రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి | Actor Sudhakar injured in Car accident in Chiunakakani | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి

Published Sat, Apr 27 2019 3:12 PM | Last Updated on Sat, Apr 27 2019 5:58 PM

Actor Sudhakar injured in Car accident in Chiunakakani - Sakshi

సాక్షి, మంగళగిరి : శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్‌ గాయపడ్డాడు. సుధాకర్‌ తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్‌ గాయపడ్డారు.

కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement