Life is Beautiful
-
మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే
'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 'మాతృ దేవో భవ' మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'బిచ్చగాడు' తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది. ప్రభాస్ 'ఛత్రపతి' 2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి. అమ్మ చెప్పింది 2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమ్మా రాజీనామా 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. యమ లీల 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్దీర్వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 'నిజం' కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. -
తండ్రైన 'లైఫ్ ఈజ్బ్యూటిఫుల్' నటుడు సుధాకర్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈనెల 14న బాబు బాబు పుట్టాడని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. బాబుకు రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా చిన్నారి ఫోటోను కూడా రివీల్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సహా పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు వెస్ట్ విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2002లో మనసుతో అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాతే సరైన అవకాశాలు లేకపోవడం అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే చికాగాలో వీరు సెటిల్ అయ్యారు. View this post on Instagram A post shared by sudhakarkomakula (@sudhakarkomakula) -
నాలుగు రోజులు
న్యూజిలాండ్ సరిహద్దులు మూసివున్నాయి. ఇప్పట్లో లోపలివాళ్లు బయటికి, బయటివాళ్లు లోపలికి ప్రయాణించే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ దేశంలో పర్యాటక రంగ ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు ఒక దారి కనిపెట్టారు. ఉద్యోగులందరికీ వారానికి 4 రోజుల పని మాత్రమే ఉంటే మిగతా మూడు రోజుల్లో దేశం లోపల టూర్లకు వెళ్లేందుకు వీలు కల్పించినట్లవుతుంది అనుకున్నారు. ఆమె ఆలోచన ఎక్కువమందికి నచ్చింది. ఉద్యోగుల అభిప్రాయ సేకరణలో 76 శాతం మంది ‘గుడ్ ఐడియా’ అన్నారు. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దేశానికి భూభాగ సరిహద్దులు లేవు. వైట్ హౌస్ బట్లర్ విల్సన్ జర్మన్.. వైట్‌హౌస్‌లో ఆతిథ్యాల ప్రధాన సహాయకుడు (బట్లర్). 91 ఏళ్ల వయసులో గురువారం కోవిడ్ 19తో చనిపోయారు. మొత్తం 11 మంది అమెరికా అధ్యక్షుల దగ్గర పని చేశారు ఆయన. డ్వైట్ ఐసన్ హోవర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేతసౌధంలో క్లీనర్‌గా చేరారు. బరాక్ ఒబామా ఉన్నప్పుడు లిఫ్ట్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యారు. ‘ప్రథమ కుటుంబాలకు విల్సన్ దశాబ్దాల పాటు వైట్ హౌస్‌లో సేవలు అందించారు’ అని మిషెల్ ఒబామా గుర్తు చేసుకున్నారు. జాన్ ఎఫ్.కెనడీ హయాంలో విల్సన్ బట్లర్ అయ్యారు. ‘వైట్ హౌస్‌ని వైట్ హోమ్లా మార్చిన బట్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి
సాక్షి, మంగళగిరి : శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్ గాయపడ్డాడు. సుధాకర్ తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్ గాయపడ్డారు. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో చిన్న పాత్ర పోషించిన నటుడు ఇప్పుడు టాలీవుడ్లో çసక్సెస్ఫుల్ హీరో అతనెవరో తెలుసా? ఎ) నిఖిల్ బి) రాజ్‌తరుణ్ సి) విజయ్ దేవరకొండ డి) నాగశౌర్య ► చంద్రముఖి’ డైరెక్టర్ పి.వాసు ప్రముఖ మేకప్‌మేన్ కుమారుడు. ఆయన పేరేంటి? ఎ) మాధవరావు బి) పీతాంబరం సి) మేకప్ బాబు డి) మేకప్ శీను ► పధ్నాలుగేళ్లుగా సౌత్‌లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార మొదట ఏ హీరోతో జతకట్టారు? ఎ) మమ్ముట్టి బి) రజనీకాంత్సి) శరత్కుమార్డి) జయరామ్ ► పరుగు ఆపటం ఓ కళ..’ పేరుతో ఈ సినీ హీరో జీవిత చరిత్రను ఆకెళ్ల రాఘవేంద్ర రచించారు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) కృష్ణ బి) శోభన్బాబుసి) అక్కినేని నాగేశ్వరరావు డి) ఎస్వీ రంగారావు ► కృష్ణ నటించిన వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఆ సినిమా 70 శాతం పూర్తయ్యాక ఆ దర్శకుడు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడా సినిమాని కృష్ణ, విజయనిర్మల పూర్తిచేశారు. 70 శాతం కంప్లీట్ చేసిన ఆ దర్శకుడెవరు? ఎ) ఆదుర్తి సుబ్బారావు బి) వి. రామచంద్రరావు సి) సాంబశివరావు డి) లక్ష్మిదీపక్ ► టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, కె.ఎస్. రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి శిష్యులు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) సాగర్ డి) ముత్యాల సుబ్బయ్య ► గాయని సునీత 800 పైచిలుకు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆమె డబ్బింగ్ ప్రస్థానం ఏ సినిమాతో మొదలైందో తెలుసా? ఎ) పెళ్లి బి) గులాబి సి) అనగనగా ఒకరోజుడి) పెళ్లి పందిరి ► ‘మిర్చి’ సినిమాలో ‘పండగలా దిగివచ్చాడు..’ పాట రాసింది రామజోగయ్యశాస్త్రి. మరి, పాడింది ఎవరు? ఎ) హరిహరన్ బి) శంకర్ మహదేవన్ సి) శ్రీరామచంద్రడి) కైలాష్ ఖేర్ ► దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10. అదే రోజున ఓ ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు కూడా. అతనెవరో ఊహించండి.. ఎ) వేణుమాధవ్ బి) అలీ సి) బ్రహ్మానందం డి) జయప్రకాశ్‌రెడ్డి ► సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏ సంగీత దర్శకుని వద్ద శిష్యరికం చేశారు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) ఎమ్మెస్ విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ‘నాకు అదో తుత్తి’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్యనటుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన కామెడీతో మనసుల్లో నిలిచిపోయారు. ఆయన ఎవరు? ఎ) ఏవీఎస్ బి) కొండవలస సి) ధర్మవరపు సుబ్రహ్మణ్యం డి) ఎమ్మెస్ నారాయణ ► దాసరి దర్శకత్వంలో హీరోగా నటించిన ఆ నటుడు ఆ తర్వాత పెద్ద రచయిత. ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా ద్వారా దర్శకుడు కాబోతున్నారు.. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం. ఎ) సురేందర్ రెడ్డి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీడి) కాశీ విశ్వనాథ్ ► భాష రాని కారణంగా మహేశ్‌బాబు సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ‘స్పైడర్’లో నటించే ఛాన్స్ కోల్పోయింది. ఆ అవకాశం ఎవరికి దక్కిందో ఈజీగానే చెప్పేస్తారు కదూ? ఎ) తమన్నా బి) తాప్సీ సి) పూజాహెగ్డే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు సాధిస్తున్న ఈ యువహీరో ఇద్దరు లేడీ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. అతడెవరు? ఎ) సిద్ధార్థ్ బి) నారా రోహిత్ సి) వరుణ్‌సందేశ్ డి) నాని ► ఏడుసార్లు నంది అవార్డు గెలుచుకున్న తెలుగు అగ్ర హీరో ఎవరో తెలుసా? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేష్ ► ఈ ఫొటోలోని బుడతణ్ణి గుర్తుపట్టారా? చిన్న క్లూ.. మీరు ‘గజిని’ కాదులెండి. ఎ) ధనుష్ బి) సూర్యసి) అజిత్ డి) శింబు ► హీరోలు గాల్లో పల్టీలు కొడుతూ ఫైట్ చేస్తుంటారు. థ్రిల్‌కి గురి చేసే ఈ ఫైట్ కంపోజ్ చేయడాన్ని టెక్నికల్‌గా ఏమంటారో తెలుసా? ఎ) వైర్ వర్క్ బి) రోప్ వర్క్ సి) స్ట్రింగ్ రిమూవల్డి) స్ట్రింగ్ ఫైట్ ► అల్లు అర్జున్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి చూద్దాం? ఎ) ఐయామ్ అల్లు బి) ఐయామ్ బన్నీ సి) అల్లు అర్జున్ డి) యువర్స్ బన్నీ ► ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మ కథ సి) తోడి కోడళ్లు డి) మూగ మనసులు ► మహేశ్‌బాబు ఈ సినిమాలో సుపారీ (డబ్బు) తీసుకుని, షూటర్‌గా చేస్తాడు. అదే సినిమా? ఎ) ఖలేజా బి) అతడు సి) బిజినెస్మేన్డి) పోకిరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) డి 4) బి5) బి 6) సి 7) డి 8) డి 9) బి10) డి 11) ఎ 12) సి 13) డి14) డి 15) డి 16) బి 17) సి18) సి 19) ఎ20) బి -
ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..!
ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసేసింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటి. తొలి సినిమాలోన తన నటనతో మంచి మార్కులు సాధించి వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. అయితే ఈ బ్యూటీని చాలా రోజుల కిందటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు, దర్శకుడు శేఖర్ కమ్ముల. తన దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించాడట శేఖర్. అయితే అప్పుడు సాయి పల్లవి ఎమ్బీబీయస్ చదువుతుండటంతో ఆ సినిమా చేసేందుకు సాయి పల్లవి అంగీకరించలేదు. తన కథలకు సాయి పల్లవి లాంటి నటి అయితే కరెక్ట్ అని భావించిన శేఖర్ మరోసారి ఫిదా కోసం సాయి పల్లవిని సంప్రదించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్ గా మారిపోయింది ఈ మల్లార్ బ్యూటి. -
పాతికేళ్ల తర్వాత...
పాతికేళ్ల తర్వాత అక్కినేని అమల రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అదేంటి.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించారు కదా! అనుకుంటున్నారా? అది తెలుగులో. ఇప్పుడు రీ-ఎంట్రీ ఇస్తున్నది మలయాళంలో. ఆంటోనీ సోని దర్శకత్వం వహిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘కేరాఫ్ సైరాభాను’లో పోస్ట్ ఉమన్‌గా మంజూ వారియర్, లాయర్‌గా అమల నటిస్తున్నారు. గతంలో సురేశ్ గోపి, మోహన్‌లాల్ పక్కన హీరోయిన్గా నటించిన అమలకు ఇది మూడో మలయాళ సినిమా. -
బొబ్బిలిలో...ప్రేమ
‘‘ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు వరా ముళ్లపూడి అన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధీర్ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్. ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. అనిల్‌కుమార్‌రాజు, జి.వంశీకృష్ణలు నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ బొబ్బిలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో నెలరోజుల పాటు జరిగే షూటింగ్‌తో టాకీ పార్టు పూర్తవుతుంది’’అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: శివశక్తి దత్తా, అనంతశ్రీరామ్, మాటలు: అనురాధ ఉమర్జీ, కెమెరా: ఎస్.డి. జాన్. -
నవ్వుతూ బతకాలిరా...నవ్వుతూ చావాలిరా....
అందుకే... అంత బాగుంది! లైప్ ఈజ్ బ్యూటిఫుల్ (1997) తారాగణం: రాబర్ట్ బెనిగ్ని, నికోలెట్టా బ్రాశ్చి, జియోర్జియో కాంటారిని, గిస్టినో డ్యూరానొ, హార్ట్స్ బుకోల్జ్, సంగీతం: నికోలా పియోవని, కెమెరా: టోనినో డెల్లి కొల్లి, నిర్మాతలు: జియాన్లుజి బ్రాచ్చి, ఎల్డా ఫెర్రి, దర్శకుడు: రాబర్ట్ బెనిగ్ని, విడుదల: 20 డిసెంబర్1997 (ఇటలీ) ; 23 అక్టోబర్ 1998 (అమెరికా), సినిమా నిడివి: 116 నిమిషాలు, నిర్మాణ వ్యయం: 2 కోట్ల డాలర్లు, వసూళ్లు: 22 కోట్ల 91 లక్షల డాలర్లు ఆత్రేయగారి ‘‘నవ్వుతూ బ్రతకాలిరా, నవ్వుతూ చావాలిరా, చచ్చినాక బ్రతకలేవురా, ఎంత ఏడ్చినా తిరిగి రావురా’’ అనే పాటను యథాతథంగా సినిమాగా రూపొందిస్తే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అవుతుంది అనిపిస్తుంది. ఆత్రేయగారు ఈ పాటని, 1980లలో రాస్తే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఇటాలియన్ సినిమా 1997లో రూపొందింది. నా ఉద్దేశం ఆత్రేయగారి పాటను... ఆయన కాపీ కొట్టాడని కాదు, ‘గ్రేట్ పీపుల్ థింక్ ఎలైక్’ అని చెప్పడం మాత్రమే! రాబర్ట్ బెనిగ్ని ఈ చిత్ర రచయిత, దర్శకుడు, కథానాయకుడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో... కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో బెనిగ్ని తండ్రి అనుభవాలే ఈ చిత్ర కథ. నాజీలు, యూదులను పట్టుకుని ఒక చోట ఖైదీలుగా ఉంచేవారు. అక్కడ జరిగినన్ని అకృత్యాలు మరెక్కడా జరగవు. రాబర్ట్ బెనిగ్ని 71వ అకాడమీ అవార్డులలో బెస్ట్ యాక్టర్‌గా ‘ఆస్కార్’ గెలుచుకున్నాడు. మరెన్నో అవార్డులు ఈ సినిమాకు లభించాయి. ఒక సందేశంతో కూడిన, హాస్యభరిత, కరుణ రసాత్మక చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఇటాలియన్ భాషలో ఈ సినిమా పేరు ‘లా విటా ఎ బెల్లా’. తర్వాత ఈ సినిమా అన్ని భాషలలో అనువాదమైంది. ఈ చిత్రంలో కథానాయకుడి పేరు - గ్యుడో. ఈ గ్యుడో చాలా చురుకుగా, ఎటువంటి సందర్భంలోనైనా హాస్యాన్ని పుట్టించగలిగే స్వభావాన్ని కలిగి ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే అతను ‘డోరా’ అనే యువతి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమెను కలుసుకోవడానికి రకరకాల ట్రిక్కులు ప్రయోగిస్తుంటాడు. ఇవన్నీ కూడా హాస్యభరితంగా ఉంటాయి. చివరకు ‘డోరా’ కూడా అతని ప్రేమలో పడిపోతుంది. కానీ, అప్పటికే ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమై ఉంటుంది. సినిమాలో దాదాపు సగం నిడివి హీరో, హీరోయిన్ల మధ్య లవ్, రొమాన్స్, కామెడీతోనే గడిచిపోతుంది. మొదట ‘డోరా’, హీరో చేతుల్లోకి ఆకాశంలో నుంచి పడినట్టుగా ఊహించుకుని, దానికి అనువుగా ఆ సీన్‌ని క్రియేట్ చేశాడు బెనిగ్ని. తర్వాత ఇలాంటి సీన్‌నే మరొక సందర్భంలో, మరో రకంగా చూపిస్తాడు. గ్యుడో, అతని స్నేహితుడు తమ గ్రామం నుంచి, సిటీలో ఉన్న తన అంకుల్ దగ్గరకు వస్తారు. అంకుల్ ఒక హోటల్లో చీఫ్-వెయిటర్‌గా పని చేస్తుంటాడు. అతని ఇంట్లోనే వీళ్లిద్దరికీ నివాసం. తర్వాత రెండు, మూడు సన్నివేశాలకు హోటల్లో ఉన్న తన అంకుల్‌ను కలిసి, ‘‘కచ్చితంగా ఇచ్చిన పని చేయగలను, సర్వర్ అంటే ఇలా వంగి దండాలు పెడుతూ పనిచెయ్యటమేగా?’’ అంటాడు. అందుకు అంకుల్, గ్యుడోతో, ‘‘సర్వింగ్ అనేది ఒక ఆర్ట్. సృష్టి మొత్తానికీ ఫస్ట్ సర్వర్ - ఆ దేవుడే!’’ అని చెబుతాడు. సినిమాలో, ఇటువంటి సున్నితమైన సంభాషణలు చాలానే ఉంటాయి. తర్వాత, తనూ, తన ఫ్రెండ్ పడుకున్నప్పుడు, ఫ్రెండ్ ఒక ప్రశ్న వేస్తాడు. దానికి గ్యుడో సమాధానం చెప్పేలోపు, అతను నిద్రపోతుంటాడు. వెంటనే గ్యుడో అతణ్ణి లేపి ‘‘నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు. నేను సమాధానం చెప్పడం పూర్తయ్యేలోపు, నువ్వు నిద్రపోతావ్. ఇదెలా సాధ్యం?’’ అని అడుగుతాడు. దానికి సమాధానంగా గ్యుడో ఫ్రెండ్ ‘‘స్కోపెన్హ్యావెర్! అంటే నువ్వు బలంగా విశ్వసించి, ఒక పని జరగాలని అనుకుంటే, ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను నిద్రపోవాలి అనుకున్నాను... నిద్ర వచ్చేసింది’’ అని చెబుతాడు. గ్యుడో కూడా వేళ్లు కదుపుతూ, తను కూడా నిద్రపోవాలి అని అనుకుంటాడు. అలా వేళ్లు కదపాల్సిన అవసరం లేదంటాడు అతని ఫ్రెండ్. ‘‘అయినా, దానికి ఇంకా కొంత టైం పడుతుంది’’ అని మళ్లీ పడుకుంటాడు ఫ్రెండ్. గ్యుడో ఇప్పుడు వేళ్లు కదిలిస్తూ, తన ఫ్రెండ్ నిద్ర లేవాలి అనుకుంటాడు. తన మీద వేళ్లు కదిలిస్తున్న గ్యుడోను చూసి విసుక్కుంటాడు ఫ్రెండ్. వెంటనే గ్యుడో, ‘‘నాకూ వచ్చేసింది. నువ్వు మేలుకోవాలని బలంగా అనుకున్నాను. నువ్వు లేచావు’’ అని అంటాడు. ‘గ్యుడో’ ఒక తెలివైన అమాయకుడు. అమాయకత్వంతో కూడిన మేధావి. తర్వాత ఇదే విషయాన్ని సినిమా చివరి వరకూ ప్రయోగిస్తూ ఉంటాడు. అన్నిసార్లూ కూడా, గ్యుడో అనుకున్నట్టే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం నవ్వుతాం. కొన్ని సందర్భాల్లో బాధపడతాం. కొన్నిసార్లు ఉద్వేగానికి గురవుతాం. రాబర్ట్ బెనిగ్ని ఈ విషయంలో, ఒక రకమైన హిప్నాటిజం అనే అంశం మీద పూర్తిగా పట్టు సాధించాడు. పైగా, అన్ని సీన్స్‌లో ఎంతో కొంత నాటకీయత ఉన్నప్పటికీ, అతని నటన కారణంగా, ముగ్ధులమై చూస్తామే తప్ప, ఎక్కడా అసహజత్వం ఫీల్ కాము. మరుసటి రోజు ఉదయం గ్యుడో తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన డోరాను చూపించి, ‘ఈమె నా కోసం, ఆకాశం నుంచి, నా చేతుల్లోకి పడిన నా రాకుమారి’ అని పరిచయం చేస్తాడు. తను వెయిటర్‌గా పనిచేస్తున్న హోటల్‌కి వచ్చిన వాళ్ల క్లిష్టమైన సమస్యల్ని కూడా చిటికెలో పరిష్కరిస్తుంటాడు. ఆ నేపథ్యంలో అక్కడికి వచ్చిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్, తన గర్ల్ ఫ్రెండ్ డోరా టీచర్‌గా పని చేస్తున్న స్కూల్‌కు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాడని తెలుసుకుని, తను మెడలో వేసుకునే క్లాత్‌ను కొట్టేసి, ఆ ఆఫీసర్‌కి బదులుగా, తనే ఇన్స్పెక్టర్లాగా వెళతాడు - మళ్ళీ డోరాను కలుసుకోవడానికి! మొత్తానికి డోరాను కలిసి, ఆమెతో మాట్లాడతాడు. తర్వాత డోరాకి నిశ్చితార్థం జరిగిన యువకుణ్ణి తప్పించి, ఆమెను కార్లో తీసుకువెళ్తాడు. భోరున వర్షం! కారు, మెట్ల మీద నుండి దిగుతున్న విషయం కూడా గ్రహించలేదు ఇద్దరూ. తర్వాత, డోరాను నేల మీద నడవనివ్వకుండా ఒక రెడ్ కార్పెట్‌ను విసిరి, వర్షంలో ఆమె తడవకుండా, ఒక గొడుగు పట్టుకుని ఆమెను నడిపించే దృశ్యం రాబర్ట్ బెనిగ్ని భావుకతకు ఒక ఉదాహరణ. అద్భుతం! ఆమె నిశ్చితార్థం జరుగుతున్న వేడుకలో గ్యుడో ఒక గుర్రంపై, ఆమెను ఎక్కించుకుని పారిపోతాడు. తర్వాత వాళ్లిద్దరికీ పెళ్లయినట్టు, ఒక 3 సంవత్సరాల పిల్లవాడు కలిగినట్టు, ఒక 30 సెకన్ల వ్యవధిలోనే చెప్పేశాడు. హ్యాపీగా సాగుతున్న, వాళ్ల జీవితాల్లో అనుకోని తుపాను. గ్యుడోనూ, అతని కొడుకునూ జర్మన్ సైన్యం, ఖైదీలను ఎక్కించే ట్రైన్లో తీసుకెళుతుంటుంది. అప్పుడు వచ్చిన డోరాతో అమర్యాదగా ప్రవర్తిస్తాడు చీఫ్. తను కూడా అదే ట్రైన్ ఎక్కుతుంది. ఇక్కడ నుంచి మొదలవుతుంది! ఖైదీలతో ఎంతో దారుణమైన పనులు చేయిస్తారు. బానిసల కంటే హీనంగా చూస్తారు. కానీ, గ్యుడో తన కొడుక్కి ఇవేం తెలియనివ్వకుండా, కొడుకును ఆటల్లో ముంచెత్తి, తను మాత్రం బాధలు అనుభవిస్తుంటాడు. కొడుకుకు ట్యాంక్ కావాలని కోరిక. ‘‘అయితే, నువ్వు వెయ్యి పాయింట్లు గెలుచుకుంటే, నీకు బహుమతిగా ఒక ట్యాంక్ ఇస్తాను’’ అంటాడు గ్యుడో. డోరా ఆడఖైదీల జైల్లో...! గ్యుడో తన కొడుకుతో వేరే జైల్లో...! రెండూ పక్కపక్కనే! ఒకసారి, ఎవరూ లేని సమయంలో, మైక్ రూమ్‌లోకి వెళ్లి, పరోక్షంగా, తన భార్యకు మాత్రమే అర్థమయ్యేలా మాట్లాడతాడు. మనం లోపల విషాదాన్ని ఫీల్ అవుతూనే హీరో, హీరోయిన్లు కలుసుకున్నారులే పాపం అని అనుకునేలా చేస్తాడు దర్శకుడు. ఖైదీలున్న జైలుకు వచ్చిన పై ఆఫీసర్, ‘మీలో ఎవరికైనా జర్మన్ భాష వస్తే, నేను చెప్పేది మిగతా వాళ్లకి, ట్రాన్ల్సేట్ చేసి చెప్ప’మన్నప్పుడు గ్యుడో వెళ్లి, తన కొడుక్కి మాత్రమే అన్వయించేలా, ఒక ఆట గురించి చెప్పి, దానిలో షరతులు కొన్ని చెబుతాడు. ఆట మధ్యలో వైదొలగిన వాడికి, ఎటువంటి ప్రైజూ రాదు. చివరి వరకూ ఉండి, ఎవరైతే 1000 పాయింట్లు స్కోర్ చేస్తారో, వారికే ట్యాంక్ ఇస్తారు. ‘ప్రతీరోజూ ఎనౌన్స్ చేస్తాం - ఎవరు ముందంజలో ఉన్నారన్నది! ఎవరైతే భయపడతారో, వాళ్లు ఓడిపోవడం ఖాయం. మీలో ఎవరన్నా ఏడ్చినా, ఎవరికైనా అమ్మని చూడాలని ఆలోచన కలిగినా, మీకు ఆకలై ఏదన్నా తినాలని కోరిక కలిగినా - మీరు తప్పనిసరిగా ఓడిపోతారు’ అని చెబుతాడు. ఇది కుర్రవాడి మనసులో చెరగని ముద్ర వేస్తుంది. తనకు తల్లిని చూడాలని కోరిక కలిగినా, ఆకలైనా, ఏడుపు వచ్చినా కూడా నిగ్రహించుకుంటాడు. చివరి సీన్లో తనను మిలటరీ జవాను తీసుకెళ్లేటప్పుడు, తనను కాల్చేస్తారు అని తెలిసి కూడా ఆ విషయం కొడుకుకు తెలియనివ్వకుండా, ‘చివరి 60 పాయింట్లు వస్తే, నీవి 1000 పాయింట్లు అవుతాయి. నువ్వే ట్యాంక్ గెలుచుకోబోతున్నావు’ అని చెప్పి, ఆ కుర్రవాణ్ణి ఒక పోస్ట్‌బాక్స్ లాంటి దాంట్లో దాక్కునేలా చేసి, తను జవాను వెంట వెళ్తాడు. అంతులేని దుఃఖాన్ని మనసులోనే దాచుకుని, కొడుకు చూస్తున్నప్పుడు మాత్రం అది కూడా ఒక ఆటలాగే అన్నట్టు నటిస్తాడు. కొడుకుకు మాత్రమే కనపడేలా, కన్నుగొట్టి సైగ చేస్తాడు. చివరికి జవాన్లు పక్కకు తీసుకెళ్లి, గ్యుడోను కాల్చేస్తారు. యుద్ధం అయిపోయాక, బతికి ఉన్న ఖైదీలందరినీ వదిలేస్తారు. అప్పుడొచ్చిన ట్యాంక్ తన కోసమే వచ్చినట్టుగా, కుర్రవాడు ఫీల్ అవుతాడు. తల్లీ కొడుకులు కలవడంతో కథ ముగుస్తుంది.సినిమా మొత్తాన్నీ ఒక యుద్ధ వాతావరణ నేపథ్యంలో తీసినప్పటికీ, ఎక్కడా హింస, రక్తపాతాలు లేకుండా, ఆద్యంతం నవ్వులతో ముంచెత్తి, అద్భుతంగా నటించారు, అంత కన్నా అద్భుతంగా దర్శకత్వం వహించాడు రాబర్ట్ బెనిగ్ని. కత్తికి రెండు వైపులా పదునే అన్నట్టు చేశాడు. ఒక ప్రేయసి, ప్రేమికుడు ఎంత ఆనందంగా ఉండవచ్చో చెప్పడంతో పాటు, ఒక తండ్రి తన కొడుకును ఎలా పెంచవచ్చో కూడా తెలిపాడు దర్శకుడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా వాళ్ల పసి మనసులను ఎలా మళ్లించవచ్చో, ఎలా మోటివేట్ చేయవచ్చో, ప్రతీ తల్లికీ తండ్రికీ, తనదైన శైలిలో సందేశం ఇచ్చాడు రాబర్ట్ బెనిగ్ని. నిజంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతీ తల్లీ, తండ్రీ, హాస్యాన్ని ఇష్టపడే ప్రతీ ప్రేక్షకుడూ చూసి తీరవలసిన చిత్రం - ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఇందులో హీరో తను నవ్వుతూ మనల్ని నవ్విస్తాడు. తన ఏడుపును లోపల దాచుకుంటూ, మనల్ని ఏడుస్తూ నవ్వేలా చేస్తాడు. ఒక మనిషి నవ్వుతూ ఎలా బతకవచ్చో, ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద, ప్రేక్షకుణ్ణి ఏడుస్తూ నవ్వేలా చేస్తాడు. నవ్వుతూ ఏడ్చేలా చేస్తాడు... చివరకు నవ్వో ఏడుపో తెలియని స్థితిలో మనల్ని ఉంచుతాడు..! అదీ దర్శకుడి చాతుర్యం!! జీవితమే సినిమా! ఇటాలియన్ నటుడు, రచయిత, దర్శకుడు రాబర్ట్ బెనిగ్ని ముందుగా రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కృషి చేసి, ఆ పైన మెగాఫోన్ పట్టుకున్నారు. నాటకాలకూ, సినిమాలకూ మధ్య టీవీ సిరీస్‌లు, షోల ద్వారా పేరు తెచ్చుకున్నారు. నటి నికోలెటా బ్రాస్చీని ఏరికోరి పెళ్ళాడిన ఆయన తన చిత్రాలు చాలావాటిలో ఆమెకు కీలక పాత్రలిచ్చారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’(1997) లోనూ ఆయన పక్కన ఆమే హీరోయిన్. నిజానికి, ఆయన తండ్రి వడ్రంగి పని, ఇటుకల తయారీ పని కూడా చేసిన ఓ రైతు. 1943 - 45 మధ్య కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లో ఖైదీగా గడిపారు. తండ్రి జీవితానుభవాలు, అప్పటి కథలే ఈ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కు పునాది. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగానే కాక, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఒరిజినల్ డ్రమాటిక్ స్కోర్, ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగాల్లోనూ ఆస్కార్ అవార్డులు సాధించారు బెనిగ్ని. శివ నాగేశ్వరరావు, ప్రముఖ దర్శకుడు -
మాది పెద్దలు అనుమతించిన ప్రేమ వివాహం!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో బోల్డన్ని పాత్రలుంటాయి. వాటిల్లో బాగా గుర్తుండిపోయిన పాత్ర... నాగరాజు. ఈ పాత్ర పోషించిన సుధాకర్ కోమాకులను చాలామంది నాగరాజు అనే పిలుస్తారు. అంత పేరొచ్చింది కాబట్టే, తదుపరి చిత్రంలోని పాత్ర కూడా బాగుండాలనే ఆకాంక్షతో ఎన్నో కథలు విని, చివరికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’కి సుధాకర్ పచ్చజెండా ఊపారు. అరుణ్ దాస్యం దర్శకత్వంలో రవి రాష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మనోభావాలు ఈ విధంగా... ఈ చిత్రంలో నా పాత్ర పేరు జాజ్రాజ్. పెద్ద రాక్‌స్టార్ కావాలనేది ఆశయం. పగలంతా ఆటో నడిపి, సాయంత్రం నుంచి ఈవెంట్స్‌లో పాల్గొంటాను. మా అమ్మ ఈవెంట్ లక్ష్మీగా రాధికగారు నటించారు. నాన్నగా నరేశ్‌గారు చేశారు. వినోద ప్రధానంగా సాగే విలువలున్న చిత్రం ఇది. బేసిక్‌గా నాకు ఆర్ట్ అంటే ఇష్టం. అది డాన్స్, ఫొటోగ్రఫీ.. ఇలా ఏదైనా. అందుకే, సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ డిప్లొమా ఇన్ డాన్స్ చేశాను. ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో అది కూడా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు అరుణ్, నేను స్కూల్ ఫ్రెండ్స్. నేను ఫొటోగ్రఫీ చేయడానికి యూఎస్ వెళ్లిపోయాను. అరుణేమో ఇక్కడ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసేవాడు. శేఖర్ కమ్ములగారు నన్ను యూఎస్ నుంచి పిలిపించి, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో మంచి పాత్ర ఇచ్చారు. ఆ సమయంలోనే అరుణ్ ఈ సినిమా అనుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత కరెక్ట్ సినిమా చేశాననిపించింది. అది అదృష్టమో దురదృష్టమో చెప్పలేను కానీ హుద్ హుద్ ముందు సుందర నగరం వైజాగ్‌ని అద్భుతంగా చూపించిన చివరి చిత్రం మాదే అవుతుంది. ఈ సినిమా కోసం వైజాగ్‌లో కీలక సన్నివేశాలు తీశాం. ఆ తర్వాత హుద్ హుద్ రావడం, వైజాగ్ పరిస్థితి దారుణంగా మారడం తెలిసిందే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో నన్నందరూ తమ ఇంటి అబ్బాయి అనుకుంటున్నారు. ఒకే రకం కాకుండా వినూత్న తరహా పాత్రలు చేయాలన్నది నా కోరిక. ముఖ్యంగా స్పోర్ట్స్మేన్గా చేయాలనే ఆకాంక్ష ఉంది. అలాగే, కథకు కీలకంగా ఉంటే.. నెగటివ్ రోల్ అయినా చేస్తాను. నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మా, నాన్న. ఆ తర్వాత నా భార్య హారిక. నాకు మంచి సినీ జీవితాన్నిచ్చిన శేఖర్ కమ్ములగారు. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు పెళ్లయిన విషయం చాలామందికి తెలీదు. మాది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం. మై వైఫ్ ఈజ్ సో బెస్ట్. -
ఘాటైన కుర్రాడి కథ!
‘‘నేటి కుర్రాళ్లు మిర్చిలా ఘాటుగా ఉంటున్నారు. అలాంటి ఓ కుర్రాడి కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం మా ‘మిర్చిలాంటి కుర్రాడు’. ప్రేమకథను ఇలానూ తీయొచ్చా అనిపించేలా ఈ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు జయనాగ్. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్, ప్రగ్య, జైశ్వాల్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. జయనాగ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సాగర్, టి. ప్రసన్నకుమార్ల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక ప్రేమకథ ఇది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పది రోజుల్లో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. టైటిల్ చూసి ఇదేదో మాస్ సినిమా అనుకోవద్దని, కథకు అవసరమైన మేరకే యాక్షన్ సన్నివేశాలుంటాయని అభిజిత్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు, కెమెరా: ఆర్.ఎం.స్వామి, సంగీతం: జేబీ, కూర్పు: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజు. -
అప్పుడు క్లాస్.. ఇప్పుడు మాస్
ఈ కుర్రాణ్ణి గుర్తుపట్టారా? శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యంగ్ హీరో ఇతను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి పేరు అభిజిత్. ఆ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించిన అభిజిత్, తన రెండో చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’ కోసం మాస్‌గా తయారయ్యాడు. ఇందులో తను సిక్స్‌ప్యాక్ దేహంతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అలరించనున్నాడు. ఈ విశేషాలను అభిజిత్ వివరిస్తూ - ‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాను. లక్కీగా అలాంటి పాత్రే నాకు లభించింది. సిక్స్ ప్యాక్ సన్నివేశాలు తీస్తున్నపుడు వారం ముందు నుంచే కొంత ప్రిపరేషన్ ఉండాలి. వాటర్ కంటెంట్ బాగా తగ్గించేయాలి. అలాగే ఉప్పు అస్సలు వాడకూడదు’’ అన్నారు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణే ఈ సినిమా. అన్ని రకాల వాణిజ్య విలువలూ ఉన్న పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇంకా పాటల చిత్రీకరణ చేయాలి. ఈ జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నాకొచ్చి ఏడాదిన్నర విరామాన్ని ఈ సినిమా మరిచిపోయేలా చేస్తుంది’’ అని అభిజిత్ చెప్పారు. -
మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ
దమ్మున్న కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ ఇందులో కథానాయికుడు. ప్రాజీ జైస్వాల్ కథానాయిక. నాగేశ్వరరావు దర్శకుడు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపు ఈ సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. అభిజిత్ నటన, వీరబాబు మాటలు, జేబీ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు’’ అని తెలిపారు. ‘‘టైటిల్‌కి తగ్గట్టు వాణిజ్య అంశాల కలగలుపుగా ఈ చిత్రం ఉంటుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మే నెల ప్రథమార్ధంలో పాటలను, అదే నెల చివర్లో కానీ, జూన్ తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథను నమ్మి తాను ఈ చిత్రం చేస్తున్నానని అభిజిత్ అన్నారు. సప్తగిరి, షకలక శంకర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. -
సుధాకర్‌కి ఉందిలే మంచి కాలం ముందు ముందునా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాత్రల్లో సుధాకర్‌ది ఒకటి. మాస్ టచ్ ఉన్న ఆ పాత్రలో సుధాకర్ కోమాకుల చక్కగా ఒదిగిపోయారు. దాంతో కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చాలామంది జోస్యం చెప్పారు. బహుశా సుధాకర్ కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు మంచి కాలం ముందుంది అని ఊహించి ఉండరు. కానీ, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ విడుదల తర్వాత తనకు మంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చక్కని రొమాంటిక్ ఎంటర్టైనర్ని ఎంపిక చేసుకున్నారు సుధాకర్. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ దాస్యం దర్శకుడు. ఈ నెల 17 నుంచి వైజాగ్‌లో ఈ చిత్రం షెడ్యూల్ జరుపుతున్నారు. అలాగే ఈ చిత్రానికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక పాజిటివ్ ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ. యువతీ యువకుల కలల్నీ కలవరాల్నీ ఇందులో నిజాయితీగా ఆవిష్కరిస్తున్నాం. సీనియర్ కథానాయికలు రాధిక, పూర్ణిమ చాలా విరామం తర్వాత చేస్తున్న తెలుగు సినిమా మాదే కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూలు నవంబర్ 23 వరకూ జరుగుతుంది’’ అని తెలిపారు. అవంతికా మోహన్, రాధిక, నరేష్, పూర్ణిమ, షకలక శంకర్, కార్తీక్ జీఎస్, నీతూ చౌదరి, దయానంద్, సంతోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, కెమరా: ఈశ్వర్, ఫైట్స్: ప్రకాష్, నిర్మాణం ఆమ్ టీమ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అరుణ్ దాస్యం. -
‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’
‘లైఫ్ ఆజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా అరుణ్ దాస్యం దర్శకత్వంలో ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’అనే టైటిల్‌ని నిర్ణయించారు. -
వైజాగ్‌లో సుధాకర్ హంగామా!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో తళుక్కున మెరిసి ఆకట్టుకున్న సుధాకర్ కొమకుల వైజాగ్‌లో హంగామా చేస్తున్నారు. ఆయన హీరోగా ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం వైజాగ్‌లో జరిగాయి. ప్రసిద్ధ నట శిక్షకుడు సత్యానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అరుణ్ దాస్యం దర్శకునిగా పరిచయమవుతున్నారు. సీనియర్ తారలు రాధిక, నరేష్, పూర్ణిమ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు అరుణ్ దాస్యం మాట్లాడుతూ -‘‘ఈ నెల 17 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా చిత్రీకరణ చేయబోతున్నాం. ప్రేమ, కుటుంబ బంధాలు, క్రీడలు, సంగీతం... ఈ నాలుగు అంశాల నేపథ్యంలో సాగే కథ ఇది. కథనం వినూత్నంగా ఉంటుంది. సుధాకర్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది’’ అని తెలిపారు. కార్తీక్ స్పెషల్ రోల్ పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, నిర్మాణం: ఆమ్ టీమ్. -
సుధాకర్‌తో ఆమ్ ఆద్మీ సినిమా
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో ఒక హీరోగా నటించిన సుధాకర్ కొమకుల కథానాయకునిగా త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. రవిబాబు దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన అరుణ్ దాస్యం ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కార్తీక్ స్పెషల్ రోల్ చేయనున్నారు. సీనియర్ తారలు రాధిక, నరేష్, పూర్ణిమ ఇందులో కీలక పాత్రలు పోషిం చనున్నారు. దర్శకుడు అరుణ్ దాస్యం మాట్లాడుతూ -‘‘లవ్, ఫ్యామిలీ డ్రామా కథాంశమిది. రియల్లైఫ్కి, క్లోజ్‌గా ఉండే కేరెక్టర్స్కి మధ్య జరిగే జర్నీ ఇది. లవ్, ఫ్యామిలీ డ్రామా, స్పోర్ట్స్, మ్యూజిక్... ఈ నాలుగు అంశాలు కలబోతగా తీర్చిదిద్దనున్నాం. అక్టోబర్ మూడోవారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. షూటింగ్ మొత్తం వైజాగ్‌లో చేయబో తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, నిర్మాణం: ఆమ్ టీమ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అరుణ్ దాస్యం. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: అమ్మా అని కొత్తగా... మళ్లీ పిలవాలనీ... తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ అతడు: నింగి నేల నిలిచే దాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా... బంగారం నువ్వమ్మా... అమ్మా అని కొత్తగా... మళ్లీ పిలవాలననీ... తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ చరణం : 1 అ: నిదురలోని కల చూసి తుళ్లి పడిన ఎదకి ఏ క్షణం ఎదురౌతావో జోలపాటవై ఆ కలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగి నేల నిలిచే దాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా... చరణం : 1 అ: చిన్ని చిన్ని తగవులే మాకు లోకమైన వేళ నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా రెప్పలా కాచిన నీకు కంటి నలుసులాగ వేదనలు పంచిన మాకు వేకువున్నదా నింగి నేల నిలిచే దాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా... బంగారం నువ్వమ్మా... చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) రచన : వనమాలి సంగీతం : మిక్కీజె. మేయర్ గానం : శశికిరణ్, శ్రావణభార్గవి