ఘాటైన కుర్రాడి కథ! | Life Is Beautiful Abhijit In Mirchi Lanti Kurradu | Sakshi
Sakshi News home page

ఘాటైన కుర్రాడి కథ!

Published Mon, Aug 4 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

ఘాటైన కుర్రాడి కథ!

ఘాటైన కుర్రాడి కథ!

 ‘‘నేటి కుర్రాళ్లు మిర్చిలా ఘాటుగా ఉంటున్నారు. అలాంటి ఓ కుర్రాడి కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం మా ‘మిర్చిలాంటి కుర్రాడు’. ప్రేమకథను ఇలానూ తీయొచ్చా అనిపించేలా ఈ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు జయనాగ్. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్, ప్రగ్య, జైశ్వాల్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. జయనాగ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సాగర్, టి. ప్రసన్నకుమార్‌ల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు.
 
  సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక ప్రేమకథ ఇది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పది రోజుల్లో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. టైటిల్ చూసి ఇదేదో మాస్ సినిమా అనుకోవద్దని, కథకు అవసరమైన మేరకే యాక్షన్ సన్నివేశాలుంటాయని అభిజిత్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు, కెమెరా: ఆర్.ఎం.స్వామి, సంగీతం: జేబీ, కూర్పు: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement