Abhijit
-
జేపీసీ భేటీలో రసాభాస
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాగ్వాదాలకు వేదికగా నిలిచింది. రసాభాసగా మారిన ఈ సమావేశంలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పట్టరాని ఆవేశంతో గాజు నీళ్లసీసా పగలగొట్టారు. సమావేశాన్ని గలాటాకు వేదికగా మార్చారంటూ బెనర్జీని కమిటీ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత జగదాంబికాపాల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చ సందర్భంగా బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిల్లును బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బెనర్జీ గాజు నీళ్ల సీసాను పగలగొట్టి చైర్మన్ కుర్చీ వైపుగా విసిరారు. ఈ క్రమంలో అది బెనర్జీ కుడి బొటనవేలుకు కోసుకుపోయింది. ప్రథమ చికిత్స చేసి కుట్లువేశాక ఆయన మళ్లీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. బెనర్జీ ఆవేశపూరిత చర్యలను మెజారిటీసభ్యులు ఖండించారు. సభ్యుల ఆవేశాలు చూస్తుంటే రేపు పొద్దున ఇంకొకరు ఇలాగే రివాల్వర్‌తో కమిటీకి వస్తారేమో అని చైర్మన్ పాల్ అసహనం వ్యక్తంచేశారు. బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన తీర్మానాన్ని 10–8 మెజారిటీతో ప్యానెల్ ఆమోదించింది. దీంతో బెనర్జీ కోపంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.న్యాయవాదులు, మాజీ జడ్జీలతో కూడిన రెండు ఒడిశా ప్రతినిధి బృందాలతో ప్యానెల్ మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగింది. వక్ఫ్ బిల్లుతో వీళ్లకు ఏం సంబంధమని బెనర్జీ నిలదీసినట్లు తెలుస్తోంది. తొలుత బెనర్జీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న చైర్మన్ ఆ తర్వాత పదేపదే బెనర్జీ కలగజేసుకోవడాన్ని తప్పుబట్టడం, దీనికి అభిజిత్ గంగోపాధ్యాయ్ మద్దతు పలకడంతో గంగోపాధ్యాయ్‌తో బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా బాటిల్‌ను విసిరేయలేదని తర్వాత బెనర్జీ వివరణ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా అభ్యంతరాల నేపథ్యంలో పరిశీలన నిమిత్తం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెల్సిందే. -
Lok Sabha elections 2024: బీజేపీలో చేరిన గంగోపాధ్యాయ్
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గంగోపాధ్యాయ్‌కు ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు బీజేపీ జెండా అందజేశారు. రాష్ట్రంలో టీఎంసీ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అభిజిత్ ఈ సందర్భంగా అన్నారు. -
నల్ల కోటు... రాజకీయం!
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే. తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు? తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు. నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్‌కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే. కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్‌ను విమర్శిస్తూ స్థానిక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు. బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి. -
రేపు నా రాజీనామా: జస్టిస్ అభిజిత్
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధమైన పలు అంశాలపై ఈయన వెలువరించిన తీర్పులు ఇటీవల తీవ్ర రాజకీయ చర్చలకు దారితీశాయి. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఆయన మంగళవారం రాజీనామా పత్రం సమర్పించాక అన్ని విషయాలను మీడియాతో పంచుకుంటానంటూ బదులిచ్చారు. రాజీనామా లేఖను మంగళవారం మొదటగా రాష్ట్రపతికి, లేఖ ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తానన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ప్రభుత్వ సాయం అందుకునే, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ దర్యాప్తు జరపాలంటూ ఈడీ, సీబీఐలకు ఆదేశాలిచ్చారు. -
ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇక లేరు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం అర్థరాతత్రి కన్నుమూశారని అభిజిత్ సేన్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ ప్రకటించారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించారని తెలిపారు. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులు, ఆర్థిక ,వ్యవసాయరంగ నిపుణులు పలువురు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) ఛైర్మన్‌గా అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన రిపోర్ట్ ప్రముఖంగా నిలిచింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొంది, నాలుగు దశాబ్దాల కరియర్లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించేవారు. అంతకుముందు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ , ఎసెక్స్‌లలో కూడా ఎకానమిక్స్ బోధించారు. వ్యవసాయ ఖర్చులు అండ్ ధరల కమిషన్ అధ్యక్షుడు సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు. సేన్‌కు భార్య జయతి ఘోష్(దివైర్ డిప్యూటీ ఎడిటర్), కుమార్తె జాహ్నవి సేన్ ఉన్నారు. Prof Abhijit Sen was a fine economist with both his head & heart in the right place. His work, interventions benefitted many lives & families. I’m sure that my friend had much more to say & contribute at this difficult time India is going through. His passing is a big loss to us. pic.twitter.com/Jxb0V4BZFU — Sitaram Yechury (@SitaramYechury) August 30, 2022 -
అమెజాన్ ప్రైమ్ కొత్త సిరీస్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..
Modern Love Hyderabad: Amazon Prime Announces Release Date: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. సొంతగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మిస్తూ యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో చిన్న హీరోలు, నటీనటులంతా ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకునే వాటిలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ పేరుతో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ అలరిస్తోంది. తాజాగా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ రానుంది. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, హీరో ఆది పినిశెట్టి, బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్‌తోపాటు సీనియర్ నటి సుహాసిని, కోమలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 6 ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు డైరెక్టర్లు నగేష్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెల క్రితం అమెజాన్ సంస్థ 'మోడ్రన్ లవ్ ముంబై' పేరుతో సిరీస్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఏప్రిల్ 28న 'మోడ్రన్ లవ్ చెన్నై' కూడా రిలీజ్ కాగా ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ bringing you 6 heartfelt stories of love all the way from Hyderabad 😍#ModernLoveOnPrime, July 8 #SICProductions @nareshagastya @hasinimani @komaleeprasad @MenenNithya #RevathyAshaKelunni #UlkaGupta #NareshVijayaKrishna @Abijeet #MalavikaNair @AadhiOfficial @riturv pic.twitter.com/lK7OdTzOv6 — amazon prime video IN (@PrimeVideoIN) June 22, 2022 -
సోషల్ హల్చల్ : చాలా మిస్ అయ్యానన్న బన్నీ.. బాధ పడొద్దన్న నమిత
అల్లు అర్జున్‌కి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పిల్లలను చాలా మిస్ అయ్యానంటూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. మీకు కరోనా లక్షణాలున్నాయా.. బాధపడొద్దు.. ఉచితంగా సలహాలు తీసుకోవచ్చునంటూ ఓ వీడియోని షేర్ చేసింది హీరోయిన్ నమిత ప్రీ ఆక్సిజన్ అంటూ పర్వతాలపై దిగిన ఓ ఫోటోని షేర్ చేశాడు బిగ్‌బాస్ ఫేమ్, హీరో అభిజిత్ లాక్డౌన్ ఫేస్ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది లావణ్య త్రిపాఠి ప్రకృతితో ఒక్క మూలన జీవించడం నా కొరిక అంటూ పచ్చని పార్క్‌లో దిగిన ఓ ఫోటోని పంచుకుంది హీరోయిన్ మీరా చోప్రా Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much 🖤 pic.twitter.com/ubrBGI2mER — Allu Arjun (@alluarjun) May 12, 2021 View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ఫినాలేలో అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్-4 టైటిల్‌ను అభిజీత్ ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్ సందర్భంగా అభిజీత్‌ను మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా ప్రకటించారు. మొదటి నుండి నామినేషన్స్ లోకి వచ్చిన అభిజిత్ ప్రతీవారం సేఫ్ గేమ్ ఆడుతూ చివరికి టైటిల్ సాధించాడు. కానీ టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని తుదికంటూ పోరాడిన అఖిల్ సార్థక్ మాత్రం రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అంతేకాదు రన్నరప్ అఖిల్‌కు నగదు బహుమతి ఏమీ ఇవ్వకపోవచ్చని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. టాప్ 2 వరకు వెళ్లిన అఖల్ చివరికి భంగపాటు తప్పలేదంటూ సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభిజిత్‌తో గొడవ, మోనాల్‌తో లవ్ ట్రాక్ తనను గెలిపిస్తాయని ఆశపడిన అఖిల్ ట్రోఫీ దక్కించు కోలేకపోయాడు. అంతేకాదు గ్రాండ్ ఫినాలే వేదికగా టాప్-5 లో నిలిచిన సోహైల్, మెహబూబ్‌లపై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి మాటలకు అందరూ ఫిదా అయ్యారు. వారిద్దరి గురించి చిరు ఎక్కువగా హైలెట్ చేయడం, అఖిల్ గురించి చాలా తక్కువ మాట్లాడడం కూడా అఖిల్‌కు దెబ్బేనని పేర్కొంటున్నారు. వాళ్లనలా పొగుడుతూంటూ.. అఖిల్ మాత్రం బేలగా నిలబడిపోయాడని అలాగే దివి, హారికలతో చిరు రొమాంటిక్ సంభాషణ, మెహబూబ్‌కి 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం లాంటివి అంశాలు అఖిల్‌కి బాధాకర విషయాలని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క రేసు నుంచి తప్పుకుని, తనకు వచ్చిన 25 లక్షల రూపాయల్లో అనాథాశ్రమానికి రూ. 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నానని ఆ గోల్డ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చేశాడు సొహేల్. ఇది నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంది. దీనికి తోడు తనకొచ్చిన ప్రైజ్‌మనీలో 10 లక్షలు దానం చేస్తానని సోహైల్ ప్రకటించడం బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మురిసిపోయి, ఆ పది లక్షలూ తానే ఇస్తాననడం మరింత హైలెట్‌గా నిలిచింది. అయితే హౌస్‌లో తన ఆట పాటలతో అలరించిన అఖిల్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణంద్వారా మొదట్లో బాగా చర్చల్లో నిలిచాడు. ఆ తరువాత ఆమెను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతూ అఖిల్ చివరికి బకరాగా మిగిలిపోయాడు. మోనాల్ చుట్టూనే తిరుగుతూ హగ్స్ ఇస్తూ.. ముద్దులు పెట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్‌ను బాగానే రక్తికట్టించినా, విన్నర్ మాత్రం అభిజిత్ అయ్యాడు. అయితే ఎలాంటి ఫేమ్ లేని అఖిల్ బిగ్ బాస్ టాప్ 2 వరకు రావడం విశేషమే. మరి అఖిల్ కెరీర్‌కు ఇదిఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిందే. కాగా మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఆ తర్వాత మోనాల్ డబుల్ గేమ్ తెలిసి మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టాడు. అయితే మోనాల్ ది డబుల్ గేమ్ తెలిసినా ఆమెతో కనెక్షన్, ఎమోషన్ పెంచుకోవడమే కాదు శృతి మించి ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో మోనాల్ విషయంలో అఖిల్ పెద్ద బకరాగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే ఓ బకరాగా బయటికి రాకతప్పదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరికి వారి జోస్యం నిజం కావడంతో అయ్యో అఖిల్ అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. An entertaining finale to most talked about season. While #Abhijeet won well deserved title, #Sohel with street smart moves and character won all hearts, #Akhil continued making mess of his chances and abilities.. Disappointed to miss #Ariyana in final 2. #BiggBossTelugu4 pic.twitter.com/GHXHRefxlv — Sampath Murki (@anytime_sampath) December 21, 2020 -
బిగ్‌బాస్ బిగ్ షాక్.. వరస్ట్ పెర్ఫార్మర్గా అభిజిత్
బిగ్‌బాస్ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్‌ల మధ్య లొల్లి మరోసారి తారాస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే ‘రేస్ టు ఫినాలే’లో భాగంగా ఇంటి సభ్యులలో మరోసారి అగ్గిరాజేశాడు బిగ్‌బాస్. బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరో ఎంచుకోవాలని ఫిట్టింగ్ పెట్టారు. మరి ఇంటి సభ్యులో ఎవరు బెస్ట్ కెప్టెన్ అయ్యారు. ఎవరు వరస్ట్ కెప్టెన్ అయ్యారు. అసలు వారిని ఎంపిక చేసే క్రమంలో ఇంటి సభ్యుల్లో ఎలాంటి గొడవ లు జరిగాయో చదివేద్దాం. బొక్క బోర్లా పడ్డ అవినాష్. గార్డెన్ ఏరియాలో మోనాల్ ఆసనాలు వేస్తూ తల క్రిందికి చేతులు పైకి పెడితే.. అవినాష్ కూడా తానేం తక్కువ కాదన్నట్లుగా వెళ్లి బొక్కబోర్ల పడ్డాడు. అరియానా చెప్పిన వినకుండా ఆసనాల కోసం ట్రై చేసి నవ్వుల పాలయ్యాడు. సొహైల్ అవినాష్‌తో ఆసనాలు వేయిస్తూ దబాంగ్ దబాంగ్ అంటూ బాదుడు బాదేయడం తెగ నవ్వు తెప్పించింది. అభిజిత్ వరస్ట్ పెర్ఫార్మర్ బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇంటి సభ్యులు నిరాశాజనకమైన ప్రదర్శన ఇచ్చారని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది బిగ్ బాస్ ఇళ్లు అని.. బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏదీ జరగదన్న విషయం మరిచిపోయారని, దెయ్యం జలజ మీకు ఇచ్చిన టాస్క్‌లను నిరాకరించారని.. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫార్మర్గా ప్రకటించారు బిగ్ బాస్. ఈ కారణంగా ఇంటి సభ్యులకు ఎటువంటి లగ్జరీ బడ్జెట్ లభించదని కనీసం.. 12 వారాల ప్రయాణం తరువాత అయినా టాస్క్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు బిగ్‌బాస్ తెలిపారు. అలాగే ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు. దీంట్లో భాగంగా అవినాష్ తనకు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశానని, రాత్రంతా నిద్రపోలేదని చెప్పుకొచ్చాడు. ‘మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వల్ల నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. ఆ లెటర్లో మీరు అఖిల్, అభిజిత్‌లు కలిసిన మోనాల్‌ని ఏడిపించారన్న పదాలు నాకు అర్థంకాలేదు.. ఆమెను నేను ఏడిపించాను అంటే పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. అందుకే టాస్క్ చేయడానికి నిరాకరించాను. 12వ వారాల జర్నీలో నేను హర్ట్ అయ్యా.. అందుకే దీన్ని పర్సనల్‌గా తీసుకున్నా. ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నా’ అని అభిజిత్ బిగ్‌బాస్‌కు వివరణ ఇచ్చాడు. బెస్ట్ కెప్టెన్‌గా హారిక బిగ్ బాస్ హౌస్‌లో రేస్ టు ఫినాలు మొదలైందని.. తిరిగి ఫినాలే వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఉండరని చెప్పారు . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటి సభ్యులు అందరూ తాము ఎదుర్కొన్న సవాళ్లు, అమలుపరిచిన నియమాలు మరియు ఇంటిని సక్రమంగా నడపడంలో తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారా లేదా అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడున్న మాజీ కెప్టెన్లలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. ఎవరు వరస్ట్ కెప్టెన్ తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశించారు. బెస్ట్ కెప్టెన్ ఎవరో చర్చించే సందర్భంగా ఇంటి సభ్యులు అభిప్రాయాలు ఇలా సొహైల్.. నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్లిపోయా.కెప్టెన్ కూడా కష్టపడి అయ్యా. ముగ్గురు పోటీదారులతో పోరాడి కెప్టెన్ అయ్యా. నా అంతట నేను ఓన్‌గా కెప్టెన్ అయ్యా అరియానా: మార్పు నాతోనే మొదలైంది. బాగా కష్టపడి ఇంటి సభ్యులందరి సహకారంతో కెప్టెన్ అయ్యా. నా కెప్టెన్సీ స్ట్రిక్ట్‌గా చేశా.. మార్పు నా కెప్టెన్సీతో మొదలైంది.. అదే టైమ్‌లో ఎవరి స్పేస్ వాళ్లకు ఇచ్చా అఖిల్ : నాకు అంత ఈజీగా కెప్టెన్సీ రాలేదు. చాలా కష్టంతో వచ్చింది. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని బయటకు వెళ్లాక సీక్రెట్ రూంలో చాలా ఫేస్ చేశా. నేను వచ్చాక లక్ బేస్ మీద కెప్టెన్సీ అయ్యానని అంటున్నారు. కానీ అక్కడ నామినేషన్ ఉంది.. కెప్టెన్సీ ఉంది.. దాంట్లో నాకు కెప్టెన్సీ వచ్చింది. నా కెప్టెన్సీ చాలా స్పూత్‌గా వెళ్లిపోయింది. హారిక.. లీడర్ షిప్లో నేను సూపర్. లీడర్ షిప్ స్కిల్స్ నాలో చాలా బాగా ఉన్నాయని అనిపించింది. ఇక అందరి ఒపినియన్ తీసుకున్నాక.. అవినాష్, అభిజిత్‌లు హారికను బెస్ట్ కెప్టెన్‌గా ఎన్నుకోగా.. సోహైల్, అఖిల్ ఒకరినొకరుని ఎంచుకున్నారు. ఇక అరియానా అవినాష్‌ని, మోనాల్ సోహైల్ పేరును చెప్పారు. మొత్తంలో హారిక, సోహైల్‌కి సమానం ఓట్లు(రెండు) రాగా, అరియానా యూటర్న్ తీసుకొని హారికను ఎంచుకుంది. దీంతో బెస్ట్ కెప్టెన్‌గా హారిక ఎంపికైంది. వరస్ట్ కెప్టెన్‌గా అరియానా వరస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చలో మొదటగా సోహైల్ మాట్లాడాడు. నాకైతే అరియానా వరస్ట్ కెప్టెన్ అనిపిస్తుందని ముఖం మీదనే చెప్పేశాడు. దానికి కారణం చెబుతూ.. ఆమె కెప్టెన్సీలో చాలా టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చాడు. ఇక అవినాష్‌ని అఖిల్‌ని వరస్ట్ కెప్టెన్ అని చెప్పాడు. పనిష్మెంట్ని మోనాల్ విషయంలో అమలు చేయలేదని చెప్పాడు. అయితే అఖిల్ ఈ విషయంపై సిరియస్ అయ్యాడు. తాను అందరిని సమానంగా చూశానని, ఎవరిపై సింపతీ చూపించలేదన్నాడు. అలాగే తనకు కూడా అవినాషే వరస్ట్ కెప్టెన్ అని చెప్పేశాడు. ఇక అరియానా సొహైల్‌ని వరస్ట్ కెప్టెన్ అని చెప్పడంతో సోహైల్ ఎప్పటిలాగే అరియానాని హేళన చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేశాడు. ఇక అభిజిత్.. అఖిల్‌ని వరస్ట్ కెప్టెన్ అని, లక్ కొద్దీ కెప్టెన్ అయ్యాడని చెప్తుండగా.. అఖిల్ ఈ సోది కబుర్లు వద్దు.. ముందునుంచి నేను వరస్ట్ అని ఉంది నీకు అదే చెప్పెయ్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య రచ్చ రేగుతుండగా.. సొహైల్ వచ్చి మళ్లీ ఎటో పోతుంది ఇది.. ఆపండి అని అనడంతో.. ఎటు పోతుంద్రా ఆగరా నువ్ అంటూ సొహైల్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు. ఇక అభి సైలెంట్ కావడంతో ఆ గొడవ అక్కడితో సద్దుమనిగింది. మొత్తంగా వరస్ట్ కెప్టెన్‌గా అరియానా పేరుని ఫైనల్ చేశారు. అలిగిన అరియానా.. సారీ చెప్పిన అవినాష్ ఏమైందో ఏమో కానీ అవినాష్‌పై అరియానా అలిగింది. కాసేపు మాట్లాడలేదు. దీంతో అవినాషే ఒక అడుగు ముందుకేసి అరియానాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు.ఏమైందని అరియానా అని అవినాష్ అడగ్గా.. నువ్ వెర్రిపప్ప అవ్వడం నాకు ఇష్టం లేదు.. నీతో మాట్లాడటానికి టైం పడుతుందని చెప్పింది. దీంతో అవినాష్ గుడ్‌నైట్ చెప్పి తన బెడ్‌పైకి వెళ్లి నిద్రపోయాడు. -
బిగ్‌బాస్ ఫిట్టింగ్.. అఖిల్, అభి మధ్య మళ్లీ లొల్లి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఈ బిగ్ రియాల్టీ షోకి శుభం కార్డు పడటానికి మరో 23 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్ మరింత రసవత్తంగా మార్చేందకు బిగ్‌బాస్ నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొత్త కొత్త టాస్క్‌లు, ఊహించని ట్విస్ట్‌లు ఇస్తూ ప్రతి ఎపిసోడ్‌ని ఆసక్తికరంగా మార్చుతున్నారు. ఇక ఇంటి సభ్యులు కూడా గేమ్‌లో లీనమైపోయారు. విన్నర్ అవ్వాలని ప్రతి ఒక్కరు వందశాతం ఫర్మార్మెన్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్‌ల మధ్య లొల్లి మరోసారి తారాస్థాయికి వెళ్లినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. తాజా ప్రోమో ప్రకారం రేస్ టు ఫినాలే మొదలైందని చెప్పిన బిగ్‌బాస్... హౌస్‌లో ఉన్న మాజీ కెప్టెన్స్‌లో ఒక బెస్ట్ కెప్టెన్ ఒక వరస్ట్ కెప్టెన్ ఎన్నుకోవాలని ఆదేశించారు. ఇకేముంది బిగ్‌బాస్ పెట్టిన ఫిట్టింగ్‌కి ఇంట్లో మాటల యుద్దమే మొదలైంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యుల్లో మోనాల్ తప్ప మిగిలిన ఆరుగురు కెప్టెన్ అయినవాళ్లే. అయితే వీళ్లలో నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సొహైల్ ఒక అడుగు ముందుకేసి.. నాకైతే అరియానా వరస్ట్ కెప్టెన్ అనిపిస్తుందని ముఖం మీదనే చెప్పేశాడు. దానికి కారణం చెబుతూ.. ఆమె కెప్టెన్సీలో చాలా టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చాడు. అయితే తన కెప్టెన్సీ దగ్గరనుంచి హౌస్‌లో మార్పు అనేది వచ్చిందని.. ఎవరి స్పేస్ వాళ్లకి ఇచ్చానని అరియానా తన కెప్టెన్సీని సమర్థించుకుంది. (చదవండి : బిగ్‌బాస్ : ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్!) సొహైల్ గాడు సొంతంగా ఆడి కెప్టెన్ అయ్యాడు.. పనిష్మెంట్ స్టార్ట్ చేసింది సొహైల్ మాత్రమే అంటూ తన గురించి తానే గప్పాలు కొట్టుకున్నాడు. అయితే అఖిల్.. అందరూ ఒంటిరిగానే ఆడుతున్నారని కౌంటర్ ఇచ్చాడు. ఇక అందరూ కష్టపడి కెప్టెన్ అయితే అఖిల్ మాత్రం లక్‌తో సీక్రెట్ రూంకి వెళ్లి కెప్టెన్ అయ్యాడని అభిజిత్ అనడంతో మళ్లీ లొల్లి మొదలైంది. అఖిల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. (చదవండి : బిగ్‌బాస్ : అఖిల్‌పై రాహుల్ షాకింగ్ కామెంట్స్) అంతకు ముందు నేను చాలా కష్టపడ్డానని, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అనేది బిగ్గెస్ట్ రిస్క్ అని అఖిల్ అనగా... ‘అది నీ దృష్టిలో రిస్క్.. మాకు అలా అనిపించలేదు.. నీకు తెలుసు అది రెడ్ జోన్ తిరిగి వస్తానని తెలిసే కావాలనే వెళ్లావు’ అని అభిజిత్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య రచ్చ రేగుతుండగా.. సొహైల్ వచ్చి మళ్లీ ఎటో పోతుంది ఇది.. ఆపండి అని అనడంతో.. ఎటు పోతుంద్రా ఆగరా నువ్ అంటూ సొహైల్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు. అసలు అభి, అఖిల్‌ల గొడవ ఏ స్థాయికి వెళ్లింది. అసలు బెస్ట్ కెప్టెన్, వరస్ట్ కెప్టెన్‌గా ఎవరెవరు ఎన్నికయ్యారో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే. -
బిగ్‌బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ విజయవంతగా 11 వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. షో ముగింపునకు 25 రోజులే మిగిలి ఉండటంతో టైటిల్ విజేత ఎవరన్నదానిపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలోనూ ఆసక్తిమొదలైంది. మరోపక్క ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో హౌస్మేట్స్ ఫోకస్ అంతా గేమ్‌పైనే పెట్టారు. త్యాగాలు, సపోర్టులు పక్కకు పెట్టి విడివిడిగా గేమ్ ఆడుతున్నారు. ఇక ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన కంటెస్టెంట్‌ని రక్షించేపనిలో పడ్డారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. (చదవండి : బిగ్‌బాస్‌లోకి అనుకొని అతిథి.. దడుచుకున్న బోల్డ్ గర్ల్) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్‌బాస్‌పై స్పందించారు. జబర్దస్త్ కమెడియన్ అవినాష్, అభిజిత్‌లకు సపోర్ట్ చేయాల్సిందిగా వీడియో విడుదల చేశారు. అవినాస్ తనకు చాలాకాలంగా తెలుసని అతనికి సపోర్ట్ చేయాలని కోరారు. అయితే, బిగ్ బాస్ షోలో ఓసారి అవినాశ్ తీవ్ర భావోద్వేగాలకు గురికావడం గమనించానని, దాంతో అతడికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందని అన్నారు. తనకు తెలిసినంత వరకు అవినాష్ ఎమోషనల్ వ్యక్తి కాదని, బహుశా బిగ్ బాస్ షోలో పరిస్థితుల కారణంగా భావోద్వేగాలకు లోనై ఉంటాడని తెలిపారు. అలాగే హౌస్‌లో తనకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అభిజిత్ అని, అతని వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని చెపుకొచ్చాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడే నచ్చాడు. మంచి కుర్రాడు అనిపించాడు. అతను ఓ హీరోగా సక్సెస్ అయ్యుంటే బాగుండును అనిపించింది. కానీ సినిమా కెరీర్ విషయం అటుంచితే బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగతంగా అవినాష్‌కి నా సపోర్ట్ ఉన్నా కూడా నా మనసు, నా ఇష్టం మాత్రం అభిజిత్‌పైనే ఉంది. నన్ను సపోర్ట్ చేయమని ఎవరూ అడుగలేదు. ఎందుకో ఈ ఇద్దరికి సపోర్ట్ ఇవ్వాలనిపించింది. ఇద్దరిలో ఎవరు విజేత అయినా నాకు ఇష్టమే. ఇద్దరికి ఓట్లు వేసి ఫైనల్ వరకు తీసుకురండి’ అని తన అభిమానులను కోరారు. -
బిగ్‌బాస్ : ఇది రా మజా అంటే.. సోహైల్
బిగ్‌బాస్ పదకొండోవారంలో టాస్క్‌ల కంటే కుటుంబ సభ్యుల సందడే ఎక్కువగా ఉంది. గత రెండు ఎపిసోడ్లు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసువచ్చి ఏడిపించడంతోనే గడిచిపోయాయి. ఇక నేటి ఎపిసోడ్‌తో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీకి ఎండ్‌కార్డు పడనుంది. ఈ రోజు ఎపిసోడ్లో లాస్య భర్త, కొడుకు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదకొడో వారంలో అసలు టాస్క్ మొదలు కానుంది. అదే కెప్టెన్సీ టాస్క్. దీనికి హారిక, అభిజిత్, అఖిల్ పోటీ పడినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్ అవుతారు. దీంట్లో భాగంగా అభిజిత్‌ను అవినాష్, అఖిల్‌ను సోహైల్, హారికను మోనాల్ తమ తమ భుజాలపై ఎత్తుకున్నారు. అయితే అభి బరువును మోయలేక అవినాష్ తటపటాయించి నట్లు తెలుస్తోంది. ఇక సోహైల్ అయితే ఇదిరా మజా అంటూ.. అఖిల్‌ను తన భూజాలపై ఎక్కించుకున్నాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి, కెప్టెన్ అయిందెవరో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్ : ఆమెను నామినేట్ చేసి షాకిచ్చిన అఖిల్
నోయల్ పెట్టిన చిచ్చు బిగ్‌బాస్ హౌస్‌లో బాగానే పనిచేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ డే (సోమవారం) రావడంతో హౌస్మేట్స్ అంతా నోయల్ వ్యాఖ్యలను బేస్ చేసుకొని నామినేషన్ చేసినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి అర్థమవుతోంది. ఇందులో నామినేట్ చేయాలనుకున్నవారి తలపై గుడ్డు కొట్టాలని.. ఒక్కొక్కరు ఇద్దరు తలపై గుడ్డు కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించగా.. అమ్మా రాజశేఖర్-అభిజిత్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ‘నోయల్ గొడవ చేస్తే నువ్ ఎవడివి? కష్టపడి పైకి వచ్చినోడికి తెలుస్తోంది బాధ.. నీకేం తెలుసు?’ అంటూ అభిజిత్‌పై అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. కష్టం.. కష్టం.. ప్రతిసారీ కష్టమేనా? ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు. మీరొక్కరే కాదు.. అంటూ అమ్మా రాజశేఖర్‌పై అభిజిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్ ఏం కష్టపడుతున్నావ్.. చైర్లో కూర్చుని బాగా కష్టపడుతున్నావా?? అని మాస్టర్ అనడంతో.. నువ్ అరిస్తే ఎవడూ ఇక్కడ బయపడేటోడు లేడు అంటూ అభిజిత్ గట్టిగానే సమధానం ఇస్తున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య గట్టిగానే అవుతోంది. ఇక ఈ సారి నామినేషన్లో మరో విచిత్రం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా అఖిల్ మోనాల్‌ని నామినేట్ చేశాడు. దీంతో హౌజ్‌మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు. మోనాల్‌ని నామినేట్ చేయడం ఏంట్రా అంటూ అమ్మ రాజశేఖర్ నోరెళ్లబెట్టాడు. ఇక అరియానా సోహైల్‌ని నామినేట్ చేయడంతో సోహైల్ కోపంతో ఊగిపోయాడు. ఇంకో గుడ్డు ఉంటే కూడా తీసుకొచ్చి కొట్టు.. హోలీ ఆడుకుందాం అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అక్కడి విషయాలు ఇక్కడ.. ఇక్కడి విషయాలు అక్కడ పెడుతున్నారంటూ సోహైల్ మోనాల్‌ని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. -
తెరపైకి ‘ఒరేయ్’ ఇష్యూ.. ఏడ్చిన మోనాల్
బిగ్‌బాస్ సీజన్ 4.. చూస్తుండగానే నెల గడిచిపోయింది. గత నాలుగు వారాలుగా చిన్న చిన్న గొడవలు, బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్కులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో షో గడిస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అంతా మాస్కులు తీసేసి ఓరినల్ ఆటను ప్రారంభించారు. ఇక శనివారం నాటి ఎలిమినేషన్, ఆదివారం నాటి ఎంటర్టైన్మెంట్తో అలా నాల్గో వీకెండ్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఐదో వారంలో ఇలా అడుగుపెట్టింది. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైందంటే.. హౌస్‌లో గొడవలు జరగడం సహజం. అయితే ఈ వారం మాత్రం నామినేషన్ ప్రక్రియ కాస్త సీరియస్‌గా జరిగింది. అభిజిత్, అఖిల్ మధ్య మాటల యుద్దం, మోనాల్ భావోద్వేగం, సోహైల్ ఫైర్ లాంటి వాటితో నేటి ఎపిసోడ్ రసవత్తంగా సాగింది. ఇక పూర్తి ఎపిసోడ్‌లోకి వెళితే.. మళ్లీ తెరపైకి ‘ఒరేయ్’ ఇష్యూ నేటి ఎపిసోడ్ మొత్తం నామినేషన్ ప్రక్రియతోనే కొనసాగింది. అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్‌బాస్.. నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశారు. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై స్నోను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పాలని ఆదేశించాడు. ఇంటి కెప్టెన్ కారణంగా నామినేషన్ నుంచి కుమార్ సాయికి మినహాయింపు లభించింది. అఖిల్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అతను అభిజిత్, అమ్మ రాజశేఖర్ ముఖాలకు స్నో పూసి నామినేట్ చేశారు. ‘ఒరేయ్’అన్న విషయంలో హర్ట్ అయ్యానని, నేను పర్మిషన్ తీసుకొనే అలా అన్నానని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఏజ్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదని వాటివల్ల నేను హర్ట్ అయ్యానని ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదని అఖిల్ అన్నాడు. నువ్వు ఒరేయ్ అనడం నాకు నచ్చలేదు.. క్వాలిఫికేషన్ విషయంలో కూడా నీకు క్లారిటీ లేదంటూ అభి వాదించడంతో ఇద్దర మధ్య చాలాసేపు మాటల యుద్దం నడిచింది. ఇక అరియానా వచ్చి అఖిల్ ముఖానికి, అమ్మా రాజశేఖర్ ముఖానికి స్నో పూసి నామినేట్ చేసింది. లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్ చేసిన షాపింగ్ తనకు నచ్చలేదని, అతను ఇంట్లో ఉన్న 16 మందికి పుడ్ వచ్చేలా చేయకుండా.. కొంతమంది పేర్లు మాత్రమే రాసి మిగిలిన వారికి రాకుండా చేశాడని చెప్పుకొచ్చింది. ఇక అమ్మ రాజశేఖర్ గురించి చెబుతూ.. తనను వంట చేయడం లేదని అన్నారని, ఆ మాట కాస్త బాధగా ఉందని చెప్పింది. కంటతడి పెట్టిన లాస్య ఇక లాస్య దివి, నోయల్‌ను నామినేట్ చేసింది. కిచెన్‌లో పాత్రలు కడగమంటే దిని నేను ఆ పని చేయనని చెప్పిందని, అలా చెప్పడం నచ్చలేదని చెప్పింది. హైస్‌లో అందరూ అన్ని పనులు చేయాలని చెప్పింది. ఇక నోయల్ నామినేట్‌కు రీజన్ చెబుతూ.. లాస్య బావోధ్వేగానికి లోనయ్యింది. గత వారం నాగ్ సర్ లాస్య ఫేక్‌గా ఉంటుందా అని అడిగి నోయల్ ఎస్ చెప్పాడని, అందరి కంటే నోయల్ అలా చెప్పడం బాధగా ఉందని కంటతడి పెట్టింది. నోయల్ తనకు ముందు నుంచి తెలుసని, ప్రస్తుతం అతనిలో సరిగా ఉండలేకపోతున్నానని చెప్పింది. అఖిల్‌పై అవినాష్ ఫైర్ లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్ కొందరి పేర్లు మాత్రమే ఇచ్చాడని, దానివల్ల కొంతమంది పస్తులు ఉండాల్సి వచ్చిందని చెబుతూ అఖిల్‌ని అవినాష్ నామినేట్ చేశాడు. అందరి పేర్లు రాస్తే అందరికి పుడ్ అందేదని, తనకు క్లోజ్‌గా ఉన్నవారి పేర్లు మాత్రమే రాయడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు. మధ్య అఖిల్ కలగజేసుకొని నేను కావాలని రాయలేదని, నా వల్ల ఎవరూ పస్తులు లేరని చెప్పాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనడంతో అవినాష్ ఫైర్ అయ్యారు. నేను సేఫ్ గేమ్ ఆడడంలేదని, అలా ఆడితే నన్ను ఎందుకు నామినేట్ చేస్తలేరని ప్రశ్నించాడు. హిట్ మ్యాన్ గేమ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నానని చెప్పినందుకు మోనాల్‌ని నామినేట్ చేశాడు. ఇక సుజాత అఖిల్, అరియానాను నామినేట్ చేయగా, కుమార్ సాయి.. నోయల్‌ని నామినేట్ చేస్తూ ఫస్ట్ నామినేషన్ అప్పుడు చెప్పిన రీజన్‌నే మళ్లీ మళ్లీ చెప్తున్నారని అందుకే తనకు నచ్చలేదని చెప్పాడు. ఇక రెండో వ్యక్తిగా సుజాతను నామినేట్ చేస్తూ.. ఒకరిపై డిపెండ్ అయ్యి ఆటాడుతుందని.. సొంతంగా ఆట ఆడటం లేదని.. నచ్చిన వాళ్ల విషయంలో సెల్ఫిష్‌గా అనిపిస్తున్నారని చెప్పారు. సొహైల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ వాష్ రూం క్లీనింగ్ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కాయిన్ టాస్క్ విషయంలో సపోర్ట్ చేస్తాడని అనుకున్నానని కాని అతనే వివాదానికి కారణం అయ్యాడని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు .గంగవ్వ.. నోయల్‌ని, అభిజిత్‌ని నామినేట్ చేసింది.అభిజిత్ ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడు అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది. రాజశేఖర్ మాస్టర్.. అఖిల్, అరియానాలను నామినేట్ చేశారు. లాస్య కష్టపడినట్టుగా అరియానా కిచెన్‌లో చేయడం లేదని చెప్పారు. అభిజిత్, అఖిల్ మధ్య బిగ్‌ఫైట్ నామినేషన్ ప్రక్రియ అభి, అఖిల్ మధ్య వార్‌కు దారి తీసింది. మొదటి వ్యక్తిగా సోహైల్‌ని నామినేట్ చేస్తు కోపం తగ్గించుకోవాలని సూచించాడు. ఇక రెండో వ్యక్తిగా అఖిల్‌ని నామినేట్ చేస్తూ గట్టిగా వేసుకున్నాడు. నువ్వు మామాలుగా కన్ఫ్యూజ్ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు అని గట్టిగా ఇచ్చేశాడు. యాటిట్యూడ్ కూడా నచ్చలేదు, దేనికైనా లిమిట్స్ ఉంటుంది అంటూ అభి మాట్లాడుతుండగా.. అఖిల్ రెచ్చిపోయాడు. ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఆమె ఐ లక్ యూ అంటే అదరికీ చెప్పుకోవడమే కాకుండా, సుజాత గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతున్నావ్.. ఇది నేషనల్ ఛానల్ ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తే బయటకు ఎలా వెళ్తుంది అంటూ ఫైర్ కాగా, మోనాల్, సుజాత గురించి నీకెందుకని, ఏదైనా ఉంటే వాళ్లతో మాట్లాడుకుంటానని అభి కౌంటర్ ఇచ్చాడు. నా క్యారెక్టర్‌తో ఆటలొద్దు : మోనాల్ ఇక అభి, అఖిల్ పదే పదే తన పేరు ప్రస్తావించడంతో మోనాల్ అసహనానికి గురైంది. దయచేసి నా పేరుని తీయకండి అంటూ దండం పెట్టి బోరు బోరున ఏడ్చింది. ఐ లైక్ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమే అని.. ఎవరైనా ఇష్టమే అని.. మీరు మీరూ చూసుకోవాలని కాని.. నేషనల్ ఛానల్లో నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి.. జీవితాలతో ఆడుకోకూడదని ప్రతి విషయం టెలికాస్ట్ అవుతుందని.. నా క్యారెక్టర్‌తో ఆటలు ఆడొద్దు.. నా క్యారెక్టర్ని జడ్జి చేయడానికి మీరు ఎవరు?? అంటూ గట్టిగా అరుస్తూ బోరున ఏడ్చేసింది. గంగవ్వ వెళ్లి మోనాల్‌ను ఓదార్చింది. ఇక నోయల్.. అమ్మ రాజశేఖర్, సోహైల్‌ను నామినేట్ చేశాడు. నామినేషన్ అంటే పాయింట్ ఉండాలని.. ఇంటి నుంచి వెళిపోవడానికి సరైనా పాయింట్ ఉండాలని చెప్పాడు. స్వాతిని మాస్టర్ అకారణంగా నామినేట్ చేశాడని, అతని వల్ల ఒక మొక్క ఎదగ కుండానే వెళ్లిపోయిందని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్. అయితే నువ్ స్వాతి విషయం మాట్లాడితే తప్పని అన్నావు.. మరి నువ్ ఇప్పుడు స్వాతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని సొహైల్ పాయింట్ రైజ్ చేయడంతో హర్ట్ అయిన నోయల్ తిరిగి సొహైల్‌నే నామినేట్ చేశాడు.దీంతో ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నిలిచారు. -
అభి, అఖిల్ మధ్య ఫైట్.. భోరుమన్న మోనాల్
బిగ్‌బాస్ సీజన్ 4.. చూస్తుండగానే నెల గడిచిపోయింది. గత నాలుగు వారాలుగా చిన్న చిన్న గొడవలు, బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్కులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో షో గడిస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అంతా మాస్కులు తీసేసి ఓరినల్ ఆటను ప్రారంభించారు. ఇక శనివారం నాటి ఎలిమినేషన్, ఆదివారం నాటి ఎంటర్టైన్మెంట్తో అలా నాల్గో వీకెండ్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఐదో వారంలో ఇలా అడుగుపెట్టింది. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైందంటే.. హౌస్‌లో గొడవలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం కాస్త రసవత్తంగా సాగనుంది. నామినేషన్ ప్రక్రియలో అభిజిత్, అఖిల్‌కు మాటల యుద్దమే జరిగింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలే దానికి నిదర్శనం. అందులో అఖిల్‌కి క్రీమ్ పూసిన తరువాత అభి మాట్లాడుతూ.. నువ్వు మామాలుగా కన్ఫ్యూజ్ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు అని గట్టిగా ఇచ్చేశాడు. వెంటనే స్పందించిన అఖిల్..వేలు అలా చూపించి మాట్లాడకు డ్యూడ్ అని సీరియస్ అవ్వగా.. నువ్వు ప్రతిసారి అదే చేస్తున్నావు అంటూ అభిజిత్ అన్నాడు. ఆ రోజు మోనాల్‌ని అలానే వేలు చూపించి మాట్లాడావు అని అభిపై అఖిల్ ఫైర్ అవగా.. ఆమె విషయం నీకెందుకు బ్రదర్ అంటూ అభి కౌంటర్ ఇచ్చాడు. దీంతో అసహనానికి గురైన మోనాల్.. తన గురించి మాట్లాడకండి అంటూ ఏడ్చేసింది. ఆ సమయంలో గంగవ్వ, మోనాల్‌ని ఓదార్చింది. ఇక మరో ప్రోమోలో కూడా కంటెస్టెంట్స్ మధ్య జరిగిన మాటల యుద్దాన్నే చూపించారు. అందులో కూడా అభి, అఖిల్‌ల ఫైటే ఉంది. అంతగానం మాట్లాడేది ఉంటే బయటకెళ్లి మాట్లాడుతో అని అభి సూచించగా.. దమ్ముంటే నన్నుఇక్కడి నుంచి పంపించు బయటకెళ్లి మాట్లాడుకుంటా అంటూ అభి కౌంటర్ ఇచ్చాడు. వేరే వాళ్ల టాపిక్ తీసుకురాకండి.. ఇది జాతీయ చానెల్ అందరూ చూస్తున్నారు అని మోనాల్ మళ్లీ ఏడ్చేసింది. Argument between #Abijeet & #Akhil in nomination process 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/yg5MG5w8gE — starmaa (@StarMaa) October 5, 2020 ఇక ఇదంతా చూస్తూ భరించిన సోహైల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఏదో విషయంలో అభిజిత్ ఫైర్ అయ్యాడు. ఇక లాస్య, దివిల మధ్య మాటల యుద్దం నడిచింది. మొత్తానికి ఈ ప్రోమోలను చూస్తుంటే ఇవాళ హౌజ్‌లో రచ్చ ఎక్కువగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ,అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రయాంగిల్ కథ అందరికీ తెలిసిందే. మోనాల్ ఆ ఇద్దరితో క్లోజ్‌గానే ఉంటుంది. ఆమె వల్ల అభి, అఖిల్ ఇద్దరు విడిపోయారనేది షో చూస్తున్న వారందరికి అర్థమవుతుంది. మరోవైపు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ తన కారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నారంటూ మోనాల్ ఇప్పటికే భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. Tonight nominations are going to be on a serious note 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/rIgnvD0RrT — starmaa (@StarMaa) October 5, 2020 -
కామన్వెల్త్ చెస్ చాంప్ అభిజిత్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్స్ మెరిశారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో అభిజిత్ గుప్తా విజేతగా నిలువగా... వైభవ్ సూరి రెండో స్థానంలో, తేజస్ బాక్రే మూడో స్థానంలో నిలిచారు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిశాక అభిజిత్ గుప్తా 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరు గేముల్లో గెలిచిన అభిజిత్, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచాడు. వైభవ్, తేజస్ ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వైభవ్‌కు రెండో స్థానం, తేజస్‌కు మూడో స్థానం దక్కాయి. తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలువడం విశేషం. ఐదు గేముల్లో గెలిచిన అర్జున్, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... మరో గేమ్‌లో ఓడిపోయాడు. -
హ్యాపీ బర్త్‌డే బరాత్!
ఆదర్శం పుట్టిన రోజూ పండగే అందరికీ! అందరికీనా? అభాగ్యులకు మాత్రం అన్ని రోజుల్లాగే అదొక రోజు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పూనుకుంటుంది. ఇదేమిటో తెలుసుకునే ముందు అభిజిత్ బాజ్‌పాయ్ గురించి తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఢిల్లీలో ఒకరోజు కారులో వెళుతుంటే దూరంగా ఒక దృశ్యం కనిపించింది. కొందరు వీధిబాలలు చిరిగిపోయిన బర్త్‌డే క్యాప్లతో, ఖాళీ కేక్బాక్స్లతో ఆడలాడుకుంటున్నారు. ఈ దృశ్యం అభిజిత్‌ను బాగా కదిలించింది. ‘‘పాపం ఈ పిల్లలకు బర్త్‌డేలు ఉండవు’’ అనుకున్నారు. ఆ రోజంతా ఆఫీసులో ఇదే విషయం గురించి ఆలోచించారు. ఇంటికి వెళ్లిన తరువాత తన ఆలోచనను భార్య సోనమ్‌తో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో అషిలా, లైలా అనే వీధి బాలల పుట్టిన రోజును ఒక వేడుకలా జరిపారు. తాము చేసిన పని గురించి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టారు అభిజిత్. అద్భుతమైన స్పందన మొదలైంది. ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పేరుతో ఒక బృందం తయారైంది. ఈ బర్త్‌డే బరాత్ వీధిబాలలకు పుట్టిన రోజు వేడుకలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది. ఆ రోజు ఆ పిల్లలు ఆటలు ఆడతారు. పాటలు పాడుతారు. బర్త్‌డే కేకు కోస్తారు. కానుకలు తీసుకుంటారు. ఆ రోజంతా ఆనందంలో మునిగి తేలుతారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బరాత్ ఉద్దేశం డబ్బులు ఖర్చు చేయడం కాదు... వీధి బాలల కోసం కాస్త సమయాన్ని కేటాయించడం. ఆ కాసేపైనా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కావడం’’ అంటున్నారు అభిజిత్. వీధిపిల్లలకే కాదు... క్యాన్సర్ బాధిత పిల్లలకు కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంది ‘హాపీ బర్త్‌డే బరాత్’ ‘హాపీ బర్త్‌డే బరాత్’ ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది. ఇప్పుడు ఢిల్లీలోనే కాదు పుణే, ముంబై, కోల్‌కతా, సూరత్, చెన్నై... మొదలైన ప్రధాన పట్టణాల్లో ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’లు జరుగుతున్నాయి. పేద పిల్లల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ‘‘ఈ పిల్లలకు తమ పుట్టిన తేదీ తెలియదు. వయసు తెలియదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు. బర్త్‌డే జరుపు కోలేదు. పుట్టిన రోజు పేరుతో మేము చేస్తున్న ఈ వేడుక వల్ల ఆ రోజు వారి కళ్లల్లో కనిపించిన సంతోషపు వెలుగును ఎప్పటికీ మరిచిపోలేం’’ అంటున్నాడు ముంబైకి చెందిన శరద్ జైన్. ‘‘మామూలు పిల్లలు ఎలాగైతే తమ బర్త్‌డే రోజు స్పెషల్‌గా ఫీలవుతారో... బర్త్‌డే బరాత్ రోజు వీధిబాలలు కూడా అలాగే ఫీలవుతారు. ఆ సమయంలో వారి కళ్లల్లోని ఆనందాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది’’ అంటాడు కునాల్. ఆదివారం వచ్చిందంటే సినిమా హాళ్ల వైపు పరుగులు తీసే ప్రీతి పరేఖ్, సలోనీ వర్మలు తొలిసారిగా ‘హ్యాపీ బర్త్‌డే బరాత్ పార్టీ’కి హాజరయ్యారు. వారి స్పందన ఇలా ఉంది... ‘‘మా సన్డే ఫన్ డేగా మారిపోయింది. ఈసారి మేము కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండదలుచుకోలేదు. మేము కూడా ఇలాంటి బర్త్‌డే పార్టీలు చేయాలనుకుంటున్నాం’’ ఈ వీధి బాలల్లో చాలామంది ఫుట్‌పాత్‌లు, చౌరస్తాల దగ్గర చిన్న చిన్న వస్తువులు అమ్ముతారు. బర్త్‌డే పార్టీ వల్ల వారికి వచ్చే చిన్న ఆదాయానికి నష్టం రాకుండా వారి చేతుల్లో ఉన్న వస్తువులను తామే కొనుగోలు చేస్తున్నారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు. విశేషమేమింటే ఈ బర్త్‌డే పార్టీలకు హాజరవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ‘‘బర్త్‌డే గురించి వినడమేగానీ ఇంతకు ముందు ఎప్పుడూ నా బర్త్‌డే జరుపుకోలేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కేకు ఎంతో రుచిగా ఉంది. ఈ రోజు నాకు చాలా మంచి రోజు’’ అంటున్నాడు రవి. సిగ్నల్స్ దగ్గర బెలూన్లు, పూలు అమ్మడం ద్వారా రవి రోజుకు కనీసం వంద రూపాయలు సంపాదిస్తాడు. ఆ మొత్తం ఇవ్వడంతో పాటు రవికి కొత్త బట్టలు, షూస్ కొనిచ్చారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు. వీధి పిల్లలు, అనాథలు కేకు రుచి ఎప్పుడూ చూడకపోవచ్చు. అయితే ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పుణ్యమా అని తీయటి కేకు రుచి మాత్రమే కాదు... అంతకంటే తీయటి ‘ప్రేమ’ను రుచి చూస్తున్నారు! -
రామ్లా నేను ప్లేబాయ్ కాదు!
‘‘ఈ తరహా కథలు హిందీలో చాలా వచ్చాయి. ఇప్పుడు తెలుగులో ‘రామ్‌లీల’తో అలాంటి ప్రయత్నం చేయడం బాగుందని అందరూ అంటున్నారు. కథ కొత్తగా ఉందనే నేనీ సినిమా చేశా’’ అని హవీష్ అన్నారు. ఆయన హీరోగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘రామ్‌లీల’ గత శుక్రవారం విడుదలైన విషయం విదితమే. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిజిత్, నందిత తదితరులు నటించారు. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని హవీష్ అంటున్నారు. ఆయన చెప్పిన మరికొన్ని విశేషాలు... ‘జీనియస్’ తర్వాత చాలా కథలు విన్నాను. అన్నింటికన్నా ‘రామ్‌లీల’ కథ నచ్చింది. చూసినవాళ్లందరికీ కూడా నచ్చింది. ఒక మంచి మ్యూజికల్ మూవీ చూశామనే ఫీలింగ్‌ని చాలామంది వ్యక్తపరిచారు. నాకున్న ప్లస్ పాయింట్స్‌లో నా వాయిస్ ఒకటి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను చేసిన రామ్ పాత్రకు నా వాయిస్ బాగా నప్పింది. నీ గొంతు బాగుంటుందనే కాంప్లిమెంట్ నా చిన్నప్పట్నుంచీ వింటున్నాను. రామ్ పాత్ర శారీరక భాష, నా శారీరక భాష ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను సునాయాసంగా చేయగలిగాను. కానీ, రామ్లా నేను ప్లేబోయ్ కాదండి. రామ్ చాలా ఈజీగా అమ్మాయిలను పడేస్తాడు. నేనలాంటివాణ్ణి కాదు (నవ్వుతూ). ‘జీనియస్’ తర్వాత మళ్లీ దాసరి కిరణ్‌కుమార్‌గారి సంస్థలోనే సినిమా చేయడానికి కారణం ఆయన మీద ఉన్న నమ్మకమే. వేరే సంస్థల నుంచి అవకాశాలు వచ్చాయి కానీ, కథలు నచ్చక తిరస్కరించాను. ప్రేక్షకులు వినోదాన్ని ఇష్టపడుతున్నారు. అందుకని ఆ తరహా పాత్రలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. వినోద ప్రధానంగా సాగే కొత్త కథల అన్వేషణలో ఉన్నాను. -
రామ్ లీలలు
అమెరికాలో స్థిరపడిన తెలుగు కుర్రాడు... తెలివైన కుర్రాడు రామ్. జీవితాన్ని హ్యాపీగా, సాఫీగా ఎలా ఉంచుకోవాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం ఎన్ని లీలలైనా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన మలుపులే ఈ ‘రామ్‌లీల’ సినిమా అంటున్నారు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. హవీష్, అభిజిత్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో కోనేరు సత్యనారాయణ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. హవీష్‌ను స్టార్‌గా నిలబెట్టే సినిమా అవుతుంది. అభిజిత్, నందిత పాత్రలు ఈ చిత్రానికి వెన్నుముకగా నిలుస్తాయి. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే విస్సు రాసిన సంభాషణలు పటాసుల్లా పేలతాయి. మా నిర్మాత చాలా పెద్ద సినిమా స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చెప్పారు. -
హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం
- దాసరి కిరణ్‌కుమార్ ‘‘ఈ చిత్రనిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నాకు చిరంజీవిగారి అభిమానిగా పరిచయం. ఎంతో కష్టపడి ఆయన నిర్మాతగా మారారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చిన్నా పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి కోనేరు సత్యనారాయణకు ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని దర్శకుడు బాబీ ఆవిష్కరించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఓ చక్కని కథతో శ్రీపురం కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాసరి కిరణ్ రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితానివ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. కిరణ్‌కుమార్ మంచి చిత్రాలు తీయాలనే తపన ఉన్న నిర్మాత అని బి. గోపాల్ చెప్పారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘మా విశ్వ విద్యాలయాన్ని హవీష్ బాగా చూసుకునేవాడు. సినిమాలంటే తనకు ఆసక్తి కావడంతో ప్రోత్సహించాం. వాస్తవానికి ‘జీనియస్’కన్నా ముందు చేయాల్సిన చిత్రం ఇది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రం ‘జీనియస్’ని మించిన విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుంది. హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. చక్కని అవగాహనతో దర్శకుడు ఈ సినిమా తీశారు’’ అని చెప్పారు. ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని హవీష్ అన్నారు. ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకోవాలని ఎస్. గోపాల్‌రెడ్డి, చిన్నా అభిలషించారు. ఈ వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు, విస్సు, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్చిలాంటి కుర్రాడు మూవీ స్టిల్స్
-
ఘాటైన కుర్రాడి కథ!
‘‘నేటి కుర్రాళ్లు మిర్చిలా ఘాటుగా ఉంటున్నారు. అలాంటి ఓ కుర్రాడి కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం మా ‘మిర్చిలాంటి కుర్రాడు’. ప్రేమకథను ఇలానూ తీయొచ్చా అనిపించేలా ఈ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు జయనాగ్. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్, ప్రగ్య, జైశ్వాల్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. జయనాగ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సాగర్, టి. ప్రసన్నకుమార్ల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక ప్రేమకథ ఇది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పది రోజుల్లో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. టైటిల్ చూసి ఇదేదో మాస్ సినిమా అనుకోవద్దని, కథకు అవసరమైన మేరకే యాక్షన్ సన్నివేశాలుంటాయని అభిజిత్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు, కెమెరా: ఆర్.ఎం.స్వామి, సంగీతం: జేబీ, కూర్పు: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజు. -
కనులు లేవని.. కలత పడలేదు
వీరవాసరం, న్యూస్‌లైన్ : కనులు లేవని కలత చెందలేదు.. క్రమశిక్షణ , పట్టుదల, శ్రమించే తత్వం ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ విద్యార్థి. స్నేహితుల సహకారానికి తన మేథస్సును జోడించి డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచాడు బీఎస్ రంగా అభిజిత్. వీరవాసరం ఎస్ఎంబీటీ ఏవీఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనలియర్ పూర్తిచేసిన అభిజిత్‌ను బుధవారం ‘న్యూస్‌లైన్’ పలకరించింది. అభిజిత్ మాట్లాడుతూ ‘మాది పాలకొల్లు. నాన్న సత్యజిత్ కుమార్ ఐన్జీ వైశ్యా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ కృష్ణ సుజాత గృహిణి, అన్నయ్య నాగ సత్యమంజిత్ బెంగుళూరులో సీఎ చ దువుతున్నాడు. టెన్త్ వరకు పాలకొల్లు బీఆర్ఎం స్కూల్లో, ఇంటర్ పాలకొల్లు ఛాంబర్స్ కాలేజీలో పూర్తి చేశాను. టెన్త్ చదువుతుండగా గ్లూకోమా వ్యాధి సోకడంతో కంటి చూపు కోల్పోయాను. కేరళలో రెండేళ్లు వైద్యం చేయించినా ఫలితం లేదు. చదువుపై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితుల సహకారంతో ఇక్కడిగా రాగలిగాను. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ స్నేహితుల సహకారంతో బీఏ పరీక్షలు రాశాను. 1000 మార్కులకు 842 వచ్చాయి. కాలేజ్ టాపర్‌గా నిలిచారు. ఇందుకు స్నేహితులు, ఉపాధ్యాయలు సహకారం మరవలేనిది. సివిల్స్ విజేతగా నిలవాలన్నదే నా కోరిక’ అన్నారు. అభిజిత్‌ను కళాశాల సెక్రటరీ వర్థినీడి సత్యనారాయణ (బాబ్జీ), కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీ రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
అప్పుడు క్లాస్.. ఇప్పుడు మాస్
ఈ కుర్రాణ్ణి గుర్తుపట్టారా? శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యంగ్ హీరో ఇతను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి పేరు అభిజిత్. ఆ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించిన అభిజిత్, తన రెండో చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’ కోసం మాస్‌గా తయారయ్యాడు. ఇందులో తను సిక్స్‌ప్యాక్ దేహంతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అలరించనున్నాడు. ఈ విశేషాలను అభిజిత్ వివరిస్తూ - ‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాను. లక్కీగా అలాంటి పాత్రే నాకు లభించింది. సిక్స్ ప్యాక్ సన్నివేశాలు తీస్తున్నపుడు వారం ముందు నుంచే కొంత ప్రిపరేషన్ ఉండాలి. వాటర్ కంటెంట్ బాగా తగ్గించేయాలి. అలాగే ఉప్పు అస్సలు వాడకూడదు’’ అన్నారు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణే ఈ సినిమా. అన్ని రకాల వాణిజ్య విలువలూ ఉన్న పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇంకా పాటల చిత్రీకరణ చేయాలి. ఈ జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నాకొచ్చి ఏడాదిన్నర విరామాన్ని ఈ సినిమా మరిచిపోయేలా చేస్తుంది’’ అని అభిజిత్ చెప్పారు. -
మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ
దమ్మున్న కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ ఇందులో కథానాయికుడు. ప్రాజీ జైస్వాల్ కథానాయిక. నాగేశ్వరరావు దర్శకుడు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపు ఈ సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. అభిజిత్ నటన, వీరబాబు మాటలు, జేబీ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు’’ అని తెలిపారు. ‘‘టైటిల్‌కి తగ్గట్టు వాణిజ్య అంశాల కలగలుపుగా ఈ చిత్రం ఉంటుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మే నెల ప్రథమార్ధంలో పాటలను, అదే నెల చివర్లో కానీ, జూన్ తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథను నమ్మి తాను ఈ చిత్రం చేస్తున్నానని అభిజిత్ అన్నారు. సప్తగిరి, షకలక శంకర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.