అఖిల్‌ నిజంగానే బకరా అయ్యాడా?! | Bigg Boss 4 Telugu: Akhil Ended Up with 2nd Place Without Any Prize Money - Sakshi
Sakshi News home page

అఖిల్‌ నిజంగానే బకరా అయ్యాడా?!

Dec 21 2020 2:41 PM | Updated on Dec 21 2020 3:35 PM

Why  Akhil misses the Bigboss 4  telugu tittle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అత్యంత ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్‌ఫినాలేలో అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్‌-4 టైటిల్‌ను అభిజీత్‌ ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్ సందర్భంగా  అభిజీత్‌ను మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా ప్రకటించారు. మొదటి నుండి నామినేషన్స్ లోకి వచ్చిన అభిజిత్ ప్రతీవారం సేఫ్ గేమ్‌ ఆడుతూ చివరికి టైటిల్ సాధించాడు.  కానీ టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని  తుదికంటూ పోరాడిన అఖిల్ సార్థక్  మాత్రం రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అంతేకాదు రన్నరప్‌ అఖిల్‌కు నగదు బహుమతి ఏమీ ఇవ్వకపోవచ్చని కూడా సోషల్‌ మీడియా  కోడై కూస్తోంది.

టాప్ 2 వరకు వెళ్లిన అఖల్ చివరికి భంగపాటు తప్పలేదంటూ సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభిజిత్తో గొడవ, మోనాల్‌తో లవ్ ట్రాక్ తనను గెలిపిస్తాయని ఆశపడిన అఖిల్‌ ట్రోఫీ దక్కించు కోలేకపోయాడు.  అంతేకాదు గ్రాండ్ ఫినాలే వేదికగా టాప్‌-5 లో నిలిచిన  సోహైల్‌, మెహబూబ్‌లపై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన మెగాస్టార్‌ చిరంజీవి మాటలకు అందరూ ఫిదా అయ్యారు. వారిద్దరి గురించి చిరు ఎక్కువగా హైలెట్‌ చేయడం, అఖిల్ గురించి చాలా తక్కువ మాట్లాడడం కూడా అఖిల్‌కు దెబ్బేనని  పేర్కొంటున్నారు. వాళ్లనలా పొగుడుతూంటూ.. అఖిల్‌ మాత్రం బేలగా నిలబడిపోయాడని అలాగే దివి, హారికలతో చిరు రొమాంటిక్ సంభాషణ, మెహబూబ్‌కి  10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం లాంటివి అంశాలు అఖిల్‌కి బాధాకర విషయాలని ఫ్యాన్స్‌  అంటున్నారు. దీనిపై మీమ్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరోపక్క రేసు నుంచి తప్పుకుని, తనకు వచ్చిన 25 ల‌క్ష‌ల రూపాయల్లో అనాథాశ్ర‌మానికి  రూ. 10 ల‌క్ష‌లు ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని ఆ గోల్డ్ బాక్స్ తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు సొహేల్‌. ఇది  నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంది. దీనికి తోడు తనకొచ్చిన ప్రైజ్‌మనీలో 10 లక్షలు దానం చేస్తానని సోహైల్ ప్రకటించడం బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున మురిసిపోయి, ఆ పది లక్షలూ తానే ఇస్తాననడం మరింత హైలెట్‌గా నిలిచింది. అయితే  హౌస్‌లో తన ఆట పాటలతో అలరించిన అఖిల్‌ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణంద్వారా మొదట్లో బాగా చర్చల్లో నిలిచాడు. ఆ తరువాత  ఆమెను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతూ అఖిల్ చివరికి బకరాగా మిగిలిపోయాడు. మోనాల్‌ చుట్టూనే తిరుగుతూ హగ్స్ ఇస్తూ.. ముద్దులు పెట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్‌ను  బాగానే రక్తికట్టించినా, విన్నర్ మాత్రం అభిజిత్ అయ్యాడు. అయితే ఎలాంటి ఫేమ్ లేని అఖిల్ బిగ్ బాస్ టాప్ 2 వరకు రావడం విశేషమే. మరి అఖిల్ కెరీర్‌కు ఇదిఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిందే.

కాగా మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఆ తర్వాత మోనాల్ డబుల్ గేమ్ తెలిసి మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టాడు. అయితే మోనాల్ ది డబుల్ గేమ్  తెలిసినా  ఆమెతో కనెక్షన్, ఎమోషన్ పెంచుకోవడమే కాదు శృతి మించి ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం  నచ్చలేదు. దీంతో మోనాల్ విషయంలో అఖిల్ పెద్ద బకరాగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు.  ఇది ఇలాగే కొనసాగితే ఓ బకరాగా బయటికి రాకతప్పదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరికి వారి జోస్యం నిజం కావడంతో  అయ్యో అఖిల్‌ అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement