Bigg Boss 4 Telugu
-
బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?
తెలుగు బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సొహెల్ ఇంట్లో విషాదం. ఇతడి తల్లి చనిపోయింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఈమెని డయాలసిస్ కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)సొహెల్ సొంతూరు కరీంనగర్. తండ్రి సయ్యద్ సలీంతో పాటు తల్లి, తమ్ముడు ఉన్నారు. సొహెల్ కెరీర్ విషయానికొస్తే 'కొత్తబంగారు లోకం' సినిమాలో కనీకనిపించని పాత్ర చేశాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో సైడ్ క్యారెక్టర్లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలా హీరో కూడా అయిపోయాడు.లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో సొహెల్ హీరోగా చేశాడు. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేస్తున్నాడా లేదా అనేది తెలియాలి. ఇక సొహెల్ తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్‌కి తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్) -
పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అలా జరగడంతో బ్రేకప్: దివి
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ షో క్రేజ్ డిఫరెంట్. ఎందుకంటే పాజిటివో నెగిటివో గానీ ఈ షో ద్వారా చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. అలా నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఎందుకంటే ఈ ప్రేమకథలో అంత ట్రాజెడీ ఉంది మరి! (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 'బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్లో ఉన్నాం. పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఇంతలోనే అతడి తమ్ముడి.. అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను' 'ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో' అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: బాత్రూమ్లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి) -
చిల్లిగవ్వ లేదు, ఫ్యాన్‌కు ఉరేసుకుందామనుకున్నాడు: అవినాష్ సోదరుడు
ముక్కు అవినాశ్.. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాడు. తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో పాల్గొని మెరిశాడు. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. షోలు, ఈవెంట్ల ద్వారా బాగానే వెనకేసిన అవినాష్ ఒకానొక సమయంలో మాత్రం తినడానికి తిండి లేక అలమటించాడు. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు అవినాష్ సోదరుడు అజయ్. చికెన్ కూడా వద్దన్నాడు! అతడు మాట్లాడుతూ.. 'లాక్డౌన్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఇల్లు, కారు తీసుకున్నాం. ఈ రెండు ఈఎమ్ఐలతో పాటు బయట చిన్నపాటి అప్పులు కూడా ఉండేవి. ఈఎమ్ఐలు కట్టకపోవడంతో నోటీసులు వచ్చాయి. మరోవైపు షూటింగ్స్ ఆగిపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిణామాలతో అన్న మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు సరదాగా చికెన్ వండుకుందాం అని అడిగాను. మన పరిస్థితే బాలేదు, రోజూ పప్పు తింటున్నాం కదా.. ఇప్పుడు కూడా అదే తిందాం.. చికెన్ అవసరమా? అన్నాడు. అలాంటి రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి. వాళ్ల సాయంతోనే.. అన్న ఒక రూమ్‌లో, నేను ఇంకో రూమ్‌లో నిద్రించేవాళ్లం. అన్న ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉదయం 5 గంటల వరకు పడుకునేవాడే కాదు. ఈ అప్పులు, ఒత్తిళ్ల వల్ల ఒకానొక సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది! బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు తాను చనిపోదామనుకున్న విషయాన్ని నాతో చెప్పాడు. అప్పుడు అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి! అన్న జేబులో రూపాయి లేదు. ఆ సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో ఒప్పుకున్నాడు. జబర్దస్త్‌కు రూ.10 లక్షలు ఇచ్చి ఆ షో నుంచి బయటకు వచ్చాడు. శ్రీముఖి రూ.5 లక్షలు, గెటప్ శ్రీను రూ.1 లక్ష, చమ్మక్ చంద్ర రూ.2 లక్షలు.. ఇలా అందరి దగ్గరా అప్పు చేసి ఆ డబ్బు ఇచ్చేశాడు. దేవుడి దయ వల్ల బిగ్‌బాస్ తర్వాత తన కెరీర్ ఇంకా బాగుంది' అని చెప్పాడు అజయ్. బిగ్‌బాస్ హౌస్‌లో కష్టాలు చెప్పుకున్న అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోనూ లాక్డౌన్లో తాను పడ్డ కష్టాలను చెప్పాడు అవినాష్. లాక్డౌన్లో ఇంటి ఈఎమ్ఐ కట్టలేకపోయానన్నాడు. ఎందుకంటే అదే సమయంలో తండ్రికి గుండెపోటు రావడంతో మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన రూ. 4 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. అలాగే అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించినట్లు పేర్కొన్నాడు. అప్పుల వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఆనందంలో తేలియాడుతున్న శోభ -
సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా: సోహైల్
సోహైల్.. బిగ్‌బాస్ షోకు ముందు ఇతడెవరో కూడా జనాలకు తెలీదు. కానీ బిగ్‌బాస్ నాలుగో సీజన్ తర్వాత కథ వేరే ఉంది. ప్రేక్షకుల్లో ఇతడికి విశేష గుర్తింపు, స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతో, మాటతో, చేష్టలతో, అరియానాతో గొడవలతో.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఈ షో తర్వాత పలు సినిమాలకు సంతకం చేసి షూటింగ్స్‌తో బిజీబిజీగా మారాడు. తాజాగా సోహైల్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటిరోజులను గుర్తు చేసుకున్నాడు. 'ఒకానొక సమయంలో నా సినిమాలు వర్కవుట్ కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఏమీ సెట్టయితలేదు, నా లైఫ్ అయిపోయింది అని చచ్చిపోదామనుకున్నా' అని చెప్తూ ఎమోషనలయ్యాడు సోహైల్. కానీ బిగ్‌బాస్ షో అతడిలోని ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం సోహైల్ లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు సినిమాలు చేస్తున్నాడు. చదవండి: పుష్ప 2 నుంచి పవర్ఫుల్ డైలాగ్ లీక్ రేవంత్, ఇది నీ దగ్గరే నేర్చుకున్నా: నాగార్జున -
సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్‌బాస్ గంగవ్వ..
Bigg Boss Gangavva Initiative For Bus Service To Lambadipally: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్ హౌజ్ నుంచి నిష్కమించిన గంగవ్వ.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర చిత్రాల్లో నటించి అలరించింది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది. గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. చదవండి: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో 'మై విలేజ్ షో' టీం నటులు అనిల్, అంజి మామ తదితరులు ఉన్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పప్పులో కాలేసి బుక్కైన దేత్తడి హారిక, చూసుకోమ్మా ఇంగ్లీష్ పాప అంటూ ట్రోల్స్..
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 4 సీజన్లో పాల్గొనే చాన్స్ కొట్టేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో వరస వీడియోలు, రీల్స్‌తో పాటు హాట్‌హాట్ ఫొటోషూట్లు షేర్ చేస్తోంది. చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి ఈ క్రమంలో ఆమెకు అభిమానుల సంఖ్యతో పాటు ట్రోలర్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలపై ఓవరాక్స్ ఎక్కువైందంటూ విమర్శించడమే కాకుండా బుడ్డది, పొట్టిది అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రీసెంట్గా ఆ ట్రోల్స్ స్పందించిన హారిక ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రోలర్స్‌కు అవకాశం ఇస్తూ ఓ వీడియో షేర్ చేసింది. తన నటన ప్రతిభను చూపిస్తూ వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. దానికి ఎక్స్ప్రెషన్ క్వీన్ (Expresstion Queen) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది హారిక. Expression బదులుగా Expresstion అని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టింది. దీంతో అది చూసిన ట్రోలర్స్ హరీకను ఆడేసుకుంటున్నారు. ‘బిగ్‌బాస్ హౌజ్‌లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ పాపల బిల్డప్ ఇచ్చావు.. కాస్తా స్పెల్లింగ్ చూసుకోమ్మా’ అని ‘ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఎలాగూ రాదు.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకోమ్మా ఇంగ్లీష్ పాప’ అంటూ సటైరికల్‌గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనన ఇలా ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. చదవండి: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్, పవన్‌పై వరస సటైరికల్ ట్వీట్స్ ఇంత చిన్ని విషయానికే ఆమెకు నెటిజన్ల ఎందుకు టార్గేట్ చేశారంటే.. బిగ్‌బాస్ హౌజ్‌లో తరచూ ఇంగ్లీష్ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కు హారిక కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎక్కువగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పిన హారిక మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా.. తెలుగు తక్కువగా మాట్లాడేది. బెసిగ్గా ఆమె తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడానికి ఆమె ఇష్టపడటంతో ప్రేక్షకుల అసహనానికి గురైంది. అంతేకాదు హోస్ట్ నాగార్జున సైతం ప్రతివారం తెలుగులోనే మాట్లాడు హారిక అంటూ నొక్కి మరి చెప్పేవారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బిగ్‌బాస్ హెచ్చరించిన హారిక తన తీరును మాత్రం మార్చుకోలేదు. -
అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా: దేత్తడి హారిక వార్నింగ్!
వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో క్రేజ్ సంపాదించుకుంది దేత్తడి హారిక. తెలంగాణ యాసలో ఆమె పలికించే డైలాగులు, నటనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ యూట్యూబ్ స్టార్ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వెళ్లింది. ప్రైవేట్ అల్బమ్స్‌తో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే హారికకు ఈ మధ్య కామెంట్ల బెడద ఎక్కువైంది. ఆమె ఫొటోను చూసి హైట్ గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు కొందరు. పొట్టిది, బుడ్డది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఇష్టారీతిన కామెంట్లు పెట్టేవారికి గట్టి కౌంటరిచ్చింది హారిక. ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. అదీ.. అర్థమైంది కదా.. అని ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. -
అప్పుడే కొత్త సినిమా మొదలుపెట్టిన సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న తొలి చిత్రం పూజా కార్యక్రమం యాదాద్రిలో జరిగింది. సోహైల్, చిత్రనిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ‘‘ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సోహైల్ ఇటీవల 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఇందులోని పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
ఏడేళ్ల కష్టార్జితంతో కొన్న ముక్కు అవినాష్ ఇల్లు చూశారా?
Mukku Avinash Shares Home Tour Video: కామెడీ షోలో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించిన ముక్కు అవినాష్ బిగ్‌బాస్ షోతో వారికి మరింత దగ్గరయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న అతడు కంటెస్టెంట్లందరితో కలిసిపోతూనే వారిని సరదాగా ఓ ఆటాడిస్తూ ఫుల్ కామెడీ చేసి జనాలను తెగ నవ్వించాడు. బుల్లితెరపై కమెడియన్‌గానే కాకుండా సినిమాల్లో నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇటీవల అవినాష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఈ క్రమంలో భార్య అనుజతో కలిసి యూట్యూబ్ వీడియోలు, రీల్స్, ఫొటోషూట్స్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా అతడు తన ఇంటిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. సుమారు ఏడేళ్ల కష్టపడ్డ అనంతరం ఆ డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కున్నానని తెలిపాడు. తనది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అంటూ ఇల్లు మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. స్కూల్‌ఫ్రెండ్ జగదీశ్ తన ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేశాడన్న అవినాష్ తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను చూపిస్తూ వాటి వెనక స్టోరీని వెల్లడించాడు. బాల్కనీ, కిచెన్, డైనింగ్ టేబుల్, పూజా గది, బెడ్ రూమ్.. ఇలా అన్నింటినీ చూపించాడు. పుట్టబోయే పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరో రెండ్ బెడ్ రూమ్స్‌ను సైతం చూపించాడు. వారి అభిరుచికి తగ్గట్లుగా ఆయా గదుల్లో థీమ్ పోస్టర్లను అతికించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మీ జంట చూడముచ్చటగా ఎలా ఉందో మీ హౌస్ కూడా అంతే బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
టిక్‌టాక్ స్టార్‌కి ప్రపోజ్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. -
స్పీడు మీదున్న సోహైల్, వకీల్ సాబ్ బ్యూటీతో రెండో సినిమా
Bigg Boss Contestant Syed Sohel Ryan Second Movie Details: బిగ్‌బాస్ షోతో దశ తిరిగిపోయిన అతికొద్దిమందిలో సోహైల్ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న సోహైల్ తన ప్రవర్తన, ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపటేశాడు. టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడి రెండో సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'బూట్ కట్ బాలరాజు' అని టైటిల్ ఫిక్స్ చేశారు. కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వకీల్‌సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోంది. బెక్కం వేణుగోపాల్ నిర్మాగా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌నివ్వగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ రావిపూడి మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ``లాక్డౌన్ టైమ్‌లో రిలీజైన పాగల్ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్, ఓటీటీ, శాటిలైట్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతోనే మా బ్యానర్లో అల్లూరి సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే గత ఆరేడు నెలలుగా సోహైల్‌తో ఒక పాయింట్ అనుకుని దాన్ని ఒక కథగా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జరిపాం. ఇలాంటి కథ సోహైల్‌కి కరెక్ట్. హుషారు తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా బూట్‌కట్ బాలరాజు. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం అన్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) సోహెల్ మాట్లాడుతూ.. ``బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది`` అన్నారు. దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ - ``ఈ కథ ఇంతబాగా రావడానికి నా చిన్ననాటి మిత్రుడు గోపి కారణం. మేం ఇద్దరం కలిసి చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. కాస్త ఆలస్యమైంది. బూట్‌కట్ బలరాజు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా`` అన్నారు. ఈ సినిమాలో శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ తదితరులు నటించనున్నారు. -
సాయం చేసిన కాసేపటికే శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Shiva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌ను రక్షించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతగానో ప్రయత్నించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయనను బతికించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, సోనూసూద్ హాస్పిటల్ ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ధనుష్ రూ.10 లక్షలు, చిరంజీవి రూ.3 లక్షల సాయం అందించారు. వీళ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన ఆయన శాశ్వతంగా కన్నుమూశాడని తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇదిలా వుంటే బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ వేసిన పెయింటింగ్ వేలం పాటలో 20 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ డబ్బునంతా అఖిల్ సర్వింగ్ హ్యాండ్స్ అనే ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. శివశంకర్ మాస్టర్ చికిత్సకు ఈ డబ్బు ఎంతోకొంత ఉపయోగపడుతుందని సదరు ఛారిటీ వాళ్లు దాన్ని నేడు(నవంబర్ 28)సాయంత్రం శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్‌కు విరాళమిచ్చారు. కానీ కాసేపటికే ఆయన కన్నుమూయడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి!
Bigg Boss Fame Dethadi Harika Beautiful Home Tour: అలేఖ్య హారిక.. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిందీ తెలంగాణ పిల్ల. దేత్తడి ఛానల్లో ఆమె చేసే వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్‌తో హారికకు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అవకాశం రావడం.. వెంటకే ఓకే చెప్పేయడం, అక్కడ టాస్కుల్లో విజృంభిస్తూ శివంగిగా పోరాడటం ఆమెను మరింత పాపులర్ చేశాయి. ప్రస్తుతం షార్ట్ ఫిలింస్, సాంగ్స్, సరదా వీడియోలతో ఫుల్ బిజీగా ఉంది హారిక. ఇదిలా వుంటే తాజాగా దేత్తడి పాప ఇల్లు ఎలా ఉందో చూపిస్తూ ఆమె తల్లి హోమ్ టూర్ వీడియో చేసింది. మరి ఆమె ఇంటి విశేషాలేంటో చూసేద్దాం.. హారిక ఇంట్లో హాల్, కిచెన్, పూజ గది, మూడు పడక గదులు, రెండు బాల్కనీలు, చిన్నపాటి స్టోర్ రూమ్ ఉన్నాయి. ఏ గదికాగది శుభ్రంగా సర్దేసినట్లుగా ఉంది. హారికకు ఇల్లు సర్దేంత ఓపిక ఉండదు కాబట్టి అన్నీ తానే నీట్‌గా సర్దుతానని చెప్తోంది ఆమె తల్లి. దాదాపు ప్రతి గదిలోనూ హారిక ఫొటోలే కనిపించాయి. మరీ ముఖ్యంగా అభిమానులిచ్చిన ఫొటోలను ఎంతో భద్రంగా దాచుకుందీ దేత్తడి పాప. షూటింగ్స్‌తో బిజీగా ఉండే హారిక ఖాళీ సమయాల్లో పెయింటింగ్ కూడా వేస్తుందట! ఆమె బెడ్రూమ్లో తను గీసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. బిగ్‌బాస్ షోకు గుర్తుగా హౌస్‌లోని నీటి జార్‌ను, నామినేషన్స్‌లో వాడే ఫొటోను, తనకిచ్చిన ఫిదా టైటిల్‌ను ఇంటికి తెచ్చేసుకుని దాచుకుంది. 'షో మస్ట్ గో ఆన్..' పాట హారికకు ఇష్టమని, త్వరలోనే దాన్ని టాటూ వేయించుకోబోతుందన్న విషయాన్ని అభిమానులకు లీక్ చేసింది ఆమె తల్లి. నిజానికి తనకు ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడాలు ఇష్టం లేకపోయినా.. తన కూతురికి ఆ సాంగ్ అంటే తెగ ఇష్టం కావడంతో ఈసారికి తనెలాంటి అభ్యంతరం తెలపడం లేదంటోంది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక సైకిల్ కొనివ్వమని సోహైల్‌ను అడిగిందట హారిక! కానీ అతడు కొనిచ్చేలోపే తనే వెళ్లి ఓ సైకిల్‌ను ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. కొత్త మురిపెంతో రెండు మూడు రోజులు దాన్ని వాడిందని, కానీ బయట సైకిల్ తొక్కడం వల్ల ముఖం నల్లగా అయిపోతుందని దాన్ని మూలనపడేసిందని చెప్పుకొచ్చింది. అలాగే హారికకు ఇప్పటివరకు వచ్చిన అవార్డులన్నింటినీ వీడియోలో చూపించింది. మీరూ ఆమె ఇంటిని చూసేయండి.. -
కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో..
Bigg Boss Telugu 4 Fame Gangavva Shares Home Tour Moments: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఇటీవల కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయిన గంగవ్వ తన మాటలతో ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. అనంతరం బిగ్ బాస్ 4వ సీజన్లో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్ వీడియోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జునతో తన చిరకాల స్వప్నం గురించి పంచుకున్న ఆమె నాగార్జున, స్టార్ మా సాయంతో సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఇటవల గృహప్రవేశం కూడా చేసిన గంగవ్వ ఈ క్రమంలో తన కొత్త ఇంటి గురించి, అందులోని గదుల ప్రత్యేకత గురించి వివరిస్తూ యూట్యూబ్ చానల్లో విడియో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి ఈ సందర్భంగా గంగవ్వ తనకు ఇళ్లు కట్టిస్తానాని మాట ఇచ్చిన హీరో నాగార్జున్, బిగ్‌బాస్ టీం, స్టార్ మాకు ధన్యావాదాలు తెలిపింది. అలాగే గృహ ప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చినట్లు చెప్పింది. అనంతంర కొత్త బిజీ కారణంగా రాలేకపోయారు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని చూపిస్తూ మురిపోయింది. మరి తన ఇళ్లు ఎలా ఉంది, గంగవ్వ పంచుకున్న విశేషాలను మనం కూడా చూద్దాం రండి! చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం -
తండ్రి బర్త్‌డేకు మర్చిపోలేని కానుకిచ్చిన అఖిల్ సార్థక్!
అఖిల్ సార్థక్.. బిగ్‌బాస్ షోతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడీ యంగ్ యాక్టర్. మోనాల్‌తో లవ్ ట్రాక్, సోహైల్‌తో ఫ్రెండ్షిప్, ఒంటరిగా గేమ్స్ రఫ్ఫాడించగల సత్తా.. ఇవన్నీ అఖిల్‌ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ ఆ మధ్య కారు కొనాలన్న కలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు మరో కల నెరవేర్చుకున్నాడు. తండ్రికి కారు కొనిచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు అఖిల్. "హ్యాపీ బర్త్‌డే డాడ్, ఒక రక్షకుడిలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. మీరే నా సూపర్ హీరో, మీ వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ మీ కోసం ఓ కారు కొన్నాను. చిన్నప్పుడు మీరు నాకు సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు, నాకోసం మరెన్నో చేశావు. ఇందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ పప్పా.. మీరు చేసినవన్నీ నేను మీకు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా కృషి చేస్తాను. మీరు గర్వపడే పనులు చేస్తాను. మీకు కారు గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్ప్రైజ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా! మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అఖిల్. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం
Bigg Boss Contestant Gangavva House Warming: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. సొంతిల్లు కట్టుకోవాలన్న ఆమె కోరిక నెరవేరింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి యాస, కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న గంగవ్వ సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. చెప్పినట్లుగానే ఆమెకు రూ.7లక్షల రూపాయలు సహాయం చేశాడు. బిగ్‌బాస్ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3లక్షల వరకు అప్పుచేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది. ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీం యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. గంగవ్వ కల నెరవేరినందుకు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్‌బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్‌తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్‌బాస్‌లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్‌బాస్ లవర్స్, -
సొంతింటి కల సాకారం, మెహబూబ్ దిల్సే ఎమోషనల్
'గుంటూరు మిర్చి'లాంటి కుర్రాడు మెహబూబ్ దిల్సే. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు గతేడాది బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే మెహబూబ్ ఫ్రెండ్షిప్కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. బిగ్‌బాస్ ద్వారా కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మంచి మిత్రులను, ఎన్నో ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కంట్లో కూడా పడ్డాడు. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకి ప్రత్యేక అతిథిగా వచ్చిన చిరు.. మెహబూబ్ డ్యాన్సింగ్ కెపాసిటీకి, ఎనర్జీకి ఆశ్చర్యపోయాడు. సినిమాల్లోకి రావాలన్న మెహబూబ్ తపన, ఆరాటం చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుందని ముచ్చటపడిపోయాడు. అతడు అనాథాశ్రమానికి చేసిన సాయాన్ని చూసి అభినందించాడు. అంతేకాదు, మెహబూబ్ సొంతింటి కల సాకారం చేయడం కోసం రూ.10 లక్షల చెక్కును బహుమతిగా అందించాడు. మొత్తానికి ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సొంతింటి కల నెరవేరింది. ఆదివారం కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు మెహు. 'ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహబూబ్ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ఓ పక్క వెబ్‌సిరీస్‌లు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు మిర్చి వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) చిరంజీవి మెహబూబ్‌కు ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్ -
కొత్త కారు కొన్న అరియానా, ఆ ఇద్దరితో ఫస్ట్ రైడ్!
Bigg Boss Beauty Ariyana Purchase New Car: బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఓ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు గాల్లో తేలిపోతుందీ అరియానా. బిగ్‌బాస్ నాల్గో సీజన్ సెకండ్ రన్నరప్ సోహైల్, బుల్లితెర నటుడు అమర్దీప్ అప్పుడే ఫ్రెండ్ కారెక్కి షికారు కూడా మొదలెట్టేశారు. బిగ్‌బాస్‌లో సోహైల్, స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో అమర్దీప్ అరియానాకు క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో కొత్త కారు కొన్న సంతోషాన్ని ఆ ఇద్దరితో పంచుకుంటూ అప్పుడే షికారు మొదలెట్టేసిందీ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి ఇద్దరినీ అరియానా ఇంటర్వ్యూ చేయగా ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్
Mukku Avinash Engagement Video: బుల్లితెర షోలపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గత బిగ్‌బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఇలా గుట్టు చప్పుడుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైతేనే పెళ్లి పెళ్లి అంటూ తహతహలాడిన అవినాష్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషించారు. చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే! అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కానీ, ఫుల్ ఫొటోలు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్ తన ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. పూలు పండ్లు మార్చుకోవడం, ఆ తర్వాత అనుజతో అవినాష్ ఫొటో షూట్ చేయడం, కాబోయే శ్రీమతికి రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో అవినాష్ ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Mr Pregnant: గర్భం దాల్చిన బిగ్‌బాస్ స్టార్ సోహైల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాధించుకున్నడాఉ సోహైల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అని టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం సినిమా టైటిల్, హీరో ఫస్ట్గ్లిమ్స్ని నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. సాధారణంగా అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతుంటారు. ఇందులో మన హీరో సోహైల్ ప్రెగ్నెంట్ కావడమే షాకింగ్ విషయం. ఈ విషయాన్ని తెలియజేసేలా టీజర్, పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఆచార్య మూవీ టీం నుంచి కాల్ వచ్చింది.. కానీ!: మెహబూబ్
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షోతో కంటెస్టెంట్స్ అంతా ఒవర్‌నైట్ స్టార్ అయిపోతున్నారు. హౌజ్‌లో తమదైన తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతంగా చేసుకుని ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజ్‌తోనే వరుస ఆఫర్లు కొట్టెస్తున్నారు. గత సీజన్ 4 కంటెస్టెంట్ ఆరియాన గ్లోరీ రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈక్రమంలో సినిమా ఛాన్స్‌లు కొట్టెసింది. అలాగే దివి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. సోహైల్ కూడా హీరోగా బిజీ అయిపోయాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా వెబ్ సిరీస్‌లు, సొంతంగా యూట్యూబ్‌లు ఛానల్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా మెహబూబ్ దిల్సేకి ఆచార్యలో నటించే ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సింగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా మెహబూబ్ దీనిపై స్పందించాడు. తనకు ఆచార్య టీం నుంచి కాల్ వచ్చిందని, ఆఫీసుకు వెళ్లి కలిశాను అని చెప్పాడు. అక్కడ తన రోల్ ఎంటో వివరించారని, దానిపై కాసేపు చర్చ కూడా జరిగినట్లు తెలిపాడు. అయితే మళ్లీ తనకు ఫోన్ రాలేదని, ఒకవేళ కాల్ వస్తే కళ్లు మూసుకుని షూటింగ్లో పాల్గొంటానని పేర్కొన్నాడు. కాగా బిగ్‌బాస్ సీజన్-4 ఫైనల్ ఎపిసోడ్లో చిరు ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోహైల్, దివి, మెహబూబ్‌లకు చిరు బిగ్ ఆఫర్లు ఇచ్చాడు. సోహైల్ హీరోగా ఏ సినిమా చేసిన అందులో అతిథి పాత్రలో నటిస్తానని మాట ఇచ్చాడు. దివికి తన నెక్ట్ మూవీలో ఓ పాత్ర ఇస్తానని చెప్పాడు. -
ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్లాలనుంది : బిగ్‌బాస్ బ్యూటీ
సొట్ట బుగ్గలతో బిగ్‌బాస్ ప్రేమికులను ఆకర్షించిన కంటెస్టెంటు దివి వైద్య. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో బిగ్‌బాస్ సీజన్-4లోతనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ భామ. అంతకుముందు పలు సినిమాల్లో రాని గుర్తింపు బిగ్‌బాస్‌తో కైవసం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న దివి ప్రస్తుతం హీరోయిన్‌గానూ అవకాశాలు కొల్లగొడుతుంది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తనకు హీరో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్ అయిపోయానని, అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్ యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేస్తుండేదాన్ని అని పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని,మిర్చి లాంటి అబ్బాయితో కప్పు కాఫీ తాగినా చాలని ఫ్యాన్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంది. -
బిగ్‌బాస్ బ్యూటీకి మరో 'బిగ్' ఆఫర్
బిగ్‌బాస్ బ్యూటీ దివికి యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ భామ. బిగ్‌బాస్ సీజన్-4కు ముందు అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్‌బాస్ 4వ సీజన్లో హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇటీవలె క్యాబ్ స్టోరీస్‌తో హీరోయిన్గా అలరించిన ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చిందట. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్గా దివిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నారట. -
అలాంటి విమర్శలు పట్టించుకోను, వారికి నా సమాధానం ఇదే!
సొట్ట బుగ్గలతో బిగ్‌బాస్ ప్రేమికులను ఆకర్షించింది కంటెస్టెంట్ దివి వైద్య. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో హౌజ్‌లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ అమ్మడు. బిగ్‌బాస్‌కు ముందే వెండితెరపై మెరిసినా దివికి అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ బిగ్‌బాస్ ఎంట్రీ తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ షో అనంతరం ఆమెకు హీరోయిన్గా నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదే ఆమె కోరిక అని దివి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. హాట్ హాట్‌గా ఫొటో షూట్లకు ఫోజులు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ, ఇటీవల హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్(TV)-2020 టైటిల్ గెలుచుకుని దర్శక- నిర్మాతల దృష్టిని ఆకర్శించింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన దివి గ్లామర్ ప్రపంచంలో తనకు గుర్తింపు అంత సులభంగా రాలేదని తెలిపింది. మోస్ట్ డిసైరబుల్ టైటిల్‌ను గెలుచుకున్నట్లు తనకు ఫోన్ రాగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయానని, ఆ ఆనందం తట్టుకోలేకపోయానని పేర్కొంది. అయితే ‘నటపై ఉన్న ఆసక్తితో ఆడిషన్స్‌కు వెళ్లగా ప్రతిసారి రిజెక్ట్ అయ్యాను. అలా ఒక 100పైగా ఆడిషన్స్‌లో నన్ను తిరస్కరించారు. ఆడిషన్స్‌లో పరాభవం ఎదుర్కొన్న ప్రతిసారి నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను. అయితే మహర్షితో పాటు పలు చిత్రాల్లో నటించిన నేను ఎవరనేది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు దివి అంటే అందరికి తెలుసు. ‘ఈ క్రమంలో నాకు పెద్ద సినిమాలు, హీరోతో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇది నిజంగా సంతోషంగా ఉంది. నేను నెక్ట్స్ చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నెలల్లో షూటింగ్ మొదలు కానుంది. పెద్ద స్టార్ల చిత్రాలలో నటించాలని నాకు కోరిక, అంతేగాక మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ రోజు కోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఇటీవల దివి సిలక ముక్కు దానా అనే ప్రైవేటు సాంగ్‌లో మెరిసి మాస్ స్టేప్పులతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచి 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అయితే ఇందులో దివి సరిగా డ్యాన్స్ చేయలేదని, తనకు డ్యాన్స్ రాదంటూ విమర్శలు చేస్తూ కామెంట్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఈ విమర్శలపై ఆమె స్పందిస్తూ.. ‘ఈ పాట కోసం, డ్యాన్స్ కోసం నేను ఎంతగ కష్టపడ్డానో నాకే తెలుసు. ఇంత కష్టం నేనేప్పుడు పడలేదు. నాకు మోకాలి నొప్పులు వచ్చినా తట్టుకుని డ్యాన్స్ చేశాను. ఇక నా డ్యాన్స్‌పై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. అలాంటి వారిక ఈ పాట సాధించిన విజయం, వ్యూసే సమాధానం’ అంటూ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కాగా ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. హారిక నారాయణ్ పాడింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. -
కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ తర్వాత అరియానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఆమె చేసిన వార్తల్లో నిలుస్తోంది. ఇక ముక్కుసూటి తనంతో బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. యాంకర్‌గా కేరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అదే స్టార్డమ్తో బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టేంట్గా ఛాన్స్ కొట్టేసింది. హౌజ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో పాల్గోంటూ మిగతా కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చాక అరియానా కేరీర్‌పై దృష్టి పెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జాగ్రత్త పడుతోంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’ నానుడిని ఈ అమ్మడు చక్కగా వినియోగించుకుంటుంది. ఇటూ ఇంటర్వ్యూలు చేస్తూనే సెలబ్రేటీ హోదాను ఎంజాయ్ చేస్తున్న అరియాన తాజాగా కొత్త బిజినేస్లోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ‘ఆర్య ఈవెంట్ ప్లానింగ్’ పేరుతో కొత్త బిజినెస్‌ను ప్రారంభించినట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఆమె సన్నిహితులు, ఫాలోవర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్
మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా వచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తన ఫ్యాన్స్‌తో టచ్‌లోకి ఉండేందుకు సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ గుజరాతీ భామ.. తరచుగా హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు వదులుతూ హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. వరుస ఆఫర్లు రావడంతో తన మకాంని హైదరాబాద్‌కి మార్చాలని భావించిందట ఈ ముద్దుగుమ్మ. ఇందుగో ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్‌లో ప్రత్యేక్షమైంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘ఇప్పుడు నాకో ఇల్లు దొరికింది. సో.. నేను కూడా అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా’అంటూ పోస్ట్ చేసింది. చదవండి: హీరోయిన్ కాజల్ ఆస్తుల విలువ ఎంతంటే... -
అరియానా ఇంట్లో దొంగతనం! అరేయ్ చంపేస్తా.. అంటూ
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టామ్ అండ్ జెర్రీ ఎవరు అనగానే సోహైల్, అరియానా అని టపీమని చెప్తారు. ఎంత కొట్టుకున్నా చివరికి కలిసిపోయే వీళ్లను అభిమానులు సోషల్ మీడియాలో సోహియానా అని పిల్చుకుంటారు. బిగ్‌బాస్ షో తర్వాత కూడా వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అరియానా మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు సోహైల్. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు, అరియానాకు చిచ్చు పెట్టిన చింటు(అరియానా ఫేవరెట్ కోతి బొమ్మ)ను దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేశాడు. 'బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి' అని చెప్పుకొచ్చాడు. "మొట్టమొదటిసారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. నా అజాత శత్రువు.. బిగ్‌బాస్ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనీమీ. అతడే ఇతడు. వీడు దొరికేశాడు. ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్‌బాస్‌లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్ తీసుకునేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా.." అని చెప్పుకొచ్చాడు. తను ఎంతో ఇష్టపడే చింటును అమ్మేస్తాననడంపై అరియానా ఫైర్ అయింది. 'అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..' అంటూ వార్నింగ్ ఇచ్చింది. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: సారీ అరియానా.. ఆలస్యమైనందుకు క్షమించు: ఆర్జీవీ -
అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది: సోహేల్
సోహేల్... బిగ్‌బాస్ షోతో ఎనలేని క్రేజ్ సంపాదిచుకున్నాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది.హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. వంద రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహేల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయింది. సీజన్ విన్నర్ కన్నా అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక సీజన్ ఫినాలే రోజు తనకు వచ్చిన డబ్బుల్లో కొంత పేదల కోసం ఖర్చుపెడతానని ప్రకటించిన సోహేల్‌కు నాగార్జున నుంచి 10 లక్షల ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు 'సోహీ హెల్పింగ్ హ్యాండ్స్' అనే ఛారిటీ ద్వారా ఇప్పటివరకు తాను చేసిన సేవా కార్యక్రమాలు, దానికి అయిన మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించాడు. 'నాలుగు ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. చాలామందికి నిత్యావసరాలు అందించాం. సోహీ హెల్పింగ్ హ్యాండ్స్, సోహెలియన్స్ మద్దతుతో ఇదంతా చేశాం. అలా ఇప్పటివరకు 14 లక్షల 70వేల 250 రూపాయలు జమ అయ్యాయి. వీటితో పాటు నాగార్జున సర్ ఇచ్చిన పది లక్షలు కలిపి ఎంతో మంది అనాథలకు, నిరుపేదలకు సహాయం చేశాం. అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది. ఇంక ఇలానే ఇది కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్లో కొంత వీటికి ఖర్చుపెడతానని తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే 100మంది జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని వివరించాడు. ఎవరికి తోచినంత వారు పక్కన వాళ్లకి సహాయం చేస్తే ఆ కిక్కే వేరు అంటూ తన స్టైల్లో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ వింజనంపతి డైరెక్షన్లో సోహేల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి : ఆట సందీప్‌కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే! -
Divi Vadthya: టాప్ యాంకర్లను వెనక్కు నెట్టిన దివి!
'దివి నుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ...' ఈ పాట వినగానే బుల్లితెర అభిమానులకు, అందులోనూ బిగ్‌బాస్ ప్రేమికులకు టపీమని గుర్తొచ్చే పేరు దివి వైద్య. అందచందాలతోనే కాదు, సూటిగా సుత్తి లేకుండా ఏదైనా ముఖం మీదే మాట్లాడే దివి తన యాటిట్యూడ్‌తో ఎంతోమందిని బుట్టలో వేసుకుంది. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న ఆమె హౌస్‌లో తన ప్రయాణం ఎక్కువ రోజులు సాగకపోయినప్పటికీ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. అలా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పట్టేసింది. తాజాగా దివి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా దివి నిలిచింది. హైదరాబాద్ టైమ్స్ దివిని బుల్లితెర మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా ప్రకటించింది. శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ వంటి టాప్ యాంకర్లను సైతం వెనక్కు నెట్టి మరీ దివి ఫస్ట్ ప్లేస్‌లో నిలవడమంటే మామూలు విషయం కాదు. దీని గురించి దివి మాట్లాడుతూ.. "ఇది కలా? నిజమా? ఇప్పటికీ అస్సలు నమ్మశక్యంగా లేదు. జనాలు నా అందం కన్నా నా గుణాన్ని ప్రేమించారు. అందరూ నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుంటే సంతోషంగా ఉంటుంది. అయినా కాలంతో పాటు అందం మారిపోతుందేమో కానీ తెలివితేటలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దివి పాప ఇలాంటి రికార్డును సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. హైదరాబాద్ టైమ్స్.. మోస్ట్ డిజైరబుల్ వుమెన్ ఆన్ టీవీ-2020 జాబితా ఇదే.. 1. దివి వైద్య 2. విష్ణుప్రియ 3. శ్రీముఖి 4. రష్మీ గౌతమ్ 5. వర్షిణి సౌందరరాజన్ 6.వర్ష 7.వింధ్యా విశాఖ 8. అశ్విని 9. దీప్తి 10. సమీరా షెరీఫ్ 11. అషూ రెడ్డి 12. లహరి శరి 13.అనసూయ భరద్వాజ్ 14. అలేఖ్య హారిక 15. నవ్య స్వామి చదవండి: ‘బిగ్‌బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’ -
లవ్ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా
రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో బాగా క్లిక్ అయింది అరియానా గ్లోరీ. అయితే ఆమె పేరును అంతా మరిచిపోయారు అనుకునేలోపు తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. తనకు తప్పు అనిపిస్తే ఏకంగా బిగ్‌బాస్‌నే ఎదురించగలిగే సత్తా ఆమెది. అందుకే అరియానాను అందరూ బోల్డ్ పాప అని పిలుచుకుంటే ఆమె అభిమానులు మాత్రం గోల్డ్ పాప అని పలకరిస్తుంటారు. తాజాగా అరియానా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన వాట్సాప్ డీపీని, వాల్‌పేపర్‌ను షేర్ చేసింది. వాట్సాప్ డీపీలో ట్రెడిషనల్‌గా ఉన్న ఈ బ్యూటీ వాల్‌పేపర్ మీద మాత్రం ట్రెండీగా రెడీ అయింది. ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు.. అసలు ఎలాంటి వీడియోలు చేయాలో అర్థం కావడం లేదని బదులిచ్చింది. నటన, హోస్టింగ్.. ఈ రెండింట్లో యాంకరింగ్ ఎక్కువ ఇష్టమని, ఆ తర్వాతే యాక్టింగ్ అని తేల్చి చెప్పింది. తన ఫేవరెట్ పర్సన్ తానే అంటూ ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పింది. బిగ్‌బాస్ భామ అరియానా గ్లోరీ అదిరే స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ గారిని కలుద్దామనుకున్నానని, కానీ సరైన సమయం దొరకడం లేదని తెలిపింది. అలాగే అవెంజర్ బైక్ నడపాలన్న తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? అన్న ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా లవ్ మ్యారేజే చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది. అరేంజ్డ్ మ్యారేజ్ చాలా కష్టమని అభిప్రాయపడింది. కానీ లవ్ మ్యారేజ్ అంటే కూడా కాస్త భయమేనని చెప్పింది. 'నా తిక్కకు, పిచ్చికి, కోపానికి ప్రేమించినవాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకోవాల్సిందే, లేదంటే చంపి పారేస్తా'నని చెప్పింది. ఇక క్రష్ గురించి బయటకు చెప్పనన్న అరియానా కొంతమంది అబ్బాయిలను చూసినప్పుడు 'అరె, భలే ఉన్నాడే ఈ అబ్బాయి' అని మనసులో అనుకుంటానని పేర్కొంది. అభిమానులు కోరిక మేరకు వారికి తన వాట్సాప్ నెంబర్ ఇవ్వాలనుందని, కానీ అందుకు ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని కొంటెగా బదులిచ్చింది. చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. -
కరోనా: గొప్ప మనసు చాటుకున్న బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు మరోసారి నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలంలో పేద కటుంబాలను ఆదుకునేందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ తన ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేటకు చెందిన ముడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసి వారి అవసరాన్ని తీర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు అభిజిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘మూడు కుటుంబాలు నిత్యవసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న సాయంత్రం సిద్దిపేట నుంచి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను నాకు తెలిసిన యువకులను దీని గురించి తెలుసుకోమ్మని చెప్పాను. తెల్లారి లేచే సరికి ఈ ఫొటోలు, వీడియొలు నాకు పంపించారు. ఇందుకు సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
‘బిగ్‌బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’
తెలుగు ‘బిగ్‌బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ‘గాలి సంపత్’ చిత్రనిర్మాత ఎస్. కృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న ‘స్పార్క్’ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సాయి కార్తీక్ చక్కని సంగీతం అందించారు. గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన మా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి’’ అన్నారు. -
ఆర్జీవీ OTTలో బిగ్‌బాస్ బ్యూటీ దివి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బిగ్‌బాస్ సీజన్-4తో తర్వాత యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న నటి దివి. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్‌బాస్ 4వ సీజన్లో హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది ఈ భామ. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ కృష్ణ నిర్మించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీని థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు వర్మతో కలిసి స్పార్క్ అనే ఓటీటీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఇందులో వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. తాజాగా దివి లేటెస్ట్ మూవీ క్యాబ్ స్టోరీస్ స్పార్క్‌లో ఈనెల 28నుంచి స్ర్టీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
మోనాల్‌పై అఖిల్‌కి ఎంత ప్రేమో.. ఈ పోస్ట్ చూస్తే తెలిసిపోతుంది
‘మోనాల్-అఖిల్ మధ్య ఏదో ఉంది.. అది కచ్చితంగా ప్రేమే. లేకపోతే అంత క్లోజ్‌గా ఎలా ఉంటారు? అఖిల్ కోసం మోనాలు ఎన్ని త్యాగాలు చేసింది. అఖిల్ కూడా మోనాల్‌ని ఎవరైనా ఏమైనా అంటే అస్సల్ సహించడు. దీన్ని ప్రేమ కాకపోతే ఇంకేం అంటారు? బయటకు వచ్చాక కచ్చితంగా వాళ్లు పెళ్లి చేసుకుంటారు’... బిగ్‌బాస్ నాల్గో సీజన్ మొదలయ్యాక రెండో వారం నుంచి బుల్లితెర ప్రేక్షకుల మదిలో మెదిలిన అనుమానాలు ఇవి. ఈ అనుమానాలు నిజం చేస్తూ బయట కూడా ఈ జంట ఎప్పుడూ కలుస్తూ నెట్టింట హల్ చేస్తుంది. పైకి మంచి స్నేహితులు అని చెబుతున్నా.. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వీరి ప్రేమ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్‌లతో వీరిమధ్య ప్రేమ ఉందనే సందేహాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా అఖిల్ మరో అడుగు ముందుకేసి తన రాణి మోనాలే అని చెప్పేశాడు. దీంతో వారి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని తెలిసిపోయింది. మోనాల్ పుట్టిన రోజు(మే 13)సందర్భంగా గురువారం అఖిల్ ఆమెకు బర్త్‌డే విషెష్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా.. రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు. ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని, అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ అన్నాడు. మోనాల్ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
కొత్త ఇంటికి మారిన బిగ్‌బాస్ భామ అరియాన
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్ సంపాదించి పెడితే బిగ్‌బాస్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకుంది. సీజన్-4 హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు సైతం అరియాన యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్ మీడియాలో ఆమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ భామ పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ (బుధవారం) తను కొత్త ఇంటికి మారంటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియాన మంకీ బొమ్మను చూపిస్తూ చింటు, చింటు అంటూ సందడి చేసింది. ఇక ఎక్కడపడితే అక్కడ సమాన్లతో నిండిపోయి గజిబిజిగా ఉన్న వారి కొత్త ఇంటిని చూపిస్తూ.. ‘హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మేం కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇది మా పరిస్థితి’ అంటూ స్టోరీ షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు ‘మీ ఇల్లు చాలా బాగుంది. ఇంతకి కొన్నారా లేదా రెంటుకు దిగారా’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇంటిని కొన్నారా లేదా అనేది మాత్రం ఈ బిగ్‌బాస్ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు. -
ఏదైతే భయపడ్డానో అదే జరిగింది: అభిజిత్
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ తల్లి కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. "ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా" "ఇకపోతే ఈ కోవిడ్ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్ నేర్చుకుంటున్నాను" అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
అరియానా అసలు పేరు తెలుసా? నాగార్జునకు కూడా చెప్పలేదు!
అరియానా గ్లోరీ.. బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఐ యామ్ బోల్డ్ అంటూ బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగు పెట్టిన ఈ భామ ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ కంటే ముందు యూట్యూబ్ యాంకర్‌గా ఉన్న అరియాన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. ఇంటర్వ్యూలో సమయంలో తనను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్‌తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఎంట్రీ కొట్టెసిన అరియాన గ్లోరీ అసలు పేరు చాలా తక్కువ మంది తెలుసు. బిగ్ బాస్ తొలి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున సైతం తన అసలు పేరు అడిగినప్పటికీ ఈ అమ్మడు రీవీల్ చేయలేదు. తనకు అరియానా పేరు అంటేనే ఇష్టమని, అసలు తన పాత పేరు గుర్తు కూడా లేదండూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని తాండూరు నుంచి వచ్చిన ఈ అరియానా గ్లోరీ అసలు పేరు మంగలి అర్చన. అయితే ఈ పేరు చాలా మందికి తెలియదు.. కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబీకులు మాత్రమే తెలుసు. వారు మాత్రమే తనని అప్పడప్పుడు అర్చన అని పిలుస్తారని, బయట వారంత అరియానా అనే పిలుస్తారట. ఎందుకంటే అర్చన పేరు తనకు కలిసి రాకపోవడం అరియానా గ్లోరీగా పేరు మార్చుకుందట. ఇదిలా ఉంటే అరియానా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వరుడు ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. -
బిగ్‌బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్తా ఓవర్ చేస్తోందంటూ..
నటి దివి బిగ్‌బాస్ తర్వాత ఒక్కసారిగా ఫేంను సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినప్పటికి ఈ భామ ఎవరికి అంతగా సుపరిచితురాలు కాదు. కానీ బిగ్‌బాస్ 4వ సీజన్లో హౌజ్ అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులో అయినా అంత్యంత ప్రేక్షకదారణ పొందింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కాగా బిగ్‌బాస్ తర్వాత దివి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేగాక ఫోటో షూట్లు చేస్తూ, పలు ప్రకటనలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దివి బంజారాహిల్స్‌లోని ప్రోటిన్ మార్ట్ అనే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఈ బ్రాండ్ ప్రకటనలో నటించింది. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను దివి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ‘దివి పాప కాస్తా ఓవర్ చేస్తోంది’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ యాడ్‌లో దివి తన వంట మనిషి చేసిన చేప కూర తింటూ ఆమెతో కాస్తా దురుసుగా ప్రవర్తిస్తుంది. దీంతో వంట మనిషి అవి ప్రోటిన్స్ నాన్ వెజ్ మార్ట్ నుంచి తీసుకొచ్చిన చేపలు పాపగారు అని చెప్పడంతో.. తనకు ప్రోటిన్స్ మీద నమ్మకం ఉందంటూ కాస్తా ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటరర్వ్యూలో దివి మాట్లాడుతూ.. అధికంగా ప్రోటీన్లను అందించే సీఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షితో పాటు పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) చదవండి: సీ ఫుడ్.. మై డైట్ అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి -
అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే?
అలీ రెజా.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఇతడు తన యాటిట్యూడ్‌తో, ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ మూడో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన అలీ ఈ షో తర్వాత ఏకంగా నాగార్జునతో కలిసి నటించే అవకాశాన్ని సైతం దక్కించుకున్నాడు. అలా యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ సినిమాలోనూ నటించి అభిమానులను మెప్పించాడు. తాజాగా అలీ రెజా ఓ కొత్త కారు కొన్నాడు, మహీంద్రా జిప్సీ ముందు ఫొటోకు పోజివ్వగా దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో బుల్లితెర స్టార్స్‌తో పాటు ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రవి డిఫరెంట్‌గా కంగ్రాట్స్ చెప్పాడు,. వాట్ ద .. అంటూ ఎమోజీలు పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఎమోజీలతో బాగానే కవర్ చేస్తున్నావే అంటూ సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) చదవండి: నాగార్జున ఫ్యాన్స్‌ను ఏప్రిల్ ఫూల్ చేసిన 'వైల్డ్ డాగ్' యూనిట్ -
సోహైల్‌కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఎంతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహైల్ ఒకడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది. హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో సోహైల్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు రాగానే అతడి కోసం వందల సంఖ్యలో ఫ్యాన్స్ బారులు తీరిన దృశ్యమే ఇందుకు ఉదహరణ. తాజాగా ఓ అభిమాని సోహైల్ బర్త్‌డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఏప్రీల్ 18న సోహైల్ పుట్టిన రోజు సందర్భంగా లక్కీ అనే అభిమాని సోహైల్‌కు ఖరిదైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేగాక సదరు అభిమానికి ఈ సందర్భంగా సోహైల్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన కోరికను బయట పెట్టాడో లేదో అలా సోహైల్‌కు దర్శక నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
‘బిగ్‌బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్ రియాల్టీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షోలో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోలేరు. దానికి కారణం ‘బిగ్‌బాస్’ నుంచి బయటకు వస్తే.. డబ్బుతో పాటు సీనీ అవకాశాలు రావడమే. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలోకి వెళ్తుంటారు. కొంత మంది సెలెబ్రిటీలు మాత్రం అవకాశం వచ్చినా వెళ్లడానికి మొగ్గు చూపపడం లేదు. ఆ లిస్టులో హీరోయిన్ ఇంద్రజ కూడా ఉన్నారు. బిగ్‌బాస్ నాల్గొ సీజన్లో ఇంద్రజకు అవకాశం వస్తే వెళ్లలేదట.ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఇంద్రజ.. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షోపై తన మనసులోని మాటను బయటకు పెట్టింది. ‘బిగ్‌బాస్’ నాల్గో సీజన్లో ఆఫర్ వచ్చింది. కానీ నేను రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలి.. నేను ఇక్కడ ఉండలేను. అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లలేదు. భవిష్యత్తులోనే అవకాశం వచ్చినా వెళ్లలేదు. అయితే గెస్ట్‌గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునని చూడడానికే వెళ్తా. ఆయనతో కాసేపు హ్యాపీగా మాట్లాడి బయటకు వస్తా. నాగ్ హోస్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ స్టైలీష్‌గా, అందంగా ఉన్నారు’ అంటూ కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు ఇంద్రజ. అలాగే నాగార్జునతో కలిసి హలో బ్రదర్ సినిమాలో ‘కన్నెపిట్టరో’ పాటకు నటించాని, ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని’ ఆ మధుర జ్ఞాపకాలను ఇంద్రజ గుర్తుచేసుకుంది. చదవండి: అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్‌స్టోరీ చెప్పిన ఇంద్రజ నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్ -
అఖిల్ కొత్త బైకు: సోహైల్, మోనాల్‌కు నో ఛాన్స్!
అఖిల్ సార్థక్.. బిగ్‌బాస్‌కు ముందు వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న అఖిల్ తన యాటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన ఇతడు పాతికేళ్లకే కారు కొన్నాలన్న కోరికను సైతం గత నెలలో సాకారం చేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ యాక్టర్ లేటెస్ట్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఫొటోలతో పాటు బైక్ నడుపుతున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. "నా కలను నిజం చేసిన ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రానున్న రాజుల్లో మీ అందరూ గర్వపడేలా చేస్తాను" అని రాసుకొచ్చాడు. ఇక ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో ఆశ్చర్యపోయిన సోహైల్ తానెక్కడ కూర్చోవాలని ప్రశ్నించాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. నీకోసం నా గుండెలో స్పెషల్ సీటు ఉందని రిప్లై ఇచ్చాడు. అతడి ఫ్యాన్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ మోనాల్ ఉందిగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక గంగవ్వేమో జర నెమ్మదిగా నడుపు అని తన మనవడు అఖిల్‌కు సూచించింది. పలువురు సెలబ్రిటీలతో పాటు అతడి అభిమానులు సైతం అఖిల్ కొత్త బైకు కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో అఖిల్.. సోహైల్, మోనాల్‌నే కాదు, ఎవరినీ ఎక్కించుకుని రైడ్‌కు తీసుకెళ్లలేడు. కాగా గతంలో పలు సీరియళ్లలో నటించిన అఖిల్ ప్రస్తుతం మోనాల్ గజ్జర్‌తో "తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ భయంతో అవ్వా అంటూ ఏడ్చినంత పని చేసిన గంగవ్వ! -
కరోనా వ్యాక్సిన్: గంగవ్వకు స్వల్ప అస్వస్థత
సాక్షి, కరీంనగర్: బిగ్‌బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్లందరినీ తన మాటల గారడీతో హుషారెత్తించింది గంగవ్వ. వయసులో పెద్దదైనా అందరినీ కలుపుకుంటూ, ఆఖరికి వ్యాఖ్యాత నాగార్జునను కూడా అన్న అని పిలుస్తూ ఆప్యాయతగా కబుర్లు చెప్పేది. కానీ పచ్చటి పైర్ల మధ్య జీవిస్తూ మట్టివాసన పీల్చే ఆమెకు అక్కడి ఏసీ వాతావరణం పడక అనారోగ్యం బారిన పడింది. దీంతో హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేసింది. ఇక బిగ్‌బాస్ తర్వాత మరెంతమందో అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వ్యాక్సిన్ తొలి డోసు వేసుకుంది. అయితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో చిన్నపిల్లలా భయడుతూ అవ్వా.. అంటూ కేకలు పెడుతూ ఏడిచినంత పని చేసింది. ఇక వ్యాక్సిన్ తర్వాత ఆమెకు జ్వరం వచ్చిందని, అంతే కాక ఒళ్లు నొప్పులతోనూ సతమతమవుతోందని గంగవ్వ బాధ్యతలు చూసుకునే శ్రీకాంత్ మీడియాకు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ తర్వాత ఈ లక్షణాలు సాధారణమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పాడు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోందన్నాడు. ప్రస్తుతం ఆమె తన పనిని పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటోందని తెలిపాడు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ గంగవ్వకు పట్టగొలుసులు ఇచ్చిన అఖిల్ -
ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్
బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్‌కు అందజేశారు. అనంతరం ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అవినాష్ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తూ ప్రేక్షకులకు నాన్‌స్టాప్ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్‌ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేసిన అతడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: 'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్‌చరణ్‌కు స్పెషల్ సర్ప్రైజ్ -
మోనాల్‌తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్
బిగ్‌బాస్ 4 సీజన్ కపుల్‌గా మోనాల్, అఖిల్‌కు సోషల్ మీడియాలో వీపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ట్రయాంగిల్ లవ్‌స్టోరిగా గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలతో ఈ షో అంతా మోనాల్, అఖిల్, అభిజిత్‌ల చూట్టే తిరిగింది. ఇక మోనాల్-అఖిల్‌ల మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే చాలా మంది ఈ షోని వీక్షించారనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మోనాల్‌ను బిగ్‌బాస్ చివరి వరకు పట్టుకొచ్చాడు. దీంతో మోనాల్‌ను నెటిజన్లు బిగ్‌బాస్ దత్త పుత్రికను చేసేశారు. అయినప్పటికి ఎప్పుడు వీరిద్దరి మంచి స్నేహితులమే అని చెబుతుంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఏముందో ఇప్పటికి ఎవరికి అంతు చిక్కడం లేదు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ కపుల్ తరచూ పార్టీలకు అటెండ్ అవ్వడం, పలు టీవీ షోలో జంటగా పాల్గొంటూ అదే బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమో అర్థంకాక ప్రేక్షకులు, అభిమానులు జుట్టు పిక్కుంటున్నారు. అయితే వీరిద్దరూ తరచూ వీడియో కాల్స్, చాట్స్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్, మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. బిగ్హౌజ్లో, బయటయ పలు టీవీ కార్యక్రమాల్లో మెనాల్పై ఉన్న ప్రేమను పాట రూపంలో వ్యక్త పరిచే అఖిల్.. ఈ సారి కవితాత్మకంగా చెప్పి కవిగా మారాడు. మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం అఖీల్.. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ఆ తరువాత ‘ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది’ తన కవి హృదయాన్ని బయటపెట్టాడు. దీంతో అఖిల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా వీరిద్దరూ జంటగా ప్రేమ కథా నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. చదవండి: రామ్ చరణ్ బర్త్‌డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో ఆచార్యతో కలిసి నడిచిన సిద్ధ -
అరియానా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పూజలు
బిగ్‌బాస్ షో అన్నది ఓ రకంగా విలాసవంతమైన జైలు లాంటిది. అందులో అడుగు పెట్టిన వాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకుని చివరి వరకు నిలబడితే విజేతగా అవతరిస్తారు. లేదంటే, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతుంటారు. అయితే షో తర్వాత కూడా వీరికి ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుతూనే ఉంటాయి. అందుకు తాజా ఘటన నిదర్శనం. తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఈ మధ్య అనారోగ్యానికి లోనైంది. తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా బాధపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఆందోళనపడిన అభిమానులు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదుటపడిందని, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది. "నాకు జ్వరం వచ్చింది, వెళ్లిపోయింది. నన్నేం చేయలేదు. ఆ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నా కోసం చాలామంది అదేపనిగా మెసేజ్‌లు చేస్తున్నారు. స్టేటస్లు పెడుతున్నారు. నేను వెంటనే కోలుకోవాలని కొందరైతే ఏకంగా పూజలు కూడా చేయిస్తున్నారు. నామీద ప్రేమ చూపిస్తున్న అందరికీ థ్యాంక్స్" అని ఈ బోల్డ్ భామ పేర్కొంది. దీంతో అరియానా తిరిగి సోషల్ మీడియాలో సందడి చేయడంతో అవినాష్, సోహైల్ సంబరపడిపోయారు. ఇక బుల్లితెరపై అవినాష్‌తో కలిసి సందడి చేస్తున్న అరియానా యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఏదైనా అప్డేట్ ఇస్తారేమో వేచి చూడాలి! చదవండి: అఖిల్ పేరు పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గంగవ్వ. యూట్యూబ్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి సంచలనమే క్రియేట్ చేసింది. అయితే వయసురీత్యా అనారోగ్యం వెంటాడుతుండటంతో షో మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు రాక తప్పలేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అందరికంటే హుషారుగా ఉంటూ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. ఇక అఖిల్ సార్థక్‌ను ప్రేమగా అఖిలూ... అని పిలుస్తూ సొంత మనవడిలా చూసుకునేది. దత్తత తీసుకుని పెళ్లి కూడా చేస్తానంది. అతడు కూడా అవ్వతో ఆప్యాయంగా మెలిగేవాడు. తాజాగా అఖిల్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది గంగవ్వ. చాలా రోజులకు అఖిల్‌ను కళ్లారా చూడటంతో అవ్వ తెగ సంతోషపడిపోయింది. అఖిల్‌ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ వేసుకున్న జీన్స్ మీద కూడా సెటైర్లు వేసింది. ఇది చినిగిపోయింది. ఇలాంటివి నేను మసిగుడ్డలుగా వాడుతానంటూ అతడి పరువు తీసింది. కానీ అంతలోనే అఖిల్ ఒక్కడే కాదు, ఇప్పుడు అందరూ ఇలాంటివే తొడుగుతున్నారని వెనకేసుకొచ్చింది. ఇక సడన్‌గా అఖిల్ వాళ్ల అమ్మానాన్న కనిపించకపోవడంతో అవ్వ వారి కోసం తెగ వెతికింది. అయితే ఇక్కడ అఖిలే వారి పేరెంట్స్‌ను బయటకు పంపించి ఆమె కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు. దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్‌లో పట్టీలు కొనుక్కొచ్చారు. వాటిని అవ్వ కాలికి పెట్టి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి ఊరి నుంచి వచ్చిన అవ్వను ఊరికే పంపించకుండా కానుక ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లిపోతుండటంతో 'నా అవ్వ బంగారం..' అంటూ అఖిల్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ -
బిగ్‌బాస్ భామల బ్యూటిఫుల్ ఫోటోలు
-
అభిమాని చేసిన పనికి షాకైన అఖిల్
అఖిల్ సార్థక్.. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అతివల మనసు దోచిన అందగాడితడు. కేవలం ఫిట్నెస్తోనే కాకుండా యాటిట్యూడ్‌తో, తనదైన గేమ్ ప్లేతో ఫినాలే వరకు చేరుకున్నాడు. కానీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అభిమానుల అండ మెండుగా ఉన్న ఇతడికి ఆ మధ్య ఓ ఫ్యాన్ ల్యాప్‌టాప్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి బిగ్‌బాస్ ఐ ఉన్న బ్రేస్లెట్ ఇచ్చి అతడి మెప్పు పొందాడు. కానీ తాజాగా ఓ వీరాభిమాని చేసిన పనికి అఖిల్‌కు షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ షో సమయం నుంచి అఖిల్‌కు వీరాభిమానిగా మారిపోయాడు అర్జున్ అనే వ్యక్తి. అతడు అందరిలా తన హీరోతో సెల్ఫీ దిగి సంతృప్తిపడాలనుకోలేదు. అతడెప్పటికీ తనతోనే ఉండిపోవాలనుకున్నాడు. దీంతో అఖిల్ పేరును ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ మధ్యే అతడు అఖిల్‌తో ఫొటో దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ఎద మీద టాటూ చూసిన అఖిల్‌కు దిమ్మతిరిగినంత పనైంది. తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు నోట మాట రాకుండా పోయింది. ఈ క్రమంలో అతడు తన అభిమానితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మాటలు కరువయ్యాయి. కానీ ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం. నా పేరును పచ్చబొట్టు వేయించుకోవడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో నన్ను భాగస్వామ్యుడిని చేసినందుకు, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు థ్యాంక్ యూ అర్జున్. తప్పకుండా మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను. కానీ ఓ ముఖ్య విషయం: మీకు నేనంటే చాలా ఇష్టం, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టాటూలు వేయించుకోవడానికి బదులు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటానని మాటిస్తే అదే చాలు.." అని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక పాతికేళ్ల వయసులో కారు కొనుక్కోవాలన్న అభిలాషను అఖిల్ ఈ మధ్యే నేరవేర్చుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు పాతికేళ్లకే సాధించిన అఖిల్ సార్థక్ -
స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఫేం..‘దేత్తడి’ హారిక బంపర్ ఆఫర్ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హారిక ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యారు. హౌజ్‌లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్ వరకు పోరాడారు. టాప్ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పలు ప్రాజెక్టులతోపాటు సినిమా చాన్స్‌లు కొట్టేశారు హారిక. మరోవైపు.. ప్రస్తుత తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్ సినిమాలు చేయడమే తన లక్ష్యమని మనసులో మాటని బయటపెట్టింది బిగ్‌బాస్–4 ఫేమ్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక). నగరంలోని మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని, అంతకుమించి ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోనని పేర్కొంది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నాని, అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్లో మరో వెబ్ సిరీస్ రానుందన్నారు. ఎప్పటికైనా సినిమాల్లోనే.. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్గా నటించాలనుందని దేత్తడి హారిక తెలిపింది. మహానటి లాంటి సినిమాలో చేయాలనుందని, అంతేకాకుండా రామ్ జామ్ తరహా సినిమాలన్నా తనకు ఎంతో ఆసక్తి అని పేర్కొంది. Sri Uppal Srinivas Gupta Garu, Chairman of Telangana state tourism Development corporation, appointed Miss Alekhya Harika as the new brand ambassador for TSTDC@USrinivasGupta @VSrinivasGoud @KTRTRS @harika_alekhya #Telanganatourism #TSTDC pic.twitter.com/cMIyK4yRlp — Telangana State Tourism (@tstdcofficial) March 8, 2021 చదవండి: ‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్!
తెలుగు నాట బిగ్‌బాస్ రియాలిటీ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ వస్తుందంటే చాలు సీరియళ్లకు ఫుల్స్టాప్ పెడ్తూ రిమోట్ మార్చేస్తుంటారు. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ హౌస్‌లోకి వీళ్లే నేరుగా ప్రవేశించినంత సంబరపడిపోతుంటారు. ఇక వారి ఫేవరెట్ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వస్తే వాళ్ల ఆనందాన్ని మాటలో చెప్పలేము. హాట్‌స్టార్ ఓట్లు మాత్రమే కాదు మిస్డ్ కాల్స్ కూడా ముఖ్యమేనంటూ లోపల ఉన్న పోటీదారులను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించేందుకు నానా రకాలుగా కష్టపడుతారు. మొత్తానికి తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అందరూ ఊహించినట్లుగానే అభిజిత్ విజేతగా అవతరించాడు. కానీ సోహైల్ రూ.25 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకోవడంతో అభిజిత్ ప్రైజ్‌మనీలో కోత పడింది. దీంతో అతడు కూడా పాతిక లక్షలు తీసుకుని ట్రోఫీని పట్టుకెళ్లిపోయాడు. షో తర్వాత తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అభిజిత్ నోరెళ్లబెట్టాడు. తనను గెలిపించిన ప్రేక్షకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని వారి మీద ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే అతడు సినిమాల్లోకి వస్తే చూడాలని ఉందని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తుండగా అభిజిత్ మాత్రం పలు కారణాలు చెప్తూ తన దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అభిజిత్ ఏకంగా నాగార్జునతో డీల్ కుదుర్చుకున్నాడట. అవును, నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఓ మూడు సినిమాలు చేసేందుకు అభిజిత్ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి దర్శకులను వెతికే పనిలో పడ్డారట. అంటే దర్శకులు దొరికేయగానే అభిజిత్ ఒకేసారి మూడు ప్రాజెక్టుల్లో పని చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉండబోతున్నాడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అన్నపూర్ణ స్టూడియోస్ అభిజిత్‌తో ఓకేసారి మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకోవడమంటే మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
బిగ్‌బాస్ బ్యూటీ అరియానాకు ‘మెగా’ ఆఫర్
యాంకర్‌గా కేరీర్ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. యాంకర్‌గా రామ్ గోపాల్ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. ఇప్పటికే యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి అరియానా ఓ సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అరియానా మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలో అరియానా నటిస్తుంది. శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్‌కు చెల్లి పాత్రలో అరియానా కనిపించనుంది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. నమో వెంకటేశ, దూకుడు సహా పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపన ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన విజేత సినిమాతో కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్ మాచి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి : (బిగ్‌బాస్ భామ అరియానకు అరుదైన ఘనత) (ఆచార్య’ సెట్లో సందడి చేయనున్న మెగా కోడలు) -
ఏకధాటిగా 21 గంటలు షూటింగ్లో పాల్గొన్నా
మోనాల్ గజ్జర్ ఇప్పుడీ పేరు టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. బిగ్‌బాస్ షోతో ఈ అమ్మడుకు దక్కిన క్రేజ్ వేరే ఎవరికీ దక్కలేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ భారీగానే పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపించింది. ఒక వైపు తన ముద్దుముద్దు మాటలు.. మరో వైపు హౌస్‌లో ట్రయాంగిల్ లవ్‌స్టోరి షోకే హైలేట్‌గా నిలిచాయి. కొన్నిసార్లు ఆమె ప్రవర్తనకు విమర్శలు ఎదురైనా అవేం పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్ళిపోయింది. పద్నాలుగా వారాలపాటు హౌస్‌లోఉన్న ఈ గుజరాతి భామ ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కుర్రకారుల మనస్సును కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా చేస్తోంది. అఖిల్ సార్థక్‌తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. కాగా, ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తను చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. డ్యాన్స్ షో ఎపిసోడ్ కోసం ఏకంగా 21 గంటలు షూటింగ్ చేసినట్లు వెల్లడించింది. అంతసేపు కష్టపడినా ఇప్పటికీ ఎంత ఫ్రెష్‌గా ఉన్నానో అంటూ ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో యాడ్ చేసింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మోనాల్ ఓపిక, సహనానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చదవండి: మోనాల్ గిఫ్ట్: హాట్‌గా ఉన్నానంటున్న అఖిల్! మహేశ్‌బాబుతో మోనాల్ స్పెషల్ సాంగ్! -
అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్‌బాస్ కంటెస్టెంట్
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు రన్నర్‌ను, కానీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న విన్నర్‌ను అని చెప్పుకుంటాడు అఖిల్ సార్థక్. ప్రస్తుతం అతడు తెలుగు అబ్బాయి - గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోమశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా అతడి ఫొటో ఫ్రేమ్‌ను ప్రత్యేక కానుకగా పంపించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "హలో రాక్‌స్టార్, హ్యాపీ బర్త్‌డే. మనిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే ఇలా కనెక్ట్ అయిపోయాం. మా అమ్మది తమిళ్. అలా నాకు ఆ భాష కాస్తోకూస్తో అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నేను తమిళ బిగ్‌బాస్ షో చూశాను. ఇద్దరం బిగ్‌బాస్ 4 నుంచి వచ్చినవాళ్లమే. లవ్ యూ రాక్‌స్టార్" అంటూ వీడియో సందేశం పంపాడు. ఇక అతడు పంపిన గిఫ్ట్ చూసి సోమశేఖర్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. "ఓ మై గాడ్, చాలా బాగుంది బ్రదర్" అంటూ త్వరలోనే కలుద్దామని చెప్పుకొచ్చాడు. సోమశేఖర్ విషయానికొస్తే.. బాక్సింగ్ మ్యాచ్‌లో గోల్డ్ మెడల్, తమిళనాడు స్టేట్ లెవల్ మువైతాయ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 'అజగియ తమిళ్ మ్యాగన్' టీవీ షోలో తళుక్కున మెరిశాడు. బైకులను అమితంగా ప్రేమించే ఇతడు ఈ మధ్యే కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందుకున్నాడు. గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న ఇతడు నాలుగో రన్నరప్‌గా నిలిచాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
తొక్కేశారు, రాహుల్ కాలికి రక్తస్రావం
బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందరి నోళ్లలో నానేలా తన స్టోర్‌కు ఊకోకాకా అని నామకరణం చేశాడు. హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో ఇప్పటికే ఈ స్టోర్లను లాంఛనంగా ప్రారంభించగా ఆదివారం సాయంత్రం వరంగల్‌లోని హన్మకొండలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాహుల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో వారిని ఆపడం అక్కడున్నవాళ్లకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ తనను ముందుకెళ్లనివ్వకుండా పైపైకి వస్తున్నవారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రాహుల్ చిచా ఇలా ప్రవర్తించాడేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే అతడి తీరును తప్పుబట్టారు. సెలబ్రిటీ అయ్యావని పొగరు చూపిస్తున్నావా? అంటూ కొందరు విమర్శలు చేశారు. దీంతో రాహుల్ తన కోపం వెనక ఉన్న బాధను బయట పెట్టాడు. "పొద్దున్నే నా కుడి కాలి చిటికెన వేలుకు ఆరు కుట్లు పడ్డాయి. అయినా ఓ 20 మంది నా కాలిని తొక్కేశారు. ఆ కుట్ల నుంచి రక్తం కారిపోతుంది. దీంతో ఎక్కడ కుట్లు ఊడిపోతాయో అని భయపడ్డాను. అంతే, కానీ మీ అందరికీ నా కోపం మాత్రమే కనబడుతుంది. ఏదేమైనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఓరుగల్లు జనాల వల్ల స్టోర్ వైభవంగా ప్రారంభించాం" అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: ఆమెను అమాంతం ఎత్తుకున్న రాహుల్! 'ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ -
అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్
గెలుపు ఒక్కటే విజయం కాదు, డబ్బుతో వెలకట్టలేని అభిమానాన్ని సంపాదించడమూ ఓ రకంగా విజయమే. బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నర్ అఖిల్ సార్థక్ ఈ మాటను బలంగా విశ్వసిస్తాడు. అందుకే హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్ విన్నర్ రుబీనాకు కాకుండా రన్నర్‌గా నిలిచిన రాహుల్ వైద్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. రన్నర్లు కూడా విన్నర్లే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే తాజాగా అఖిల్ సార్థక్ ఓ కొత్త కారు కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "పాతికేళ్లలోపే కొత్త కారు కొనాలని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. తల్లిదండ్రుల సపోర్ట్, నా హార్డ్‌వర్క్, మీ ప్రేమాభిమానాల వల్లే ఇప్పుడా కల నెరవేరింది. నేను కష్టాన్ని నమ్ముతాను, పనిని దైవంగా భావిస్తాను. ఏదైనా సరే సాధించేవరకు పోరాడుతూనే ఉంటాను. అఖిల్ ఫ్యామిలీలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.." అంటూ అఖిల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. త్వరలోనే హోండా సిటీ కారులో రైడ్‌కు వెళ్దాం అని సోహైల్, నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మోనాల్ సదరు పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. నోయల్ సహా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన ఎర్రటి కారులో ఎరుపు రంగు డ్రెస్సులో అఖిల్ నేడు షికారుకు వెళ్లాడు. ఈ వీడియోను ఆర్జే చైతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ అఖిల్‌కు కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. మరి ఈ కారులో సామ్(సోహెల్, అఖిల్, మోనాల్ గజ్జర్) ఎప్పుడు షికారుకు వెళ్తారోనని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇదిలా వుంటే అఖిల్ ప్రస్తుతం "తెలుగు అబ్బాయి- గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ అతడితో జోడీ కడుతోంది. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: జంటగా మారబోతున్న బిగ్‌బాస్ ఫేం మోనాల్-అఖిల్ -
భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య
యాంకర్ లాస్య. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ యాంకర్‌గా పాపులారిటీ గడించిన ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కారణంగా బుల్లితెర మీద నుంచి నెమ్మదిగా పక్కకు జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం, పెద్దలను ఒప్పించి మరోసారి అదే వ్యక్తితో వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త వేలు పట్టుకుని ఏడడుగులు నడిచింది. ఆమె యాంకర్‌గా తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. ఈసారి ఆలోచించింది, షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పింది. అలా బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అడుగు పెట్టిన లాస్య తన అభిమానులను మెప్పించింది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా తన పనేదో తను చేసుకుపోయింది. కానీ అందరికీ వండి పెడుతూ వంటలక్కలా స్థిరపడిపోయింది. తన ప్రేమ, పెళ్లి విషయాలు చెప్తూ ఎన్నోసార్లు కంటతడి పెట్టింది. సోమవారం వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా లాస్య కొత్త కారు కొంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు కొనుగోలు చేసి భర్తకు కానుకగా ఇచ్చింది. దీని ధర పదహారు లక్షల పైమాటే! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి బహుమతినిస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో?! మేము ఇప్పుడు దీనిలో ఓ రౌండ్ వేసుకొస్తాం అని రాసుకొచ్చింది. ఇక నిన్న పెళ్లిరోజును పురస్కరించుకుని మంజునాథ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఏ అనుబంధంలోనూ మంచి రోజులే ఉండవు. తుపానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది అని భావోద్వేగ నోట్ రాసుకొచ్చింది. తన ప్రేమ కథను చెప్తూ ఓ స్పెషల్ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) చదవండి: లాస్య ఛానెల్ హ్యాక్: హ్యాపీ అంటున్న నోయల్ బిగ్‌బాస్: అరియానా ఖాతాలో అరుదైన ఘనత సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి -
తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ రెండూ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సోహైల్ ఒకడు. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.100 రోజులపాటు హౌస్‌లో సందడి చేసిన ఈ కరీంనగర్ కుర్రోడు షోలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. విన్నర్ కాకపోయినా అదే రేంజ్లో తనపై దృష్టి పడేలా చేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్‌కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. తాజాగా సోహైల్ మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి వృత్తిపరంగా కాకుండా ఓ ముఖ్యమైన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి, సోదరుడితో కలిసి ఓ శుభవార్త చెప్పాడు. అదే.. సోహైల్ కొత్త కారును కొనుగోలు చేశాడు. MG కంపెనీకి చెందిన దాని ధర దాదాపు రూ. 30 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘కొత్త కారు కొనాలనే కల నిజమైంది. దీన్ని సాధ్యం చేసినందుకు బిగ్‌బాస్‌కు, అలాగే ఎప్పుడూ నాకు ఆదర్శంగా నిలిచే మా నాన్నకు కృతజ్ఞతలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌ను సోహైల్ అంగీకరించి ఇంటిని వీడాడు. చదవండి: మెగాస్టార్ ఇంట్లో బిగ్‌బాస్ తురుమ్‌ఖాన్ సందడి అభిజీత్‌ను వెనక్కినెట్టిన అఖిల్.. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
జంటగా మారబోతున్న మోనాల్-అఖిల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో మోనాల్, అఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే షోని వీక్షించినవారు ఉన్నారు. ఇక మోనాల్, అఖిల్, అభిజిత్ మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ షోని ఎంత రక్తి కట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాల్గో సీజన్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక కూడా అదే ప్రేమానుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బిగ్‌బాస్ లవ్ కపుల్‌గా పేరొందిన మోనాల్ గజ్జర్-అఖిల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వీరిద్దరు కూడా అదే బాండ్‌ను కొనసాగిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. షో నుంచి బయటకు వచ్చాక పార్టీలు చేసుకొని ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇలా బుల్లితెరపై, సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ లవ్ కపుల్..వాలెంటైన్స్‌డే సాక్షిగా జంటగా మారబోతున్నట్లు ప్రకటించారు. అయితే వీరు జంటగా మారబోతున్నది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. వీరిద్దరు కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సీరిస్‌లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ వెబ్ సిరీస్‌కి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఏ భాస్కరరావు నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తూ.. ‘బిగ్ డే.. మీ ఆశీర్వాదం కావాలి' అంటూ అభిమానులను కోరారు. -
బిగ్‌బాస్: అరియానా ఖాతాలో అరుదైన ఘనత
యాంకర్‌గా కేరీర్ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. వరుస ఇంటర్వ్యూలు, మాల్స్ ఓపెనింగ్స్‌తో పాటు పలు పార్టీలతో ఆమెకు క్షణం తీరిక లేకుండా పోయింది. అంతేగాక ఓ సినిమాకు కూడా సంతకం చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో రాజ్ తరణ్ కలిసి ఈ మూవీలో నటించనుంది. ఈ క్రమంలో ఇటీవల గోవా పర్యటనకు వెళ్లిన అరియాన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను కలిసిన సంగతి తెలిసిందే. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్తో కలిసి ఎంజాయ్ చేసింది. (చదవండి: గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా) ఈ నేపథ్యంలో అరియానా అక్కడ వర్మను కలిసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పంచుకుంది. ఇదిలా ఉండగా ఈ భామకు ఓ అరుదైన ఘనత దక్కింది. బిగ్‌బాస్ షోతో ఎంతో క్రేజ్ అందుకున్న ఆమె .. గూగుల్‌లో ప్రిన్సెస్ ఆఫ్ బిగ్‌బాస్ తెలుగు అని టైప్ చేయగా అరియానా గ్లోరీ అని చూపించడం విశేషం. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. ఈ విషయాన్ని ఆమె ‘సీరియస్లీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో అరియాన హాట్‌టాపిక్ అయిపోయింది. అయితే ఇప్పుడు గూగుల్ ఆమె పేరును తొలగించింది. (చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..) -
కింగ్ నాగార్జునను కలిసిన బిగ్‌బాస్ రన్నరప్
బిగ్‌బాస్ షో ముగిసి చాలా రోజులైనా ఆ షోలో పాల్గొన్న వారంతా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కథ వేరుంటది’ అని బిగ్‌బాస్ షో-4లో హల్చల్ చేసిన సోహేల్ అక్కినేని నాగార్జునను, చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్ధక్ కింగ్ నాగార్జునను కలిశాడు. తన తల్లితో కలిసి నాగ్ నివాసానికి అఖిల్ చేరుకున్నాడు. తన తల్లితో కలిసి నాగార్జునతో దిగిన ఫొటోలను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘నాగార్జునను మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.. బిగ్‌బాస్ రోజుల్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా.. లవ్ యూ సర్ మీ టైమ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ పోస్ట్ చేశాడు. నాగ్, అఖిల్ గట్టిగా నవ్వుతూ కనిపించారు. హోస్ట్‌గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున షోలో అఖిల్ సార్థక్‌తో కొంత చనువుగా ఉన్నారు. అఖిల్‌పై జోక్స్ వేస్తూ.. అతడి వస్త్రధారణను మెచ్చుకుంటూ ఉన్నారు. ‘బిగ్‌బాస్’లోకి టిక్‌టాక్ స్టార్ దుర్గారావు! బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా
బిగ్‌బాస్ భామ, సన్నజాజి తీగ అరియానా గ్లోరీ బిగ్‌బాస్ నాల్గో సీజన్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. ఇంటర్వ్యూలతో, మాల్స్ ఓపెనింగ్స్‌తో, పార్టీలతో క్షణం తీరిక లేకుండా పోయింది. పనిలో పనిగా ఓ సినిమాకు సంతకం కూడా చేసిన విషయం తెలిసిందే. "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి నటిస్తోంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసింది. కాగా ముక్కుసూటి వైఖరితో, ఎవరినైనా ఎదిరించే ధైర్యంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ గెలుద్దామని ధృడంగా నిశ్చయించుకుంది, కానీ ఆమె కల నెరవేరలేదు. అయినప్పటికీ బోలెడంత మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు ఆర్జీవీ కూడా ఓ అభిమానే! అవును, బిగ్‌బాస్‌కు ముందు కూడా అరియానా యూత్‌కు సుపరిచితురాలే. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసిన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో ఆమె బాగా ఫేమస్ అయింది. దీంతో ఆమె బిగ్‌బాస్‌లో అడుగు పెట్టడానికి కారణం ఓ రకంగా ఆర్జీవీనే అన్న వార్తలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో వర్మ ఆమెకు ఓటేయమంటూ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలపడం విశేషం. అంతే కాదు వీలైతే అరియానాతో సినిమా తీసేందుకు సిద్ధమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే మొత్తానికి వీళ్లిద్దరూ సమావేశమయ్యారు. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న అరియానా తాజాగా రామ్ గోపాల్ వర్మను కలిసింది. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో వర్మ ఆమెతో సినిమా తీస్తానన్న మాట గురించి ప్రస్తావించాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ) (చదవండి: హీరోయిన్గా బిగ్‌బాస్ బోల్డ్ బ్యూటీ) -
మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ!
బిగ్‌బాస్‌కు ముందు వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంది నటి మోనాల్ గజ్జర్ పరిస్థితి. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఆమె సొంతమైంది. తనకు పేరు తెచ్చిన స్టార్ మా ఛానల్లోనే డ్యాన్స్ ప్లస్ షోకి జడ్జిగా వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో బెల్లంకొడ శ్రీనివాస్‌తో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమా సర్కారు వారి పాటలోనూ ప్రత్యేక గీతంలో స్టెప్పులేయనుందన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. (చదవండి: పీనట్ డైమండ్ హిట్ అవ్వాలి) అయితే నిజంగానే ఈ బ్యూటీ మహేశ్‌తో డ్యాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందా? అని పలువురు సందేహపడ్డారు కూడా! దీనిపై తాజాగా మోనాల్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. సర్కారు వారి పాట సినిమాలో తను ఎలాంటి స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడటం లేదని స్పష్టం చేసింది. కాగా మోనాల్ ఇటీవలే బిగ్‌బాస్ రీయూనియన్ పార్టీలో తళుక్కున మెరిసింది. స్టార్ మా చేపట్టిన ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన పలు ఫొటోలను సెలబ్రిటీలు షేర్లు చేస్తుండటంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. (చదవండి: ఆచార్యలో మరోసారి లెట్స్ డు కుమ్ముడు!) -
మా అందాలకు అదే వన్నె: బిగ్‌బాస్ అరియానా
సాక్షి, హైదరాబాద్: ఆత్మసంతృప్తే మగువల అందాలకు మరింత వన్నె తెస్తుందని అన్నారు బిగ్‌బాస్-4 ఫేమ్ అరియానా. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ బ్యూటీ కాన్ఫరెన్స్–2021ను బిగ్‌బాస్ ఫేమ్ అరియనా, వర్ధమాన నటి లోహితా తనుడ్రాతో కలిసి సోమవారం ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత చాలారోజులకు ఫ్యాషన్ ప్రియులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ బ్యూటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్న ఎస్బీ ఇన్నోవేషన్స్ ఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దాదాపు 50 ఫ్యాషన్ అనుబంధ ఉత్పత్తిదారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారన్నారు. ప్రసిద్ధ బ్రాండ్స్ కాస్మొటిక్స్, స్కిన్ కేర్, పర్సనల్ ప్రొడక్ట్స్, బ్యూటీ ఫెస్ట్, సెలూన్ ఎక్విమెంట్స్ ప్రదర్శనకు ఉంటాయన్నారు. -
ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు? బిగ్‌బాస్ నాల్గో సీజన్లో బుద్దిబలంతో టాస్కులు గెలవడంతో పాటు అమ్మాయిల మనసు దోచుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ అభిజిత్. చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటో ఆయన అభిమానులకు విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ ప్రేమ అన్న క్యాప్షన్‌తో ఈ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కాగా ఓ స్పెషల్ ఎపిసోడ్లో అభి అమ్మ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. మీరు కొట్టుకోండి, అదే కదా మజా అంటూ కంటెస్టెంట్లతో ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో ఆమె కూడా పాపులర్ అయింది. (చదవండి: బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్) కేవలం ఎక్స్పీరియన్స్ కోసమే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చానన్న అభి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ప్రేక్షకులు చూపించిన ప్రేమలో తడిసి ముద్దైన అతడు సోషల్ మీడియాలో వారికి నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్ ప్రయాణంలో తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా కలుసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మధ్యే తన స్నేహితుడు, క్రికెటర్ హనుమ విహారిని కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అభి వీరాభిమాని అని తెలిసిన హనుమ విహారి ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ చెవిన వేశాడు. దీంతో రోహిత్ అభికి ఫోన్ చేసి మాట్లాడటమే కాక ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. (చదవండి: ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
మోనాల్ గిఫ్ట్: హాట్‌గా ఉన్నానంటున్న అఖిల్!
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్, సోహైల్ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్‌బాస్ టైటిల్ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్, ల్యాప్‌టాప్ కొనివ్వాల్సిందేనని డీల్ మాట్లాడుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే ప్రేక్షకులు మరొకటి తలిచారన్నట్లుగా వీళ్ల కల నెరవేరలేదు. విజయం వీళ్లను వరించలేదు. అలా అని వీరి కోరిక అసంపూర్తిగా మిగిలిపోలేదు. అఖిల్‌కు ఓ మహిళా అభిమాని ల్యాప్‌ట్యాప్ బహుమతిగా ఇచ్చింది. దీంతో అతడి సంతోషం కట్టలు తెంచుకుంది. తన మీద చూపిస్తున్న అభిమానానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే ఈసారి ఏకంగా అతడి మనసుకు మరింత దగ్గరైనవాళ్లు ఓ బహుమతినిచ్చారు. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, మోనాల్ గజ్జర్. (చదవండి: ఇల్లు కొనబోతున్న మోనాల్?!) బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్‌ను అంటిపెట్టుకుని ఉన్న మోనాల్ షో తర్వాత కూడా అతడితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ నానా హంగామా చేస్తోంది. ఈ క్రమంలో అఖిల్‌కు పూల ప్రింట్ ఉన్న ఎరుపు రంగు షర్ట్‌ను బహుకరించింది. ఇంకేముందీ.. అఖిల్ మరోసారి గాల్లో తేలిపోయాడు. ఆమె ఇచ్చిన షర్ట్ ధరించి మోనాల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్‌గా కనిపిస్తున్నా కదూ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. నిజంగానే అఖిల్‌కు పూలచొక్కా భలే సెట్టయ్యింది, ఎంతైనా మోనాల్ ఇచ్చింది కదా! అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ ఈ మధ్యే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. అటు మోనాల్ డ్యాన్స్ ప్లస్ షో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్‌లో ఆమె ప్రత్యేక గీతంలో ఆడిపాడిన విషయం తెలిసిందే! (చదవండి: ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను) -
బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్
బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజేతగా మిస్టర్ కూల్ అభిజిత్ ఊహించని వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడటమే కాకుండా.. ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. ఈ విషయాన్ని అభిజీతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గురించి రోహిత్ శర్మకు చెప్పిన తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ధన్యవాదాలు తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ, హనుమ విహారికి మధ్య జరిగిన సంభాషణలో బిగ్‌బాస్ షో గురించి చర్చకు వచ్చిందట. ఈ సందర్భంగా బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్‌కు చెప్పాడట హనుమ విహారి. అంతేకాకుండా అతను తనకు పెద్ద ఫ్యాన్ అన్న విషయం కూడా చెప్పాడట. దీంతో రోహిత్ అభిజిత్‌కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపాడట. అలాగే అతన్ని అభినందిస్తూ తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్... రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్వీటర్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్నం అన్న విషయం తెలిసిందే. రోహిత్ మహారాష్ట్రలోనే పుట్టిపెరిగినప్పటికీ.. తెలుగు మూలాల కారణంగా అతడికి తెలుగు అర్థం అవుతుంది. అంతే కాదు గతంలో అతడు డెక్కర్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్లో కూడా ఆడాడు. DAY MADE. The Hitman @ImRo45 says Hello from Australia! Thanks for this wonderful gift @Hanumavihari!! Get well soon. You showed amazing character at the highest level of the game, in a pressure situation. Contnd. pic.twitter.com/GMAVS6hgt8— Abijeet (@Abijeet) January 14, 2021 -
బిగ్‌బాస్: అఖిల్‌కు ఊహించని బహుమతి
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్, బైక్ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ.. అవును ఈ మధ్యే విజయవంతంగా పూర్తైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అఖిల్, సోహైల్ కుదుర్చుకున్న డీల్ ఇది. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా! వీరి విషయంలో కూడా అంతే... 25 లక్షల రూపాయలకు టెంప్ట్ అయి సోహైల్ ట్రోఫీ రేసు నుంచి తప్పుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ఎలాగైనా టాప్ 2లో ఉండాలన్న కోరికతో అడుగుపెట్టి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరినీ వెనక్కు నెట్టి అభిజిత్ విజేతగా అవతరించాడు. అలా వీరి డీల్ మధ్యలోనే ఆగిపోయింది. ల్యాప్‌ట్యాప్‌తో అభిమానం చాటుకుంది ఎవరికీ బైక్, ల్యాప్‌ట్యాప్ రాకుండా పోయింది అనుకుంటున్న తరుణంలో అఖిల్‌కు మాత్రం ఓ మంచి ల్యాప్‌ట్యాప్ వచ్చింది. జయలక్క్క్ష్మి అనే మహిళా అభిమాని విజయవాడ నుంచి వచ్చి మరీ అతడికి ల్యాప్‌ట్యాప్‌ను బహుమతిగా ఇచ్చింది. రెప్పకాలంపాటు ఇది నిజమా? కలా? అనుకున్న అఖిల్ కళ్లముందు అభిమాని ల్యాప్‌ట్యాప్ బ్యాగు పట్టుకుని కూర్చుండటం చూసి నమ్మక తప్పలేదు. తనకు అంత ఖరీదైన బహుమతినిచ్చినందుకు అఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీక మాటలు వెతుక్కున్నాడు. ఎలాగైతేనేం ల్యాప్‌ట్యాప్ కావాలన్న తన స్నేహితుడి కోరిక నెరవేరినందుకు అతడి జిగిరీ దోస్త్ సోహైల్ కంగ్రాట్స్ తెలిపాడు. పలువురు అభిమానులు కూడా అఖిలే నంబర్ 1 అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) 'సిటీమార్'లో అఖిల్ కాగా ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ దాదాపు ఏదో ఒక పనిలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా దివి, సోహైల్, మెహబూబ్, మోనాల్, అభిజిత్‌కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే అఖిల్‌కు కూడా ఏదో మంచి అవకాశం వచ్చిందట. కానీ దాన్ని సంక్రాంతికి చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే గోపీచంద్ సిటీమార్ సినిమాలో సెకండాఫ్ కోసం అఖిల్‌ను తీసుకున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. మరి తనకు వచ్చిన అవకాశం అదేనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలను ఆయన అధికారికంగా చెప్పేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: కోటి రూపాయలు ఎగ్గొట్టిన వర్మ) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
బాధపడ్డా.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్స్‌తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఫినాలేలో అనూహ్య నిర్ణయంతో అతడు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అభిజిత్, అఖిల్‌తో పాటు టాప్-3లో నిలిచిన సోహైల్.. బిగ్‌బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల డీల్‌కు అంగీకరించి ఇంటిని వీడాడు. అంతేగాక మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకోవడమే గాకుండా.. తన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తానంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ముగిసిన తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఏ నిర్ణయంతో అయితే సోహైల్ సీజన్ మొత్తానికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడో.. దాని కారణంగానే విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా ఫినాలేకు ముందు అతడి స్నేహితుడు, తోటి కంటెస్టెంటు మెహబూబ్ చేసిన పనితో ట్రోలింగ్‌కు గురయ్యాడు. మెహబూబ్ సైగల కారణంగానే తాను మూడోస్థానంలో ఉన్నానని తెలుసుకున్న సోహైల్.. డబ్బు తీసుకునేందుకు అంగీకరించాడని.. ఇలా మోసపూరితంగా ఆడటం సరికాదంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. (చదవండి: బంపరాఫర్ కొట్టేసిన అఖిల్..!) ఈ విషయంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సోహైల్ మరోసారి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి నిరాధార ఆరోపణలు, రాతల వల్ల నేనెంతో బాధపడ్డాను. నేను విజేతను కాదని తెలిసే రూ. 25 లక్షలు తీసుకున్నాననడం సరికాదు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. 25 లక్షలు అంటే నాకు పెద్ద మొత్తం. ఆ డబ్బు తీసుకుని షో నుంచి బయటకు రావడం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్‌లో పాల్గొనడం తనకెన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందని, తన జీవితంలో ఇది భావోద్వేగపూరిత ప్రయాణం అని పేర్కొన్నాడు. తన పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యాడు. -
ఇల్లు కొనబోతున్న మోనాల్?!
సినిమాలతో రాని గుర్తింపు రియాలిటీ షో బిగ్‌బాస్‌తో సొంతం చేసుకున్నారు మోనాల్ గజ్జర్. ఓట్లు, గేమ్‌తో కాకుండా లవ్‌ట్రాక్‌తో బిగ్‌బాస్‌లో కొనసాగారు మోనాల్. ఎలిమినేషన్‌కు ముందు కొన్ని రోజుల పాటు తనలోని అసలు టాలెంట్‌ని చూపించినప్పటికి.. ఫైనల్‌కి మాత్రం చేరుకోలేకపోయారు. ఇక ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారందరు ప్రస్తుతం టీవీ, సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో మోనాల్‌కి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ నటి మా టీవీలో డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా మొనాల్‌కి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. (చదవండి: బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్.. ) ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోల ఆఫర్స్‌తో బిజీగా ఉన్న మోనాల్ హైదరాబాద్‌లో ఇల్లు కొనే ఆలోచనలో ఉందట. తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిన టాలీవుడ్లోనే ఆమె కొనసాగాలునుకుంటున్నట్లు.. ఈ మేరకు సిటీలోనే ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఫిలీంనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. -
బిగ్‌బాస్ 4 నయా రికార్డు, ఆన్లైన్లో..
బిగ్‌బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 19 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా అభిజిత్ నిలిచాడు. ఇక అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. చదవండి: బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్! కాగా బిగ్‌బాస్‌ను ప్రేక్షకులు అమితంగా ఆదరించడంతో టీఆర్పీ రేటింగ్‌లోనూ ఈ షో దూసుకుపోయింది. బిగ్‌బాస్‌లో పాత రికార్డులను తుడిచిపెడుతూ నయా రికార్డులు రాసింది. తాజాగా ఆన్లైన్ వేదికగా అత్యధిక వీక్షకాదరణ పొందిన కార్యక్రమంగా బిగ్‌బాస్ సీజన్ 4 నిలిచింది. ఈ విషయాన్ని డిస్నీ హాట్ స్టార్ నిర్వహించిన పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది. మొత్తంగా చూస్తే 75శాతం వీక్షకులను బిగ్‌బాస్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో కార్తీక దీపం సీరియల్ నిలిచిందని పేర్కొంది. బిగ్‌బాస్ షో మొత్తంలో 86వ ఎపిసోడ్ అత్యధిక ఓట్ల వెల్లువ అందుకుందని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీకి నాన్ మెట్రల్లో వీక్షకుల సంఖ్య 117శాతం పెరిగిందని ఈ పరిశోధన వెల్లడించింది. అలాగే తమ ప్లాట్ ఫామ్ మీద ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాగా ‘ప్రతి రోజూ పండగే’ నిలిచిందని వివరించింది. మొత్తంగా వినోద కార్యక్రమాలను వీక్షించిన వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపింది. చదవండి: స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్ -
బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి కాస్త ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్‌గా గెలిచిన అభిజీత్‌కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో నిలిచిన సోహైల్‌కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్‌బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్‌కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా నాల్గో సీజన్లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సీజన్లో పాల్గొని రన్నర్‌గా నిలిచిన అఖిల్ సార్ధక్ గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరో గోపిచంద్ మూవీలో అఖిల్‌కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోందిసంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా ‘సిటీమార్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో సెకండాఫ్‌లో ఓ కీలక పాత్ర కోసం అఖిల్‌ని తీసుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి అఖిల్ 2016లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘బావ మరదలు’ అనే సినిమా ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా ద్వారా అఖిల్‌కి ఎలాంటి గుర్తింపు రాలేదు. దీంతో అఖిల్ బుల్లితెర వైపు అడుగులు వేశాడు. పలు సీరియళ్లలో కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్ నాల్గో సీజన్లోకి వెళ్లి రన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు అఖిల్‌కి పలు సినిమా ఆఫర్లు వస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తన సినిమా అవకాశాల గురించి అఖిల్ అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చప్పగా సాగుతున్న బిగ్‌బాస్ హౌజ్‌ను తన కామెడితో ఆసక్తికరంగా మార్చాడు. అయితే అతడు బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టేందుకు జబర్ధస్త్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని బ్రేక్ చేసి పెద్ద రిస్క్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో జబర్ధస్త్‌ను వదిలి వెళుతున్నందుకు గాను నిర్మాతలకు అవినాష్ 10 లక్షల రూపాయల జరిమాన కూడా చెల్లించాడు. అయితే బిగ్‌బాస్ ద్వారా అవినాష్ బాగానే లాభపడినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌తో మరింత ఫేంను సంపాదించుకున్న అవినాష్‌కు.. డబ్బులు కూడా భారీ మొత్తంలో అందినట్లు సమాచారం. అయితే ఇటీవల బిగ్‌బాస్ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా టీవీ, న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిబీ బిజీగా ఉన్నారు. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్‌కు నాగ్ ఊహించని గిఫ్ట్) అదే విధంగా అవినాష్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో అవినాష్ మాట్లాడుతూ.. తన సహా కంటెస్టెంట్ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే గత ఆదివారం జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అడుగుపెట్టి టాప్ 5లోని ఒకరిని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన దర్శకుడు అనిల్ తన తదుపరి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని, ఒకసారి కలవమని కూడా చెప్పినట్లు అవినాష్ చెప్పుకొచ్చాడు. -
బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్..
అప్పటి వరకు వాళ్ల ఫేమ్ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. బిజీగా ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. కంటెస్టెంట్ల జీవితాల్లో బిఫొర్ బిగ్‌బాస్ ఆఫ్టర్ బిగ్‌బాస్ అనేంతలా మార్పు వస్తుంది. అయితే మిగతా సీజన్లతో పోలీస్తే బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు హౌజ్ నుంచి బయటొచ్చాక సినిమా ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే సోహైల్ ఓ సినిమాకు సైన్ చేయగా.. తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మెగాస్టార్ మాటిచ్చాడు. ఇక అభిజిత్ ఎఫ్ 3లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చదవండి: విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ జాబితాలోకి తాజాగా మోనాల్ గజ్జర్ చేరిపోయింది. ఇప్పటికే బుల్లితెరలో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ షోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తెలుగు సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ గుజరాత్ భామ. టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్, నభానటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ సాంగ్‌లో మోనాల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆడిపాడనుంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల సారథ్యంలో సెట్ వేసినట్లు, దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేయనున్నారని సమాచారం. ఇక మోనాల్ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ కానుందనడంలో సందేహం లేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: అభిమానులకు రకుల్ గుడ్‌న్యూస్ #BiggBoss beauty #MonalGajjar shaking legs with @BSaiSreenivas for a special song in #AlluduAdhurs.🕺💃 Movie releasing on Jan 15th 2021.✨ #SanthoshSrinivas @ThisIsDSP @prakashraaj @SonuSood @NabhaNatesh @ItsAnuEmmanuel @shekarmaster #AvinashKolla #SumanthMovieProductions pic.twitter.com/7fFof5xE7u — Shreyas Group (@shreyasgroup) December 29, 2020 -
‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్ సీజన్ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని ఒడిదొడుకులను చిన్ననాటి నుంచీ చూస్తూ పెరిగారు. జీవితం నేర్పిన పాఠాలతోనే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలనుకున్నారు. నవతరం అమ్మాయిలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ►‘దేత్తడి’ అంటూ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అలేఖ్య హారిక. డిగ్రీ చదువుతూ పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేసింది. జాబ్ పోతే ఎలా అనే ఆలోచనతో కొత్త ఆలోచనలకి పదును పెట్టింది. ►యాంకరింగ్ ద్వారా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరీ. కాలేజీ రోజుల నుంచే యాంకరింగ్ అంటే ఇష్టం పెంచుకుని తనకు అభిరుచి ఉన్న రంగం వైపే అడుగులు వేసింది. కొద్ది రోజుల్లోనే కుటుంబం మెప్పుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్నీ పొందుతోంది. ఇంటిని వదిలి 105 రోజులు వేరే చోట ఉన్నారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? హారిక: ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ముందు మా అమ్మ, అన్న కోసం ఒప్పుకున్నాను. మా ఇంటి నుంచి బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాక అక్కడంతా వేరే ప్రపంచం. వెళ్లకముందు కొంత భయం అనిపించింది. వెళ్లాక, అక్కడున్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాను. ఒక నిర్ణయానికి వచ్చామంటే ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నానా అనిపించినప్పుడు కళ్లు మూసుకొని రెండు నిమిషాలు కూర్చొనేదాన్ని. ‘మా అమ్మ, అన్నయ్య కళ్లముందు కనిపించేవారు. హారికా.. డౌన్ అయిపోవద్దు. ఏదైనా నీకు అండగా కుటుంబం ఉంది. ఇది కేవలం ఒక గేమ్. లాక్డౌన్ టైమ్‌లో నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని బాగా ఉపయోగించుకో..’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని. మా అమ్మ సమస్యలను ఎదుర్కొన్న విధానం వల్ల కూడా నాకు ధైర్యం వచ్చి ఉంటుంది. అరియానా: చిన్నప్పటి నుంచీ నేనూ, చెల్లి ఏ సమస్య అయినా ఫేస్ చేసేవాళ్లం. మా మమ్మీ జాబ్ చేసేది. తను వెళ్లిపోయాక మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్లం. తనకూ క్లాస్ ఉంటే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. నేను బయటకు వెళితే చెల్లి కూడా అంతే. అలా ఇండిపెండెంట్‌గా ఉండటం మాకు ఎప్పుడో అలవాటైపోయింది. హౌజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి 104 జ్వరం వచ్చింది. తట్టుకోలేక ఏడ్చేశాను. అక్కడ అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కి కూడా చెప్పాను. నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి పంపించేస్తే మా ఇంటి ఫుడ్ తిని, త్వరగా కోలుకుంటాను అని. కానీ, బిగ్‌బాస్ ‘స్పెషల్ కేర్ తీసుకుంటామ’ని చెప్పారు. అవినాష్ నన్ను బాగా చూసుకున్నారు. ఆ వారం రోజులు మాత్రం కొంచెం లోన్లీగా అనిపించింది. బిగ్‌బాస్ హౌస్‌లో మీ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది? హారిక: బయట రంగులరాట్నంలో తిరిగితే ఎంత సంబరంగా ఉంటుందో బిగ్‌బాస్ హౌజ్‌లో అలాంటి ఎక్స్‌పీరియెన్స్. భలేగుంది. ముందు భయపడ్డా... ఎలా ఉంటుందో ఏమో అని. కానీ, లోపలకు వెళ్లినప్పుడు చిల్... మస్తుంది. టాస్క్ మీదనే నా దృష్టి అంతా. ఇదో హ్యూమన్ ఎక్స్పరిమెంట్. టైమ్ కనుక్కోకముందు సూర్యుడిని చూసి పాతకాలం నాటి వాళ్లు ఎలా అంచనా వేసుకునేవారో మేం అలా చేసేవాళ్లం. ఫోన్లు లేవు, టీవీ లేదు, వాచీలు లేవు. అదో లోకం.. ఆ లోకంలో అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్‌గా భావిస్తాను. అరియానా: బిగ్‌బాస్ సీజన్ 4 అంతా రికార్డ్ చేసి పెట్టి, భవిష్యత్తులో నా పిల్లలకు చూపిస్తాను. అన్ని రోజుల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎప్పుడెలా ఉన్నానో నాకే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటోంది. కోపం వస్తే ఎలా ఉంటాను, బాధ వస్తే, సంతోషం కలిగితే ఎలా ఉంటాను.. అనేవన్నీ నాకు నేనే ఎక్స్‌పీరియెన్స్ చేశాను. బిగ్‌బాస్ తర్వాత మీకు మీరుగా మార్చుకోవాలనుకున్నవి? హారిక: సహజంగా నాకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి బాగా చిరాకుపడేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కోపం చూపాలి... ఎలాంటి స్థితిలో మౌనంగా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అరియానా: ముక్కుమీది కోపం. చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. మా చెల్లితో అలాగే గొడవ పడేదాన్ని. అదే, పెద్ద పెద్ద విషయాల్లో అయితే మౌనంగా ఉండిపోతాను. బిగ్‌బాస్‌లో బాధ కలిగించినది... అత్యంత సంతోషాన్నిచ్చిన ఇన్సిడెంట్స్..? హారిక: అన్ని రోజులు కెప్టెన్సీకి వర్క్ చేసినా బెస్ట్ కెప్టెన్సీ రాలేదు. అది చాలా బాధ అనిపించింది. హాపీ మూమెంట్స్ అయితే లెక్కలేనన్ని. నాకెవ్వరితోనూ లొల్లి లేదు. పర్సనల్‌గా ఎవ్వరిమీదా కోపం లేదు. అంతా హ్యాపీ. అరియానా: మా ఫ్రెండ్స్ ఎలిమినేట్ అవడం బాధగా అనిపించింది. ఒకసారి గిఫ్ట్‌లు ఎవరికి ఇవ్వాలో నోట్ చేయమన్నారు. అందులో ఇద్దరికి రాయాలనుకున్నాను. కానీ, ఎవరికి రాయాలి..? అనేది సందేహం. దాంతో ఎవరికీ రాయలేదు. నాకూ ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. అయినా ఏమీ బాధనిపించలేదు. అప్పుడు బిగ్‌బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కన్సర్న్కి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. రూమర్స్ గురించి.. ఏమనుకుంటారు? హారిక: వాటి గురించి పట్టించుకుంటే మనం అస్సలు నడవను కూడా నడవలేం. అరియానా: ఏం వచ్చినా పట్టించుకోను. నాది నాకు తెలుసు. అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం. అందరూ ఫ్రెండ్స్‌గా ఉంటారు. కానీ, ఒక పర్సన్‌కే కనెక్ట్ అవుతాం. నా సిచ్యుయేషన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోను. సింగిల్ పేరెంటింగ్‌లో పెరిగినట్లున్నారు కదా... మీకు ఎలా అనిపించింది? హారిక: పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటే బాధ్యత రాకపోవచ్చు. అలా లేకపోవడం వల్లే నాలో ఒక బాధ్యత పెరిగిందనుకుంటాను. అమ్మ బొటీక్ ద్వారా కష్టపడుతుంది... తనను డబ్బులు అడగకూడదు అనుకున్నాను. అమెజాన్‌లో పార్ట్‌టైమ్‌గా జాబ్‌లో చేరాను. ‘కానీ, ఈ రోజున్న జాబ్ రేపు ఉండకపోవచ్చు. ఇంకేదైనా చేయాలి..’ అనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్ ద్వారా క్రియేటివ్ థాట్స్‌ని మీడియా ద్వారా చూపవచ్చు అని తెలిసింది. అప్పటికి ఫుల్‌టైమ్ జాబ్ చేస్తున్నా. వీకెండ్లో స్కిట్లు ప్లాన్ చేసుకున్నా. ఎలాగైనా ఫర్వాలేదు.. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా బతికేయాలని డిసైడ్ అయ్యాను. అరియానా: లైఫ్‌లో భార్య, భర్త, పిల్లలు అనే బంధం ఉండాలి. దీనితో పాటు మనకు మనంగా లైఫ్‌లో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అమ్మాయిల్లో టు షేడ్స్ ఉండాలి. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా వ్యక్తిగతంగా ఏం సాధించాలనుకుంటామో ఆ దిశగా ప్రయత్నాలూ చేయాలి. కుటుంబం కుటుంబమే. నాకు నేనుగా ఎదగడమూ ముఖ్యమే. వర్క్‌లో అధిగమించిన సమస్యల గురించి.. హారిక: నాకు జీవితంలో ఎదిగే అవకాశం ఇచ్చింది ‘దేత్తడి.’ దేవుడు.. పాపా నువ్వు ఇందులో ఉంటే సెట్ అవుతావు. నీ కుటుంబానికి హెల్ప్ అవుతావు.. అని పెట్టాడేమో అనిపిస్తుంది. ముందు 7–8 వీడియోలు చేసేవరకు నాకు వాటిలో చాలా విషయాలు తెలియవు. తర్వాత అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులను పిక్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. ఆర్టిస్టుల కోసం టిక్‌టాక్ వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పదిమందిని కాంటాక్ట్ చేశాను. ఎడిటింగ్, డబ్బింగ్ అంటూ స్టూడియోలు వెతుక్కొని వెళ్లాను. రిలీజ్ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. మంచి రిజల్ట్ వచ్చింది. ముందు దీనిలో ఓనమాలు తెలియవు. అందుకే, జాబ్ చేస్తూనే ఈ వర్క్ వీకెండ్లో చేసేదాన్ని. ఆఫీస్ షూట్.. షూట్.. ఆఫీస్ అన్నట్టుగా చేసేదాన్ని. అరియానా: కాలేజీ రోజుల నుంచి ఒకే ఆలోచన.. ఒక్కరోజు టీవీలో కనిపించినా పాప్యులర్ అయిపోతాను అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. అమ్మ వద్దంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ మెయిల్ క్రియేట్ చేసి, టీవీలకి బోలెడన్ని ఫొటోలు పంపించాను. తర్వాత అడిషన్స్‌కి వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. ఐదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ చేశాను. మొదట్లో ఏవీ తెలియవు. అన్నీ తెలుసుకుంటూ వెళ్లడమే. నేను యాంకర్ కావాలి అనుకున్నాను. నేర్చుకునే క్రమంలో ప్రతిచోటా ప్రతిరోజూ ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. మీ ముందున్న లక్ష్యం? హారిక: గొప్ప నటిగా ఎదగాలి. క్రేజీ క్యారెక్టర్ చేయాలి. అది సినిమా లేదా వెబ్‌సీరీస్. సినిమా ఏది వస్తుందో తెలియదు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తున్నప్పుడు అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి మాట్లాడుతుంటాం. అలా నా యాక్టింగ్ గురించి కూడా చాలా మంది మెచ్చుకోవాలని ఉంది. అలా నేనూ చేయాలి అదే నా యాంబిషన్. అరియానా: మంచి యాంకర్ అవ్వాలి. క్రికెట్లో కామెంటరీ చేయాలి. ఒక పెద్ద నేషనల్ ఛానెల్లో ఇంటర్వ్యూస్ చేయాలి. ఈ అమ్మాయి ఎవరో భలే మాట్లాడింది.. అనుకోవాలి. ఆ రోజు రావడానికి టైమ్ పట్టచ్చు. కానీ, తప్పక వస్తుంది అనుకుంటాను. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హోస్ట్‌గా అవియానా జంట.. ఇక సందడే సందడి
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లు ఏం ఆశించి హౌస్‌లోకి వచ్చారో.. అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి కాస్త ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్‌గా గెలిచిన అభిజీత్‌కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో నిలిచిన సోహైల్‌కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్‌బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్‌కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా నాల్గో సీజన్లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి : భలే చాన్స్ కొట్టేసిన మోనాల్.. బుల్లితెరపై సందడి) బిగ్‌బాస్ హౌస్‌లో అరియానా, అవినాష్ జోడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదే. నెటిజన్లు అయితే ఈ జంటకు అవియానా అని పేరు పెట్టి మరి ప్రశంసలు కురిపించారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, అన్నం తినిపించుకోవడం, ఒకరిపైఒకరు పంచ్‌లు వేసుకోవడం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. అవినాష్ ఎలిమినేట్ అయినప్పుడు అరియానా ఎంత భావోద్వేగానికి గురైందో అందరూ చూశారు. ఇలా ఈ సీజన్లో గుడ్ పెయిర్‌గా గుర్తింపు పొందిన ఈ జంటతో ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహించి టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకునే ప్లాన్ చేస్తున్నాయట కొని ఎంటర్టైన్మెంట్ చానళ్లు. దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని హోస్ట్‌గా పెట్టి స్పెషల్ ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తున్నారట ఓ చానల్ నిర్వాహకులు. కాగా హోస్ట్‌గా అరియానాకు మంచి అనుభవం ఉంది. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో కలిసి ఓ షోను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరితో కలిసి పలు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అరియానా, అవినాష్ టీవీ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని చానళ్లకు జంటగా వెళ్లి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ జంట హోస్ట్‌గా వస్తే.. బుల్లితెరపై సందడి మాత్రం మా..ములుగా ఉండదు మరి. -
బిగ్‌బాస్ : సోహైల్‌కు ఫ్యాన్స్ ఘన స్వాగతం
హుస్నాబాద్: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సోహైల్‌కు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్‌కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో.. స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్ వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్‌కు వెళ్లేందుకు పయనమయ్యాడు. అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్ చౌరస్తాలో సోహైల్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బిగ్‌బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, చివరకు 5గురు టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. కాగా చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారిలో సోహైల్ అంగీకరించడంతో అతను రూ.25లక్షలు ప్రైజ్‌మనీ పొందాడు. -
భలే చాన్స్ కొట్టేసిన మోనాల్.. బుల్లితెరపై సందడి
మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చకా.. బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలతో పాటు పలు షోలలో ఆమె పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా స్టార్ మాలో రేపటి నుంచి ప్రసారం కాబోయే డ్యాన్స్ ప్లస్ షోలో మోనాల్ పాల్గొనబోతున్నట్లు ఈ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అందులో వన్ డే టు గో అంటూ తనదైన స్టైల్లో చెప్పింది మోనాల్. అయితే ఈ షోలో మోనాల్ మెంటర్‌గా ఉండనున్నారా..? లేక జడ్జిగా ఉండబోతున్నారా అనేది నిర్వాహకులు తెలియజేయలేదు. కానీ ఆమె జడ్జిగానే ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షోకి మోనాల్‌తో పాటు బాబా భాస్కర్ మాస్టర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ కూడా జడ్జిలుగా ఉండబోతున్నారట. ఇక ఈ షోకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని చూస్తుంటే ఈ షో ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. 1 Day to go!!!#Dancee+ starts tomorrow at 6 PM on @StarMaa#DanceePlus pic.twitter.com/xeab1aFzgr — starmaa (@StarMaa) December 26, 2020 -
అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్! దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్ బిగ్‌బాస్ 4 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..