Bigg Boss 4 Telugu Winner Abhijeet Mother Tested Covid Positive - Sakshi

బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ తల్లికి కోవిడ్‌ పాజిటివ్‌

May 11 2021 7:59 AM | Updated on May 11 2021 12:19 PM

Bigg Boss Winner Abhijeet Mother Tests Coronavirus Positive - Sakshi

ఈ కోవిడ్‌ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం అనేది ఇరిటేటింగ్‌.

తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌ తల్లి కోవిడ్‌ బారిన పడింది. ఈ విషయాన్ని అభిజిత్‌ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. "ఏదైతే  భయపడ్డామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్‌ అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్‌ బాగానే ఉన్నాయి. త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా"

"ఇకపోతే ఈ కోవిడ్‌ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్‌ నేర్చుకుంటున్నాను" అని అభిజిత్‌  చెప్పుకొచ్చాడు.

చదవండి: ఈ యంగ్‌ హీరోను గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement