Abhijeet Duddala
-
పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్‌లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్‌నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
ఏదైతే భయపడ్డానో అదే జరిగింది: అభిజిత్
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ తల్లి కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. "ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా" "ఇకపోతే ఈ కోవిడ్ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్ నేర్చుకుంటున్నాను" అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
అమలగారూ నాకు అమ్మే: అభిజీత్
బిగ్ స్క్రీన్‌లో నటించాలి. బిగ్ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్. సహజంగానే స్ట్రాంగ్. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ విజయం వీక్షకుల కటాక్షమే’ అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లది గత తరం. ఇంజనీర్ అయ్యి సినిమాల్లోకి వస్తున్న తరం ఇప్పటిది. ఈ తరానికి నవ ప్రతినిధి అభిజీత్. ‘‘సినిమాకి ఉన్న అందం అది. ఎప్పటికీ వన్నె తగ్గని కళ అది. అందుకే ఈ ఆకర్షణకు లోనయ్యాను’’ అని పెద్దగా నవ్వేశాడు అభిజీత్. స్కూల్లో నేర్చుకున్నవి కాలేజ్‌లో మనల్ని నడిపిస్తాయి. కాలేజ్‌లో నేర్చుకున్నవి సమాజంలో నడిపిస్తాయి. చదువు సమాజంలోకి ధైర్యంగా నడిపించే సాధనం అయితే... సమాజం నుంచి నేర్చుకున్న జ్ఞానం మనిషిగా నిలబెడుతుంది. బిగ్‌బాస్ తనకు అలాంటి జ్ఞానాన్నే ఇచ్చిందని అన్నాడు అభిజీత్. ‘‘బిగ్‌బాస్ హౌస్‌లో జీవించడం మాత్రం జీవితంలో గొప్ప అనుభవం. ఒక మామూలు మనిషిని గొప్ప వ్యక్తిత్వంతో మలచగలిగిన శక్తి ఈ రియాలిటీ షోకి ఉంది. బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు అభిజీత్‌కి, బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చిన అభిజీత్‌కి మధ్య తేడా ఉంటుంది. ఆ మార్పును మీరే చూస్తారు’’ అని అన్నాడు అభిజీత్. ‘‘బిగ్‌బాస్ విజేత కావడం కంటే చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అదృష్టం నాకు ఎక్కువ ఆనందాన్నిస్తోంది. ఈ షోలో విజేతనయ్యాను కాబట్టే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి బిగ్‌బాస్ విజేత అనే ట్యాగ్‌ని ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ షో పట్ల గౌరవంగా ఉంటాను’’ అని చెప్పాడు. అమలగారూ నాకు అమ్మే మొదటి సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల కొడుకు అభిజీత్. ‘‘అమలగారు ఎంత కేరింగ్‌గా ఉండేవారంటే... ‘అభీ నువ్వు తిన్నావా’ అని అడిగేవారు. అంతటి సీనియర్ నటితో సీన్ అంటే ముందుగానే రెండు– మూడు రిహార్సల్స్ చూసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ ఆమె కొత్తవాళ్లు కదా భయపడతారేమోనని ‘ఓకేనా, ప్రిపరేషన్‌కి మరికొంత టైమ్ కావాలా’ అని అడిగేవారు. నాగార్జున సర్ నుంచి డెడికేషన్, డిసిప్లిన్ నేర్చుకున్నాను. మా సమస్యలను అర్థం చేసుకుని అందులో నుంచి ఒక పంచ్ వేసి మమ్మల్ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తారాయన. అఖిల్ కూడా అమలగారిలాగానే ఉంటారు. ఆ కుటుంబం నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అంటూ నాగార్జున్ సర్ని అంత దగ్గరగా అన్ని రోజుల పాటు ఆయనతో కలిసి పని చేసే అవకాశం బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిందని అభిజీత్ సంతోషంగా చెప్పాడు. ఇంకా స్ట్రాంగ్ అవాలి మంచి ప్రమాణాలున్న రిషీవ్యాలీ స్కూల్, జేఎన్టీయూ, మసాచుసెట్స్‌లో చదువు తనను వ్యక్తిగా దృఢంగా నిలబెట్టాయని చెప్పాడు అభిజీత్. ‘‘బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే వరకు ‘నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్’ అనుకునే వాడిని. నేను మరింత స్ట్రాంగ్‌గా మారాలని హౌస్‌లోకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే తెలిసింది. కొన్ని సందర్భాలు నన్ను ఎమోషనల్‌గా మార్చాయి. మానసికంగా బలహీన పరిచే సంఘటనలు కూడా ఎదురయ్యాయి. నేను తప్పు చేయలేదు కదా, ఎందుకిలా అవుతోంది అని బాధపడిన సందర్భాలున్నాయి. అయితే ఆందోళన, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన నిగ్రహం నాలో ఉంది. అది నేను చదువుకున్న మంచి విద్యాసంస్థల శిక్షణతోనే వచ్చింది. నేను బలహీన పడిన ప్రతి సందర్భంలోనూ వీక్షకులు నాకు అండగా నిలిచారు. నన్ను విజేతగా నిలపడానికి వాళ్లందరూ ఇచ్చిన మద్దతు మర్చిపోలేనిది. నా కుటుంబం ఇచ్చినంత సహకారాన్ని నాకు తెలియని చాలా మంది నుంచి కూడా పొందగలగడం నిజంగా వరమే’’ అని తనకు ఓట్లేసి విజేతగా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. నటనకే నా జీవితం నటనలో కెరీర్‌ను మలుచుకోవడం కాదు, నటన కోసం జీవితాన్ని అంకితం చేస్తానన్నాడు అభిజీత్. సినిమా థియేటర్, ఓటీటీ ఏదైనా సరే... నటనలోనే జీవితం, నటనతోనే జీవితం... అంటూ ‘మా అమ్మకు నన్ను తెర మీద చూడడం ఇష్టం’ అని అసలు రహస్యాన్ని బయటపెట్టాడు.‘‘మా నాన్న మాత్రం చదువుకుని ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ స్థిరపడాలని కోరుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అమ్మ నేను పెద్ద హీరోనైపోయినంతగా సంతోషపడింది. అమ్మ కోరుకున్నట్లు ‘హీరో అభిజీత్’గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నాడు అభిజీత్. అమ్మాయి ఎంపిక ఇక జీవిత భాగస్వామిని నిర్ణయించే బాధ్యత అమ్మకే ఇచ్చేశానని చెప్పాడు ఈ బిగ్‌బాస్ తాజా విజేత. ‘‘ఈ రోజు నేను అందరి ఎదుట ఇలా నిలబడగలిగానంటే... అది నా ఒక్కడి సమర్థత, కాదు. అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ అందరి ఆశలు, ప్రయత్నం, శ్రమ ఉన్నాయి. వాళ్లు మంచి చదువుని, మంచి జీవితాన్నిచ్చారు. నా జీవితంలో, మా కుటుంబంలో చక్కగా ఇమిడిపోగలిగిన అమ్మాయి ఎంపిక కూడా మా అమ్మ అయితేనే కరెక్ట్‌గా చేయగలుగుతుంది. ఓకే... థాంక్యూ’’ అంటూ ఇంటర్వ్యూ ముగించాడు అభిజీత్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బిగ్‌బాస్: అభిజిత్ రెమ్యునరేషన్ ఎంతంటే..
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్ సీజన్ 4 డిసెంబర్ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 29 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. 25 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ఓ బైక్ గెలుచుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. టాప్ 5 కంటెస్టెంట్లందరికిరు హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం గ్రాండ్‌గా బ్యాండ్ బాజాలతో ఇంటికి పయనమయ్యారు. చదవండి: బిగ్‌బాస్: అభి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా కాగా అభిజిత్ తన వ్యక్తిత్వంతో షో ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను దక్కించుకున్నాడు. చివరి వరకు అభిజిత్‌పై అదే అభిమానం కురిపిస్తూ అతన్ని విజయ తీరానికి నడిపించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్‌దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ ముగిసినప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విన్నర్‌గా నిలిచిన అభిజిత్ షో మొత్తం రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విజేతగా నిలిచిన అభిజిత్ బిగ్‌బాస్ షో కోసం వారానికి 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 106 రోజులకు 60 లక్షలు, ప్రైజ్ మనీ 25 లక్షలు కలిపి మొత్తం 85 లక్షలు అభికి మూటజెప్పినట్లు టాక్. వాస్తవానికి బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కంటే హౌజ్‌లో ఉన్నందుకే అభి అధికంగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అదే విధంగా టీవీ యాంకర్ లాస్యకు ఒక వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ కూడా వారానికి ఏకంగా 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. -
ఇలా చేస్తుంటే కష్టం అన్నారు: బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్
ఒక విజయం కోసం 105 రోజుల ఎదురుచూపు, రోజూ పిల్లలాటలు, కుమ్ములాటలు. అలకలు, బుజ్జగింపులు, ఎలిమినేషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు... కొన్ని రాజీల మధ్య బిగ్‌బాస్ నాలుగో సీజన్ కూడా పూర్తయింది. విజేత అభిజీత్. కంటెస్టెంట్లందరూ ఇన్ని రోజులు ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా కలిసిపోయారు. ఒక్కో కంటెస్టెంటూ వెళ్లిపోతుంటే హౌస్‌లో ఉన్న తోటి కంటెస్టెంట్లతోపాటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఇన్ని అడ్డంకులనూ దాటుకుని విజేతగా నిలిచిన అభిజీత్‌కు తెర ముందు కనిపించే ప్రశంసలతోపాటు తెర వెనుక కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయం అందరిదీ అదృష్టం అనాలో దేవుడి రాత అనాలో తెలియదు కానీ, నా ప్యాషన్‌ని ప్రదర్శించడానికి మంచి అవకాశం వచ్చింది. మనకేది ఇష్టమో అదే చేయాలి. ఆ పనిని పర్ఫెక్ట్గా చేయాలి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగలగడం అంత సులభం ఏమీ కాదు. సవాళ్లతో కూడుకున్న పని, చాలా కష్టమైన విషయమే, అయితే ఇది చాలా మంచి అనుభవం. హౌజ్‌లో ఉన్నంత కాలం ఇంట్లో వాళ్లందరూ గుర్తుకువచ్చారు. ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నేను విజేతగా నిలవడానికి నాకు తెలియని వాళ్లు కూడా సహాయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. – అభిజీత్ బిగ్‌బాస్ 4 విజేత తనే అవుతాడని అభిజీత్ అనుకున్నాడో లేదో కానీ, వాళ్ల అమ్మ లక్ష్మీప్రసన్న మాత్రం బలంగా నమ్మారు. ఎందుకంటే అతను హౌస్‌లోకి వెళ్లిన కొద్దిరోజులకే ‘మా అబ్బాయిని 105 రోజులపాటు మిస్ అవుతున్నాం’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హౌస్‌లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించా’నని ఇప్పుడు చెప్పారు లక్ష్మీ ప్రసన్న. అభిజీత్ విజేతగా నిలవడంతో అతని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. బ్యూటిపుల్ లైఫ్ అభిజీత్... మదనపల్లెలోని రిషీవ్యాలీ స్కూల్లో చదివాడు. హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కాలేజ్ తరవాత జేఎన్టీయూలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో! ఫైనల్ ఇయర్లో ఉండగానే ఫ్రెండ్‌తో కలిసి సరదాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఆడిషన్కెళ్లాడు. శేఖర్ కమ్ముల అంచనా తప్పలేదు. స్పార్క్ ఉన్న కుర్రాడిని చేజార్చుకోలేదతడు. అలా తెర మీదకొచ్చాడు అభిజీత్. ఇదంతా జరిగింది 2012లో. ఆ సినిమా పూర్తయిన తర్వాత తిరిగి చదువుకోసం అమెరికాకి వెళ్లాడు. మసాచుసెట్స్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అభిజీత్. ఆ తర్వాత మళ్లీ ‘రామ్‌లీలా, మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాలు చేశాడు. మూడేళ్ల కిందట వెబ్ సీరీస్ ‘పెళ్లిగోల’లో నటించాడు. అవి మూడు సీజన్లు పూర్తయ్యాయి. అంతలో బిగ్‌బాస్‌లో సహజ నటనకు తెరతీశాడు. ఇక ఆ తర్వాత అభిజీత్ అందరికీ తెలిసిన వాడయ్యాడు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) ప్రిన్సిపల్ నుంచి ఫోన్ అభిజీత్ గురించి ఎవరికీ తెలియని ఓ సరదా సంఘటన రిషీవ్యాలీ స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది. పిల్లల్లో ఓ కుర్రాడు ‘ఎవరికైనా ధైర్యం ఉంటే ఆ పోల్ ఎక్కగలరా’ అన్నాడు. ఆ చాలెంజ్‌ని స్వీకరించి స్తంభాన్ని ఎక్కేశాడు అభిజీత్. అది ప్రిన్సిపల్‌కి తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ‘మీ వాడిని చదువు విషయంలో తప్పుపట్టడం లేదు. కానీ అల్లరి ఎక్కువ. ఇలా చేస్తుంటే కష్టం’ అన్నారు. పిల్లల చురుకుదనం తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది. కానీ మరీ ఇంత చురుగ్గా ఉంటే సంతోషంతోపాటు భయం కూడా వెంటాడుతుంటుంది. ‘‘మా అభి సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గెలవాలనే ఆకాంక్ష మెండు. అతడు హౌస్‌లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించాను. నా మనసుకు అలా అనిపించింది’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. స్కూల్ నేర్పిన పరిణతి ‘‘రిషీవ్యాలీ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా రోజూ ఫోన్లో మాట్లాడేదాన్ని. యూఎస్‌లో ఉన్నన్ని రోజులు రోజూ వీడియో కాల్లో మాట్లాడేదాన్ని. ఇన్ని రోజులు అభితో మాట్లాడకుండా ఉన్నది ఇప్పుడే. బిగ్‌బాస్ షోలో రోజూ చూస్తూనే ఉన్నాను. కానీ మాట్లాడలేకపోవడంతో డిజప్పాయింట్మెంట్కు లోనయ్యాను. బిగ్‌బాస్ చాలెంజ్ అభికి కాదు అసలైన చాలెంజ్ నాకే’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. ‘‘అభిని నేను తీర్చిదిద్దానని చెప్పడం కంటే రిషీ వ్యాలీ స్కూలే అలా తీర్చిదిద్దింది. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఒంటపట్టించుకున్నాడు. స్వతంత్ర వ్యక్తిత్వంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన మానసిక పరిపక్వత వచ్చింది. ఆ లక్షణాలే అభిని ఈ రోజు విజేతగా నిలిపాయి’’ అన్నారామె సంతోషంగా. ‘‘తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. వెంటనే స్పందిస్తాడు. రోడ్డు మీద ఎవరైనా రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నా కూడా వెంటనే వెళ్లి వాళ్లతో ‘ఇలా చేయడం తప్పు’ అంటాడు. అలాగని ఊరికే గొడవలు పడడు. స్వతహాగా తను స్మార్ట్ బాయ్, క్వైట్ కూడా’’ అన్నారు తండ్రి మన్మోహన్. (చదవండి: బిగ్‌బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం) ఇదీ కుటుంబం అభిజీత్ పూర్వికులు హైదరాబాద్ స్థానికులు. ముత్తాతలు చార్మినార్ నిర్మాణంలో భాగస్వాములు. తాత నాగయ్య ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్, దోమల్‌గూడలో తాత నాగయ్య దాదాపుగా ఎనభై ఏళ్ల కిందట కట్టిన ఇంట్లోనే ఇప్పుడు అభిజీత్ కుటుంబం నివసిస్తోంది. తండ్రి మన్మోహన్ భవన నిర్మాణ రంగం నుంచి వ్యవసాయరంగానికి మారారు. అభిజీత్ తమ్ముడు అభయ్ వ్యవసాయం పనులు చూస్తున్నాడు. తల్లి ప్రసన్న కేటరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా గృహిణిగా ఉండిపోయారు. అభిజిత్ పెట్ లవర్. మంచి శివభక్తుడు, పోకర్ ఆటను ఇష్టపడే అభిజీత్‌కి బైక్ రేసింగ్ అంటే మంచి సరదా. స్థితప్రజ్ఞత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో గెలవడానికి తొందరపడకపోవడం, ఎలిమినేషన్ సమయంలో ఆందోళన పడకపోవడం... ఈ రెండు లక్షణాలూ అభిజీత్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలే అందరిలో ఒకడిగా కాకుండా అతడిని ఒకే ఒక్కడిగా నిలిపాయి. ముప్పై రెండేళ్లకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అలవడింది అని ముచ్చటపడేలా చేశాయి. ‘చదువుకున్నవాడినని అతడికి గర్వం ఎక్కువ’ అనే అభిప్రాయాలకు కూడా కారణమయ్యాయి. ‘ఇక్కడ అందరూ సమానమే’ అని ఒక సందర్భంలో నాగార్జున హెచ్చరించారు కూడా. అభిజీత్ నటించిన సినిమాల్లో కూడా ‘అతడు తన పాత్రకు తగినట్లు హుందాగా నటిస్తాడు. పాత్రోచిత నటనకే పరిమితమవుతాడు తప్ప సన్నివేశంలో తనను డామినేట్ చేసే ప్రయత్నం చేయడు, పాత్రను తేలిక చేయడు అని సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు అభిజీత్. – వాకా మంజులారెడ్డి, ఫీచర్స్ ప్రతినిధి -
'మిర్చిలాంటి కుర్రాడు' స్టిల్స్
-
'మిర్చిలాంటి కుర్రాడు' ఆడియో ఆవిష్కరణ