Abhijeet
-
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
పెళ్లి చేసుకోమని అమ్మ పోరు పెడుతోంది: అభిజిత్
కొన్ని విషయాల పట్ల నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటాను. నాకు నచ్చనిది ఏ పని చేయను. పెళ్లి విషయంలో కూడా ఇలానే ఉన్నాను. మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటుంది. నాకేమో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికే వరకు కాంప్రమైజ్ కాలేను. ఇంత సెలెక్టివ్ గా ఉండటం కూడా నాకు కొద్దిగా మైనస్ అవుతుంది’అని అన్నారు యంగ్ హీరో, ‘బిగ్‌బాస్’ ఫేమ్ అభిజిత్. చాలా కాలం తర్వాత ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా అభిజిత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ లో నేను రోహిత్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్ గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్ గా తీసుకోడు. రోహిత్ కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు. ► నా రియల్ లైఫ్ లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్ ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక...బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే అది 30-35 ఇయర్స్ లోనే చేయాలి. 40 దాటిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్నా చేయలేరు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి. ► ఈ మధ్య పెళ్లి గోల, మోడరన్ లవ్ అనే సిరీస్ లు చేశాను. ఆ తర్వాత నటించిన వెబ్ సిరీస్ ఇదే. "మిస్ పర్ఫెక్ట్" అనేది రొమాంటిక్ కామెడీ సిరీస్. ఏదైనా కథ విన్నప్పుడు నేను చేయగలనా, నాకు సెట్ అవుతుందా అనేది ఆలోచిస్తా. మనకు నచ్చనివి చేసి రిలీజ్ చేయడం ఈజీ. కానీ ఆడియెన్స్ కు నచ్చదు. వాళ్లు ఏదో చేసేస్తే చూసే ట్రెండ్ ఇప్పుడు లేదు. మనకు సెట్ అయ్యే మూవీ , క్యారెక్టర్ చేస్తేనే ఆదరిస్తున్నారు. ► బయటి వాళ్లకు నేను బాగా సెలెక్టివ్ అనుకున్నా సరే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఫిలింమేకర్స్ గా, యాక్టర్స్ గా మేము ముందు ఆ కథను పూర్తిగా నమ్మాలి. కన్విక్షన్ తో రూపొందించాలి. బ్యాడ్ కంటెంట్ ను ఆడియెన్స్ ఇష్టపడే పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం లేదు. ► ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ మంచి రోమ్ కామ్ ..అయితే ఇందులో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక అపార్ట్ మెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరుగుతుంది. క్యారెక్టర్స్ మధ్య నవ్వించే డైలాగ్స్ ఉంటాయి. ప్లెజంట్ గా ఎంటర్ టైనింగ్ గా ఎపిసోడ్స్ వెళ్తుంటాయి. షూటింగ్ మాత్రం సమ్మర్ లో చేశాం. ఆ హీట్ కు ఇబ్బందిపడ్డాం. ► లావణ్య త్రిపాఠీ నటన అంటే నాకు ఇష్టం. తను మంచి కోస్టార్. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేసే క్రమంలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను, తను దాదాపు ఒకే టైమ్ లో కెరీర్ స్టార్ట్ చేశాం. అయితే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్ ను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు. -
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ గురించి లావణ్య త్రిపాఠి మరియు అభిజీత్
-
పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్‌లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్‌నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
లావణ్య మిస్ పర్ఫెక్ట్
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి. ‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్‌కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా. -
మెగా కోడలు కొత్త వెబ్‌సిరీస్.. హీరోగా 'బిగ్‌బాస్' విన్నర్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మళ్లీ రంగంలోకి దూకేసింది. నవంబరులో మెగాహీరో వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. హనీమూన్, భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఇతర డీటైల్స్ త్వరలో వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏ సిరీస్? 'అందాల రాక్షసి' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. మిడ్ రేంజ్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అయితే 2016లో 'మిస్టర్' షూటింగ్ టైంలో మెగాహీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. అప్పటినుంచి 2023 జూన్ వరకు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారు. ఎంగేజ్మెంట్తో తమ రిలేషన్‌ని అఫీషియల్ చేశారు. నవంబరు 1న ఇటలీలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) ఇదే చివరి సిరీస్? 2022లో 'హ్యాపీ బర్త్ డే' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన లావణ్య త్రిపాఠి.. గతేడాది ఒక్క మూవీలో నటించలేదు. కాకపోతే 'పులిమేక' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్‌లో ఈమెదే మెయిన్ లీడ్ అని తెలిసింది. తాజాగా ఫస్ట్ లుక్ బట్టి చూస్తే బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్.. లావణ్యకు జోడీగా నటించనున్నాడు. అయితే లావణ్య త్రిపాఠి చేతిలో ప్రస్తుతం 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్‌తో పాటు 'తనల్' అనే తమిళ మూవీ మాత్రమే ఉంది. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదు. అంటే ఈ రెండు చేసిన తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా అని డౌట్ వస్తుంది. లావణ్య కొత్త సినిమాలు చేసిన దానిబట్టి దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) Starting this new year on a perfect note! Miss Perfect sir, Miss Perfect anthe 👌#MissPerfectonHotstar Coming Soon only on #DisneyPlusHotstar@Abijeet @abhignya_v #VishvakKhanderao @AnnapurnaStdios #SupriyaYarlagadda @adityajavvadi @prashanthvihari @disneyplushstel pic.twitter.com/An6XjCbWuk — LAVANYA (@Itslavanya) January 3, 2024 -
అనారోగ్య సమస్యలతో బిగ్‌బాస్-4 విజేత అభిజిత్
Bigg Boss Fame Abhijeet About His Movies: 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడడం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. మిస్టర్ కూల్‌తో పాటు మిస్టర్ పర్ఫెక్ట్గా ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్న అభిజిత్ బిగ్‌బాస్ సీజన్-4 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. షో అనంతరం మిగతా కంటెస్టెంట్లు పలు బర్త్‌డే, ప్రైవేట్ పార్టీల్లో పాల్గొంటే అభిజిత్ మాత్రం ఎక్కువగా కనపడలేదు. అంతేకాకుండా సోహైల్, అఖిల్, అరియానా సహా పలువురు కంటెస్టెంట్లు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారితే, సీజన్ విన్నర్‌గా నిలిచిన అభిజిత్ మాత్రం సెలైంట్ అయిపోయాడు. ఆ మధ్య మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు చెప్పిన అభిజిత్ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ట్విట్టర్లో 'ఆస్క్ మి ఎనీథింగ్' అనే సెషన్‌ను నిర్వహించిన అభిజిత్‌కు ఫ్యాన్స్ నుంచి కుప్పలు తెప్పలుగా క్వశ్చన్స్ వచ్చి పడ్డాయి. సినిమా అప్డేట్ గురించి చెప్పాల్సిందిగా పలువురు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన అభిజిత్.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తనకు ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం అని తెలిపాడు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో మాత్రం అభిజిత్ క్లారిటీ ఇవ్వలేదు. Guys, thanks so much for coming. It’s really difficult to see all your tweets but I can tell you that I have tried very much to reply to everyone. I only have one thing to say right now, my body is my only priority. Health is wealth 🙏🏽 — Abijeet (@Abijeet) September 12, 2021 -
ఆర్జే కాజల్‌ను ఆడేసుకుంటున్న అభిజిత్ ఫ్యాన్స్!
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే ఏ విషయంలోనైనా అతిగా ఉండకూడదు అని! కానీ అతి ఎగ్జయిట్‌మెంట్‌తో ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది ఆర్జే కాజల్. తనకు బిగ్‌బాస్ షో అంటే ఎంతో ఇష్టమని, అలాంటిది ఆ షోలో తను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తొలి రోజే ఉబ్బితబ్బిబ్బైపోయింది కాజల్. హౌస్ అంతా కలియతిరుగుతూ అందరితోనూ మాట కలుపుతూ హడావుడి చేస్తోంది. అయితే ఆమె ఉత్సుకత మిగతావారికి మింగుడు పడటం లేదు. ఇదంతా ఏదో కావాలని చేస్తున్నట్లు ఉందని కొందరు కంటెస్టెంట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో హౌస్‌లో ఆమె ఏం చేసినా ఒకరకంగా దాన్ని ఓవరాక్షన్ అనే వర్ణిస్తున్నారు. వాళ్లే కాదు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఇదే అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో 'బిగ్‌బాస్ తన కలల హౌస్' అంటూ డ్రీమ్ కార్డ్ వాడిన ఆమె, నేటి ప్రోమోలో కన్నీళ్లు పెట్టుకుని చైల్డ్ కార్డ్ వాడుతోందంటూ సెటైర్లు వేస్తున్నారు. గత సీజన్లో అభిజిత్ పీఆర్ టీమ్ పెట్టుకున్నాడంటూ నెగెటివిటీ వ్యాప్తి చేసిన ఆమెను అభి ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. పైగా తొలి రోజే కాజల్ అందరి దగ్గరకు వెళ్లి వారి పర్సనల్ విషయాల కూపీ లాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె హౌస్‌లో ఓ వైరస్ లాంటిదని, వీలైనంత తొందరగా తనను బయటకు పంపించేయండని అభి ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కాజల్ అభిమానులు మాత్రం ఈ ట్రోలింగ్‌ను గట్టిగా తిప్పికొడుతున్నారు. ఆమె మీద ఇంత విషం చిమ్మడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. తన ఎగ్జయిట్‌మెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆమె ఆటతీరు చూశాక మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. మరి ఈ నెగెటివిటీ నుంచి కాజల్ ఎలా బయటపడుతుంది? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. Odiyamma badava idendayya idi😂 Iddaru strong ani nominate chestene vallani nominate chesav kada Khaja akka... Alantidi enno valid points tho nominate chesina #Abijeet ni ennesi matalu annav#BiggBoss Nee dream aithey Pakkodidhi enti ?icecream ha??#BiggBossTelugu5 #RJKajal pic.twitter.com/O6AHUxor3Y — Vamc Krishna (@vamccrishnaa) September 7, 2021 Karma hits back like BOOMERANG 🪃 @RJKajal tanu tesukunna gotilo thane padutundi🤣#kajalions #5muchdrama #BiggBossTelugu5 #biggboss5telugu #RJKajal pic.twitter.com/v6TgzJhL0O — PeddaDora (@DoraPedda) September 7, 2021 #Abijeet ni PR team ani cheppi negative ga spread chesina #RJKajal pakka preplanned ga motham PR set chesi ochindhi! #BiggBossTelugu5 'You don't have a point you need a point ' Nee dramal ki evdu karagadu! Infront there is crocodile festival.. pic.twitter.com/y5FvDEPvMF — Vamsi (@Darlingvamsi38_) September 7, 2021 5 much negativity on #Abijeet in Her Reviews kanipinchaledha 😌😌#RjKajal #BiggBossTelugu5 https://t.co/Oc9CxHJXks — Rooba_Rooba (@rooba_rooba) September 7, 2021 Bigg Boss ni pindesi ochina contestant laga ayite naku kanipinchaledu RJ Kajal. Emotions fake anipinchayi and also logic behind her nominations is the worst !!! #RJKajal #BiggBossTelugu5 #biggboss5telugu #BiggBossTeluguSeason5 — Hydrocker (@Hyd_Rocker) September 6, 2021 -
హల్చల్ : సోనమ్ సొగసులు..దీప్తి సునయన వయ్యారాలు
♦చీర కట్టులో దీప్తి సునయన ♦ తమ్ముడి షర్ట్‌ను దొంగతనం చేసిన అనుపమ ♦ క్యూట్ లుక్స్‌లో సనయా ఇరానీ ♦ పొలం దున్నుతున్న అభిజీత్ ♦ బ్రేక్ ఫాస్ట్‌తో తమన్నా.. ఆ షో కోసమేనా? ♦ వోగ్ ఫోటో షూట్లో సోనమ్ కపూర్ ♦ నిషా అగర్వాల్‌ను పొగిడేస్తున్న కాజల్ View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by pradeep machiraju (@pradeep_machiraju) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
సోషల్ హల్చల్ : ఆర్జీవీతో అరియానా జిమ్.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ
మొదటి స్టెప్ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. పెంచ్ మెమోరీస్ అంటూ హాట్ ఫోటోని షేర్ చేసింది శ్రీముఖి ముళ్లు లేని గులాబీని పొందలేము అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్‌ని షేర్ చేసింది లక్ష్మీరాయ్ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసిందంటూ ఆయనతో జిమ్ చేస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకుంటి బిగ్‌బాస్ బ్యూటీ అరియానా మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
కరోనా: గొప్ప మనసు చాటుకున్న బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు మరోసారి నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలంలో పేద కటుంబాలను ఆదుకునేందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ తన ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేటకు చెందిన ముడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసి వారి అవసరాన్ని తీర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు అభిజిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘మూడు కుటుంబాలు నిత్యవసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న సాయంత్రం సిద్దిపేట నుంచి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను నాకు తెలిసిన యువకులను దీని గురించి తెలుసుకోమ్మని చెప్పాను. తెల్లారి లేచే సరికి ఈ ఫొటోలు, వీడియొలు నాకు పంపించారు. ఇందుకు సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
ఏదైతే భయపడ్డానో అదే జరిగింది: అభిజిత్
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ తల్లి కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. "ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా" "ఇకపోతే ఈ కోవిడ్ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్ నేర్చుకుంటున్నాను" అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్!
తెలుగు నాట బిగ్‌బాస్ రియాలిటీ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ వస్తుందంటే చాలు సీరియళ్లకు ఫుల్స్టాప్ పెడ్తూ రిమోట్ మార్చేస్తుంటారు. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ హౌస్‌లోకి వీళ్లే నేరుగా ప్రవేశించినంత సంబరపడిపోతుంటారు. ఇక వారి ఫేవరెట్ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వస్తే వాళ్ల ఆనందాన్ని మాటలో చెప్పలేము. హాట్‌స్టార్ ఓట్లు మాత్రమే కాదు మిస్డ్ కాల్స్ కూడా ముఖ్యమేనంటూ లోపల ఉన్న పోటీదారులను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించేందుకు నానా రకాలుగా కష్టపడుతారు. మొత్తానికి తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అందరూ ఊహించినట్లుగానే అభిజిత్ విజేతగా అవతరించాడు. కానీ సోహైల్ రూ.25 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకోవడంతో అభిజిత్ ప్రైజ్‌మనీలో కోత పడింది. దీంతో అతడు కూడా పాతిక లక్షలు తీసుకుని ట్రోఫీని పట్టుకెళ్లిపోయాడు. షో తర్వాత తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అభిజిత్ నోరెళ్లబెట్టాడు. తనను గెలిపించిన ప్రేక్షకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని వారి మీద ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే అతడు సినిమాల్లోకి వస్తే చూడాలని ఉందని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తుండగా అభిజిత్ మాత్రం పలు కారణాలు చెప్తూ తన దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అభిజిత్ ఏకంగా నాగార్జునతో డీల్ కుదుర్చుకున్నాడట. అవును, నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఓ మూడు సినిమాలు చేసేందుకు అభిజిత్ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి దర్శకులను వెతికే పనిలో పడ్డారట. అంటే దర్శకులు దొరికేయగానే అభిజిత్ ఒకేసారి మూడు ప్రాజెక్టుల్లో పని చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉండబోతున్నాడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అన్నపూర్ణ స్టూడియోస్ అభిజిత్‌తో ఓకేసారి మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకోవడమంటే మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు? బిగ్‌బాస్ నాల్గో సీజన్లో బుద్దిబలంతో టాస్కులు గెలవడంతో పాటు అమ్మాయిల మనసు దోచుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ అభిజిత్. చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటో ఆయన అభిమానులకు విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ ప్రేమ అన్న క్యాప్షన్‌తో ఈ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కాగా ఓ స్పెషల్ ఎపిసోడ్లో అభి అమ్మ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. మీరు కొట్టుకోండి, అదే కదా మజా అంటూ కంటెస్టెంట్లతో ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో ఆమె కూడా పాపులర్ అయింది. (చదవండి: బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్) కేవలం ఎక్స్పీరియన్స్ కోసమే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చానన్న అభి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ప్రేక్షకులు చూపించిన ప్రేమలో తడిసి ముద్దైన అతడు సోషల్ మీడియాలో వారికి నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్ ప్రయాణంలో తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా కలుసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మధ్యే తన స్నేహితుడు, క్రికెటర్ హనుమ విహారిని కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అభి వీరాభిమాని అని తెలిసిన హనుమ విహారి ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ చెవిన వేశాడు. దీంతో రోహిత్ అభికి ఫోన్ చేసి మాట్లాడటమే కాక ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. (చదవండి: ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్
బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజేతగా మిస్టర్ కూల్ అభిజిత్ ఊహించని వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడటమే కాకుండా.. ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. ఈ విషయాన్ని అభిజీతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గురించి రోహిత్ శర్మకు చెప్పిన తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ధన్యవాదాలు తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ, హనుమ విహారికి మధ్య జరిగిన సంభాషణలో బిగ్‌బాస్ షో గురించి చర్చకు వచ్చిందట. ఈ సందర్భంగా బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్‌కు చెప్పాడట హనుమ విహారి. అంతేకాకుండా అతను తనకు పెద్ద ఫ్యాన్ అన్న విషయం కూడా చెప్పాడట. దీంతో రోహిత్ అభిజిత్‌కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపాడట. అలాగే అతన్ని అభినందిస్తూ తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్... రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్వీటర్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్నం అన్న విషయం తెలిసిందే. రోహిత్ మహారాష్ట్రలోనే పుట్టిపెరిగినప్పటికీ.. తెలుగు మూలాల కారణంగా అతడికి తెలుగు అర్థం అవుతుంది. అంతే కాదు గతంలో అతడు డెక్కర్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్లో కూడా ఆడాడు. DAY MADE. The Hitman @ImRo45 says Hello from Australia! Thanks for this wonderful gift @Hanumavihari!! Get well soon. You showed amazing character at the highest level of the game, in a pressure situation. Contnd. pic.twitter.com/GMAVS6hgt8— Abijeet (@Abijeet) January 14, 2021 -
రౌడీ హీరోను కలిసిన అభిజిత్
బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజేతగా మిస్టర్ కూల్ అభిజిత్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయగలిగే నైపుణ్యం, హుందాగా మాట్లాడే వైఖరి, అన్నింటికీ మెంచి తెలివి.. అతడికి విజయాన్ని తెచ్చి పెట్టాయి. అయితే షో నుంచి బయటకు వచ్చాక తనకు వస్తున్న మద్దతు చూసి అభి ఆశ్చర్యపోయాడు. అభిమానుల కురిపిస్తున్న ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు. హౌస్‌లో అతడు వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబబ్రిటీలు కూడా మంత్రముగ్దులవడం విశేషం. ఇక షో ముగిశాక అభిజిత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారాడు. అదే సమయంలో తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను సైతం కలుస్తున్నాడు. (చదవండి: మెహబూబ్ సైగలపై సోహైల్ రియాక్షన్) మొన్న నాగబాబును కలిసిన అభి నిన్న హీరో విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఈ మేరకు అతడితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ 'ఫుల్ చిల్' అని రాసుకొచ్చాడు. కాగా రౌడీ హీరో విజయ్.. అభి హౌస్‌లో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా అతడికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక అభి హీరోగా నటించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న నెగెటివ్ పాత్రలో నటించారు. ఆ సినిమాతో ఇద్దరూ క్లోజ్ అయ్యారు. అయితే మరోసారి రౌడీ విజయ్, పులి అభి కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని అభిమానులు కోరుతున్నారు. ఇదిలా వుంటే క్రిస్మస్ రోజు అభి సాంటాక్లాజ్గా మారిపోయి బహుమతులను పంచాడు. అనాథ శరణాలయాలను సందర్శించి అక్కడి పిల్లలతో వేడుకలు జరుపుకున్నాడు. చాక్టెట్లు, బ్యాడ్మింటర్ రాకెట్స్, క్యారమ్ బోర్డులు, ఇతర ఆటవస్తువులు సహా పలు బహుమతులు అందించాడు. (చదవండి: బిగ్‌బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్) -
అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్! దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్ బిగ్‌బాస్ 4 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు. కానీ షో నడిచే కొద్దీ జనాలు వారికి తెలీకుండానే కంటెస్టెంట్లకు అభిమానులుగా మారిపోయారు. వారిని ఎలాగైనా గెలిపించాలన్న కసితో సోషల్ మీడియాలో ఆన్లైన్ యుద్ధాలు చేశారు. అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మనసున్న దోచుకున్న అభిజితే విజేతగా అవతరించాడు. అయితే సీజన్ అలా ముగిసిందో లేదో వరుస ఆఫర్లు కంటెస్టెంట్ల ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సోహైల్ సినిమాలో ఒక్క రూపాయి తీసుకోకుండా నటిస్తామని మెగాస్టార్ చిరంజీవి, కమెడియన్ కింగ్ బ్రహ్మానందం మాటిచ్చారు. అటు దివి కూడా మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. సామ్‌తో అభిజిత్ ఈ క్రమంలో విన్నర్ అభిజిత్‌కు సైతం బంపరాఫర్ తగిలినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్‌జామ్‌కు అభిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈమేరకు ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఈ బిగ్‌బాస్ స్టార్ త్వరలోనే సమంతతో సందడి చేయనున్నాడు. ఓటీటీ వేదిక ఆహాలో నిర్వహిస్తున్న సామ్‌జామ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదటి అతిథిగా హాజరయ్యారు. తర్వాత రానా, తమన్నా, రాకుల్ ప్రీత్‌సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు సామ్ షోలో మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోలో పాల్గొనగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది. చూస్తుంటే త్వరలోనే అభి కూడా ఈ షోలో ప్రత్యక్షమవనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే) అభికి సినిమా ఆఫర్లు కాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో వెండితెరకు పరిచయమైన అభిజిత్ తర్వాత కనిపించకుండా పోయాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు బిగ్‌బాస్‌ను వేదికగా మలుచుకున్నాడు. హౌస్‌లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఎక్కడా నోరు జారకుండా, గొడవల్లో దూరకుండా, మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ, తెలివిగా టాస్క్‌లు ఆడుతూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఆయన సహనం, ప్రేమ, తెలివి, వ్యక్తిత్వం అన్నింటినీ మెచ్చి జనాలు బ్రహ్మరథం పట్టారు. అతడిని గెలిపించారు. ఇది అతడి లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ కానుంది. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి..పలువురు దర్శకనిర్మాతలు అభికి కథలు వినిపిస్తున్నారట. ఈ క్రమంలో ఓ మంచి సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు అభి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అభికి మళ్లీ హిట్ దొరికి హీరోగా నిలదొక్కుకోగలిగితే అతడి లైఫ్ మరింత బ్యూటిఫుల్ అవడం ఖాయం! (చదవండి: 'విజయ్ దేవరకొండను కిస్ చేయాలని ఉంది') -
బిగ్‌బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో మొదట్లో అభిజిత్-మోనాల్-అఖిల్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఎంత హైలెట్ అయిందో చెప్పనక్కర్లేదు. గంట సేపు ప్రసారమయ్యేలో షోలో.. ఈ ముగ్గురికే ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఇచ్చేవాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఎత్తుగడను పసిగట్టిన మిస్టర్ కూల్ అభిజిత్.. మోనాల్‌తో కాస్త దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. దీంతో అఖిల్- మోనాల్ ప్రేమాయణాన్ని హైలెట్ చేసి చూపించాడు బిగ్‌బాస్. ఇక వీరిద్దరంతా కాకపోయినా.. అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. నోయల్, లాస్య ఎలిమినేట్ అయ్యాక అభి, ఎక్కువగా హారికతోనే గడిపాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న మాటలు, హగ్‌లు, ముద్దులను హైలెట్ చేసి చూపించాడు బిగ్‌బాస్. దీంతో అభికి హారిక మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే) ఇక ఆ పుకార్లు నిజమే అన్నట్లు హారిక కూడా అభిజిత్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోయింది. చాలా సందర్భంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను హైలైట్ చేస్తూ ఏదో నడుస్తుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు బిగ్ బాస్. దీంతో అభి-హారిక పేర్లను ఏకం చేసి అభిక అని ఫ్యాన్స్ పేజ్‌లు కూడా వచ్చేశాయి. వీరిద్దరూ కొత్త లవ్ ట్రాక్ మొదలుపెట్టారని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక వీరిద్దరి పేరెంట్స్ కూడా పరోక్షంగా వాళ్లు లవ్‌లోనే ఉన్నారని ఒప్పేసుకున్నారు. హారిక లాంటి కోడలు కావాలని అభి తల్లి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే హారిక తల్లి చెప్పడంతో వీరద్దరి గుండెల్లో గంట మోగిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఇదంతా తప్పని, బిగ్‌బాస్ తమ రిలేషన్‌ని వేరేలా చూపించారని చెబుతున్నాడు నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్. తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైం స్పెండ్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్‌లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు. రేటింగ్ కోసమే బిగ్‌బాస్ అభి, హారిక రిలేషన్‌ని వేరుగా చూపించినట్లు అర్థమవుతుంది. -
బిగ్‌బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేకు గ్రాండ్ ఫినాలే వేడుకలో సినీ తారలు అదిరిపోయే ప్రదర్శనతో అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ రియాలిటీ షో విజేతగా యువ హీరో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ట్రోఫీ కోసం 19 మంది బరిలోకి దిగి చివరికి ఫినాలే వరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. అయితే ఈ ఐదుగురు బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీకి తీవ్రంగా కృషి చేశారు. కానీ చివరు గెలుపు మాత్రం మిస్టర్ కూల్ అభిజిత్‌ను వరించింది. అయితే ఇది ఒక వారం రోజులు పాటు చూసిన ఇచ్చిన ట్రోఫి కాదు. 105 రోజుల పాటు అతని ఆట తీరు, ప్రవర్తను బట్టి బిగ్‌బాస్ ట్రోఫీ లభించింది. మరి అంతమందిలో అభి మాత్రమే ఎలా విజయం సాధించాడు. అసలు ఆయన బిగ్‌బాస్ జర్నీలో ట్రోపి కొట్టడానికి ఉపయోగపడ్డ అంశాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం బుద్ది బలంతో కొట్టాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్‌ను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పడు కూడా అభిజిత్‌పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. షో ఆరంభంలో అతడిపై ఎలాంటి అంచనాలూ లేవు. షో హైపు కోసం, అమ్మాయిలతో ట్రాకులు నడపడం కోసమే అభిని ఎంచుకున్నారని అనుకున్నారు. కానీ క్రమ క్రమంగా అభిజిత్ టాలెంట్ బయటపడింది. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడడం ప్రేక్షకులను ఆకర్షించింది. మాస్టర్ మైండ్‌తో అతడు తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాస్క్ వచ్చిందంటే చాలు అందులో ఈజీగా ఎలా గెలవచ్చు అనేదానిపై అభి ఫోకస్ ఉండేది. అత్యధిక సార్లు నామినేషన్లో బిగ్‌బాస్‌లో అత్యంత కీలకమైనది నామినేషన్. ప్రతి సోమవారం జరిగే ఈ నామినేషన్ ప్రక్రియను చూసి ఇంటి సభ్యులంతా గజ గజ వణికిపోయేది.ఒక అభిజిత్ తప్ప. ఆయన నామినేషన్‌ను సానుకూలంగా స్వీకరించేవాడు. సరైన కారణాలతో ఇతరులను నామినేట్ చేసేవాడు. ఎవరైనా తనను నామినేట్ చేసినా మిగతా వాళ్లలాగా గొడవకు దిగకుండా.. నామినేషన్లను స్వాగతించేవాడు. అభిజీత్‌ను హౌస్మేట్స్ అంతా కలిసి 11 సార్లు నామినేట్ చేశారు. నామినేషన్ జరిగిన 14 వారాల్లో 11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇది కూడా అతడి విజయానికి కారణమైంది. గత రెండు సీజన్ల విన్నర్లు రాహుల్, కౌషల్ కూడా 11 సార్లు నామినేట్ కావడం గమనార్హం. మిస్టర్ కూల్‌గా పేరు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అతి తక్కువ గొడవలు పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఒక అభిజితే అని చెప్పొచ్చు. ఒక్క నామినేషన్ టాస్కుల్లో తప్ప ఆయన ఎప్పుడూ ఎవరితో గొడవపడలేదు. కామ్‌గా ఉంటూ.. నామినేషన్‌ను కూడా సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. క్లిష్ట సమయంలోనూ సహనాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఓట్లను సంపాదించాడు. అలాగే లవ్ ట్రాకులకు ఆయన దూరంగా ఉన్నాడు. మోనాల్ విషయంలోనూ అభి నిర్ణయం అందరిని అబ్బురపరిచింది. అఖిల్ ఆమెకు దగ్గరైనప్పుడు అభి దూరంగా ఉంటడం. ఆమెపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం కలిసొచ్చింది. ఇక అఖిల్, మోనాల్ ప్రవర్తన కూడా అభికి ప్లస్ అయింది. ఒక్క టాస్క్... అభిని హీరో చేసింది నాల్గో సీజన్ మొత్తంలో అతి తక్కువగా టాస్క్‌లు ఆడింది మాత్రం అభిజిత్. ఇందులో సందేహం లేదు. మిగతావాళ్లు వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడినా.. అభి మాత్రం ఫిజికల్ టాస్కులు మాత్రం అంతగా ఆడేవాడు కాదు. కానీ ఒకే ఒక టాస్క్ అభికి మంచి పేరు తెచ్చి విజయానికి కారణమైంది. అదే రోబో టాస్క్. బిగ్ బాస్ ఇచ్చిన రోబో టాస్క్‌లో అతడు దివిని కిడ్నాప్ చేయడం పెద్ద సంచలనం అయింది. అప్పుడు సోహెల్, మెహబూబ్, అఖిల్, మోనాల్‌లు అతడిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో కొట్టేందుకు మీదకెళ్లారు. కానీ అభి మాత్రం తన సహనంతో గేమ్ ప్లాన్‌ను వివరించాడే తప్ప.. గొడవకు సై అనలేదు. అప్పుడే అభి పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి పెరిగింది. గేమ్‌ను గేమ్‌లాగే ఆడాడని అతనికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. నోయల్, లాస్యల ఫ్రెండ్షిప్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నోయల్, లాస్యల మద్దతు కూడా అభికి కలిసొచ్చింది. హౌస్‌లో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడినా.. అందరితో మాత్రం అభి టచ్‌లో ఉండేవాడు. అతను అంతగా మాట్లాడనప్పటికీ అభిపై మాత్రం ఇంటి సభ్యులకు కోపం ఉండేది కాదు. ప్రతి ఒక్కరు అభితో ఫ్రెండ్షిప్ చేయడానికే ఇష్టపడేవారు. ఇక నోయల్ అయితే తన సపోర్ట్ అభిజిత్‌కే అని బహిరంగంగా చెప్పేశాడు. అభి గెలుపును తన భుజానా వేసుకుంటానని, అయన ఇంట్లో గేమ్ ఆడితే తాను బయట అతనికి చేయాల్సిన సాయం చేస్తానని నాగార్జున ముందే చెప్పేశాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా. కలిసొచ్చిన సినీ పెద్దల మద్దతు ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు అభి గురించి పాజిటివ్‌గానే చెప్పారు కానీ నెగెటివ్‌గా ఒక్కరు కూడా చెప్పకపోవడం కూడా అభికి ఓట్లు పడేలా చేశాయి. వీటితో పాటు సినీ ప్రముఖుల సపోర్టు కూడా అభికి కలిసొచ్చింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మెగా బ్రదర్ నాగబాబు, శ్రీకాంత్ సహా ఎంతో మంది అతడికి సపోర్ట్ చేశారు. నాగబాబు అయితే అవినాష్‌కి ఓట్లు వేయమని చెబుతూనే.. తనకు మాత్రం అభిజితే ఇష్టమని చెప్పాడు. అతను బాగా ఆడుతున్నాడని, తన ప్రవర్తన బాగా నచ్చిందని అభిని ఆకాశానికెత్తేశాడు. ఇక ప్రతి సీజన్‌ని ఫాలో అయ్యే శ్రీకాంత్ సైతం అభికే నా ఓటు అటు తేల్చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతన్ని గెలిపించమని అభిమానులకు పిలుపునిచ్చారు. మొత్తానికి అభి ప్రవర్తననే ఆయన గెలుపుకు కారణమని చెప్పొచ్చు. -
బిగ్‌బాస్: అభిజిత్ రెమ్యునరేషన్ ఎంతంటే..
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్ సీజన్ 4 డిసెంబర్ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 29 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. 25 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ఓ బైక్ గెలుచుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. టాప్ 5 కంటెస్టెంట్లందరికిరు హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం గ్రాండ్‌గా బ్యాండ్ బాజాలతో ఇంటికి పయనమయ్యారు. చదవండి: బిగ్‌బాస్: అభి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా కాగా అభిజిత్ తన వ్యక్తిత్వంతో షో ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను దక్కించుకున్నాడు. చివరి వరకు అభిజిత్‌పై అదే అభిమానం కురిపిస్తూ అతన్ని విజయ తీరానికి నడిపించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్‌దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ ముగిసినప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విన్నర్‌గా నిలిచిన అభిజిత్ షో మొత్తం రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విజేతగా నిలిచిన అభిజిత్ బిగ్‌బాస్ షో కోసం వారానికి 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 106 రోజులకు 60 లక్షలు, ప్రైజ్ మనీ 25 లక్షలు కలిపి మొత్తం 85 లక్షలు అభికి మూటజెప్పినట్లు టాక్. వాస్తవానికి బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కంటే హౌజ్‌లో ఉన్నందుకే అభి అధికంగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అదే విధంగా టీవీ యాంకర్ లాస్యకు ఒక వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ కూడా వారానికి ఏకంగా 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. -
ఇలా చేస్తుంటే కష్టం అన్నారు: బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్
ఒక విజయం కోసం 105 రోజుల ఎదురుచూపు, రోజూ పిల్లలాటలు, కుమ్ములాటలు. అలకలు, బుజ్జగింపులు, ఎలిమినేషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు... కొన్ని రాజీల మధ్య బిగ్‌బాస్ నాలుగో సీజన్ కూడా పూర్తయింది. విజేత అభిజీత్. కంటెస్టెంట్లందరూ ఇన్ని రోజులు ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా కలిసిపోయారు. ఒక్కో కంటెస్టెంటూ వెళ్లిపోతుంటే హౌస్‌లో ఉన్న తోటి కంటెస్టెంట్లతోపాటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఇన్ని అడ్డంకులనూ దాటుకుని విజేతగా నిలిచిన అభిజీత్‌కు తెర ముందు కనిపించే ప్రశంసలతోపాటు తెర వెనుక కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయం అందరిదీ అదృష్టం అనాలో దేవుడి రాత అనాలో తెలియదు కానీ, నా ప్యాషన్‌ని ప్రదర్శించడానికి మంచి అవకాశం వచ్చింది. మనకేది ఇష్టమో అదే చేయాలి. ఆ పనిని పర్ఫెక్ట్గా చేయాలి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగలగడం అంత సులభం ఏమీ కాదు. సవాళ్లతో కూడుకున్న పని, చాలా కష్టమైన విషయమే, అయితే ఇది చాలా మంచి అనుభవం. హౌజ్‌లో ఉన్నంత కాలం ఇంట్లో వాళ్లందరూ గుర్తుకువచ్చారు. ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నేను విజేతగా నిలవడానికి నాకు తెలియని వాళ్లు కూడా సహాయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. – అభిజీత్ బిగ్‌బాస్ 4 విజేత తనే అవుతాడని అభిజీత్ అనుకున్నాడో లేదో కానీ, వాళ్ల అమ్మ లక్ష్మీప్రసన్న మాత్రం బలంగా నమ్మారు. ఎందుకంటే అతను హౌస్‌లోకి వెళ్లిన కొద్దిరోజులకే ‘మా అబ్బాయిని 105 రోజులపాటు మిస్ అవుతున్నాం’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హౌస్‌లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించా’నని ఇప్పుడు చెప్పారు లక్ష్మీ ప్రసన్న. అభిజీత్ విజేతగా నిలవడంతో అతని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. బ్యూటిపుల్ లైఫ్ అభిజీత్... మదనపల్లెలోని రిషీవ్యాలీ స్కూల్లో చదివాడు. హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కాలేజ్ తరవాత జేఎన్టీయూలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో! ఫైనల్ ఇయర్లో ఉండగానే ఫ్రెండ్‌తో కలిసి సరదాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఆడిషన్కెళ్లాడు. శేఖర్ కమ్ముల అంచనా తప్పలేదు. స్పార్క్ ఉన్న కుర్రాడిని చేజార్చుకోలేదతడు. అలా తెర మీదకొచ్చాడు అభిజీత్. ఇదంతా జరిగింది 2012లో. ఆ సినిమా పూర్తయిన తర్వాత తిరిగి చదువుకోసం అమెరికాకి వెళ్లాడు. మసాచుసెట్స్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అభిజీత్. ఆ తర్వాత మళ్లీ ‘రామ్‌లీలా, మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాలు చేశాడు. మూడేళ్ల కిందట వెబ్ సీరీస్ ‘పెళ్లిగోల’లో నటించాడు. అవి మూడు సీజన్లు పూర్తయ్యాయి. అంతలో బిగ్‌బాస్‌లో సహజ నటనకు తెరతీశాడు. ఇక ఆ తర్వాత అభిజీత్ అందరికీ తెలిసిన వాడయ్యాడు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) ప్రిన్సిపల్ నుంచి ఫోన్ అభిజీత్ గురించి ఎవరికీ తెలియని ఓ సరదా సంఘటన రిషీవ్యాలీ స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది. పిల్లల్లో ఓ కుర్రాడు ‘ఎవరికైనా ధైర్యం ఉంటే ఆ పోల్ ఎక్కగలరా’ అన్నాడు. ఆ చాలెంజ్‌ని స్వీకరించి స్తంభాన్ని ఎక్కేశాడు అభిజీత్. అది ప్రిన్సిపల్‌కి తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ‘మీ వాడిని చదువు విషయంలో తప్పుపట్టడం లేదు. కానీ అల్లరి ఎక్కువ. ఇలా చేస్తుంటే కష్టం’ అన్నారు. పిల్లల చురుకుదనం తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది. కానీ మరీ ఇంత చురుగ్గా ఉంటే సంతోషంతోపాటు భయం కూడా వెంటాడుతుంటుంది. ‘‘మా అభి సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గెలవాలనే ఆకాంక్ష మెండు. అతడు హౌస్‌లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించాను. నా మనసుకు అలా అనిపించింది’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. స్కూల్ నేర్పిన పరిణతి ‘‘రిషీవ్యాలీ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా రోజూ ఫోన్లో మాట్లాడేదాన్ని. యూఎస్‌లో ఉన్నన్ని రోజులు రోజూ వీడియో కాల్లో మాట్లాడేదాన్ని. ఇన్ని రోజులు అభితో మాట్లాడకుండా ఉన్నది ఇప్పుడే. బిగ్‌బాస్ షోలో రోజూ చూస్తూనే ఉన్నాను. కానీ మాట్లాడలేకపోవడంతో డిజప్పాయింట్మెంట్కు లోనయ్యాను. బిగ్‌బాస్ చాలెంజ్ అభికి కాదు అసలైన చాలెంజ్ నాకే’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. ‘‘అభిని నేను తీర్చిదిద్దానని చెప్పడం కంటే రిషీ వ్యాలీ స్కూలే అలా తీర్చిదిద్దింది. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఒంటపట్టించుకున్నాడు. స్వతంత్ర వ్యక్తిత్వంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన మానసిక పరిపక్వత వచ్చింది. ఆ లక్షణాలే అభిని ఈ రోజు విజేతగా నిలిపాయి’’ అన్నారామె సంతోషంగా. ‘‘తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. వెంటనే స్పందిస్తాడు. రోడ్డు మీద ఎవరైనా రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నా కూడా వెంటనే వెళ్లి వాళ్లతో ‘ఇలా చేయడం తప్పు’ అంటాడు. అలాగని ఊరికే గొడవలు పడడు. స్వతహాగా తను స్మార్ట్ బాయ్, క్వైట్ కూడా’’ అన్నారు తండ్రి మన్మోహన్. (చదవండి: బిగ్‌బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం) ఇదీ కుటుంబం అభిజీత్ పూర్వికులు హైదరాబాద్ స్థానికులు. ముత్తాతలు చార్మినార్ నిర్మాణంలో భాగస్వాములు. తాత నాగయ్య ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్, దోమల్‌గూడలో తాత నాగయ్య దాదాపుగా ఎనభై ఏళ్ల కిందట కట్టిన ఇంట్లోనే ఇప్పుడు అభిజీత్ కుటుంబం నివసిస్తోంది. తండ్రి మన్మోహన్ భవన నిర్మాణ రంగం నుంచి వ్యవసాయరంగానికి మారారు. అభిజీత్ తమ్ముడు అభయ్ వ్యవసాయం పనులు చూస్తున్నాడు. తల్లి ప్రసన్న కేటరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా గృహిణిగా ఉండిపోయారు. అభిజిత్ పెట్ లవర్. మంచి శివభక్తుడు, పోకర్ ఆటను ఇష్టపడే అభిజీత్‌కి బైక్ రేసింగ్ అంటే మంచి సరదా. స్థితప్రజ్ఞత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో గెలవడానికి తొందరపడకపోవడం, ఎలిమినేషన్ సమయంలో ఆందోళన పడకపోవడం... ఈ రెండు లక్షణాలూ అభిజీత్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలే అందరిలో ఒకడిగా కాకుండా అతడిని ఒకే ఒక్కడిగా నిలిపాయి. ముప్పై రెండేళ్లకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అలవడింది అని ముచ్చటపడేలా చేశాయి. ‘చదువుకున్నవాడినని అతడికి గర్వం ఎక్కువ’ అనే అభిప్రాయాలకు కూడా కారణమయ్యాయి. ‘ఇక్కడ అందరూ సమానమే’ అని ఒక సందర్భంలో నాగార్జున హెచ్చరించారు కూడా. అభిజీత్ నటించిన సినిమాల్లో కూడా ‘అతడు తన పాత్రకు తగినట్లు హుందాగా నటిస్తాడు. పాత్రోచిత నటనకే పరిమితమవుతాడు తప్ప సన్నివేశంలో తనను డామినేట్ చేసే ప్రయత్నం చేయడు, పాత్రను తేలిక చేయడు అని సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు అభిజీత్. – వాకా మంజులారెడ్డి, ఫీచర్స్ ప్రతినిధి -
బిగ్‌బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం
బిగ్‌బాస్-4 సీజన్ ఆదివారంతో ముగిసింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో అభిజిత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, అభిజిత్‌కు దక్కాల్సిన ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో కోత పడింది. కంటెస్టెంట్లలో చివరగా అభిజిత్, అఖిల్, సోహైల్ మాత్రమే మిగలడంతో.. పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పడంతో. బిగ్‌బాస్ ఆఫర్‌ను స్వీకరించిన సోహైల్ పక్కకు తప్పుకునున్నాడు. ఇక అఖిల్, అభిజిత్ ఫైనలిస్టులుగా మిగలగా.. అభిని ట్రోఫీ వరించింది. అయితే, అభి అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే రూ.25 లక్షలు కట్ చేయడమేంటని ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులు అభిమానుల్ని అవమానించారని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. (చదవండి: సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్!) కష్టపడి ఓట్లేస్తే ఇంత చెత్తగా ఆలోచిస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో మరోసారి బిగ్‌బాస్ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు. విన్నర్ అభిజిత్ రూ.25 లక్షలు మాత్రమే దక్కాయని, సెకండ్ రన్నరప్ సోహైల్‌కు అంతకన్నా ఎక్కువ మొత్తం, ఇంకా బెనిఫిట్స్ అందాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మెహబూబ్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.10 లక్షల చెక్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్తూనే.. మిగతా కంటెస్టెంట్లు అరియానా, అవినాష్, హారిక పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఒకవైపే మొగ్గు చూపారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ సోహైల్, అఖిల్.. అభిజిత్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి ఉంటే కూడా బిగ్‌బాస్ ఇలాగే ప్రైజ్ మనీలో కోత పెట్టేవారా అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్– 4 విజేత అభిజిత్) -
బిగ్‌బాస్– 4 విజేత అభిజిత్
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్–4 గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. పరిణతి చెందిన వ్యక్తిత్వంతో పెద్ద సంఖ్యలో మహిళాభిమానుల్ని, బిగ్‌బాస్ ప్రశంసల్ని కూడా దక్కించుకున్న అభిజిత్‌ను విజయం వరించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్‌దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనగా వారిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరకు అఖిల్, అభిజిత్, సోహైల్, హారిక, అరియానాలు టాప్–5 ఫైనల్ కంటెస్టెంట్స్‌గా మిగిలారు. అయితే చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారు రూ. 25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చన్న వ్యాఖ్యాత నాగార్జున ఆఫర్‌ను సోహైల్ అంగీకరించడంతో అభిజిత్ ప్రైజ్ మనీలో సగానికి కోత పడింది. అలరించిన ముగింపు.. బిగ్‌బాస్ సీజన్ 4 చివరి రోజున మెగాస్టార్ చిరంజీవి ఈ షో కంటెస్టెంట్స్‌తో సాగించిన ముచ్చట్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షోలో పాల్గొన్న పోటీదారులంతా ఫినాలే సందర్భంగా హాజరై తమ అనుభవాలు పంచుకున్నారు. మెగాస్టార్‌తో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా స్టార్ మెహబూబ్‌కు చిరంజీవి ఆర్థిక సాయం అందించడంతో ఆహూతులు అంతా హర్షధ్వానాలు చేశారు. హీరోయిన్లు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్ రావిపూడి గ్రాండ్ ఫినాలేలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ కాన్సర్ట్‌తో అలరించారు. గత బిగ్ బాస్ సీజన్–3కు 8 కోట్ల మంది ఓట్లు వేయగా 4వ సీజన్‌కు మొత్తం 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. -
బిగ్‌బాస్: రూ.25 లక్షలకు సోహైల్ టెంప్ట్
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అభిజిత్‌ను విజేతగా ప్రకటించారు. అఖిల్‌ను రన్నరప్‌గా వెల్లడించారు. మూడో సీజన్ ఫినాలేకు 8 కోట్ల ఓట్లు రాగా నాల్గో సీజన్‌కు రికార్డు స్థాయిలో 15.65 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ వెల్లడించారు. కాగా 19 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన ఈ రియాటీ షో ప్రేక్షకులను గణనీయంగా అలరించింది. సెప్టెంబర్ 6న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని విన్నర్‌గా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ విశేషాలేంటో చదివేయండి.. క్షమాపణ చెప్పిన నోయల్ నాగార్జున, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేశారు. దేవి నాగవల్లి మాత్రం ఫినాలే ముగిసే సమయానికి హాజరైంది. ఇక నోయల్ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌కు ముందు రాజమౌళి, సుకుమార్ ఇచ్చిన అవకాశాలతో నన్ను గుర్తు పట్టేవారు. బిగ్‌బాస్ తర్వాత నాకు మరింత పాపులారిటీ సంపాదించుకున్నాను. ఇంటిలో అవినాష్, అమ్మా రాజశేఖర్‌తో జరిగిన గొడవ వల్ల వాళ్లు ఏమైనా హర్ట్ అయితే అందుకు సారీ. అవినాష్ కామెడీ ఓ మెడిసిన్.. ఆయనలా ఎప్పుడు నేను కామెడీ చేయలేను' అంటూ ఇద్దరికీ క్షమాపణలు తెలిపాడు. బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది : అవినాష్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన అవినాష్ నాగ్‌తో తన బిగ్‌బాస్ జర్నీ అనుభవాలను పంచుకుంటూ.. ‘మీరు చెప్పినట్టే.. బిగ్‌బాస్‌కు ముందు, బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది. ఇంతకు ముందు మా ఊరు వాళ్లే ఫోటోలు దిగేవారు. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇతర జిల్లాల వాళ్లు వచ్చి నాతో ఫోటో దిగుతున్నారు. నాతోనే కాకుండా నా తల్లితో కూడా ఫోటోలు దిగుతున్నారు అని సంతోషం వ్యక్తం చేశాడు. ఫొటోలు దిగలేకపోతున్నా : గంగవ్వ గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని వాపోయింది. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, దాని వల్ల గొంతు నొప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. దీనికి బదులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోయినా బాగుండని అనిపిస్తోందని చెప్పింది. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారంది. తన కోరిక మేరకు ఇల్లు కట్టిస్తున్నారని, చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపింది. జర్నీ చూసి కంటెస్టెంట్స్ కంటతడి బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇంటి సభ్యులందరికి 105 రోజుల జర్నీని చూపించి అందరినీ ఏడిపించారు. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రస్తుతం 5 మంది ఉన్నారు. ఇన్నాళ్లు వాళ్లు చూపించిన ప్రేమ, కోపం,ఆప్యాయతలు అన్నింటినీ ఏవీలో వేసి చూపించారు. తమ జర్నీ చూసి ఇంట్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజిత్, హారిక, అరియానా, సోహైల్, అఖిల్‌తో పాటు ఎలిమినేట్ అయినవారు కూడా కంటతడి పెట్టారు. అనిల్ రావిపుడి రచ్చ రచ్చ బిగ్‌బాస్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడికి అప్పగించారు. అయితే తాను నవ్విస్తాను కానీ ఎలిమినేట్ చేయలేనని నాగ్‌కు విజ్ఞప్తి చేశాడు. దీంతో నాగ్ ఆ బాధ్యతను ఎఫ్2 హీరోయిన్ మెహరిన్‌కు అప్పగించారు. దీంతో బ్యాండ్ బాజాలతో అనిల్ రావిపుడి, మెహరిన్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్‌తో టాస్క్‌లు ఆడించారు నాగ్. పలు చిలిపి ప్రశ్నలు అడిగి ఎంటర్‌టైన్‌మ్మెంట్ చేశాడు. హౌస్‌మేట్స్‌ని ఇమిటేట్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. హారిక అవుట్ ఫినాలే పోరులో నుంచి తొలుతగా హారిక ఎలిమినేట్ అయింది. హౌస్‌లోకి వెళ్లిన మెహరిన్, అనిల్ రావిపుడి కలిసి హారికను ఎలిమినేట్ చేశారు. మొదటగా హౌస్మేట్స్ అందరికి కళ్లకి గంతలు కట్టి ఎలిమినేట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా మెహరిన్‌కు నాగ్ సూచించారు. కాసెపు అందరికి టెన్షన్ పెట్టి చివరగా హారికను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ తరవాత హారిక గంతలు విప్పిన మెహ్రీన్, అనిల్.. ఆమెను తీసుకెళ్లి ఒక పంజరం లాంటి ఐరన్ రూమ్‌లోకి పంపారు. ఆ పంజరాన్ని ఒక క్రేన్ గాల్లోకి లేపుతూ బయటికి తీసుకెళ్లిపోయింది. హారిక గాల్లో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఫైనలిస్ట్‌ల గంతలు విప్పగా దేత్తడి వెళ్లిపోవడం చూసి విస్తుపోయారు. 10 లక్షలు తిరస్కరించిన హౌస్మేట్స్ రెండో వ్యక్తిని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్ హీరోయిన్లు లక్ష్మీరాయ్, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్ బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణీత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్ కేస్‌తో వెళ్లి కంటెస్టెంట్స్‌ను టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.10లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్ ఇవ్వగా అందరూ తిరస్కరించారు. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారని, డబ్బుతో వాళ్ల ప్రేమను పొగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రణీత 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసింది. తర్వాత హీరోయిన్ లక్ష్మీరాయ్ వెళ్లి అరియానాను ఎలిమినేట్ చేశారు. రూ. 25 లక్షలకు సోహైల్ టెంప్ట్ టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌కు సోహైల్ టెంప్ట్ అయ్యాడు. ఇంట్లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్‌లో ఎవరైనా 25లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావొచ్చని నాగ్ సూచించగా.. అఖిల్, అభిజిత్ తిరస్కరించారు. సోహైల్ మాత్రం తాను ఈ డబ్బును తీసుకొని వెళ్తానని చెప్పాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో ఐదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్‌ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు. సోహైల్ పర్మిషన్ తీసుకున్న చిరు లక్ష్మీ రాయ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకోగా తర్వాత వచ్చిన తమన్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. అనంతరం స్వయంగా నాగార్జునే హౌస్‌లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. బిగ్‌బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. నాగార్జున ఫిట్నెస్ను చూస్తే కుళ్లు వేస్తోందన్నారు. అలాగే పది సీజన్ల వరకు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉండాలన్నారు. ఆ తర్వాత నాగ్ జర్నీ చూపించారు. అనంతరం అభిజిత్ మీద పంచులేస్తూనే అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రతిదాంట్లో గెలవాలన్న తాపత్రయం కనిపించేదని, ప్రేమోనాల్ను గెలిచేవాడని తెలిపారు. మన కథ వేరన్న డైలాగ్ తర్వాతి సినిమాలో పెడతాను, అందుకు పర్మిషన్ ఇవ్వంటూ సోహైల్‌ను అడిగారు. అభి విన్నర్ అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చిన నాగ్.. అభి విజయానికి సంకేతంగా అతడి చేయి పైకెత్తారు. ఇద్దరు మిత్రులు చిరు, నాగ్ కలిసి అతడికి ట్రోఫీ అందించారు. స్టైలిష్ బైక్‌ను కూడా అందజేశారు. ఈ విజయాన్ని ఊహించలేకపోయిన అభి సంతోషం కట్టలు తెంచుకుంది. తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపాడు.. 63 ఏళ్లలో ఇది తనకు గొప్ప వేడుకలాంటిదని అభిని చూసి అతడి తండ్రి గర్వపడ్డారు. -
ఈసారైనా దక్కుతుందా.. బిగ్‌బాస్ ఎవరు?
పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా నిర్వహించే హిందీ బిగ్‌బాస్‌లో ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్ జరిగే క్రేజ్ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్‌బాస్ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్‌బాస్ హౌస్‌లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్లలో టైటిల్ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు. మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి తెలుగు బిగ్‌బాస్ 1,2,3 సీజన్లలో మహిళా కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్ 2లో గాయని గీతామాధురి రన్నర్ అప్‌గా నిలిచారు. నటుడు కౌశల్ ఆ సీజన్‌కు విన్నర్ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్ 3 లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్ సరళి పురుషుల ఫేవర్లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది. ఈసారి అరియానా, హారిక బిగ్‌బాస్ 4 సీజన్ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్‌కు అట్రాక్షన్‌గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ చివరి వారంలో ఎవిక్ట్ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్ యాంకర్ అరియానా, యూ ట్యూబ్ స్టార్ హారికా మిగిలారు. అమ్మాయిలు గెలుస్తారా? ఓటింగ్ సరళిని, హౌస్‌లో అరియానా, హారికల గేమ్ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్‌బాస్ టైటిల్ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది. ఒక దశలో హౌస్మేట్స్ అందరూ ఆమెను ఎలిమినేట్ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్‌ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్లు అభిజిత్, సొహైల్, అఖిల్ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు. 50 లక్షలు ప్రైజ్ బిగ్‌బాస్ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్‌బాస్‌లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్‌కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్‌కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్ ఒక జట్టు కడితే సొహైల్– అఖిల్ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్ అయ్యి వెళ్లే ముందు మోనల్ గజ్జర్ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు. నేడే ఫైనల్స్ నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్‌లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్‌గెస్ట్‌గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో వెంకటేశ్ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
నోయల్ టైటిల్ గెలవాల్సింది: అభిజిత్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఆఖరుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గడిపారు. ఎలిమినేట్ అయినవాళ్లను తిరిగి హౌస్‌లో చూస్తున్నందుకు ఓపక్క సంతోషం, తర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండదన్న మరో వైపు బాధ వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్‌లో చివరి రోజు కొంత ఎమోషనల్‌గా సాగింది. అయితే దేవి నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ మాత్రం రీయూనియన్ పార్టీకి రాకపోవడం గమనార్హం. మరి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేయండి.. ఇంటి నుంచి సందేశం.. అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగవ్వ లోపలకు వచ్చింది. అవ్వ పిలుపు వినగానే అఖిల్ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆమెను చూడగానే పిల్లాడిలా సంబరపడిపోయాడు. తర్వాత జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వతో కలిసి ఫైనలిస్టులతో ఆటాడించారు. నన్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వచ్చిన మెస్సేజ్‌ను చూపిస్తానని సుజాత బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీపడుతూ ఇంట్లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో అభి మైకు విరగొట్టుకుని మరీ మొదటగా కాఫీ మగ్గు తీసుకొచ్చాడు. తర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ లవ్ యూ అని రాసుకొచ్చి మరీ అందించాడు. ఇలా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయగా.. ఫైనలిస్టులందరికీ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు చూపించారు. అనంతరం గంగవ్వ, సుజాత ఇద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. (చదవండి: కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్) నేను నిన్ను గెలిచాను.. తర్వాత వచ్చిన నోయల్ ర్యాప్‌తో ఊపేస్తూ అందరి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అతడి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్‌ను అభి నోయల్ చేతికందించాడు. దానిపై 'నోయల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చదివిన నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాలదా.. అంటూ అభిజిత్‌తో చెప్పుకొచ్చాడు. హౌస్‌ను మిస్సవలేదు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్‌బాస్ తనకు ఎంతో ఇచ్చిందని, కానీ తను ఏమీ తిరిగివ్వలేకపోతే క్షమించండి అంటూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే) దివి.. దీపిక పదుకొణెలా ఉన్నావు తర్వాత మెహబూబ్‌ను చూడగానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అతడు మాత్రం తన ఆతృతను లోలోపలే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంతరం తన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్, అభిజిత్‌తో కబుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగడ్తలతో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవడంతో ఏంటి పులిహోరా? అని దివి ప్రశ్నించింది. మరోపక్క మెహబూబ్, సోహైల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఫైనలిస్టులు అన్ని హార్ట్ దిండులను మెహబూబ్, దివికి బహుమతిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్నర్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండని మెహబూబ్ పదే పదే చెప్తూ సెలవు తీసుకున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా తర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంటనే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఓదార్చాడు. తననిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంటర్టైనర్ అని పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు కలిసేందుకు వస్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండటం చూసి ఏంటి? దినాలకు పిట్టకు పెట్టినట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంతరం అందరి హౌస్‌కు గుడ్‌బై చెప్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఫైనలిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ అతడే: అలీ రెజా) -
తప్పకుండా విన్నర్ అవుతా: అఖిల్ కాన్ఫిడెన్స్
ప్రేమ పాఠాలు, గుణ పాఠాలు, కథలు, వ్యథలు, పోరాటాలు, ఆరాటాలు, బాధలు, బంధాలు, కలయికలు, విడిపోవడాలు, ఆటపాటలు, అడ్డంకులు.. ఇలా అన్నీ కలగలిపితేనే అది బిగ్‌బాస్ రియాలిటీ షో. తెలుగులో ప్రస్తుతం నడుస్తున్న నాల్గవ సీజన్‌కు నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. నేడు అఖిల్, అభిజిత్ వారి ప్రయాణాన్ని తరిచి చూసుకుని ఆనందంతో గాల్లో తేలుతున్నారు. మరి ఈ జర్నీ గురించి వాళ్లేమన్నారో తెలియాలంటే ఇది చదివేయండి.. ప్రేక్షకుల ప్రేమ చాలు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటివరకు ఆడించిన టాస్కులకు సంబంధించి అన్ని వస్తువులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ముందుగా అఖిల్‌ను పిలిచి అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. ఇందులో మోనాల్‌తో ఆటపాటలు, అభితో గొడవలు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్ కంటతడి పెట్టుకున్నాడు. తను ఎఫర్ట్స్ పెట్టి ఆడానని అఖిల్ మరోసారి స్పష్టం చేశాడు. గెలుపోటములు తన చేతిలో లేవని, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ మానుకోలేదని చెప్పాడు. తోడు కోసం పరితపించాను కానీ ప్రేక్షకుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వచ్చినప్పుడు ఇంకా ప్రేమ కావాలనుకోవడం ఫూలిష్‌నెస్ అనిపిస్తోందన్నాడు. తనకీ ప్రేక్షకుల ప్రేమ చాలు అంటూ మోకాళ్లపై మోకరిల్లి ఓట్లేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. బిగ్‌బాస్ వల్ల తనేంటో తనకు తెలిసిందని, తప్పకుండా విన్నర్ అవుతానన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అనంతరం బాల్కనీలో ఉన్న తన ఫొటోను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. (అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించావు అనంతరం అభిజిత్ గార్డెన్ ఏరియాలోకి వెళ్లి తనకు పేరు తెచ్చిన రోబో టాస్క్‌లోని వస్తువులను తనివితీరా చూసుకున్నాడు. బిగ్‌బాస్ అతడికి "మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్" బిరుదునిచ్చాడు. నీ కంటే ఎక్కువగా వేరేవాళ్లకోసం ఆలోచించావని అభిని మెచ్చుకున్నాడు. ఇలాంటి పరిపక్వత చెందిన తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నానని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అభి చేతులెత్తి నమస్కరిస్తూ.. నేను బిగ్‌బాస్‌కు రావడం అనేది నా జీవితంలోనే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను అని తెలిపాడు. అనంతరం అతడికి జర్నీ వీడియో చూపించగా దాన్ని చూసి అభి మైమరిచిపోయాడు. (ఓటింగ్‌లో అభిజిత్‌ను దాటేసిన అరియానా!) నేనంటే నీకిష్టం లేదా? ఆ వీడియోలో అభి మోనాల్‌తో పెట్టిన కబుర్లనే ఎక్కువగా చూపించారు. అందులో 'నీకు నేనంటే ఇష్టం లేదా?' అని అభి మోనాల్‌ను ప్రశ్నించాడు. అప్పుడు దానికి మోనాల్ సమాధానం చెప్పకపోయినా తర్వాత మాత్రం 'ఐ లైక్ యూ' అని చెప్పింది. కానీ తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆమెతో దూరం కావడం, అఖిల్‌తో గొడవలు, నామినేషన్లు అన్నింటినీ చూపించారు. హారిక అతడికి తోడుగా నిలిచిన సందర్భాలను సైతం గుర్తు చేశారు. ఇవన్నీ చూసి చలించిపోయిన అభి ఎంతో సంతోషించాడు. తర్వాత తన ఫొటోను తీసుకుని లోపలకు వెళ్లాడు. రేపటి ఎపిసోడ్లో మిగతా ముగ్గురి జర్నీలు చూపించనున్నారు. (ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) -
బిగ్‌బాస్: చీలిపోతున్న అభిక ఓట్లు?!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఓటింగ్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా మారింది. ఇంతకుముందు తమ అభిమాన కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో లేకపోతే వారికిష్టమైన ఫ్రెండ్స్‌ను సేవ్ చేసే బాధ్యతను అభిమానులు వారి భుజాన వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం తమకిష్టమైన కంటెస్టెంట్ల మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హౌస్‌లో ఉన్న ఫైనలిస్టులతో బిగ్‌బాస్ "టైటిల్ గెలిచేందుకు ఎవరు అనర్హులు?" అని ఓ టాస్క్ ఆడించిన విషయం తెలిసిందే కదా! ఇందులో అఖిల్, హారిక.. అరియానా గెలవడానికి అనర్హురాలు అని చెప్పారు. సోహైల్ మాత్రం అభిజిత్, అరియానాకు విజేతగా నిలిచే అర్హత లేదని అభిప్రాయపడ్డాడు. హారికకు ఝలక్ ఇచ్చిన అభిజిత్ అటు అభిజిత్ మాత్రం హారిక అనర్హురాలు కావాలని కోరుకున్నాడు. ఈ ఆటలో ఇద్దరమే మిగిలితే అందులో హారిక ఓడిపోవడం ఇష్టం లేదని, అలా అని తాను ఓడిపోలేనని, ఎలాగైనా గెలవాలని, అందుకే ఆమె అనర్హురాలుగా మిగిలిపోవాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. అభిజిత్ ఏం చెప్తున్నాడో అర్థం కాని హారిక కాస్త డల్ అయినట్లు అనిపించింది. ఏదేమైనా అభిజిత్ తనను అనర్హురాలు అని చెప్పడాన్ని ఆమె మనసులో నుంచి తీసేయలేకపోయింది. ఈ క్రమంలో అభిజిత్, హారిక ఫ్యాన్స్ మద్ద మాటల యుద్ధం నడుస్తోంది. (చదవండి: మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి) చీలిపోతున్న అభిక ఓట్లు ఇప్పుడు కూడా అభిక అంటే కుదరదని వారు వాదిస్తున్నారు. అభిజిత్, హారిక.. ఇద్దరిలో ఒకరికే ఓటేయాలని చెప్తున్నారు. దీంతో అభిక ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఇందులో మొదటి వర్గం.. అభికి మాత్రమే ఓటేయాలని, అభి లేనిదే హారిక లేదని అంటున్నారు. అభి ఫ్యాన్స్ ఆమెను చాలాసార్లు నామినేషన్ నుంచి సేవ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడిక ఫినాలే వీక్‌లో ఆమెకు ఓటేయాల్సిన అవసరం లేదని, ప్రతి ఓటు అభికే వేయండని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. పైగా కన్ఫెషన్ రూమ్‌లో నాగార్జున క్లాస్ పీకిన తర్వాత ఆమె అభిని దూరం పెట్టి అఖిల్‌తో క్లోజ్ అయిందని విమర్శిస్తున్నారు. (చదవండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి) అభిక ఫ్యాన్స్ ఓటు ఎటువైపు? దీనిపై రెండో వర్గానికి చెందిన హారిక ఫ్యాన్స్ కూడా దీటుగానే స్పందిస్తున్నారు. మా క్యూటీ లేకపోతే అభి లేడని కౌంటరిస్తున్నారు. హారిక.. అభిజిత్లాగా బద్ధకంగా టాస్కు చేయకుండా కూర్చోలేదని, అన్నింట్లోనూ తన సత్తా చూపిస్తూ, ఒంటరి పోరాటంతో ఇక్కడివరకు వచ్చిందంటున్నారు. అభిజిత్‌ను సేవ్ చేయడం కోసం ఆమెను కెప్టెన్ చేసిన మోనాల్‌ను నామినేషన్లోకి పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హారికను తక్కువ అంచనా వేయకండని హెచ్చరిస్తూ, ఆమెకు ఓటేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఏదేమైనా గెలుపును నిర్దేశించడంలో అభిక ఫ్యాన్స్ ఓట్లు కీలకంగా మారనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: అభిజిత్‌ను గెలిపించండి: యువ హీరో) -
బిగ్‌బాస్ ఓటింగ్: రెండో స్థానంలో అభిజిత్!
సెంచరీ ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ నాల్గో సీజన్ విజేత ఎవరనేది నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఈ క్రమంలో ఎవరు విజేతగా నిలుస్తారని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిర్వహిస్తున్న పోల్స్‌లో అభిజిత్ ఎక్కువ ఓట్లతో ముందు వరుసలో ఉన్నాడు. ఏ అనఫీషియల్ పోల్ చూసినా సుమారు 50 శాతం ఓట్లు అభిజిత్‌కే పడుతున్నాయి. తర్వాతి స్థానంలో సోహైల్ ఉంటుండగా అరియానా మూడో ప్లేస్‌లో ఉంది. కొన్నిసార్లు వీరిద్దరి స్థానాలు తారుమారవుతూ వస్తున్నాయి. కానీ అభి మాత్రం ఏ పోల్ చూసినా మొదటి స్థానం నుంచి కదలడమే లేదు. ఇక అఖిల్, హారిక వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. (చదవండి: శ్రీముఖి టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా?) అయితే తాజాగా కొన్నింటి పోల్స్‌లో అరియానా ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి మొదటి స్థానంలో పాగా వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తొలి స్థానం నుంచి అంగుళం కూడా కదలని అభిని ఆమె వెనక్కు నెట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 50 శాతం ఓటింగ్‌తో ముందు వరుసలో ఉన్న అభి సెకండ్ ప్లేస్‌కు రావడానికి ఛాన్సే లేదని ఆయన అభిమానులు అంటున్నారు. మరికొందరేమో అభికి ఓట్లు పడేందుకు ఇలాంటి కొత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. నిమిషానికోసారి స్థానాలు మారిపోయే ఈ ఓటింగ్ పోల్స్‌ను పూర్తిగా నమ్మలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బయట నడుస్తున్న టాక్ ప్రకారం అభిజిత్ విజేతగా నిలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదంటే సోహైల్ ట్రోఫీ ఎగరేసుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా ట్విస్టులు చోటుచేసుకుంటే మాత్రం అరియానా విన్నర్ లేదా రన్నరప్‌గా నిలిచేందుకు ఆస్కారముంది. (చదవండి: మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?) -
బిగ్‌బాస్.. నా లైఫ్‌లో గొప్ప నిర్ణయం: అభి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ చివరి ఘట్టానికి చేరుకునేసరికి అన్నీ మారిపోయాయి. అభిజిత్‌తో తప్ప ఎవరితో కలవదనుకున్న హారిక అందరితో కలిసిపోయింది. కోపిష్టి అనుకున్న సోహైల్ ప్రేమతో ఇంటి సభ్యుల మనసులు గెలుచుకుని అందరివాడయ్యాడు. టాస్కులు ఒక్కటే తన గోల్ అనుకున్న అఖిల్ ఇంట్లో వాళ్ల మమకారం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నాడు. కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానన్న అభిజిత్ అభిమానుల సపోర్ట్ చూశాక ఎలాగైనా గెలవాల్సిందేనంటున్నాడు. ఎవరికీ ఓ పట్టాన అర్థమవదనుకున్న అరియానా ఏం చేసినా తన గెలుపుకోసమే చేశానని చెప్తోంది. ఆట ఎంత ముఖ్యమో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో టాప్ 5 కంటెస్టెంట్లు నూటికి నూరు మార్కులు సాధించారు. ఇక్కడివరకు రావడానికి వాళ్లు ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు మిగిలిందంల్లా ప్రేక్షకుల వంతు. వారిని ఏయే స్థానాల్లో నిలబెట్టాలనేది వీక్షకులే నిర్ణయించనున్నారు. (ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్ ముగుస్తుండటంతో బిగ్‌బాస్ అందరి జర్నీని వీడియో ద్వారా చూపించాడు. దీంతో కంటెస్టెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. సోహైల్‌కు కోప్పడిన సందర్భాలను చూపిస్తూనే మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు బాధపడటాన్ని చూపించడంతో అతడు మరోసారి ఏడ్చేశాడు. అభికి అతడి రాతనే మార్చేసిన రోబో టాస్క్‌ను కళ్ల ముందుంచారు. అవినాష్‌కు కోపం తెప్పించాలనే సీక్రెట్ టాస్క్ హారిక ఎలా గెలిచిందో మరోసారి చూపించడంతో ఆమె నవ్వేసింది. అంతలోనే తన అన్నయ్యకు ఇష్టం లేకపోయినా సరే, టాస్క్ కోసం జుట్టు కత్తిరించుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. (తిండి కోసం అతడి ఇంటికి వెళ్లాను: అరియానా) సుమ తనను ఇమిటేట్ చేయడం, సోహైల్‌తో గొడవలో కిందపడి ఏడ్చేయడం చూసి అరియానా స్థాణువులా నిల్చుండిపోయింది. ఇప్పటికే మోనాల్ లేకపోవడంతో ఊపిరి ఆడనట్లుగా ఉందన్న అఖిల్‌కు ఆమెతో కలిసున్న క్షణాలను చూపించి ఆ బాధను రెట్టింపు చేశారు. మొత్తానికి ఈ హౌస్‌లో అన్ని ఎమోషన్స్ పండించిన కంటెస్టెంట్లు వాళ్లను వాళ్లే వెనక్కు తిరిగి చూసుకుని ఎమోషనల్ అవుతున్నారు. ఈ సందర్భంగా.. నేనేంటో నాకు బిగ్‌బాస్ హౌస్‌లోనే పూర్తిగా తెలిసిందని అఖిల్ చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌కు రావడం అనేది నా జీవితంలోనే నేను తీసుకున్న గొప్ప నిర్ణయం అని అభిజిత్ అభిప్రాయపడ్డాడు. మరి ఈ కంటెస్టెంట్ల వంద రోజుల ప్రయాణాన్ని మరోసారి చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (బిగ్‌బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి) -
బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేయండి: శ్రీముఖి సలహా
తెలుగు బిగ్‌బాస్ హిందీ బిగ్‌బాస్‌ను ఫాలో అయినట్లు కనిపించింది. మాజీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. మొదటి సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖితో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజాలకు రెట్టించిన ఉత్సాహంతో షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కానీ కోవిడ్ వల్ల నేరుగా హౌస్‌లోకి వెళ్లకుండా ప్రత్యేక గదిలో నుంచే ఫైనలిస్టులతో సంభాషించారు. మరి 101వ ఎపిసోడ్లో ఈ మాజీ ఫైనలిస్టులు ఇప్పుడున్న కంటెస్టెంట్లను ఏమేం ప్రశ్నలడిగారు? వారిని ఎలా ఆడుకున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? గత సీజన్ల ఫైనలిస్టులు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ఇంటిసభ్యులను సర్ప్రైజ్ చేశారు. అప్పట్లో తాము దంచుతూ కష్టాలు పడుతుంటే మీరేమో మిక్సీలు వాడుతున్నారా? అని ఈ సీజన్ కంటెస్టెంట్ల మీద అక్కసు వెళ్లగక్కారు. తమ టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? అని అడుగుతున్నారని, బయట ఇలాంటి టాస్కులు ఉంటాయనుకోలేదని శ్రీముఖి వాపోయింది. తర్వాత ప్రేక్షకుల తరపున ప్రశ్నలు అడుగుతూ వారికి సరదాను పంచేందుకు సిద్ధమయ్యారు. ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తినమని శ్రీముఖి అరియానాకు సలహా ఇచ్చింది. (చదవండి: ఏడవకుండా నవ్వుతూ మోనాల్ వీడ్కోలు) మోనాల్ లేకపోవడంతో ఊపిరాడలేదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహైల్ తన కోపాన్ని కూల్ చేయగలగాలి అని చెప్పాడు. ఇది జరగని పని అని హరితేజ కుండ బద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంటని అఖిల్‌ను కూపీ లాగేందుకు ప్రయత్నించగా సోహైల్ మధ్యలో లేచి అంత లేదంటూ, ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేపటివరకు ఊపిరి ఆడలేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. తర్వాత సీనియర్లు అరియానాను లౌడ్ స్పీకర్‌గా అభివర్ణిస్తూ ఇమిటేట్ చేయడంతో ఇంటి సభ్యులు పడీపడీ నవ్వారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడటాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజన్లో శ్రీముఖికే సపోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడటం గ్రేట్ అని హరితేజ సైతం మెచ్చుకుంది. (చదవండి: హౌస్‌లో శివగామి ఎవరో చెప్పిన అభిజిత్) అమ్మాయిల కోసం పాట పాడిన అభి కావాలని తప్పులు చేయండి, ఎందుకంటే వారంలో బిగ్‌బాస్ గొంతు మిస్సవుతారు అని సీనియర్లు ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత అందరితో డ్యాన్స్ చేయించారు. గర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్‌తో పాట పాడించారు. అయితే లిరిక్స్ రాకపోయినా 'నీ ఎదలో నాకు చోటే వద్దు.. అంటూ బాగానే పాడాడు. తర్వాత అలీ రెజా మాట్లాడుతూ..నన్ను అర్జున్‌రెడ్డి అనేవారు, కానీ నువ్వు నన్ను మించిపోయావని, గొడవయ్యాక నువ్వే వెళ్లి కలిసిపోవడం బాగుందని సోహైల్‌ను మెచ్చుకున్నాడు. ఇలా కోప్పడే ఒకరు ట్రోఫీ తీసుకెళ్లారు తన కోపం కారణం లేకుండా రాదని, ఎంత కోప్పడినా మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటా అని సోహైల్ చెప్పగా ఇలా కోప్పడే ఒకరు బిగ్‌బాస్ 1 ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది. తర్వాత మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. టాస్కుల్లో మామూలు స్పీడు లేదని గీతా మాధురి మెచ్చుకుంది. నవ్వితే బాగుంటావు, కానీ ఎప్పుడూ సీరియస్‌గా ముఖం పెడతావేంటని శ్రీముఖి నిలదీయడంతో అలాంటిదేమీ లేదని అఖిల్ తెలిపాడు. పులిహోర మాత్రం మామూలుగా కలపడం లేదని గీతా, హరితేజ సెటైర్లు వేశారు. (చదవండి: ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) ఉన్న టైమ్‌ను ఎంజాయ్ చేయండి చివర్లో మాకు సలహాలు ఇవ్వండని జూనియర్లు సీనియర్లను కోరారు. మొదట హరితేజ మాట్లాడుతూ... ఇక్కడిదాకా వచ్చాక మార్చుకోవాల్సినవేమీ ఉండవని చెప్పింది. ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయమని సూచించింది. గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయమని చెప్తూనే చివర్లో ఎవరినీ బాధపెట్టే డైలాగులు మాట్లాడకండని సలహా ఇచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. 'గత సీజన్లో నేను సెట్లో ప్రతి మూలమూలకు వెళ్లాను. ఎందుకంటే తర్వాత ఆ సెట్ తీసేస్తారు. కాబట్టి మీరు కూడా హౌస్‌లో చిల్ అవ్వండి. రూల్స్ బ్రేక్ చేసి బిగ్‌బాస్‌తో తిట్టించుకోండి. ఎందుకంటే మళ్లీ ఆ వాయిస్ వినలేరు' అని చెప్పింది. హౌస్‌లో ఎంత నెగెటివిటీ వస్తుందో అంత పాజిటివిటీ వస్తుందని అలీ ధైర్యం చెప్పాడు. మా అమ్మాయి బిగ్‌బాస్ చూస్తూనే అన్నం తింటుది, వారం తర్వాత పరిస్థితి ఏంటో అని గీతామాధురి తల పట్టుకోగా తాము ఇంటికొచ్చి తినిపిస్తాం అని ఫైనలిస్టులు ముందుకొచ్చారు. అనంతరం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్లకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు పలికారు. (చదవండి: బిగ్‌బాస్: టైటిల్ గెలిచే అర్హత హారిక, అరియానాకు లేదు!) -
'11' నెంబర్ అభిని విన్నర్ చేస్తుందా?
బిగ్‌బాస్ గూటికి చేరాక హీరోలు జీరోలవుతుంటారు, జీరోలు హీరోలవుతుంటారు. స్ట్రాంగ్ అనుకున్నవాళ్లు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు, ఊహించని కంటెస్టెంట్లు చివరి వరకూ వెళ్తుంటారు. ఇలా ఎన్నో జంతర్‌మంతర్ మాయలు చోటు చేసుకునే బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే మిగిలారు. అరియానా, హారిక, అభిజిత్, సోహైల్, అఖిల్.. టైటిల్ కోసం పోటీపడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం అభిజితే విన్నర్ అవుతాడని బలమైన ప్రచారం జరగుతోంది. దీనికి తోడు 11 సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఇదే నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇంతకీ ఈ 11 నెంబర్ ప్రత్యేకత ఏంటేంటే.. ఈ సీజన్లో అతడు 11 సార్లు నామినేట్ అయ్యాడు. 11 సార్లు నామినేట్.. మోనాల్ అతడికన్నా ఒకసారి ఎక్కువగా అంటే 12 సార్లు నామినేట్ అయినప్పటికీ ఫినాలే వీక్‌కు ముందే ఎలిమినేట్ అయి రేసు నుంచి తప్పుకుంది. ఆమె విషయాన్ని కాస్త పక్కన పెడితే ఎక్కువ సార్లు నామినేట్ కావడం అభిజిత్‌కు కలిసొచ్చినట్లు కన్పిస్తోంది. ప్రతిసారీ నామినేషన్లో ఉండటం వల్ల అతడికి ప్రేక్షకుల సపోర్ట్ ఎంత ఉందనే విషయం అర్థమై ఉంటుంది. ఇక మొదటి సీజన్ మినహా రెండో సీజన్లో కౌశల్ మండా కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. గీతా మాధురి తనకు లభించిన సూపర్ పవర్‌తో అతడిని సీజన్ మొత్తం నామినేట్ చేసింది. అయినా సరే ప్రతిసారి ఎక్కువ ఓట్లతో సేవ్ అవుతూ చివరికి విజేతగా అవతరించాడు. (చదవండి: నీ వల్ల చాలా హర్ట్ అవుతున్నా: అభి) ఎక్కువ సార్లు నామినేట్ అయిన రాహుల్ తర్వాత మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. తన జిగిరీ దోస్త్ పునర్నవిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం కోసం సీజన్ మొత్తం తనను తాను నామినేట్ చేసుకున్నాడు. అయినా సరే ప్రేక్షకుల సపోర్ట్‌తో చివరికి ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఇక ఈసారి కూడా అభిజిత్ 11 సార్లు నామినేషన్లో ఉండి సేవ్ అవుతూ టాప్ 5లోకి చేరుకున్నాడు. దీంతో మరోసారి 11 సెంటిమెంట్ వర్కవుట్ అయితే అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అనిపిస్తోంది. మరి అభిజిత్ ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూడాల్సిందే. (చదవండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి) Nominated for 11 times by housemates and saved with all your support & continued his journey in #BiggBossTelugu4. Let's finish this with his victory, Let's prove them that #Abijeet is the most Loved Contestant. Let's Vote For the #MostDeservingWinnerABI .#VoteForAbijeet pic.twitter.com/30rutWxnwh — Abijeet (@Abijeet) December 15, 2020 -
బిగ్‌బాస్ ట్రోఫీ తీసుకురా, దావత్ చేసుకుందాం
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో లోపలున్న కంటెస్టెంట్లను గెలిపించేందుకు అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లెక్క ప్రకారం ఇప్పుడున్న ఫైనలిస్టుల్లో అభిజిత్‌కే ప్రేక్షకుల సపోర్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీనికి తోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం అభికే మద్దతు తెలిపాడు. వీరిద్దరూ గతంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో కలిసి నటించారు. ఇదే సినిమాలో నటించిన మరో హీరో సుధాకర్ కోమాకుల కూడా మొదటి నుంచి అభికే తన మద్దతు తెలుపుకుంటూ వచ్చాడు. బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌లోకి అడుగు పెట్టిన సందర్భంగా సుధాకర్ మరో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. (చదవండి: బిగ్‌బాస్ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్) ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ.. "బిగ్‌బాస్ కంటెస్టెంటు అభిజిత్ నా క్లోజ్ ఫ్రెండ్. టైటిల్ దక్కించుకునేందుకు ముందు వరుసలో ఉన్నాడు. రెండు నెలల క్రితం అతడి గురించి వీడియో చేసినప్పుడు పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ అభి గ్రాఫ్ పెరిగిపోయింది. అతడిని బిగ్‌బాస్ విన్నర్‌గా చూడాలనుకుంటున్నా. అతడు హౌస్‌లో అందరూ సర్ప్రైజ్ అయ్యేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇన్ని సీజన్లలో ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ అభికి వచ్చింది. కానీ అతడు బిగ్‌బాస్‌లోకి వెళ్లినప్పుడు టైటిల్ ఫేవరెట్ కాదనే చెప్పాలి. లోపలికి వెళ్లే వారం ముందు నాతో మాట్లాడాడు. నేను నాలా ఉంటా. పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అరేయ్ మామా, మనం ఒక్కసారి దిగినమంటే సిక్స్ కొడితే బాల్ స్టేడియం అవతల పడాల్సిందే, టైటిల్ గెలవాల్సిందేనని చెప్పాను. అతడేమో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నా కానీ చూద్దామని చెప్పాడు." (చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ) నీ కోసం అమెరికా నుంచి వచ్చాను "ఎన్నిసార్లు నామినేషన్లోకి వెళ్లినా ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు వేసి సేఫ్ చేశారు. రోబో టాస్క్ తర్వాత అతడికి పేరొచ్చింది. భుజాల నొప్పి, మోకాళ్ల సమస్య ఉండటం వల్ల ఫిజికల్ టాస్కులు చేయలేకపోయాడు. అయినా సరే తన బెస్ట్ ఇచ్చాడు. ఏ పరిస్థితిలోనైనా బ్యాలెన్స్‌గా ఉంటాడు. బయట ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. టాస్క్‌లో ఫ్రెండ్స్‌ను పక్కన పెట్టాడు. ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే వెళ్లి సాయం చేస్తాడు. ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పి దాన్ని సరిదిద్దుకున్నాడు. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న అభికి ఓటు వేసి గెలిపించండి" అని సుధాకర్ అభిమానులను కోరాడు. చివర్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోని నాగరాజు పాత్రలోకి దూరిపోయి ఓ డైలాగ్ విసిరాడు. "అరేయ్ మామా అభిజిత్, బిగ్‌బాస్ ట్రోఫీ తీసుకుని రా. బీ ఫేస్ మొత్తం వెయిట్ చేస్తుంది. మస్త్ దావత్ చేసుకుందాం. ఎంజాయ్ చేద్దాం. అమెరికా నుంచి వచ్చినరా బై నీకోసం.. బిగ్‌బాస్ 4 విన్నర్ కావాలి చెప్తున్నా.." అంటూ అభిని విజేతగా నిలపండని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. (చదవండి: అరియానాకు ఓటేయమని ఆర్జీవీ పిలుపు) -
మోనాల్ లేకపోతే పిచ్చి లేస్తుంది: అఖిల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ నేటితో విజయవంతంగా వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. టాప్ 5లోకి చేరుకున్న ఇంటిసభ్యుల మధ్య బిగ్‌బాస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ట్రోఫీ గెల్చుకునేందుకు అనర్హురాలు ఎవరన్న ప్రశ్నకు అమ్మాయిల పేర్లే ఎక్కువగా వినిపించడంతో వారిలో గెలవాలన్న కసి మరింత పెరిగింది. సెంచరీ కొట్టిన బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి. మోనాల్ లేదని బాధపడిన అఖిల్ ఎప్పుడూ సినిమా పాటతో నిద్ర లేచే కంటెస్టెంట్లు ఇవాళ మాత్రం బిగ్‌బాస్ జర్నీ ర్యాప్ సాంగ్‌తో మేలుకున్నారు. వాళ్ల అరుపులు, మాటలు, ఏడుపులు వారికే కొత్తగా అనిపించాయి. ఇక ఈ మధ్య మోనాల్‌ను పట్టించుకోవడం మానేసిన అఖిల్ ఆమె లేని లోటును ఫీలయ్యాడు. తోడు లేకపోవడంతో పిచ్చి లేస్తుందని హారిక దగ్గర బాధ చెప్పుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ ముసుగు వెనుక దాగింది ఎవరు? అనే టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంట్లో మొదట ముసుగు ధరిస్తే దానిని బయట పెట్టింది ఎవరనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. టాస్క్ ప్రారంభం అవగానే ఇంటి సభ్యులు ముఖాన మాస్కు పెట్టుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. (చదవండి: గెలిస్తే రైతుల అప్పు తీరుస్తానన్న అరియానా) అఖిల్ వల్ల పులిహోర కలపడం బయటపడింది మ్యూజిక్ ఆగిపోగానే మొదట అభిజిత్ మాట్లాడుతూ.. నా కోపాన్ని ఇంట్లోకి జంటగా అడుగు పెట్టిన సోహైల్, అరియానా బయట పడేలా చేశారని చెప్పాడు. తనకు వంట వచ్చన్న విషయం అమ్మ రాజశేఖర్ వల్ల అందరికీ తెలిసిందని అరియానా చెప్పుకొచ్చింది. కోపం సోహైల్ వల్ల, కెమెరాల ముందు ఏడవడం అవినాష్ వల్ల బయట పడిందని పేర్కొంది. అనంతరం సోహైల్ మాట్లాడుతూ.. దివి వల్ల అగ్రెసివ్, అరియానా వల్ల వంట చేయడం బయటపడిందన్నాడు. అఖిల్.. నోయల్ వల్ల ఏడవడం, అభి వల్ల కోపం బయటపడిందని చెప్పాడు. హారిక.. సోహైల్ వల్ల కోపాన్ని దాచుకోలేకపోయానని చెప్పింది. అభి వల్ల పొజెసివ్నె, అఖిల్ వల్ల పులిహోర కలపడం, అరియానా వల్ల తనకున్న సహనం బయటపడిందని తెలపింది. (చదవండి: హారిక తమన్నా, మోనాల్ అనుష్క అంటోన్న అభి) సోహైల్ మనసులో ఏదీ పెట్టుకోడు తర్వాత ఒకరి గురించి మరొకరు మాట్లాడారు. సోహైల్ ఎంత కోప్పడతాడో అంతకంటే ఎక్కువ బాధపడతాడు. చిన్నపిల్లాడి మనస్తత్వం, మనసులో ఏదీ పెట్టుకోడని అరియానా చెప్పుకొచ్చింది. తర్వాత సోహైల్.. అరియానా గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న ప్రేమను బయటపెట్టదని చెప్పాడు. తర్వాత అభి గురించి నేను చెప్తానంటే నేను చెప్తానని అఖిల్, హారిక పోట్లాడారు. చివరికి అఖిల్ అందుకుంటూ.. రిజర్వ్డ్గా కనిపిస్తాడు కానీ అభి ఎమోషనలేనని, దాన్ని బయటపెట్టట్లేదు అని చెప్పాడు. తర్వాత హారిక.. అఖిల్ గురించి చెప్తూ.. అతడిని కేర్ తీసుకునేందుకు ఒకరు కావాలని ఎదురు చూస్తాడు అని మోనాల్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చింది. అభిజిత్.. హారిక గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న విషయాన్ని బయట పెట్టదని చెప్పాడు. తనకంటే ఎక్కువ ఇగో ఉంటుందన్నాడు. మోనాల్, అరియానాను బాగున్నావని మెచ్చుకుంటే నన్ను ఎందుకు పొగడలేదని దబాయించేదని చెప్పాడు. (చదవండి: బొమ్మ లొల్లి: శోకాలు పెట్టిన టామ్ అండ్ జెర్రీ) ముగ్గురి దృష్టిలో అరియానా అనర్హురాలు తర్వాత బిగ్‌బాస్ ఈ ఫైనలిస్టులకు మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫైనలిస్టులు తాము విజేత కావడానికి ఎందుకు అర్హులో చెప్తూ, అర్హత లేని వ్యక్తి పేరును చెప్పాల్సి ఉంటుంది. మొదట అభి మాట్లాడుతూ.. 'ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయ్యాను. నేను ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని అనుకుంటున్నాను. హారికతో పోటీపడటం నేను తట్టుకోలేను. కాబట్టి నేను గెలవాలంటే హారిక అర్హురాలు కావద్దు' అని చెప్పాడు. తర్వాత అఖిల్.. టాస్కుల్లో హద్దులు దాటినందుకు అరియానా అనర్హురాలు అనుకుంటున్నానని చెప్పాడు. సోహైల్.. అరియానా, అభిజిత్ అనర్హులు అని, హారిక.. అరియానా అనర్హురాలు అని చెప్పింది. మెజారిటీ ఫైనలిస్టులు అరియానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చి చెప్పారు అమ్మాయిలే ట్రోఫీ కొట్టాలి చివరగా అరియానా మాట్లాడుతూ.. 'ఆటలో నా పేరు గుర్తుండిపోవడం బాగుంది. అందరి బుర్రల్లోకి నా పేరే వచ్చిందంటే నేను గేమర్నే. అంటే ట్రోఫీ తీసుకునేందుకు నేను అర్హురాలినే' అని చెప్పుకొచ్చింది. హారిక కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదంటూ ఆమెను అనర్హురాలని ప్రకటించింది. ఈ టాస్క్ ముగిసిన తర్వాత హారిక, అరియానా దీని గురించి చర్చించుకున్నారు. అనర్హులుగా అమ్మాయిల పేర్లే రావడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ట్రోఫీ ఎలాగైనా అమ్మాయే గెలవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. (చదవండి: టోటల్ డ్యామేజ్ చేసుకుంటున్న అఖిల్) -
ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుదశకు వచ్చింది. మరో వారం రోజుల్లో ఈ షో ముగియనుంది. టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక, అరియానా ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలన్న కసితో ఇంటిసభ్యులు గేమ్‌పై ఫోకస్ చేస్తున్నారు. అభిమాన కంటెస్టెంట్‌ని ఎలాగైనా గెలిపించాలన్న తపనతో అభిమానులు కూడా ఓట్ల ప్రచారం చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా బిగ్‌బాస్ హౌజ్‌లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దుతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: విన్నర్ ఎవరో తేల్చేసిన హీరో శ్రీకాంత్) ఇక హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నది ఎవరికంటే అభిజిత్ అనే చెప్పవచ్చు. ఈ సీజన్ విజేత అతడే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. ఇక ఇప్పటికే అభిజిత్‌కి నాగబాబు వంటి వారు మద్దతివ్వగా తాజాగా ఈ జాబితాలోకి ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ చేరారు. అభిజిత్‌కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా అభిజిత్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో విజయ్ దేవరకొండ గోల్డ్ ఫేజ్ కుర్రాడి పాత్రలో మెప్పించారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టీంతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘‘మై బాయ్స్.. ఎల్లప్పుడూ వారికి శుభాకాంక్షలు.. ఎక్కడైనా.. ఏదైనా’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండతో పాటు అభిజిత్, సుధాకర్, అభితో పాటు మరోకరు ఉన్నారు. ఇక అభిజిత్‌కి రౌడీ హీరో మద్దతు కూడా దక్కడంతో అతడి ఫ్యాన్స్ ఫుల్లు ఖుషి అవుతున్నారు. -
బిగ్‌బాస్ : ఫ్రైజ్ మనీ గెలిస్తే.. సోహైల్ ఎమోషనల్
ఎన్నో అనుమానాల మధ్య మొదలైన బిగ్‌బాస్ నాల్లో సీజన్.. అప్పుడే ముగింపు దశకు చేరుకుంది. కరోనా, ఐపీఎస్ లాంటి ఎన్నో ఆటుపోటులను తట్టుకుంటూ వచ్చిన ఈ బిగ్ రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. కొద్ది సమయం మాత్రమే ఉండటంతో కంటెస్టెంట్స్ తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌లో ఇప్పటికే టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ , సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. ఈ రోజు ఒకరు ఎలిమినేట్ అయి మరో ముగ్గురు టాప్‌లోకి చేరుకుంటారు. ఇదిలా ఉంటే వారం రోజుల ముందే విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో నాగార్జున తేల్చేశాడు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ప్రైజ్ మనీ పై క్లారిటీ ఇచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. బిగ్‌బాస్ విన్నర్‌కు 50లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటారు. అయితే ఈ భారీ జాక్ పాట్ ఎవరు అందుకుంటారు? ఆ డబ్బుతో ఏమేం చేస్తారో చెప్పాలని నాగ్ అడగ్గా.. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ముఖ్యంగా సోహెల్ ఒక్క డైలాగ్ తోనే ఎమోషనల్ గా టచ్ చేసినట్లు అర్ధమయ్యింది. ఇప్పటివరకు నా అకౌంట్ లో లక్ష దాటి లేదు అని వివరణ ఇచ్చాడు. ఇక హారిక మాత్రం ఆ డబ్బును గెలుచుకుంటే పూర్తిగా తన తల్లికే ఇస్తానని చెప్పింది. ఇక అభిజిత్ వంతు రావడంతో ఆ ప్రైజ్ మనీ మొత్తం ఇంట్లో వాళ్ళకే అంటూ ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ అని చెప్పాడు. ఇక అఖిల్ మంచి కేఫె ఓపెన్ చేస్తానని చెప్పాడు. దానికి ముఖ్య అతిథిగా రావాలని నాగ్‌ను కోరాడు. ఇక బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటిస్తే.. కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే కంటెస్టెంట్స్ చూపించాలని నాగ్ కోరడంతో హారిక, మోనాల్ ను ఇమిటేట్ చేసింది. ఇక అఖిల్ అరియానా ఫీలింగ్ ను తెలుపగా..అరియానా అభిని ఇమిటేట్ చేసింది. మోనాల్, సోహెల్ డ్యాన్స్ ను చూపించగా.. హారిక ముద్దులు ఎలా పెడుతుందో సోహెల్ చూపించాడు. మరి వారి ఇమిటేట్ హౌస్‌లో ఏ మేరకు నవ్వులు పూయించిదో నేటి ఎపిసోడ్లో చూడాలి. -
బిగ్‌బాస్ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్
మొదటి సారి తెలివైనోడు(అభిజిత్) టాస్క్ కండీషన్స్ మర్చిపోయి ఓడిపోయాడు. ప్రతి సారి టాస్క్ పేపర్‌ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదివే అభిజిత్.. నేడు మాత్రం ఒక్కసారి కూడా టాస్క్ పేపర్ చదవలేదు. దీంతో నిబంధనలు మర్చిపోయి మంచి చాన్స్ మిస్సయ్యాడు. ఇక తనకు కెప్టెన్సీ టాస్క్‌కు సహాయం చేసిన మోనాల్‌కు అరుదైన అవకాశం కల్పించి హారిక తన రుణం తీర్చుకుంది. అసలు మన తెలివైనోడు మర్చిపోయిన కండీషన్ ఏంటి? మోనాల్ రుణం హారిక ఎలా తీర్చుకుందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. మరింత రెచ్చిపోయిన పులిహోర రాజా పులిహోర కలపడంతో అఖిల్ ఆరితేరిపోయాడు. చాన్స్ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిన్న పులిహోర రాజా అన్న మోనాల్‌తో గొడవ పడిన అఖిల్.. ఈ రోజు ఏమో ఆమె ముందే హారికను ఫ్లర్ట్ చేశాడు. హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్‌లో ఉండగా.. అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. సొహైల్ చూసి.. ఏంటి ఆమె దగ్గరకు పోతున్నావ్ అని అనడంతో.. హారికను వెనకనుంచి వాటేసుకుని ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది? అంటూ ఆమెతో మాటలు కలపడం స్టార్ట్ చేశాడు. ఏంట్రా ఇది అంటూనే హారిక కూడా అఖిల్‌తో డబుల్ మీనింగ్ వచ్చే మాటలు మాట్లాడింది. ఇక హారిక మాటలకు అఖిల్ మరింత రెచ్చిపోయి ఆమెపై పాట పాడుతూ.. పక్కనే ఉన్న మోనాల్‌ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. కానీ మోనాల్ మాత్రం ఏమి విననట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఎదురుగా ఉన్న సోహైల్.. పులిహోర కలపడంలో నువ్వే తోపువంటూ అఖిల్‌పై పంచ్ వేశాడు. ‘నన్ను కుక్క అనుకున్నా పర్లేదు.. కుక్కకు విశ్వాసం ఉంటుంది.. మా యాజమాని(హారిక) దగ్గరకి వస్తే కరిచేస్తా’ అంటూ ఘోరమైన పులిహోర కలిపాడు. స్టెప్పులేసి.. గొల్డెన్ మైక్ పట్టు ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే మూడు రకాల టాస్క్‌లు ఇచ్చిన బిగ్‌బాస్.. నాల్లో టాస్క్‌గా వినోదాన్ని అందించే చాన్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజు షూ ధరించి స్లేజ్పై డాన్స్ చేయాలి. ఆ సమయంలో ఎవరూ కూడా స్జేజీపై కూర్చోవడం కానీ, నిలబడటం కానీ చేయకూడదు. అలాగే మధ్య మధ్య మ్యూజిక్ ఆపేస్తానని.. అప్పుడు ఒకరు కిందకు దిగాలని కండీషన్ పెట్టాడు. అయితే ఎవర దిగిపోతారో ఇంటి సభ్యల ఇష్టమని చెప్పాడు. ఈ టాస్క్‌కు అఖిల్‌ని సంచాలకుడిగా నియమించాడు. కిందికి ఎవరి దించాలో అఖిల్ కూడా సూచించవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. చివరి వరకు స్టేజీపై ఎవరు ఉంటారో వారికి గోల్డెన్ మైక్ లభిస్తుందని చెప్పాడు. అయ్యో అభి.. చూసుకోవాలిగా దీంటో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజ్ గల షూ ధరించి డాన్స్ చేశారు. మొదటి సారి మ్యూజిక్ ఆపేయగా.. అఖిల్ పాటు మిగతా ఇంటి సభ్యులంతా అరియానాను దిగాల్సిందిగా కోరారు. ఆమెకు ఇదివరకే రెండు సార్లు ప్రేక్షకులతో మాట్లాడే చాన్స్ వచ్చిందని, ఈ సారి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నారు. అయితే ఇక్కడ అరియానా కొంచెం అతి చేసింది. తాను దిగేందుకు సిద్దంగా ఉన్నానంటునే ఇప్పుడు మాత్రం దిగనని, రెండోసారి దిగుతానని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఎవరు దిగుతారని అభిజిత్ ప్రశ్నించగా.. సోహైల్ కూడా ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసే చాన్స్ వచ్చింది కదా.. ఆయన్ని దిగమని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎందుకు దిగవని చెబితే.. నాకు డాన్స్ చేయాలని ఉందని, ఏవోవో చెప్పుకొచ్చింది. ఇక అరియానా ఇప్పట్లో ఒప్పుకునేలా లేదనుకున్న అభిజిత్.. టాస్క్ కండీషన్ మర్చిపోయి కింద కూర్చున్నాడు. ఈ విషయాన్ని మోనాల్ గుర్తు చేసింది. దీంతో మొదటి సారి మన తెలివైనోడు.. తనకు ఈ విషయం తెలియదని, పొరపాటు జరిగిపోయిందంటూ స్టేజీ దిగేశాడు. ఇక అభి మొదటి సారి టాస్క్ కండీషన్స్ మర్చిపోవడంతో ఇంటి సభ్యులు అంతా అవాక్కయ్యారు. సోహైల్ అయితే.. ఏంటి అభి.. ప్రతిసారి టాస్క్ పేపర్ క్షుణ్ణంగా చదువుతావు.. ఈ సారి ఏమైంది చూసుకోవాలి కదా..అని నవ్వుతూ అభిపై సెటైర్లు వేశాడు. అందుకే దిగుతున్నా : అరియానా ఇక రెండో సారి మ్యూజిక్ ఆగినప్పుడు అరియానా దిగుతూ..తనకు ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసుకునే చాన్స్ వచ్చిందని, మిగతవారికి కూడా రావాలనే స్టేజీ దిగుతున్నానని చెప్పి దిగిపోయింది. అలా మూడో సారి సోహైల్ దిగిపోయాడు. తానకు డాన్స్ చేయాలని ఉందని, కేవలం హౌస్మేట్స్ కోసమే కిందికి దిగుతున్నానని చెప్పాడు. అనంతరం వాష్‌రూమ్ దగ్గరకు వెళ్లి అరియానాపై బిగ్‌బాస్‌కు కంప్లైంట్ ఇచ్చాడు. ఇదివరకు జరిగిన టాస్క్‌లో ఇంటి సభ్యుల కోసం త్యాగం చేయమంటే చేయని అరియానా ఇప్పుడు ఎందుకు ఇచ్చిందని తప్పుపట్టాడు. మోనాల్ రుణం తీర్చుకున్న హారిక ఇక స్టేజీపై చివరకు హారిక, మోనాల్ మాత్రమే మిగిలి ఉన్నారు.ఇద్దరిలో ఒకరు దిగాల్సిరావడంతో.. హారికను దిగాల్సిందిగా మోనాల్ రిక్వెస్ట్ చేసింది. ఒక టాస్క్‌లో లాస్ట్ వరకు ఉండటం ఇది రెండో సారి అని, ఈ చాన్స్ తనకు చాలా ముఖ్యమని హారికను రిక్వెస్ట్ చేసింది. ఒక్కనిమిషం ఆలోచించిన హారిక.. చివరకు గోల్డెన్ మైక్‌ను మోనాల్‌కు త్యాగం చేసింది. కెప్టెన్సీ టాస్క్‌లో తనను భుజాలపై ఎత్తుకొని గెలిపించావని, అందుకే ఇప్పుడు నేను ఈ చాన్స్ ఇస్తున్నా అని హారిక చెప్పి దిగిపోయింది. ఇక టాస్క్ గెలిచి గొల్డెన్ మైక్ సాధించిన మోనాల్.. కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లి ఓట్లు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. అనంతరం గార్డెన్ ఏరియాకు వచ్చి సంతోషంతో బిగ్‌బాస్‌కు హగ్‌లు, ఫ్లైకింగ్ కిస్‌లు ఇచ్చేసింది. -
బిగ్‌బాస్ : అయ్యో అరియానా.. అభితో కూడా లొల్లేనా
బిగ్‌బాస్ నాల్గో సీజన్ చివరి రోజులు అరియానాకు కలిసి రావడంలేదనే చెప్పాలి. ఈ వారం అంతా ఈ బోల్డ్ బ్యూటీ ఏడుస్తూనే ఉంది. టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని కలిసిపోయే అరియానా, సోహైల్ ఈ వారంలో పెద్ద లొల్లి పెట్టుకున్నారు. అలాగే మోనాల్‌తో కూడా అరియానాకు గొడవ జరిగింది. అఖిల్ కూడా సోహైల్‌కు సపోర్ట్ చేస్తూ అరియానాతో కాస్త దూరంగానే ఉంటున్నాడు. ఇక ఇంట్లో అరియానాకు ప్రస్తుతం అంతో ఇంతో క్లోజ్‌గా ఉంది ఎవరంటే హారిక, అభిజిత్ అనే చెప్పాలి. అయితే చివరికి అభిజిత్‌తో కూడా అరియానాకు గొడవ జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ అవకాశం కల్పిస్తున్నాడు. చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ గెలిచిన వారికి ఓట్లు అభ్యర్థించే అవకాశం కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు ఇంటి సభ్యులకు డాన్స్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ ప్లే చేస్తున్నంతసేపు ఇంటి సభ్యులంతా స్టేజ్ మీద డాన్స్ చేయాలి. అయితే మ్యూజిక్ ఆపినప్పుడు మాత్రం స్టేజ్ మీద నుంచి ఒకరు దిగిపోవాలని కండిషన్ పెట్టాడు. దీంట్లో భాగంగా హారిక, మోనాల్, అఖిల్ ముందుగానే దిగిపోయినట్లు తెలుస్తోంది. చివరికి అభిజిత్, సోహైల్, అరియానా మిగిలారు. మరోసారి మ్యూజిక్ ఆగిపోగా.. ముగ్గురిలో ఒకరు దిగాల్సి వచ్చింది. వీరిలో ఏ ఒక్కరు కూడా దిగేందుకు ఇష్టపడలేదు. తనకు డాన్స్ చేయాలని ఉందని, తర్వాత మ్యూజిక్ ఆగితే ఆటోమెటిక్‌గా దిగుతానని అరియానా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు దిగకపోతే ఎవరో ఒకరు దిగాలి కదా అని అభిజిత్ అనగా..నేను, సోహైల్ ఇద్దరం వెళ్లాం కదా అని అరియానా చెప్పింది. అలా అయితే మీరిద్దరే మాట్లాడుకోవాలని హారిక సూచించగా.. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారి సోహైల్ గరం అయ్యారు. ఇక అరియానా ఏమో నా ఒపియన్ నేను చెప్పా అంటుంది. అభిజిత్ ఇట్స్ ఓకే.. డన్ లెట్స్ గో అంటూ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. ఈ ప్రోమో చూస్తే అభి కూడా అరియానాకు కాస్త దూరమయినట్లే కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో. మరి అరియానా,అభి కలిశారా లేదో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్లో చూడాలి. -
శివగామికి కొత్త నిర్వచనం చెప్పిన అభిజిత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టికెట్ టు ఫినాలే గెలిచిన అఖిల్ నేరుగా ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో అతడు మినహా మిగతా ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఎంటర్టైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోండని బిగ్‌బాస్ వీళ్లకు వరుస టాస్కులు ఇస్తున్నాడు. వాటిని ఎలాగైనా గెలవాలన్న కసితో కంటెస్టెంట్లు ఆడుతున్నారు. ఇప్పటికే అధికారం టాస్కులో అరియానా, ఓపిక టాస్కులో సోహైల్ గెలిచి.. ప్రేక్షకులను ఓట్లేయమని అభ్యర్థించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఏకాగ్రత అనే మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్లు ఏదైనా పని చేస్తూ 30 నిమిషాలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. మిగతావాళ్లు ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయొచ్చు. ఈ క్రమంలో అభిజిత్ తనలోని కామెడీ టైమింగ్‌ను బయట పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. (బొమ్మ లొల్లి: శోకాలు పెట్టిన టామ్ అండ్ జెర్రీ) ఇందులో టాస్క్ పూర్తి చేయడంలో మునిగిపోయిన సోహైల్‌ను నీకు బాగా నచ్చిన పనేంటని అభి ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా నినిద్ర పోవవడం అని సమాధానమిచ్చాడు. తర్వాత హారిక.. ఇక్కడున్నవాళ్లలో ఎవరిని శివగామితో పోలుస్తావు? అని అడగ్గా అభి తెలివిగా సమాధానమిచ్చాడు. శివగామిలో ఉన్న అందం మోనాల్‌కు ఉంది, శివగామిలో ఉన్న టెర్రర్ అరియానాకు ఉంది. శివగామిలో ఉన్న ప్రేమ హారికకు ఉంది అని చాలా క్లారిటీగా చెప్పాడు. ఇక టాస్క్ చేస్తున్న మోనాల్‌ను అభి.. ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉందని ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ భారత్-చైనా సరిహద్దులో ఉందని చెప్పింది. ఈ సమాధానం విని షాక్ అయిన అభి ఉన్నచోటే కింద పడిపోయాడు. మొత్తానికి రెండు రోజులుగా గొడవలతో వేడెక్కిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో అభి తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచనున్నట్లు తెలుస్తోంది. (బిగ్‌బాస్ విన్నర్ అభిజితే: శ్రీకాంత్) -
విన్నర్ ఎవరో తేల్చేసిన హీరో శ్రీకాంత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ ఎవరనేది మరో రెండు వారాల్లో తేలనుంది. ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలన్న కసితో ఇంటిసభ్యులు గేమ్‌పై ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎలాగైనా గెలిపించాలన్న తపనతో అభిమానులు కూడా ఓట్ల ప్రచారం చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం వీరికి తోడుగా నిలుస్తున్నారు. అయితే ముందు నుంచీ కూడా అభిజితే గెలుస్తాడన్న బలమైన ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. తాజాగా హీరో శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి కన్నా అభిజిత్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. అతడితో పాటు అరియానా, అఖిల్. సోహైల్, హారిక టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారమైతే అభిజిత్ విన్నర్ అవుతాడని అనిపిస్తోందని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఇప్పటికే నాగబాబు అభిజిత్‌కు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా అభికే తమ ఓటని తేల్చి చెప్పారు. (చదవండి: రంగంలోకి దిగిన ‘నారప్ప’... టీజర్ అప్పుడే) కాగా శ్రీకాంత్‌కు బిగ్‌బాస్ షో అంటే ఎంతో ఇష్టం. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ బిగ్‌బాస్‌ను చూస్తుంటారు. గతేడాది ఆయన బిగ్‌బాస్ మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా వెళ్లారు. కంటెస్టెంట్లతో డీల్ కుదిర్చేందుకు వెళ్లారు కానీ, ఎవరూ దానికి అంగీకరించలేదు. ఇప్పుడు నాల్గో సీజన్‌ను కూడా ఆయన బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అభితో ఉండట్లేదని హారికను తిడుతున్న నెటిజన్లు) -
బిగ్‌బాస్: దేత్తడిపై ట్రోలింగ్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఇప్పుడు మూడు జంటలు మాత్రమే మిగిలాయి. అది అభిజిత్- హారిక, అఖిల్-మోనాల్, సోహైల్-అరియానా. వీరిలో సోహైల్ జంట ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకోవడానికే సరిపోతుంది. మరోవైపు అఖిల్ జోడీ మధ్య దూరం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలింది అభిక జోడీ. మొదటి నుంచి కలిసి ఉన్న ఈ జోడీ ఈ మధ్య పెద్దగా కలిసి కనిపించడం లేదు. నీకోసం ఎప్పుడూ నేనుంటా అని చెప్పిన హారిక ఈ మధ్య అభితో ఎక్కువ సమయం గడపట్లేదు. నాగార్జున వచ్చినప్పుడు కూడా అభి ఇదే విషయాన్ని చెప్తూ కాస్త డల్‌గా ఫీలయ్యాడు. చూస్తుంటే అభిజిత్ చెప్పింది కూడా నిజమేననిపిస్తోంది. ఎప్పుడూ అతడితో మాత్రమే ఉండే హారిక ఇప్పుడు అందరితో కలిసిపోయింది. ముఖ్యంగా అఖిల్‌తో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది అభిజిత్ అభిమానులకు బొత్తిగా నచ్చడం లేదు. అభిని వదిలేసి, అఖిల్‌తో.. నిన్నటి టాస్కులో మహారాణిగా అవతారమెత్తిన హారిక తను పిలవగానే అభి రాలేదని అతడి బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. అది చూసిన అభి ఆమెపై ఏ మాత్రం కోప్పడలేదు. అవి నోయల్ బట్టలు అని ఆమెకు వివరణ ఇచ్చాడు. పైగా హారిక అనుమతి తీసుకుని ఆ బట్టలను నీళ్లలో నుంచి బయటకు తీసి ఆరేశాడు. అయితే హారిక కావాలనే అభి మీద కోపాన్ని చూపిస్తోందని కొందరు తప్పులో కాలేస్తున్నారు. హారిక తీరు ఈ మధ్య అస్సలు బాగోలేదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అభిజిత్‌కు దూరంగా ఉండటంపై ఆయన అభిమానులు కొందరు గుర్రుగా ఉన్నారు. ఇన్ని వారాలు అభితో ఉండి, ఇప్పుడు మాత్రం అతడిని ఒంటరిగా వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఓట్లు వేసేదే లేదని తేల్చి చెప్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అందరికీ దూరంగా నోయల్) గంట ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయకండి: నోయల్ ఈ ట్రోలింగ్‌పై హారిక ఫ్యాన్స్ కూడా ధీటుగా సమాధానమిస్తున్నారు. 'అభితో మాత్రమే ఉంటే ఎవరితో కలవట్లేదని తిడతారు, ఇప్పుడు అందరితో కలిస్తే అభిని వదిలేసిందని ట్రోల్ చేస్తారు, ఆమె ఏం చేసినా నిందిస్తారా?' అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. 'ఒకరితో క్లోజ్‌గా ఉన్నట్లు చూపించినంత మాత్రాన అభితో ఉండట్లేదని ఎలా అనుకుంటారు?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. హారికను టార్గెట్ చేయడంపై ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నోయల్ సైతం స్పందించారు. అభిజిత్, హారికల బంధం ఎలాంటిదో తనకు తెలుసని, ఒక్క గంట ఎపిసోడ్ చూసి వారిని జడ్జ్ చేయకండని కోరాడు. కేవలం టాస్క్‌లో భాగంగానే హారిక తన బట్టలను నీళ్లలో పడేసిందని స్పష్టం చేశాడు. (చదవండి: సోహైల్ చేస్తే ఒప్పు? హారిక చేస్తే తప్పా?) -
బిగ్‌బాస్: నా గర్ల్‌ఫ్రెండ్ జోలికి రావద్దు!
నిబంధనలు పాటించకపోతే కంటెస్టెంట్లకు మొట్టికాయలు వేసే బిగ్‌బాస్ తొలిసారి తను పెట్టిన రూల్స్ కూడా మార్చుకోవచ్చని బంపరాఫర్ ప్రకటించాడు. కావాలనుకుంటే సొంతంగా రూల్స్ పెట్టుకుని మరీ బిగ్‌బాస్ హౌస్‌ను మీకు నచ్చినట్లు వాడుకోండని చెప్పాడు. అయితే ఓ కండీషన్ పెట్టాడు. ఎంటర్టైన్ చేయాలని ఆదేశించాడు. అలా "రాజారాణి" టాస్కులో ఇంటిసభ్యులు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించారు. నిన్న సోహైల్, అభిజిత్, హారిక వంతు రాగా నేడు మోనాల్ వంతు వచ్చింది. వినోదాన్ని పంచేందుకు మోనాల్ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించినట్లు కనిపిస్తోంది. ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్ చేయిస్తోంది. అందులో భాగంగా అభిజిత్-అరియానా, సోహైల్-హారిక జంటలుగా విడిపోయారు. కాకపోతే ఇందులో ఓ ట్విస్టుంది. అరియానా గర్ల్‌ఫ్రెండ్‌గా అభి, హారిక గర్ల్‌ఫ్రెండ్‌గా సోహైల్ పాత్రలు పోషించినట్లు కనిపిస్తోంది. అరియానా గారూ.. అంటూ గెంతులు వేసుకుంటూ వచ్చిన అభిని ఆమె బంగారం అంటూ దగ్గరకు తీసుకుంది. ఇంతలో అభి మీద సోహైల్ రంకెలేయడంతో అరియానా రెచ్చిపోయింది. ఎవడ్రా? నా గర్ల్‌ఫ్రెండ్ జోలికి వచ్చేది అని శివాలెత్తించింది. ఆడపిల్లలు అంటే ఆటబొమ్మలైపోయారా అంటూ హారికను కూడా గట్టిగానే వేసుకుంది. మొత్తానికి అరియానా పర్ఫామెన్స్తో ఈ స్కిట్టు బాగా పేలినట్లు కనిపిస్తోంది. చూస్తుంటే మహారాణి మోనాల్ రాజ్యంలో మంత్రితో పాటు ప్రజలు కూడా సంతోషంగా ఫీలైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ అధికారం టాస్కులో అరియానా విజృంభిస్తోంది. మొత్తానికి ఈ ప్రేమికుల గొడవను చూసి కడుపుబ్బా నవ్వుకోవాలంటే రాత్రి పది గంటల వరకు వేచి చూడాల్సిందే! (బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్) -
బిగ్‌బాస్: గాయాలపాలైన అభిజిత్!
బయట జనాలొకటి తలుస్తుంటే లోపల కంటెస్టెంట్లు మరోలా ఆలోచిస్తున్నారు. నిన్న బిగ్‌బాస్ ఇంట్లోవాళ్లను ఎవరికి వారు ర్యాంకింగ్స్ ఇచ్చుకోమని చెప్పగానే అందరూ మొదటి స్థానాల వైపు కన్నేస్తే అభిజిత్ మాత్రం నేరుగా వెళ్లి ఆరో స్థానంలో నిలబడ్డాడు. మొదటి నుంచి అన్ని టాస్కుల్లో వంద శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న తాను జలజ దెయ్యం ఇచ్చిన మోనాల్‌తో డేటింగ్ అనే టాస్కు మాత్రం చేయలేదని తన తప్పును ప్రస్తావించాడు. ఆ ఒక్క పొరపాటు కారణంగా వరస్ట్ పర్ఫార్మర్గా నిలిచేందుకు సిద్ధమేనని చెప్పాడు. దీంతో బిగ్‌బాస్ అభిని వరస్ట్ పెర్ఫార్మర్గా ప్రకటించి జైలుకు పంపాడు. కంటెస్టెంట్లను వేధిస్తున్న అనారోగ్యం.. అయితే నేడు అతడి జైలు శిక్ష పూర్తి కానుందట. అలాగే హౌస్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్కు జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో అభి స్విమ్మింగ్ పూల్ దగ్గర టాస్కు చేస్తున్న క్రమంలో గాయాలపాలయ్యాడట. అతడి చేతికి, కాలికి స్వల్ప గాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ఈ సీజన్లో కంటెస్టెంట్లను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గంగవ్వ, నోయల్ అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. మధ్యలో అవినాష్ కూడా కాలు బెణికి కొంత ఇబ్బంది పడ్డాడు. (చదవండి: బిగ్‌బాస్ : వరస్ట్ పెర్ఫార్మర్గా అభిజిత్.. జైలు శిక్ష) భుజాల నొప్పి వేధిస్తున్నా.. ఇక అభిజిత్ విషయానికివస్తే గతంలో అతడి భుజానికి గాయమైందని ఆమె తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందువల్లే టాస్కులు సరిగా ఆడలేకపోతున్నాడని క్లారిటీ ఇచ్చింది. కానీ అభి మాత్రం ఈ విషయాన్ని ఎప్పుడూ షోలో వెల్లడించడానికి ఇష్టపడలేదు. పైగా రోబో టాస్క్ మినహా అభి ఇతర టాస్కులు పెద్దగా ఆడింది లేదని మిగతా ఇంటి సభ్యులు అతడిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో కసితో రగిలిపోయిన అతడు కమాండో ఇన్స్టిట్యూట్ గేమ్‌లో ఫిజికల్ టాస్కు ఆడి స్టార్ సంపాదించాడు. కెప్టెన్సీ పోటీదారునిగా ఎంపికయ్యాడు, కానీ కెప్టెన్ కాలేకపోయాడు. 'రేస్ టు ఫినాలే' టాస్క్‌లో సైతం తనవంతు అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఇలా టాస్కుల్లోనూ విజృంభిస్తున్న తరుణంలో అభికి గాయాలు కావడం ఆయన అభిమానులను కలవరపరుస్తోంది. అయితే అతడికి చిన్నచిన్న గాయాలే అయ్యాయంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమనేది నేటి ఎపిసోడ్లో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్‌లో పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్) -
బిగ్‌బాస్ : తప్పు చేశా.. వరస్ట్ పెర్ఫార్మర్ నేనే : అభి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ వరస్ట్ ఫెర్ఫార్మర్‌గా తనను ఎంచుకోండని అభిజిత్ బిగ్‌బాస్‌ను వేడుకున్నాడు. తాను గత వారం ఓ తప్పు చేశానని, అందుకు శిక్షగా తనను చెత్త ఆటగాడిగా ప్రకటించాలని కోరారు. ఇంతకీ అభిజిత్ చేసిన తప్పేంటి? ఇంట్లో ఎవరు బెస్ట్ ఫెర్ఫార్మర్ అయ్యారు? అసలు బెస్ట్, వరస్ట్ బిరుదు ఎవరు, ఎందుకు ప్రకటించారో చదివేద్దాం. టికెట్ టూ ఫినాలే విన్నర్ అఖిల్ 'టికెట్ టు ఫినాలే' రేస్‌లో భాగంగా సోహైల్, అఖిల్ రాత్రి మొత్తం ఉయ్యాలపైనే కునుకు తీశారు. ఇక వారితో పాటు సంచాలకుడిగా వ్యవహరిస్తున్న అఖిల్ కూడా గార్డెన్ ఏరియాలోనే ఉండిపోయాడు. ఉదయం అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఇద్దరూ ఉయ్యాలలనే ఉండిపోయారు. ఇక ఎలాగో వీళ్లు దిగేలా లేరని ఫిక్సయినా అభి.. ఇద్దరూ ఆలోచించుకోండి అని సలహా ఇచ్చాడు. దీంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అఖిల్ ఏమో అమ్మ సెంటిమెంట్‌ను తీసుకొచ్చాడు. ‘ఈ గేమ్ ఇద్దరికీ ఇంపార్టెంటే. మా అమ్మ వచ్చి కెప్టెన్ అవ్వు అని అడిగినా నేను కాలేకపోయా. నేనే టాప్ 5 ఉంటానని అమ్మకు చెప్పా. మా అన్న వచ్చి కూడా నన్ను టాప్ 5లో పెట్టలేదు. అదే కొంచెం భయంగా ఉంది’ అంటూ సోహైల్‌ని సెంటిమెంట్ దెబ్బ కొట్టాడు. దీంతో కరిగిపోయిన సోహైల్.. ఉయ్యాల దిగేందుకు సిద్దమయ్యాడు. కానీ అఖిల్ అడ్డుకొని వద్దని వారించాడు. పర్లేదు నేను దిగుతా.. ఈ గేమ్ నాకు కూడా ఇంపార్టెంటే కానీ.. నీ కోసం నేను దిగుతా.. మనం సాయంత్రం వరకూ ఉండమన్నా ఉంటాం.. అది బిగ్ బాస్‌కి కూడా తెలుసు. నా భయం ఏంటంటే మళ్లీ బిగ్ బాస్ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తారో గేమ్ అటూ ఇటూ కాకుండా పోతుంది. నువ్వూ నేనూ ఉడుము పట్టే వెనక్కి తగ్గం’ అని సొహైల్ అనడంతో అఖిల్ నేను నామినేషన్లో ఉన్నా.. ఒక వేళ నేను ఈ వీక్ ఎలిమినేట్ అయితే టికెట్ ఫినాలే వృధా అయిపోతుంది. అందుకే నువ్వే ఆ టికెట్ తీసుకో. నన్ను ఉయ్యాలలో నుంచి తోసెయ్ అని చెప్పాడు. దీంతో సోహైల్ మరోసారి ఎమోషనల్ అయి గట్టిగా ఏడ్చేశాడు. అనంతరం ఏం చేద్దాం అని అఖిల్ అడగడంతో.. నాకేం అర్థం కావడం లేదు అఖిల్.. నువ్ నన్ను తమ్ముడిలా తీసుకున్నావ్.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యావ్.. ఎవర్నీ నన్న చూసుకున్నట్టు చూసుకోలేదు అని సొహైల్ ఎమోషనల్ కావడంతో అఖిల్ ఇంకా ఎక్కువ ఏడ్చేశాడు. చివరికి మా వల్ల కావడం లేదు బిగ్ బాస్ ఏదొకటి చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అనంతరం కొంచె జరుగు అని చెప్పి సోహైల్ ఒక్కసారిగా ఉయ్యాల నుంచి కిందిగి దిగేశాడు. దీంతో షాకైన అఖిల్.. భోరున విలపించాడు. మొత్తానికి సొహైల్ చేసిన త్యాగంతో అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ సాధించి టాప్ 5కి వెళ్లాడు.ఈ టాస్క్ విజేత కావడంతో బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి ఫైనలిస్ట్ అయ్యాడని బిగ్ బాస్ అభినందించారు. ఈవారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయితే నేరుగా ఫినాలేకి వెళ్తారని చెప్పారు బిగ్ బాస్. థ్యాంక్స్ అభి.. అఖిల్ నిన్న హారికతో జరిగిన గొడవను అభిజిత్ క్లియర్ చేసుకున్నాడు. నా విషయంలో ఒక స్టాండ్ తీసుకోలేవు అంటూ బాధపడ్డాడు. ఒక్కసారి కూడా నాకు హెల్ఫ్ చేయలేదని, నేను చెప్పిన విషయాలను కూడా సీరియస్ తీసుకోవని కొంచెం అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను నీ ఫ్రెండ్‌గా చెప్తున్నా.. కొన్ని కొన్ని విషయాలను అర్థం చేసుకుని నీ ప్రాబ్లమ్ ఇదీ అని చెప్తావని చూస్తా. కానీ నువ్ స్టాండ్ తీసుకోవు’ అని అభిజిత్ బాధపడ్డాడు. ‘స్టాండ్ తీసుకోవడం అంటే ఏంటి.. అభి? ఒకేదాని కోసం ఎందుకు ఆలోచిస్తూ కూర్చోవడం మర్చిపోవచ్చు కదా అని చెప్పా అంతేగా అని హారిక తనను తాను సమర్థించుకుంది. మర్చిపో అంటున్నావ్ తప్పితే హెల్ప్ చేయడం నీ వల్ల కావడం లేదా? నువ్ అర్థం చేసుకోవా? అని అభిజిత్ తిరిగి ప్రశ్నించాడు. అలాగే అఖిల్ గురించి మాట్లాడుతూ.. తాను నన్ను ఓరేయ్ అనొద్దని చెప్పినందుకు నామినేట్ చేశాడు. నేను ఎవరితో ఇలా మాట్లాడా అంటూ యాటిట్యూడ్ చూపించాడని అఖిల్‌పై తన అక్కసును వెళ్లగక్కుతుండగా.. సడన్‌గా అఖిల్ వచ్చి అభికి థ్యాంక్స్ చెప్పాడు. దీంతో కంగుతిన్న అభి.. నీ గురించే మాట్లాడుకుంటున్నామని ఉన్న ముచ్చట చెప్పాడు. ఇక టికెట్ టూ ఫినాలేలో మాతో పాటు నువ్వు కూడా నిద్రపోకుండా ఉన్నావని, మంచిగా సపోర్ట్ చేశావంటూ మరోసారి అభిజిత్‌కి థ్యాంక్స్ చెప్పాడు అఖిల్. నాగార్జునకు జోడిగా నటిస్తా : మోనాల్ ఇంటి సభ్యులకు ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌ను పెట్టాడు బిగ్‌బాస్. అందరూ రౌండ్‌గా నిలబడి రియల్ మ్యాంగో డ్రింక్ తాగుతూ ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయాలని, ఎవరిదగ్గరైతే మ్యాంగో డ్రింక్ అయిపోతుందో వాళ్లు ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడాలని చెప్పాడు. మొదటగా సోహైల్ ఓడిపోయి.. డేర్ ఎంచుకున్నాడు. అందుకుగాను మ్యాంగో డ్రింక్ బాటిల్‌ని చేతులతో టచ్ చేయకుండా నోటితో తాగి విజయం సాధించాడు. అనంతరం అభిజిత్ ఓడిపోయి ట్రూత్ ఎంచుకొని తన స్కూల్ డేస్లోని క్రష్ ఉన్నా అమ్మాయిల పేర్లు చెప్పాడు. ఆ తర్వాత మోనాల్ ట్రూత్ ఎంచుకుంది. వరణ్ తేజ్, నాగార్జున, విజయదేవరకొండ, అల్లు అర్జున్‌తో చాన్స్ వస్తే మొదట ఎవరితో సినిమా చేస్తావని అడగ్గా.. మోనాల్ తెలివిగా నాగార్జున పేరు చెప్పి మార్కులు కొట్టేసింది. అవినాష్ ఒగ్గు కథకు హౌస్మేట్స్ ఫిదా ఇక ఇంటి సభ్యులను నవ్వించడంలో ఎప్పుడు ముందుండే అవినాష్.. ఈ సారి ఒగ్గుకథతో ఇంటి సభ్యులను ఆకట్టుకున్నాడు. కిచెన్ వంట చేస్తున్న అరియానా, మోనాల్ దగ్గరికి వెళ్లి ఒగ్గుకథ రూపంలో వారిని పొగిడాడు. అరియానాను ఇలియానాలో పోల్చుతూ..తనదైన శైలీలో పొగిడేశాడు. అవినాష్ పొగడ్తలకు పొంగిపోయిన అరియానా.. ఒక్కసారిగా వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇలా ప్రతి ఒక్కరిని ఒగ్గుకథ రూపంలో పొగిడాడు. దీంతో ఇంటి సభ్యులంతా ఎమెషనల్ అయి.. అవినాష్‌ని హగ్ చేసుకున్నారు. ఇంటి సభ్యుల ప్రేమకు అవినాష్ కూడా ఫిదా అయిపోయాడు. బెస్ట్ ఫెర్ఫార్మర్ సోహైల్.. వరస్ట్ ఫెర్ఫార్మర్ అభిజిత్ గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా నెంబర్ గేమ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని బెస్ట్ ఫెర్మార్మర్ ఆఫ్ దీ సీజన్‌గా, చివరి స్థానంలో ఉన్న వారిని వరస్ట్ ఫెర్మార్మర్ ఆఫ్‌ది సీజన్‌గా ప్రకటిస్తానని బిగ్‌బాస్ ముందే అనౌన్స్ చేశాడు. టికెట్ టు ఫినాలే గెలినందున అఖిల్‌కు ఈ టాస్క్ నుంచి మినహాయింపు లభిచింది. ఇక ఉన్న మిగతా ఆరుగురిలో మొదటి స్థానంలో సోహైల్, రెండో స్థానంలో అరియానా, మూడో స్థానంలో హారిక, నాల్గో స్థానంలో మోనాల్, ఐదో, ఆరో స్థానాల్లో అవినాష్, అభిజిత్ నిలబడ్డారు. ఆ తర్వాత వారు ఏ స్థానం కోరుకుంటున్నారో ఇలా వివరించారు. సోహైల్ : ఏ టాస్క్ ఇచ్చినా 100 శాతం చేశా. తప్పు చేయకున్నా కొన్నిసార్లు సారీ చెప్పా. కోపం ఉన్నా.. టాస్క్‌లు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు.అందుకే నాకు మొదటి స్థానం కావాలి అరియానా : బిగ్‌బాస్ ఆట వ్యక్తిగతం. కొన్ని టాస్క్‌లు కలిసి ఆడాల్సి వస్తోంది. మరికొన్ని వ్యక్తిగతంగా ఆడాలి. అలాంటి టాస్క్‌లను గేను సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగానే ఆడాను. అందుకే నేను కూడా మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాను అవినాష్ : ఇంట్లో తక్కువ నామినేట్ అయింది నేను ఒక్కడినే. వరస్ట్ ఫెర్మారర్ అని ఒక్కరు కూడా అనలేదు. కొన్ని తప్పిదాలు చేశాను కాబట్టి నాకు రెండో స్థానం కావాలని కోరుకుంటున్నా. హారిక : కెప్టెన్‌గా ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అందుకే టాప్ 2 కావాలి. మోనాల్ : జనాల వల్ల ప్రతి వారం నామినేషన్లో ఉన్నా.. సేవ్ అవుతూ 13వ వారానికి చేరుకున్న. గేమ్ కూడా ఆడుతున్నా. నాకు మూడో స్థానం కావాలి. అభిజిత్ : నేను మొదటి నుంచి గేమ్ బాగా ఆడాను. ప్రతి టాస్క్ వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడాను. గత వారం మిస్టేక్ తప్పితే(మోనాల్‌ని డేట్ తీసుకెళ్లనని చెప్పడం), టాస్క్ పరంగా నేను ఎప్పడు వెనుకడుగు వేయలేదు. అయితే ఆ ఒక్క విషయంలో నేను పొరపాటు చేశాను. కాబట్టి ఈ సీజన్ వరస్ట్ ఫెర్ఫార్మర్ తీసుకోవాడిని రెడీగా ఉన్నా. ఇలా కొన్ని వాదలన అనంతరం అందరు తమ తమ స్థానాల్లోనే నిల్చోని.. ఇదే మా నిర్ణయం అంటూ బిగ్‌బాస్‌కు తెలియజేశారు. దీంతో బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా సోహైల్‌ని, వరస్ట్ ఫెర్మార్మర్‌గా అభిజిత్‌ను ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం ఈ సీజన్‌కి వరస్ట్ ఫెర్మార్మర్‌గా ఎన్నికైన అభిజిత్..జైలు శిక్ష అనుభవించాలని బిగ్‌బాస్ ఆదేశించారు. దీంతో అభిజిత్ ఖైదీ దుస్తులు ధరించి జైలుకి వెళ్లాడు. -
బిగ్‌బాస్ : అభిజిత్‌కి జైలు శిక్ష.. నెంబర్ వన్ అతనే!
బిగ్‌బాస్ హౌస్‌లో గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా నెంబర్ గేమ్ టాస్క్ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్‌లో నెంబర్ గేమ్ నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా అఖిల్, సోహైల్ మొదటి స్థానంలో నిలబడినట్లు ప్రోమోలో చూపించినప్పటికీ టికెట్ టు ఫినాలే గెలిచినందుకు అఖిల్‌ను ఈ టాస్క్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. దీంతో సోహైల్ ఒక్కడే మొదటి స్థానంలో నిలబడ్డాడని టాక్. ఇక రెండో స్థానంలో అరియానా నిలబడింది. (చదవండి : బిగ్‌బాస్ : ఫినాలేకు అతిథిగా స్టార్ హీరో!) ఇక, మూడు నాలుగు స్థానాల్లో హారిక, మోనాల్ నిలిచారు. ఐదో స్థానంలో అవినాష్ ఉండగా, చిట్ట చివరన అభిజీత్ ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ టాస్క్‌లో గొడవ కంటే ఎక్కువగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరం ఇక్కడ ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా గ్రిల్ అయిపోయాం బిగ్‌బాస్ అని అరియానా అనగా.. ఇందాకే బిగ్‌బాస్ అందరం కలిసి హగ్ చేసుకున్నాం అని సోహైల్ కంటతడి పెట్టాడు. ఇదిలా ఉంటే బయట భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అభిజిత్.. ఆరోస్థానంలో నిలబడటం అందరిని అశ్చర్యపరిచింది. గత నాలుగు వారాల క్రితం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఇంటి సభ్యులంతా అభిజిత్‌కి నెంబర్ వన్ ర్యాంకు ఇచ్చారు. ఇప్పుడేమోఅందరి కంటే చివరి స్థానం ఇవ్వడం అభిజిత్‌కి అవమానమనే చెప్పాలి. ఇక నెంబర్ గేమ్‌లో అభికి చివరి ర్యాంకు రావడంతో అతనికి జైలు శిక్ష పడినట్లు లీకుల వీరులు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే అభిజిత్‌కి మరింత సానుభూతి కలిసిరావడం ఖాయం. అయితే అభి జైలుకెళ్లడం ఒట్టి పుకారేనా లేదా నిజమా తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. -
మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి
కెట్ టు ఫినాలే రేసు నేడు మూడో లెవల్లోకి అడుగుపెట్టింది. ఈసారి బిగ్‌బాస్ ఫిజికల్ టాస్కు లాంటివి కాకుండా సహనానికి, ఓపికకు పరీక్ష పెట్టాడు. ఉయ్యాలో ఊగమని చెప్పాడు. వినడానికి ఓస్ ఇంతేనా అనిపించినా, అది అంత ఈజీ కాదు. పూటకోసారి తీసుకొచ్చే జ్యూసులు తాగుతూ చలిలో కూర్చున్నచోటు నుంచి కదలకూడదు అంటే మాటలు కావు. పొట్ట ఉబ్బి అవస్థ పడుతూ పట్టపగలే చుక్కలు చూస్తారు. ఈ టాస్కులో ఇద్దరు స్నేహితులూ పట్టువిడవకుండా ఉయ్యాల మీదే ఉండిపోయారు. ఇక అభిజిత్ మోనాల్ గుట్టును బయటపెట్టాడు. ఆ వివరాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. అవినాష్- బ్రదర్ ఆఫ్ మోనాలి 'టికెట్ టు ఫినాలే' రేస్ మూడో లెవల్లో అఖిల్, సోహైల్ ఊయలపై కూర్చుని పాటలు పాడుకున్నారు, సరదాగా కొట్టుకున్నారు కూడా! ఈ టాస్క్‌కు సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్ అఖిల్‌కు ఎండ కొడుతుంటే కాసేపు అతడికి నీడలా నిలబడ్డాడు. ఈ ఇద్దరినీ 48 గంటలు ఉయ్యాల మీద నుంచి దింపకండని అవినాష్ తన అక్కసు వెళ్లగక్కుతూ బిగ్‌బాస్‌ను అభ్యర్థించాడు. తర్వాత మోనాల్‌ను వెంటేసుకుని అవినాష్ బయటకు రావడాన్ని చూసిన అఖిల్.. అతడు మీ తమ్ముడా అని మోనాల్‌ను అడిగాడు. అందుకు హర్ట్ అయిన అవినాష్ నేను నీకు అన్నయ్యనా? అవినాష్నా? అని అడగ్గా మోనాల్ అవినాష్ అన్నయ్య అని టపీమని చెప్పేసింది. దీంతో తలెక్కడ పెట్టుకోవాలో తెలీక అవినాష్ కాసేపు అవమానంతో చచ్చిపోయాడు. వీరి రిలేషన్‌కు అఖిల్ "బ్రదర్ ఆఫ్ మోనాలి" అని టైటిల్ కూడా ఇచ్చేశాడు. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్‌కు గడ్డు కాలం?) ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్ పోటీదారులను తిప్పలు పెట్టేందుకు బిగ్‌బాస్ పాలను పంపించాడు. అఖిల్‌కు పాలు తాగడం అలవాటు లేకపోయినా తప్పక తాగాడు. తర్వాత కూర్చున్నదగ్గరే పరదాలు చుట్టి వాష్‌రూమ్‌కు వెళ్లారు. రాత్రి బిగ్‌బాస్ తుపాకీ పేలుడు శబ్ధాలు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కానీ అఖిల్, సోహైల్ మాత్రం కూర్చున్నచోట నుంచి అంగుళం కూడా కదల్లేదు. వీరు భయపడటం లేదని తెలుసుకున్న బిగ్‌బాస్ ఈసారి కొట్టుకుని చావండంటూ ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాడు. ముల్లంగి రసాన్ని ఒకరికి ఒకరు చెంచాతో తాగించుకోమని చెప్పాడు. అయితే తాగించే సభ్యుడు తను ఉయ్యాల మీద ఉండటానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అనర్హుడు? అన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఇద్దరికీ చిన్నపాటి గొడవ జరిగింది. తర్వాత ఇదంతా కాదని చిన్నచిన్న కారణాలు చెప్తూ జ్యూస్ తాగించుకున్నారు. అక్కడే ఉన్న అరియానా మధ్యలో దూరి మీరు చెప్పే కారణాలు సరిగా లేవని విమర్శించింది. దీంతో ఇద్దరూ ఏకమై మాలో ఇద్దరం అర్హులమే, అందుకే చిన్నచిన్నవి అయినా లెక్కలోకి తీసుకుంటున్నామని క్లారిటీ ఇఇస్తూ ఆమె నోరు మూయించారు. (చదవండి: హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదు: నాగార్జున) హారిక మీద సీరియస్ అయిన అభి హారిక.. తనకు నాగ్ క్లాస్ పీకిన విషయాన్ని అభిజిత్ ముందు ఏకరువు పెట్టింది. ఒక కెప్టెన్‌గా మోనాల్‌తో డేట్‌కు వెళ్లాల్సిన టాస్క్ నీతో చేయించకపోవడం తప్పని నాగ్ సర్ చెప్పారని బాధపడింది. దీంతో అభిజిత్ కలగజేసుకుంటూ ఎన్నో రోజులుగా తన గుండెలో దాచుకున్న నిజాన్ని బయటకు వెల్లడించాడు. 'నేనంటే ఇష్టమని మోనాల్ స్వయంగా నాతో చెప్పింది. తర్వాత ప్రతిసారి ఆమె మనసులో ఒక A ఉందంటున్నారు కదా! ఆ A ఎవరు అని అడిగితే నేనే అంది. కానీ ఇది ఎప్పుడూ అందరి ముందు బయట పెట్టలేదు. అయినా సరే ఆమె నాకు స్టాండ్ తీసుకోలేదు, ఇంకా నామినేట్ చేసింది' అని తన బాధను బయటకు కక్కాడు. అయితే అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. హారిక తెలుగు తెలుగు అని పదే పదే గుర్తు చేసింది. దీంతో చిర్రెత్తిన అభి.. నువ్వు నాతో మాట్లాడాలంటే ఇంకో 5 సంవత్సరాలు ఎదగాలి అన్నాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అని మండిపడ్డాడు. (బిగ్‌బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు) అవినాష్ మీద అరియానా తిట్ల పురాణం ఇక టాస్క్ జరిగేటప్పుడు లైట్లు ఆర్పేయమని బిగ్‌బాస్ తేల్చి చెప్పడంతో కంటెస్టెంట్లు జాగరణ చేశారు. అఖిల్ అరియానాతో పులిహోర కలుపుతున్నాడని హారిక మోనాల్ చెవిలో ఊదింది. ఇదెప్పుడు జరిగిందని మోనాల్ అవాక్కైంది. అవినాష్ జోకులు పేల్చుతూ అరియానా మీద కూడా జోకేశాడు. దీంతో ఆమె వచ్చి అవినాష్‌కు నాలుగు తగిలించడమే కాక అతడి మీద కొత్త కొత్త బూతులను ప్రయోగించింది. ఇక తెల్లవారు కోడి కూసే వేళకు కూడా అఖిల్, సోహైల్ ఉయ్యాల మీదనే ఉన్నట్లు చూపించారు. సహనంతో కాలాన్ని నెట్టుకొచ్చిన ఈ ఇద్దరు రేపటి ఎపిసోడ్లో మాత్రం ఉయ్యాల మీద నుంచి కిందకు దిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం అఖిల్ గెలిచాడా? లేదా సోహైలా? అన్న విషయం రేపు తేలనుంది. (చదవండి: సిటీకి దూరంగా నోయల్) -
మోనాల్ నన్ను తన్నింది: అవినాష్ ఫైర్
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా తమ బుద్ధిబలానికి, శక్తిసామర్థ్యాలకు ఏకకాలంలో పని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో నామినేషన్స్ అనేవే లేకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లేందుకు బిగ్‌బాస్ ఫినాలే మెడల్ ప్రవేశపెట్టాడు. దీన్ని చేజిక్కించుకునేందుకు ఇంటి సభ్యులు ఒకరికొకరు ఏమాత్రం తక్కువ కాదనేలా ప్రాణం పెట్టి పోరాడారు. కానీ నలుగురు మాత్రమే లెవల్ 2కు అర్హత సాధించారు. మరి నేటి 87వ బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. మోనాల్‌తో మనసు పెట్టి ఆడా: అఖిల్ నామినేషన్ షాక్ నుంచి తేరుకోలేని అఖిల్ ఫ్యామిలీ ఫొటో చూసుకుంటూ ఏడ్చేశాడు. తర్వాత మోనాల్ అతడికి సారీ చెప్పే ప్రయత్నం చేయగా నీతో మాట్లాడమే వద్దని దండం పెడుతూ తెగతెంపులు చేసుకున్నాడు. ఆమె మనసు పెట్టి ఆడుతుందట నేను మెదడుతో ఆడతానట. ఇంట్లో అందరితో బ్రెయిన్ గేమ్ ఆడాను కానీ ఆమె దగ్గర మాత్రం మనసు పెట్టి ఆడాను అని సోహైల్ దగ్గర వాపోయాడు. ఈమెతో మనసు పెట్టి ఆడినందుకు నేను హౌలాగాడినా అని సీరియస్ అయ్యాడు. తన స్నేహితులిద్దరూ గొడవపడతుండటం సోహైల్‌కు ఏమాత్రం నచ్చలేదు. మోనాల్ కోసం సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఆమె వీక్ వీక్ అని పదేపదే చెప్పే అవినాష్, అరియానా దగ్గరకు వెళ్లి మోనాల్ ఆడుతోందని నచ్చ జెప్పాడు. తన్నింది నువ్వంటే నువ్వు... అనంతరం 'రేస్ టు ఫినాలే'లో మొదటి లెవల్ ప్రారంభమైంది. ఇందులో ఎవరైతే ఎక్కువ పాల బాటిళ్లు నింపుతారో వారు తర్వాతి లెవల్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెవల్లో గెలిచేందుకు ఎలాంటి పనులు చేస్తారనేది ఇంటిసభ్యుల ఇష్టానికే వదిలేశాడు. మొదటగా ఆవు అంబా అనగానే కంటెస్టెంట్లు పరుగెత్తుకుంటూ వెళ్లి పాలు పట్టుకున్నారు. ఈ గేమ్‌లో ఏమైనా చేసుకోవచ్చని ఏకంగా బిగ్‌బాసే చెప్పాడు కాబట్టి సోహైల్, అఖిల్ కలిసి ఆడుతూ మిగతావాళ్లకు పాలు దక్కకుండా చేశారు. ఇందులోనూ అఖిలే ఎక్కువ కష్టపడ్డట్లు కనిపించింది. ఇంతలో మోనాల్ తన్నిందని అవినాష్ గొడవ పడ్డాడు. నువ్వు కూడా నన్ను తన్నావంటూ సోహైల్ కాలి దెబ్బను చూపించాడు. (చదవండి: నాకొద్దు, ఎలిమినేట్ చేయండి: అవినాష్) సాయం అడిగిన అరియానాపై చికాకు అందరూ కలిసి తనకు దక్కకుండా పాలు పట్టుకుంటున్నారని అవినాష్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగతంగా కాకుండా టీమ్‌గా ఏర్పడి ఆడుతున్నారని అసహనంతో ఊగిపోయాడు. ఇంతలో అరియానా అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు కదా, నాకు చెయ్యవా అని నోరు తెరిచి అడగ్గా అతడు శివాలెత్తిపోయాడు. నా గేమ్ ఆడటానికి వచ్చా, సపోర్ట్ చేయడానికి రాలేదు అని కుండ బద్ధలు కొట్టి చెప్పడంతో ఆమె ముఖం మాడిపోయింది. అంతలోనే మళ్లీ తాను ఆడనని, ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ హౌస్ లోపలకు వెళ్లి ఏడ్చేశాడు. దిక్కులు చూస్తూ ఎవరూ తనను చూడటం లేదని నిర్దారించుకున్నాక కిచెన్‌లోని పాలు, నీళ్లన్నింటినీ క్యాన్‌లో నింపుకోవడం ప్రారంభించాడు. అవినాష్ చర్యతో అసలుకే ఎసరు కానీ అతడి అతితెలివి నీళ్లపాలైంది. ఇంట్లోని పాలు, నీళ్లు నింపుకున్న కారణంగా అవినాష్ రేసు నుంచి అవుట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. తను రేసు నుంచి నిష్క్రమించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. రేస్ టు ఫినాలే ఇలా పెడతారా? అని బిగ్‌బాస్ మీద అసహనం వ్యక్తం చేశాడు. తర్వాతి రౌండ్లో హారిక మొదట తనదగ్గర 14 బాటిళ్లు ఉన్నాయని చెప్పిందని, కానీ బిగ్‌బాస్‌కు మాత్రం 11 అని చెప్పడంతో అఖిల్‌కు అనుమానం వచ్చింది. బహుశా మిగతావి అభికి ఇచ్చి ఉండటమో లేదా లెక్క తప్పుగా చెప్పడమో జరిగి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: అభికి షాకుల మీద షాకులు) ఫినాలేలో బెర్త్ కోసం ఏడ్చేసిన అరియానా ఈ రౌండ్లో అరియానా అవుట్ అవడంతో ఆమె గుక్కపెట్టి ఏడ్చింది. ఫినాలేలో ఉంటానో ఉండనో అని భయమేస్తుందంటూ అవినాష్‌ను హత్తుకుని బాధపడింది. మూడో రౌండ్లో తక్కువ బాటిళ్లు నింపిన కారణంగా మోనాల్ నిష్క్రమించింది. దీంతో అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక రెండో లెవల్‌కు అర్హత సాధించారు. మరి వీరిలో ఎవరు ఫినాలే మెడల్ సొంతం చేసుకుంటారో చూడాలి. (చదవండి: ట్రయాంగిల్ స్టోరీపై లాస్య స్పందన) -
ఫినాలే రేస్: ఒంటరిగా ఆడటం చేతకాదా?
పంతొమ్మిది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణం ఇప్పుడు ఏడుగురి దగ్గర ఉంది. వీరిలో ఒకరికి నేరుగా ఫినాలేలో పాగా వేసేందుకు బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరి ఎక్కువ పాలు సేకరిస్తే వారికి టికెట్ ఇచ్చేస్తానని చెప్పాడు. ఆ టికెట్ దక్కించుకునేందుకు ఇంటిసభ్యులు నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతున్నారు. ఇదేమీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కాదు, ఏదైనా యాడ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ అంతకన్నా కాదు. ఎవరికి వారు సొంతంగా ఆడాల్సిన అత్యంత కీలకమైన గేమ్. కానీ దీన్ని కూడా కొందరు కలిసి ఆడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో అభిజిత్ ఇదే సందేహాన్ని లేవనెత్తాడు. అఖిల్ సోహైల్ కలిసి ఆడుతున్నారా? అని ప్రశ్నించాడు. దానికి అఖిల్ తెలివిగా సమాధానమిస్తూ.. 'నీకు ఓ కప్పిచ్చాను.. ఫస్ట్ నువ్వు పట్టుకో, తర్వాత నేను పట్టుకుంటా అని చెప్పాను. అది కూడా కలిసి ఆడటమేనా? అని అడుగుతూనే ఇది కలిసి ఆడటం కాదు కదా, అలాగే సోహైల్‌కు ఏదో కావాలంటే ఇస్తున్నా' అని జవాబిచ్చాడు. అతని సమాధానం విని అభి షాకయ్యాడు. (చదవండి: దండం పెడతా, గేమ్ ఆడండి: నాగార్జున) ఇకపోతే అఖిల్, సోహైల్ మిగతావారికి పాలు దక్కించుకునేందుకు ఏమాత్రం సందివ్వట్లేదు. దీంతో అరియానా ఫైర్ అవుతూ మొత్తం మీరే పట్టేసుకుంటూ మిగతావారికి ఏం లాభం? అని సీరియస్ అయింది. అటు హారిక తనకు అదృష్టం కలిసొస్తుందేమోనని నోయల్ టీషర్ట్‌నే ధరించింది. చివరిసారి ఈ టీ షర్ట్ ధరించినప్పుడే ఆమె కెప్టెన్ అయింది. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఫినాలే టికెట్ ఇచ్చేందుకు మరీ ఇలాంటి టాస్క్ ఇస్తారా? అని విమర్శిస్తున్నారు. అభిజిత్‌కు సపోర్ట్ చేసినందుకు హారికను ఫేవరెటిజమ్ చూపిస్తుందన్నారు. మరి అఖిల్, సోహైల్ చేస్తున్నదేంటని నిలదీస్తున్నారు. వీళ్లకు ఇక్కడ కూడా ఒంటరిగా ఆడటం చేతకాదని విమర్శిస్తున్నారు? రెండో సీజన్లో కౌశల్‌కు వ్యతిరేకంగా తనీష్, సామ్రాట్ కలిసి ఆడితే చివరికి ఏమైందో ఓసారి గుర్తు చేసుకొమ్మని మరికొందరు సెటైర్లు విసురుతున్నారు. మొత్తానికి ఈ రేసు నుంచి అవినాష్, మోనాల్, అరియానా అవుట్ అవగా మిగిలిన నలుగురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్: ఊహించని ట్విస్టులతో అభిజిత్ కంట నీరు
ఈసారి బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు కావాల్సినన్ని గొడవలు పెట్టుకునేందుకు బంపరాఫర్ ఇచ్చాడు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవచ్చని తెలిపాడు. ఇద్దరిని నామినేట్ చేయడానికే కిందామీద పడుతున్న కంటెస్టెంట్లు ఈ ఆప్షన్ వాడదల్చుకోలేదు. కానీ మోనాల్, అరియానా మాత్రం ఈ అవకాశాన్ని చేజార్చుకోదల్చుకోలేదు. అయితే అరియానా వేరేవాళ్లతో మామూలుగా మాట్లాడి, మోనాల్‌తో మాత్రం గొంతు పెంచి డిమాండ్ చేసినట్లు మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వింది. మరోవైపు అవినాష్ గత ఎలిమినేషన్ నుంచి ఇప్పటికీ బయటకు రావడం లేదు. తనకన్నా వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు అని మోనాల్నుద్దేశిస్తూ పదేపదే దెప్పి పొడిచాడు. ఫలితంగా మరోసారి నామినేషన్లో వచ్చిపడ్డాడు. అటు హారిక, అభి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా.. అర్థం చేసుకుని మళ్లీ కలిసిపోయారు. కానీ అఖిల్, మోనాల్ మాత్రం భగ్గుమంటూ ఎదురు పడటానికి కూడా ఇష్టపడలేదు. అభిని నామినేట్ చేసి ఏడ్చేసిన హారిక బిగ్‌బాస్ హౌస్‌లో 13 వారానికిగానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏడుగురు కంటెస్టెంట్ల ముందు కంటైనర్స్ ఉంటాయి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కంటెస్టెంట్ల కంటైనర్లలో కలర్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఎవరి గిన్నెలో ఎక్కువ రంగు నీళ్లు ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లు లెక్క. మొదటగా హారిక నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి నేను కారణం అయినప్పటికీ, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదనిపించిందని అవినాష్‌ను నామినేట్ చేసింది. నీకు విలువిచ్చాను. కాకపోతే నాకంటే వీక్ ఉన్నవాళ్లు నామినేషన్లో ఉన్నప్పుడు నేనెలా ఎలిమినేట్ అవుతాను అన్న సందేహమే నన్ను వేధిస్తోంది అని అవినాష్ స్పష్టం చేశాడు. అనంతరం టాస్కు ఆడటానికి నిరాకరించినందుకుగానూ అభిజిత్‌ను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించగానే అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్ఫెషన్ రూమ్‌లో జరిగినదానికి అభిని నామినేట్ చేయలేదని అంతకుముందే ఇది అనుకున్నానని హారిక కెమెరాల ముందు చెప్పుకుంటూ ఏడ్చింది. నీకు ఓవర్ కాన్ఫిడెంట్.. తర్వాత అవినాష్.. మోనాల్‌ను వీక్ అంటూ నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ నేను వీక్ కాదని జనాలు నిరూపించారు, అది మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో అవినాష్ అందుకుంటూ.. ఆమె వీక్ కాదని నిరూపించారట. 'అంటే నేను వీక్ కదా! ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లే సేవ్ అయ్యాను కదా. అందుకే ముఖం చూపించుకోలేకపోతున్నా..' అని అవినాష్ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తనను వరస్ట్ కెప్టెన్ అని చెప్పినందుకు అఖిల్‌ను నామినేట్ చేశాడు. అనంతరం అఖిల్.. నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందంటూ అవినాష్‌ను, గేమ్‌లో ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయని మోనాల్‌ను నామినేట్ చేశాడు. (చదవండి: హారికను పెళ్లి చేసుకుంటా: అవినాష్) నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభి అనంతరం అభిజిత్.. 'మొదటి రోజు నుంచీ నీవల్ల నేను ఎమోషనల్‌గా హర్ట్ అవుతున్నా. ఇది నీ తప్పు అనట్లేదు. కానీ నీకు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా కూడా నీ విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నువ్వు కావాలని చేస్తున్నావో, దేనికి చేస్తున్నావో తెలీదు కానీ ఎక్కడో ఓసారి నాకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుండేదనిపించింద'ని మోనాల్‌ను నామినేట్ చేశాడు. 'టాస్కు చేయకపోవడం నాకు తప్పు. కానీ ఎందుకు చేయలేదనే విషయం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు' అంటూ హారిక కంటైనర్‌లో అతి తక్కువ రంగు నీళ్లు పోసి నామినేట్ చేశాడు. (చదవండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్మేట్స్) ఆ ఇద్దరినీ తొలిసారి నామినేట్ చేసిన మోనాల్ తర్వాత వచ్చిన మోనాల్ తనను చులకనగా చూస్తున్న కంటెస్టెంట్లకు గట్టి కౌంటర్లు ఇచ్చింది. ముందుగా అవినాష్‌ను నామినేట్ చేస్తూ ఇక్కడున్న అందరూ స్ట్రాంగే అని నొక్కి చెప్పింది. నామినేషన్‌కు భయపడటమే మీ వీక్నెస్ అని చెప్పింది. తర్వాత టాస్క్ ఆడనందున అభిని నామినేట్ చేస్తూ.. మీరు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా మీకు దూరంగానే ఉంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది. అలాగే తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్‌ను సైతం నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది, నువ్వు బ్రెయిన్‌తో గేమ్ ఆడితే, నేను మనసుతో ఆడతానని మోనాల్ తెలిపింది. నన్ను నామినేట్ చేయనని మాటిచ్చావు, కానీ చేస్తున్నావు అని అఖిల్ సీరియస్ అవగా నువ్వే కదా గేమ్ ఆడమన్నావు అంటూ ఆమె బదులిచ్చింది. అయినా సరే ఆమె మాటలను వినిపించుకోని అఖిల్.. నువ్వు ప్రతిరోజు నా కళ్లు తెరిపిస్తున్నావు అని మనసులోని బాధను కక్కేశాడు. ఇక హౌస్‌లోకి వెళ్లి మోనాల్ ఏడ్చేసింది. మొదటి మూడు వారాలు ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, పదే పదే నన్ను వీక్ అంటున్నారని హారికతో తన గోడు వెల్లబోసుకుంది. ముగ్గురిని నామినేట్ చేసిన అరియానా అరియానా.. తనను వరస్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక, అవినాష్, సోహైల్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అరియానా.. మోనాల్‌ను డిమాండ్ చేస్తూ మాట్లాడింది. మధ్యలో అందుకుని అవినాష్ తెలుగులో మాట్లాడు అని చెప్పగా మధ్యలో మాట్లాడకు అని మోనాల్ హెచ్చరించింది. సోహైల్.. అవినాష్‌ను నామినేట్ చేస్తూ మోనాల్ కూడా స్ట్రాంగ్ అయిందని, ఆమెను వీక్ అనొద్దని అభ్యర్థించాడు. మోనాల్ కన్నీళ్లు తుడిచాడు. ఈవారం అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక నామినేట్ అయ్యారు. (చదవండి: బిగ్‌బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం) -
నీ వల్ల చాలా హర్ట్ అవుతున్నా: అభి
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అందరిలో ఆసక్తి రేకెత్తించిన ట్రయాంగిల్ స్టోరీ ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది. మోనాల్ కోసం కొట్టుకు చచ్చిన అఖిల్, అభిజిత్ ఇప్పుడు ఆమెనే పెద్ద సమస్యగా భావిస్తున్నారు. నిన్నటికి నిన్న నీకే గనక శక్తినిస్తే ఎవరిని మాయం చేస్తావు అని అఖిల్‌ను అడిగితే అతను క్షణం కూడా ఆలోచించకుండా టపీమని మోనాల్ పేరు చెప్పాడు. ఆమె తన గేమ్‌కు డిస్టబెన్స్‌గా మారిందని తెలిపాడు. మరోవైపు అభిజిత్.. మోనాల్‌తో డేట్‌కు వెళ్లే టాస్క్‌ను చేయనని మొండికేసినందుకు నాగ్‌తో చీవాట్లు తిన్నాడు. బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా చేయాల్సిందేనని మొట్టికాయలు వేయించుకున్నాడు. అతడి చేత టాస్క్ చేయించాల్సిన బాధ్యత కెప్టెన్ది కాదా? అని నాగ్ హారికను కూడా గట్టిగానే వేసుకున్నారు. దీని ఎఫెక్ట్ అంతా నేటి ఎపిసోడ్లో స్పష్టంగా కనిపించనున్నట్లు ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. (చదవండి: మోనాల్‌తో లింక్ చేయకండి: అభి వేడుకోలు) ఇప్పటికే హారిక అభిని నామినేట్ చేసి షాకిచ్చింది. అందులో నుంచి తేరుకోకముందే అభికి మరో షాక్ తగిలింది. మోనాల్ తొలిసారి అభిని నామినేట్ చేసింది. అభి కూడా మోనాల్‌ను నామినేట్ చేస్తూ 'ఈ షో మొదటి రోజు నుంచే నీవల్ల ఎమోషనల్‌గా హర్ట్ అవుతున్నాను. నీకు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా నేను ఇబ్బందిపడుతూనే ఉన్నా'నని చెప్తూ మనసులోని భారాన్ని దింపే ప్రయత్నం చేశాడు. విడ్డూరంగా మోనాల్ నేడు అఖిల్, అభి ఇద్దరినీ నామినేట్ చేసింది. ఏదేమైనా నామినేషన్ ప్రక్రియతో జంటలను విడగొట్టాలనుకున్న బిగ్‌బాస్ పథకం విజయవంతమైనట్లే తెలుస్తోంది. ఎన్నో ట్విస్టులు, మరెన్నో వింతలు చోటు చేసుకుంటున్న నామినేషన్ ప్రక్రియను పూర్తిగా చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: మధ్యలో మాట్లాడకు: అవినాష్‌కు మోనాల్ వార్నింగ్) -
మోనాల్‌తో మాట్లాడమని అభికి చెప్పేవాళ్లం: లాస్య
బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక వంటలక్కలా మారిన లాస్య పదకొండో వారం ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా తన కుటుంబాన్ని కలుస్తానన్న సంతోషమే ఆమెను ఉక్కిరిబిక్కరి చేసింది. దీంతో ఆనందంగా హౌస్మేట్స్ దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుంది. ఇక ఈ సీజన్ మొత్తంలో హైలెట్‌గా నిలిచిన అఖిల్, మోనాల్, అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి యాంకర్ లాస్య స్పందించింది. తను చూసినంతవరకు హౌస్‌లో లవ్స్టోరీలేమీ లేవని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్ బిగ్ షాక్.. వరస్ట్ పెర్ఫార్మర్గా అభిజిత్) "అభిజిత్‌కు మోనాల్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. పైగా ఒకే ఇంట్లో ఉండి మాట్లాడకపోతే బాగోదని ఆమెతో మాట్లాడమని అభికి మేమే చెప్పేవాళ్లం. అటు అఖిల్, మోనాల్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అఖిల్ మోనాల్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, మోనాల్ కూడా అఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పేవాళ్లు. ఎప్పుడూ వాళ్ల నోటి నుంచి లవ్ అనేది రాలేదు. అలాంటప్పుడు వాళ్ల మధ్యలో ఏదో ఉందని మేం ఎందుకు అనుకుంటాం? కొన్ని మెంటాలిటీలు కొందరికి మాత్రమే ట్యూన్ అవుతారు. అలాగే నేను, అభి, నోయల్, హారికలు ట్యూన్ అయ్యాం. అదే విధంగా అఖిల్ మోనాల్ క్లోజ్ అయ్యారు. నేనైతే వాళ్లను బెస్ట్‌ఫ్రెండ్స్ అనే అంటాను. అయితే ఎలాంటి క్లిప్పింగులు చూపించారో నాకు తెలీదు. కానీ బయట మాత్రం ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపించిందంటున్నారు. కానీ లోపల మాత్రం అలాంటిదేమీ లేదు" అని లాస్య స్పష్టం చేసింది. (చదవండి: టాప్ 2లో ఉండేది ఆ ఇద్దరే: లాస్య) -
బిగ్‌బాస్: అభిని నామినేట్ చేసిన హారిక
బిగ్‌బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు పోటీని తట్టుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్ అనే సంద్రాన్ని ఈదాల్సి ఉంటుంది. ఈ రోజు ఆ సమయం రానే వచ్చింది. పదమూడో వారానికిగా గానూ నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో జంట పక్షులు విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటి నుంచి తన గేమ్ ఆడతానని చెప్పిన మోనాల్ అన్నంతపనే చేసింది. కానీ మొదటి నుంచి ఆమెకు నీడలా తోడున్న అఖిల్‌ను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. కలలో కూడా ఊహించని ఈ పరిణామానికి అఖిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. నీకోసం ఎంతో కొట్లాడాను,.. చివరికి ప్రేక్షకుల దగ్గర నన్ను బ్యాడ్ చేయాలనుకుంటున్నావు, అంతే కదా! అని మండిపడ్డాడు. (చదవండి: బిగ్‌బాస్: నాగ్‌పై అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్) ఓవర్ కాన్ఫిడెన్స్ నీకే ఎక్కువ అటు అవినాష్, అఖిల్ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ నాకన్నా వీక్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. నేనెందుకు ఎలిమినేట్ అవ్వాలని ఫ్రస్టేట్ అయ్యాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అఖిల్ అభిప్రాయపడ్డాడు. మరి అఖిలే నెంబర్ 1 అని నువ్వు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? అని అవినాష్ ఎదురు ప్రశ్నించాడు. అసలు మొదటి నుంచి అరియానాకు, మోనాల్‌కు పడదన్న విషయం ఈ నామినేషన్‌తో మరోసారి బయటపడింది. ఈ ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకుంటుండగా తెలుగులో మాట్లాడమని అవినాష్ సలహా ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన మోనాల్ మధ్యలోకి రావద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం ) నువ్వు కూడా అర్థం చేసుకోలేదా.. అన్నింటికీ మించి ప్రోమోలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం హారిక అభిజిత్‌ను నామినేట్ చేయడం! ఫేవరెటిజమ్ చూపించకుండా సొంతంగా గేమ్ ఆడంటూ నాగార్జున ఆమెకు క్లాస్ పీకిన విషయం తెలిసిందే కదా! దీంతో గతవారంలో టాస్క్ ఆడని తన క్లోజ్ ఫ్రెండ్ అభిని ఆమె నామినేట్ చేస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. అయితే మనసు వద్దని చెప్తున్నా తప్పని పరిస్థితుల్లో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని హారిక ముఖం చూస్తే అర్థమవుతుంది. కానీ దీనివల్ల అభి మనసు నొచ్చుకుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే.. ఇక్కడ ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని బాధపడ్డాడు. ఏదేమైనా బిగ్‌బాస్ విజయవంతంగా రెండు జంటలను విడగొట్టినట్లు సులువుగా స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ వారం అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, హారిక నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. టామ్ అండ్ జెర్రీ సోహైల్, అరియానా మాత్రం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. -
ట్రోలింగ్: నాగార్జునతోనే ఆటలా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ గెలుచుకునేందుకు ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటికీ కంటెస్టెంట్లు ఎవరి ఆట వాళ్లు ఆడటం లేదన్న విషయం నాగార్జున కంట్లో పడింది. అంతేకాక బెస్ట్ కెప్టెన్‌గా హారికను, వరస్ట్ కెప్టెన్‌గా అరియానాను ఎన్నుకోవడాన్ని కూడా ఆయన సమర్థించలేదు. దీంతో హారికను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఈ వారమంతా ఆమె చేసిన తప్పులను వీడియోల మీద వీడియోలు వేసి మరీ కళ్లకు కట్టినట్లు చూపించారు. మోనాల్ వల్ల కెప్టెన్ అయిన నువ్వు అభిజిత్ కోసం పని చేశావని నిందించారు. అభి మీద ఫేవరెటిజమ్ చూపించావని విమర్శించారు. బిగ్‌బాస్ షోలో గెలవాలంటే నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే అని ఆమెకు సలహా ఇచ్చారు. ఇద్దరి తప్పులే కనిపించాయా? మరోవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులు ఆడలేదని అభిజిత్ మీద మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చూపించారు. గేట్లు ఎత్తి పంపించేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో అభి కాస్త ఎమోషనల్ అయ్యి మోకాళ్ల మీద కూచుని తన తప్పును క్షమించమని అభ్యర్థించారు. అయితే నాగార్జున ఈ ఇద్దరి వీడియోలు మాత్రమే చూపించి క్లాస్ పీకడం నెటిజన్లకు మింగుడు పడలేదు. కావాలనే హారిక, అభిజిత్‌ను నాగ్ టార్గెట్ చేశారని విశ్వసించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగ్ తీరును తప్పుపడుతున్నారు. (చదవండి: మోనాల్‌తో లింక్ చేయకండి: అభి వేడుకోలు) నాగ్ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేస్తాం అసలు సిసలు ఫేవరెటిజమ్ చూపించేది నాగార్జునే అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన కళ్లకు ఎవరి తప్పులూ కనిపించడం లేదా అని కడిగిపారేశారు. ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన నాగ్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఓ మామూలు కంటెస్టెంటు కోసం స్టార్ హీరో నాగ్‌ను అన్నేసి మాటలంటారా? అని గరమవుతున్నారు. ఉన్న మాట చెప్పినందుకు ఎగిరెగిరిపడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎంత నెగెటివ్ ట్రెండ్ చేసినా మా కింగ్‌కు అది గడ్డ పరకతో సమానం అని ఏకిపారేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే) అప్పుడు నాని, ఇప్పుడు నాగ్ నిజానికి నాగార్జున కంటెస్టెంట్ల తప్పులను ఎత్తి చూపి వారిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ వారంలో ఎవరైతే దిద్దుకోలేని తప్పులు చేశారో, వాటినే ప్రస్తావిస్తూ ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోమని సలహా ఇచ్చారు. అది తమ మంచి కోరే చెప్పారన్న విషయం హారిక, అభిజిత్‌లకు అర్థమైంది కూడా. కానీ వాళ్ల అభిమానులే అనవసరంగా రెచ్చిపోయి నాగ్‌తో పెట్టుకుంటున్నారు. నోటికొచ్చినట్లుగా విమర్శిస్తున్నారు. కాగా రెండో సీజన్లో కౌశల్ మండా అభిమానులు హోస్ట్ నానిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక నాని మరోసారి బిగ్‌బాస్ షోనే చేయనని కరాఖండిగా చెప్పేశారు. ఈ సీజన్లో అభిజిత్ కోసం ఏకంగా నాగార్జుననే ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. -
దండం పెడతా, గేమ్ ఆడండి: నాగార్జున
బిగ్‌బాస్ ప్రయాణం చివరి మజిలీకి చేరుకుంటున్న దశలో కొందరి గ్రాఫ్ తగ్గుతోంటే మరికొందరి గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురయ్యే మోనాల్‌కు ఈ సారి అత్యధిక ఓట్లు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తుండగా నాగ్ సైతం తొలుత మోనాల్‌నే సేవ్ చేయడం విశేషం. ఇక హౌస్‌లో ఎవరూ తప్పు చేయకుండా చూసుకోవాల్సిన కెప్టెన్ హారికే సరిదిద్దుకోలేని తప్పులు చేసింది. దీంతో మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా నాగ్ ఆమెకు గట్టి క్లాస్ పీకారు. అభి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఆపలేదని, టాస్క్ చేయకపోయినా శిక్షించకుండా వెనకేసుకొస్తూ ఫేవెరెటిజిమ్ చూపించావని మండిపడ్డారు. మోనాల్‌కు ఎప్పుడు సాయం చేశావు? అఖిల్ కోసం సోహైల్ నామినేట్ అవడానికి రెడీగా ఉన్నప్పటికీ నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్‌ను అభి కోసం నామినేషన్లోకి పంపావని గరమయ్యారు. మోనాల్‌కు సాయం చేశావని పదేపదే చెప్పావు కానీ ఎక్కడ చేశావంటూ వీడియో చూపించారు. అందులో హారిక బట్టలు పట్టుకుని శిలా విగ్రహంలా నిలబడిందే తప్ప మోనాల్ పేరు రాసి ఉన్న బుట్టలో వేయలేదు. బజర్ మోగిన తర్వాతే ఆమె బెడ్ దగ్గర నుంచి కదలింది, కానీ దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఇలా ఎన్నో తప్పిదాలు చేసినందున హారిక బెస్ట్ కెప్టెన్ కాదని నాగార్జున తేల్చేశారు. అరియానాను మాత్రం వరస్ట్ కెప్టెన్ కాదని, బిగ్‌బాస్ నియమాలు అందరూ పాటించేలా కృషి చేసిందని వెనకేసుకొచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: ఆ వీడియోలు వేసి ఇజ్జత్ తీయకండి) బహుశా అఖిల్‌తో స్వాప్ చేయకపోవడమే నా పొరపాటు తర్వాత హౌస్‌లో ఈ వారం ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో చెప్పమని నాగ్ ఆదేశించారు. తొలుత సోహైల్ మాట్లాడుతూ.. తను అరియానాను వెక్కిరించడం తప్పని చెప్తూ ఆమెకు సారీ చెప్పాడు. అలాగే దెయ్యం టాస్కులో అఖిల్, నేను భయపడ్డామంటూ అసలు నిజాన్ని బయటపెట్టాడు. తర్వాత అరియానా వంతు రాగా ఆమె వరస్ట్ కెప్టెన్ కాదని గుడ్ కెప్టెన్ అని మెచ్చుకున్నారు. అవినాష్.. నేను వెర్రిపప్పలా కనపడుతున్నానానా అని అరియానా మీద సీరియస్ అయ్యాను అని చెప్పుకురాగా ఫ్రెండ్స్ మీద నోరు జారొద్దని నాగ్ అతడిని హెచ్చరించారు. దీంతో అవినాష్.. అరియానాను లైఫ్‌లో మర్చిపోలేని ఫ్రెండ్ అని తెలిపాడు. అలాగే శ్మశానం టాస్కులో ఎక్కువ ఆలోచించడం కూడా తప్పేనని పేర్కొన్నాడు. మోనాల్.. అఖిల్‌తో స్వాప్ చేయకపోవడమే తన పొరపాటు అనిపిస్తోందని తెలిపింది. చివరికి కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమంటే హారిక.. అఖిల్‌తో కాకుండా అభితో చేసిందని బాధపడింది. (చదవండి: ఇలాగైతే బిగ్‌బాస్ నుంచి తప్పుకుంటా: నాగ్ వార్నింగ్) మోనాల్‌తో లింక్ చేయకండి: అభి తర్వాత అఖిల్ మాట్లాడుతూ.. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినప్పుడు హారిక ఐ హేట్ యూ అంటే నువ్వు ఎప్పుడు నన్ను ఇష్టపడ్డావు అని ఏదో కోపంలో అన్నాను, కానీ తర్వాత సారీ చెప్పాను అని తెలిపాడు. అనంతరం నాగ్ బిగ్‌బాస్ హౌస్ గేట్లు తెరవండని చెప్పి అభి వైపు తిరిగి అతడిని తప్పుల చిట్టా చదమన్నారు. దీంతో అభి టాస్కు చేయలేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. మోనాల్‌తో లింక్ చేయకండని ఎన్నోసార్లు అభ్యర్థించాను. పైగా దెయ్యం ఇచ్చిన టాస్క్‌లో నేను మోనాల్‌ను ఏడిపించానని చెప్పారు. కానీ నేను ఏడిపించలేదని చెప్పడంతో నాగ్ ఓ వీడియో చూపించారు. అందులో అభిజితే మోనాల్‌ను ఏడిపించినట్లు ఒప్పుకున్నాడు. కళ్లెదురుగా తను మాట్లాడింది కనిపించడంతో అభి సారీ చెప్పాడు. (చదవండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్మేట్స్) కంటెస్టెంట్ల తీరుతో చేతులెత్తి వేడుకున్న నాగ్ ఇది మొదటిసారి కాదని నాగ్ మండిపడటంతో అభి మోకాళ్ల మీద కూర్చుని అభ్యర్థించాడు. నా సీజన్లో మోనాల్ కోణమే నన్ను ఇబ్బందికి గురి చేస్తోందని వివరించాడు. చివరాఖరకు టాస్కు చేయకపోవడమే తన తప్పని అంగీకరించడంతో నాగ్ గేట్స్ క్లోజ్ చేయమన్నాడు. తప్పును అంగీకరించకపోతే నువ్వు బయటకు వెళ్లిపోయేవాడివని నాగ్ హెచ్చరించారు. పన్నెండు వారాలు ముగుస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చరించినా, నవ్వుతూ చెప్పినా ఇంకా సరిగా గేమ్ ఆడటం లేదని నాగ్ ఆవేదన చెందారు. మీ అందరికీ దండం పెడుతున్నా, గేమ్ ఆడండి అంటూ కంటెస్టెంట్లను చేతులెత్తి వేడుకున్నారు. దీంతో సారీ సార్ అంటూ ఇంటి సభ్యులు బాగా ఆడతామని హామీ ఇచ్చారు. తర్వాత మోనాల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. -
బిగ్‌బాస్: అభిజిత్‌ను పంపించేస్తోన్న నాగార్జున!
బిగ్‌బాస్ షో అంటే ఒక మనిషి ఎలా ఉంటాడో చూపించడమే కాదు. అతడి శక్తి సామర్థ్యాలు కూడా వెలికి తీస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడం. కానీ ఈ సీజన్లో ఈ రూల్ బ్రేక్ అవుతోందని తేటతెల్లమవుతోంది. కొందరు టాస్కుల్లోనే విపరీతంగా కష్టపడుతుండగా, మరికొందరు మాత్రం ఎలా ఉన్నామో అలానే ఉంటే సరిపోతుందంటై వేటిలోనూ ఆసక్తి చూపించకుండా బద్ధకస్తులుగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఇక్కడ మొదటి కేటగిరీవారికన్నా బద్ధకస్తుల కేటగిరీలోని వారికే అభిమానులు మెండుగా ఉన్నారు. అయితే ప్రతిసారి టాస్కులు తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తే బిగ్‌బాస్ చూస్తూ ఊరుకోడు. అందులోనూ ఇది పన్నెండో వారం. షో ముగింపుకు వస్తున్నా కూడా బిగ్‌బాస్ ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని నాగార్జున కూడా సహించలేకపోయాడు. వెరసి నేటి ఎపిసోడ్లో నాగ్ అభిజిత్‌కు చీవాట్లు పెట్టాడు. మోనాల్‌ను డేట్‌కు తీసుకెళ్లని అభిజిత్ జలజ దయ్యం ఇంట్లో వాళ్లను ఎలా ఆడేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దయ్యం ఇంటిసభ్యులకు టాస్కులు కూడా ఇచ్చింది. చెట్టుకున్న ఆకులు లెక్కపెట్టమని అభిని ఆదేశించింది. కొమ్మకు 50 ఆకుల చొప్పున సుమారు ఇంత అని చెప్పేస్తాను అని లెక్కలు వేసుకున్నాడు.. మళ్లీ అంతలోనే ఈ ఆకులు లెక్కించాలంటే అవన్నీ తెంపాలని, అలా చేయడం బిగ్‌బాస్ నియమాలను ఉల్లంఘించినట్లేనని టాస్కు చేయకుండా తెలివిగా జారుకున్నాడు. తర్వాత అఖిల్, అభిజిత్.. మోనాల్‌ను ఏడిపించిన కారణంగా ఈ ఇద్దరిలో ఒకరు ఆమెను డేట్‌కు తీసుకెళ్లాలంటూ మరో టాస్క్ ఇచ్చింది. ఎప్పుడు ఏడిపించాను? ఎందుకు డేట్‌కు తీసుకెళ్లాలి? అని అభి జుట్టు పీక్కుని ఏడ్చినంత పని చేశాడు. మోనాల్‌తో తనను కలపొద్దు అంటున్నా ఇప్పటికీ అదే జరుగుతోందని అని అసహనం వ్యక్తం చేశాడు. ఏదైతే అది అయిందని అసలు ఈ టాస్కే చేయనని తేల్చి చెప్పేశాడు. (చదవండి: బిగ్‌బాస్ స్కెచ్: టాప్ 5లోకి అవినాష్!) హౌస్ నుంచి పంపించేస్తానని వార్నింగ్ తాజా ప్రోమోలో ఇదే విషయాన్ని నాగార్జున లేవనెత్తగా.. మోనాల్‌ను ఏడిపించలేదు అంటూ అభి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నాగ్.. అభి మాట్లాడిన వీడియో చూపించాడు. నువ్వు చెప్పిన మాటలే బిగ్‌బాస్ టాస్క్‌లో పంపించాడు అని స్పష్టం చేశాడు. దీంతో అభి క్షమాపణ చెప్పగా నాగ్ అందుకు అంగీకరించలేదు. ఇది మొదటి సారి కాదని సీరియస్ అయ్యాడు. తప్పు చేయడం సారీ చెప్పడం అలవాటు అయిందని మండిపడ్డారు. టాస్కు చేయకపోవడం తప్పు అని చెప్తూ గేట్లు ఓపెన్ చేయండి.. అని అభిని భయపెట్టే ప్రయత్నం చేశారు. అతడు టాస్క్ చేయనంటే సపోర్ట్ చేసిన కెప్టెన్ హారికను కూడా నాగ్ నిలదీశాడు. అయితే ఇలా కంటెస్టెంట్లను ఉన్నఫళంగా పంపించేస్తామని బెదిరించడం కొత్తేమీ కాదు. రెండో సీజన్లో గణేశ్‌ను, మూడో సీజన్లో మహేశ్‌ను నాల్గో సీజన్లో హారికతో మరికొందరిని కూడా ఇలానే అర్ధాంతరంగా పంపించేస్తామని భయపెడుతూనే ఉన్నారు. (చదవండి: బిగ్‌బాస్‌లోకి జలజ.. గజ గజ వణికిన బోల్డ్ గర్ల్) -
అభిజిత్‌కే ఓటేస్తా: జబర్దస్త్ కమెడియన్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఫినాలేలో చోటు దక్కించుకునేందుకు రేసు మొదలైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాలను పక్కకు నెట్టి పూర్తిగా గేమ్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. పంతొమ్మిది మందితో మొదలైన ఈ ప్రయాణంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు.. అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, మోనాల్, సోహైల్, హారిక మాత్రమే మిగిలారు. టాప్ 5లో చోటు దక్కించుకోవడమే కాకుండా ట్రోఫీని ఎగరేసుకుపోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. అయితే వీరు లోపలెంత కష్టపడుతున్నారో వారిని గెలిపించేందుకు అంతకన్నా ఎక్కువే కష్టపడుతున్నారు వారి అభిమానులు. ఇక బిగ్‌బాస్ ప్రయాణం ముగింపుకు వస్తున్న తరుణంలో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతూ వారి ఫేవరెట్ కంటెస్టెంట్లకే సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు అఖిల్‌కు ఓటేయాలని కోరుతుండగా హీరో సందీప్ కిషన్ తన ఫుల్ సపోర్ట్ సోహైల్కే అని మొదట్లోనే చెప్పేశాడు. (చదవండి: ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌లోకి వెళ్లను : యాంకర్) అవినాష్‌కు జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ యూనిట్ కూడా ఈ ప్రచారంలోకి దిగింది. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను.. అవినాష్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అవినాష్ చివరి వరకు ఉండాలని కోరుకుంటూనే అభిజిత్ అంటే ఇష్టమని చెప్పారు. అభి ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటూ మొదటి నుంచి ఒకేలా ఉంటున్నాడంటూ అతడికి కూడా సపోర్ట్ చేశారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ సైతం అభిజిత్‌కే మద్దతు తెలిపాడు. 'అందరూ బాగా ఆడుతున్నారు, కానీ నా ఫేవరెట్ మాత్రం అభిజిత్. అతడే గెలవాలని కోరుకుంటున్నా. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడు. నిజాయితీగా ఉంటాడు. సహనంగా ఉండటం చాలా గొప్ప. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా అవినాష్ గెలవాలని ఆశిస్తాను. కానీ ఓటు మాత్రం అభిజిత్‌కే" అని స్పష్టం చేశాడు. (చదవండి: వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు) -
బిగ్‌బాస్: మోనాల్‌తో డేట్.. అభి కంటతడి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ మొత్తం మోనాల్ చుట్టే నడుస్తోంది. కాదు.. మోనాల్ చుట్టూ నడిచేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఏంమేం జరిగాయోనని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే.. మెనాల్, అభి, అఖిల్‌ల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, మోనాల్ అఖిల్‌ల రొమాన్స్.. గొడవలు, ఏడుపులు.. రోమాంటిక్ ముచ్చట్లు ఇవే కనిపిస్తాయి. మోనాల్‌తో విడిపోదామనుకున్న ప్రతి సారి అభి, అఖిల్‌లను మోనాల్‌తో కలిసేలా చేయడమే బిగ్‌బాస్ పనిగా పెట్టుకున్నాడు.ఇక నేటి ఎపిసోడ్లో కూడా తన దత్త పుత్రిక మోనాల్‌ని హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మోనాల్‌ని అభిజిత్, అఖిల్ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్ పెట్టాడు బిగ్‌బాస్. (చదవండి : వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు) మోనాత్తో డేట్ అనగానే అభిజిత్ తెగ ఫీల్ అవుతున్నాడు. మోనాల్ విషయంలో నేను ఇన్వాల్వ్ కావొద్దనుకుంటున్నా. ఆమె పాయింట్ వచ్చిన ప్రతిసారి ఏదోఒక రాడ్ పడుతోంది. నా జర్నీ మొత్తంలో ఈ మోనాల్ టాపికే బిస్కెట్ అవుతుంది’ అంటూ అభి ఎమోషనల్ కాగా, హరిక, సోహైల్ వెళ్లి ఓదార్చారు. మరోవైపు అఖిల్ మాత్రం.. ‘ఇక్కడ ఫిటింగ్ ఏం లేదు.. చేయాలనిపిస్తే చేయి లేదంటే లేదు’ అంటున్నాడు. ఇక బిగ్‌బాస్ దత్తపుత్రిక మాత్రం డేట్ అనగానే చిరునవ్వులు చిందిస్తూ.. అందంగా ముస్తాబవుతోంది. మరి అభి అంతాలా ఎమోషనల్ కావడానికి కారణమేంటి? మోనాల్ ఎవరితో డేట్‌కి వెళ్లింది అని తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
నువ్వు మా నాన్నకు నచ్చావంటే..: అభిజిత్
పన్నెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్ కకావికలం అయింది. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేం అన్నట్లుగా ఉండే జంట పక్షులు అఖిల్, మోనాల్ అర్ధాంతరంగా విడిపోయారు. నామినేషన్ అంటే చాలు ఠారెత్తిపోయే అవినాష్ తను సేవ్ అయ్యేందుకు ఓ రకంగా మోనాల్‌తో యుద్ధమే చేశాడు. గట్టిగా మాట్లాడుతూ తన వాదనే నిజమని నిరూపించుకునేందుకు ప్రయత్నించిన అరియానా పథకం కూడా పారలేదు. ఇంతమందితో పోరాడిన మోనాల్ చివరికి కెప్టెన్ హారిక వల్ల నామినేషన్స్‌లోకి వెళ్లింది. అసలు మోనాల్‌తో స్వాప్(స్థానాలను ఇచ్చిపుచ్చుకోవడం) చేసుకోనని అభి తేల్చి చెప్పినప్పటికీ కెప్టెన్ తన పవర్‌ను ఉపయోగిస్తూ అతడిని నామినేషన్ గండం నుంచి గట్టెక్కించి మోనాల్‌ను బలి చేసింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ హౌస్‌లోని వాతావరణాన్ని హీటెక్కిచ్చింది. (బిగ్‌బాస్: రికార్డుల వేటలో అభిజిత్ ఫ్యాన్స్) ముఖ్యంగా అఖిల్, మోనాల్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. మోనాల్ తనను మోసం చేసిందన్న భ్రమలో అఖిల్ కూరుకుపోయాడు. అటు మోనాల్ మాత్రం హారికతో అఖిల్ సూపర్ జెన్యూన్ అని, కానీ ఈ మధ్య అతడికి ఏమైందో అర్థం కావట్లేదని కంటతడి పెట్టుకుంది. బాధలో ఉన్న మోనాల్‌ను ఓదార్చేందుకు అభి ఆమెతో మాటలు కలిపాడు. నువ్వు మా నాన్నకు నచ్చడమేంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీంతో అభి, మోనాల్ కథ మళ్లీ మొదటికి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు అవినాష్‌కు ఫ్రస్టేషన్ ఏమాత్రం తగ్గలేదు. నామినేట్ అయినందుకు అరియానా కన్నీళ్లు పెట్టుకోగా ఏడవకు, ఏడిస్తే మనం సేవ్ అవమూ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. కష్టపడి టాస్కులు ఆడనవసరం లేదని అర్థమైందంటూ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ వారం అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. (బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే) -
బిగ్‌బాస్: ఈ షోకు నువ్వు అనర్హురాలివి
పోయినసారి నామినేషన్ అఖిల్, అభిజిత్ మధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్టయ్యేవరకు వచ్చిందీ పరిస్థితీ. అఖిల్ కోసం కూడా త్యాగానికి సిద్ధపడని మోనాల్ చివరికి కెప్టెన్ వల్ల అభిజిత్ కోసం నామినేషన్లోకి వచ్చింది. మరోవైపు ఎప్పటిలాగే అవినాష్ నామినేషన్‌ను తట్టుకోలేకపోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాల్సిందేనా అంటూ చిందులు తొక్కాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. కిచెన్‌లో అభిజిత్ కష్టాలు వంట రాదంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన అభిజిత్ లాస్య వేసిన బిగ్‌బాంబ్ వల్ల కిచెన్‌లో దూరాడు. 20 దోశెలైనా ఆవురావురుమంటూ తినే సోహైల్‌తో కలిసి దోశెలు వేశాడు. అది చూసిన సోహైల్ దోశె వేయమంటే అభిజిత్ పరోటా చేస్తున్నాడని ఆటపట్టించాడు. ఇజ్జత్ కా సవాల్.. ఇప్పుడు చేస్తా చూడంటూ మరోసారి దోశె వేసేందుకు ప్రయత్నించిన అభి ఈసారి ఏకంగా ఊతప్పం చేశాడు. మరోవైపు కొద్ది రోజులుగా డల్ అయిన అఖిల్.. 'నా జీవితంలో ముందు నుంచీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే నీతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతా. నీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నా, నీతో అటాచ్మెంటే వద్దు' అంటూ రిలేషన్‌కు కటీఫ్ చెప్పడంతో మోనాల్ కంటతడి పెట్టుకుంది. (చదవండి: సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) ఫస్ట్ రౌండ్లో సోహైల్, మోనాల్ సేవ్ తర్వాత అవినాష్‌ను అరియానా అంకుల్ అని పిలవగా సోహైల్, అఖిల్ మధ్యలో దూరి అవినాష్‌ను ఏడిపించారు. అవినాష్‌కు ఈపాటికే పెళ్లి అయితే నలుగురు పిల్లలుండేవారంటూ ఆట పట్టించారు. అనంతరం పన్నెండోవారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బజర్ మోగగానే ఇంటి సభ్యులు పరుగెత్తుకెళ్లి తలపై టోపీ పెట్టుకున్నారు. గ్రీన్ టోపీలు ధరించిన సోహైల్, మోనాల్ సేవ్ అవగా ఎర్ర టోపీలు ధరించిన అరియానా, అఖిల్, అభిజిత్, అవినాష్ నామినేట్ అయ్యారు. ఈ నలుగురు శవ పేటికలో నిలబడటంతో రెండో లెవల్ ప్రారంభమైంది. ఇందులో నామినేట్ అయినవారు సేఫ్ అయినవారితో స్వాప్ చేసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించాడు. నువ్వు బిగ్‌బాస్ షోకు అనర్హురాలివి మొదటగా అవినాష్ మాట్లాడుతూ.. నిన్న వీకెండ్లో నాకర్థమైంది నువ్వు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అంటూ సోహైల్‌ను స్వాప్ చేయమని అభ్యర్థించగా అతడు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత మోనాల్‌తో మాట్లాడుతూ.. నీ కన్నా నేను స్ట్రాంగ్, ఎప్పుడూ వరస్ట్ పర్ఫామెన్స్ అనిపించుకోలేదు. బల్లగుద్ది మరీ చెప్తున్నా నీ కన్నా 200 % బాగా ఆడుతున్నాను.. నువ్వు కేవలం మూడు వారాల నుంచి పర్ఫామెన్స్ చేసి కప్పు గెలుస్తా అంటే కుదరదు. ఈ షోకు నువ్వు అనర్హురాలివి అని గరమయ్యాడు. నేను అర్హురాలినో కాదో చెప్పడానికి నువ్వు బిగ్‌బాస్ కాదు అని ఆమె కౌంటరిచ్చింది. నువ్వు స్ట్రాంగ్ అనుకున్నప్పుడు ఇంకా భయమెందుకు? నామినేషన్లో ఉండు అని తేల్చి చెప్పింది. (చదవండి: ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి) అఖిల్- మోనాల్ మధ్య రాజుకున్న గొడవ తర్వాత అఖిల్ మోనాల్‌ను తనకోసం నామినేషన్లోకి రమ్మని కోరగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. 'నన్ను ఎలిమినేట్ చేయాలన్నప్పుడు టపీమని నా పేరు చెప్పావు. కానీ కెప్టెన్సీలో మాత్రం నాకు సపోర్ట్ చేయలేదు. నేను నీ కోసం బట్టలు, వస్తువులు అన్నీ త్యాగం చేశాను. సపోర్ట్ చేస్తావనుకున్నా. కానీ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు!' అని చెప్పుకొచ్చాడు. నేను స్ట్రాంగ్ అని నిరూపించుకునేందుకే కెప్టెన్సీ టాస్క్‌లో హారికకు సపోర్ట్ చేసి ఆడాను అని మోనాల్ సమాధానమిచ్చింది. అలా ఇద్దరి మధ్య గొడవ రాజుకోవడంతో అటు మోనాల్, ఇటు అఖిల్ బాధపడ్డారు. వీళ్లిద్దరినీ చూసి సోహైల్‌కు మరింత బాధేసింది. దీంతో నీకోసం నామినేషన్లోకి వెళ్తానని అఖిల్‌తో చెప్పినప్పటికీ అతడు దానికి అంగీకరించలేదు. మనసులోని మాట చెప్పిన అభిజిత్ అరియానా వంతు రాగా.. ఈ సారి నీ సాయం కావాలంటూ సోహైల్‌ను కోరగా అతడు ససేమీరా నిరాకరించాడు. నీకన్నా నేను బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాను అని మోనాల్‌తో చెప్పుకు రాగా ఆమె మాత్రం స్వాప్ అవనని తేల్చి చెప్పింది. ఇక్కడ అరియానాకు మోనాల్‌కు మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంటే అవినాష్ మధ్యలో దూరి ఈ చర్చను గొడవగా మార్చాడు. తర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. మీ అమ్మ వచ్చి నన్ను ఫేవరెట్ అని చెప్పిన మాట నా మనసును తాకింది. కాబట్టి నాకోసం నిన్ను త్యాగం చేయమని అడగను అని మోనాల్‌కు మనసులోని మాట చెప్పాడు. ఎవరూ స్వాప్‌కు ఒప్పుకోకపోవడంతో అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇప్పుడు బాగా ఆడే కంటెస్టెంటు ఎలిమినేట్ అయి ఇంట్లో వెళ్లి కూర్చోవాలా అని ఆవేశపడ్డాడు. దీంతో అభి స్పందిస్తూ ఈ నలుగురిలో నువ్వు బాగా ఆడకపోతే ఎలిమినేట్ అవుతావు తప్ప అదృష్టం లేక కాదు అని క్లారిటీ ఇచ్చాడు. హారిక మీద భారం వేసిన బిగ్‌బాస్ వీళ్ల గొడవకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ పెద్ద ట్విస్టు ఇచ్చాడు. కెప్టెన్ హారిక తన పవర్ ఉపయోగించి ఒక స్వాప్ చేయాలని బాధ్యత అప్పజెప్పాడు. దీంతో హారిక నీకోసం నేనున్నా అంటూ అభిజిత్‌ను సేవ్ చేస్తూ తనకు కెప్టెన్సీ ఫలాన్ని అందించిన మోనాల్‌ను నామినేషన్లోకి పంపించింది. దీంతో తనకు సేవ్ అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని మోనాల్ ఏడ్చేసింది. అటు హారిక కూడా తనకు స్వాప్ చేయక తప్పలేదని ఎమోషనల్ అయింది. మొత్తానికి ఈ వారం అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. (చదవండి: ఈ ఇద్దరిలో ఒకరే బిగ్‌బాస్ విజేత: కౌశల్) -
అఖిల్‌కు శఠగోపం, అభి కోసం మోనాల్ త్యాగం!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్‌లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. రోజులు తగ్గేకొద్దీ వారి మధ్య పోటీ మరింత పెరుగుతోంది. మొదట్లో పెద్దగా కష్టపడినట్లు కనిపించని మోనాల్.. ఏడుసార్లు కెప్టెన్సీ కోసం పోరాడి ఓడిన హారికను ఇంటి కెప్టెన్‌గా గెలిపించిచి అందరి మనసులను దోచుకుంది. దీంతో తను కూడా స్ట్రాంగేనని ఇంటిసభ్యులకు చెప్పకనే చెప్పింది. ఇక ప్రతివారం నామినేట్ అయ్యే మోనాల్ ఈ ఈసారి కూడా నామినేషన్ లిస్టులో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓట్ల ఆధారంగా కాకుండా ప్రత్యేక టాస్క్ ద్వారా నామినేషన్ నిర్వహించారు. అందులో భాగంగా బజర్ మోగగానే కెప్టెన్ హారిక మినహా మిగతా ఇంటి సభ్యులు బయట ఉన్న టోపీలను ధరించారు. అందులో ఎరుపు రంగు టోపీ ధరించిన అవినాష్, అభిజిత్, అఖిల్, అరియానా నేరుగా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. అవినాష్‌కు కౌంటరిచ్చిన మోనాల్ కానీ వారు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించాడు. బయట ఉన్న సభ్యుల్లో ఒకరితో స్వాప్(ఒకరి స్థానంలోకి మరొకరు రావడం) చేసుకోవచ్చని సూచించాడు. దీంతో ఎక్కువ మంది మోనాల్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 'బల్లగుద్ది చెప్తున్నా.. నీకన్నా 100 కాదు 200% ఈ షోకు నేను అర్హుడిని' అని అవినాష్ చెప్పగా.. అలాంటప్పుడు భయమెందుకు, నామినేషన్లో ఉండు అని మోనాల్ కౌంటరిచ్చింది. మంచి గేమ్ ఆడుతున్నాను అనుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అంటూ అవినాష్ నోరు మూయించింది. అరియానా కూడా స్వాప్ కోసం మోనాల్‌ను అభ్యర్థించగా కుదరదని ఆమె కరాఖండిగా తేల్చి చెప్పింది. (చదవండి: అభిజిత్ లవ్ స్టోరీ చెప్పండి: నాగ్) అఖిల్- మోనాల్ మధ్య పెరుగుతున్న దూరం ఇక అఖిల్.. 'నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు అని అంతా అనుకుంటున్నారు. ఎప్పుడు చేశావు?' అని ప్రశ్నించాడు. దీంతో మోనాల్.. 'అది చేశాను, ఇది చేశాను అని నేను చెప్పను. నువ్వు నా కోసం చాలా మంచి చేశావు' అంటూ దండం పెట్టేసి స్వాప్ చేసుకునే ఆలోచనే లేదన్నట్టుగా నిలబడిపోయింది. చివర్లో మాత్రం మోనాల్ అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఆమె అభిజిత్‌తో స్వాప్ చేసుకుంటూ అతన్ని సేవ్ చేస్తూ నామినేషన్లోకి వెళ్లినట్లు చూపించారు. ఇక్కడ అఖిల్ ఎక్స్ప్రెషన్స్ మరింత హైలెట్‌గా మారాయి. తనను కాదని మోనాల్.. అభి కోసం త్యాగానికి సిద్ధమవడం అతడు జీర్ణించుకోలేనట్లు కనిపిస్తున్నాడు. అయితే మోనాల్ అభి కోసం నామినేషన్లోకి వెళ్లిందా? లేదా హారిక కెప్టెన్సీ పవర్‌తో అభిని సేవ్ చేసి మోనాల్‌ను నామినేషన్లోకి పంపించిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. (చదవండి: మోనాల్ మాత్రం కోడలిగా రాదు: అఖిల్ తల్లి) -
టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలో లాస్య జున్నును కలిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అసలే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు దాటిపోవడంతో జున్ను ఆమెను పూర్తిగా మార్చిపోయాడు. దీంతో ఆమె జున్ను చెంతకు చేరి తల్లి ప్రేమ కురిపించి మళ్లీ దగ్గరకు తీసుకోనుంది. ఇక వెళ్తూ వెళ్తూ కిచెన్ బాధ్యతలనే బిగ్‌బాంబ్‌ను ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మీద వేసింది. వాళ్లెవరు? నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ కన్నేయండి.. సేఫ్‌గా ఆడటం మీ స్ట్రాటజీనా? సండేను ఫండేగా మార్చేందుకు సిద్ధమైన నాగార్జున ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. అవినాష్, అరియానా, సోహైల్, మోనాల్ ఏ టీమ్‌గా మిగిలినవారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. వీరికి కొన్ని ఫొటోలను చూపించి దాని ఆధారంగా పాటల పేర్లను చెప్పమని గేమ్ ఆడించారు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్ ముగిసేసరికి బీ టీమ్ గెలిచింది. బీ టీమ్ కెప్టెన్ హారిక సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. అనంతరం ఓ ప్రేక్షకురాలు సంధించిన ప్రశ్నను వినిపించారు. సేఫ్‌గా ఆడటం మీ గేమ్ స్ట్రాటజీనా అని ఓ అభిమాని లాస్యను అడగ్గా తాను సేఫ్ గేమ్ ఆడటం లేదని ఆమె స్పష్టం చేసింది. తర్వాత మోనాల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. (చదవండి: సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్న హారిక) అవినాష్‌కు నెయిల్ పాలిష్ రుద్దిన సోహైల్ ఇంటిసభ్యులతో వెరైటీగా లూడో గేమ్ ఆడించారు. ఇందులో సోహైల్, అవినాష్ ఉన్న అరియానా టీమ్‌లో మోనాల్, మిగిలిన సభ్యులు ఉన్న హారిక టీమ్‌లో అభిజిత్ డైస్ రోల్ చేశారు. సోహైల్, అఖిల్ డైస్ రోల్ చేసిన నంబర్ల ఆధారంగా ఒక్కో గడిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఇందులో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్‌ను అవినాష్ వేళ్లకు అందంగా రుద్దాడు. అటు అఖిల్ రొమాంటిక్ సాంగ్‌ను ఏడుస్తూ, ఫాస్ట్ ఫార్వర్డ్‌లో, స్లో మోషన్లో ఖూనీ చేయకుండా పాడి మెప్పించాడు. తర్వాత లాస్య నాలుక బయటపెట్టి డైలాగులు చెప్పడం అందరికీ నవ్వు తెప్పించింది. అరియానా సేఫ్, లాస్య అవుట్ ఇక అవినాష్ ఒక్క నిమిషంలో చీర కట్టుకుని చిందులు వేయగా.. రాత్రి తొమ్మిది తర్వాత నువ్వు చేసేది ఇదే అన్నమాట అని నాగ్ కౌంటర్ వేశారు. ఈ దెబ్బతో తన పెళ్లి సంబంధాలు గోవిందా అని డీలా పడ్డ అవినాష్ తర్వాత టాస్కులో భాగంగా నిమ్మకాయను నమిలిపారేశాడు. మొత్తానికి లూడో గేమ్‌లో అరియానా టీమ్ గెలవగా హారిక టీమ్ ఓడిపోయింది. తర్వాత అభిజిత్, అరియానా సేఫ్ అయినట్లు ప్రకటించగా లాస్య ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..) అందరి కన్నా వీక్ అనుకున్నా.. స్టేజీ మీదకు వచ్చిన లాస్య ముందుగా తన నవ్వు నిజమైనదేనని, కన్నింగ్ కాదని చెప్పుకొచ్చింది. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసని నాగ్ భరోసా కల్పించారు. తర్వాత లాస్య.. సోహైల్, అభిజిత్ టాప్ 2లో ఉంటారని జోస్యం చెప్పింది. దీంతో భావోద్వేగానికి సోహైల్.. అందరికన్నా వీక్ అనుకున్నా కానీ అక్క టాప్ 2లొ ఉంటాను చెప్పగానే ఈ మాట చాలు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అవినాష్.. ఎంటర్టైనర్ కానీ నామినేషన్‌ను తీసుకోలేడని చెప్పింది. మోనాల్ బాగా ఆడుతుంది కానీ కన్ఫ్యూజన్లో ఉంటుందని పేర్కొంది. అరియానా బోల్డ్‌గా మాట్లాడుతుంది, కానీ కొన్నిసార్లు తప్పును కూడా ఒప్పుకోవాలని సలహా ఇచ్చింది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్) అభిజిత్ అంటే ఇష్టం అంటూనే అతడిపై బిగ్‌బాంబ్ సోహైల్‌కు ఎంత కోపం వస్తుందో అంత త్వరగా కరిగిపోతుంది అని చెప్పుకొచ్చింది. అఖిల్ బాగా ఆడతాడు. కానీ కోపం ఎక్కువ. ఎదుటివాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడని, అది మార్చుకోమని సూచించింది. అభి నాకు చాలా ఇష్టం. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. హారికతో సమయం గడపడం మరీమరీ ఇష్టం. అల్లరి పిల్ల. తనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే వాదించి సాధిస్తుంది. తను టాప్ 3 నుంచి 1కి వెళ్లాలని తెలిపింది. అనంతరం కింగ్ ఆఫ్ ద కిచెన్ బిరుదును అభిజిత్‌కు ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాలన్న బిగ్‌బాంబ్ అభి మీద పడింది. కానీ అభి మాత్రం బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే చేస్తానని చెప్పేశాడు. (చదవండి: అభి, నీ బ్రదర్‌ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ) -
బిగ్‌బాస్: రికార్డుల వేటలో అభిజిత్ ఫ్యాన్స్
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్‌బాస్ తన పేరు లిఖించుకుంది. ఏ యేటికాయేడు రెట్టింపు ఉత్సాహంతో అంతకు మించిన వినోదంతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. ఈ క్రమంలో వచ్చిన నాల్గో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా 11 వారం ముగింపుకు చేరుకుంది. హౌస్‌లో వంటలక్కగా స్థిపరడిపోయిన లాస్య నేడు ఎలిమినేట్ కానుందని లీకువీరులు టముకేసి మరీ చెప్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ సారి టాప్ 5 లో ఎవరుంటారనేది కంటెస్టెంట్ల ఫ్యామిలీలు కూడా కుండ బద్ధలు కొట్టినట్లు క్లారిటీగా చెప్పాయి. అభిజిత్ పక్కాగా టాప్ 2 ఉంటారని తేల్చి చెప్పాయి. నిజానికి అభిజిత్‌కు సినిమాల ద్వారా రాని గుర్తింపు బిగ్‌బాస్ ద్వారా వస్తోంది. ఎదుటివారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా ఎక్కడా తప్పటడుగు వేయకుండా జాగ్రత్తపడతాడు. కూల్‌గా మాట్లాడుతూ సమస్య పరిష్కరించుకుందామని చెప్తాడు. (చదవండి: అభిజిత్‌తో నాకు ఫ్రెండ్షిప్ వద్దు: సోహైల్) ఫేమస్ అయిన అభిక జంట అన్నింటికీ మంచి అతడికో క్లారిటీ ఉంటుంది. తన మాటల్లో చేతల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మోనాల్‌తో వ్యవహారం ఏదో తేడా కొడుతుందని ఆమెను పక్కన పెట్టేశాడు. హారికతో దోస్తీ చేయడం ప్రారంభించాడు. దీంతో వీళ్ల జంట ఫేమస్ అవగా, నెటిజన్లు వారికి 'అభిక' అని పేరు కూడా పెట్టేశారు. అయితే అభి ఫిజికల్ టాస్క్‌లో వెనకడుగు వేస్తాడు. దాన్ని కూడా మైండ్ గేమ్‌తో ఆడి గెలవాలనుకుంటాడు. దీంతో ఒక్క రోబో టాస్కు మినహా మిగతావాటిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. ఈ కారణాన్ని సాకుగా చెప్తూ ఇతర కంటెస్టెంట్లు అభిని నామినేట్ చేయడంతో అతడు తన రూటు మార్చాడు. అభికి లేరెవరూ పోటీ.. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఇచ్చిన ఫిజికల్ టాస్క్‌లో తన స్టామినా ఏంటో చూపించాడు. ఇది చూసిన ఆయన అభిమానుల సంబరం చెప్పనలవి కాదు. అభిని ఆకాశానికెత్తుతూ పండగ చేసుకుంటున్నారు. 'మా అభికి లేరెవరూ పోటీ, రారెవరూ సాటి' అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అందులో భాగంగా #WeAdmireAbijeet అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ మీద ఇప్పటికే నాలుగు లక్షల పైచిలుకు ట్వీట్లు రావడం విశేషం. మొత్తానికి సోషల్ మీడియాలో అభి పేరున రికార్డులు క్రియేట్ చేయాలని వీళ్లు కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది. (చదవండి: అభిజిత్ కచ్చితంగా టాప్ 2లో ఉంటాడు) -
బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో మరోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ నడిచింది. కాకపోతే వచ్చినవారితో కూడా నాగార్జున గేమ్ ఆడించారు. ఎవరు టాప్ 5లో ఉంటారో అంచనా వేయమన్నారు. దీనివల్ల ఓరకంగా కంటెస్టెంట్లకు లాభమే జరిగింది.అటు అయినవారితో మాట్లాడే వెసులుబాటుతో పాటు వారి అంచనాలను బట్టి ప్రేక్షకుల నాడి తెలుసుకునే అవకాశం దొరికింది. కానీ అవినాష్‌ను మాత్రం దురదృష్టం వెంటాడింది. అతడి ఫ్యామిలీని కలుసుకునే ఛాన్స్ చేజేతులా పోగొట్టుకున్నాడు. ఇక ఈ సీజన్ మొత్తంలో ఈ వారంలోనే అత్యధికంగా 9.5 కోట్ల ఓట్లు వచ్చాయని నాగార్జున సగర్వంగా ప్రకటించారు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీద ఓ కన్నేయండి.. అవినాష్ టాప్ 2లో ఉండకూడదు: హారిక కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు నాగ్ కంటెస్టెంట్లకు బంపరాఫర్ ప్రకటించారు. తను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్తే వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడిస్తానని చెప్పారు. దీనికి ఇంటిసభ్యులు సరేనంటూ తలాడించారు. మొదటగా హారిక వంతు రాగా.. నువ్వు టాప్ 2లో ఉంటే ఎవరు నీతో పాటు ఉండటానికి ఇష్టపడవు అని నాగ్ ప్రశ్నించారు. అందుకు ఆమె అవినాష్ పేరును చెప్పింది. దీంతో హారిక అన్నయ్య, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. వచ్చిన వాళ్లతో నాగ్ గేమ్ ఆడించారు. ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పమనగా.. హారిక, అభిజిత్, లాస్య, సోహైల్, అరియానా ముందు వరుసలో ఉంటారని తెలిపారు. (చదవండి: ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి) ముందు ఒకలా, వెనక ఒకలా ఉండేది అభి బిగ్‌బాస్ ఇంట్లో ముందు ఒకలాగా, వెనక ఒకలాగా ప్రవర్తించేది ఎవరు అన్న ప్రశ్నకు అభిజిత్ అని అఖిల్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా ఈ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని నాగ్ చేతులెత్తేశారు. తర్వాత అఖిల్ అన్న బబ్లూ, ఆయన కొడుకు అరుష్ స్టేజీ మీదకు వచ్చారు. సోహైల్, అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్ టాప్ 5లో ఉంటారని బబ్లూ అభిప్రాయపడ్డాడు. షో కోసం అన్నివిధాలా తమ వంతు కృషి చేయనిది ఎవరన్న ప్రశ్నకు అరియానా మోనాల్ అని చెప్పింది. తర్వాత అరియానా చెల్లి మృ గనయని(ముగ్గు), స్నేహితుడు కార్తీక్ వచ్చారు. (చదవండి: ఐ లవ్ యూ వినయ్: అరియానా) అవినాష్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు: లాస్య ఈ సందర్భంగా అరియానా చెల్లి మాట్లాడుతూ నువ్వు ఏడవకు, నన్ను ఏడిపించకు అని అక్కకు సలహా ఇచ్చింది. టాప్ 5లో అరియానా, అఖిల్, సోహైల్, హారిక, అవినాష్ ఉంటారని చెప్పుకొచ్చారు. కూరలో ఉప్పు ఎంత అవసరమో బిగ్‌బాస్‌కు అవినాష్ అంత అవసరమని ముగ్గు అభిప్రాయపడింది. కానీ అతడు అరియానాను పడేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పగా వెంటనే అవినాష్.. తాము క్లోజ్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక సేఫ్ గేమ్ ఆడుతూ ఇంతవరకు నెట్టుకొచ్చింది ఎవరన్న ప్రశ్నకు లాస్య అవినాష్ పేరు చెప్పింది. దీంతో స్టేజీ మీదకు వచ్చిన లాస్య తల్లి శాంతమ్మ తన కూతురు షోకు వచ్చాక ఎన్నో షాకులిచ్చిందని తెలిపింది. లాస్య, అభిజిత్, సోహైల్, అఖిల్, హారిక టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. (చదవండి: అఖిల్ బర్త్‌డే: ముద్దులు కురిపించిన మోనాల్) అభితో ఫ్రెండ్షిప్ వద్దు: సోహైల్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాక ఇంటిసభ్యుల్లో ఎవరితో స్నేహాన్ని కొనసాగించవు? అన్న ప్రశ్నకు సోహైల్ అభిజిత్ పేరు చెప్పాడు. దీంతో సోహైల్ బ్రదర్స్ సబిల్, రామారావు స్టేజీ మీదకు వచ్చారు. సోహైల్, అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చారు. రాత్రి తొమ్మిది తర్వాత నుంచి ఒంటి గంట వరకు సోహైల్ అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడని చెప్పడంతో అందరూ షాకయ్యారు. తర్వాత నాగ్ ఓ గాడిద సామెతను చెప్పగా అభిజిత్ చేయి లేపుతూ అది హారిక గురించే చెప్పానని సమాధానమిచ్చాడు. (చదవండి: మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు) మెహబూబ్‌కు బదులు మోనాల్ వెళ్లిపోవాల్సింది: అభి పోయిన వారం మెహబూబ్‌కు బదులు ఎవరు ఎలిమినేట్ కావాల్సింది అన్న ప్రశ్నకు మోనాల్ అని అభి సమాధానమిచ్చాడు. తర్వాత అభి మామ, నాన్న స్టేజీ మీదకు రాగా అతడి లవ్ స్టోరీ చెప్పమని నాగ్ అడిగారు. అయితే అభి వద్దనగానే మామ ఏమీ లేదని దాట వేశారు. టాప్ 5లో అభిజిత్, సోహైల్, హారిక, అఖిల్, మోనాల్ ఉంటారని తెలిపాడు. ఇంట్లో ఎవరిని నమ్మకుండా ఉంటే బాగుండేది అనుకున్నావు అన్న ప్రశ్నకు మోనాల్ అభిజిత్ పేరు చెప్పింది. స్టేజీ మీదకు వచ్చిన మోనాల్ తల్లి నాగ్‌కు గిఫ్ట్ ఇచ్చింది. సోహైల్ సేఫ్ తర్వాత అభిజిత్, మోనాల్, అఖిల్, లాస్య, సోహైల్ టాప్ 5లో ఉంటారని ఆశీర్వాదమిచ్చింది. అంతేకాక తనకు అభిజిత్ ఫేవరెట్ అని చెప్పింది. తర్వాత అవినాష్.. అందరికన్నా లాస్య సెల్ఫిష్ అని చెప్పాడు. కానీ సరైన కారణం చెప్పకపోవడంతో అతడి ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీ మీదకు రాకుండా వెనుదిరిగి పోయారు. అనంతరం టాప్ 5 ఓట్లు తక్కువగా పడ్డ ముగ్గురు కంటెస్టెంట్లు వారికి ఇష్టమైన వస్తువులను స్టోర్ రూమ్‌లో పెట్టాలని నాగార్జున ఆదేశించారు. దీంతో లాస్య.. జున్ను ఫొటో, అవినాష్.. పర్ఫ్యూమ్, మోనాల్ తన స్పెషల్ గిఫ్ట్‌ను పంపించేశారు. తర్వాత సోహైల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. మొత్తానికి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అభిజిత్, సోహైల్, అఖిల్, హారిక, అరియానా టాప్ 5లో ఉంటారని తేల్చి చెప్పారు (చదవండి: మోనాల్ సేఫ్, లాస్య ఎగ్జిట్!) -
బిగ్‌బాస్: అఖిల్‌కు షాకిచ్చిన మోనాల్ తల్లి
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఓ రకంగా అదృష్టవంతులు. కరోనా దూరని కుటీరంలా బిగ్‌బాస్ హౌస్ వారికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఆ మాయదారి రోగం వల్ల కంటెస్టెంట్లకు వారి కుటుంబాలకు మధ్య గాజు తెర అడ్డుగా నిలిచింది. కానీ అది వారి ప్రేమను అడ్డుకోలేదు. కన్నవారిని కళ్లారా చూసుకుని ఇంటి సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మంచీచెడ్డలు అడిగి తెలుసుకున్నారు. 70 రోజులకు పైగా ఇంట్లో ఉంటున్న కంటెస్టెంట్లకు రక్తసంబంధీకులతో ఎంత మాట్లాడినా తనివి తీరలేదు. అందుకని నాగార్జున ఇంటిసభ్యుల కోసం నేడు మరోసారి వారి కుటుంబాలను తీసుకువచ్చారు. అఖిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బుడ్డోడు తనకు అఖిల్ బాబాయ్‌తో పాటు మోనాల్ కూడా ఇష్టమని చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్) ఇక మోనాల్ అమ్మ తన కూతురు తర్వాత అభిజిత్ ఇష్టమని చెప్పడంతో అఖిల్ ముఖం మాడిపోయింది. ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేమని అరియానా సోదరి పంచ్ వేసింది. రాత్రి తొమ్మిది తర్వాత సోహైల్ కథ వేరే ఉంటదని అతడి ఫ్యామిలీ మెంబర్ ఏదో రహస్యాన్ని చెప్పబోతుంటే వద్దని సోహైల్ వేడుకున్నాడు. ఇక అభిజిత్ లవ్ స్టోరీ గురించి చెప్పమని నాగ్ అతడి బంధువును అడగ్గా.. నాన్న ముందు చెప్తే బాగోదని అభి దాటవేసే ప్రయత్నం చేశాడు. తర్వాత అవినాష్ నాగ్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో అతడి ఫ్యామిలీ మెంబర్‌ను కలుసుకునే అవకాశం కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు అఖిల్‌కు పంచ్ పడిందని కామెంట్లు చేస్తున్నారు. మోనాల్ సోదరి అభికి కౌంటరిస్తే వాళ్ల అమ్మ మాత్రం అతడికే సపోర్ట్ చేయడం విశేషమని చెప్తున్నారు. (చదవండి: ఐ హేట్ యూ అన్నావు, అసలు నన్నో ఫ్రెండ్‌గా ఎప్పుడు ఇష్టపడ్డావు) -
లక్ వల్లే అఖిల్ రీఎంట్రీ ఇచ్చాడు: అభిజిత్
కంటెస్టెంట్లు కలిసి ఉండాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా అదంతా బిగ్‌బాస్ చేతిలో ఉంటుంది. అఖిల్-అభిజిత్ విషయంలో ఇది తేటతెల్లమవుతోంది. బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో ఏ సమస్యా లేకపోయినా అఖిల్, అభిజిత్ గొడవలు పడేవారు. కేవలం మోనాల్ కోసం కొట్టుకు చచ్చేవారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరూ ఆమెను వదిలేసి స్నేహం గీతం పాడుకుంటూ కలిసిపోయారు. ఇంతలో నామినేషన్ పెంట పెట్టి బిగ్‌బాస్ అఖిల్, అభి మధ్య నిప్పు రాజేసే ప్రయత్నం చేశాడు. తర్వాత సీక్రెట్ రూమ్ ట్విస్టుతో ఆ నిప్పు అగ్ని పర్వతంలా మారగా.. రీఎంట్రీతో అఖిల్ దాన్ని బద్ధలు చేస్తూ ఫైర్ అయ్యాడు. నామినేషన్లోనూ.. మటన్ షాపు ఓనర్ మేకకు గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది.. తర్వాత ఏమైంది అంటూ అభి తన గురించి వెనకాల మాట్లాడిన మాటలను ప్రస్తావిచాడు. ఆ మేక ఇప్పుడు పులై వచ్చిందని చెప్తూ అతడిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్లారు. (చదవండి: ఆఫ్ట్రాల్ ఓ బచ్చాగానివి, పక్కకు పో: అభి ఫైర్) కానీ మొన్న అఖిల్ అమ్మ హౌస్‌లోకి వెళ్లి అభిజిత్, నీ బ్రదర్‌ను బాగా చూసుకో అని అఖిల్ గురించి చెప్పుకొచ్చింది. అటు అభి అమ్మ కూడా ఏం పర్లేదు కొట్టుకోండి అని సలహా ఇచ్చింది. ఈ ఒక్క ఎపిసోడ్‌తో బద్ధ శత్రువుల్లా మారిన అఖిల్, అభిజిత్ సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు. కానీ ఇది బిగ్‌బాస్‌కు బొత్తిగా నచ్చనట్లు కనిపిస్తోంది. దీంతో నాగార్జున నేడు మరోసారి మేక గొడవను లేవనెత్తారు. దీనిపై అభి స్పందిస్తూ.. తను అన్నదాంట్లో తప్పేముందని అడిగాడు. అఖిల్ ముందు చెప్పమన్నా చెప్తానని స్పష్టం చేశాడు. దీంతో అఖిల్ అప్పుడు మాట్లాడిన టోన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడిన టోన్ ఏంటని మండిపడ్డాడు. అయినా లక్‌తో పాటు బిగ్‌బాస్ తల్చుకోవడం వల్లే అఖిల్ హౌస్‌లోకి మళ్లీ వచ్చాడని అభిజిత్ చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య గొడవ రాజుకున్నట్లు తేటతెల్లమవుతోంది. (చదవండి: తిండి కోసం అతడి ఇంటికి వెళ్లాను: అరియానా) -
బిగ్‌బాస్: తల్లి ప్రేమ, అందరినీ కలిపేసింది
బిగ్‌బాస్ జర్నీలో కంటెస్టెంట్లు వారి కుటుంబాలను కలసుకునే ఎపిసోడ్ ఎంతో ప్రత్యేకమైనది. ఇంటిసభ్యుల తప్పొప్పులను సరిచేస్తూ ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు వారిచ్చే సలహాలు ఎంతో విలువైనవి. కానీ ఈసారి అలాంటి అవకాశమేమీ లభించలేదు. పర్సనల్‌గా మాట్లాడుకునే స్పేస్ దొరక్కపోయినా కావాల్సినంత ప్రేమను పంచారు. అదేంటో కానీ కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ లోనికి అడుగు పెట్టేకొద్దీ లోపల ఉన్న కంటెస్టెంట్ల మనసులు శుద్ధిగా మారిపోయాయి. నామినేషన్ గొడవలను గాలికొదిలేసి అంతా ఒకే కుటుంబం అన్నట్లుగా కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇన్ని వింతలు చోటు చేసుకున్న నేటి 74వ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా చదివేసేయండి.. అవినాష్‌ను ఆడుకున్న సోహైల్ ఓ వైపు మటన్ పాడు చేసినందుకు కంటెస్టెంట్లతో చీవాట్లు, మరోవైపు నాన్‌వెజ్ తినకూడదన్న బిగ్‌బాంబ్ అవినాష్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇలాంటి సమయంలో సోహైల్, అవినాష్ పక్కన చేరి మటన్ ఆవురావురుమని లాగిస్తూ అతడికి ఊరిళ్లు తెప్పించాడు. దీంతో అవినాష్ తన జిహ్వ చాపల్యాన్ని కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. సోహైల్ మాత్రం నేల మీద పాకుతూ మరీ ప్లేటు ఖాళీ చేశాడు. తర్వాత హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒక్కొక్కరిగా పంపించాడు. ముందుగా అఖిల్ అమ్మ దుర్గ రాగానే అతడు చంటిపిల్లాడిలా ఏడ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: హారికకు ఇచ్చి పడేసిన సోహైల్) మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అమ్మకు.. మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అఖిల్ తన అమ్మకు ఇచ్చాడు. ఆమె హారికను పట్టుకుని నీలాంటి ఆడపిల్ల కావాలి అనడంతో హారిక ఆనందంతో గాల్లో తేలియాడింది. అందరి గురించి అన్నీ చెప్తున్న ఆమె మోనాల్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో తన గురించి కూడా చెప్పమని అఖిల్ నోరు తెరిచి అడిగాడు. దీంతో ఆమె మోనాల్ నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అద్దం తెర చాటు నుంచే కొడుక్కు ముద్దు పెట్టింది. అలాగే అఖిల్‌కు అభిజిత్ అన్న, లాస్య అక్క అని చెప్పింది. ఆమె వీడ్కోలు తీసుకోగానే ఏదో మంత్రం వేసినట్టుగా అభిజిత్, అఖిల్, సోహైల్ కలిసిపోయారు. (చదవండి: ఇక చాలు ఆపండి, అభిజిత్ విన్నరేంటి?) హారికతో చక్కర్లు కొట్టేందుకు అభి ప్లానింగ్ ప్లాంక్ వాక్(నేలమీద పాకడం) పెట్టకండని అరియానా బిగ్‌బాస్‌ను వేడుకుంది. ఆ వెంటనే అందరూ పాకాలని బిగ్‌బాస్ బజర్ మోగించాడు. దీంతో చచ్చినట్లు నేలమీద పడి పాకడం మొదలుపెట్టారు. వారిని పవర్ సేవ్ మోడ్‌లో ఉంచిన బిగ్‌బాస్ హారిక తల్లి జ్యోతిని లోనికి పంపించారు. హారికను చూసుకుంటున్నందుకు ఆమె అభిజిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచానని హారిక గుడ్‌న్యూస్ చెప్పగా ఈసారైనా గెలుస్తావా? అని ఏడిపించింది. ఇంతలో అభిజిత్ అందుకుంటూ మీరు అనుమతిస్తే హారికను ఓసారి ఓ చోటుకు తీసుకెళ్తాను అని అడగ్గా ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేస్ట్‌గాడు అన్నందుకు సారీ: హారిక తర్వాత లోనికి వచ్చిన అభిజిత్ అమ్మ లక్ష్మి కొడుకును చూడగానే సంతోషంతో ఏడ్చేసింది. దీంతో ఎమోషనల్ అవొద్దు అంటూ అభి తల్లిని ఓదార్చాడు. ఆమె కొడుకు కన్నా ఎక్కువగా అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా తనకు కూడా హౌస్‌లో ఓ రోజు ఉండాలనుందని మనసులోని మాట చెప్పింది. ఈ అవకాశం మళ్లీ దొరకదని బాగా ఎంజాయ్ చేయండి, కొట్టుకోండి అని సలహా ఇచ్చింది. సంతోషం పట్టలేని కంటెస్టెంట్లు డ్యాన్సు చేస్తూ కుప్పిగంతులు వేశారు. బయటకు వెళ్లాక మనం కొట్టుకున్నది చూసి నవ్వుకుంటామని అభిజిత్ చెప్పుకొచ్చాడు. దానికంతటికీ కారణమైనందుకు అఖిల్, సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన అభి హారికకు ధన్యవాదాలు చెప్పకుండా హారికకు హగ్గిచ్చాడు. తర్వాత హారిక వేస్ట్‌గాడు అన్నందుకు సోహైల్‌కు సారీ చెప్పింది. (చదవండి: నేను గేమ్ ఆడటానికి రాలేదు: అభిజిత్) ప్రతిసారి పెళ్లి అనకు, వచ్చాక చేస్తా తర్వాత అవినాష్ అమ్మ మల్లవ్వ లోపలకు వచ్చింది. కొడుకు మీద ముద్దుల వర్షం కురిపించింది. కంటెస్టెంట్లు అందరూ బాగుండాలని రోజూ దేవుళ్లకు పూజలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఊరికే పెళ్లి అంటూ కలవరించొద్దని, బయటకు వచ్చాక చేస్తానని హామీ ఇచ్చింది. చాలా మంది ఇంటికొచ్చి తనను సెల్ఫీ అడుగుతున్నారని తెలిపింది. వెళ్లిపోయే ముందు హౌస్‌మేట్స్‌తో కలిసి హుషారుగా స్టెప్పులేసింది. ఆమె వెళ్లిపోగానే అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెండు మోకాళ్లు అరిగిపోయి ఆపరేషన్ అయిందని, తాను వచ్చేముందు నడవలేని స్థితిలో ఉండేదని అరియానాతో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు నడవగలుగుతోందని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కొంత భారంగా మరికొంత వినోదాత్మకంగా సాగింది. వచ్చిన వాళ్లందరూ అఖిల్‌కు బర్త్‌డే విషెస్ చెప్తూ అవినాష్‌కు పిల్లను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఈ ఎపిసోడ్ అందరినీ మార్చేసింది. వారి మధ్య ఉన్న గొడవలను తుంచి, మనస్పర్థలను చెరిపేసింది. అందరి మనసుల్లో ప్రేమను మాత్రమే వ్యాపింపజేసింది. -
ఈ ఇద్దరిలో ఒకరే బిగ్‌బాస్ విజేత: కౌశల్
పోటీదారులు ఎంతమంది ఉన్నా విజేత ఒక్కరే. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ కోసం ఎనిమది మంది పోరాడుతున్నారు. అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్, మోనాల్, అరియానా, అవినాష్, లాస్య ఎవరికి వారే టైటిల్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు బలహీనతలను అధిగమించి, ఎమోషన్స్‌ను జయించి, బలాన్ని కూడదీసుకుని, టాస్కులను ఒంటిచేత్తో పూర్తి చేసి విజయాన్ని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. కానీ ఎంత కష్టపడ్డా వీరిలో ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాలే వరకు వెళ్తారు. అందులో ఒక్కరికే టైటిల్ సొంతమవుతుంది. అలా మరో మూడు వారాల్లో షోకు శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో ట్రోఫీని అందుకునే అవకాశం ఎవరికి పుష్కలంగా ఉందనే విషయాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంటు కౌశల్ మండా వెల్లడించాడు. కానీ హౌస్‌లో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని చెప్పుకొచ్చాడు. ఆయన ఇంకా ఏమేం అన్నాడో అతడి మాటల్లోనే.. సీక్రెట్ రూమ్ అట్టర్ ఫ్లాప్.. అభిజిత్.. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఫిజికల్‌గా స్ట్రాంగ్ కాకపోవచ్చు. కానీ అతడు చెప్పే ప్రతీదీ జనాలకు అర్థమయ్యేట్టు చెప్తాడు. మా సీజన్లో తనీష్‌కు ఆ అలవాటు ఉంది. ఇతడు కచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. సోహైల్.. మంచి ప్లేయర్. కోపమే అతడి బలం. అతడు కోపంలో మాట్లాడే మాటలు విని ఎంజాయ్ చేయొచ్చు. సోహైల్ కూడా పక్కా టాప్ 2లో ఉంటారు. అఖిల్.. మిగతావాళ్లతో పోలిస్తే బాగా ఆడతాడు. మొదట్లో మోనాల్‌తో ట్రాక్ నడిపాడు. కానీ సడన్‌గా ఆ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు. తర్వాత మళ్లీ గేమ్‌లోకి వచ్చాడు. అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడని అతనితో పాటు ఇంటిసభ్యులకు కూడా తెలుసు. అయితే ప్రతి సీజన్‌కు సీక్రెట్ రూమ్ వర్కవుట్ కాదు. పైగా అఖిల్ ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి టెంపర్ లూజ్ అయ్యాడు. అదే అతడికి మైనస్ అవుతోంది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్) అవినాష్ కామెడీ తగ్గించేశాడు అవినాష్.. కామెడీ చేస్తున్నాడు, గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చిల్లర కామెడీ అన్నప్పటి నుంచి కామెడీ తగ్గించేశాడు. ఎత్తుకు పై ఎత్తుకు వేసుకుంటూ వెళ్తే టాప్ 5లోకి వెళ్తాడు. అరియానా.. అగ్రెసివ్. ఒకసారి పీక్స్‌కు వెళుతుంది మళ్లీ డ్రాపవుట్ అవుతుంది. అదే పీక్నెస్ మెయింటెన్ చేస్తే బాగుంటుంది. ఇక అవినాష్, అరియానా మధ్య బంధం బలంగా ఉంది. హారిక.. ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడుతుంది. అందరితో ఓపెన్ అవ్వట్లేదు. క్యూట్ అండ్ బబ్లీనెస్తోనే ఉండిపోతోంది. కానీ అక్కడ సమయం మించిపోతోంది. అయినా సరే తర్వాత చేద్దాం, తర్వాత ఆడదాం అనుకుంటే కుదరదు. ఇప్పటి నుంచే ఆడాల్సిందే. (చదవండి: అరియానా నాకు కాంపిటీషనే కాదు: లాస్య) లాస్య అసలు స్వరూపం చూపించాలి లాస్య.. గేర్ లేని కారును నడుపుతున్నట్లుగా ఆమె ఆట ఉంది. మొదటి నుంచి కూల్‌గా వెళ్తోంది. అందరూ ఆమె నవ్వునే చూశారు, కానీ కోపాన్ని కూడా చూడాలనుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు అసలు స్వరూపాన్ని చూపింస్తుందని కోరుకుందాం. మోనాల్.. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతోంది. అఖిల్‌తో రిలేషన్ నుంచి బయటకు వచ్చి గేమ్ మీద దృష్టి పెడితే బాగా ఆడగలదు. భాష రాకపోవడం వల్ల చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్పలేకపోతోంది. ఎమోషనల్‌గా కాకుండా అగ్రెసివ్‌గా ఆడితే బాగుంటుందని కౌశల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్ : నీకు పడిపోతా అవినాష్.. అరియానా) -
హారిక లాంటి కూతురు కావాలి: అఖిల్ తల్లి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమై 70 రోజులు దాటిపోయింది. ఈ సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరికి తోడుగా మరో ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు లోనికి వెళ్లడంతో పార్టిసిపెంట్ల సంఖ్య 19కి చేరింది. కానీ పదకొండో వారానికి వచ్చేసరికి మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. అయితే కంటెస్టెంట్లు లోనికి వెళ్లే ముందు 14 రోజులు క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే కదా! కరోనా కాలం కాబట్టి ఆ ముందు జాగ్రత్త చర్యలు తప్పలేవు. ఇదిలా వుంటే షో ముగింపుకు వస్తున్న తరుణంలో ఇంటిసభ్యులు వారి కుటుంబీకులను కలుసుకునేందుకు బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు. కానీ కోవిడ్ కారణంగా ఒకరినొకరు టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా అడ్డుగోడ కట్టారు. కుటంబ సభ్యులు వారి పిల్లలతో కలిసి తిరగకుండా ఓ గాజు తెరలో నుంచే మాట్లాడే సదుపాయం కల్పించారు. (చదవండి: నేను స్ట్రాంగ్ కాదు, పంపించేయండి: అరియానా) దీంతో నేడు హౌస్‌లోకి అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక, అరియానా తల్లులు వచ్చారు. వాళ్లను చూసి సర్ప్రైజ్ అయిన ఇంటిసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కన్నీళ్లు తుడిచే అవకాశం లేకపోయినా మాటలతో ఓదార్చుతూ అద్దంలో నుంచే తమ పిల్లలకు మమకారపు ముద్దులు కురిపిస్తూ ఓదార్చారు. కాగా ఎన్ని గొడవలు జరిగినా కేవలం గేమ్ వరకే అని అవినాష్ చెప్తుంటే అభిజిత్ అమ్మ మాత్రం కొట్టుకోండి, మజా వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. అఖిల్ తల్లి మాట్లాడుతూ హారిక లాంటి కూతురు కావాలని దేత్తడి మీద ప్రేమ కురిపించింది. అవినాష్ లాగే అతడి తల్లి కూడా డ్యాన్సు చేస్తూ ఎంటర్టైన్ చేసింది. ఇక హారిక అమ్మ మాట్లాడుతూ.. ఈసారైనా కెప్టెన్ అవుతావా? అని కూతురిని ఏడిపించింది. కుటుంబ సభ్యులను కలుసుకున్న కంటెస్టెంట్లు ఆనందంతో గాల్లో తేలియాడుతున్నారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ ఎపిసోడ్ వీక్షించాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే! (చదవండి: అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి) -
అఖిల్ బర్త్‌డే: ముద్దులు కురిపించిన మోనాల్
క్రమశిక్షణ లేకుండా పోయిన హౌస్‌ను బిగ్‌బాస్ కమాండో ఇన్స్టిట్యూట్గా మార్చాడు. ఇది టాస్క్ కాదు శిక్ష అనేట్టుగా వారితో సకల ఆటలు ఆడించాడు. పడుతూ లేస్తూ, నవ్వుతూ తుళ్లుతూ, ఆయాసపడుతూ ఆటాడుతూ చచ్చినట్లు బిగ్‌బాస్ చెప్పినట్లు నడుచుకుంటున్నారు. మరోవైపు నామినేషన్ ప్రక్రియ రోజు నిప్పులు తొక్కిన కంటెస్టెంట్ల ఆవేశం నేడు చల్లారినట్లు కనిపిస్తోంది. గొడవలు పక్కనపెట్టి తిరిగి ఎప్పటిలాగే మాట్లాడుకున్నారు. మరి నేటి బిగ్‌బాస్ షోలోని 73వ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. కమాండోలుగా మారిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్ ఇల్లు కమాండో ఇన్స్టిట్యూట్గా మారింది. ఈ టాస్క్‌లో యూనిఫామ్ ధరించిన ఇంటిసభ్యులు కొన్ని డ్రిల్స్ చేయాలి. అఖిల్ కేడట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ట్రంపెట్ సౌండ్ వస్తే మార్చి ఫాస్ట్, ఎక్సర్సైజ్, గన్‌షాట్స్ వస్తే దాక్కోవడం, పవర్ సేవ్ అనగానే ఫ్రీజ్ అవడం, స్లో మోషన్ అన్నప్పుడు స్లో మోషన్లో, ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో, డ్రమ్ రోల్స్ వస్తే నేలపై పాకడం వంటివి అన్నీ చేయాలి. బజర్ మోగినప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్యక్తి ఒక ఛాలెంజ్ చేసే అవకాశం పొందుతారు. ఇలా నాలుగు సార్లు బజర్ మోగుతుంది. ఒకసారి ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తికి మరోసారి బజర్ కొట్టే అవకాశం లేదు. (చదవండి: కెప్టెన్ అఖిల్: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు) పోరాడి ఓడిన సోహైల్ టాస్క్ మొదలవగానే బిగ్‌బాస్ చెప్పినట్టుగా ఆడుతూ ఎంజాయ్ చేశారు. కానీ పదేపదే స్టంట్లు చేసేందుకు మాత్రం తెగ ఆయాసపడ్డారు. మొదటి బజర్ మోగగానే సోహైల్ అన్నింటికన్నా కఠినమైన ఛాలెంజ్ స్వీకరించాడు. ఇందులో సోహైల్ స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున ఉన్న బరువైన వస్తువులను మరోవైపుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెహబూబ్ కోసం ఈ ఆటాడుతున్నానని చెప్పిన సోహైల్ చివరికి ఓడిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు. తర్వాత బజర్ కొట్టిన అఖిల్.. పోల్‌ను వాటేసుకుని కిందకు దిగకూడదన్న సవాలు స్వీకరించి విజయం సాధించాడు. (చదవండి: బిగ్ సర్ప్రైజ్: హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీస్!) ఇక నుంచి నామినేట్ చేయకండి: అభి తర్వాతది నువ్వే కొట్టాలని హారిక అభిజిత్‌కు చెప్పింది. అనుకున్నట్లుగానే అభి బజర్ కొట్టి మంకీ బార్ ఛాలెంజ్ స్వీకరించి గెలుపొందాడు. 100 శాతం ఇస్తున్నా కదా, ఈ సారి నన్ను నామినేట్ చేయకండి అని అభి అభ్యర్థించాడు. మరోవైపు అవినాష్ సరిగా దాక్కోలేదని అభిజిత్ ఫిర్యాదు చేయగా అవునని అరియానా సమర్థించింది. దీంతో అవినాష్, అరియానా కొట్టుకు చచ్చారు. నాకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అరియానా స్పష్టం చేసింది. తర్వాత బజర్ కొట్టిన హారిక టైర్‌ను గార్డెన్ ఏరియాలో పది రౌండ్లు ఫ్లిప్ చేసే సవాలును స్వీకరించి పూర్తి చేసింది. (చదవండి: నాతో మర్యాదగా మాట్లాడు: అభిజిత్) అఖిల్‌కు మోనాల్ రొమాంటిక్ గిఫ్ట్ అనంతరం రాత్రి పూట హౌస్‌లో అఖిల్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. అఖిలే నం.1 అని కేక్ మీద రాసి బర్త్‌డే బాయ్‌తో కేక్ కట్ చేయించారు. మొదట ఎవరికి తినిపిస్తాడు అన్న సస్పెన్స్‌కు తూట్లు పొడుస్తూ కేకు ముక్క తనే తిన్నాడు. తర్వాత మోనాల్ అఖిల్‌ను హత్తుకుని తొలిసారిగా ముద్దులు కురిపించింది. దీంతో గాల్లో తేలిపోయిన అఖిల్ రోజు నా బర్త్‌డే ఉంటే బాగుండని మనసులోని మాట బయటపెట్టాడు. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో సోహైల్ ఎక్కడా కనిపించలేదు. (చదవండి: ఎలిమినేషన్: సోహైల్‌కు షాకుల మీద షాకులు) -
బిగ్‌బాస్: వేట మొదలు పెట్టిన అభిజిత్!
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మేక పులి గేమ్ నడుస్తోంది. పులి ఎదురు చూసి పంజా విసురుతుందని అభి తనకు తానే పులి అని ప్రకటించుకున్నాడు. అప్పటి నుంచి నాగార్జున కూడా అతడిని పులి అని పిలవడం మొదలు పెట్టారు. ఇది సహించలేకపోయాడో లేదా తనను మేక అనడం భరించలేకపోయాడో కానీ అఖిల్ తనకు తానే పులి అని ప్రకటించుకున్నాడు. తన మీద జోకులేసిన అభి మీద మాటలతో కత్తులు దూశాడు. అలా వీళ్లిద్దరి మధ్య గొడవలు అనే అగ్నిగుండం బద్ధలై ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్లారు. దీంతో బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్ సక్సెస్ అయింది. కానీ అఖిల్ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవుతోంది. కరెక్ట్ పాయింట్ మాట్లాడినా ఆటిట్యూడ్ చూపించడంతో తన గొయ్యి తానే తాన తవ్వుకుంటున్నట్లవుతోంది. ఇక నామినేషన్ ప్రక్రియలో అవినాష్, అరియానా, అఖిల్, సోహైల్.. టాస్కులు ఆడటం లేదంటూ అభిజిత్‌ను నామినేట్ చేశారు. దీనివల్ల ఓ రకంగా మంచే జరిగినట్లు కనిపిస్తోంది. (చదవండి: నాతో జాగ్రత్త: సోహైల్‌కు అభిజిత్ వార్నింగ్) ఇప్పటివరకు నిద్రపోయిన పులి అభిజిత్ మొదటి సారి టాస్కులో తన ప్రతాపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. బిగ్‌బాస్ ఇంటిని కమాండో ఇన్స్టిట్యూట్గా మార్చారు. ఇంటిసభ్యులందరూ బుల్లెట్లను తప్పించుకుంటూ బిగ్‌బాస్ చెప్పిన టాస్కులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందరితోపాటు అభి కూడా తొలిసారి గేమ్‌ను ఎంజాయ్ కోసం కాకుండా గెలవాలన్నట్టుగా ఆడుతున్నట్లు అనిపిస్తోంది. మొత్తానికి అభిజిత్, హారిక, అఖిల్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచినట్లు టాక్. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు లాస్య ఎప్పుడూ టాస్క్ పేపరు చదివి వినిపించడమే తప్ప ఆడదని సెటైర్లు విసురుతున్నారు. పులి వేటాడటం మొదలు పెట్టింది, ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు అని అభిజిత్ అభిమానులు అంటున్నారు. మరి ఈ టాస్క్‌లో ఎవరెవరు తమ సత్తా చూపించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అభిజిత్ ఆలోచన దిగజారిపోయింది..) -
ఆఫ్ట్రాల్ ఓ బచ్చాగానివి, పక్కకు పో: అభి ఫైర్
ఓరకంగా బిగ్‌బాస్ హౌస్ మాంత్రికుడి మాయాజాలం వంటిదే. కంటెస్టెంట్లు ఎప్పుడు కలిసిపోతారో, ఎప్పుడు విడిపోతారో ఎవ్వరూ ఊహించలేరు. సీజన్ మొదటి నుంచే మోనాల్ కోసం కొట్టుకు చస్తూ బద్ధ శత్రువుల్లా మారిన అఖిల్, అభిజిత్ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మోనాల్‌ను పక్కన పెట్టేశారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. నేటి నామినేషన్లో అది తారాస్థాయికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో అఖిల్ అభిజిత్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తను సీక్రెట్ రూమ్‌లో విన్న డైలాగులను ఏకరువు పెట్టాడు. ఇంత జరిగినా బుద్ధి రాలేదు.. "మటన్ షాపు ఓనర్ మేకకు గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది.." అని అభి తన గురించి అన్న మాటనే తిరిగి వల్లించాడు. కానీ లోపలికి వెళ్లిన మేక పులిలా వచ్చిందని చెప్పగా మేక ఎప్పుడూ పులి కాదని, బలవుతుందని అభిజిత్ కౌంటరిచ్చాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ లోపలికి వస్తానన్న నమ్మకంతోనే వెళ్లిపోయావు అని అసలు పాయింట్ లాగాడు. "ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అయినా నా గురించి చెప్పడానికి నువ్వెవరు? ఆఫ్ట్రాల్.." అంటూ గరమయ్యాడు. నీకు నువ్వు తురుమ్‌ఖాన్ అనుకుంటున్నావా? నువ్వో బచ్చాగానివి, ఏం తెల్వదు పో.. అనడంతో అఖిల్ ఫేస్ మాడిపోయింది. (చదవండి: నువ్వు ఫేక్, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్) అఖిల్ మీద నెటిజన్ల జోకులు దీంతో మంట మీదున్న అఖిల్ 'నువ్వు బిగ్‌బాస్‌కు రావడానికి 32 ఏళ్లు పట్టిందేమో, నాకు 25 ఏళ్లే పట్టింది' అని అఖిల్ రివర్స్ కౌంటరిచ్చాడు. అగ్నిగుండంలా రగిలిపోతున్న ఈ ఇద్దరి గొడవ నామినేషన్ తర్వాత చల్లారిపోతుందేమో కానీ వాళ్ల అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకు చస్తున్నారు. సీక్రెట్ రూమ్‌లో పిల్లిలా ఏడ్చిన అఖిల్ పులి ఏంటని విమర్శిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌కు బయట ఉండే మేకలు మేమేమే అని అరిస్తే లోపల ఉన్న మేక మమ్మీ అంటుందని సెటైర్లు వేస్తున్నారు. ఇక అఖిల్ అభిమానులు మాత్రం అతడు సింహం అని, అతడి మీద కుళ్లు జోకులు వేస్తే ఎందుకు సహిస్తాడని వెనకేసుకొస్తున్నారు. మిగతా నెటిజన్లు.. అనవసరంగా అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతూ తన ఇమేజ్ తానే డ్యామేజ్ చేసుకుంటున్నాడని అంటున్నారు. మొత్తానికి సీక్రెట్ రూమ్ వల్ల ఇద్దరి మధ్య అగ్నిపర్వతం బద్ధలైందని చెప్తున్నారు. (చదవండి: గే బార్‌కు వెళ్లాను: అభిజిత్ షాకింగ్ సీక్రెట్) -
కెప్టెన్ అఖిల్: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు
ఒకప్పుడు నాగార్జున ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని అభిజిత్‌ను హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు సీను మారింది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటూ అఖిల్‌కు చీవాట్లు పెట్టారు. అఖిల్‌ను వెళ్లగొట్టినంత పని చేసి తిరిగి లోనికి పంపించారు. ఇక కంటెస్టెంట్ల కోసం నాగార్జున భార్య అమల డ్రైఫ్రూట్స్ పంపించగా, నాగ్ మటన్ పంపిస్తానని మాటిచ్చారు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్‌బాస్ సంధించిన ప్రశ్నలు అర్థం చేసుకోరా? కంటెస్టెంట్లు అందరూ జంటలుగా విడిపోయి నాగార్జున సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి ఆయన్ను సర్ప్రైజ్ చేశారు. అందరితోపాటు అభిజిత్ కూడా డ్యాన్స్ బాగా చేశాడని నాగ్ మెచ్చుకున్నారు. అనంతరం తన భార్య అమల ఇచ్చిన బహుమతులను పంపించాడు. అందులో సంచుల కొద్దీ డ్రైఫ్రూట్స్ ఉండటంతో ఇంటిసభ్యులు సంతోషంతో ఎగిరి గంతేశారు. తర్వాత అఖిల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. బిగ్‌బాస్ మిమ్మల్ని ఒంటిగంటకు నిద్ర లేపి ఏకగ్రీవంగా ఒక పేరు చెప్పమన్నాడు. ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఎవరు మీ గేమ్‌కు అడ్డుపడతారు? ఫైనల్స్‌కు మీకు అడ్డొచ్చేది ఎవరు? అని మూడు కండీషన్లు పెట్టారు. కానీ మీరందరూ మొదటి కండీషన్‌ను మాత్రమే పట్టుకుని వేలాడారు. అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు వాళ్లే చెప్పుకోవడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ చర్చతో హౌస్‌లో వాతావరణం వేడెక్కగా దాన్ని చల్లబరిచేందుకు గేమ్ ఆడించారు. సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్న హారిక త్వరగా ఆరిపోయే చిచ్చుబుడ్డి, అందర్నీ షేక్ చేసే ఆటంబాంబు ఎవరు అని ఆటాడించారు. మెహబూబ్.. అరియానా చిచ్చుబుడ్డి, అభిజిత్ ఆటంబాంబు అని చెప్పాడు ఇక అరియానా.. చాలా ఎఫెక్టివ్‌గా కనిపించాలనుకుంటాడు, కానీ ఏమీ ఉండదని మెహబూబ్‌ను చిచ్చుబుడ్డి, దొంగ మొహపోడు అవినాష్ ఆటంబాంబు అని చెప్పుకొచ్చింది. సోహైల్.. అరియానా చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని అభిప్రాయపడ్డాడు. మోనాల్.. సోహైల్ చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని తెలిపింది. అభి.. సోహైల్ చిచ్చుబుడ్డి, మెహబూబ్ ఆటంబాంబు అని తెలిపాడు. హారిక.. సోహైల్ వేస్ట్‌గాడు, ఎవ్వరూ పట్టించుకోరు అంటూ అతడికి చిచ్చుబుడ్డి ఇచ్చింది. తానే ఆటంబాంబు అని సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంది. సరే కానీ ఎవరికి ఇస్తావు అని నాగ్ కూడా విసుగు చెందుతూ ఆమెలా గెంతుతూ నాగ్ ఇమిటేట్ చేయడంతో కంటెస్టెంట్లు పడీ పడీ నవ్వారు. అవినాష్, నువ్వు పెళ్లికి పనికి రావేమో దీంతో బుంగమూతి పెట్టిన హారిక.. మెహబూబ్‌కు ఆటంబాంబు ఇచ్చింది. లాస్య.. సోహైల్‌కు చిచ్చుబుడ్డి, అభికి ఆటంబాంబు ఇచ్చింది. అవును కానీ లాస్యను ఆంటీ అని ఏడిపించారేంటి అంటూ నాగ్ ఆమెను పదే పదే ఆంటీ అని గుచ్చి గుచ్చి పిలిచారు. తర్వాత అవినాష్.. మోనాల్ చిచ్చుబుడ్డి, అరియానా ఆటంబాంబు అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా ఆమె పడదు అని తేల్చి చెప్పారు. దీంతో అవినాష్ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశాడు. అయినా సరే నాగ్ మాత్రం నువ్వు పెళ్లికి పనికిరావేమో అని అవినాష్ మీద జోకేశారు. (చదవండి: అబ్బాయితో రిలేషన్లో ఉన్నా, కానీ బ్రేకప్ అయింది: హారిక) చంటిపిల్లాడిలా ఏడ్చేసిన అఖిల్ సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో నాగ్ మాట్లాడుతూ.. "నువ్వు ఫైటర్, మరి అంత ఈజీగా ఎందుకు వచ్చేశావు?" అని నాగ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి అఖిల్ సమాధానమిస్తూ.. "ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంటును ఎందుకు పంపిస్తారు. వీక్ కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తారా? నన్ను పంపించరు అని నమ్మకముండే" అని చెప్పుకొచ్చాడు. దీనికి నాగ్ స్పందిస్తూ 'నీ అంచనా తప్పు. చాలా సీజన్లలో ఇలాగే కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్ నుంచే ఇంటికి పంపించేసిన సందర్భాలున్నాయి. నువ్వు బ్యాగు సర్దుకొని బయటకు వచ్చేయ్' అని ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న అఖిల్ తనను పంపించొద్దని ప్రాధేయపడ్డాడు. దయచేసి పంపకండని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా సరే అంగీకరించని నాగ్ కంటెస్టెంట్లతో ఫొటో దిగి వచ్చేయ్ అని చెప్పాడు. (చదవండి: మాస్టర్ మీద కావాలని కాఫీ పోసిన హారిక) అభిజిత్ ఆలోచన దిగజారిపోయింది.. ఈ విషయం తెలిసిన మోనాల్ అఖిల్‌కు బదులు తాను వెళ్లిపోతానంటూ ముందుకొచ్చింది. కానీ అది కుదరదని నాగ్ తేల్చి చెప్పారు. అనంతరం అఖిల్‌తో టాస్క్ ఆడించారు. ఇద్దరు ఫ్రెండ్స్, నలుగురు శత్రువుల పేర్లు చెప్పమన్నారు. దీంతో అఖిల్.. సోహైల్‌కు, మోనాల్‌కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాడు. అభి ఆమెను ఛీ కొట్టినా అతడు టాప్ 5లో ఉంటాడని మోనాల్ పాజిటివ్‌గా మాట్లాడేదని చెప్పాడు. ఇక అభిజిత్, లాస్య, హారిక, మెహబూబ్‌ను శత్రువుల జాబితాలో చేర్చాడు. మొదట అభిజిత్ గురించి మాట్లాడుతూ నీ ఆలోచన దిగజారిపోయింది అని విమర్శించాడు. "పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంత పచ్చగ కనిపిస్తదట. నువ్వు ఫేక్ అయితేనే నీకు వేరేవారు ఫేక్ అనిపిస్తారు" అని చెంపపెట్టుగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఒక్కమాటతో మనసు దోచుకున్న మోనాల్) నా మీద అలాంటి జోకులా, ఇది నీ ఎథిక్స్ "సింపథీ కార్డు ఎప్పుడు పని చేయదు అన్నావు. నువ్వెన్నిసార్లు వాడావు. నేను వెళ్లిపోయేటప్పుడు ఐ హేట్ యూ అని చెప్పావు. అసలు నన్నో ఫ్రెండ్‌గా ఎప్పుడు ఇష్టపడ్డావు" అని హారికను నిలదీశాడు. నేను లేనప్పుడు నా మీద జోక్స్ వేశావు. అది నీ మెచ్యూరిటీ, ఎథిక్స్ అని లాస్యను విమర్శించాడు. ఎప్పుడూ నీకే అన్నీ చేయాలి అంటే ఎవరూ ఏం చేయరు అని మెహబూబ్‌కు బోధించాడు. తర్వాత లాస్య తన జోక్‌కు హర్ట్ అయినందుకు సారీ చెప్పగా హారిక మొదటి సారి ఐ లవ్యూ అని అఖిల్‌తో చెప్పింది. అనంతరం అఖిల్ హౌస్‌లోనే ఉంటున్నాడని నాగ్ స్పష్టం చేయడంతో సోహైల్, మోనాల్ తెగ సంతోషపడ్డారు. తర్వాత అఖిల్‌కు బంపరాఫర్ ఇచ్చారు. రెండు కుండలు పెట్టి అందులో ఒకదాంట్లో నామినేషన్, మరొకదాంట్లో కెప్టెన్సీ ఉంటుందని చెప్పాడు. అఖిల్ చేయి పెట్టిన కుండలోకెప్టెన్ ట్యాగ్ ఉండటంతో తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందాడు. తర్వాత అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివర్లో రెండు కిలోల మటన్ పంపించండని అవినాష్ నాగ్‌ను అభ్యర్థించాడు. దీంతో అతడి విన్నపాన్ని ఆలకించిన నాగ్ తప్పకుండా పంపుతానని హామీ ఇచ్చారు. -
ఇక చాలు ఆపండి, అభిజిత్ విన్నరేంటి?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదోవారం ముగింపుకు వచ్చింది. ఇప్పటికే పది మంది షో నుంచి నిష్క్రమించగా ఇంకా తొమ్మిది మంది కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నారు. వీరిలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది? ఎవరికి అభిమాన గణం మెండుగా ఉంది? అన్న ప్రశ్న వస్తే క్షణం ఆలస్యం చేయకుండా అభిజిత్ అని టక్కున చెప్పేస్తారు. అవును మరి, షో ప్రారంభమైనప్పటి నుంచే అభిజిత్ కోసం ఆర్మీలు పుట్టుకొచ్చాయి. అతడేం చేసినా వెనకేసుకు రావడం, హౌస్‌లో అతడికి ఎవరు యాంటీగా ప్రవర్తిస్తే వారిని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా అభితో వైరం పెట్టుకున్న అఖిల్‌ను ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నాయి తన గేమ్ తనిష్టం, అరియానా విషయంలో మాత్రం ఇదిలా వుంటే బిగ్‌బాస్ ప్రయాణం తుది దశకు చేరుకుంటోంది. అయినా కంటెస్టెంట్లు సిల్లీ రీజన్స్ చెప్తూ ఇతరులను నామినేట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అరియానా ఆట తీరు బాగోలేదని చెప్తూ అభిజిత్ ఆమెను నామినేట్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఎలా ఆడాలో ఆమెకు వివరిస్తూ, కొన్ని గెలవాలి, మరికొన్ని ఓడిపోవాలని ఉపదేశించాడు. అయితే అఖిల్ కూడా గేమ్ గురించే అభిజిత్‌ను నామినేట్ చేశాడు. ఇమ్యూనిటీ టాస్క్‌లో అందరి కన్నా ముందే తనవల్ల కాదని చేతులెత్తేయడం కరెక్ట్ కాదని అఖిల్ చెప్పాడు. కానీ అభి మాత్రం అందుకు ఏకీభవించకపోవడం గమనార్హం. అది తనిష్టమని, అవసరమైతే ఇంటికి పోతా, నీకెందుకు మధ్యలో అని మొహం మీదే చెప్పాడు. (నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా కన్నీళ్లు) గేమ్ ఆడటానికి రాలేదు, ఎక్స్పీరియన్స్ కోసమే తను గేమ్ ఆడటానికి రాలేదని, కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానని కూడా మరోసారి స్పష్టం చేశాడు. అంటే టైటిల్ విన్నర్ అవ్వాలన్న ఆశ, పట్టుదల అభిలో ఏమాత్రం కనిపించడం లేదు. కానీ బయట ఆయన అభిమానులు మాత్రం అభిజితే విన్నర్ అవుతాడని బల్లగుద్ది చెప్తున్నారు. పోనీ అభికి విన్నర్ అవ్వాలని ఆశలు లేకపోయినా అతడి పర్ఫామెన్స్ వల్ల గెలిచే అవకాశాలున్నాయా? అంటే అదీ లేదు. రోబో టాస్క్ మినహా మరేదీ తాను గొప్పగా ఆడింది లేదని స్వయంగా అభిజితే అంగీకరించాడు. ఫిజికల్ టాస్కులోనూ బుర్ర ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడే కానీ బాడీని వాడడు. ఇలా బద్ధకంగా కనిపించే అభి ఎమోషన్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడంలో దిట్ట. తను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఇలాంటి క్వాలిటీసే అతడిని టాప్ 5కి తీసుకెళ్తున్నాయి. కానీ గెలుపు మాత్రం ఆయన చేతిలోనే ఉంది. (అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?) టాప్ 5లో ఉండేదెవరు? షో ముగియడానికి ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఉంది. ఎవరికి టైటిల్ గెలిచే అర్హత ఉందో తెలుసుకునేందుకు బిగ్‌బాస్ రానున్న రోజుల్లో ఇంకా కఠినతరమైన టాస్కులు ప్రవేశపెడతాడు. అప్పటికి కూడా చూస్తాను కానీ చేయనని వెనకడుగు వేస్తే మాత్రం అభిజిత్ రన్నరప్‌గా కూడా నిలవలేడు. అలా కాకుండా అతడికి బుద్ధిబలంతో పాటు కండబలం తోడైతే మాత్రం విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో విన్నర్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు మొదలెట్టేశారు. కనీసం ఎంటర్టైన్ చేయకుండా, టాస్కులు ఆడకుండా ఉండే అభి విన్నర్ కాలేడని కొందరు వాదిస్తున్నారు. అయినా సరే ఓట్లు పడుతున్నాయ కదా అని పర్ఫామెన్స్‌ను పక్కన పెట్టి అతడికి కిరీటం తొడిగితే మాత్రం బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇది పెద్ద తప్పుగా నిలిచిపోతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే టాప్ 5లో అభితో పాటు అఖిల్, అవినాష్, సోహైల్, లాస్య ఉండే అవకాశముంది. -
బిగ్‌బాస్: లాఠీ దెబ్బలు తిన్నాం, కోర్టు మెట్లు ఎక్కాం
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వారి రహస్యాల గుట్టును బయటపెట్టగా లేఖలు అందుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇద్దరికి మాత్రం అఖిల్ లేఖలు పంపలేదు. వాళ్లకు లెటర్స్ ఎందుకు పంపలేదు? కంటెస్టెంట్లు ఏయే సీక్రెట్లను వెల్లడించారో చదివేయండి..బిగ్‌బాస్ లైఫ్ చూపిస్తుంది అని అఖిల్‌కు బోధపడింది. మరోవైపు అఖిల్ గురించి అభిజిత్ అతడి స్నేహితులతో మాట్లాడాడు. మళ్లీ లోపలికి పంపిస్తారన్న నమ్మకంతోనే కదా.. అందరూ అతడి పేరు చెప్పగానే ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ ఈ మాటలను పూర్తిగా వ్యతిరేకించాడు. అయితే ఇదంతా ఏదో స్క్రిప్టెడ్ అని అభికి లోపల బలమైన అనుమానమే ఉంది. ఇక మటన్ చెడిపోవడంతో రేషన్ మేనేజర్ అవినాష్ మీద అందరూ గరమయ్యారు. దీంతో ఒక్క కిలో మటన్ పంపమని అతడు కెమెరాల ముందు వేడుకున్నాడు. అయినా సరే శాంతించని సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్‌ను చితకబాదారు. అతడిని స్విమ్మింగ్ పూల్‌లో నిమజ్జనం చేశారు. లాఠీలతో కొట్టి స్టేషన్లో వేశారు: మెహబూబ్ అనంతరం ఇంటిసభ్యుల కోసం వారి ఆప్తులు లేఖలు పంపించారు. వాటిని హౌస్‌మేట్స్‌కు ఇవ్వాలా? వద్దా? అనేది అఖిల్ నిర్ణయానికి వదిలేశారు. మరోవైపు హౌస్‌లో ఉన్న ఇంటిసభ్యులు ఇప్పటికీ ఎవరితోనూ పంచుకోని అతిపెద్ద రహస్యాన్ని చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అప్పుడే వారికి లేఖలు అందుతాయని స్పష్టం చేశాడు. మొదట కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన మెహబూబ్ మాట్లాడుతూ.. "నా బెస్ట్ ఫ్రెండ్‌ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. ఆమె కోసం టికెట్ తీసుకోడానికి లోపలకు వెళ్లాను. అయితే హడావుడిలో రాంగ్ ప్లేస్‌లో బండి పార్క్ చేశాను. దీంతో అక్కడ పోలీసులు ఆమ్మాయిని అనుమానిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేను వెళ్లేసరికి ఆమె ఏడుస్తుండటంతో పోలీసుల మీదకు తిరగబడ్డాను. అప్పుడు వాళ్లు నా కాలర్ పట్టుకుని లాఠీలతో కొట్టారు. నన్ను, అమ్మాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అమ్మాయిని వెంటనే వదిలేశారు. కానీ నన్ను మాత్రం రెండు రోజుల వరకు పోలీస్ స్టేషన్ నుంచి పంపించలేదు" అని చెప్పుకొచ్చాడు. దీంతో అఖిల్ అతడికి లేఖ పంపించాడు. అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి హారిక మాట్లాడుతూ.. "అమ్మ దగ్గర దాచిన ఏకైక రహస్యం ఇది. ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్తున్నా. హారికను చూసి నేర్చుకోండి. లవ్వుల జోలికే వెళ్లదు అని నన్ను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెప్పేదానివి. సారీ అమ్మా.. నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను. ఇది రెండేళ్ల క్రితం ముచ్చట. ఎక్కువ కేరింగ్ చూపించేసరికి అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది" అని చెప్పుకొచ్చింది. దీంతో హారికకు కూడా లేఖ అందింది. అవమానాలను గెలుపుగా మార్చుకున్నావు తల్లీ అంటూ ఆమె అన్నయ్య రాసిన ఒక్కో వాక్యం చదువుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. (ఇప్పటికిప్పుడు హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు) సినిమా ఛాన్స్ అనగానే రూ.80 వేలు ఇచ్చాను అవినాష్ మాట్లాడుతూ.. "సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే కిరాణ షాపులో, తర్వాత ఓ కంపెనీలో ఆఫీసు బాయ్‌గా పని చేశాను. ఓసారి ఆడిషన్ కోసం మణికొండ వెళ్లాను. రూ.80 వేలు ఇస్తే లీడ్ క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. సినిమా పిచ్చితో నేను మా నాన్నను అడిగితే ఆయన అప్పు చేసి మరీ తెచ్చారు. దాన్ని తీసుకెళ్లి నిర్మాత చేతిలో పెట్టాను. నువ్విక్కడే ఉండు, రెండు రోజుల్లో ఖమ్మం షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పి జంప్ అయ్యారు. మొదటిసారి అలా మోసపోయాను. ఇప్పటికీ ఇది మా తల్లిదండ్రులకు తెలీదు" అని చెప్పాడు. అయితే ఈ విషయం తనతో చెప్పాడని అఖిల్ అతడి లేఖను చించేశాడు. కానీ అవినాష్ మాత్రం చించిన లేఖ ముక్కలను ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేశాడు. (జబర్దస్త్‌లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు) నా భర్త నాకంటే ఓ ఏడాది చిన్న: లాస్య లాస్య మాట్లాడుతూ.. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లయింది. నేను పెళ్లాడిన వ్యక్తి పేదవాడు, నాకన్నా ఒక ఏడాది చిన్న. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఈ షోకు వచ్చాక అమ్మకు షాకుల మీద షాకులిస్తున్నా. వయసు చిన్నదే అయినా మనసు గొప్పది" అని లాస్య కన్నీళ్లతో చెప్పుకొచ్చింది. ఆమెకు లేఖ అందగా దాన్ని చదువుకుంటూ మరోసారి కంటతడి పెట్టుకుంది. అభిజిత్ మాట్లాడుతూ.. "మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లో ఓ రెస్టారెంటుకు వెళ్లాను. ఆర్డర్ ఇచ్చాను. అక్కడున్న ఓ వ్యక్తి నీకోసం నేను డ్రింక్ తీసుకోవచ్చా అని అడిగాడు. ఇదేదో బాగుందని సరే అన్నాను. ఇద్దరం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకున్నాం. నెంబర్ అడిగాడు. అనుమానపడుతూనే ఇచ్చాను. ఆ తర్వాత అతడు మీదమీదకొస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది గే బార్ అని చెప్పాడు. అప్పుడు నేను బయటకు వెళ్లి బోర్డు చదివాను" అని సీక్రెట్‌ను వెల్లడించాడు. అఖికి అందిన లేఖ చదవడం పూర్తవగానే హారిక వెళ్లి అతడికి హగ్గిచ్చింది. అర్ధరాత్రి కారు యాక్సిడెంట్.. అరియానా మాట్లాడుతూ.. "ఈ జూలై 13కు నాతో పాటు నలుగురు చనిపోయి ఒక సంవత్సరం అయ్యేది. మా ఊరుకు వెళ్దాం అని అర్ధరాత్రి కారులో బయలుదేరాం.. ఒక మనిషి బైకు మీద అడ్డు వచ్చాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక కిలోమీటర్ వరకు కారు దూసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్‌ను గుద్దింది. కారు నుజ్జయ్యింది. బయటకు వస్తే వైరులు తగిలి షాక్ కొట్టేది. ఆ ప్రమాదం నుంచి బయట పడకుండే ఈ రోజు నేనిక్కడ ఉండేదాన్నే కాదు" అని ఎమోషనల్ అయింది. ఇది సీక్రెట్ కాదని అఖిల్ ఆమె లెటర్ చించేశాడు. (మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు) కుటుంబం కోసం చదువు త్యాగం చేశా: మోనాల్ మోనాల్ మాట్లాడుతూ.. "పన్నెండో తరగతి పూర్తయ్యాక నాకు బ్యాంక్‌లో జాబ్ వచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదవాలనుకున్నాను. కానీ కాలేజీ టైమింగ్, జాబ్ టైమింగ్ సెట్ కాలేదు. దీంతో ఫైనలియర్ డ్రాప్ అవుట్ అయ్యాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం చదువు త్యాగం చేశాను. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు" అని ఏడ్చేసింది. దీంతో అఖిల్ ఆమెకు లేఖ పంపించాడు. అది చదువుతున్న మోనాల్ కన్నీటిని సోహైల్ తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు. (బిగ్‌బాస్: సోహైల్‌కు గట్టి షాక్ ఇచ్చిన మెహబూబ్) డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 102 రీడింగ్ వచ్చింది: సోహైల్ సోహైల్ మాట్లాడుతూ.. "ఇప్పుడు మందు మానేశాను. కానీ కొన్నేళ్ల క్రితం ఓసారి పబ్బు నుంచి తాగొస్తున్నా. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 102 రీడింగ్ వచ్చింది. కారు తీసుకుపోయారు. తర్వాతి రోజు స్టేషన్‌కు వెళ్లి చలానా కట్టిన. అప్పుడు కోర్టు స్లాట్ తీసుకోమన్నారు. తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. డూప్లికేట్ పేరెంట్స్‌ను మాట్లాడిన. కానీ మా ఫ్రెండ్ అట్లా నడవదని చెప్పిండు. కోర్టుకు వెళ్లాక ప్రతి ఒక్కడూ పదో తరగతి రిజల్ట్ వచ్చినట్టు నీ రీడింగ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ఆఖరికి మా తమ్ముడిని పిలిపించిన. ఇది అమ్మావాళ్లకు తెల్వదు" అని సీక్రెట్ బయటపెట్టాడు. బిగ్‌బాస్‌ను అర్థిస్తున్న అఖిల్ మా తమ్ముడు ఈ రహస్యం నాకు కూడా చెప్పలేదని అఖిల్ అతడికి లేఖను అందించాడు. అందులో మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అఖిల్, మెహబూబ్ నిన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది అని అతని తండ్రి రాసుకొచ్చాడు. లేఖను చదివి సోహైల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. అఖిల్ గుర్తొచ్చి బాధపడ్డాడు. మరోవైపు అఖిల్ తనకు లెటర్ కావాలని బిగ్‌బాస్‌ను ప్రాధేయపడుతున్నాడు. మరి అతనికి లేఖ అందిందా? లేదా? అనేది రేపు తేలనుంది. -
ఈ విషయంలో మాత్రం సక్సెస్ అవుతున్న బిగ్‌బాస్
ఇప్పుడు కానీ బిగ్‌బాస్ కళ్లు చల్లారవు.. ఈ మాట అంటోంది మేము కాదు, నెటిజన్లు.. ఎందుకో ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది.,.. ఈ సీజన్లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆక్రమించింది మోనాల్, అఖిల్, అభిజిత్. బిగ్‌బాస్ ఫస్టాఫ్ అంతా ఆమె కోసం ఈ ఇద్దరూ కొట్టుకోవడంతోనే సరిపోయింది. వాళ్లిద్దరి మధ్య ప్రత్యేకించి గొడవలు లేకపోయినా మోనాల్ వల్ల శత్రువులుగా మారిపోయారు. ఆ తర్వాత అభి.. మోనాల్‌కు దూరమవడం, ఆమె అఖిల్‌కు మరింత దగ్గరవడం జరిగింది. అయితే అనూహ్యంగా అఖిల్ కూడా మోనాల్‌ను పక్కన పెట్టేసి అభిజిత్‌కు దగ్గరయ్యాడు. అతడితో స్నేహ గీతం పాడాడు. దీంతో గొడవలు జరిగేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ అందరికీ షాకిస్తూ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ అఖిల్ అభిజిత్‌ను నామినేట్ చేశాడు. తర్వాత చాక్లెట్ ఇచ్చి కూల్ చేశాడు. అయిపోయింది. ఇక్కడ కూడా ఎలాంటి గొడవా లేదు, గందరగోళం లేదు. ఇది బిగ్‌బాస్‌కు బొత్తిగా నచ్చనట్లుంది. అందుకే మరో ప్లాన్ వేశాడు. అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించి అతడికి అభికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చిచ్చు పెట్టనున్నాడు. అభి అభిప్రాయాలన్నింటినీ అఖిల్ చెవిన వేస్తున్నాడు. అసలే ఎవరి మాటతోనూ ఏకీభవించని అఖిల్ అభి వ్యాఖ్యలకు సీక్రెట్ రూమ్నుంచే కౌంటరిస్తున్నాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో అభి ఈ వారం రద్దైన కెప్టెన్సీ టాస్క్ మీద మరోసారి చర్చ లేవనెత్తాడు. ఒక వారం ఇమ్యూనిటీ కోసం ఇంత కొట్లాడిన వాడు సడన్‌గా పంపించేస్తే ఎందుకు ఊరుకున్నాడని సందేహిస్తున్నాడు. అంటే ఇదంతా ఫేకే కదా! ఎలాగో మళ్లీ హౌస్‌లోకి పంపిస్తారులే అన్న నమ్మకమే కదా! అని వాదించాడు. దీనికి అఖిల్.. నీ అంత కాన్ఫిడెన్స్ మాకు లేదయ్యా అని సీక్రెట్ రూమ్‌లో నుంచి ఉన్నమాట చెప్పాడు. (చదవండి: నేను ఆడటానికి రాలేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం..) ఒకవేళ నిజంగా పంపించలేకపోతే ఎంత భయంగా ఉంటుంది? అని అభి అనగా నీకు కావాల్సింది కూడా అదేగా అని అఖిల్ కౌంటరిచ్చాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మీరిద్దరూ మనసులో ఏదో పెట్టుకుని బయటకు మాత్రం కలిసి ఉంటూ ఫేక్ ఎమోషన్స్ ప్రదర్శించకండని హితవు పలుకుతున్నారు. అభిజిత్.. అఖిల్కోసం పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారని అతని అభిమానులు అభిని సమర్థించుకుంటున్నారు. అఖిల్ స్నేహితుల దగ్గరే అతడి గురించి తప్పులు తీస్తూ మాట్లాడటం ఏంటని అఖిల్ అభిమానులు మండిపడుతున్నారు. ఏదేమైనా కలిశారు అనుకున్న అఖిల్, అభిజిత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని బిగ్‌బాస్ కావాలని క్రియేట్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌తో అభి, అఖిల్ మధ్య పుల్లలు పెట్టే మిషన్‌ను బిగ్‌బాస్ విజయవంతంగా పూర్తి చేయనున్నాడని చెప్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ రూటులో అఖిల్?) -
బిగ్‌బాస్: 'కరివేపాకు'కు అభిజిత్ ఫ్యాన్స్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు చేసే రచ్చ కన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ మరీ దారుణంగా ఉంటుంది. అభిమాన కంటెస్టెంటును వెనకేసుకు రావడం కన్నా, ఇతరుల మీద పడి ట్రోలింగ్ చేయడమే వీళ్లు ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. రెండో సీజన్లో కౌశల్ ఆర్మీ నెట్టింట ఎంత హడావుడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీజన్లో మాత్రం అందరికన్నా ఎక్కువగా అభిజిత్ పేరుతో ఏర్పాటైన ఆర్మీలు ఏకంగా సోషల్ మీడియాను ఆక్రమించుకున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే అభి తప్పు చేసినా, ఒప్పు చేసినా, పని చేసినా, చేయకపోయినా.. ఇలా ప్రతిదాన్ని గుడ్డిగా వెనకేసుకొస్తున్నాయి. హౌస్‌లో అభి మీద ఈగ వాలినా బయట వీళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండటం లేదు. అఖిల్‌కు ఆక్సిజన్‌లా మారిన సీక్రెట్ రూమ్ ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ సీజన్లో ప్రస్తుతం పదోవారం కొనసాగుతోంది. ఇంకా ఐదువారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఒకరైన అఖిల్ ఫేక్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే నిజంగానే తన ప్రయాణం ముగిసిందేమోనని ఒక్క క్షణం గుండె ఆగిన అఖిల్‌కు బిగ్‌బాస్.. సీక్రెట్ రూమ్ అనే ఆక్సిజన్ అందించాడు. దీంతో హమ్మయ్యా.. నా బెర్త్ ఎక్కడికి పోలేదని గుండెలమీద చెయ్యేసుకున్నాడు. అయితే ఈ రహస్య గదిలో కేవలం ఇంటిసభ్యులు ఏం మాట్లాడుకుంటారో ఆ క్లిప్పింగులు చూస్తూ గడిపేయడమేననుకున్నాడు. కానీ సోహైల్ మాటలో చెప్పాలంటే కథ వేరే ఉంది. (చదవండి: బిగ్‌బాస్: హోస్ట్, గెస్ట్‌గా తండ్రీకొడుకులు) అభికి లెటర్ వచ్చిందా? లేదా? కంటెస్టెంట్లకు వచ్చిన లెటర్లను పంపించి వారిని సంతోషర్చడం లేదా, వాటిని తునాతునకలు చేసి బాధపర్చడం అంతా అఖిల్ చేతిలోనే ఉందని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో తన స్నేహితులకు లెటర్స్ పంపి వారి ముఖంలో నవ్వులు చూసి అఖిల్ సంతోషపడుతున్నట్లు ప్రోమోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే అభిజిత్ కోసం వచ్చిన లెటర్‌ను హౌస్‌లోకి చేరవేశాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అభిజిత్ మాత్రం తన ఎదుట కాగితపు ముక్కలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని బట్టి అభికి లెటర్ రాలేదని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. దీంతో అఖిల్‌ను కరివేపాకుతో పోల్చుతూ అతడి మీద మండిపడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కు ఏమైంది?) నిజమేంటో తెలీకుండానే ట్రోలింగ్ ఒకవేళ అభి చేతికి లెటర్ అందకపోతే అఖిల్‌ను ఆ దేవుడు కూడా కాపాడలేరని వార్నింగ్ ఇస్తున్నారు. 'ఇప్పటికే నామినేట్ చేసి తప్పు చేశావు, ఇప్పుడు లెటర్ ఇవ్వకుండా మరో తప్పు చేస్తావా? అయినా మీరు ఎన్ని వేషాలు అభి ఇంకా స్ట్రాంగ్ అవుతాడు" అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరికీ లేఖలు పంపిచడానికి వీల్లేదని బిగ్‌బాస్ షరతు పెట్టి ఉండొచ్చేమోనని అఖిల్ అభిమానులు అతడిని వెనకేసుకొస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రోమోను చూసి తప్పులో కాలేయకండని, అభికి కూడా లెటర్ వస్తుందని ఆశించండి అని సానుకూలంగా ఆలోచించమని హితవు పలుకుతున్నారు. ఎపిసోడ్ చూడకుండా ఒకర్ని ట్రోల్ చేయడమేంటని తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా అతడికి లెటర్ అందలేదేమోనన్న ఆలోచనకే సోషల్ మీడియా షేక్ అయిపోతుంటే ఇక ఎపిసోడ్లో అదే నిజమైతే, అఖిల్‌ను ఏ రేంజ్లో ఆడుకుంటారో! అఖిల్ కూడా తన చర్యను ఎలా సమర్థంచుకుంటాడో చూడాలి! -
నేను గేమ్ ఆడటానికి రాలేదు: అభిజిత్
ఇంట్లో ఒక్కరూ నాకు సపోర్ట్ చేయలేదు అని అఖిల్ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. మొదటిసారి అభి మినహా అందరూ ఏకాభిప్రాయంతో అఖిల్ పేరు చెప్పారు.. కానీ అతడిని హౌస్ నుంచి బయటకు పంపించడానికి. అయితే ఓ రకంగా ఇది అతనికి మంచే చేసింది. ఎవరేంటని తెలుసుకునేందుకు మంచి అవకాశం లభించింది. అయితే అఖిల్ ఎలిమినేట్ కావడంలో మోనాల్, సోహైల్ కీలక పాత్ర వహించడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. గేమ్ కోసం ఫ్రెండ్ పేరు చెప్పిన సోహైల్, మోనాల్ అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్‌బాస్ అందరినీ బ్యాగు సర్దుకోమని ఆదేశించాడు. అనంతరం ఫినాలే వరకు సాగే మీ ప్రయాణంలో ఎవరు మీకు అడ్డుపడతారని భావిస్తారో ఆ వ్యక్తి పేరును ఏకాభిప్రాయంతో తెలియజేయాలని, అతడు తక్షణమే హౌస్‌ను వీడి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కంటెస్టెంట్లు తలలు పట్టుకున్నారు. అభిజిత్ మాత్రం తనకు అడ్డు పడేంత స్ట్రాంగ్ ఎవరూ అనిపించట్లేదు అంటూనే ఇక్కడికి కచ్చితంగా గెలవడానికి రాలేదు, ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వచ్చానని తనలో తనే మాట్లాడుకున్నాడు. అనంతరం సోహైల్, మోనాల్, అరియానా.. అఖిల్; మెహబూబ్, అవినాష్.. అరియానా; అఖిల్, లాస్య, అభిజిత్ వాళ్ల పేరును వాళ్లే చెప్పుకున్నారు. అందరూ ఏ పేరు చెప్తే దానితో తాను ఏకీభవిస్తానని హారిక తెలిపింది. (చదవండి: నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి: అఖిల్) ఎలిమినేషన్‌తో మూగబోయిన అఖిల్ అఖిల్‌కు ఎక్కువ మెజారిటీ ఓట్లు పడటంతో అతడు హౌస్ నుంచి నిష్క్రమించాడు. ఇది ఊహించని అతడు కన్నీళ్లు ఆపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మొదటి సారి ఏకాభిప్రాయంతో నన్ను సెలక్ట్ చేసుకున్నారు అంటూ తన బాధను చెప్పుకునేందుకు మాటలు వెతుక్కున్నాడు. సోహైల్, మోనాల్ కన్నీళ్ల పర్యంతం అవగా అభిజిత్ మాత్రం కనీసం దగ్గరకు కూడా వెళ్లలేదు. అఖిల్ లాగే సోహైల్, మోనాల్ గేమ్ ఈజ్ గేమ్ అని ఆలోచించారు. కానీ స్ట్రాంగ్ అని చెప్తూనే తన ఫ్రెండును బయటకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని లాస్య, అభి, హారిక.. మోనాల్ తీరు మీద చర్చలు పెట్టారు. తామైతే అలా చేయలేమని అభిప్రాయపడ్డారు. (చదవండి: మోనాల్‌తో తెగతెంపులు చేసుకున్న అభిజిత్!) అబద్ధం చెప్పిన అభి, దండం పెట్టిన అఖిల్ మరోవైపు అఖిల్ ఫేక్ ఎలిమినేషన్‌తో నేరుగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. ఈ అవకాశం లభించినందుకు ఆనందించిన అఖిల్ ఇప్పుడు తనకు క్లారిటీ దొరుకుతుందని భావించాడు. కానీ అక్కడ హౌస్‌లో మాత్రం మోనాల్, సోహైల్ చంటిపిల్లల్లా ఏడ్చారు. ఇక తర్వాతి రోజు నుంచి ఇంట్లో ఏం జరుగుతుందనేది అఖిల్ టీవీలో చూశాడు. ఈ సందర్భంగా మోనాల్ అతడిని తలుచుకుని కన్నీళ్లు కార్చడం చూసి ఫీలయ్యాడు. ఇక కెప్టెన్సీ టాస్కులో సోహైల్ బయటకు వచ్చేయడం ఏంటని అభి హారికతో అన్నాడు. వాళ్లు గొడవపడి పది రోజులు మాట్లాడుకోలేదు అనడంతో ఇది పెద్ద అబద్ధమంటూ అఖిల్ లోపల నుంచే దండం పెట్టాడు. ఇక అభి కూడా ఇది కనక నువ్వు చూస్తుంటే వచ్చాక దీని గురించి మాట్లాడతాను అని అఖిల్‌ను ఉద్దేశించి చెప్పాడు. అఖిల్ వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్‌గా అయిపోయిందని మోనాల్ వెలితిగా ఫీలవుతుంటే తనకు మాత్రం ఎప్పటిలాగే ఉందని అభి కౌంటరిచ్చాడు. -
బిగ్‌బాస్: నేడే ఎలిమినేట్ కానున్న అతడు!
పదో వారానికిగానూ హౌస్‌కు కెప్టెన్ అవ్వండి అని బిగ్‌బాస్ బంతి టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్, మెహబూబ్ ఫైనల్ వరకు వెళ్లారు. కానీ ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. నేనే కెప్టెన్ అవుతానంటే నేను అని కీచులాడుకున్నారు. బిగ్‌బాస్ బజర్ మోగించినా ఇంకా ఓ అండర్‌స్టాండింగ్‌కు రాకుండా వాదులాడుకుంటూనే ఉన్నారు. ఎవరి ముఖం ఉన్న బంతి వారు పట్టుకునేందుకు వీల్లేదని చెప్పినా సరే అదే పని చేసి మూర్ఖంగా ప్రవర్తించారు. ఫలితంగా బాస్‌కు కోపమొచ్చింది. టాస్క్ రద్దయింది, కెప్టెన్సీ ఎవరికీ అందకుండా పోయింది. అప్పటి వరకు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. దీనికి కారణమైన అఖిల్, మెహబూబ్‌కు బిగ్‌బాస్ బాగానే చీవాట్లు పెట్టాడు. తన ఆదేశాలను బేఖాతరు చేశారని మండిపడ్డారు. ఇదే ఆవేశంలో బిగ్‌బాస్.. ఇంటిసభ్యులకు అర్ధరాత్రి పరీక్ష పెడుతున్నాడు. హాయిగా నిద్రపోతున్న ఇంటిసభ్యులను లేపి ముల్లెమూట సర్దుకోమన్నాడు. అనంతరం గార్డెన్ ఏరియాకు రమ్మని పిలిచాడు. ప్రతిసారి మిమ్మల్ని బయటకు పంపే నిర్ణయం ప్రేక్షకుల చేతిల్లో ఉంటుందని, కానీ ఈసారి మీ చేతులోనే ఉందని హౌస్‌మేట్స్‌కు చెప్పాడు. (అఖిల్ నన్ను కాదని నిన్నే సేవ్ చేస్తాడు: మోనాల్) మీరు ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుపడే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనే ప్రశ్నను సంధించినట్లు కనిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పేందుకు ఇంటిసభ్యులు తర్జనభర్జన పడ్డారు. మొత్తానికి ప్రోమోలో మాత్రం అవినాష్.. అరియానా స్ట్రాంగ్ అని, సోహైల్.. మెహబూబ్, అరియానా.. అఖిల్ పేర్లు చెప్పారు. అఖిల్ వంతు వచ్చేసరికి తనకు అడ్డు పడేవారు ఎవరూ లేరని, తన గేమ్ తాను ఆడగలుగుతానని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అభిజిత్ మాత్రం.. బిగ్‌బాస్ ఒక పేరు చెప్పమన్నారు అని ముందే ఓ క్లారిటీ ఇస్తూ తన పేరునే చెప్పుకున్నాడు. దీన్ని కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం ఒక్క మాటతో అందరికీ పంచ్ వేశాడు. ఇక అందరూ వారివారి అభిప్రాయాలు చెప్పాక అఖిల్‌ను ఎలిమినేట్ అయినట్లు నమ్మించి సీక్రెట్ రూమ్‌లోకి పంపే అవకాశముందంటున్నారు. అదే కనక జరిగితే చాలామంది లోలోపల సంతోషపడతారు. కానీ మోనాల్ మాత్రం తనలోని నర్మదకు పని చెప్తుంది. మరి నిజంగా అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపుతారా? ఏదైనా ట్విస్టు ఉండబోతుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్
కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదని నిరూపించుకున్నారు అఖిల్, మెహబూబ్. కెప్టెన్సీ నాకు తప్ప నా ఫ్రెండుకు కూడా దక్కకూడదన్న మూర్ఖత్వంతో ప్రవర్తించి టాస్కు రద్దయ్యేందుకు కారణమయ్యారు. ఫలితంగా హౌస్‌లో ఉండేందుకు అవసరమైన ప్రాణవాయువులాంటి ఇమ్యూనిటీ ఎవరికీ అందకుండా పోయింది. వీళ్ల గొడవను చూసి అగ్లీ అన్న అభిజిత్.. హారికతో అంతకన్నా అగ్లీ గొడవకు దిగాడు. తనను పక్కనపెట్టి అఖిల్‌కే హగ్గులిస్తుందని నొచ్చుకున్నాడు. వెళ్లి వాళ్లకే నీ హగ్గులు ఇచ్చుకో అని పదే పదే అంటూ జనాలకు విసుగు తెప్పించాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. గేమ్‌లో ఒంటరైన మోనాల్ బిగ్‌బాస్ ఈ వారం బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి బంతిని వాళ్లే కాకుండా మిగతావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఆలస్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖరి రౌండ్లో గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లే గెలిచినట్లు. ఈ గేమ్‌లో అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అతడు, హారిక కలిసి తనకు గిట్టని వ్యక్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాలని ఆలస్యంగా వేశారు. మోనాల్ బంతిని ఎవరూ తీసుకోలేదు. ఈ గేమ్‌లో చివరికి మెహబూబ్, అఖిల్ ఇద్దరే మిగిలారు. (అభిజిత్‌కు హౌస్‌లో ఉండే అర్హత లేదు: అమ్మ రాజశేఖర్ ) తొక్కలో రిలేషన్స్, అంతా నటిస్తారు: అఖిల్ ఈసారి నాకు సపోర్ట్ కావాలంటే నాకు సపోర్ట్ కావాలని ఇద్దరూ వాదులాడుకున్నారు. బజర్ మోగిన విషయం మర్చిపోయి బాల్ వేయకుండా కీచులాడుతూనే ఉన్నారు. చివరికి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎవరి బంతి వారు గోల్ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్ ఇద్దరి బాధ్యతారాహిత్యం కారణంగా టాస్క్ మొత్తాన్ని రద్దు చేస్తునట్లు వెల్లడించారు. ఈ వారానికి హౌస్‌లో కెప్టెనే ఉండరని ప్రకటించాడు. దీంతో స్నేహితుల కోసం గేమ్ నుంచి తప్పుకున్న సోహైల్ చిందులు తొక్కాడు. అనవసరంగా ఇమ్యూనిటీ రాకుండా చేసుకున్నారని బాధపడ్డాడు. ఇంట్లో నాకు ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఈ ఒక్కసారి చేయుమన్నా.. అని అఖిల్ ఫ్రస్టేట్ అయ్యాడు. అందుకే ఈ తొక్కలో రిలేషన్స్ వద్దంటా, అంతా నటిస్తారు అని అలిగాడు. పనిలో పనిగా మోనాల్ మీద విసుగు ప్రదర్శించాడు. ప్రతిసారి నీ కోసం ఆడతా అని ఎందుకనుకుంటున్నావు అని మోనాల్ ముఖం పట్టుకుని అడగ్గా నాకోసం ఆడమని నీకు చెప్పలేదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు తన నెత్తి మీద దరిద్రం డ్యాన్స్ చేస్తోందని మెహబూబ్ కన్నీళ్లు పెట్టుకోగా మోనాల్, సోహైల్ ఓదార్చారు. నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి పడిపోతావు.. కెప్టెన్సీ చేజారిన బాధలో నుంచి బయటకు రాని అఖిల్.. మెహబూబ్, సోహైల్‌తో మాట్లాడుతూ మీరిద్దరే ఫ్రెండ్స్, నేనే అప్పుడప్పుడు మధ్యలోకి వస్తా. ఈ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ బక్వాస్. అందుకే దివాళీ గిఫ్ట్‌కు మీ ఇద్దరితో పాటు మోనాల్ పేరు కూడా రాయలేదు అని అసలు విషయం చెప్పాడు. వీళ్ల పంచాయితీ మీద అభిజిత్ సెటైర్లు వేశాడు. ఎందుకింత అగ్లీగా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు కదా అని తన టీమ్‌తో చర్చించాడు. కానీ మరుక్షణమే అతడు అగ్లీ టాపిక్కు తెర తీశాడు. పోయి(అఖిల్‌కు) హగ్గులిచ్చుకో పో అని హారిక మీద కోప్పడ్డాడు. నాకు హగ్గిచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలగడంతో ఈరోజు పొద్దున్నే కదా ఇచ్చానని హారిక జవాబిచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు అని హెచ్చరించింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని కవర్ చేసేందుకు హగ్గిచ్చావే కానీ సొంతంగా హగ్గిచ్చావా అని నిలదీశాడు. అలా కాసేపటి వరకు ఈ హగ్గుల గురించి హద్దులు దాటి మాట్లాడుకున్నారు. (మనసు గెలిచేసిన మోనాల్) సూట్‌కేసులు సర్దుకున్న కంటెస్టెంట్లు మరోవైపు అలక బూనిన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సోహైల్ నలిగిపోయాడు. రేపు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను, అఖిల్ ఉంటే.. నువ్వు కచ్చితంగా అఖిల్‌నే సేఫ్ చేస్తావు అని మోనాల్‌తో అన్నాడు. దానికి ఆమె స్పందిస్తూ కానీ నేను, నువ్వు ఉంటే మాత్రం అఖిల్ నిన్నే సేఫ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చింది. ఎటొచ్చీ ఈరోజు మోనాల్ మళ్లీ ఒంటరిగా మారగా అప్పటివరకూ గొడవపడ్డ సోహైల్, అఖిల్, మెహబూబ్ మళ్లీ ఒక్కటైపోయారు. ఇక అరియానా దగ్గర మోనాల్ సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పిన అవినాష్.. తర్వాత మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ క్రీమ్ బిస్కెట్లు వేశాడు. అనంతరం అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్‌బాస్ వారి సూట్‌కేసులను సర్దుకోమన్నాడు. ఫినాలేకు వెళ్లడానికి ఎవరు అడ్డుపడుతారనుకుంటున్నారో వారి పేర్లను చెప్పమన్నాడు. ఎవరు ఎవరి పేర్లను చెప్పనున్నారో రేపటి ఎపిసోడ్లో తేలనుంది. (అభికి జీరో టాలెంట్, అఖిల్‌కు అహంకారం)