బిగ్‌బాస్‌: ఫ‌స్ట్ కెప్టెన్‌గా క‌ట్ట‌ప్ప‌! | Bigg Boss 4 Telugu: Lasya As First Captain In House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్: సేఫ్ జోన్‌లోకి అభిజిత్‌, సుజాత

Published Sat, Sep 12 2020 11:23 PM | Last Updated on Sun, Sep 13 2020 6:05 PM

Bigg Boss 4 Telugu: Lasya As First Captain In House - Sakshi

నాలుగు రోజులుగా నాన్చుతూ వ‌చ్చిన క‌ట్ట‌ప్ప ఎపిసోడ్‌ ఉత్తిదేన‌ని తేలింది. హౌస్‌లో అలాంటి పాత్రే లేద‌ని, కానీ మీలో ఉన్న అనుమాన‌మే క‌ట్ట‌ప్ప అని, దాన్ని ప‌క్క‌న ప‌డేయండ‌ని నాగార్జున‌ సూచించారు. వారం రోజులు కావ‌స్తున్నా ఇంటి స‌భ్యులు ఒక‌రికొక‌రు స‌రిగ్గా క‌నెక్ట్ అయిన‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని చెప్పాడు. హౌస్‌మేట్స్ చేసిన త‌ప్పొప్పుల‌ను స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్న‌డూ లేనంత‌గా రికార్డు స్థాయిలో ఈ వారం 5 కోట్ల ఓట్లు వ‌చ్చాయన్నారు. ఎలిమినేష‌న్ జోన్‌లో ఉన్న ఇద్ద‌రిని ఆ గండం నుంచి బ‌య‌ట‌ప‌డేశారు. ఆ ఇద్ద‌రు ఎవ‌రు? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం..

ఎన్నో వారాలు ఉండ‌లేను: గ‌ంగ‌వ్వ‌
బిగ్‌బాస్‌లో క‌ట్ట‌ప్ప ఎవ‌రో తేల్చేద్దాం అంటూ బాహుబ‌లి పాట‌తో ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున‌. అనంత‌రం శుక్ర‌వారం నాడు హౌస్‌లో ఏం జ‌రిగిందో చూపించారు. ఆ రోజు వర్షం ప‌డుతుండ‌టంతో "ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చానా వాన" సాంగ్ వేశారు. ఇంకేముందీ.. ఇంటి స‌భ్యులు వ‌ర్షంలోనే త‌డుచుకుంటూ మ‌రీ చిందేశారు.  ఆ త‌ర్వాత మాస్ట‌ర్ క‌ట్ట‌ప్ప మీద పాట పాడాడు. క‌ల్యాణి కూడా బాగా పాడుతుందంటూ పొగ‌డ‌టంతో గొంతు స‌వ‌రించుకుని పాటందుకుంది. అంతే.. చ‌టుక్కున‌ అక్క‌డున్న అబ్బాయిలంతా వెన‌క్కి తిరిగి చూడ‌కుండా వెళ్లిపోయి ఆమెను బ‌కరా చేశారు. ఐదేళ్లున్న‌ప్పుడు పెళ్లి చేశారు. మ‌రోవైపు గంగ‌వ్వ‌ "నా భ‌ర్త తాగుడు, కొట్టుడు, చెప్పిన‌మాట విన‌కుండా అయిపోయిండు" అని త‌న బాధ‌ల‌ను ఇంటి స‌భ్యుల‌తో  వెళ్ల‌బోసుకుంది. ఎన్నో వారాలు ఇంట్లో ఉండ‌లేన‌ని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: 'అత‌ను‌ ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకుంటే మంచిది)

అప్పుడు పెళ్ల‌న్నాడు, ఇప్పుడు మాట కూడా లేదు
వీకెండ్ ఎపిసోడ్ కావ‌డంతో హౌస్‌మేట్స్ అంద‌రూ అందంగా ముస్తాబ‌య్యారు. వారం రోజుల‌కు నాగార్జున క‌నిపించ‌డంతో ఇంటిస‌భ్యులు ఆనందానికి లోన‌య్యారు. గంగ‌వ్వ నాగార్జున‌ను న‌డిప‌న్న(రెండో అన్న‌) అని పిలుచుకుంటూ పాట పాడింది. నోయ‌ల్ నువ్వు ఓవ‌ర్ థింక్ చేస్తావ్ క‌దా అని నాగ్ అన్నారు. అన్నింటిని అలాగేపెంట చేశావ్ అని చెప్పారు. నువ్వు టాలెంటే కానీ, ఓవ‌ర్ థింకింగ్ త‌గ్గించుకో అని సూచించారు. అరియానాకు ఇంకోసారి తినిపించ‌య‌ని అఖిల్‌ను ఆదేశించారు. ఆ త‌ర్వాత నాగ్‌, ఇంటిస‌భ్యుల కోరిక మేర‌కు సోహైల్ అరియానాను వీపుపై మోస్తూ పుష‌ప్స్ చేశాడు. నువ్వెప్పుడైనా ఇలా ట్రై చేశావా అని నాగ్ అడ‌గ్గా ఇలాంటి అమ్మాయి ఇంకా దొర‌క‌లేద‌ని అఖిల్ స‌మాధాన‌మిచ్చాడు. న‌ర్మ‌ద న‌దిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. దానికి డ్యామ్ క‌ట్టేశార‌ని, నువ్వు కూడా అలాంటిది వేసుకోవాల‌ని నాగ్ మోనాల్‌ను కోరారు. లాస్యకు గోడ మీద పిల్లిలా ఉన్నావ్‌, జోష్ త‌గ్గిపోయింద‌ని చెప్పారు. షో ప్రారంభం రోజు అభిజిత్ ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటావు అంటే మోనాల్‌ను చేసుకుంటాన‌న్న విష‌యం తెలిసిందే. కానీ ఇప్పుడు త‌ను నేరుగా వ‌చ్చి మాట్లాడిచ్చినా స్పందించ‌ట్లేద‌ని మోనాల్ వాపోయింది. మ‌రోవైపు సైలెంట్‌గా ఉంటూ.. అంద‌రి గురించి బాగా చెప్పావ్ అని దివిని పొగిడారు.

సూర్య‌కిర‌ణ్‌కు మొట్టికాయ‌లు వేసిన నాగ్‌
క‌ట్ట‌ప్ప గురించి తెలుసుకోడానికి వెయిటింగ్ అంటూ హౌస్‌మేట్స్ అద్భుత‌మైన ర్యాప్ సాంగ్ పాడారు. నా చెవులు గిల్లుమంటున్నాయి ఆపండి అని గంగ‌వ్వ వారించ‌డంతో అంద‌రూ నోళ్లు మూసుకున్నారు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రుగుతున్న‌దాని గురించి బ్రేకింగ్ అండ్ హెడ్‌లైన్స్ చెప్ప‌మ‌ని నాగ్ దేవి నాగ‌వ‌ల్లిని కోరారు. అందుకు ఆమె వ్యాసం చెప్ప‌డంతో 'ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. దేవి వార్త‌లు చెప్ప‌డం మ‌ర్చిపోయింద‌'ని కింగ్ న‌వ్వుతూ చెప్పుకొచ్చారు. అన‌వ‌స‌ర‌మైన దానిలో దూరి లెక్చ‌ర్లు ఇవ్వ‌‌కండని సూర్య‌కిర‌ణ్‌కు మొట్టికాయ‌లు వేశారు. అక్క‌డిది ఇక్క‌డ‌.. ఇక్క‌డిది అక్క‌డ చెప్ప‌డమేంట‌ని క‌రాటే క‌ల్యాణిపై అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. వేరేవాళ్ల‌ని మాట్లాడ‌నివ్వండ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. (చ‌ద‌వండి: దివి ధ్యాస‌లో వంట‌ పెంట‌ చేసిన మాస్ట‌ర్‌)

గంగ‌వ్వ తోపు, లాస్య బ‌క‌రా
ఆ త‌ర్వాత సోహైల్‌, అరియానాతో ఓ ఆటాడించారు. ర‌క‌ర‌కాల బొమ్మ‌లు ఉన్న మెడ‌ల్స్‌ను కంటెస్టెంట్ల మెడ‌లో వేయాల‌న్నారు. అలా సుజాత ఊస‌ర‌వెల్లి, దివి కాక‌ర‌కాయ‌, క‌ల్యాణి చిచ్చు పెట్ట‌డం, హారిక‌ డ్రామా క్వీన్‌, సూర్య కిర‌ణ్ బ‌ద్ధ‌కం, అభిజిత్ చెత్త‌కుండీ, నోయ‌ల్‌ లౌడ్ స్పీక‌ర్‌, గంగ‌వ్వ తోపు, దేవి ప‌ర్ఫెక్ట్‌, మోనాల్ ఏడ్చే బేబీ, లాస్య బ‌క‌రా, మెహ‌బూబ్ మిర్చి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను ‌జోక‌ర్‌గా చెప్పుకొచ్చారు. అనంత‌రం నాగ్‌ ఎలిమినేష‌న్ జోన్లో ఉన్న ఏడుగురిలో మొద‌ట‌ అభిజిత్‌ను, త‌ర్వాత‌ సుజాత, గంగ‌వ్వ‌ను సేవ్ చేశారు. ఇక‌ మెజారిటీ ఇంటి స‌భ్యులు లాస్య‌ను క‌ట్ట‌ప్ప అనుకున్నారు, కానీ అలాంటి క్యారెక్ట‌రే లేదని నాగ్ వెల్ల‌డించారు. లాస్య‌ను ఫ‌స్ట్‌ కెప్టెన్‌గా ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: అమ్మ రాజ‌శేఖ‌ర్ కుళ్లు జోకులు మానేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement