Anchor Sujatha
-
జోర్దార్గా రాకింగ్ రాకేశ్, సుజాతల హల్దీ.. ఫోటోలు వైరల్
జబర్దస్త్ కమెడియన్లు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం జరుపుకోగా తాజాగా పెళ్లిపీటలెక్కారు. బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమ హల్దీ వేడుకల ఫోటోలను నూతన వధూవరులిద్దరూ అభిమానులతో పంచుకున్నారు. 'మీ అందరి ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం. ఈ ఆనందం చెప్పలేనిది, రాయలేనిది' అంటూ ఫోటోలు షేర్ చేశారు. తమకు శుభాకాంక్షలు చెప్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వీరి హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ హల్దీ థీమ్‌లో రాకేశ్, సుజాత ఇద్దరూ పసుపు రంగు బట్టలు ధరించగా వెరైటీ పోజులతో ఫోటోలు క్లిక్‌మనిపించారు. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) చదవండి: కష్టాలతో సావాసం.. ఫైమా సొంతింటి కల సాకారం -
మంత్రి రోజా ఇంట్లో వంటమనిషిగా మారిన రాకింగ్ రాకేశ్!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ జోర్దార్ సుజాత.. కమెడియన్ రాకింగ్ రాకేశ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే! ఇటీవలే వీరు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కూడా చేశారు. ఆ వీడియోను సుజాత తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇకపోతే నిశ్చితార్థానికి బంధుమిత్రులను పిలిచేందుకు రెడీ అయిందీ జంట. తాజాగా ప్రముఖ నటి, మంత్రి రోజాకు తమ పెళ్లి వార్త చెబుదామని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే రోజా ఏదో మీటింగ్‌లో ఉండటంతో రాకేశ్ ఆలస్యం చేయకుండా వంటిట్లో దూరాడు. తనే స్వయంగా ఆలూ ఫ్రై వండాడు. రోజా ఇంటికి రాగానే ఆమెకు స్వయంగా వడ్డించాడు. విందు అనంతరం రోజా కాబోయే పెళ్లికూతురు సుజాతకు పట్టుచీర పెట్టారు. ఆ తర్వాత ఆ జంటను తన కారులో తిరుపతి కొండకు తీసుకెళ్లారు. 'మేడమ్ మమ్మల్ని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం దగ్గరుండి తిరుపతి కొండకు తీసుకెళ్లడం ఎన్నో జన్మల అదృష్టం' అంటూ మురిసిపోయాడు రాకేశ్. ఇక ఈ వీడియోను చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. చదవండి: నోరు అదుపులో పెట్టుకోకుంటే బాలయ్యకు గుణపాఠం చెప్తాం -
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటీ కాబోతున్నారు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను వీడియోలో షేర్ చేసుకుంది. ఈనెల చివర్లోనే తమ నిశ్చితార్థం ఉండనుందని, త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. -
దుబాయ్‌లో గ్రాండ్ గా ‘జోర్దార్’ సుజాత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జోర్దార్గా రాకింగ్ రాకేశ్ ప్రియురాలి బర్త్‌డే సెలబ్రేషన్స్
తెలంగాణ యాసలో జోర్దార్గా మాట్లాడే సుజాత గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో! మొదట్లో సుజాత ఆన్లైన్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేసింది. తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ వస్తుందంటే తన అదృష్టం పరీక్షించుకుందామని దానికి ట్రై చేసింది. ఆమె యాస నచ్చడంతో షో నిర్వాహకులు ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ హిట్ కావడం.. గలగలా మాట్లాడే సుజాతను ప్రేక్షకులు జోర్దార్ సుజాతగా అక్కున చేర్చుకోవడం చకాచకా జరిగిపోయాయి. యాంకర్‌గా తనేంటో నిరూపించుకున్న సుజాత తర్వాత బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. అనంతరం ఓ కామెడీ షోలోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాకింగ్ రాకేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అవును, ప్రేమలో పడ్డామని అంగీకరించారు. ఇక రాకేశ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడ సుజాత ఉండాల్సిందే! అంతలా కలిసిపోయారిద్దరూ.. ఇటీవల వీరిద్దరూ విదేశీ విహారయాత్రకు వెళ్లారు. దుబాయ్‌లో సుజాత బర్త్‌డే(డిసెంబర్ 29) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారీ లవ్ బర్డ్స్. ఇందులో ఒకరికొకరు ప్రేమగా కేక్ తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) చదవండి: బాలీవుడ్ నటుడు సతీష్ షాకు జాతి వివక్ష హీరో కాకపోయుంటే ఆ పని చేసేవాడిని : ప్రభాస్ -
జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లి పరీక్ష పెట్టిన రాకింగ్ రాకేశ్!
నాన్‌స్టాప్ మాటలతో అందరినీ ఆకట్టుకునే యాంకర్ జోర్దార్ సుజాత ఆమధ్య బిగ్‌బాస్ షోలో సందడి చేసింది. నాలుగో సీజన్లో పాల్గొన్న ఆమె కింగ్ నాగార్జుననే బిట్టు అని పిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర షోలలో ఎక్కువగా కనిపిస్తోంది. కమెడియన్ రాకింగ్ రాకేశ్‌తో లవ్‌లో పడ్డ సుజాత పెళ్లికి ముందే అతడి ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా చేసిన విషయం తెలిసిందే! తమ ప్రేమను బాహాటంగానే బయటపెట్టిన ఈ లవ్ బర్డ్స్ తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేటప్పుడు ఆ భగవంతుడు నాకెన్నో పరీక్షలు పెట్టాడు. కానీ నువ్వు స్మశానానికి తీసుకెళ్లి నాకు పరీక్ష పెట్టావు అంటూ ఎమోషనలైంది. నాకు కోట్లాది రూపాయలు కావాలి, కార్లల్లో తిప్పాలి అని నేను అడగను, కానీ నా కన్నీళ్లను తుడవడానికి జీవితాంతం నా పక్కనుంటే చాలు అంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో రాకేశ్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఇది చూసిన జనాలు ఇంతకీ రాకేశ్ స్మశానానికి తీసుకెళ్లి ఏం పరీక్ష పెట్టి ఉంటాడు? అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని విషయాలు అడ్డంగా దొరికిపోయిన శ్రీసత్య, బండారం బయటపెట్టిన నాగ్ -
స్టేజ్‌పైనే ప్రియుడికి ముద్దుపెట్టిన జోర్దార్ సుజాత
తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జోర్దార్ సుజాత. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవలె రాకింగ్ రాకేశ్ అనే కమెడియన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి లవ్ ట్రాక్ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ నడుస్తుంది. ఇప్పటికే తమ ప్రేమ గురించి బహిరంగంగానే మాట్లాడిన ఈ జోడీ తాజాగా మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఓ షోపై వీరి జంట సందడి చేసింది. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తమది ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు.. షో కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద అందరి ముందే చెప్పేశాడు. రాకేశ్ మాటలకు ఫిదా అయిన సుజాత స్టేజ్‌పైనే అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. -
పెళ్లికి ముందే అత్తారింట్లో జోర్దార్ సుజాత వరలక్ష్మి వ్రతం!
తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది జోర్దార్ సుజాత. అదే యాసలో యాంకరింగ్ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ కామెడీ షోలోనూ చేరి మరింతమందికి జనాలకు చేరువైంది. అదే సమయంలో ఆ కామెడీ షోలోని హాస్య నటుడు రాకింగ్ రాకేశ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా ఇరువురూ పలుమార్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకున్నారు కూడా! అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సుజాత ఓ సర్ప్రైజింగ్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరలక్ష్మి వ్రతం చేశానోచ్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. సాధారణంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైనవాళ్లు వారి భర్త బాగుండాలని ఈ పూజ చేస్తారంటూ వ్రతం విశేషాన్ని చెప్పుకొచ్చింది. అయితే సుజాత మాత్రం ఈసారి ఏకంగా కాబోయే అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతం చేసింది. రాకింగ్ రాకేశ్ ఇంట్లో అత్తయ్యతో కలిసి పూజలో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ వ్రతాన్ని ఇంత గ్రాండ్‌గా ఎప్పుడూ చేసుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చినవాళ్లందరికీ వాయినం కూడా ఇచ్చానంటూ మురిసిపోయింది. అత్తయ్య.. ఇంట్లో అమ్మవారికి చీర కట్టినదగ్గర నుంచి ఫలహారాలు చేయడం వరకూ అన్నీ తానే దగ్గరుండి చూసుకుందంటూ ఆమె గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చదవండి: బిగ్‌బాస్ 6.. ఇప్పటివరకు ఫైనల్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే! -
ప్రియుడికి రూ.లక్ష విలువైన ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత
జోర్దార్ సుజాత.. టీవీ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె బిగ్‌బాస్ షోతో మరింత ఎక్కువమందికి చేరువైంది. నాగార్జునను కిట్టూ అని పిలుస్తూ అందరినీ తనవాళ్లే అనుకునే అమాయకత్వం, చిరునవ్వు చాలామందిని కట్టిపడేసింది. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న ఆమె సూపర్ సుజాత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్‌తో ప్రేమలో పడ్డ సుజాత తాజాగా తన ప్రియుడికి మర్చిపోలేని బహుమతినిచ్చింది. లక్ష రూపాయల విలువైన కొత్త ఫోన్ కొనిచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను వదిలింది. చదవండి: ఆయన ఫోటో చూసి భోరున విలపించిన మిత్రాశర్మ 'నా ఆత్మీయుడు, ఫ్రెండ్, అంతకుమించి అయిన రాకేశ్‌కు ఫోన్ కొనిస్తున్నాను. తను కొద్దిరోజుల నుంచి మొబైల్‌తో ఇబ్బందిపడుతున్నాడు. పైగా కోపం వస్తే ఫోన్ పగలగొట్టే అలవాటు ఉంది. నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి నేను ఫోన్ కొనిస్తే దాన్ని పగలగొట్టడానికి ఆలోచిస్తాడు కదా అనిపించింది. తను నాకు దగ్గరైనప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రతీ విజయంలో రాకేశ్ ఉన్నాడు. నేను ఫోన్ గిఫ్టిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడనిపించింది, అందుకే ఈ ఫోన్ బహుమతిగా ఇస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. సామ్సంగ్ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసింది. వీటి ఖరీదు లక్షా 20 వేల రూపాయలు అని రాకేశ్ వెల్లడించాడు. ఇక సుజాత వీటిని తనకోసమే కొన్నానని చెప్పడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. చదవండి: విశ్వక్ సేన్ గురించి చెప్పగానే షాకయ్యా! -
నోయల్ టైటిల్ గెలవాల్సింది: అభిజిత్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఆఖరుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గడిపారు. ఎలిమినేట్ అయినవాళ్లను తిరిగి హౌస్‌లో చూస్తున్నందుకు ఓపక్క సంతోషం, తర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండదన్న మరో వైపు బాధ వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్‌లో చివరి రోజు కొంత ఎమోషనల్‌గా సాగింది. అయితే దేవి నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ మాత్రం రీయూనియన్ పార్టీకి రాకపోవడం గమనార్హం. మరి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేయండి.. ఇంటి నుంచి సందేశం.. అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగవ్వ లోపలకు వచ్చింది. అవ్వ పిలుపు వినగానే అఖిల్ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆమెను చూడగానే పిల్లాడిలా సంబరపడిపోయాడు. తర్వాత జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వతో కలిసి ఫైనలిస్టులతో ఆటాడించారు. నన్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వచ్చిన మెస్సేజ్‌ను చూపిస్తానని సుజాత బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీపడుతూ ఇంట్లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో అభి మైకు విరగొట్టుకుని మరీ మొదటగా కాఫీ మగ్గు తీసుకొచ్చాడు. తర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ లవ్ యూ అని రాసుకొచ్చి మరీ అందించాడు. ఇలా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయగా.. ఫైనలిస్టులందరికీ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు చూపించారు. అనంతరం గంగవ్వ, సుజాత ఇద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. (చదవండి: కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్) నేను నిన్ను గెలిచాను.. తర్వాత వచ్చిన నోయల్ ర్యాప్‌తో ఊపేస్తూ అందరి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అతడి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్‌ను అభి నోయల్ చేతికందించాడు. దానిపై 'నోయల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చదివిన నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాలదా.. అంటూ అభిజిత్‌తో చెప్పుకొచ్చాడు. హౌస్‌ను మిస్సవలేదు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్‌బాస్ తనకు ఎంతో ఇచ్చిందని, కానీ తను ఏమీ తిరిగివ్వలేకపోతే క్షమించండి అంటూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే) దివి.. దీపిక పదుకొణెలా ఉన్నావు తర్వాత మెహబూబ్‌ను చూడగానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అతడు మాత్రం తన ఆతృతను లోలోపలే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంతరం తన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్, అభిజిత్‌తో కబుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగడ్తలతో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవడంతో ఏంటి పులిహోరా? అని దివి ప్రశ్నించింది. మరోపక్క మెహబూబ్, సోహైల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఫైనలిస్టులు అన్ని హార్ట్ దిండులను మెహబూబ్, దివికి బహుమతిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్నర్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండని మెహబూబ్ పదే పదే చెప్తూ సెలవు తీసుకున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా తర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంటనే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఓదార్చాడు. తననిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంటర్టైనర్ అని పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు కలిసేందుకు వస్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండటం చూసి ఏంటి? దినాలకు పిట్టకు పెట్టినట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంతరం అందరి హౌస్‌కు గుడ్‌బై చెప్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఫైనలిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ అతడే: అలీ రెజా) -
బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్‌బాస్: గంగవ్వ, సుజాతల కొట్లాట!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ల తలరాతను మార్చే గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమవుతోంది. ఈ టెన్షన్ నుంచి ఉపశమనం కల్పిస్తూ, చివరి సారి హౌస్‌లో సరదాగా గడిపేందుకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను లోనికి పంపించారు. వాళ్లను చూడటంతోనే ఫైనలిస్టుల కళ్లు ఆనందంతో మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే మోనాల్, కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. నేడు మిగతా కంటెస్టెంట్లు గంగవ్వ, నోయల్, సుజాత, అవినాష్, మెహబూబ్, దివి ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో నోయల్ తన ర్యాప్ సాంగ్‌తో ఫైనలిస్టుల్లో జోష్‌ను నింపాడు. ఇక మెహబూబ్‌ను చూడగానే సోహైల్ ఆనందంతో గంతులేశాడు. (చదవండి: నిద్ర పట్టడం లేదు అఖిల్.. నాక్కుడా మోనాల్!) అటు పక్క మెహబూబ్ మాత్రం దివితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ జోడీని చూసి ఇంటి సభ్యులు కూడా రెట్టించిన హుషారుతో స్టెప్పులేశారు. గంగవ్వ, సుజాతలు మాత్రం కాసేపు కొట్టుకున్నట్లుగా నటించి ఆ వెంటనే మాస్ సాంగ్‌కు ఇరగదీశారు. అవినాష్ తనకు దొరికిన కాసింత సమయంలో కూడా కామెడీని పండించి ఆకట్టుకున్నాడు. అభిని చూస్తూ బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, నెంబర్ అడుగుతున్నారు అని ఊరించి చివర్లో తన నెంబర్ అడుగుతున్నారని పంచ్ వేశాడు. అలాగే ఈ మధ్య మొహమాటం లేకుండా రెచ్చిపోయి మరీ పులిహోర కలుపుతున్న అఖిల్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. పులిహోర చేయాలంటే ముందుగా కావాల్సింది అఖిల్ అంటూ జోకులు పేలుస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ ప్రోమోలో సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి జాడ మాత్రం కనిపించలేదు. మరి వారు తర్వాతి ప్రోమోలో అయినా కనిపిస్తారో లేదో చూడాలి! (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వకు కండల వీరుడు స్పెషల్ గిఫ్ట్) -
బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆరో వారంలో అడుగు పెట్టినా ఇప్పటికీ ఎవరు టాప్ 5లో ఉంటారనేది చెప్పడం కష్టంగానే ఉంది. కానీ గడిచిన ఐదు వారాల్లో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అందరూ ముందే ఊహించగలిగారు, ఒక్క దేవి నాగవల్లి ఎలిమినేషన్ తప్ప! ఐదో వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సుజాత నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఆమె నామినేషన్లోకి రాకపోవడంతో ఇన్ని వారాలు ఇంట్లోనే ఉండగలిగింది. అలా అని ఆమె టాస్కులు బాగా ఆడలేదని కూడా కాదు, కాకపోతే ఆమె నవ్వు చాలామందికి చిరాకు తెప్పించింది. అది ఫేక్ నవ్వు అని ప్రేక్షకులు బలంగా నమ్మారు. ఇక స్టార్ హీరో నాగార్జునను పట్టుకుని గౌరవం లేకుండా బిట్టూ అని పిలవడం ఆయన అభిమానులు సహించలేకపోయారు. (చదవండి: బిగ్‌బాస్‌ను వీడిన గంగవ్వ, అఖిల్ కంటతడి) అయితే ఈ బిట్టూ పిలుపు వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సుజాత మాట్లాడుతూ.. "నేను అక్కడికి వెళ్లగానే బిగ్‌బాస్ టీమ్.. నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు. ఇష్టం, అందులోనూ ఆయన చేసిన 'మనం' సినిమా, బిట్టు పాత్ర మరీ మరీ ఇష్టమని చెప్పాను. దీంతో బిట్టు అని పిలవడానికి నీకు ఇష్టమేనా అని అడిగారు, సరేనన్నాను. నేను అలా పిలిచినప్పుడు కూడా నాగార్జున సర్ చాలా సంతోషపడ్డారు. ఒకవేళ అలా పిలవడం నాగార్జునకు గానీ, బిగ్‌బాస్ టీమ్‌కు కానీ నచ్చకపోతే వెంటనే కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి వద్దని చెప్పేవాళ్లు. కానీ వాళ్లంతట వాళ్లే బిట్టు అని పిలవమన్నారు. అయితే ఇది ఆయన అభిమానులకు బాధ కలిగిస్తే క్షమించండి. నేను కావాలని మాత్రం పిలవలేదు" అని క్లారిటీ ఇచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: హౌస్‌లో సుజాతకు ఆఖరి రోజు!) -
సుజాత ఎలిమినేట్, 'పోకిరీ'పై ప్రతీకారం
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌లో ఆరో కంటెస్టెంటు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో ఇంటి సభ్యుల సంఖ్య పదమూడుకు చేరింది. గంగవ్వ చెప్పినట్టుగానే సుజాత నేడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నాగ్‌ను చివరిసారిగా బిట్టూ అని పిలుస్తూ నవ్వుతూ అందరి దగ్గరా సెలవు తీసుకుంది. ఇక ఏ పనీ చేయని కెప్టెన్‌కు ఒళ్లు వంచి పని చేసేలా బిగ్‌బాంబ్ వేసింది. మరి ఆ బిగ్‌బాంబ్ ఏంటో?, నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. ఆ పిల్ల నాది: అఖిల్ సండేను ఫండే చేసేందుకు నాగ్ ఇంటి సభ్యులతో గేమ్ ఆడించారు. డంబ్ షేరాడ్స్ ఆడిస్తూనే ఒక్కో ఇంటి సభ్యుడిపై ఒక్కో పోస్టర్ వదిలారు. అలా ఊహలు గుసగుసలాడే టైటిల్‌ను సుజాతకు అంకితం ఇచ్చారు. అభిజిత్‌ను వరల్డ్ ఫేమస్ లవర్‌గా ప్రకటించగా అతడు అరియానాతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆమె తెగ ఎక్జైట్ అయిపోయింది. అనంతరం నాగ్‌తో పాటు ఇంటి సభ్యులు అభిజిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మెహబూబ్‌కు రేసు గుర్రం పోస్టర్, అమ్మ రాజశేఖర్‌కు మాస్టర్, నోయల్‌కు శంకర్‌దాదా ఎంబీబీఎస్, అరియానాకు జల్సా, సోహైల్‌కు పోకిరీ సినిమా పోస్టర్లు వదిలారు. అరియానా సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత అవినాష్‌కు డార్లింగ్, మోనాల్ ఏ మాయ చేశావే, దివికి అందాల రాక్షసి, కుమార్ సాయికి మత్తు వదలరా, హారికకు ఫిదా, అఖిల్‌కు అర్జున్ రెడ్డి, లాస్యకు పెదరాయుడు పోస్టర్ అంకితం చేశారు. ఈ సందర్భంగా అఖిల్ ఆ పిల్ల నాది అన్న డైలాగ్ చెప్పినప్పుడు అతని వేలు మాత్రం కరెక్ట్‌గా(మోనాల్ వైపు) చూపించావని నాగ్ సెటైర్ వేశారు. అనంతరం నోయల్ సేఫ్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: నేడే ఎలిమినేషన్: స్వాతి దీక్షిత్ అవుట్!) లాస్య, మోనాల్ సేఫ్ బీబీ హోటల్లోని స్టాఫ్.. అతిథులుగా, అతిథులు స్టాఫ్‌గా మారతారని నాగ్ పేర్కొన్నారు. అయితే అంతకు ముందు టాస్క్‌లో అరియానా, సోహైల్ రాచిరంపాన పెట్టారని ఇంటి సభ్యులు నాగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నాగ్ అవకాశమిచ్చారు. దీంతో మాస్టర్ ఆదేశాల మేరకు హారిక నుదుటి మీద నీళ్ల గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించింది, కానీ విఫలమైంది. కోడి పిల్లలాగా సోహైల్ శబ్ధం చేస్తూ రెక్కలు విదుల్చుతూ నడిచాడు. అరియానా.. అవినాష్‌ను ఎత్తుకుని పది నిమిషాలు ఉండాలని సుజాత చాలెంజ్ విసిరింది. దీంతో అవినాష్‌ను ఎత్తుకున్న అరియానా అతని బరువు మోయలేక అమాంతం కింద పడేసింది. తర్వాత మెహబూబ్.. సుజాతను ఎత్తుకుని 50 సార్లు పైకి కిందకు లేపాడు. తర్వాత లాస్య, మోనాల్ సేఫ్ అయినట్లు తెలిపారు. (చదవండి: బిగ్‌బాస్: సుజాతపై పగ పట్టిన నెటిజన్లు) అభిజిత్, మాస్టర్‌తో ఇబ్బంది: సుజాత దీంతో నామినేషన్లో ఇంకా మిగిలి ఉన్న సుజాత, మాస్టర్ గార్డెన్ ఏరియాలోకి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరూ ఐస్‌గడ్డను పగలగొట్టగా అందులో సుజాత ఫొటో రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. తర్వాత స్టేజీపైకి వచ్చిన ఆమె తాను ఎలిమినేట్ అవుతాననుకోలేదని తెలిపింది. కానీ తనకు తనలాగా ఉండే అవకాశం ఇక్కడ లభించిందని పేర్కొంది. అనంతరం ఇంటిసభ్యులతో ఉన్న అనుబంధాన్ని హార్ట్ ముక్కల ద్వారా చెప్పకనే చెప్పింది. తనకు ఎంతో ఇష్టమైన నోయల్, లాస్య, అవినాష్‌కు రెడ్ హార్ట్ ఇచ్చింది. చిన్న చిన్న సమస్యలు ఉన్న అభిజిత్, అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, కుమార్ సాయికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. హారిక, దివి, సోహైల్, అఖిల్, మోనాల్‌కు బ్లాక్ హార్ట్ పెట్టింది. హారిక నోయల్, అభిజిత్‌తో మాత్రమే కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పింది. మోనాల్ తనను చెల్లిగా చూసుకుందని తెలిపింది. అనంతరం బిగ్‌బాంబ్‌ను ఏరికోరి సోహైల్‌పై విసిరింది. వారం రోజులపాటు బోళ్లు అన్నీ తోమాలని అతడిపై బిగ్‌బాంబ్ వేసింది. (చదవండి: నన్ను పంపించేయండి: చేతులెత్తి వేడుకున్న గంగవ్వ) -
బిగ్‌బాస్: హౌస్‌లో సుజాతకు ఆఖరి రోజు!
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్ నుంచి సూర్య కిరణ్, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కారణాలతో గంగవ్వ హఠాత్తుగా షో నుంచి నిష్క్రమించింది. ఇంటి సభ్యులతోపాటు నాగ్ సైతం ఆమెకు గౌరవంగా వీడ్కోలు పలికారు. అంతే కాకుండా కొత్త ఇల్లు కట్టిస్తానని ఆమెకు మాటిచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. కాగా ఉన్నపళంగా అవ్వ షో నుంచి బయటకు రావడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? అని బిగ్‌బాస్ వీక్షకులు గందరగోళంలో పడిపోయారు. కానీ ప్రేక్షకులు వేసిన ఓట్లు వృథా కాలేదు. వారు అభిమానించే వారిని సేవ్ చేస్తూనే తక్కువ ఓట్లు వచ్చినవారిని బయటకు పంపిచనున్నారు. (చదవండి: బిగ్‌బాస్: ఆ విషయం మోనాల్‌దే తప్పన్న దివి) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఈరోజు సుజాత ఎలిమినేట్ అవనుందని లీకువీరులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. తన నవ్వే ఆమె పాలిట శత్రువుగా మారిందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రతిదానికి ఫేక్ నవ్వు విసురుతుందని విమర్శిస్తున్నారు. అలాగే నాగార్జునను పట్టుకుని బిట్టూ అంటూ బిస్కెట్లు వేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో సుజాత ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్తుండగా మాస్టర్ త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతే వచ్చేవారం మాస్టర్నే పంపించేస్తామని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: మళ్లీ ఇంటికి పోతా అంటున్న గంగవ్వ) -
బిగ్‌బాస్‌లో ఆ నవ్వు దూరం కానుందా?
బిగ్‌బాస్ హౌస్‌లో రోజులు గడిచేకొద్దీ ఆట మీద ఫోకస్ పెరుగుతోంది. కానీ ఇదే క్రమంలో కొందరి ఫోకస్ మాత్రం వేరేవాళ్లపై పెట్టడంతో వారి గేమ్ పట్టాలు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పటికే బిగ్‌బాస్ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. సూర్య కిరణ్, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వెళ్లిపోయారు. ఇక చూస్తుండగానే ఐదోవారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గర పడింది. ఈ సారి నామినేషన్లో అభిజిత్, అఖిల్, మోనాల్, సోహైల్, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్, నోయల్, సుజాత ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్లోకి వచ్చారో చదివేయండి. ఓటింగ్లే ఆ ఇద్దరే టాప్ నామినేషన్లోకి తరచూ వస్తున్న కంటెస్టెంట్ల లిస్టులో అభిజిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి అతడికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఓటింగ్ దాదాపు సగం వరకు ఓట్లు అభిజిత్‌కే గుద్దేస్తున్నారు. దీంతో ఎలిమినేషన్ గండం నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతున్నాడు. ఈసారి కూడా అందరి కన్నా ఎక్కువ ఓట్లు అతడికే రావడంతో సేఫ్ జోన్లో అడుగుపెట్టాడు. తర్వాత అఖిల్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో అతడు కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. లాస్యకు ప్రేక్షకుల ఫుల్ సపోర్ట్ లాస్య నామినేషన్లోకి వచ్చినా అందుకు గల కారణాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదు. ఆమె చేసిన పప్పు కూర వల్ల ఇంటిసభ్యులకు మోషన్స్ అవుతున్నాయని చెప్పడం ప్రేక్షకులకు సిల్లీగా అనిపించింది. అంతేకాక దివి పాయింట్‌ను గంగవ్వ తోపాటు కిచెన్‌లో ఉండే రాజశేఖర్ కూడా వ్యతిరేకించారు. అలాగే జనాలు కూడా లాస్య ఏ తప్పూ చేయనందున ఆమెకు సపోర్ట్ చేస్తూ ఓట్లు గుద్దేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: మళ్లీ ఇంటికి పోతా అంటున్న గంగవ్వ) బాబాలా మరిపోతున్న నోయల్ సేఫ్ నోయల్.. అందరిమీద అభిప్రాయాన్ని రుద్దడాన్ని తగ్గించుకోమని నాగ్ సూచించినప్పటి నుంచి నోయల్ పూర్తిగా మారిపోయాడు. ఎదుటివారు కోపంగా మాట్లాడినా, చిరాకుతో చూసినా నవ్వుతూనే సమాధనమిస్తున్నాడు. నోయల్ బాబాలా మారడంపై ఆయన అభిమానులు కలవరపాటుకు లోనవుతున్నారు. అయితే ఎవరి మీద నోరు జారకుండా, అనవసర విషయాల్లో తలదూర్చనందుకు అతనికి కూడా బాగానే ఓట్లు వచ్చి పడ్డాయి. దీంతో నోయల్ మళ్లీ సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అరియానాకు అవకావమిస్తున్నారు ముక్కుసూటిగా మాట్లాడే అరియానాకు షో ప్రారంభంలో పెద్దగా అభిమానులు లేరు. కానీ ఆమె ఆటతీరు, ఉన్నదున్నట్లు ముఖం మీద చెప్పే విధానం, ఎలాంటి సేఫ్ గేమ్ ఆడకపోవడం, టాస్క్‌లో శక్తి మేర ప్రయత్నించడం వల్ల అందరి దృష్టి ఆమె మీద పడింది. పులిహోర కలిపేవాళ్లకు కాకుండా ఇలా నిజమైన గేమ్ ఆడేవాళ్లకు అవకాశమిద్దామని ఆమెను ఎలిమినేట్ అవకుండా కాపాడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: రీ ఎంట్రీ కోసం స్వాతి ఫ్యాన్స్ ఆందోళన) ఆ సాంప్రదాయం ప్రకారం సోహైల్ కూడా సేఫ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఓ సాంప్రదాయం ఉంది. కెప్టెన్‌గా గెలిచిన కంటెస్టెంట్ ఎలిమినేట్ కారు. ఈ సాంప్రదాయం కొనసాగితే సోహైల్ ఈ వారం ఎలిమినేషన్ నుంచి గట్టెక్కుతారు. గత వారం కూడా కుమార్‌సాయి నామినేషన్లో ఉన్నప్పటికీ కెప్టెన్‌గా గెలిచినందున ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. కాబట్టి ఈసారి కూడా సోహైల్ విషయంలో దాదాపు అదే జరగనుంది. (చదవండి: బిగ్‌బాస్: సుజాతపై పగ పట్టిన నెటిజన్లు) డేంజర్ జోన్లో మాస్టర్, సుజాత మిగిలిన ఇద్దరు అమ్మ రాజశేఖర్, సుజాత. ముందుగా మాస్టర్ గురించి చెప్పాలంటే ప్రతిదానికి తను పెద్దవాడినని అందరిపై జులుం ప్రదర్శిస్తాడు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నామినేట్ చేసినా సహించలేడు. ఆటలో భాగమేనని సర్దుకుపోలేడు. వ్యక్తిగతంగా తీసుకుని శాపనార్థాలు పెడతాడు. ఇలా ఎంతోమంది మాస్టర్‌ను గురువు, డాడీ అంటూ అతడి చేతిలో బలయ్యారు. తన కోపమె తన శత్రువు అన్న వాక్యం ఇప్పుడు ఆయన విషయంలో పని చేస్తోంది. అతని ప్రవర్తనకు చిర్రెత్తుకొచ్చిన బిగ్‌బాస్ ప్రేమికులు ఆయన్ను హౌస్ నుంచి పంపించేయాలని ఎదురు చూస్తున్నారు. దీంతో అతడికి ఈ సారి తక్కువ ఓట్లే వచ్చాయి. సుజాతపై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి సుజాతకు నవ్వు ప్లస్సా? మైనస్సా? అన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఎందుకంటే ఆమె నవ్వితే బాగుంటుందని స్వయంగా నాగార్జునే చెప్పారు. దీంతో అందలమెక్కి కూర్చున్న ఆమె నవ్వడమే పనిగా పెట్టుకుంది. ఇది చూసిన ప్రేక్షకులు ఆమెకెవరైనా నవ్వడం ఆపమని చెప్పండ్రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. అంతా ఫేక్ నవ్వు అని విమర్శిస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే అందరిదీ ఒక రూటైతే ఆమెది సెపరేటు రూటు. నాగ్‌ను అందరూ సర్ అని పిలిస్తే సుజాత మాత్రం బిట్టూ అని హొయలు పోతుంది. అలా పిలిపించుకోవడం నాగ్‌కు ఎలా ఉన్నా ఆయన అభిమానులకు మాత్రం ఒళ్లు మండిపోతోంది. పైగా గాసిప్స్ రాణి కూడా అయిన ఈ సుజాతను ఈ వారం ముల్లెమూట సర్దుకుని నేరుగా ఇంటికి పంపించాలని వీక్షకులు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ప్రకారం సుజాతకే అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. స్వల్ప ఓట్ల తేడాతో అమ్మ రాజశేఖర్ తర్వాతి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఓటింగ్‌కు ఈ రోజు అర్ధరాత్రి వరకు సమయం ఉండటంతో ఈ స్థానాలు తలకిందులవుతాయో, అలాగే ఉండిపోతాయో చూడాలి! -
బిగ్‌బాస్: సుజాతపై పగ పట్టిన నెటిజన్లు
ఈ సీజన్‌లోని అందరు కంటెస్టెంట్లు వ్యాఖ్యాత నాగార్జున అక్కినేనిని సర్ అనే పిలుస్తారు. కానీ ఒక్కరు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఈ పాటికే అర్థమైపోయుంటుంది ఆ మనిషి ఎవరా అని! అవును, సుజాత ఒక్కరే నాగ్‌ను సర్ అని పిలవకుండా బిట్టు అని ముద్దుగా పిలుచుకుంటుంది. అలాగే ప్రతీ విషయానికి నవ్వుతూనే ఉంటుంది. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాదని నాగ్ చాలాసార్లు అన్నారు. ఆయనకే కాదు బిగ్‌బాస్ వీక్షకులకు కూడా ఆమె నవ్వు వెనక ఆంతర్యమేంటో అంతు పట్టదు. (చదవండి: నేడే ఎలిమినేషన్: స్వాతి దీక్షిత్ అవుట్!) స్టార్ హీరోను బిట్టు అని పిలవడమేంటి? పొరపాటున నీ నవ్వు భలే ఉంటుంది అని నాగ్ అన్న పాపానికి చీటికిమాటికీ నవ్వుతూనే ఉంది. అయితే కొన్నిసార్లు ఆమె నవ్వు రాకపోయినా కావాలనే నవ్వుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో సుజాతను ట్రోల్ చేస్తున్నారు. సుజాతవి ఫేక్ నవ్వులని విమర్శిస్తున్నారు. వారాంతం వచ్చిందంటే చాలు, ఆమె నవ్వు చూడలేకపోతున్నామని ఘొల్లుమంటున్నారు. అలాగే వయసులోనే కాదు, అనుభవంలోనూ పెద్దవారైన స్టార్ హీరో నాగార్జునను పట్టుకుని గౌరవం లేకుండా బిట్టు అని పిలవడమేంటని నిలదీస్తున్నారు. అలా పిలవకూడదని ఆమెకెవరైనా చెప్పండ్రా అని ఉసూరుమంటున్నారు. నాగ్‌ను బిట్టు అని పిలిచిన ప్రతిసారీ చాలా చిరాకుగా ఉంటోందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: స్వాతి విషయంలో అభిజిత్‌ను నిలదీసిన హారిక) సుజాతను బయటకు పంపించేందుకు వెయిటింగ్ అయినా ఈ మధ్య సుజాత చాలా అతి చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య కెమెరా ముందు అప్పుడే ఏడుస్తూ, అప్పుడే నవ్వుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఫ్యాషన్ షో అయిపోయాక అవినాష్ అద్దం టాస్క్‌లో అందరిపై కామెడీ చేస్తే నవ్వింది, కానీ ఆమెపై జోకులు పేలిస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ఆ మధ్య అభిజిత్ చెల్లి అన్నందుకు కూడా తెగ ఫీలైపోయింది. ఎవరితో సరిగా కలవట్లేదన్న కారణంతో కుమార్ సాయిని నామినేట్ చేసి తిరిగి ఓ టాస్క్‌లో తన అవసరం కోసం మళ్లీ అతడి దగ్గరకే వెళ్లి సాయం కోరడం విడ్డూరం. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రేక్షకులు ఆమె నామినేషన్ జోన్లోకి వచ్చే సమయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి నామినేట్ అయితే చాలు, ఇంటి నుంచి బయటకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై వేస్తున్న సెటైర్లపై మీరూ ఓ లుక్కేయండి. #Sujatha laugh !, I am very sure you will think she got mad & fluctuating mentality 🤮 I guess she is stress at bbhouse !#BiggBossTelugu4 https://t.co/b4EBLKBQCc — Raja (@Truly_Raja) October 3, 2020 #Sujatha : Brand Ambassador of Fake Laugh#BiggBossTelugu4 — SatwikMathangi (@seven_week) October 3, 2020 Someone please put plaster on #Sujatha mouth. We are unable to hear calling #Nagarjuna as bitu 🤦🏻♂️ & on top of it laughing vamoo #BiggBossTelugu4 — Raja (@Truly_Raja) October 3, 2020 #Sujatha NAG ni Bittu anadam is sooooo irritating#BiggBossTelugu4 — Believer! Living on a PALE BLUE DOT🌏 (@Human9368) October 3, 2020 #Sujatha laugh is like this!! #BiggBossTelugu4 pic.twitter.com/6h4MIjedIL — BIggBossTelugu4 (@BiggBossTelugu2) October 3, 2020 Idhi antha kadhu Kani...@iamnagarjuna Garu.. ahh #Sujatha ni bittu ani athi cheyodhu Ani cheppandi. Or sujatha eliminate ayyevaraku.. Miru host cheyakandi plz 🙏🙏🙏 — 🐝 (@dewz124) October 4, 2020 #sujatha neeku pedha 🙏🙏..Areyy @StarMaa nduku maaku ee torture asalu . Please eliminate this irritating contestant.#BiggBossTelugu4 pic.twitter.com/NNcNLA54MQ — S A (@soonotsoo) October 4, 2020 -
నాతో జీవితంలో మాట్లాడకు: అమ్మ రాజశేఖర్
ఇంటి సభ్యుల కసి చూస్తుంటే బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఓవైపు నిద్రాహారాలు మాని గెలుపు కోసం పరితపిస్తున్న మనుషుల టీమ్ దెబ్బ తిన్న పులిలా ఉంటే, మరోవైపు అన్ని సౌకర్యాలు, సౌలభ్యాలను వాడుకుంటున్న రోబో టీమ్ గెలుపుకు ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ మనుషుల టీమ్‌కు కండబలం ఉంటే ప్రత్యర్థి టీమ్‌కు బుద్ధి బలం ఉంది. దీంతో ఎత్తుకు పై ఎత్తులతో ఆట నడుస్తూనే ఉంది. అయితే మాస్టారు అంటూ అమ్మ రాజశేఖర్ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తూ నెమ్మదిగా చార్జింగ్ పెట్టేసుకుని వెన్నుపోటు పొడిచాడు అవినాష్. (చదవండి: బిగ్‌బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?) దీంతో ఆలస్యంగా విషయం అర్థమైన మాస్టర్‌కు లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం నవ్వేశాడు. కానీ తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తుంటే ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోకుండా మనుసులో పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. "ఈ జీవితంలోనే కాదు, జన్మజన్మలలోనూ అవినాష్ తనతో మాట్లాడకూడదు" అని తేల్చి చెప్పాడు. నిన్నటి వరకు ఐకమత్యంగా ఉన్న మనుషుల టీమ్‌లోనూ బేధాభిప్రాయాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన టీమ్ సభ్యులు చెప్తున్నా వినకుండా రోబోలతో ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. ఇది రోబోల టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారనుండగా మనుషుల టీమ్‌లో మరిన్ని గొడవలకు దారి తీసేలా కనిపిస్తోంది. మరి ఆమె నిర్ణయం హౌస్‌లో ఎంత రచ్చకు దారి తీస్తుందో నేటి ఎపిసోడ్లో చూడాలి. (చదవండి: చాలాసార్లు బతకాలనిపించలేదు: వితికా ) -
బాంచెన్.. నా వల్ల అయితలే: ఏడ్చేసిన గంగవ్వ
బుల్లితెర బాస్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో నేడు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్ హౌస్‌లో ఎంటరయ్యాడు. వినూత్న ఎంట్రీతో హౌస్‌లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. మట్టి మనిషి గంగవ్వకు ఏసీ గదుల్లో రోజుల తరబడి ఉండటం కష్టంగా ఉంది. ఆ వాతావారణం, అక్కడి తిండి తన ఒంటికి పడక అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను వైద్యుల దగ్గరకు పంపించారు. మరి నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం.. ఈ రోజు.. నా రోజు: అవినాష్ ఎంట్రీ పదకొండో రోజు ఉదయం పాటకు బదులు వాయిస్ ఓవర్‌తోనే నిద్ర లేచారు. ఈ రోజు.. నా రోజు అంటూ ముక్కు అవినాష్ ఇంట్లోకి రాకముందే ఇంటి సభ్యులపై జోకులు పేల్చాడు. జోకర్.. ఆనందానికి, బాధ మధ్య నలిగిపోతూ ఉండే చిన్న పదం, జోకర్ వెనక జీవితమే ఉంది అంటూ ఏవీ చూపించారు. ఆ తర్వాత అందర్నీ నవ్వించే జోకర్‌గా వచ్చాను అంటూ అవినాష్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తనకు పెద్ద కుటుంబం ఉందని, తన గురించి ఆలోచించంటూ మోనాల్ దగ్గర పెళ్లి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులు సరదాగా కళ్యాణిని బయటపెట్టాలనుకున్న ప్లాన్ అట్టర్‌ప్లాఫ్ అయింది. (చదవండి: బిగ్‌బాస్: ఎలిమినేషన్, ఆ వెంటనే సర్ప్రైజ్) గుక్కపెట్టి ఏడ్చిన సుజాత, బుజ్జగించిన నోయల్ కానీ సుజాతను మాత్రం నోయల్ విజయవంతంగా బయటపెట్టాడు. ఆ భయం నుంచి బయటపడని సుజాత గుక్కపెట్టి మరీ ఏడ్చింది. దీంతో నోయల్ ఆమెను దగ్గర తీసుకుని ఊరడించాడు. అనంతరం పెద్ద బిల్డప్ ఇచ్చిన అవినాష్‌తో ఇంటి సభ్యులు ఓ ఆటాడుకున్నారు. అతడిని అమ్మాయిగా రెడీ చేసి గంగవ్వతో కలిసి ర్యాంప్ వాక్ చేయించారు. ఇదిలా వుంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా ఇంట్లో ఉండే ఒక అబ్బాయిని నువ్వుసెలక్ట్ చేసుకోవాలి అని హారిక సుజాతను అడిగింది. అందరూ అక్క, తమ్ముడు అవుతారు, పోనీ అభి పేరు చెప్తావా అనగానే అతడు ఛీఛీ సుజాత నాకు చెల్లి అని అన్నాడు. చీచీ అన్నందుకు సుజాత నొచ్చుకుంది. ఆ విషయాన్ని చెప్తూ పదేపదే ఏడ్చింది. పంటి కింద నొప్పిని భరిస్తున్న గంగవ్వ గత కొద్దిరోజులుగా పంపించండని వేడుకుంటున్న గంగవ్వ అనారోగ్యం బారిన పడింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అందరూ బాగానే చూసుకుంటున్నారు, కానీ భర్త కొట్టిన దెబ్బలు ఇప్పుడు మళ్లీ నొప్పెడుతున్నాయని చెప్పింది. నాకిక్కడ వాతావారణం, ఆహారం పడతలేదని ఏడుస్తూ గోడు వెల్లబోసుకుంది. మట్టిలో తిరిగేదాన్ని, ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పింది. రెండు నెలలు ఉందామనే వచ్చాను, కానీ తన వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: నాకైతే రెమ్యూనరేషన్ చాలానే ఇచ్చారు) వైద్యులతో గంగవ్వకు చికిత్స మీరు గట్టిమనిషి, ఇలాంటి ఎన్నో కష్టాలను చూసి ఇక్కడిదాకా వచ్చారు అని బిగ్‌బాస్ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఇక్కడ ఉండలేకపోతున్నా అని పరోక్షంగా పంపించేయండని పదేపదే చెప్పింది. బిగ్‌బాస్ ఆమెను మెడికల్ రూమ్‌కు వెళ్లమని చెప్పి అక్కడ వైద్యులతో చికిత్స అందించారు. ఇప్పటివరకు గంగవ్వను గెలిపిద్దాం అనుకున్న అభిమానులు నేటి ఎపిసోడ్ చూశాక మనసు మార్చుకుంటున్నారు. ఆమె పడుతున్న అవస్థను కళ్లారా చూసిన తర్వాత ఆమెను ఇంక ఇంటికి పంపించేయడమే బెటర్ అంటున్నారు. ఇదిలా వుంటే రేపటి ఎపిసోడ్లో బీబీ కామెడీ షో జరగనుంది. ఇందులో రెండు టీమ్‌లుగా విడిపోయిన అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ స్కిట్లు చేయనున్నారు. వీరిలో ఎవరి కామెడీ పండనుందో చూడాలి. ఇక్కడ రియల్ జోకర్ గెలుస్తాడా? రీల్ జోకర్ విజయం సాధిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్ లాస్యకు మాస్టర్ పంచ్) -
బిగ్‌బాస్: ఫస్ట్ కెప్టెన్‌గా కట్టప్ప!
నాలుగు రోజులుగా నాన్చుతూ వచ్చిన కట్టప్ప ఎపిసోడ్ ఉత్తిదేనని తేలింది. హౌస్‌లో అలాంటి పాత్రే లేదని, కానీ మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని, దాన్ని పక్కన పడేయండని నాగార్జున సూచించారు. వారం రోజులు కావస్తున్నా ఇంటి సభ్యులు ఒకరికొకరు సరిగ్గా కనెక్ట్ అయినట్లు కనిపించడం లేదని చెప్పాడు. హౌస్మేట్స్ చేసిన తప్పొప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈ వారం 5 కోట్ల ఓట్లు వచ్చాయన్నారు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఇద్దరిని ఆ గండం నుంచి బయటపడేశారు. ఆ ఇద్దరు ఎవరు? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం.. ఎన్నో వారాలు ఉండలేను: గంగవ్వ బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరో తేల్చేద్దాం అంటూ బాహుబలి పాటతో ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. అనంతరం శుక్రవారం నాడు హౌస్‌లో ఏం జరిగిందో చూపించారు. ఆ రోజు వర్షం పడుతుండటంతో "ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వాన" సాంగ్ వేశారు. ఇంకేముందీ.. ఇంటి సభ్యులు వర్షంలోనే తడుచుకుంటూ మరీ చిందేశారు. ఆ తర్వాత మాస్టర్ కట్టప్ప మీద పాట పాడాడు. కల్యాణి కూడా బాగా పాడుతుందంటూ పొగడటంతో గొంతు సవరించుకుని పాటందుకుంది. అంతే.. చటుక్కున అక్కడున్న అబ్బాయిలంతా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయి ఆమెను బకరా చేశారు. ఐదేళ్లున్నప్పుడు పెళ్లి చేశారు. మరోవైపు గంగవ్వ "నా భర్త తాగుడు, కొట్టుడు, చెప్పినమాట వినకుండా అయిపోయిండు" అని తన బాధలను ఇంటి సభ్యులతో వెళ్లబోసుకుంది. ఎన్నో వారాలు ఇంట్లో ఉండలేనని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది) అప్పుడు పెళ్లన్నాడు, ఇప్పుడు మాట కూడా లేదు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో హౌస్మేట్స్ అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారం రోజులకు నాగార్జున కనిపించడంతో ఇంటిసభ్యులు ఆనందానికి లోనయ్యారు. గంగవ్వ నాగార్జునను నడిపన్న(రెండో అన్న) అని పిలుచుకుంటూ పాట పాడింది. నోయల్ నువ్వు ఓవర్ థింక్ చేస్తావ్ కదా అని నాగ్ అన్నారు. అన్నింటిని అలాగేపెంట చేశావ్ అని చెప్పారు. నువ్వు టాలెంటే కానీ, ఓవర్ థింకింగ్ తగ్గించుకో అని సూచించారు. అరియానాకు ఇంకోసారి తినిపించయని అఖిల్‌ను ఆదేశించారు. ఆ తర్వాత నాగ్, ఇంటిసభ్యుల కోరిక మేరకు సోహైల్ అరియానాను వీపుపై మోస్తూ పుషప్స్ చేశాడు. నువ్వెప్పుడైనా ఇలా ట్రై చేశావా అని నాగ్ అడగ్గా ఇలాంటి అమ్మాయి ఇంకా దొరకలేదని అఖిల్ సమాధానమిచ్చాడు. నర్మద నదిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. దానికి డ్యామ్ కట్టేశారని, నువ్వు కూడా అలాంటిది వేసుకోవాలని నాగ్ మోనాల్‌ను కోరారు. లాస్యకు గోడ మీద పిల్లిలా ఉన్నావ్, జోష్ తగ్గిపోయిందని చెప్పారు. షో ప్రారంభం రోజు అభిజిత్ ఎవర్ని పెళ్లి చేసుకుంటావు అంటే మోనాల్‌ను చేసుకుంటానన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తను నేరుగా వచ్చి మాట్లాడిచ్చినా స్పందించట్లేదని మోనాల్ వాపోయింది. మరోవైపు సైలెంట్‌గా ఉంటూ.. అందరి గురించి బాగా చెప్పావ్ అని దివిని పొగిడారు. సూర్యకిరణ్‌కు మొట్టికాయలు వేసిన నాగ్ కట్టప్ప గురించి తెలుసుకోడానికి వెయిటింగ్ అంటూ హౌస్మేట్స్ అద్భుతమైన ర్యాప్ సాంగ్ పాడారు. నా చెవులు గిల్లుమంటున్నాయి ఆపండి అని గంగవ్వ వారించడంతో అందరూ నోళ్లు మూసుకున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నదాని గురించి బ్రేకింగ్ అండ్ హెడ్‌లైన్స్ చెప్పమని నాగ్ దేవి నాగవల్లిని కోరారు. అందుకు ఆమె వ్యాసం చెప్పడంతో 'ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. దేవి వార్తలు చెప్పడం మర్చిపోయింద'ని కింగ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. అనవసరమైన దానిలో దూరి లెక్చర్లు ఇవ్వకండని సూర్యకిరణ్‌కు మొట్టికాయలు వేశారు. అక్కడిది ఇక్కడ.. ఇక్కడిది అక్కడ చెప్పడమేంటని కరాటే కల్యాణిపై అసహనం ప్రదర్శించారు. వేరేవాళ్లని మాట్లాడనివ్వండని ఉచిత సలహా ఇచ్చారు. (చదవండి: దివి ధ్యాసలో వంట పెంట చేసిన మాస్టర్) గంగవ్వ తోపు, లాస్య బకరా ఆ తర్వాత సోహైల్, అరియానాతో ఓ ఆటాడించారు. రకరకాల బొమ్మలు ఉన్న మెడల్స్‌ను కంటెస్టెంట్ల మెడలో వేయాలన్నారు. అలా సుజాత ఊసరవెల్లి, దివి కాకరకాయ, కల్యాణి చిచ్చు పెట్టడం, హారిక డ్రామా క్వీన్, సూర్య కిరణ్ బద్ధకం, అభిజిత్ చెత్తకుండీ, నోయల్ లౌడ్ స్పీకర్, గంగవ్వ తోపు, దేవి పర్ఫెక్ట్, మోనాల్ ఏడ్చే బేబీ, లాస్య బకరా, మెహబూబ్ మిర్చి, అమ్మ రాజశేఖర్‌ను జోకర్‌గా చెప్పుకొచ్చారు. అనంతరం నాగ్ ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఏడుగురిలో మొదట అభిజిత్‌ను, తర్వాత సుజాత, గంగవ్వను సేవ్ చేశారు. ఇక మెజారిటీ ఇంటి సభ్యులు లాస్యను కట్టప్ప అనుకున్నారు, కానీ అలాంటి క్యారెక్టరే లేదని నాగ్ వెల్లడించారు. లాస్యను ఫస్ట్ కెప్టెన్‌గా ప్రకటించారు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి) -
బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రస్తుతం నీరసంగా సాగుతోంది. ప్రోమోలతో ఆకాశమంత హైప్ క్రియేట్ చేసినా ఎపిసోడ్లు మాత్రం చప్పగా సాగుతున్నాయి. అసలే ఐపీఎల్ గండం ముంచుకొస్తుంది. ఆటను రంజుగా మార్చకపోతే ప్రేక్షకులు షోతో డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్‌బాస్ ప్లాన్ మారుస్తే తప్ప ప్రేక్షకులు షోలో లీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా వుంటే గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ దిల్సే, అఖిల్ సార్థక్, సూర్య కిరణ్, సుజాత, దివి వైద్య మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') ఒక్క ఎపిసోడ్‌తో పెరిగిన దివి క్రేజ్ 50 శాతానికిపైగా ఓట్లతో గంగవ్వ ఎప్పుడో సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఆమె తర్వాత ఎక్కువ ఓట్లు గెలుచుకున్న అభిజిత్ కూడా ఎలిమినేషన్ గండం నుంచి బయటపడ్డాడు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న అఖిల్, మెహబూబ్ కూడా ఈసారికి ఎలిమినేషన్ నుంచి బతికి బట్టకట్టారు. మిగిలింది దివి, సుజాత, సూర్యకిరణ్.. నిన్నటి ఎపిసోడ్ ముందు వరకు దివికి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమె రాతనే మార్చేసింది. దివి సైలెంట్ కిల్లర్ అని, ఆమె హౌస్‌లో ఉండాల్సిందేనంటూ ఓట్లు గుద్దుదుతున్నారు. సుజాత.. తొందరపాటు, తత్తరపాటు చర్యలతో ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: సూర్య కిరణ్‌తో దివి ఫైట్!) తన కోపమె తన శత్రువు తొలి రోజు నుంచే ఎవరి మీద పడితే వారిమీద తన కోపాగ్నిని ప్రదర్శించి సూర్య కిరణ్ అప్రతిష్ట మూట గట్టుకున్నాడు. ఎదుటివారిని మాట్లాడనివ్వకపోవడం, తన మాటే వినాలనేలా మూర్ఖత్వంగా ప్రవర్తించడమే ఓట్ల గండికి ప్రధాన కారణం. 'తన కోపమె తన శత్రువు' అన్న మాట ఇతని విషయంలో అక్షరాలా నిజమయ్యేట్లు కనిపిస్తోంది. కోపావేశాల కారణంగా హౌస్‌లో విలన్‌గా మారిపోయిన సూర్య కిరణ్‌ను బ్యాగు సర్దేసి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిచాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే చివరి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఓట్ల వ్యత్యాసంలో పెద్ద తేడా కూడా లేదు. పైగా నేడు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉండటంతో చివరి రెండు స్థానాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున వచ్చి చెప్పేవరకు వెయిట్ చేయక తప్పదు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి) -
దిల్దార్ ఉంటానంటోన్న జోర్దార్ సుజాత
శ్రుతి అంటే ఎవరూ గుర్తుపట్టరు కావచ్చు కానీ, జోర్దార్ సుజాత అంటే ఇట్టే గుర్తుపడతారు. పూర్తిగా పల్లెటూరులోనే పెరిగిన ఆమె సర్కార్ బడిలో పదో తరగతి వరకు చదివింది. పై చదువులు పూర్తయ్యాక ఆన్లైన్ మార్కెటింగ్‌లో జాబ్ చేసింది. తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ వస్తుందంటే ఓ సారి ప్రయత్నిద్దామని రాయి వేసి చూసింది. కానీ ఆమె మాట్లాడే తీరు నచ్చడంతో ఎంపిక చేసుకున్నారు. అలా తీన్మార్ వార్తలు కార్యక్రమంలో సుజాతగా అందరికీ దగ్గరయ్యింది. ఆ తర్వాత వేరే ఛానల్లోనూ యాంకర్‌గా రాణిస్తోంది. కానీ పాపులారిటీ వచ్చిన సమయంలోనే కన్నీళ్లు సైతం గడ్డ కట్టుకుపోయేటన్ని బాధలను చూసానంటోంది. అన్నింటినీ దాటే ఇక్కడి వరకు వచ్చానని చెప్తోంది. మంచిగ అనిపిస్తే దిల్దార్గా మాట్లాడతా, కోపమొస్తే బొక్కలిరగ్గొడతా అంటోంది. వచ్చీరాగానే నాగార్జునను బిట్టు అని పలకరిస్తూ జోర్దార్గా మాట్లాడింది. తన ముచ్చట్లతో నాగ్‌ను బుట్టలో వేసుకున్న ఆమెకు నాగ్ బహుమతి కూడా ఇచ్చారు. మరి ఆమె ఇంట్లో ఇలానే తన యాసతో అలరిస్తుందా? లేదా చూడాలి.