Jordar Sujatha Interesting Comments On Rocking Rakesh - Sakshi
Sakshi News home page

Jordar Sujatha: రాకేశ్‌ నన్ను స్మశానానికి తీసుకెళ్లి పరీక్ష పెట్టాడు

Published Sat, Oct 22 2022 4:46 PM | Last Updated on Sat, Oct 22 2022 6:00 PM

Jordar Sujatha Interesting Comments On Rocking Rakesh - Sakshi

నాన్‌స్టాప్‌ మాటలతో అందరినీ ఆకట్టుకునే యాంకర్‌ జోర్దార్‌ సుజాత ఆమధ్య బిగ్‌బాస్‌ షోలో సందడి చేసింది. నాలుగో సీజన్‌లో పాల్గొన్న ఆమె కింగ్‌ నాగార్జుననే బిట్టు అని పిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర షోలలో ఎక్కువగా కనిపిస్తోంది. కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌తో లవ్‌లో పడ్డ సుజాత పెళ్లికి ముందే అతడి ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా చేసిన విషయం తెలిసిందే! తమ ప్రేమను బాహాటంగానే బయటపెట్టిన ఈ లవ్‌ బర్డ్స్‌ తాజాగా ఓ షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేటప్పుడు ఆ భగవంతుడు నాకెన్నో పరీక్షలు పెట్టాడు. కానీ నువ్వు స్మశానానికి తీసుకెళ్లి నాకు పరీక్ష పెట్టావు అంటూ ఎమోషనలైంది. నాకు కోట్లాది రూపాయలు కావాలి, కార్లల్లో తిప్పాలి అని నేను అడగను, కానీ నా కన్నీళ్లను తుడవడానికి జీవితాంతం నా పక్కనుంటే చాలు అంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో రాకేశ్‌ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఇది చూసిన జనాలు ఇంతకీ రాకేశ్‌ స్మశానానికి తీసుకెళ్లి ఏం పరీక్ష పెట్టి ఉంటాడు? అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: రిషబ్‌ శెట్టి గురించి ఎవరికీ తెలియని విషయాలు
అడ్డంగా దొరికిపోయిన శ్రీసత్య, బండారం బయటపెట్టిన నాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement