rocking rakesh
-
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
కేసీఆర్‌కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్‌గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్‌గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్‌గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
KCR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకింగ్ రాకేష్ స్పీచ్
-
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
త్వరలోనే ఆ రుణం తీర్చుకుంటాను: సాయి రాజేష్
‘‘నేను తీసిన ‘హృదయ కాలేయం’ సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేశాడు రాకేష్. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన తనకి కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. త్వరలోనే ఆపాత్ర రాసి రుణం తీర్చుకుంటాను. ‘కేసీఆర్’ సినిమా ట్రైలర్ బావుంది. సినిమా విజయం సాధించి, రాకేష్ మంచి స్థాయికి వెళ్లాలి’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు.రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది’’ అని తెలిపారు. ‘‘కేసీఆర్’కి నేను దర్శకత్వం వహించడంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా అందించాను. రాకేష్ అద్భుతమైన కథ రాశారు’’ అని ‘గరుడవేగ’ అంజి చెప్పారు. నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘కొన్ని డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలనుకుంటారు. కానీ, రాకేష్ మాత్రం ‘కేసీఆర్’లాంటి ఒక మంచి సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు. -
ఒక్క ఫోటో వైరల్.. అనసూయ భర్తను నేనే అనుకున్నారు: సాయిరాజేష్
'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రం ఆడియో వేడుకలో అనసూయ గురించి డైరెక్టర్ సాయిరాజేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తూనే 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తోన్నాడు. ఆపై స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బేబీ సినిమా డైరెక్టర్ సాయిరాజేష్, అనసూయ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బావమరదళ్ల ప్రేమకథతో దర్శకుడు 'గరుడవేగ' అంజి ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. అయితే, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో యాంకర్ అనసుయపై దర్శకుడు సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జబర్దస్త్ షో కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. ఆ సమయంలో అనసూయతో ఒక సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాను. అయితే, చాలామంది అనసూయ భర్తను నేనే అనుకుని బండబూతులు తిట్టారు. అనసూయకు సరైన టేస్ట్ లేదు.. ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ కొందరు కామెంట్ చేశారు. తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చాను.' అంటూ సాయి రాజేష్ సరదాగ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.కానీ, ఇలాంటి వార్తలను తాను చూడలేదని అనసూయ చెప్పింది. సాయిరాజేష్ అందరికీ మంచి చేసే వ్యక్తి అంటూ ఆమే తెలిపింది.. అందుకే రాకింగ్ రాకేశ్ సినిమా విజయం కోసం ఇంత దూరం వచ్చారని సాయిరాజేష్పై ఆమె ప్రశంసలు కురిపించింది. అనసూయ, సాయిరాజేష్ల మధ్య సరదాగ జరిగిన సంభాషణ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
బుజ్జిపాపాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత (ఫోటోలు)
-
తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు
బుల్లితెర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్, సుజాత తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వారు ప్రకటించారు. అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ జోర్దార్ సుజాతగా పేరు తెచ్చుకున్న ఆమె బిగ్‌బాస్ షో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది. అప్పటికే బుల్లితెరపై ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేశ్ రాణిస్తున్నారు. గతేడాది తిరుమలలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.తాము తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్నట్లు రాకింగ్ రాకేశ్ తెలిపారు. పండండి పాపకు సుజాత జన్మనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో ఒక అద్భుతం అంటూ.. ' జీవితంలో సగ భాగం అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం' అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: ఓటీటీలో 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటనబిగ్బాస్తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్‌తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగానే రాకేష్ చెప్పాడు. అలా 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. -
బిగ్‌బాస్ సుజాత సీమంతం 'ఫోటోలు' షేర్ చేసిన రాకింగ్ రాకేశ్ (ఫొటోలు)
-
పెళ్లే వద్దన్నాడు.. భార్యతో కలిసి గుడ్‌న్యూస్ చెప్పిన రాకింగ్ రాకేశ్ (ఫోటోలు)
-
త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ - నటి, యాంకర్ జోర్దార్ సుజాత దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నెలలో ఆమె సీమంతం కూడా జరిగింది. అయినా దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇన్నాళ్లకు తాను గర్భవతిని అని తెలియజేస్తూ ఓ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. 'ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వీడియో షేర్ చేసినా మీరు ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేస్తూనే ఉన్నారు.ప్రెగ్నెన్సీఒక మంచి సందర్భం చూసుకుని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. మీరు ఆశీర్వదించినట్లే మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్గానూ ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకూ ఆయనకు నేనే భార్యను కావాలి.ఇంటికి పంపలేదుమా ఇంట్లోని వీణ(తోటి కోడలు).. నన్నెంత బాగా చూసుకుంటుందో! నేను ఏ ఫుడ్ తీసుకోవాలనే విషయంలో మా ఆయనతో పోటీపడేది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. అక్కడ రోడ్లు సరిగా లేవు, ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది. ఇలా ఎమోషనల్ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) చదవండి: Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు -
తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్.. నెట్టింట వైరల్
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' అనే టైటిల్‌తో ఒక సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మాతగా రాకింగ్ రాకేశ్ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా నుంచి తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ దంపతులు వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఉన్నారు. ఈ పాటను గోరేటి వెంకన్న రచించగా సింగర్స్ మనో, కల్పన, గోరేటి వెంకన్న ఆలపించారు. ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తుంది. పాటలో తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతూ సాగడంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు భారీగా షేర్ చేస్తున్నారు. -
హైదర్‌నగర్‌లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్' అని ఓ సినిమా తీస్తున్నాడు. అయితే ఇది తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ లేదంటే వేరే ఏదైనా స్టోరీనా అనేది పెద్దగా రివీల్ చేయలేదు. సరే అదంతా పక్కనబెడితే ఈ నవంబరులోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయమై నటుడు-నిర్మాత రాకేశ్ ఎమోషనల్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) అసలేం జరిగింది? ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. మరోవైపు జబర్దస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'(కేశవ్ చంద్ర రమావత్) పేరుతో సినిమా తీస్తున్నాడు. అయితే ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయొద్దని సెన్సార్ ఆపేసింది. ఇప్పుడు దాని గురించే చెబుతూ రాకేశ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలానే కొందరికి తను బినామీగా వ్యవహరిస్తున్నాననే వార్తలపైనా క్లారిటీ ఇచ్చేశాడు. రాకేశ్ ఏమన్నాడు? 'ఈ సినిమాని అనుకున్న టైంకే రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇది బయోపిక్కా? ఏ జానర్ అనేది రివీల్ చేయడం లేదు. సెన్సార్ వాళ్లకే అన్నీ వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ మూవీని ఇప్పుడు విడుదల చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నాను. పబ్లిసిటీకి టైం దొరికిందని అనుకుంటాను. అలానే నాకు ఎవరు డబ్బులిచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు. ప్యాషన్ తో ఈ సినిమా తీస్తున్నా. మీరు గౌరవిస్తారని కోరుకుంటున్నాను' అని రాకేశ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్
తెలుగులో కామెడీ షో అనగానే చాలామందికి 'జబర్దస్త్' గుర్తొస్తుంది. ఓ సాధారణ కమెడియన్‌గా ఈ షోలో అడుగుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత టీమ్ లీడర్ రాకింగ్ రాకేశ్ అయ్యాడు. పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ 'కేసీఆర్' సినిమా తీస్తున్నాడు. అయితే ఈ మూవీ తీయడం కోసం ఇల్లు తాకట్టు పెట్టానని, కొందరు తనని మోసం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏంటీ సినిమా? కమెడియన్ రాకేశ్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు ఏకంగా కోట్లు పెట్టి 'కేసీఆర్' అనే సినిమా తీస్తున్నారు. ఇది కేసీఆర్ జీవితం ఆధారంగా, ఆయనపై ఇష్టంతో తీస్తున్న సినిమా ఇది అని స్వయంగా రాకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా! అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అని యాంకర్ అడగడంతో.. తను ఎంతో కష్టపడి, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టేశానని రాకేశ్ చెప్పుకొచ్చాడు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో) మోసం చేశారు! ఈ సినిమా చేస్తానని కొందరు వ్యక్తులు తనకు మాటిచ్చారని, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చిందని రాకింగ్ రాకేశ్ చెప్పుకొచ్చుడ. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత తనని ఎంకరేజ్ చేశారని రాకేశ్ చెప్పుకొచ్చాడు. తన భార్య సుజాత.. బ్యాంకులో దాచుకున్న డబ్బులిస్తానని తనకు ధైర్యం చెప్పిందని.. అలానే ఈ సినిమాకు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, క్యాస్టూమ్ డిజైనర్.. ఇలా చాలా పనుల్ని సుజూత చేస్తూ తనకు అండగా ఉందని రాకేశ్ చెప్పాడు. ఇదిలా ఉండగా కేసీఆర్ సినిమాతో తెలుగు నటి సత్యకృష్ణ కూతురు అనన్య మేనన్ ఇండస్ట్రీలోకి ఎంటారీ ఇస్తోంది. గరుడ వేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్‌బాస్?) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకాస్త టైం ఉంది కానీ తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించేశారు. కొన్నిరోజుల్లో నామినేషన్స్, ఎన్నికలు, కౌంటింగ్ అని హడావుడి మాములుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ కమెడియన్ తన కొత్త మూవీ టైటిల్ ప్రకటించాడు. కాకపోతే దానికి 'కేసీఆర్' అని పేరు పెట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఈ సినిమా సంగతేంటి? మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత కొన్నాళ్లకు 'జబర్దస్త్' కామెడీ షోలోకి వచ్చాడు. అలా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత రాకింగ్ రాకేశ్ అయ్యాడు. మొన్నీ మధ్య హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఆ చిత్రానికే 'కేసీఆర్' అనే టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. టైటిల్ మాత్రమేనా? అయితే ఈ సినిమా పోస్టర్లో కేసీఆర్ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ లుక్ చూస్తుంటే ఆయనదే అనిపిస్తుంది. అలానే కేసీఆర్ అంటే 'కేశవ్ చంద్ర రమావత్' అని తెలుస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ అనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి రాజకీయాలతో సంబంధం ఉందా? లేదంటే హైప్ కోసమే ఆ పేరు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో అమర్‌కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
గ్రాండ్‌గా జబర్దస్త్ కమెడియన్స్ రాకేశ్, సుజాతల హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
జోర్దార్గా రాకింగ్ రాకేశ్, సుజాతల హల్దీ.. ఫోటోలు వైరల్
జబర్దస్త్ కమెడియన్లు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం జరుపుకోగా తాజాగా పెళ్లిపీటలెక్కారు. బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమ హల్దీ వేడుకల ఫోటోలను నూతన వధూవరులిద్దరూ అభిమానులతో పంచుకున్నారు. 'మీ అందరి ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం. ఈ ఆనందం చెప్పలేనిది, రాయలేనిది' అంటూ ఫోటోలు షేర్ చేశారు. తమకు శుభాకాంక్షలు చెప్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వీరి హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ హల్దీ థీమ్‌లో రాకేశ్, సుజాత ఇద్దరూ పసుపు రంగు బట్టలు ధరించగా వెరైటీ పోజులతో ఫోటోలు క్లిక్‌మనిపించారు. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) చదవండి: కష్టాలతో సావాసం.. ఫైమా సొంతింటి కల సాకారం -
జబర్దస్థ్ కమెడియన్‌ను పెళ్లాడిన యాంకర్.. ఫోటోలు వైరల్
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్‌తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్‌తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. -
ఊ అంటావా మావా!
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రేలంగి నరసింహారావుగారి 76వ చిత్రం ఇది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి’’ అన్నారు ప్రసన్నకుమార్. -
ఆర్పీ చేపల పులుసు బిజినెస్ వారి భిక్షే: రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొతంంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. భారీ సంఖ్యలో కస్టమర్లు ఆర్పీ కర్రీ పాయింట్ ముందుకు క్యూ కడుతున్నాడు. ఫలితంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు బిజినెస్ లాభాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆర్పీ తన బిజినెస్ చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కియారా-సిద్ధార్థ్‌ల సీక్రెట్ డేటింగ్, పెళ్లిపై కంగనా షాకింగ్ రియాక్షన్! తాను నిజాయితిగా కర్రీ పాయింట్ నడిపిస్తున్నానని, ఎవరి ఎన్ని తప్పుడు ప్రచారం చేసిన అది తనకు ప్రమోషన్ అవుతుందంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు ఓ పెయిడ్ బ్యాచ్‌తో తన కర్రీ పాయింట్‌పై ఆసత్య ప్రచారం చేయిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే కమెడియన్ రాకింగ్ రాకేష్ ఆర్పీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. జబర్దస్త్ షోను నుంచి బయటకు వచ్చాక ఆర్పీ కర్రీ పాయింట్ పెట్టి ఫేమస్ అయ్యాడు కదా? దీనికి కారణం జబర్దస్త్ షోనే అంటారా? అని అడగ్గా.. ‘ఎవరికై సరే ఆ కామెడీ షో భిక్షే. ఎవరూ ఏం చేసిన కూడా అది జబర్దస్త్ భిక్షే’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: సుమంత్‌తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడైన ఆయనను కలిశారా? అని అడగ్గా.. ‘లేదు.. అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు’ అంటూ పరోక్షంగా ఆర్పీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చాక ఆయన ఫుల్ ట్రోల్ చేశాడు. అక్కడ ఫుడ్ బాగుండదంటూ విమర్శలు చేశాడు. ఇప్పుడు వాటికి పుల్‌స్టాప్ కూడా పడింది. కానీ ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారని అడగ్గా.. జనాలకు అంతా తెలుసని, ఎవరో ఏదో మాట్లాడారని.. అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే ఈ విలువైన సమయం వృధా అనుకుంటున్నానంటూ ఆసక్తికర షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు రాకేష్. -
''ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ''.. రిలీజ్ డేట్ ఫిక్స్
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహా రావు దర్శకత్వం వహించారు. కామెడీ హారర్ చిత్రాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. .'ఈ సినిమాను కశ్మీర్, హైదరాబాద్‌లో షూట్ చేశాం. మంచి అద్భుతమైన కంటెంట్‌తో తెరకెక్కించాం. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి 76 సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇందులో మంచి అద్భుతమైన కామెడీ హారర్ ఉంది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ బిజీగా ఉన్నా తను ఈ చిత్రంలో మంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో నటించిన యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు హార్రర్,థ్రిల్లర్ కామెడీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నాం.' అని అన్నారు. -
రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
-
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl)