
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్‌గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను.
మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్.
ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్‌గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను.
ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్‌గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment