release
-
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓజీ సంభవం పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. Maameyyyyy!!!The Blast is here 💥💥#OGSambavam from #GoodBadUgly 🔥🔥https://t.co/FWr6nWOpB5In cinemas April 10th.— Mythri Movie Makers (@MythriOfficial) March 18, 2025 -
ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్
నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ద్వారానే నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ విడుదలైన పదేళ్లు పూర్తి కావడంతో మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు.ఇలాంటి అరుదైన సినిమాలు తరచుగా రావని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. మీలో ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే తప్పుకుండా థియేటర్లకు వెళ్లి చూడాలని అభిమానులను కోరారు. నేటి యువతరం తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఎవడే సుబ్రమణ్యం ఒకటని ఆయన తెలిపారు. ఈ జనరేషన్‌కు మూవీ కథ సరిగ్గా సెట్ అవుతుందన్నారు. గత పదేళ్లలో చాలా చిత్రాలు వచ్చాయి.. కానీ ఆ టైమ్‌లో చూడని వాళ్లు ఎవరైనా ఉంటే చూడాలని కోరారు. ఈ సినిమా చూసి కనీసం ఒకశాతం మార్పు వచ్చినా చాలని నాగ్ అశ్విన్ వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. ఎవడే సుబ్రమణ్యం మూవీ ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం ఎవరైనా మిస్సయితే ఎంచక్కా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్టైనర్ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025 -
'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తున్నాడు
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామ్ చరణ్ లవ్ ఎంటర్టైనర్ ఆరెంజ్‌ను రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఇటీవల మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు థియేటర్లలో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యుగానికి ఒక్కడు(ఆయిరత్తిల్ ఒరువన్) (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్ హిట్‌గా నిలిచింది. ఈ విజువల్ వండర్ మూవీకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా యుగానికి ఒక్కడు దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో రీరిలీజ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో అందుబాబులో ఉంది. తమిళ వర్షన్ సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.From gritty battles to heart-stopping drama❤️🔥Witness @Karthi_Offl's most captivating and raw performance in #YuganikiOkkadu on the big screens once again 🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14thBook your tickets now! -- https://t.co/Y4GE3fy2MiAP & TG,… pic.twitter.com/fNsmtD2UwL— Primeshow Entertainment (@Primeshowtweets) March 10, 2025 -
దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్ విడుదల
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జైలు నుంచి విడుదలయ్యారు. దేశంలో స్వల్పకాలిక మార్షల్ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన జనవరి చివరిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని నిన్న(శుక్రవారం) ఆదేశాలు జారీ చేసింది.కాగా, యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే.దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి.అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
ఒక రోజు ముందే వినోదం
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్లో రూపొందిన ‘మ్యాడ్’ (2023) ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించి, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఈ హీరోల కాంబినేషన్లోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 29న విడుదల కావాల్సింది. అయితే ఆ రోజు అమావాస్య కావడంతో పంపిణీదారుల విజ్ఞప్తి మేరకు ఒకరోజు ముందే 28న విడుదల చేయనున్నామని చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన కల్యాణ్ శంకర్ మలి భాగాన్ని కూడా తెరకెక్కించారు. -
వంశీపై అక్రమ కేసు.. వీడియో బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.💣 Truth Bomb 💣సత్యమేవ జయతేతీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..! -
టాలీవుడ్లో ఇప్పుడదే ట్రెండ్.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..!
టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. The wait is over! 🎬✨Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025 -
ఈ సినిమాపై కొందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే లైలా మూవీ రిలీజ్‌కు ముందు అభిమానులకు విజ్ఞప్తి చేశారు మన యంగ్ హీరో. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్తే. ఫైనల్‌గా లైలా విడుదలవుతోంది. కానీ మధ్యలో చాలా అపార్థాలు జరిగాయి. మా టీమ్ తరఫున క్షమాపణలు చెప్పాను మా తప్పు లేకపోయినా. అందరం కోపాలు తగ్గించుకుని.. మిస్ అండర్స్టాండిగ్స్ తగ్గించుకోవాలి. నేను మీలో ఒకడిని. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పాత్రలు చేయగలను. మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాం. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. చాలామంది కొత్త నటులు, డైరెక్టర్ లైఫ్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఇప్పటికైనా అందరం కలిసి సినిమాను గెలిపిద్దాం. మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి' అంటూ వీడియోను పోస్ట్ చేశారు.పృథ్వీ వ్యాఖ్యలతో వివాదం..లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. తాజాగా నటుడు పృథ్వీ సైతం తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు.#laila pic.twitter.com/pc1Mcpq6ho— VishwakSen (@VishwakSenActor) February 13, 2025 -
రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదలచేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు. మొత్తం 11 మంది విడుదల ఫోగెల్ విడుదల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు. రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్‌ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు. -
రష్యా చెర నుంచి విడుదలైన అమెరికా టీచర్
వాషింగ్టన్: అన్యాయంగా రష్యా కారాగారంలో మూడేళ్లు జైలు జీవితం అనుభవించిన అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ ఎట్టకేలకు ట్రంప్ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. రష్యా నుంచి బయల్దేరిన ఫోగెల్ మంగళవారం రాత్రి అమెరికాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వైమానిక స్థావరంలో దిగారు. తర్వాత నేరుగా అధ్యక్ష భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. తన విడుదలకు అవిశ్రాంతంగా కృషిచేసినందుకు ట్రంప్‌కు ఆయన మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో మాట్లాడి యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించిన వేళ పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ స్వయంగా రష్యాకు వెళ్లిమరీ ఉపాధ్యాయుడిని వెంట తీసుకురావడం విశేషం. తమ పౌరుని విడుదల కోసం చూపిన స్థాయిలోనే ట్రంప్ సర్కార్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చొరవ చూపుతుందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ ఇదే చొరవను కొనసాగించాలని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. ఎవరీ ఫోగెల్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఫోగెల్ రష్యాలోని మాస్కో సిటీలో ఆంగ్లో– అమెరికన్ పాఠశాలలో దశాబ్దకాలంపాటు టీచర్‌గా చరిత్ర పాఠ్యాంశాలను బోధించారు. ఉపాధ్యాయునిగా ఉన్న కాలంలోనే మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో 2021 ఆగస్ట్‌లో ఆయనను రష్యా పోలీసులు అరెస్ట్‌చేశారు. చట్టవ్యతిరేకంగా 17 గ్రాముల గంజాయిని రష్యాకు తీసుకొస్తున్నారని ఆయనపై నేరాభియోగాలు మోపింది. 2022 జూన్‌లో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష వేశారు. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తీవ్రమైన వెన్ను సమస్య కారణంగా వైద్యుల సలహా మేరకే ఆయన గంజాయిని వాడుతూ, వెంట తెచ్చుకున్నారని అమెరికా పేర్కొంది. ఈయనను ‘‘పొరపాటున అరెస్ట్‌కు గురైన వ్యక్తి’గా అమెరికా అభివరి్ణంచింది. ఎలాగైనా ఆయనను విడుదలచేసి తీసుకొస్తామని నాటి బైడెన్ ప్రభుత్వం చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా అమెరికా జైళ్లో మగ్గిపోతున్న ఒక రష్యా పౌరుడిని విడుదలచేసి అందుకు ప్రతిగా టీచర్ ఫోగెల్ విడుదలను ట్రంప్ సుసాధ్యం చేశారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ ఖైదీల పరస్పర మారి్పడి అంశంపై వైట్‌హౌస్ స్పందించలేదు. త్వరలో మరో అమెరికన్ విడుదలై స్వదేశానికి రాబోతున్నారని తెలుస్తోంది. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళంలో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటనతో మెప్పించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది. పివీఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఈనెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు వర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాం. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం " అని అన్నారు. -
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్
రామ్ చరణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ అభిమానులను రొమాంటిక్ ఎంటర్టైనర్ అలరించనుంది. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్ ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆరెంజ్ సినిమా (Orange Movie) రీ రిలీజ్ కానుంది. ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న థియేటర్లలో సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఈ చిత్రంలో షాజాన్ పదమ్సీ, ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాగ బాబు కీలక పాత్రల్లో నటించారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. -
లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ రోజే ఏకంగా ఐదు సినిమాలు!
'ఫిబ్రవరి అంటే వెంటనే... సినిమా లవర్స్‌కు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రేమ నేపథ్యంలో వచ్చే చిత్రాలను విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తే, ప్రేక్షకులు కూడా లవ్ మూవీస్‌ని ఆశిస్తారు. దానికి తగ్గట్టే ఫిబ్రవరిలో అరడజను ప్రేమకథా చిత్రాలు థియేటర్స్‌లోకి రానున్నాయి. వీటితో పాటు యాక్షన్, ఎమోషనల్ మూవీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి మరింత పెరగనుంది. 'రాజుగాడి లవ్‌స్టోరీ..‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన సినిమా ‘తండేల్’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... ఉత్తరాంధ్ర మత్స్యకారులు జీవనో΄ాధి కోసం గుజరాత్‌కు వెళ్తారు. అక్కడి సముద్ర తీరంలో తెలియక ఇండియన్ బోర్డర్ దాటి, పాకిస్తాన్ కోస్టు గార్డులకు బంధీలుగా చిక్కుతారు. వీరందరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ‘తండేల్’ సినిమా కథ అని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలోని రాజు పాత్ర కోసం నాగచైతన్య, ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు.సాయిరామ్ శంకర్ 'ఒక పథకం ప్రకారం'..ఇక ‘ఒక పథకం ప్రకారం’ అంటూ ఇదే రోజు థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు హీరో సాయిరామ్ శంకర్. ‘143, బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లో నటించిన సాయిరామ్ శంకర్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఒక పథకం ప్రకారం’. క్రైమ్ మిస్టరీగా రానున్న ఈ మూవీలో సాయిరామ్ శంకర్ అడ్వొకేట్ పాత్రలో, సముద్ర ఖని పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. గార్లపాటి రమేష్‌తో కలిసి ఈ చిత్రదర్శక–నిర్మాత వినోద్ కుమార్ విజయన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. శ్రుతీ సోధి, ఆషిమా నర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఆర్ఆర్ అందించారు. ఇక ఈ సినిమాల కంటే ముందు అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘రాచరికం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శక–ద్వయం సురేష్ లంకపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో ఈ మూవీని ఈశ్వర్ నిర్మించగా, ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇటు ప్రేమ... అటు సంఘర్షణవిశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్‌లో నటిస్తున్నారు విశ్వక్ సేన్. రామ్ నారాయణ్ డైరెక్షన్లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం దిల్ రూబా..మరోవైపు ఇటీవలే ‘క’తో ఓ మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లవర్స్ డే రోజున ‘దిల్ రూబా’ అనే లవ్ అండ్ యాక్షన్ మూవీతో థియేటర్స్‌లోకి వస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా, నాజియా డేవిసన్ మరో కీలక ΄ాత్రలో నటించిన ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిన ఓ అబ్బాయి, మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లుగా తెలిసింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ రెండు సిటీ లవ్‌స్టోరీ మూవీస్‌తో పాటు ఓ గ్రామీణ లవ్‌స్టోరీ కూడా ఇదే రోజున థియేటర్స్‌లోకి రానుంది. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలు తీసిన దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి, మరో నిర్మాత రాహుల్ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే తెలంగాణ గ్రామీణ ప్రేమకథ తీశారు. ఖమ్మం– వరంగల్ల సరిహద్దు నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో సాయిలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ గ్లింప్స్ వీడియోలో ఈ మూవీని ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. తాతా మనవడు... తండ్రీకొడుకుఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవ్‌స్టోరీ మూవీస్ మాత్రమే కాదు.. ఎమోషనల్ చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ మూవీలో మాత్రం తాతా మనవళ్లుగా నటించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కానీ గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు.ధన్‌రాజ్ 'రామం రాఘవం'నటుడు ధన్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ మూవీ కూడా ఫిబ్రవరి 14నే రిలీజ్ కానుంది. తండ్రి పాత్రలో సముద్రఖని, తనయుడి పాత్రలో ధన్‌రాజ్ కనిపిస్తారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీని గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకునే తండ్రి, తనను తన తండ్రి సరిగా అర్థం చేసుకోవడం లేదనుకునే ఓ కొడుకు మధ్య సాగే భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో ఈ ‘రామం రాఘవం’ మూవీ రానుంది.సందీప్ కిషన్ మజాకా..గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరి పేరు భైరవకోన’ అనే ఓ హారర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు సందీప్ కిషన్. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మజాకా’ మూవీతో సందీప్ కిషన్ వస్తున్నారు. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేశ్, ‘మన్మధుడు’ ఫేమ్ నటి అన్షు ప్రధాన ΄ాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘మజాకా’. ‘నేను లోకల్, ధమాకా’ చిత్రాల ఫేమ్ నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా నిర్మించిన ఈ ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.శివరాత్రికి నితిన్..శివరాత్రికి ‘తమ్ముడు’గా థియేటర్స్‌లోకి రానున్నారు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘తమ్ముడు’ అనే మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.ఇక సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘జటాధర’. శాస్త్రీయ, పౌరాణిక అంశాలతో ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రేరణా అరోరా, సివిన్ నారం, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో ‘జటాధర’ మూవీని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు, జటాధర’ రిలీజ్ డేట్స్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.అలాగే ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో ఆది పినిశెట్టి ‘శబ్దం’ చేయనున్నారు. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా మూవీ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ల్స్, ఎం.ఎస్. భాస్కర్ ఇతర కీలక ΄ాత్రల్లో ఈ మూవీని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఫిబ్రవరి నెల ఆరంభానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యేందుకు మరికొన్ని సినిమాలు బరిలోకి రావొచ్చు లేదా ఆల్రెడీ ఫిబ్రవరి రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల్లో విడుదల వాయిదా పడే అవకావం లేకపోలేదు. మరి... ఫిబ్రవరిలో ఫైనల్ రిలీజ్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న సినిమాలేవో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అనువాదాలు రెడీ..అజిత్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘విదాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ నటించారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ్ర΄÷డక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.ఇక అనిఖా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని, ఫిబ్రవరిలోనే రిలీజ్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.2022లో విడుదలైన ‘లవ్ టుడే’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు నటుడిగా దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరోగా నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. తమిళంలో లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా, కేఎస్ రవికుమార్, మిస్కిన్, వి.జె. సిద్ధు, హర్షద్ ఖాన్లు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. తెలుగులోనూ ఈ మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
రిలీజ్‌కు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. సినీ ప్రియులకు బంపరాఫర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్‌నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025వివాదాలతో ఆలస్యం..ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు. -
బందీల విడుదల..జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్:గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు,పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. వారిని విడిపించేందుకు ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. కొత్త ఏడాది 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని జెలెన్స్కీ తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు,పౌరుల విడుదలలో మిత్ర దేశాల పాత్ర కీలకమని తెలిపారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాది ముగియాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ ఆకాంక్షించారు.2022లో ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 30 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.In 2024, we managed to bring 1,358 of our people back home to Ukraine from Russian captivity. These are our soldiers and civilians.Their fates are different, but they are equally happy to return home. Each and every one of them for the sake of whom a large Ukrainian team… pic.twitter.com/AxTPYlmYhv— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 3, 2025 ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
తెలుగులో రిలీజ్ అవుతోన్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
గతేడాది తమిళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘డా..డా’. ఈ చిత్రంలో కవిన్, అపర్ణ దాస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. గణేశ్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సక్సెస్ సాధించింది.కోలీవుడ్‌లో సూపర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ మూవీని తీసుకొస్తున్నారు. పా.. పా పేరుతో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 3న ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఇటీవలే విడుదల చేసిన పా.. పా.. మూవీ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నా..! 36 ఏళ్లకు విముక్తి : వైరల్ స్టోరీ
సోదరుడిని హత్య చేసిన ఆరోపణల కేసులో జీవిత ఖైదు అనుభవించి శతాధికవృద్ధుడిగా జైలునుంచి విడుదలైన ఘటన వైరల్‌గా మారింది. గత నెల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్డా కరెక్షనల్ హోం నుంచి విడుదలయ్యాడో వ్యక్తి. ఆయన పేరే 104 ఏళ్ల రసిక్ చంద్ర మోండల్. ‘‘జైలుకి ఎపుడొచ్చానో, ఎన్నేళ్లు గడిపానో గుర్తు లేదు. ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నాను’’ అంటున్న రసిక్ చంద్ర మాటలు పలువురిని ఆలోచింప చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్చక్ నివాసి రసిక్ చంద్ర. 1988లో స్వల్ప భూవివాదంలో సోదరుడిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. 1992లో మాల్డాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటికి మోండల్ వయస్సు 72 సంవత్సరాలు. కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో బెయిలుపై విడుదలయ్యాడు. కానీ దిగువ కోర్టు జీవితఖైదు విధించడం,హైకోర్టు దానిని సమర్ధించడంతో తిరిగి కరెక్షనల్ హోమ్‌కు వెళ్లక తప్పలేదు. ఆ తరువాత 2020లో పేరోలు మీద బయటికి వచ్చి, మళ్లీ 2021లో కరెక్షనల్ హోమ్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జీవిత ఖైదుగా ఉన్నాడు. ఎలా విడుదలయ్యాడుజీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి నిర్దేశించిన శిక్షాకాలంలో ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడ కుండా, సత్ర్పర్తనతో ఉంటే, జైలు నుంచి విడుదలయ్యే అర్హత ఉంటుంది. అలా 36 ఏళ్ల జైలు జీవితం తర్వాత మాల్డా కరెక్షనల్ హోమ్ నుండి 104 ఏళ్ల వృద్ధుడిగా జనజీవితంలోకి వచ్చాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన తండ్రిని విడుదల చేసినట్లు మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్ తెలిపాడు. ఈ వయసులో కూడా మోండలు ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించడం విశేషం. ఎందుకంటే మోండల్ జైలులో నిత్యం వ్యాయామం చేసేవాడట. క్రమశిక్షణతో ఉంటూ వయసుకు తగ్గట్టు ఫిట్నెస్ పెంచుకున్నాడు.అంతేకాదు మొక్కలను పెంచడం, తోటపనిలో బాగా పాలు పంచుకునేవాడు. బయటికి వచ్చాక తన అభిరుచికి తగట్టి తోట పని చేసుకుంటానని చెప్పాడు మోండల్. అంతేకాదు తాను నిర్దోషిని, పరిస్థితుల వల్ల తన పరిస్థితి ఇలా వచ్చిందని తెలిపారు. ఇన్నాళ్లుగాకుటుంబాన్ని, మనవలు మనవాళ్లతో గడిపేసమయాన్ని కోల్పోయాను అంటూ వాపోయాడు. అన్నట్టు మోండల్ భార్య మీనా ,ఇన్నాళ్లకు తన భర్త విడుదల కావడంపై సంతోషం ప్రకటించింది. -
కేసీఆర్‌కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్‌గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్‌గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్‌గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ శుక్రవారమే థియేటర్లలో పుష్ప..!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడు లేని రికార్డులు సృష్టస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.అయితే పుష్ప 2 రిలీజ్‌కు కొద్ది రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా పుష్ప ది రైజ్ పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. హిందీ వర్షన్‌ను ఈ నెల 22న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నార్త్‌లో మార్కెట్‌ను మరింత పెంచుకునే ఆలోచనతో మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే హిందీలో మాత్రమే పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. అలాగే దక్షిణాది భాషల్లోనూ రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు యూఎస్‌లో పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa - The Rise (Hindi) Re-Releasing In Cinemas on 22nd Nov 2024@alluarjun @iamRashmika @GTelefilms #PushpaTheRise #AlluArjun #RashmikaMandanna #PushpaReReleaseInCinemas pic.twitter.com/vrdSQCGqKg— Goldmines Telefilms (@GTelefilms) November 19, 2024 #PushpaTheRise USA RE RELEASE Bookings started to open 💥🪓#Pushpa2TheRule pic.twitter.com/owcQvwbF5z— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 16, 2024 #PushpaTheRise Re-Release bookings are now open at @Cinemark 💥💥🪓🪓Grab your tickets today with TUESDAY discount offers and relive the PUSHPA mania before the storm of #Pushpa2TheRule begins! 💥💥@alluarjun #Sukumar @MythriOfficial @PushpaMovie pic.twitter.com/a4UUkrBGfB— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 18, 2024 -
హోండా మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (ఫొటోలు)
-
'చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే'.. కంగువా రిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు మేకర్స్.తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈవెంట్లో సూర్యతో పాటు బాబీ డియోల్ సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌తో కంగువాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ఈ మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!)కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ మూవీలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను జేజేఆర్ ఎంటర్టైన్మెంట్, ఎల్ఎల్పీ బ్యానర్లపై యలమంచి రాణి సమర్పణలో జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ అందుకున్న గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి 'కావాలయ్యా..'అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతమందించగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. -
సూర్య 'కంగువా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కంగువా'. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చేనెల థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం కంగువా టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.కంగువా విడుదలకు మరో రెండు వారాలు ఉండడంతో చిత్రయూనిట్ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నాయకా..' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. కాగా.. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. -
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
ప్రభాస్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
టాలీవుడ్లో ఇటీవల ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరో బర్త్ డే రోజు వస్తే చాలు హిట్ సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. గతంలో మహేశ్‌బాబుతో పాటు పలువురు హీరోల సినిమాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. ఇకపోతే ఈనెల రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే రానుంది. ఈనెల 23న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మిస్టర్ ఫర్ఫెక్ట్ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 22న థియేటర్లలో డార్లింగ్ ప్రభాస్ సినిమా సందడి చేయనుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2011లో వచ్చిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మరోసారి బిగ్ స్క్రీన్‌పై అలరించనుంది.కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. కె దశరధ్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ మోహన్, నాసర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.The Darling we all adore is making a grand return! 😍Join us on October 22nd to celebrate our Rebel Star #Prabhas with #MrPerfect ❤️Theatres lo Dhol Dhol Dhol Bhale 😎🥁@directordasarad @ThisIsDSP @MsKajalAggarwal @taapsee @SVC_official @adityamusic pic.twitter.com/uGk4AY2nh7— Sri Venkateswara Creations (@SVC_official) October 15, 2024 -
రజినీకాంత్ లేటేస్ట్ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.తలైవా కోసం తప్పుకున్న కంగువా..తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్లో సూర్య అధికారికంగా ప్రకటించారు. -
ఇంద్ర మూవీ రీ రిలీజ్.. చిత్రబృందానికి మెగాస్టార్ స్పెషల్ ట్రీట్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈనెల 22న ఆయన బర్త్ డేను తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు మరింత స్పెషల్‌గా మారింది. ఎందుకంటే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ హంగామా చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ ఇంద్ర మూవీ టీంను ఘనంగా సత్కరించారు. ఇంద్ర క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేసుకుంటూ నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ బి గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథ అందించిన చిన్ని క్రిష్ణను ఆయన సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోను చిరంజీవి తన ట్విటర్లో పోస్ట్ చేశారు.అదిరిపోయే కలెక్షన్స్దాదాపు 22 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ ఇంద్ర. మొదటి రోజు అదిరిపోయే రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3.05 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇంద్ర' క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, 'ఇంద్ర' టీంకి 'చిరు' సత్కారం! అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024 -
మెగాస్టార్‌తో డ్యాన్స్ చేసేందుకు భయపడ్డా: ఇంద్ర హీరోయిన్
తనదైన నటనతో అభిమానుల గుండెల్లో ప్రత్యేకస్థానం దక్కించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈనెల 22న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే.. ఇంద్ర రీ రిలీజ్ కావడంపై స్పందించింది. చిరంజీవి పక్కన నటించడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని అన్నారు. ఆయనతో కలిసి స్టెప్పులు వేయడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇంద్ర షూటింగ్ సమయంలో చిరుతో డ్యాన్స్ వేసేందుకు భయపడేదాన్ని అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగిన సమయంలో చాలా ఎంజాయ్ చేశానని.. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారని వెల్లడించారు. మరోసారి ఇంద్ర మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. బిగ్స్క్రీన్పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోనాలి బింద్రే తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తన ట్విటర్లో షేర్ చేశారు. Relive the magic of #INDRA with @iamsonalibendre as she takes us down memory lane and shares her excitement for the August 22nd re-release. 🎬https://t.co/RBGJ5iBcYq#Indra4K Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal #AarthiAgarwal @tejasajja123 #ManiSharma @GkParuchuri… pic.twitter.com/KFFkCHHlze— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 21, 2024 -
'ఆ డైలాగ్ వింటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది'.. మెగాస్టార్ స్పెషల్ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం బిగ్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అయితే దాదాపు 22 ఏళ్ల తర్వాత మరోసారి ఈ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ..'ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి ఆ డైలాగ్ వినగానే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం కథ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. అందుకే ఇప్పటికీ ఇంద్ర గురించి మాట్లాడుకుంటున్నాం. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న చిత్రం ఇంద్ర. ఒక్కమాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రాలకు నిర్వచనం ఇంద్ర. 22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ మాట్లాడిన స్పెషల్ వీడియోను వైజయంతి మూవీస్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర 4కే వెర్షన్ లో మరోసారి వస్తోంది. ఆగస్ట్ 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ కాగా.. టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమదైన నటనతో మెప్పించారు.Indra Sena Reddy is back 💥💥💥Our dearest Megastar @KChiruTweets garu reflects on the journey of #INDRA and shares his excitement for the worldwide grand re-release on August 22nd. 🤗https://t.co/wdY0I7hZiE#Indra4K @AshwiniDuttCh #BGopal @iamsonalibendre #AarthiAgarwal… pic.twitter.com/gZWrBcBvV8— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 20, 2024 -
దేవర కు కలిసోస్తున్న కాపీ ట్యూన్స్.. త్వరలో మూడో సింగల్ రిలీజ్...
-
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పేపర్ లీక్ కారణంగా రెండుసార్లు గ్రూప్-1 రద్దయ్యిందని భట్టి విక్రమార్క అన్నారు.ఉద్యోగుల భర్తీ అంశంలో అధికారులతో రెండు కమిటీలు వేశారని.. ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 13వేల ఖాళీలను గుర్తించామని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పోటీ పరీక్షలను వాయిదా వేశామని.. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.నోటిఫికేషన్లు.. పోస్టుల భర్తీ ఇలా..గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడించారు. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు జరపనున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మేలో పరీక్షలు జరపనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు జరపనున్నారు.వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు జరపనున్నారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు జరపనున్నారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. -
INDIA bloc: విపక్షాల గొంతు నొక్కుతోంది
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది. ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. -
మెగాస్టార్ బర్త్ డే.. రీ రిలీజవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ!
టాలీవుడ్లో కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయినా చాలా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. ఇటీవల హీరోల బర్త్ డే రోజున బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సైతం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఇంద్ర మూవీని మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2002లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. కాగా.. ఆగస్టు 22న వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్ల పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే 50 స్వర్ణోత్సవాల వేడుకతో పాటు చిరంజీవి బర్త్ డే కావడంతో ఇంద్ర సినిమాను మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024 -
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.⇒ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.⇒ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ⇒ హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. ⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. -
ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసిన మురళి మోహన్!
చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "నేను-కీర్తన". ఈ సినిమా ద్వారా చిమటా రమేష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి "కొంచెం కొంచెం.. గుడుగుడు గుంజం" అనే లిరికల్ వీడియో ఐటమ్ సాంగ్‌ను నటుడు మురళిమోహన్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ..'ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను - కీర్తన మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. -
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందాక ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 69,870 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమరి్పంచారు. దర్శన టికెట్లు లేని వారికి స్వామివారి దర్శనం 24 గంటల సమయం పడుతోంది. -
నాన్న నటించిన ఆ సినిమా అంటే చాలా ఇష్టం: మహేశ్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం 'హరోం హర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మహేశ్ బాబుతో సుధీర్ బాబు మాట్లాడిన ఫోన్ రికార్డ్ ఆడియోను ప్లే చేశారు. వీరి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధాలిచ్చారు. మొదటిసారి గన్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అని సుధీర్ ప్రశ్నించగా.. టక్కరి దొంగ సినిమాలో ఎక్కువసార్లు గన్స్ వాడా.. కానీ గన్ కాల్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని మహేశ్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మోసగాళ్లకు మోసగాడు గుర్తొచ్చింది.గన్స్ చూపించే సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది అని సుధీర్ బాబు అడిగాడు. నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను వందసార్లు చూశానని మహేశ్ అన్నారు. హరోంహరలో నీకు బాగా నచ్చిన పాట ఏదని అడగ్గా.. టైటిల్ సాంగ్ అని మహేశ్ ఆన్సరిచ్చారు. హరోంహర ట్రైలర్లో నీకు నచ్చిన అంశాలు ఏంటి? అని సుధీర్ ప్రశ్నించాడు. ఈ సినిమాలో నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్.. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది.. అని మహేశ్ బాబు అన్నారు. మీరు నటించిన నిజం సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా? అని సుధీర్ బాబు అడిగారు. నిజం చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్. నా సినిమాల్లో నిజం ఒక ఫెవరేట్ ఫిల్మ్ అని మహేశ్ బాబు అన్నారు. కాగా.. సుధీర్ బాబు నటించిన హరోం హర జూన్ 14 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు హరోం హర పెద్ద హిట్ అవ్వాలని.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. Here we go from the man himself @urstrulyMahesh about #HaromHara#HaromHaraOnJune14th pic.twitter.com/e5iUutn4ML— Sudheer Babu (@isudheerbabu) June 11, 2024 -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్ నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
విక్రమ్ తంగలాన్.. ఆ నెలలోనే రిలీజ్‌కు ప్లాన్!
పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడి యో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్, పార్వతి, డేనియల్ కల్టిగరోన్, పశుప తి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలోని గోల్డ్ మైన్ కార్మికుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. మొదట తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.కాగా తాజాగా చిత్రాన్ని జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో తంగలాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందించారు. -
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..'సినిమా అంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్లు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ..' మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమానే నటరత్నాలు. డైరెక్టర్ శివ నాగు ఈ కథ చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు గనే యువత చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రంలో అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషించారు. -
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వజక్కు. 2021లోనే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య వివాదమే. అయితే మూడేళ్ల పాటు ఓపికగా ఉన్న డైరెక్టర్ సడన్‌గా షాకిచ్చాడు. ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశాడు.తాజాగా వజక్కు చిత్రాన్ని వీమియో అనే ప్లాట్ఫామ్లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్లోడ్ చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాగే ఉంటుంది. వీమియోలో ఈ చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని శశిధరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారుస్పందించిన టొవినో థామస్సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని.. తనకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి డైరెక్టరే కారణమని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రి రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. -
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
కోలీవుడ్‌లో తెరకెక్కించిన సినిమాలు హిట్ అయితే ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కోలీవుడ్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ టాలీవుడ్ సిద్ధమయ్యారు. తమిళ మూవీ యతిసై తెలుగు డబ్బింగ్ వర్షన్ మే 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ హిస్టారికల్ గతేడాదిలోనే ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే తమిళంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా యతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్స్‌ను సినిమా యూనిట్ ప్రకటించింది.ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాషలకు సంబంధించి టీజర్స్ రిలీజ్ చేశారు. యుద్ధ సన్నివేశాలు, పాండ్య రాజులను ఎదురించి అసమాన పోరాటం చేసిన ఓ తెగ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై రూ.20 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఓటీటీలో రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో థియేటర్లలో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు హిందీలో ఒకే రోజు థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు ధరణి రాసేంద్రన్ దర్శకత్వం వహించారుమొదట టీజర్స్, ట్రైలర్స్ రిలీజైన తర్వాత కోలీవుడ్ వర్గాల యాతిసై మూవీని బాహుబలితో పోల్చారు. కానీ ఈ సినిమా బాహుబలికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్లు మాత్రమే రాబట్టింది -
సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'సీతా కల్యాణ వైభోగమే'. ఈ చిత్రాన్ని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీ కాదు. మా మీద నమ్మకముంచిన నిర్మాత రాచాల యుగంధర్‌కు థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్ మంచి కమర్షియల్ సినిమా తీశారు. గగన్ విహారి చాలా వైల్డ్‌గా నటించారు. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన. ఆ చిత్రానికి కూడా యుగంధర్ సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతమందించారు. -
చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సామాజిక న్యాయ వేదిక (ఎస్జేఎఫ్) సూపర్ సిక్స్ (ఆరు) ప్రశ్నలు సంధించింది. సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బహిరంగ లేఖను విడుదల చేసింది. ఎస్జేఎఫ్ రాష్ట్ర చైర్మన్ యర్రాకుల తులసీరామ్ యాదవ్, కో చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పంచాది రంగారావు, కో కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. తాము సంధించిన సూపర్ సిక్స్ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ప్రశ్నలివీ.. ► రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు, స్థానిక సంస్థలు, గ్రామ, వార్డు వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోరి్సంగ్ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలు చేస్తోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సంపూర్ణ మహిళా సాధికారతకు మూలాలైన విద్య, ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మీకు (చంద్రబాబు) ఉన్న ఇబ్బందేవిుటి? మీరు ఆ దిశగా ఎందుకు హామీ ఇవ్వలేక పోతున్నారు? ► బీసీ, పేద ఓసీ, కాపులు, మహిళలకు సమన్యాయం–సామాజిక న్యాయం చేయడానికి మీకు ఇబ్బందేవిుటి? ► బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బాహాటంగా హామీ ఇస్తున్న మీరు.. విద్య, ఉద్యోగాల్లో కూడా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఎందుకు ఇవ్వడంలేదు? ఈ ద్వంద్వ నీతి ఏమిటి? ఈ ద్వంద్వ విధానం దేనికి సంకేతం? ► అగ్రవర్ణ పేదలకు (బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ తదితరులకు) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగించడానికి మీకు ఇబ్బందేవిుటి? ► మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా అటు బీసీలు, ఇటు ఓసీలకు ఇబ్బంది లేకుండా 10 శాతం ప్రత్యేక బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి న్యాయం చేయడానికి మీకున్న ఇబ్బందేవిుటి? ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సబ్‌ప్లాన్ మాదిరిగా ఓసీ, కాపు సబ్‌ప్లాన్ అమలు చేస్తానని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు? కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయడం కాకుండా వారికి అధికారంలో ఎందుకు పరిగణనలోని తీసుకోవడంలేదు అంటూ చంద్రబాబుకు ఎస్జేఎఫ్ ప్రశ్నలు సంధించింది. -
సరికొత్త టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. క్రేజీ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘అందుకోవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. 'మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు. లెజెండరీ సింగర్ చిత్ర మా పాటను పాడటం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అని అన్నారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా మూవీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి అందుకోవా అనే పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎబెనెజర్ పాల్ సంగీతమందిస్తున్నారు. -
లిక్కర్ కేసు: తీహార్ జైలు నుంచి ‘ఆప్’ ఎంపీ రిలీజ్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్‌సింగ్‌కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్‌సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్‌సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ను కలిశారు. #WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4 — ANI (@ANI) April 3, 2024 ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు -
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల అప్పుడే..
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనుంది. గత పదేళ్లుగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకట్టుకునేలా మేనిఫెస్టోను తయారు చేసింది. జైపూర్‌లో ఏప్రిల్ 6న జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కలిసి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారని ఆ పార్టీ రాజస్థాన్ ఛీఫ్ గోవింద్ సింగ్ దోటసార తెలిపారు. కాంగ్రెస్ విడుదల చేయనున్న మేనిఫెస్టోను ఫ్రేమింగ్ కమిటీకి నేతృత్వం వహించిన మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం "ప్రజల మేనిఫెస్టో"గా అభివర్ణించారు. ఈ మేనిఫెస్టో తయారీ కోసం కాంగ్రెస్ పార్టీ జనవరిలో ప్రజల నుంచి ఆలోచనలు, సూచనలను ఆహ్వానించింది. -
గోదావరి నేపథ్యంలో వస్తోన్న లవ్ స్టోరీ.. సాంగ్ రిలీజ్!
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శశివదనే. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'గోదారి అటు వైపో' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ శశివదనే, డీజే పిల్లా అనే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్గా విడుదలైన టీజర్ ఆడియన్స్ ఊహించని స్పందన వచ్చింది. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. -
భిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలకు కాస్త సినిమా టిక్ సన్నివేశాలను కలిపితే అది మరింత జనరంజక చిత్రంగా మారుతుంది. ఈ తరహా చిత్రాలకు పెద్దగా క్యాస్టింగ్ గురించి పట్టించుకోరు. కథ, కథనాలు బిగువుగా ఉంటే చాలు.. అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం వెప్పమ్ కుళీర్ మళై. హాష్ ట్యాగ్ ఎఫ్డీఎఫ్ఎస్ పతాకంపై ధీరవ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఇస్మత్ భాను హీరోయిన్గా పరిచయమవుతోంది. పస్కల్ వేదముత్తు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లల పుట్టుక గురించి ఆవిష్కరించిన చిత్రమిది. పెళ్లి తరువాత ఆ దంపతులకు పిల్లలు పుట్టక పోతే కుటుంబ సభ్యుల నుంచి, ఊరు జనం వరకూ ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆధునిక సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా కలిగి సంతానం కారణంగా ఎలాంటి మనోవేదనకు గురవుతారు? వంటి అంశాలను, సహజ సిద్ధంగా పిల్లలు పుట్టడానికి కారణాలు అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రమే వెప్పమ్ కళీర్ మళై. ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, నటి రమ, మాస్టర్ కార్తీకేయన్, దేవ్హబిబుల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శంకర్ రంగరాజన్ సంగీతాన్ని, పృధ్వీ రాజేంద్రన్ ఛాయాగ్రహణం అందించారు. దర్శకుడు ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకుని వైవిధ్యంగా తెరకెక్కించారు. ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ నుంచి కొత్త టీజర్
ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్ హెచ్. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. వెస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘వెల్కమ్ టు మై కింగ్డమ్’, ‘బెండ్ ఫర్ యువర్ కింగ్’, ‘..నెవర్’ అనే డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ రీ బూట్ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011)’, ‘డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2014), ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. -
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ఆ సూపర్ హిట్ సినిమా మళ్లీ!
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. యూత్‌లో అతని మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. కానీ ఎప్పటికీ అతని నటించిన సినిమాలను ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్‌ను మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం లభించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవల టాలీవుడ్లో పాత సినిమాలను రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా మళ్లీ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజై అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా మార్చి 21న థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. -
స్టార్ హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ప్రేమికుడు చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు, శోభారాణి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. '30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవని చూసి స్ప్రింగ్‌లు ఏమన్నా మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా' అని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..' ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి విజయం అందుకుంటుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శివనాగుమాట్లాడుతూ.. 'ప్రేమికుడు ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించేంది. అప్పుడున్న బడ్జెట్‌కి రూ.3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు కూడా రూ.30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా డాన్సులు ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా.. కేటి కుంజుమన్ నిర్మించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించననున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 17 నుంచి 31 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరపనున్నారు ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. -
నలుగురికే లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోక్‌సభ స్థానాలు కేటాయిస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధిష్టానం.. ప్రస్తుతం ప్రకటించిన నలుగురు అభ్యర్థులకు తొలి జాబితాలోనే చోటు కల్పించింది. -
'ఒకసారి డేట్‌కు పిలిస్తే కదా తెలిసేది'.. టీజర్‌తోనే భయపెట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఖరీఫ్ వర్షాభావం వల్ల, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►సాగుచేసిన ప్రతి ఎకరాకూడా ఇ-క్రాప్ కింద నమోదు చేస్తున్నాం ►ఎవరు ఎంత సాగు చేశారు? ఏ పంట వేశారనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తోంది ►రైతులు ప్రకృతివైపరీత్యాల కారణంగా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం ►ఇలాంటి గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోకి వచ్చింది ►అవినీతికి, వివక్షకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నాం ►మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ►దీనికి నేను చాలా సంతోషిప్తున్నాను, ఆనందపడుతున్నాను ►ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే నమ్మకాన్ని కలిగించాం ►తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేశాం ►రైతులు నష్టపోకుండా అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకున్నాం ►3.25లక్షల టన్నుల రంగుమారిన, తడిసన ధాన్యాన్ని కొనుగోలు చేశాం ►అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం తోడుగా నిలిచి, అందాల్సిన సహాయాన్ని సమయానికే ఇస్తామన్న భరోసాను కల్పించాం ►వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సుమారుగా రూ.1300 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నాం ►మొట్టమొదటి సారిగా ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లు రైతులకు చెల్లించాం ►గత ఐదేళ్లతో పోలిస్తే రూ. 3,411 కోట్లు మాత్రమే రైతులకు బీమా ఇచ్చారు ►ఆ ఐదేళ్లలో ప్రతి ఏటా కరువు వస్తున్నా కేవలం 30 లక్షలమంది రైతులకు మాత్రమే 3,411 కోట్లు మాత్రమే ఇచ్చారు ►ఈ సంవత్సరంలో కాస్త వర్షాభావ పరిస్థితులు తప్పిస్తే ప్రతిఏటా కూడా మంచి వర్షాలు పడ్డాయి ►నాలుగేళ్లకాలంలో ఒక్క మండలాన్నికూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు ►అలాంటి పరిస్థితుల్లో కూడా 54 లక్షలమందికిపైగా రైతులకు బీమాను అందించిన తోడుగా నిలిచాం ►ఇ-క్రాప్ చేసి రైతులకు ఆటోమేటిక్‌గా ఉచిత పంట బీమాను అందిస్తున్నాం ►ఈ 58 నెలల కాలంలో కొత్త ఒరవడిని తీసుకు రాగలిగాం ►పెట్టుబడి సహాయంగా ఏటా రూ.13500 ఇస్తున్నాం ►గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు ►63 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమిమాత్రమే ఉంది ►87 శాతం మంది రైతులకు హెక్టారులోపే భూమి ►తాజాగా సబ్ డివిజన్లు జరిగిన తర్వాత వచ్చిన డేటా ఇది ►క్రమం తప్పకుండా వీరికి రైతు భరోసా అందుతోంది ►ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల కరువు మండలాలను ప్రకటించాం ►వారికి కూడా ఇన్పుట్ సడ్సిడీ ఇస్తున్నాం ►అలాగే తుపాన్ కారణంగా నష్టపోయిన వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీ విడుదలచేస్తున్నాం ►వీరందరికీ కూడా ఈ జూన్‌లో బీమా డబ్బు కూడా చెల్లిస్తాం ►రైతులు ఎక్కడా కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ►ఉలవలు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న లాంటి పంటలకు సంబంధించి విత్తనాలు పంపిణీ చేశాం ►తుపాను వల్ల డిసెంబర్ 4న రైతులకు నష్టం జరిగితే డిసెంబర్ 8 కల్లా వారికి సబ్సిడీపై విత్తనాలు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశాం ►ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన విధంగా తోడుగా నిలుస్తుంది -
పాన్ ఇండియా మూవీగా వస్తోన్న రికార్డ్ బ్రేక్..!
నిహార్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. మళ్లీ పుట్టి వచ్చినవా అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తోంది. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అతి త్వరలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. ప్రేక్షకులందరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో 8 భాషల్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలత పాత్రల్లో నటిస్తున్నారు. -
టీఎస్ ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈసెట్, లాసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్సీహెచ్ఈ పేర్కొంది. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, 6న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహించనున్నారు. -
డల్లాస్ లో యాత్ర 2 మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్
-
కాలిఫోర్నియాలో యాత్ర 2 ప్రీమియర్ షో
-
అట్లాంటాలో యాత్ర 2 రిలీజ్ సంబరాలు
-
కొలువుల జాతర.. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రానుంది. ఈ మూవీని మార్చి 1 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనుండగా.. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆడియన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. జనవరి 26న రిపబ్లిక్ డేకు ముందు దేశభక్తి జ్వాలని రగిలించే ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన' అనే పాటను అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులతో చిత్ర బృందం ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో వరుణ్‌తేజ్ ఆసక్తిక ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? అంటూ విద్యార్థులు వరుణ్‌తేజ్‌ను అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ..'నేను నా ఫేవరేట్ హీరోయిన్నే పెళ్లి చేసుకున్నా. ఏదైనా మంచి కథ వస్తే ఇద్దరం కలిసి చేస్తాం. మా ఇద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది నేనే' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా లావణ్య కాకుండా తనకు సాయిపల్లవి అంటే అభిమానం అని తెలిపారు. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే అనుకుంటా. దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. నేను చేయబోయే తర్వాతి మాస్ మూవీ మట్కా. గద్దల కొండ గణేష్ తరహాలో నా పాత్ర ఉండనుంది.' అని అన్నారు. Love takes flight and so do we!#OperationValentine second song out now❤️ - https://t.co/FeQNC1gjrd#Gaganaala #RabHainGawah#OPVonMarch1st@ShaktipsHada89 @ManushiChhillar @MickeyJMeyer @ArmaanMalik22 @singer_shaan @sonypicsfilmsin @RenaissancePicz @saregamaglobal pic.twitter.com/0OC575Ndot — Varun Tej Konidela (@IAmVarunTej) February 6, 2024 -
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం రూ. 988 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 13,097 గ్రామ పంచాయతీలకు రూ. 689 కోట్లు, 650 మండల పరిషత్‌లకు రూ. 148.30 కోట్లు, ఉమ్మడి 13 జిల్లా పరిషత్‌లకు రూ. 150.75 కోట్లను ఆయా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో 15 రోజుల కిత్రమే జమ చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. వీటికి తోడు గతంలో ఆయా స్థానిక సంస్థలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఖర్చు కాని మొత్తం రూ. 126.99 కోట్లు కలిపి.. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల వద్ద మొత్తం రూ. 1,115 కోట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు వివరించారు. ఆన్లైన్లోనే బిల్లులు నమోదు.. నేరుగా సర్పంచులే డబ్బులు బదిలీ గ్రామ పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసింది. తాజాగా బిల్లుల చెల్లింపులు పీఎఫ్ఎంఎస్ విధానంలో చేస్తారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ నిబంధనల ప్రకారం పీఎఫ్ఎంఎస్ విధానంలో.. ఏ పని చేపట్టినా వాటి బిల్లులు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆ బిల్లుల మొత్తాలను గ్రామ పంచాయతీలలో సర్పంచి, మండల, జిల్లా పరిషత్‌లలో అక్కడి మండల, జిల్లా స్థాయి అధికారులు నేరుగా పనిచేసిన వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయవచ్చు. అయితే, చేసిన పనికి ఆన్లైన్లో బిల్లుల నమోదులో కట్టుదిట్టౖమైన ఏర్పాట్లు ఉన్నాయి. పని జరిగిన ప్రాంతం వివరాలు జియో ట్యాగింగ్‌తో సహా ముందుగానే ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, ఎం–బుక్ వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఆ పనులను ముందుగా గ్రామ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ), లేదంటే ఎంపీడీపీ లేదంటే జెడ్‌పీడీపీలో పేర్కొనాలి. ఈ ప్రణాళికలలో పేర్కొనని పనులకు ముందుగా ఆమోదం తీసుకోవాలి. ఆ పని చేసిన తర్వాత నిధులు డ్రా చేయడానికి అభివృద్ధి ప్రణాళికలో సప్లిమెంటరీ ప్లాన్లను తయారు చేసుకొని ఆ వివరాలను ఆ పోర్టల్ నమోదు చేసే వెసులుబాటు ఉందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
వేసవిలో మ్యాచ్‌ను ప్లాన్ చేసుకున్న నయనతార
‘ది టెస్ట్’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగర్ శక్తి శ్రీగోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 18తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 29న పోలింగ్ జరగనున్నారు. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
పండగకు పుంజుకొస్తున్నాయి
సంక్రాంతికి కోడి పందేల హవా ఉంటుంది. వెండితెరపై సినిమా పందేల హవా ఉంటుంది. పండగకి రావడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అన్నింటికీ థియేటర్లంటే కష్టం. అందుకే కొన్ని పండగ పుంజులు (సినిమాలు) వెనక్కి తగ్గాయి.పాంచ్ పటాకా అంటూ జోరుగా వెండితెర మీదకు పుంజుకొస్తున్న ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. ∙ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ఒకటి స్టార్ హీరో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ కాగా మరొకటి యువహీరో తేజా సజ్జా ‘హను–మాన్’. ‘అతడు, ఖలేజా’ వంటి సినిమాల తర్వాత హీరో మహేశ్ బాబు–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఈ మూవీలో మహేశ్‌బాబు పక్కా మాస్ లుక్‌లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్,పాటలు స్పష్టం చేశాయి. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో పోలిటికల్ టచ్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇక అదే రోజు యువ హీరో తేజ సజ్జా ‘హను–మాన్’ సినిమాతో తొలిసారి సంక్రాంతికి వస్తున్నారు. ‘జాంబీ రెడ్డి’ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రమిది. కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. అమృతా అయ్యర్ హీరోయిన్. మామూలు కుర్రాడికి హనుమంతుని ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే అతను చేసే అసాధారణ పనులు ఏంటి? అనే నేపథ్యంలో ‘హను–మాన్’ తెరకెక్కింది. ఒకే రోజు అమ్మ సెంటిమెంట్, భక్తి సెంటిమెంట్... ఇలా రెండు విభిన్న చిత్రాలతో 12వ తేదీ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా దగ్గర కావడానికి రెడీ అవుతోంది. సీనియర్ హీరోలు వెంకటేశ్, రవితేజ సంక్రాంతికి ఒకే రోజు బరిలో దిగుతున్నారు. వెంకటేశ్ నటించిన ‘సైంధవ్’, రవితేజ నటించిన ‘ఈగల్’ జనవరి 13నే రిలీజ్ కానున్నాయి. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా, బేబీ సారా కీలకపాత్రలో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘సైంధవ్’ వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటించిన తొలిపాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. తండ్రీ–కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి భిన్నంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రవితేజ ‘ఈగల్’ వస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో మల్టీపుల్ షేడ్స్ ఉన్నపాత్ర చేశారు రవితేజ. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మరొకటి యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ రెండు వర్గాల ప్రేక్షకులకు మంచి చాయిస్ దక్కినట్లే. హీరో నాగార్జున కూడా ‘నా సామిరంగ’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్న ఆయన ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ చిత్రంతో జనవరి 14న సోలోగా వస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ మధ్య రెండు సంక్రాంతి పండగలకు హిట్ సాధించిన హీరో కాబట్టి.. ఈసారి నాగార్జున ‘నా సామిరంగ’పై అంచనాలు ఉన్నాయి. అనువాదం ఉందా? తమిళంలోనూ సంక్రాంతికి పోటీ నెలకొంది. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’, తమిళ్, హిందీలో రూపొందిన విజయ్ సేతుపతి ‘మెర్రీ క్రిస్మస్’ సినిమాలు జనవరి 12న, అరుణ్ విజయ్ ‘మాఫియా’ పండగకి విడుదలకు సిద్ధమయ్యాయి. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అయలాన్’. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మూవీ ‘మెర్రీ క్రిస్మస్’. ఈ మూడు సినిమాలూ తమిళంలో ఒకేరోజు విడుదలవుతున్నాయి. తెలుగులోనూ అనువాదం అవుతున్నాయి. అయితే తెలుగు విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఈ సంక్రాంతికి స్ట్రయిట్ తెలుగు సినిమాలకే పోటీ ఉండటంతో థియేటర్ల సమస్య ఎదురైంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ వంటి స్ట్రయిట్ చిత్రాల రిలీజ్ వాయిదా పడింది. అలాంటిది డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా? అన్నది ఆసక్తిగా మారింది. ఇక అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘లాల్ సలాం’ వంటివి పోటీ నుంచి తప్పుకున్నాయి. -
స్టార్ హీరో లేటెస్ట్ మూవీ.. న్యూ ఇయర్‌కు క్రేజీ అప్డేట్
ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విశాల్ నటిస్తోన్న చిత్రం రత్నం. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హరీ దర్శకత్వం వహిస్తుండగా.. కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌తో పాటు లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తే విశాల్ ఎన్నడూ కనిపించని ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫస్ట్‌లుక్‌తో పరాటు ఓ లిరికల్ పాటను విడుదల చేశారు. 'రా రా రత్నం' అంటూ సాగే ఈ పాట మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి. వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
నువ్వు నా వరమే..
‘బంగారమే బంగారమే నువ్వు నా వరమే.. నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే...’ అంటూ మొదలవుతుంది ‘సైంధవ్’ సినిమాలోని ‘బుజ్జి కొండవే..’ పాట. వెంకటేశ్ హీరోగా నటించిన 75వ సినిమా ఇది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య కీలక పాత్రలు పోషించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‘నా ఆయువంతా అందిపుచ్చుకుని నువ్వు చిందులాడవే... బుజ్జికొండవే...’ అంటూ సాంగే ‘బుజ్జి కొండవే..’ పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ఎస్పీ చరణ్ ఆలపించారు. ‘‘తండ్రీ కూతుళ్ల అనుబంధం, వారి ఎమోషన్ ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఈ సినిమాలో వెంకటేశ్ కూతురికి ఆరోగ్య సమస్య ఉంటుంది. తన కూతురిని భావోద్వేగానికి గురి చేయకుండా, తన ఎమోషన్స్‌ని దాచిపెడతాడు. పాపకు తల్లి కాకపోయినా సొంత కూతురిలా చూసుకుంటుంటుంది శ్రద్ధా శ్రీనాథ్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్ ఎప్పుడంటే?
మనోజ్, చాందిని హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం "14 డేస్ లవ్". ఈ చిత్రాన్ని నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కించారు. సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దాసరి హరిబాబు నిర్మించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అన్న కోణంలో దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కుటుంబ సంప్రదాయ విలువలతో రూపొందించినఈ చిత్రం జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్, అంజలి, ఐడ్రీమ్ రాజా, శ్రీధర్ కీలక పాత్రలు పోషించారు. -
గ్రామీణ ప్రేమకథగా వస్తోన్న 'రాధా మాధవం'..!
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధా మాధవం'. ఈ చిత్రానికి దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'నువ్వు నేను' అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్, రవి జీ ఆలపించారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో మేక రామకృష్ణ, జయ ప్రకాశ్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
Christmas: శ్రీలంక ప్రభుత్వ సంచలన నిర్ణయం
కొలంబో: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా జైలు పాలైన వెయ్యికిపైగా మంది ఖైదీలకు క్రిస్మస్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత వారం దేశంలో డ్రగ్స్‌పై నిరోధానికి చేపట్టిన యాంటీ నార్కొటిక్ డ్రైవ్‌లో పోలీసులు ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునరావాస కేంద్రంలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలో జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ను పురస్కరించుకుని 1000 మందిని జైళ్ల నుంచి విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. గడిచిన శుక్రవారం వరకు దేశంలోని జైళ్లలో 30 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే దేశంలో ఉన్న జైళ్ల మొత్తం కెపాసిటీ కేవలం 11 వేలేనని జైళ్ల శాఖ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. బౌద్ధ మతస్తులు మెజారిటీలుగా ఉండే శ్రీలంకంలో గతంలో బుద్ధ జయంతి రోజు కూడా భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులకు ఎంపికైనవారి జాబితాను రాష్ట్ర పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 315 సివిల్ ఎస్ఐ (పురుషులు, మహిళలు), 96 ఏపీఎస్పీ ఎస్ఐ (పురుషులు) పోస్టులకు రాత పరీక్షల ఫలితాల అనంతరం నాలుగు జోన్ల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సివిల్ ఎస్ఐ పోస్టులకు ఏకంగా 102 మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం. మొత్తం సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం జోన్లో 50, ఏలూరులో 105, గుంటూరులో 55, కర్నూలులో 105 మందిని ఎంపిక చేశారు. టాపర్లు వీరే.. సివిల్ ఎస్ఐ పురుషుల విభాగంలో గోనబోయిన విజయభాస్కరరావు (రి.నం. 5033539) 400 మార్కులకు గాను 284 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. ఈయన ఏలూరు జోన్‌కు ఎంపికయ్యారు. మహిళల్లో లోగిసా కృష్ణవేణి (రి.నం.5052468) 273 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీఎస్పీ విభాగంలో రానెల్లి కోటారావు (రి.నం.5036787) 300 మార్కులకు గాను 190.5 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. త్వరలో పోలీసు నియామక మండలి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థులకు అనంతపురంలోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత శిక్షణ ఉండొచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రతిభ, రోస్టర్ ప్రకారం.. రాష్ట్రంలో 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇవ్వగా 1,73,047 దరఖాస్తులు వచ్చాయి. 1,40,453 మంది పురుషులు, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1,51,288 మంది పరీక్ష రాస్తే 57,923 మంది (38.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 31,193 మంది తుది రాత (మెయిన్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్ష జరగ్గా ఈ నెల 6న ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 18,637 మంది అర్హత సాధించారు. వీరిలో ప్రతిభావంతుల జాబితాను రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్లో నిలిచిన 411 మంది అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎస్ఐ పోస్టులకు ఎంపిక చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు ప్రత్యేక కోటా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల తుది ఎంపికలు చేపట్టింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ (పీఈ)కు 2 శాతం, ఎన్సీసీకి 3 శాతం, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ (ఎంఎస్పీ)కు 2 శాతం, పోలీసు సిబ్బంది పిల్లలు (సీపీపీ)కు 2 శాతం, సీడీఐకి 2 శాతం, పోలీసు మినిస్టీరియల్ (పీఎం)కు 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. -
ఇష్క్ జైసా కుచ్..
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ఇష్క్ జైసా కుచ్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌ల మధ్య వచ్చే ఫుల్ రొమాటింక్ సాంగ్ ‘ఇష్క్ జైసా కుచ్..’. దీపిక, హృతిక్ డ్యాన్స్ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్ అన్నారు. -
ప్రేమకు జై
అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ని ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. నూతన నటీనటులు చాలా బాగా నటించారనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడు దుబ్బాక భాస్కర్ బాగా నటించారు. మా సినిమాని నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, లైన్‌ప్రోడ్యూసర్: మైలారం రాజు. -
మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు మరికొద్ది గంటల్లో రానుంది. యంగ్ రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్ ఈనెల 22న తెల్లవారుజామునే థియేటర్లలో సందడి చేయనుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. లక్షల్లో అమ్ముడయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రతి గాథలో' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 25 సినిమాలు!
ఈ వారం ఓటీటీ సినిమాల కంటే ప్రభాస్ సలార్ చిత్రంపైనే అందరి దృష్టి ఉందనడంలో సందేహం లేదు. మరోవైపు సలార్‌తో పోటీ పడేందుకు షారుక్ ఖాన్ డంకీ సైతం ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద హీరోల చిత్రాలో కావడంతో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వారంలో ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వీకెండ్లో ఏకంగా 25 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన 'ఆదికేశవ', రక్షిత్ శెట్టి, రుక్మిణి నటించిన 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' అలరించనున్నాయి. ఈ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, బాలీవుడ్ చిత్రాలు సందడి చేసేందుకు వస్తుండగా.. ఇప్పటికే కొన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20 మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20 ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20 అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21 లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21 రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21 ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22 కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22 యోంగ్సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22 కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22 ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24 పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20 డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20 పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20 వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22 అమెజాన్ ప్రైమ్ వీడియో ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21 డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22 సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22 సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22 జీ5 అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22 హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22 జియో సినిమా బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21 హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22 లయన్స్ గేట్ ప్లే ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22 -
సంక్రాంతికి ముందే బుల్లెట్ల పండుగ.. ట్రైలర్ వచ్చేసింది!
మాస్ మహరాజా రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈగల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈగల్ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్లో 'విశ్వం తిరుగుతాను.. ఊపిరి అవుతాను..కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను' అనే రవితేజ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ట్రైలర్ చూస్తే మాఫియా నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సంక్రాంతికి బుల్లెట్ల పండుగ రావడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు' అనే మాస్ మాహారాజా డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. Breaking the myths this Sankranthi!#EAGLETrailer out now :) - https://t.co/ZSe6qyHxon See you all at the cinemas on JAN 13th with #EAGLE 🔥#EAGLEonJan13th pic.twitter.com/3mnQjG7nwl — Ravi Teja (@RaviTeja_offl) December 20, 2023 -
కామెడీ ఎక్స్‌ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
నాలుగు కథలతో...
యడ్లపల్లి మహేశ్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్’. వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో ముక్కాముల అప్పారావు, డా. కోడూరు గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో డబ్బుకీ, మనిషికీ ఉన్న సంబంధాన్ని వెన్నెల కుమార్ చక్కగా చూపించారు. నాలుగు కథలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
నేల మీద నేను ఉన్నా...
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘నేల మీద నేను ఉన్నా..’ అంటూ సాగే ఫాస్ట్ మాస్ బీట్ సాంగ్‌ను బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ విడుదల చేశారు. కొల్లి చైతన్య స్వరపరచిన ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. -
నిజాయితీగా శ్రమిస్తే సక్సెస్ గ్యారంటీ
‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి హీరో హీరోయిన్లుగా, ఎస్తేర్ ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సాహు గారపాటి, నటుడు ‘సుడిగాలి’ సుధీర్ అతిథులుగా హాజరై ‘టెనెంట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినీ పరిశ్రమను నమ్ముకుని నిజాయితీగా శ్రమిస్తే ఆలస్యమైనా సక్సెస్ తప్పకుండా వస్తుందనడానికి నిదర్శనం ‘సత్యం’ రాజేశ్, ‘సుడిగాలి’ సుధీర్. ఈ ఇద్దరూ కష్టపడి హీరోలుగా నిరూపించుకున్నారు. యుగంధర్ ప్రతిభ గల వ్యక్తి’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాహు గారపాటి. ‘‘సత్యం’ రాజేశ్‌గారు వరుస హిట్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ సినిమా కథలోని ఎమోషన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. -
ఈ కథలో...
హోమానంద్, రేవంత్ హీరోలుగా, సిమ్రాన్ పరింజా హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈ కథలో నేను’. ఎమ్మెస్ ఫణిరాజ్ దర్శకత్వంలో ఎం. అచ్చిబాబు సమర్పణలో టి. కేశవ తీర్థ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నేటి ట్రెండ్‌కి, ఇప్పటి యూత్‌కి సరిపోయేలా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ఎమ్మెస్ ఫణిరాజ్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ లస్ట్ నేపథ్యంలో రూ΄పొందిన చిత్రమిది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునే అదృష్టం మా సినిమాకి, నాకు దక్కింది. ఆయన తనయుడు యోగి శ్రీ మంచి సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఫణిగారు ఓ మంచి చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అచ్చిబాబు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్ భట్ జోషి. -
సరదా.. సరదాగా...
హీరో వెంకటేశ్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సరదా.. సరదాగా...’ అంటూ సాగే రెండో పాటని నేడు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేసింది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా కలిసి సరదాగా సముద్రపు ఒడ్డున చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందుతోన్న చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ‘రాంగ్ యూసేజ్..’ అనే తొలి పాటకి మంచి స్పందన వస్తోంది. ‘సరదా.. సరదాగా...’ పాట కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: యస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు. -
నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామి రంగ. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'బెల్లం చెరకు చూపులదానా.. అల్లం మిరప మాటలదానా..బొండు మల్లి నడుముదానా.. బండెడు సోకుల ఓ నెరజాణ.. నువ్వుట్టా పోతుంటే..నిన్నట్టా సూతుంటే.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్ అందించారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఆషిక రంగనాథ్ పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె వరలక్ష్మి పాత్రలో కనిపించనుందని వెల్లడించారు. ప్రత్యేకంగా గ్లింప్ల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్‌లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ఊహించని మలుపులు
పృథ్వీ కృష్ణ, శ్రీ విద్య జంటగా శ్రావణ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎయిమ్’. ఎంఎన్ రావు, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్ర కథలో పలు మలుపులు ఉన్నాయి. పి. గోపాల్ రెడ్డి స్వరపరచిన ఐదు పాటలు బాగుంటాయి. తల్లిదండ్రులకు.. ముఖ్యంగా యువతరానికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
సంక్రాంతికి సై
సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. పండగ వసూళ్లను దండుకోవడానికి సంక్రాంతి మంచి సమయం. అందుకే ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. 2024 సంక్రాంతి పండగకి మరో నెలకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఇండస్ట్రీలో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. ఈసారి పండగకి దాదాపు అరడజను స్ట్రయిట్ తెలుగు, దాదాపు ఐదు డబ్బింగ్ చిత్రాలతో సినిమాల జోరు బాగానే కనిపించనుంది. సినీ లవర్స్‌కి పండగకి దాదాపు పది చిత్రాలు రానున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్నారు నాగార్జున. ‘నా సామి రంగ’ చిత్రంతో ఈసారి మళ్లీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తారు. ఆయన మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలిష్‌గా ఉంటాయి. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్ 29) సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘ఈ పండక్కి నా సామి రంగ’ అంటూ గ్లింప్స్ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఆయన కెరీర్లో 99వ సినిమాగా ‘నా సామి రంగ’ రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, సంక్రాంతికి రిలీజ్ పక్కా అని డుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ► ‘సైంధవ్’ సినిమాతో వెంకటేశ్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకటేశ్ కెరీర్లో ‘సైంధవ్’ 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సైంధవ్’ చిత్రాన్ని ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించడంతో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేశ్. ► గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు రవితేజ. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా వెండితెరపై కనిపించారు. సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో బరిలో దిగడానికి రెడీ అయ్యారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి విడుదలవుతుందా? వాయిదా పడుతుందా అనే చర్చ వినిపిస్తోంది. కానీ చెప్పిన తేదీకి పక్కా వస్తామంటూ రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు మేకర్స్. రవితేజ కెరీర్లోనే ‘ఈగల్’ వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రయూనిట్ పేర్కొంది. ► ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు గుంటూరు కారం ఘాటు చూపించ డానికి ‘గుంటూరు కారం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో మహేశ్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు పక్కా మాస్ లుక్‌లో కనిపించ నున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ చెబుతున్నాయి. ► ‘ఖుషి’ వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్–పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలవనుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనే చర్చ తాజాగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకపోతే మార్చిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక తర్వాతి షెడ్యూల్ చిత్రీకరణకు అమెరికాకు బయలుదేరనుంది యూనిట్. దాదాపు నెలరోజులకు పైగా అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నారట. సంక్రాంతికి ఇంకా నెలన్నరే ఉంది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్‌కి దాదాపు అంతే సమయం పడుతుందట. అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. ► ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు దిగుతుంటే నేనూ వస్తున్నానంటున్నాడు యువ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్’. ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి, చివరికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డబ్బింగ్ కూడా.. పండగకి స్ట్రయిట్ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈసారి రజనీకాంత్ సినిమాతో పాటు జోరుగా బరిలో నిలవనున్న అనువాద చిత్రాలేవో తెలుసుకుందాం. ‘జైలర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రజనీకాంత్ ‘లాల్ సలాం’తో పొంగల్ (సంక్రాంతి) బరిలో దిగుతున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్డీ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజవుతోంది. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. స్వీయ దర్శకత్వంలో ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో భాగంగా సుందర్ .సి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొంగల్‌కి రిలీజ్ కానుంది. -
మార్చిలో గోదావరి గ్యాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాడి. -
ఎలా సహాయపడగలను రాధిక
‘‘చెప్పు రాధిక.. ఏం కావాల నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు చెప్పు’’ అని సిద్ధు చెప్పే డైలాగ్‌తో ‘రాధిక..’ పాట ఆరంభమవుతుంది. ‘‘రాధిక ఎవరు.. నా పేరు రాధిక కాదు.. నా పేరు లిల్లీ’’ అంటుంది అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘టిల్లు స్క్వేర్’లోని రెండో పాట ‘రాధిక..’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు రామ్ మిరియాల ‘రాధిక..’ పాటను స్వరపరచి, పాడారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘రాధిక..’ పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
దిస్ ఈజ్ లేడీ రోజ్..
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్ రామ్‌తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. -
మళ్లీ కలసి పనిచేస్తాం
‘‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ‘బ్రీత్’. వంశీకృష్ణగారు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు.. భవిష్యత్‌లో మేము మళ్లీ కలసి పనిచేస్తాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా జంటగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ–‘‘బ్రీత్’ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన కథని రెడీ చేశాను. ‘బ్రీత్’ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ వేడుకలో వైదిక సెంజలియా, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రెండు ప్రపంచాలు
‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్రిష్టి తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. ఏ మూన్ షైన్ పిక్చర్స్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్. -
తండ్రీ, కూతుళ్ల ఎమోషనల్ డ్రామా.. ట్రైలర్‌తోనే కన్నీళ్లు పెట్టించేశాడుగా!
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా డ్రామాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమనే కథాంశంగా రూపొందించారు. తల్లి లేని బిడ్డ జీవితంలో తండ్రి పాత్ర ఎలా ఉంటుందనే కథనే చూపించనున్నారు. ట్రైలర్ చూస్తే తండ్రీ,కూతుళ్ల ప్రేమ, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. -
సందీప్ రెడ్డి యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషనల్‌గా కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ మూవీ రన్‌టైమ్ చూస్తే భారీ నిడివితోనే వస్తోంది. ఏకంగా మూడు గంటల 21 నిమిషాల పాటు ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వెల్లడించారు. -
ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!
ప్రతి వారంలో శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ఒకవైపు థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీకి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. గురు, శుక్రవారాల్లో మరిన్నీ సందడి చేయనున్నాయి. ఓటీటీలతో పాటు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత్, శివాని రాజశేఖర్ నటించిన కోటబొమ్మాళి పీఎస్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లియో- (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్- 24 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ది విలేజ్ (తమిళ వెబ్ సిరీస్) - నవంబరు 24 ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22(రెంట్- RS.149) అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 -
హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మంది బందీలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ కేబినెట్ తీర్మాణాన్ని ఆమోదించింది. హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన నాటినుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో మహిళలు, పిల్లలను కాపాడుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ప్రతి రోజూ 12 మంది చొప్పున విడుదల చేసేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించింది. తమ చెరలో ఉన్న పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. గాజాకు అధిక మొత్తంలో ఇంధన, మానవతా సాయం అందడానికి కూడా అనుమతించింది. అటు.. హమాస్ చెరలో దాదాపు 240 మంది ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం గాజాపై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్‌ను అంతమొందించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఎడతెరిపిలేని యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తర గాజాను పూర్తిగా ఖాలీ చేయించింది. ప్రస్తుతం దక్షిణ గాజాపై యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: బందీలకు ఇక విముక్తి! -
సస్పెన్స్ సహస్ర
‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథి నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గాలోడు’ హిట్‌తో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది. ‘కాలింగ్ సహస్ర’తో సస్పెన్స్ జానర్లోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఇప్పటివరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు’’ అన్నారు అరుణ్ విక్కిరాలా. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు విజేష్ తయాల్. -
పక్కా మాస్
‘‘ఆదికేశవ’ సినిమా ట్రైలర్‌కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్లానే సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని హీరో వైష్ణవ్ తేజ్ అన్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఆదికేశవ’ పక్కా మాస్ చిత్రం. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్.. ఇలా అన్నీ బాగుంటాయి. గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్ మాస్ మూవీ ‘ఆదికేశవ’’ అన్నారు. -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
వైద్యో నారాయణో హరి..
చైతన్యకృష్ణ హీరో పరిచయమవుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతం అందించారు. -
ధరణి బదులు ‘మీ భూమి’ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని, సమర్థవంతమైన పాలనపై దృష్టిపెడతామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. భూముల రికార్డులకు సంబంధించి ధరణి స్థానంలో పారదర్శంగా ఉండేలా ‘మీ భూమి’ వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేస్తామని, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం అందరికీ చట్టం ఎదుట సమాన గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటామని పే ర్కొంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరిట దీనిని విడుదల చేశారు. అందులో తెలంగాణను ప్రగతిపథంలో నడిపేందుకు రెండు విభాగాలుగా పది ప్రధాన లక్ష్యాలను, 25 అంశాల కార్యాచరణను బీజేపీ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 48 ప్రకారం తెలంగాణలో గోహత్యపై సంపూర్ణ నిషేధం అమలుచేస్తామని పేర్కొంది. గోహత్య విషయంలో...నేరం రుజువైతే నేరస్థులకు మూడేళ్ల కు తక్కువ కాకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్ష, ఒక పశువుకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షల దాకా జరిమానా లేదా రెండూ విధిస్తామని తెలిపింది. ప్రధాన కార్యాచరణ అంశాలివీ.. ► ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహణ. పరకాల, బైరాన్పల్లిలలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఆగస్టు 27ను ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ’ దినంగా నిర్వహణ. ► రజాకార్లు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గుర్తుచేసుకునేలా హైదరాబాద్‌లో ఓ స్మారకం, మ్యూజియం ఏర్పాటు. ► అవినీతిపై ఉక్కుపాదం. బీఆర్ఎస్ సర్కారు హయాంలో కాళేశ్వరం, ధరణి, ఇతర అంశాల్లో అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు ► ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ – సబ్ కా ప్రయాస్’ నినాదంతో అవినీతి రహిత సుపరిపాలన ► రాష్ట్రంలోని 52% వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు. రాష్ట్రానికి బీసీ సీఎం. ► ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయడానికి చర్యలు. ► రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా, మత ప్రతిపాదికన ఇచ్ఛిన రిజర్వేషన్లను తొలగించి వాటిని వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు (జనాభాకు అనుగుణంగా) అందజేస్తాం. ► ద్రవ్యోల్బణం తగ్గించడంతోపాటు సాధారణ ప్రజలకు ఊరట కల్గించేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు ► రాష్ట్ర రైతులకు ఎరువుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు) అమలు. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్పుట్ అసిస్టెన్స్. ► ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు బాటలు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు. ► వరి ధాన్యానికి రూ.3,100 మద్దతు ధర. తెలంగాణలో ఉత్పత్తయ్యే మొత్తం బియ్యం కొనుగోలుకు చర్యలు ► ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం. ► ఉజ్వల లబి్ధదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం. ► ఆడబిడ్డ భరోసా పథకంతో నవజాత బాలికల పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్. వారికి 21 ఏళ్లు వచ్చాక రూ.2లక్షలు పొందవచ్చు. ► డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్స్ ► స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు వడ్డీకే రుణాలు ► యూపీఎస్సీ తరహాలో.. గ్రూప్–1, గ్రూప్–2 సహా టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆర్నెల్లకోసారి పారదర్శకంగా నిర్వహణ ► ఆసక్తి గల రైతులకు ఆరోగ్యకరమైన ఆవును ఉచితంగా అందిస్తాం ► అర్హత కలిగిన కుటుంబాలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ. పేద కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు ►కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా హక్కును పొందేందుకు కేడబ్ల్యూడీ– ఐఐ ముందు రాష్ట్ర వాదనలు సమర్థవంతంగా వినిపిస్తాం ► ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, పింఛన్లు అందేలా చర్యలు ► వివిధ చట్టాలను ఏకీకృతం, సమన్వయం చేసి ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించేందుకు కమిటీ ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వనరులను సమన్వయం చేసుకుంటూ.. పేదలందరికీ ఇళ్ల మంజూరు. గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను అందిస్తాం. ► వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రలు ► తెలంగాణకు చెందిన ఎన్నారైలు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం/మంత్రిత్వ శాఖ ఏర్పాటు. పది ప్రధాన లక్ష్యాలు ఇవీ.. ► ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి. ధరణి స్థానంలో పారదర్శకమైన ‘మీ భూమి’ వ్యవస్థ ► రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకోసం నోడల్ మంత్రిత్వ శాఖ ► వెనుకబడిన వర్గాల సాధికారత.. అందరికీ చట్టం ఎదుట సమాన గుర్తింపు. అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు. ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ వర్గీకరణ వేగవంతం ► కూడు–గూడు: ఆహార, నివాస భద్రత. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేత. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు ► రైతే రాజు– అన్నదాతకు అందలం ► నారీశక్తి– మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రోత్సాహం ► యువశక్తి–ఉపాధి: అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల్లోనే భర్తీ ►వైద్యశ్రీ– నాణ్యమైన వైద్య సంరక్షణ చర్యలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పన ► నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు ► ప్రభుత్వ ప్రాజెక్టుల ముసుగులో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై, అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు. నదీ గర్భాల కోత నిరోధానికి కొత్త ఇసుక మైనింగ్ విధానం -
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా, ఫైట్ మాస్టర్‌గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు.. గోధుమలను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,700 చొప్పున కొనుగోలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు. ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ)ను కేంద్రం సాయంతో నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడం. ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది. మహిళలు, బాలికల కోసం... జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్..ప్రతి నగరంలో యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటు. లాడో ప్రోత్సాహన్ యోజన కింద పుట్టిన ప్రతి బాలిక పేరిట రూ.2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. లక్పతి దీదీ పథకం ద్వారా ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ. 12వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీల పంపిణీ. పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రాష్ట్రంలో మూడు మహిళా బెటాలియన్ల ఏర్పాటు. పీఎం మాతృ వందన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి 8 వేలకు పెంపు. యువత కోసం.. వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ పేద కుటుంబాల విద్యార్థులు పుస్తకాలు, దుస్తులు కొనుక్కునేందుకు ఏటా రూ.12 వేలు పంపిణీ. ప్రతి డివిజన్లో రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు. ఆరోగ్యరంగంలో.. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య రంగంపై రూ.40 వేల కోట్ల పెట్టుబడి కొత్తగా 15 వేల మంది వైద్యులు, 20 వేల పారామెడికల్ సిబ్బంది నియామకం. వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజీ్మర్, జోథ్‌పూర్, బికనీర్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్సీ,ఎస్టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. -
పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా వస్తోన్న "ఏ చోట నువ్వున్నా"!
ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరో, హీరోయిన్స్‌గా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం "ఏ చోట నువ్వున్నా". మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త గా ఎమ్.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి పసలపూడి ఎస్.వి దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..' దర్శకుడు పసలపూడి కథ చెప్పినపుడు చాలా బాగా అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నటీనటుల కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్లను సెలెక్ట్ చేసుకున్నాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.' అని అన్నారు. -
36 రోజుల్లో పూర్తయిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యువనటుడు హరీష్‌కల్యాణ్. ఈయన ఇటీవల ఎల్జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించి తాజాగా పార్కింగ్తో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. నటి ఇందుజా నాయకిగా నటించిన ఇందులో ఎంఎస్.భాస్కర్, రమా, ఇళవరసు, ప్రార్థన ముఖ్యపాత్రలు పోషించారు. రామ్‌కుమార్ బాలకృష్ణన్ అనే నవ దర్శకుడిని పరిచయం చేస్తూ ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన చిత్రం ఇది. శామ్.సీఎస్ సంగీతాన్ని, జిజు సన్ని ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని డిసెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధమఅవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలో సమావేశం ఏర్పాటు చేసింది. లాక్డౌన్ సమయంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రమే పార్కింగ్ అని దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ చెప్పారు. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనలు ఈ చిత్రంలో చోటుచేసుకుంటాయన్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎప్పుడో, ఎక్కడో ఎదుర్కొనే సంఘటనలే నేపథ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈగో అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని పార్కింగ్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇందులో హరీష్ కల్యాణ్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగిగానూ.. ఆయనకు భార్యగా ఇందుజా నటించారని తెలిపారు. మరో ముఖ్యపాత్రలో నటుడు ఎంఎస్.భాస్కర్ నటించారని తెలిపారు. చిత్రంలో రెండు పాటలు ఉంటాయని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్స్‌కు అధిక సమయం కేటాయించి షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 36 రోజుల్లో పూర్తిచేసినట్లు తెలిపారు. మానవతావాదం ముఖ్యం అని చెప్పే చిత్రంగా పార్కింగ్ ఉంటుందని దర్శకుడు తెలిపారు. తనకు కథను చెప్పిన దానికంటే బెటర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని నటుడు హరీశ్‌కల్యాణ్ పేర్కొన్నారు. -
ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!
దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17 రస్టిన్-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
ఆ రోజు సౌండ్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ, ‘మిర్చి’ ప్రియ కీలక పాత్రల్లో నటించారు. సంజయ్ శేరి దర్శకత్వంలో జయశంకర్ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు .దర్శక– నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రెహమానిక్. -
పండగ పోస్టర్ గురూ
దీపావళి పండక్కి ఇండస్ట్రీలో సినీ టపాసులు బాగానే పేలాయి. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్.. ఇలా సినీ ప్రేమికులకు కావాల్సిన మతాబులు అందాయి. ఈ విశేషాల్లోకి... రజనీకాంత్, కపిల్‌దేవ్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా జీవితా రాజశేఖర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. క్రికెట్‌ను ప్రేమించే కొందరు హిందు, ముస్లిం యువకుల మధ్య రాజకీయ జోక్యంతో తలెత్తిన వివాదాలను మొయిద్దీన్ భాయ్ (రజనీ పాత్ర పేరు) ఎలా సరిదిద్దుతాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ చెబుతోంది. ‘రాంగ్ యూసేజ్’ అంటూ ‘సైంధవ్’ సినిమా కోసం పాట పాడారు వెంకటేశ్. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రాంగ్ యూసేజ్’ పాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ సాంగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యాథాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదల కానుంది. తొలి భాగం ట్రైలర్‌ను డిసెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మాస్ పోలీసాఫీసర్ పాత్రలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘భీమా’. ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. దీపావళి సందర్భంగా ‘కంగువా’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెండు విభిన్న కాలాల్లో సాగనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఏప్రిల్ 11న విడుదల కానుందని టాక్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారు. సంక్రాంతికి ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కానుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్రీత్’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చోటు చేసుకునే ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని యూనిట్ చెబుతోంది. ప్రముఖ నటుడు ఉపేంద్ర భార్య, నటి ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’. ఈ సినిమాకు లోహిత్ దర్శకుడు. రాధికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్ నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ సినీ ప్రపంచంలో రాని ఓ ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. 30 రోజులు గోవాలో ఏకధాటిగా షూటింగ్ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి, నటి రాధికా కుమారస్వామి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘అజాగ్రత్త’. శశిధర్ దర్శకత్వంలో రవిరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రాధికా కుమారస్వామి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘భైరా దేవీ’. శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే అఘోరా భైరాదేవిగా రాధిక నటిస్తున్నారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘చే’. ‘లాంగ్ లివ్’ అనేది ఉపశీర్షిక. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ కీలక పాత్రల్లో నటించారు. బి.ఆర్ సభావత్ నాయక్ దర్శకత్వంలో సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘‘చేగువేరా బయోపిక్ తీయాలన్నది నా 20 ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు బి.ఆర్ సభావత్ నాయక్. -
ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. దీపావళి దాటగానే జోరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్‌లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
మార్పులతో బీజేపీ ఐదో జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా గందరగోళానికి దారితీసింది. తీవ్ర కసరత్తు అనంతరం శుక్రవారం 14 మంది అభ్యర్థులతో చివరి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఇందులో 11 మంది కొత్తవారు కాగా.. మిగతా నలుగురు మార్పులతో టికెట్ దక్కించుకున్నవారు. కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఐదో జాబితాలోని మూడు చోట్ల అభ్యర్థులను మార్చడం గందరగోళానికి తెరలేపింది. ఇటీవల వేములవాడ నుంచి తుల ఉమ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం అనూహ్యంగా బీఫాంను చెన్నమనేని వికాస్‌రావుకి ఇచ్చింది. సంగారెడ్డి నుంచి దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు పేరును ఐదో జాబితాలో ప్రకటించినా.. అక్కడ పులిమామిడి రాజుకు బీఫాం అందింది. బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి తొలి జాబితాలో సీటు పొందిన అమరాజుల శ్రీదేవిని మారుస్తూ.. కొయ్యల ఏమాజీ పేరు ప్రకటించారు. కాసేపటికే మళ్లీ అమరాజుల శ్రీదేవినే బరిలో ఉంటారని ప్రకటించి బీఫామ్ ఇచ్చారు. ఐదో జాబితాలో అలంపూర్ నుంచి మారెమ్మ బరిలో ఉంటారని చెప్పినా.. సాయంత్రానికి మార్చేసి, రాజగోపాల్ పేరు ప్రకటించారు. చాంద్రాయణగుట్టలో సత్యనారాయణ ముదిరాజ్‌కు బదులు కె.మహేందర్‌ను ఎంపిక చేశారు. మూడో జాబితాలో వనపర్తికి అశ్వత్థామరెడ్డి పేరు ప్రకటించగా.. తాజా జాబితాలో అనుజ్ఞారెడ్డిని అక్కడ బరిలో దింపారు. ఐదు జాబితాల్లో కలిపి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. 111 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగతా 8 స్థానాల్లో జనసేన బరిలో ఉంది. -
సరికొత్త ట్రయల్
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో, సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహనిర్మాత: సుదర్శన్ రెడ్డి. -
మాస్ రింగు...
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్– కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మేçఘా లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘రింగు రింగు బిళ్ల..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకి దేవ్ పవార్ సాహిత్యం అందించగా, భోలే షావలి, రఘురామ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫుల్ మాస్‌గా ‘రింగు రింగు బిళ్ల..’ సాంగ్ ఉంటుంది. సోహైల్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్. -
వేటాడే సత్యభామ
‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్‌రాజ్).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ (కాజల్ అగర్వాల్)’ అనే డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్. పోలీసాఫీసర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సార్.. ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్ అగర్వాల్)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్ (కాజల్)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
దీపావళికి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రైడ్. దర్శకుడు ముత్తయ్య మాటలను అందించిన ఈ చిత్రం ద్వారా.. ఆయన శిష్యుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.స్డూడియోస్, ఓపెన్ స్క్రీన్ పిక్చర్స్, జీ.పిక్చర్స్ సంస్థల అధినేతలు కే.కనిష్క్, జీకే, జీ.మణికన్నన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండగ సందర్భంగా ఈనెల 10న థియేటర్లలో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రం గురించి నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. 'దర్శకుడు కార్తీ రైడ్ చిత్ర కథ చెప్పినప్పుడే అందులో యాక్షన్, ఎమోషనల్, లవ్, డాన్స్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేసే అన్ని అంశాలు ఉన్న విషయాన్ని గ్రహించా. తాను కమర్షియల్ కథా చిత్రాల గురించి ఎక్కువగా ఆలోచిస్తా. మూవీ ఫైనల్ కాపీ చూసిన తరువాత దర్శకుడు నన్ను కమర్షియల్ హీరోగా చూపించడం సంతోషంగా అనిపించిందని' అన్నారు. రైడ్ సామాజిక సమస్యతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కార్తీ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసుకున్నప్పుడే కథానాయకుడి పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉండాలని భావించానన్నారు. అదే సమయంలో మాస్ హీరోగానూ కనిపించాలని అనుకున్నానని అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విక్రమ్‌ప్రభు కరెక్ట్ అని యూనిట్ అంతా ముక్తకంఠంతో చెప్పారన్నారు. ఈ పాత్రకు విక్రమ్‌ప్రభు పూర్తి న్యాయం చేశారన్నారు. దర్శకుడు ముత్తయ్య సంభాషణలు ఈ చిత్రానికి వాణిజ్యపరంగా పక్కా బలంగా నిలిచాయన్నారు. -
ప్రతి కణం కణం...
టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుద లైంది. 16 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థు లను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ, ఐదు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కామారెడ్డి నుంచీ సీఎం కేసీఆర్‌పై బరిలో దింపారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన జి.వివేకానందకు చెన్నూ రు టికెట్ ఇచ్చారు. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సు వాడ నుంచి, షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ నారాయణ్‌ఖేడ్ నుంచి, నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితాలో 14 స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించగా, మరో రెండు స్థానాలకు గతంలో ప్రకటించిన అభ్యర్థులను మార్చారు. గతంలో బోథ్ నియోజకవర్గానికి వన్నెల అశోక్ పేరును ప్రకటించగా, తాజాగా ఆ యన స్థానంలో ఆదె గజేందర్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే వనపర్తికి గతంలో జిల్లెల చిన్నారెడ్డి పేరు ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. అనేక కసరత్తుల తర్వాత ఆయన స్థానంలో తుడి మేఘారెడ్డిని బరిలోకి దింపుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి మొత్తం 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐకి కొత్తగూడెం కేటాయించగా.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ సీట్లను పెండింగ్‌లో ఉంచింది. ఒకవేళ సీపీఎంతో చర్చలు సఫలం అయితే వారికి మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
సూర్యవన్షీ సాహసం
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్ ’. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ , రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనె, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అక్షయ్‌కుమార్ c చేసి, వీర్ సూర్యవన్షీ పాత్రలో ఆయన నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవన్షీ’ (2021) చిత్రం విడుదలై ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో, ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలోని అక్షయ్ లుక్‌ను విడుదల చేసినట్లుగా రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఇందులో అక్షయ్ లుక్ చూస్తుంటే పోలీసాఫీసర్‌గా మరోసారి ఆయన సహసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సింగమ్ ఎగైన్ ’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
సమ్మర్లో సత్యభామ
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో, నవీన్ చంద్ర, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభిస్తాం. సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ. -
మార్పు కోసం..
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ– ‘‘ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తప్పుదారి పట్టిన ప్రజల ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు. -
తెరచాప ఆడాలి
నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిజైనింగ్ బాగుంది. ఈ సినిమా కథ, కథనం, టేకింగ్, అన్నీ నాకు తెలుసు. ఈ సినిమా బాగా ఆడి, చిత్ర యూనిట్‌కి మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: అజీమ్–వెంకట్. -
ఇరవై ఏళ్లకు నా కల నెరవేరింది
‘‘ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్‌గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. రవికిశోర్‌గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్‌గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
ఆవకాయ తాండ్ర...
‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, గణేష్ ఎ. రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్ భాస్కర్ నటించడం విశేషం. ‘‘తరుణ్ భాస్కర్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్ భూపతి. -
భారతీయుడు ఈజ్ బ్యాక్
‘‘హలో... ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడుకి చావే లేదు’ అంటూ ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం చివర్లో కమల్‌హాసన్ చెప్పే డైలాగ్‌తో ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) ఇంట్రో గ్లింప్స్ మొదలవుతుంది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందిన ‘ఇండియన్’ (1993)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రధారులు. సుభాస్కరన్, ఉదయ నిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఇండియన్ 2’ ఇంట్రో గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఇండియన్ 2’ తెలుగు వెర్షన్ గ్లింప్స్‌ను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి షేర్ చేశారు. ఈ వీడియోలో ‘నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ కమల్‌హాసన్ చెప్పిన డైలాగ్ ఉంటుంది. -
ఓ కల ఆధారంగా..
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం దర్శకత్వం వహించిన చిత్రం ‘విధి’. ఎస్. రంజిత్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రోహిత్ నందా మాట్లాడుతూ ‘‘న్యూజిల్యాండ్‌లో చదువుకున్నాను. నటనపై ఆసక్తితో స్టేజ్ డ్రామాల్లో చేశాను. చిరంజీవిగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఇక ‘విధి’ సినిమా రా అండ్ రస్టిక్ ఫిల్మ్. రియల్ లైఫ్‌లోని నా క్యారెక్టర్‌కు విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేశాను. అలాగే మా ‘విధి’ సినిమాను చూపులేనివారు కూడా ఓ యాప్ సాయంతో ఆస్వాదించవచ్చు. ఈ ఆలోచన నాదే. కొన్ని కొత్త కథలు వింటున్నాను’’ అన్నారు. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చిన ఓ కల ఆధారంగా ‘విధి’ సినిమా స్టోరీ లైన్‌ను డెవలప్ చేసి, కథ రెడీ చేసుకున్నాం. రోహిత్ బాగా చేశారు’’ అన్నారు శ్రీనాథ్, శ్రీకాంత్. -
అలాంటి కార్తీనే ఇష్టపడుతున్నారు!
‘‘చేసిన పాత్రలనే మళ్లీ చేస్తే నాకు బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వినూత్నంగా, ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే కార్తీనే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అంటే నేను నాలా ఉంటే ఆదరిస్తున్నారు. మరొకరిలా ఉండాలనుకోవడం లేదు. కాబట్టి నా తరహా సినిమాలే నేను చేస్తాను’’ అని కార్తీ అన్నారు. కార్తీ హీరోగా ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ‘జపాన్’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు. ∙‘జపాన్’ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. నిజమైన కథ కాదు. కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూ΄పొందించాం. ఈ సినిమా కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాదు... మన ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నించేలా కూడా ఉంటుంది. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. సోషల్ మీడియా అంశాన్ని కూడా టచ్ చేశాం. అలాగే మనకు ‘జపాన్’ అంటే హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి గుర్తుకు రావచ్చు. ఆ దాడి తర్వాత జపాన్ దేశం మళ్లీ పుంజుకుని అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఈ రిఫరెన్స్ ‘జపాన్’ పాత్రలో కూడా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మాస్‌తో కూడిన స్ట్రాంగ్ అండ్ సెటైరికల్ రోల్ నాకు మళ్లీ ‘జపాన్’తో వచ్చినట్లు అనిపించింది. ‘జపాన్’ గ్రే క్యారెక్టర్ కాదు.. డార్క్ అంతే. నా క్యారెక్టర్లో డార్క్ హ్యూమర్ ఉంటుంది. ‘జపాన్’ కోసం రెగ్యులర్ కార్తీలా ఉండకూడదని అనుకున్నాను. దర్శకుడు కూడా ఇదే కోరుకున్నారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అయ్యాను. నా వాయిస్ మాడ్యులేషన్, హెయిర్ స్టయిల్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. నేను నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్‌కు దర్శకులు రాజు ముగరున్ డైలాగ్స్ రాశారు. ఆయనలో మంచి హ్యూమర్ ఉందని ఆ సమయంలో అనిపించింది. కానీ రాజుగారు తీసిన ‘కుకు’, ‘జోకర్’ సినిమాల్లో ఇది అంతగా లేదు. సాధారణంగా నేను నా కోసం ఏవైనా కథలు ఉన్నాయా? అని ఎవర్నీ అడగలేదు. తొలిసారి రాజు మురుగన్‌ని అడిగాను. ఓ డార్క్ ఎమోషనల్ స్టోరీ చెప్పారు. నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత మరో కథలోని ఓ క్యారెక్టర్ నచ్చి, ఆ పాత్ర ఆధారంగా కథ రాయమన్నాను. అలా ‘జపాన్’ కథ మొదలైంది. రాజు మురుగన్గారు గతంలో జర్నలిస్ట్‌గా చేశారు. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ఘటనలను ‘జపాన్’లో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే నాగార్జునగారి అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోషియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ∙దర్శకుడు నలన్కుమార్తో నేను చేస్తున్న సినిమా 70 శాతం షూటింగ్ పూర్త యింది. ‘96’ ఫేమ్ ప్రేమ్‌కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే ‘ఖైదీ 2’, ‘సర్దార్ 2’ చిత్రాలు చేయాల్సి ఉంది. -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
ఇంట్రో రెడీ
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄పొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మేజర్ షూట్ పూర్తయింది. తాజాగా ‘ఇండియన్ 2’ సినిమాకు సంబంధించిన వీడియోను ‘ఇండియన్ 2 యాన్ ఇంట్రో’ టైటిల్‌తో నవంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్. -
లవ్ అండ్ ఎమోషన్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న విడుదల కానుంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. చంద్రబోస్‌గారి సాహిత్యం, సుభాస్ ఆనంద్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
వినోదం.. సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్ శ్రీలేఖ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో మంచిని పెంపొందిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని ఈ సినిమాలో చూపిస్తాం. అలాగే 75 శాతం వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్. అచ్యుత రావుతో పాటు చిత్ర సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను: హీరోయిన్
‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల హీరో హీరోయిన్లుగా ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను నందిపాటి వంశీకృష్ణ నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు కెమెరామేన్. రంభ, కల్పనా రాయ్‌లు మాకు దూరపు బంధువులు. నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. మెడిసిన్ చేసినా నటిగానూ చేయాలనుకుంటున్నాను. ‘మిస్ ఇండియా’ సినిమాతో నా జర్నీ మొదలైంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మా ఊరి పొలిమేర 1, విరూపాక్ష’ వంటి సినిమాలు, ‘ఆహా’ ఓటీటీలో మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ఇక ‘మా ఊరి పొలిమేర 1’లో సహనం ఉన్న లక్ష్మీ పాత్ర చేశాను. రెండో భాగంలో నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను’’ అన్నారు. -
‘వాస్తు’ కోసం బాగా ప్రాక్టీస్ చేశా! : చైతన్యా రావు
చైతన్యా రావు, బ్రహ్మానందం, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రానా సమర్పణలో కె. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీల్ రోల్ చేసిన చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో టూరెట్ సిండ్రోమ్ (నత్తిగా మాట్లాడటం, మాట్లాడుతున్నప్పడు మధ్యలో ఆగడం)తో ఇబ్బందిపడే వాస్తు పాత్ర చేశాను. మనకు ఓ సమస్య ఉన్నప్పటికీ, అందరిలానే మాములు జీవితం గడపొచ్చనేది నా పాత్రలో ఉన్న సందేశం. యూ ట్యూబ్ వీడియోలు, హాలీవుడ్ సినిమాలు చూసి వాస్తు పాత్రకు ప్రాక్టీస్ చేసుకుని ఆడిషన్‌కు వెళ్లాను’’ అని అన్నారు. -
కిక్కెక్కుతోందే జన్మ...
సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మా.. కిక్కెక్కుతోందే జన్మ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, తిరుపతి జావన లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ఈ సినిమాకు సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ నుంచి 16 వరకు రూ.50, 17వ తేదీ నుంచి 22 వరకు రూ.200, 23వ తేదీ నుంచి 30 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల హెచ్ఎంలు నిర్ణి త సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు. -
కొత్త లోకంలోకి వెళ్తారు
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. ‘మా ఊరి పోలిమేర’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న పంపిణీదారుడు వంశీ నందిపాటి నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ‘మా ఊరి పోలిమేర 2’ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకుని వెళ్తుంది’’ అన్నారు. ‘‘తొలి భాగానికి 20 రెట్లు మలి భాగం బాగుంటుంది. త్వరలోనే ‘పోలిమేర 3’ని కూడా ఆరంభిస్తాం’’ అన్నారు అనిల్ విశ్వనాథ్. ‘‘సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ప్రేక్షకులు ఓ థ్రిల్లింగ్ చిత్రాన్ని చూడబోతున్నారు’’ అన్నారు వంశీ. -
ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు: శ్రీకాంత్
మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా హీరో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఈ మూవీని మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ రి రిలీజ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రైలర్‌ను నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవిని అడిగా. అలా నవ్వి ఇలా వదిలేశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడే మనస్తత్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతూ ఉంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను ఎవరూ చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు మళ్లీ మళ్లీ చూసే ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి చిత్రాలను ఒకప్పుడు థియేటర్లో మళ్లీ ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ, ఛానెళ్లలో వస్తున్నాయి. ఇలాంటి సినిమా మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.' అని అన్నారు. -
భావోద్వేగ దీపావళి
తాతా–మనవడి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కీడా’. పూ రాము, కాళీ వెంకట్ ముఖ్య తారలుగా దీపన్, పాండియమ్మ, విజయ, కమలి కీలక పాత్రల్లో నటించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగులో ‘దీపావళి’గా రిలీజ్ కానుంది. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నవంబరు 11న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్ షేర్ చేశారు. దీపావళి పండక్కి మనవడికి కొత్త డ్రెస్ కొనాలని ఓ మేకను అమ్మకానికి పెడతాడు తాత. కానీ అది మొక్కుబడి మేక కావడంతో ఊర్లో ఎవరూ కొనరు. చివరికి మటన్‌షాప్ పెట్టుకోవాలనుకునే వీరబాబు కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. మేక పాత్ర అబ్బులుకు నటుడు సప్తగిరి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో తాత– మనవడు–మేక మధ్య అనుబంధం, వారి భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
మాస్ అవతార్
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. దసరా సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నామని, ఈ సినిమాలో అల్ట్రా మాస్ అవతార్‌లో మహేశ్‌బాబు ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల!
ఇజ్రాయెల్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరో ఇద్దరు బందీలను విడుదల చేసింది. వారిద్దరూ ఇజ్రాయెల్‌కు చెందిన వృద్ధ మహిళలు. ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృష్టితో ఆ ఇద్దరు బందీలను విడుదల చేసినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతకుముందు శుక్రవారం హమాస్ ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. వారు తల్లీకూతుళ్లు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి, వందలాది మందిని బందీలుగా పట్టుకుంది. ప్రస్తుతం హమాస్ అదుపులో 222 మంది బందీలుగా ఉన్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా గాజా స్ట్రిప్‌ను సీజ్ చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ యాక్షన్ విరమించడం లేదు. కాగా హమాస్ చెర నుండి బందీలను విడిపించేందుకు, వారితో చర్చలు జరిపేందుకు గ్రౌండ్ యాక్షన్ కొంతకాలం విరమించాలని అమెరికా సూచించింది. ఈ చర్య గాజాకు మానవతా సహాయం అందించే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది. అలాగే బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూసేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడుతున్నట్లు అమెరికా తెలిపింది. హమాస్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడమే అమెరికా ప్రథమ ప్రాధాన్యత అని వైట్‌హౌస్ అధికారి జాన్ కిర్బీ తెలిపారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందేలా చూడటం కూడా దీని లక్ష్యమన్నారు. గాజాను విడిచి వెళ్లాలనుకునే అమెరికన్ పౌరులతో సహా గాజా నుండి అమాయక ప్రజలను సురక్షితంగా తరలించాలనుకుంటున్నామని ఆయన అన్నారు. హమాస్- ఇరాన్ మధ్య సంబంధాల గురించి జాన్ కిర్బీ మాట్లాడుతూ ఈ దాడుల్లో ఇరాన్ భాగస్వామి అని తమకు తెలుసని, ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా హమాస్‌కు మద్దతు ఇస్తోందని, ఇరాన్ లేకుండా హమాస్‌కు ఉనికి లేదని ఆరోపించారు. కాగా ఖతార్‌తో సహా ఇతర మధ్యవర్తుల సాయంతో బందీలను విడుదల చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఖతార్ ప్రయత్నాల కారణంగా హమాస్ ఇటీవల ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. ప్రస్తుతం హమాస్ కస్టడీలో 222 మంది పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్‌గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
మేనిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనివీ అమలు చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ సమయంలో తెలంగాణ అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండేదని, ఆర్థికవేత్తల సాయంతో రాష్ట్ర పరిస్థితిపై లోతుగా మదింపు చేసుకుని ప్రయాణాన్ని ప్రారంభించా మని భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చిన హామీలు కేవలం పది శాతమేనని.. ప్రజల అవసరాలు, స్వీయ అనుభవం ఆధారంగా మరో 90% కొత్త పథకాలను అమలు చేశామన్నారు. కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పెంచాలన్నదే తమ విధానమని.. మళ్లీ అధికారంలోకి వచి్చన ఆరు నెలల్లోనే హామీ లన్నింటినీ అమలు చేస్తా మని ప్రకటించారు. గతంలో మేనిఫెస్టో చెప్పినవీ, చెప్పనివీ కలిపి 99.9 % హామీలను నెరవేర్చామని చెప్పారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేశామన్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చడం, పోడు భూముల పట్టాలు, గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు వంటివి అమలు చేశామన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన బీసీ బంధు వంటి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. చేపలు, గొర్రెల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎదిగిందన్నారు. ఉత్తమ వ్యవసాయ, తాగునీరు, విద్యుత్, సాగునీరు, దళిత, సంక్షేమ, విద్య, ఆరోగ్య, పారిశ్రామిక, గృహ నిర్మాణ పాలసీలను రూపొందించుకున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశానికే తలమానికంగా ఎదిగామని పేర్కొన్నారు. ప్రస్తుత విధానాలను కొనసాగిస్తూనే ‘సందర్భోచిత ఉద్దీపన’తో ముందుకు సాగుతామని ప్రకటించారు. ఏపీలో పెన్షన్ల తీరు బాగుంది ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్న ఆసరా పెన్షన్ రూ.2,016ను దశల వారీగా పెంచి రూ.5 వేలకు చేర్చుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల తీరు బాగుందన్నారు. పేదలకు పెన్షన్‌ను క్రమంగా పెంచుతూ ప్రతీ నెలా రూ.3 వేల చొప్పు న అందించే పథకాన్ని ఏపీ విజయవంతంగా అమలు చేస్తోందని కితాబునిచ్చారు. -
పేదలందరికీ రూ.5లక్షలు బీమా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పరిధిని విస్తరించడంతోపాటు కొత్తగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదివారం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో కలసి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. రైతు బంధు, ఆసరా, ఆరోగ్య రక్ష వంటి పాత పథకాల పరిధిని విస్తరించడం ద్వారా రాష్ట్రంలోని సుమారు కోటికి పైగా కుటుంబాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ప్రతిగా ‘సౌభాగ్యలక్ష్మి’, రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందులో చేర్చారు. పేదలకు రూ.5 లక్షల జీవిత బీమా, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా వంటి కొత్త పథకాలను ప్రకటించారు. అగ్ర వర్ణ పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని పథకాలు, హామీలివీ.. దివ్యాంగుల పెన్షన్లు ప్రస్తుత రూ.4,016కు ఏటా రూ.300 చొప్పున చేర్చుతూ రూ.6,016కు పెంపు రెసిడెన్షియల్ విద్యా సంస్థలు: అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఇప్పటికే వివిధ వర్గాల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలను డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడం. ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)కు తిరిగి మార్చే అంశంపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ. దాని నివేదిక ఆధారంగా నిర్ణయం. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ అసైన్డ్ భూముల విముక్తి కోసం చర్యలు మైనారిటీ సంక్షేమ పథకాలు మరింత విస్తరణ