రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌ | Cm Jagan: Input Subsidy Release Program Updates | Sakshi
Sakshi News home page

రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌

Published Wed, Mar 6 2024 1:37 PM | Last Updated on Wed, Mar 6 2024 4:58 PM

Cm Jagan: Input Subsidy Release Program Updates - Sakshi

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసిన సీఎం

సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఖరీఫ్‌ వర్షాభావం వల్ల, మిచాంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్‌ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
సాగుచేసిన ప్రతి ఎకరాకూడా ఇ-క్రాప్‌ కింద నమోదు చేస్తున్నాం
ఎవరు ఎంత సాగు చేశారు? ఏ పంట వేశారనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తోంది
రైతులు ప్రకృతివైపరీత్యాల కారణంగా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం
ఇలాంటి గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోకి వచ్చింది
అవినీతికి, వివక్షకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నాం
మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం
దీనికి నేను చాలా సంతోషిప్తున్నాను, ఆనందపడుతున్నాను
ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే నమ్మకాన్ని కలిగించాం
తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేశాం
రైతులు నష్టపోకుండా అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకున్నాం
3.25లక్షల టన్నుల రంగుమారిన, తడిసన ధాన్యాన్ని కొనుగోలు చేశాం
అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం తోడుగా నిలిచి, అందాల్సిన సహాయాన్ని సమయానికే ఇస్తామన్న భరోసాను కల్పించాం
వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సుమారుగా రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇస్తున్నాం
మొట్టమొదటి సారిగా ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లు రైతులకు చెల్లించాం
గత ఐదేళ్లతో పోలిస్తే రూ. 3,411 కోట్లు మాత్రమే రైతులకు బీమా ఇచ్చారు
ఆ ఐదేళ్లలో ప్రతి ఏటా కరువు వస్తున్నా కేవలం 30 లక్షలమంది రైతులకు మాత్రమే 3,411 కోట్లు మాత్రమే ఇచ్చారు
ఈ సంవత్సరంలో కాస్త వర్షాభావ పరిస్థితులు తప్పిస్తే ప్రతిఏటా కూడా మంచి వర్షాలు పడ్డాయి
నాలుగేళ్లకాలంలో ఒక్క మండలాన్నికూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు
అలాంటి పరిస్థితుల్లో కూడా 54 లక్షలమందికిపైగా రైతులకు బీమాను అందించిన తోడుగా నిలిచాం
ఇ-క్రాప్‌ చేసి రైతులకు ఆటోమేటిక్‌గా ఉచిత పంట బీమాను అందిస్తున్నాం
ఈ 58 నెలల కాలంలో కొత్త ఒరవడిని తీసుకు రాగలిగాం
పెట్టుబడి సహాయంగా ఏటా రూ.13500 ఇస్తున్నాం
గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు 
63 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమిమాత్రమే ఉంది
87 శాతం మంది రైతులకు హెక్టారులోపే భూమి
తాజాగా సబ్‌ డివిజన్లు జరిగిన తర్వాత వచ్చిన డేటా ఇది
క్రమం తప్పకుండా వీరికి రైతు భరోసా అందుతోంది
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల కరువు మండలాలను ప్రకటించాం
వారికి కూడా ఇన్‌పుట్‌ సడ్సిడీ ఇస్తున్నాం
అలాగే తుపాన్‌ కారణంగా నష్టపోయిన వారికి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదలచేస్తున్నాం
వీరందరికీ కూడా ఈ జూన్‌లో బీమా డబ్బు కూడా చెల్లిస్తాం
రైతులు ఎక్కడా కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది
ఉలవలు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న లాంటి పంటలకు సంబంధించి విత్తనాలు పంపిణీ చేశాం
తుపాను వల్ల డిసెంబర్‌ 4న రైతులకు నష్టం జరిగితే డిసెంబర్‌ 8 కల్లా వారికి సబ్సిడీపై విత్తనాలు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశాం
ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన విధంగా తోడుగా నిలుస్తుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement