Tadepalli
-
జగన్ ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
-
నిరంతరం ప్రజలతోనే.. : వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు తోడుగా, వారికి అండగా నిలబడుతుంది. ప్రజల తరపున వారి గొంతుకై నిలుస్తుంది. ‘‘యువత పోరు’’ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకుడు, కార్యకర్తకు అభినందనలు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ (నోరు లేని ప్రజల గొంతుక)గా ఉంటుందని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (YS Jagan Mohan Reddy) వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల కష్టాల్లో నుంచి పుట్టింది.. వైఎస్సార్ సీపీని స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ఈ ప్రయాణంలో ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి తరపున వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. మనం ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో పదేళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూ వస్తున్నాం. కళ్లు మూసి తెరిచేసరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే. ఈరోజు వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడు. ఏ పేద ఇంటికైనా మన కార్యకర్త సగర్వంగా, కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే అవకాశం ఉంది. ఆ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతు చిరునవ్వుతో పలకరిస్తారు. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ ఎప్పుడైనా కూడా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ఈ రోజుకూ ప్రతి ఇంట్లో ఉంది కాబట్టే! వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్ పిల్లల ఫీజుల కష్టాలు... ‘యువత పోరు’ ఈరోజు విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన కార్యక్రమం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఎన్నికల వేళ వాళ్లు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ గాలికెగిరిపోయాయి. చదువులు, వైద్యం, గవర్నెన్స్, వ్యవసాయం.. ఏది చూసినా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి, ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఏడాదికి నాలుగు క్వార్టర్లకు రూ.2,800 కోట్లు కేటాయించాలి. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు కేటాయించాలి. అంటే.. గత ఏడాది ఈ రెండింటికి సంబంధించి పిల్లల చదువుల కోసం మొత్తం రూ.3,900 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. రూ.3,200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతేకాకుండా ఈ ఏడాది 2025–26కి సంబంధించి విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం మరో రూ.3,900 కోట్లు ఇవ్వాలి. అంటే గతేడాది పెట్టిన రూ.3,200 కోట్ల బకాయిలతో కలిపి మొత్తం దాదాపు రూ.7,100 కోట్లు కేటాయించి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి పిల్లల చదువులతో ఆడుకుంటున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ⇒ శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అనుబ«ంధ విభాగాల అ«ధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
YSRCP అంటే వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్.. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (చిత్రాలు)
-
ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించింది: వైఎస్ జగన్
-
Live: పేర్ని నాని PRESS MEET
-
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని.. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10వతేదీ నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తేనే రాష్ట్ర ప్రజలకు ఫలాలు పూర్తి స్థాయిలో అందించవచ్చని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడమన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమన్నారు. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా, మన ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సమావేశంలో ఎంపీలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడటం లేదని.. టీడీపీ ఎంపీలతో కలసి ప్రధాని సహా సంబంధిత కేంద్ర మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని.. కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు వెల్లడించారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గట్టి పోరాటం చేయాలని.. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని, సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని.. దీనివల్ల ఉత్తరాదిలో లోక్‌సభ స్థానాలు పెరిగినట్లుగా దక్షిణాదిలో పెరగవని ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు ప్రస్తావించారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించారు. ‘వన్ నేషన్... వన్ ఎలక్షన్’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఎంపీలు తెలిపారు. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం.. నిరుపేదలకు వైద్య సదుపాయాలను చేరువలో అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ హయాంలోప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలు పెట్టగా.. వాటిలో పూర్తయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే దిశలో చంద్రబాబు సర్కారు చేస్తున్న యత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా.. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా చేరువలో అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని.. కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ సదుద్దేశాలను నీరు గారుస్తున్నారని.. అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని, రాష్ట్రంలో మిర్చికి మద్దతు ధర అంశాన్ని కూడా చర్చకు తేవాలని ఎంపీలకు సూచించారు. వైఎస్ జగన్ భద్రతపై.. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్‌కు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్నారు. ప్రజా నాయకుడైన వైఎస్ జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించేందుకు ఇలాంటి దిగజారుడు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్లో గట్టిగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీపీ) నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తోపాటు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, మేడా రఘునాథరెడ్డి, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
YSRCP ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం
-
భూమిపూజకు రండి.. జగన్ కు నందిపుర పీఠాధిపతులు ఆహ్వానం
-
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
సత్యవర్థన్ని పోలీసులే వేధించి నిర్బంధించారు: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరచకాలు పెచ్చరిల్లాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారని ఘాలు విమర్శలు చేశారు. గన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావటం లేదు. కూటమి ప్రభుతం ఏర్పడిన తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు పెరిగాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మి అనే మహిళ బలైంది. చివరికి ఆమె మీదనే రివర్స్ కేసు పెట్టించి పక్క రాష్ట్రాల పోలీసులతో అరెస్టు చేయించారు. రాష్ట్రంలో అరెస్టులే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారుగన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారు. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు?. గన్నవరం కేసులో తనను సాక్షిగా పిలిచి, ఫిర్యాదుదారుడిగా చేశారంటూ సత్యవర్ధనే జడ్జికి చెప్పాడు. దీన్ని తట్టుకోలేక వల్లభనేని వంశీ మీద అక్రమంగా మరో కేసు పెట్టి జైలులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. కూటమి నేతలకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. చట్టం, న్యాయం అంటే వీరికి గౌరవం లేదు.గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలే తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఏకంగా పోలీసుల మీద దాడులు చేయించాడు. వారి చేతిలో సీఐ కనకారావు గాయపడ్డారు. తర్వాత కేసు మొత్తాన్ని మార్చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరగటం, దగ్గర్లోనే అగ్ని ప్రమాదాలు జరగటంపై మాకు అనుమానాలు ఉన్నాయి. దోషులపై కనీస చర్యలు కూడా తీసుకోని చేతగాని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం దగ్గర్నుంచి జైలు పాలు చేయటం వరకు అన్నీ ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
Watch Live: ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కలిశారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు అంబటి ారాంబాబు, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.నందిగం సురేష్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్‌కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొంటున్న నందిగం సురేష్‌కు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. నందిగం సురేష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం ఏమైతే అక్రమ కేసులు పెట్టిందో వాటిని ధైర్యంగా ఎదుర్కొందామన్నారుకాగా, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్ నుంచి వైఎస్ జగన్ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. -
తాడేపల్లి YSRCP కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్చల్
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు. కార్లు, బైకులపై వచ్చి హడావుడి చేశారు. పార్టీ ఆఫీసు ముందు వాహనాలను ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్ చల్ చేశారు. -
ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు.. 520 కిలోల భారీ కేక్
-
Watch Live: తాడేపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో భారీ ఏర్పాట్లు
-
ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా వైఎస్ జగన్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి.జాన్ వెస్లీ, పాస్టర్ టి.ఎస్.ఆర్ ప్రసాద్ రెడ్డి (కవితం), పాస్టర్ జీవన్ కుమార్ (ఏపీపీఎఫ్, ఏలూరు), బిషప్ రెబ్బ ఇమ్మాన్యుయేల్ (రేపల్లె), రెవరెండ్ వి.కే.జేమ్స్ కుంపట్ల (ఏడిఎఫ్, విశాఖపట్నం), రెవరెండ్ ఎన్.ఐ.సోలోమన్ రాజు (వరల్డ్ విజన్, అవనిగడ్డ), రెవరెండ్ డి.రాజశేఖర్ (ఎన్‌బిఎమ్, నెల్లూరు), రెవరెండ్ ఎం.సుధాకర్ పాల్ (సీఎంసీ, వైజాగ్), రెవరెండ్ విజయ్ కిషోర్ (కడప), రెవరెండ్ మనోజ్ బాబు (తణుకు), బిషప్ శ్రావణ్ కుమార్ (కోనసీమ జిల్లా), పాస్టర్ శ్రావణ్ (తూర్పు గోదావరి), పాస్టర్ గెరా హనోక్ (ఏఐసీసీ ప్రెసిడెంట్), బ్రదర్ కమలాకర్ (ఏఐసీసీ, విజయవాడ), పాస్టర్ కే.ఎలిషా (గణపవరం), పాస్టర్ జాషువా మూర్తి (విజయవాడ), పాస్టర్ మోజెస్ (విజయవాడ), జేసు రత్నాకర్ (మెజిస్ట్రేట్, గుంటూరు), బ్రదర్ వై.ప్రసాద్ బాబు (విశాఖపట్నం) పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను మీ అందరినీ కోరేది ఒక్కటే.. మన పోరాట పటిమ సన్నగిల్లకూడదంటూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్ట,నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటా. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతా.. ‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’’ అని వైఎస్ జగన్ వెల్లడించారు.‘‘ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌తో యుద్ధం చేశాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ నా మీద పిటిషన్లు వేశారు. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా... నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్ప్లూయన్స్ చేస్తానని చెప్పేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వాలే అయినా నేను ప్రభావితం చేస్తానని బెయిల్ తిరస్కరించారు. ఇలా 16 నెలలు చేసారు. కానీ ఏమైంది.. ఆ తర్వాత బయటకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన చేశాం.ఇదీ చదవండి: ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు వెళ్లాల్సిందే: వైఎస్ జగన్..అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
కనకదాసుకు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శ్రీకృష్ణ భగవానుడికి కనకదాస గొప్ప భక్తుడని, ఆధునిక కవిగా ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా, సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు.. ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం అని తన ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు, ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం. pic.twitter.com/lq9enqM7Br— YS Jagan Mohan Reddy (@ysjagan) November 18, 2024 అంతకు ముందు.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కనకదాస జయంతి కార్యక్రమం జరిగింది. కనకదాస చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ టి.ఎన్.దీపిక, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
మీడియా ముందుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ వేధింపులకు సంగతి తెలిసిందే. అలాగే శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామాలపై వైఎస్ జగన్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడనున్నారు. 🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference today.📍Central Office, Tadepalli 🕒3:00 PM#StayTuned ❗https://t.co/RSawyrTK0MLive Link👆🏻#WeStandWithYSRCPSM#YSJagan pic.twitter.com/TDXHh2XQTa— YSR Congress Party (@YSRCParty) November 7, 2024 -
ఆగని కూటమి సర్కార్ వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో నాగిరెడ్డి (నాని) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న నాగిరెడ్డిని పూజ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కారులో పోలీసులు ఎత్తుకెళ్లారు. తాము వినుకొండ పీఎస్ నుంచి వచ్చామని చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత కాదు.. కాదు సత్తెనపల్లి నుంచి వచ్చామంటూ మాటమార్చారు. అసలు వచ్చిన వారు పోలీసులా? టీడీపీ గూండాలా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. నాని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.కాగా, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసుల ద్వారా గూండాగిరీకి బరి తెగించింది. ఫలితంగా ఖాకీ క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. పౌర హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ పోలీసు రాజ్యంతో బెంబేలెత్తిస్తోంది.అయ్యప్ప దీక్షలో ఉన్న వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తని బలవంతంగా తాడేపల్లిలో పోలీసులు కిడ్నాప్ @JaiTDP కూటమి ప్రభుత్వ అసమర్థతని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు వైయస్ఆర్సీపీ కార్యకర్త నాని (నాగి రెడ్డి)ని మఫ్తీలో వచ్చి ప్రైవేట్ కారులో తీసుకెళ్లిన @APPOLICE100 అయ్యప్ప… pic.twitter.com/n4kkeA8j9C— YSR Congress Party (@YSRCParty) November 5, 2024 కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులను ఎదుర్కొంటున్న కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా నిలుస్తోంది. వారికి అండగా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్లపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొని, అన్ని విధాలా వారికి అందుబాటులో ఉండేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ‘సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్సార్సీపీ అండ -
కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా?: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచి మాట తప్పడమే మీ (చంద్రబాబు) నైజమని మరోసారి రుజువు చేశారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేయడం మానండి. విద్యుత్ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు చార్జీలు పెంచడమేనా..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది చంద్రబాబూ? అంటూ సూటిగా ప్రశ్నించారు.‘టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ఎందుకు పెడచెవిన పెట్టారు? ప్రజలపై అదనపు చార్జీల భారం వేయడమే మీ విజనా?’ అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీరు తప్పు చేసి మాపై నిందలా?⇒ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోపే వినియోగదారులపై ఎఫ్‌పీసీసీఏ చార్జీల భారం రూ.6,072.86 కోట్లు మోపింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సిగ్గు లేకుండా వదిలేసి ఎఫ్‌పీసీసీఏ చార్జీల పేరిట వసూలు చేస్తున్నప్పటికీ.. అవి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్యకలాపాలకు సంబంధించిన చార్జీలంటూ మా ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రయత్నించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వమే ఈ చార్జీలు భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఏపీఈఆర్సీ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజులపాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసినా కూటమి ప్రభుత్వం చార్జీలు భరించేందుకు ముందుకు రాలేదంటే అర్థం ఏమిటి? ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానానికి అర్థమేమిటి బాబూ?⇒ ప్రజలపై చార్జీల భారం వేయాలన్నదే మీ ఉద్దేశమని ఇక్కడ స్పష్టమైంది. గతంలోనూ ఇలాగే చార్జీలు పెంచి, ఇదేమి న్యాయం అని అడిగిన ప్రజలను బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి.. తుపాకీలతో కాల్పించి చంపించిన చరిత్ర మీదే. ఇప్పటికైనా విద్యుత్ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు.ఆ రోజే డిస్కంలను అప్పులపాలు చేశారు⇒ గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పులపాలు చేశారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది.⇒ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. 2016–18లో 78 యూనిట్లకు రూ.145.30 నుంచి రూ.202.80 అంటే 39.57 శాతం, 80 యూనిట్లకు రూ.150.50 నుంచి రూ.208 అంటే రూ.38.21 శాతం పెంచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారని మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.⇒ 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉండగా.. విద్యుత్ శాఖను అసమర్థంగా నిర్వహించిన కారణంగా డిస్కంలకు సంచిత నష్టాలు రూ.22,089 కోట్లు వచ్చాయి. అప్పటికే ఉన్న రూ.6,625 కోట్ల నష్టాలతో కలుపుకుని మొత్తంగా రూ.28,715 కోట్లకు నష్టాలు పెరిగాయి. డిస్కంల సంచిత నష్టాలు 4.35 శాతం రెట్లు పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ రంగ సంస్థలపై అప్పులతోపాటు బకాయిల భారం 2014లో రూ.29,552 కోట్లు ఉండగా, అది 2019లో రూ.86,215 కోట్లకు చేరింది.⇒ టీడీపీ ప్రభుత్వం కాలానుగుణంగా ట్రూ అప్ పిటిషన్లను ఏపీఈఆర్సీకి దాఖలు చేయాలి. కానీ అలా చేయలేదు. అందువల్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీడీపీ సర్కార్ హయాం నాటి ట్రూ అప్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. అయితే ఆ భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా అతి తక్కువ భారం పడేలా చేసింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీసీసీఏ తదితర కొత్త పేర్లతో ప్రజలపై భారం మోపి కష్టాలపాలు చేస్తోందంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు నానా రాద్ధాంతం చేశాయి. -
కొత్త వీసీల నియామకం
-
బాబు మాఫియా బండారం బయటపెట్టిన జగన్
-
వాల్మీకి మహర్షికి జగన్ నివాళి..
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.విజయవాడ: కూటమి లిక్కర్ టెండర్లపై వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి నేతల జేబులు నింపడానికే చంద్రబాబు లిక్కటర్ టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారన్నారు.పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్ అన్నారు.ప్రకాశం జిల్లా: ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం చేతకాని ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన మద్యం టెండర్ల లాటరీని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యం వ్యాపారాన్ని చేస్తుందని మండిపడ్డారు. -
కలాం జయంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘అబ్దుల్ కలాం వినయం, ముందుచూపు, విజ్ఞానం, విద్య మీద ఉన్న అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం జీ వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.Remembering Dr. A.P.J. Abdul Kalam Ji on his birthday! A scientist and a revered President his humility, vision, wisdom and unwavering dedication to education have left an indelible mark in the hearts of millions . Kalam Ji’s legacy continues to be a beacon of hope for humanity…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2024 చదవండి: మీరే కదా బాబూ.. లిక్కర్ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్ జగన్ -
తాడేపల్లిలో మంగళగిరి వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో ఆయన చర్చిస్తున్నారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సమాలోచనలు జరిపారు.తిరుమల లడ్డూ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ -
‘ఎన్టీఆర్ మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు’
తాడేపల్లి, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. అదీకాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు.‘‘ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. గాంధీజయంతి రోజు మద్యం పాలసీ ఎందుకు తెచ్చారు?. మహిళల పసుపు, కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, మద్యం మాత్రం రూ.99కే ఇస్తామంటున్నారు. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడమని చంద్రబాబు చెప్తున్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?. మహిళల తాళిబొట్లు తెగినా పట్టించుకోరా?. షాపింగ్ కాంప్లెక్స్ లాగా లిక్కర్ కాంప్లెక్సులు తేవటం ఏంటి?. జగన్ హయాంలో మద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అందుకే ఎలాంటి సమస్యా ఆనాడు రాలేదు. ఇప్పుడు తన మనుషులకు ఆదాయం సమకూర్చేందుకు చంద్రబాబు మద్యం షాపులు ఇస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని బాధ పడిన వ్యక్తి చంద్రబాబు. తిరుపతిలో 227 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వటం దారుణం. ఈ మద్యం పాలసీని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. వీటన్నిటిపై మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం’ అని అన్నారామె.చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్.. -
వైఎస్సార్సీపీ ఏదైనా సాధించగలదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో అనుబంధ విభాగాలు చాలా కీలకమని, వాటి కార్యకలాపాలు గ్రామస్థాయి వరకు విస్తరించాలని.. ప్రతీ కార్యకర్త, అభిమాని అందులో భాగస్వామ్యం కావాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయిన ఆయన.. కీలక సూచనలు చేశారు.‘‘పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడాలి. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. వైయస్సార్సీపీ మన పార్టీ. మనందరి పార్టీ. మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ. నేను మీ అందరి ప్రతినిధిని మాత్రమే’’ అని అన్నారాయన.ఏదైనా సాధించగలంYSRCPకి సంబంధించిన దాదాపు 24 అనుబంధ విభాగాలను యాక్టివేట్ చేస్తున్నాం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పోషించే పాత్ర చాలా కీలకమైనది. కారణం పార్టీకి కాళ్లు చేతులు ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్సే.. ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడగలదు. పరిగెత్తగలదు. పార్టీని పటిష్టపరిచేందుకు మనం శ్రీకారం చుడుతున్నాం. పదిహేను సంవత్సరాలుగా పార్టీ బలంగా ఉంది. మరింత ఆర్గనైజ్డ్గా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వీరిని ఆర్గనైజ్డ్గా అనుబంధ విభాగాల్లోకి తీసుకుని వస్తే.. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం.మనం చేసే కార్యక్రమాన్ని పద్ధతిగా తీసుకుని రావడంతో పాటు, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్ కదులుతుంది. ఎప్పుడైతే కేడర్ అగ్రెసివ్ గా కదులుతుందో అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతాం. పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉంటనే మనం ఈ పోరాటం చేయగలుగుతాం. మనం పిలుపునిస్తే.. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలి. అప్పుడే మనం ఆర్గనైజ్డ్గా పని చేస్తున్నట్లు అవుతుంది.అందరినీ కలుపుకుపోవాలిపార్టీ ఒక పిలుపు ఇస్తే అది గ్రామస్ధాయి వరకు మెసేజ్ పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామస్ధాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్ధను క్రియేట్ చేయాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకుని రావాలి. ఇందులో భాగంగా మిమ్నల్ని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించాం. తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తైంది. ఇప్పుడు మీరు ఆయా జిల్లాల్లో అధ్యక్షులతో మమేకం కావాలి. ప్రతి జిల్లాలోనూ అనుబంధ విభాగాలకు సంబంధించి.. జిల్లా, నియోజకవర్గ, మండల స్ధాయి వరకు నియమించాలి. ముందుగా బలమైన జిల్లా అధ్యక్షుడిని నియమించాలి. ఆ తర్వాత నియోజకవర్గం, మండలాల ద్వారా ప్రతి గ్రామంపై దృష్టి పెట్టాలి.జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిస్తే ఆ జిల్లా అంతా కదలాలి. రాష్ట్రస్థాయి నుంచి పిలుపునిస్తే.. గ్రామ స్ధాయి నుంచి కదలిక రావాలి. అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి మిమ్మల్ని ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ లేనంత ధ్యాస పెడుతున్నాం. గ్రామస్ధాయి నుంచి తొలిసారిగా ఇంత ధ్యాస పెట్టి ఆర్గనైజ్డ్గా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. వేగంగా అడగులు వేస్తున్నాం. మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ జిల్లాలో తిరగాలి. పర్యవేక్షణ చేయాలి. ఏం జరుగుతుందో చూడాలి. అందుకే ఇందులో అనుభవం ఉన్నవాళ్లను నియమించాం.సమన్వయంతో సమష్టి కృషిజిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా సమ్వయంతో పని చేయాలి. సంయుక్తంగా పార్టీని ఎలా గ్రామస్థాయికి తీసుకుని పోవాలి అన్నదానిపై ఒక వర్క్ షాప్ కూడా ఉంటుంది. ఇందులో గ్రామస్దాయికి పార్టీని ఎలా తీసుకుని పోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న 24 విభాగాల్లో కొన్ని గ్రామస్థాయి వరకు విస్తరించాల్సిన విభాగాలు ఉంటాయి. వాటికి గ్రామస్ధాయి వరకు ప్రతినిధులు.. యువత, మహిళా, రైతు ఇలా అన్ని విభాగాల్లో ఉండాలి. ఈ కార్యక్రమాన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కలిసి చేయాలి.జిల్లా అధ్యక్షుడితో అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంత విస్తృతంగా మమేకమై తిరగగలిగతే.. అంత లోతుగా గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరిస్తుంది. అలాగే పార్టీకి కూడా అంత మేలు జరుగుతుంది. నేను కూడా అయా విభాగాలతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది.‘జగన్’ మీ అందరి ప్రతినిధి మాత్రమే:మీమీద నమ్మకంతో పెట్టిన ఈ బాధ్యతను మీరు అంతే బాధ్యతగా నెరవేరిస్తే.. మీక్కూడా మంచి జరుగుతుంది. పార్టీ మీ సేవలను గుర్తిస్తుంది. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికే ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ మనది, మనందరిది అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. మనం అందరం కలిసికట్టుగా పార్టీని నిర్మించుకున్నాం. జగన్మోహన్రెడ్డి మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. వారికే ప్రధమ ప్రాధాన్యత కూడా ఉంటుంది.క్షేత్రస్థాయి నుంచి బలోపేతంపార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం మూడు, నాలుగు నెలల్లో పూర్తి కావాలి. ఆ తర్వాత బూత్ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. పార్టీ నిర్మాణంలో ఉన్న వారందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలి. వారందరినీ పార్టీలో భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలి. వైఎస్సార్సీపీని దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా నిర్మించాలన్న ధృఢ సంకల్పంతో పని చేస్తున్నాం. క్షేత్రస్ధాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వారంతా పార్టీని నమ్ముకుని ఉన్నారు. వాళ్లందరికీ పార్టీ వ్యవస్ధలోకి తీసుకుని రావాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా పని చేయాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఇద్దరూ ఎలా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం చేసుకోవాన్న దానిపై త్వరలోనే వర్క్ షాప్ నిర్వహిస్తామని జగన్ తెలిపారు. -
వైఎస్సార్సీపీలో రెండు నియామకాలకు వైఎస్ జగన్ ఆదేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు కీలక పదవులకు కార్యదర్శి, అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం నియమితులయ్యారు. చదవండి: కరెంట్ ఛార్జీలతో ప్రజల నెత్తిన మరో పిడుగు: కాకాణి గోవర్ధన్ రెడ్డి -
‘వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడి యత్నం హేయం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడి యత్నం హేయమని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాష్, పోతిన మహేష్‌తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి మండిపడ్డారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురందేశ్వరి, లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు, ఎల్లో మీడియా దారుణ ఆరోపణ చేస్తోందని ఆయన ఆక్షేపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే టీడీపీ, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అంబటి అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంపై భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తల దాడి యత్నాన్ని ఖండించిన మాజీ మంత్రి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని కోరారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. దానికి ఆధారాలు ఏమున్నాయని నిలదీశారు. అందుకు వారు చూపిస్తున్న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు గత జూలై 23న వచ్చిందన్న ఆయన, అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబే అని గుర్తు చేశారు. అదే రిపోర్టుకు సంబంధించి, ఆనాడు (జూలై 23న) మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, లడ్డూ తయారీ కోసం కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యత పరీక్షిస్తే.. అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి కలిపినట్లుగా తేలిందని, ఆ నెయ్యిని రిజెక్ట్ చేశామని, ఇంకా ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదీ చదవండి: వాస్తవాలు నిగ్గు తేల్చాలి.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖఆ తర్వాత ఈనెల 18న ఎన్డీఏ సమావేశంలో టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణల తర్వాత, 20వ తేదీన మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, మాట మార్చారని గుర్తు చేశారు. తాము ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి కలిపినట్లు అవశేషాలు ఉన్నట్లుగా, నివేదిక వచ్చిందని తెలిపారని ప్రస్తావించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తూ, టీటీడీని, శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆక్షేపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తమ పార్టీ నేత, కుటుంబంతో సహా స్వామి వారి చెంత కుటుంబ సమేతంగా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తే, స్పందన లేదని అంబటి గుర్తు చేశారు. గుడ్డ కాల్చి మొహం మీద వేసి తుడుచుకోమంటున్నారని ఆక్షేపించారు.కూటమిలో భాగమైన బీజేపీకి సంబంధించిన విభాగం బీజేవైఎం, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ప్రయత్నించిందన్న మాజీ మంత్రి, అది ఏదో ఒక విధంగా జగన్‌పై బురద జల్లాలనే కుట్రపూరితమైన ప్రయత్నం అని అభివర్ణించారు. అసలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా? లేక జగన్ ప్రతిష్టను దెబ్బ కొట్టాలనుకుంటున్నారా? అని అంబటి నిలదీశారు.‘దైవాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ పరువు మీద దాడికి ప్రయత్నిస్తే శ్రీ వెంకటేశ్వరస్వామివారు కూడా సహించరు. పురందేశ్వరి.. అమ్మా ఏంటిది?. వైఎస్ జగన్ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఏవేవో విసిరి ఆనందపడాలనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేస్తున్నారనే బాధతో ప్రజలు, కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒక పార్ట్ అమ్మేశారు. ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు. అక్కడ రగిలిపోతుంటే దాన్ని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటికి కచ్చితంగా సమాధానం ఉంటుందని అంబటి స్పష్టం చేశారు.టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించిన రోజునే, స్వామివారిని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం మొదలైందన్న మాజీ మంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి టెస్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్‌కు జగన్‌గారిని బాధ్యుడిని ఎలా చేస్తారని నిలదీశారు. అది చాలా అన్యాయం, అక్రమం, దుర్మార్గమన్న ఆయన.. ముగ్గురూ కలిసి తొండి ఆడుతున్నారని అభివర్ణించారు.గత జూలైలో కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యతపై అనుమానంతో పరీక్ష చేయించామని, ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించామని స్వయంగా టీటీడీ ఈఓ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. లడ్డూ తయారీలో కల్తీ నూనె ఎక్కడ వాడారో పవన్‌కళ్యాణ్ చెప్పాలని స్పష్టం చేశారు.నెయ్యిలో నాణ్యత లేకపోతే, తిప్పి పంపించడం ఆనవాయితీ అని గుర్తు చేసిన మాజీ మంత్రి, 2019–24 మధ్య 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలిపారు. అలా టీడీపీ హయాంలోనూ 14 ట్యాంకర్లు వెనక్కు పంపారని, అయినప్పటికీ నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తూ.. గుడ్డ కాల్చి మొహాన వేస్తున్నారని ఆక్షేపించారు. నిజంగా ఆధారాలు ఉంటే, ఇలా ఆరోపణలు చేయకుండా, వాటిని చూపాలని కోరారు. ఎంత మంది చెప్పినా అబద్ధం నిజమైపోదన్న అంబటి.. జగన్ హయాంలో ప్రసాదాల తయారీలో ఏ పొరపాటు, తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. అలా జరిగి ఉంటే, నిరూపించాలని సవాల్ చేశారు.రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ ఉన్న జగన్ ప్రజాదరణ తట్టుకోలేక నిత్యం ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తూ నిందిస్తున్నారని, అందుకోసం చివరకు దేవుణ్ని కూడా వాడుకుంటున్నారని.. అయితే అవన్నీ శ్రీ వెంకటేశ్వరస్వామివారు చూస్తున్నారని, వారిని తప్పకుండా శిక్షిస్తారని చెప్పారు.పవన్‌కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను ప్రస్తావించిన మాజీ మంత్రి, అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు ఆ దీక్ష చేయాలని, పొరపాటు అయ్యింది కాబట్టి క్షమాపణ కూడా చెప్పి, సంప్రోక్షణ చేసుకోవాలని సూచించారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే సంస్కృతి చంద్రబాబుది అని అంబటి రాంబాబు వివరించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వంద రోజుల వైఫల్యాలు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’ -
వైఎస్సార్సీపీ నేతలతో.. జగన్ కీలక భేటీ
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ లో వినాయక చవితి ఉత్సవాలు
-
వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
తాడేపల్లి, సాక్షి: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘ తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’అంటూ ట్వీట్ చేశారు.తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#HappyVinayakaChavithi— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2024 -
జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్
-
పంద్రాగస్టు వేడుకలు: జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024 -
జగన్ ను కలిసేందుకు పోటెత్తిన అభిమానులు
-
జననేత వైఎస్ జగన్‌కు అభిమాన వెల్లువ.. (ఫొటోలు)
-
కార్యకర్తలతో వైఎస్ జగన్
-
తాడేపల్లి : కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జనంతో జననేత.. పేరుపేరునా పలకరిస్తూ.. (ఫొటోలు)
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబు ఆటవిక పాలనను ఎండగడుతూ జగన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
తాడేపల్లికి చేరుకున్న వైఎస్ జగన్
విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ధర్నా నిర్వహించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఆయన ఉదయం 8.25 గంటలకు ఇక్కడికి విచ్చేశారు. ఇదే విమానంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, పేర్ని నాని, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దేవినేని అవినాష్ , పేర్ని కిట్టు తదితరులు వచ్చారు.విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గం ద్వారా తాడేపల్లి చేరుకున్నారు. కాగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక పాలనపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో చేపట్టిన ధర్నా విజయవంతమైందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ దమనకాండపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు మంచి స్పందన వచి్చందన్నారు.సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తోపాటు పలు రాజకీయ పారీ్టల ప్రతినిధులు తమకు సంఘీభావం తెలియజేశారని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన గురించి దేశ ప్రజలందరికీ తెలిసిందన్నారు. త్వరలో ప్రధాని మోదీని కూడా కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సంఘటనలను యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సందర్భంగా ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమేనని పలు పారీ్టల నేతలు అభిప్రాయపడ్డారని తెలిపారు. -
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీని అణగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని, పైగా ఈ అరాచక పాలన ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. ఆయన అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్… వైన్‌షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. కాలిన బైక్.. వైఎస్సార్సీపీ వాళ్లది, దీనికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యింది. దాన్ని ట్విస్ట్ చేసి… నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మా కొడుకు ఏం తప్పుచేశాడని రషీద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వైఎస్ జగన్ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయిదీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారుఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉందిలోకేష్ పుట్టినరోజున హతుడు ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపించిన ఫొటోలు హంతకుడి ఫొటోలను తల్లిదండ్రులు చూపారుస్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారుతన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారుటీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారుమాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారుతప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి15 సంవత్సరాలగా వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఉందిచంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కలేరుజరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయిరాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలిచంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలిపోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదురేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారుబుధవారం నాడు నిరసన తెలుపుతాంరాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాంఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలిజరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందిఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాను.ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు:అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా?ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదుప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలిఅన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలిరాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచికాదుప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయిబుధవారం ధర్నా అయిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలిపార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలిఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్ జగన్ ఆదేశంఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈకార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశంగత ఎన్నికల్లో మనం 86శాతం సీట్లను గెలిచాంఅయినా ఇలాంటి ఘటనలు జరగలేదువైఎస్సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాందాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదుప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాంప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశందీనిపై ఎవ్వరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశంఅందుకే దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారుపార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యంఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యతఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలికార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలిరాష్ట్రంలో వైయస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారువారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందిమన పోరాటం ద్వారా గట్టి ఒత్తిడి తీసుకురావాలి -
నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తాడేపల్లికి రానున్నారు. గత సోమవారం బెంగుళూరు వెళ్లిన వైఎస్ జగన్.. వినుకొండ ఘటన నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు.కాగా, టీడీపీ దాడులపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి
-
వైఎస్ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్ జగన్ మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు
-
కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు. ప్రజావేదికతో సంబంధం లేదు ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్‌పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్‌కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్‌లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు. -
బాబు దుష్ట పాలనకు నిదర్శనమిది
సాక్షి, అమరావతి: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం చంద్రబాబు కూటమి దుష్ట పాలనకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని సీతానగరంలో బాబు ప్రభుత్వం కూల్చివేసిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రాంతాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు తదితరులతో కలిసి పరిశీలించారు.అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విధానం కాదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిందేనని, అప్పట్లోనే టీడీపీకి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గుర్తు చేసారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఈ భవనాన్ని కూల్చబోమని నిన్న కోర్టులో చెప్పి, ఇవాళ ఉదయాన్నే కూల్చి వేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అన్నారు. నియమ నిబంధనల ప్రకారం భవనం నిర్మాణం చేపట్టిన విషయాన్ని న్యాయస్థానానికి తాము వివరించామన్నారు.అయితే శని, ఆదివారాల్లో అప్పీలు చేసుకునే అవకాశం లేదనే తెల్లవారుజామునే పార్టీ కార్యాలయం కూల్చివేత చేపట్టారన్నారు. ఈ దుర్మార్గ చర్యను దేశంలోని ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. అధికారంలో ఉన్నాం కదా అని కూల్చివేయడం సరికాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. చట్టబద్ధ పాలన చేస్తామని, కక్ష సాధింపులు ఉండవని చెప్పిన సీఎం చంద్రబాబు.. అధికారాన్ని చేపట్టిన రోజుల వ్యవధిలోనే విధ్వంస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి దుర్మార్గ పాలనను రాజకీయ పక్షాలు క్షమించకూడదన్నారు. ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చివేయాలంటే చట్టపరంగా రావాలని, న్యాయ స్థానాల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకాలపాలపై కోర్టులో పోరాడుతామని, ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు. కేబినెట్ ఆమోదించాకే ఇక్కడ స్థలాన్ని తీసుకొని, పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారన్నారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపేనని, ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు. -
అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచి ఈరోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి దమనకాండ చూస్తూనే ఉన్నామన్నారు.హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూలి్చవేయడం కూటమి నేతల విధ్వంసకాండకు పరాకాష్టగా చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వైఎస్సార్సీపీ కార్యాలయాలకు అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అధికారులతో నోటీసులు జారీ చేయించారన్నారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, తమ పార్టీ దేవాలయాలను రక్షించుకుంటామని అన్నారు. అనుమతులున్నా.. లేవంటూ నోటీసులు విశాఖ, అనకాపల్లి పార్టీ కార్యాలయాలకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అనుమతుల్లేవంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 33 ఏళ్లకు డబ్బు చెల్లించి పార్టీ కార్యాలయానికి స్థలాలు లీజుకు తీసుకున్నామన్నారు. విశాఖ కార్యాలయానికి రూ.15 లక్షలు, అనకాపల్లి కార్యాలయానికి రూ.38 లక్షలు వీఏంఆర్డీఏకి చెల్లించి గతేడాది ఫిబ్రవరి నెలలోనే అనుమతి కోరామన్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఏదైనా పార్టీ కార్యాలయాలకు లీజు పద్ధతిలో ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవచ్చనేది ఉందని, దాని ప్రకారమే 33 ఏళ్లకు లీజుకు తీసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిరి్మస్తున్నామని తెలిపారు. గజాల్లో స్థలం ఉంటే జీవిఎంసీ అనుమతి కావాలని, కానీ 2 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలంటే వీఎంఆర్డీఏ అనుమతి తీసుకోవాలన్నారు.దాని ప్రకారమే డబ్బులు చెల్లించి వీఎంఆర్డీఏ అనుమతి కోరామన్నారు. సెప్టెంబర్‌లో మార్టగేజ్ కూడా చేశామని తెలిపారు. ఈ నిర్మాణాలు తమ పరిధిలోకి రావని వీఎంఆర్డీఏ చెప్పి ఉంటే అప్పుడే జీవిఎంసీ అనుమతి కోరేవాళ్లమని అన్నారు. రూల్ ప్రకారం వీఎంఆర్డీఏ ద్వారానే జీవీఎంసీకి కూడా అనుమతికి పంపిస్తారని తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయాన్ని అక్రమ పద్ధతుల్లో నిర్మించారు విశాఖలో టీడీపీ కార్యాలయానికి నిర్మాణం చేపట్టిన 16 ఏళ్ల వరకు అనుమతే తీసుకోలేదని, అనుమతుల్లేకుండా అక్రమ పద్ధతిలో దాన్ని నిర్మించారని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా నిరి్మంచిన టీడీపీ కార్యాలయాలను కూల్చడం క్షణాల్లో పని అని, కానీ తాము ఆ పని చేయలేదని అన్నారు. 2015–19 మధ్య ఏపీలో 10 టీడీపీ కార్యాలయాల కోసం లీజు పద్ధతిలో స్థలం తీసుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.ఇది బుల్డోజర్ల ప్రభుత్వమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం అక్రమాలతో పాలన సాగిస్తోందని శుక్రవారం తమ పారీ్టకి చెందిన 4వ వార్డు కార్పొరేటర్ కొండబాబు ఇంటిపై రాళ్లతో టీడీపీ మూకలు దాడి చేశాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు.ఇది ప్రజాస్వామ్యమేనా? హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అధికార బలంతో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూలి్చవేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని, నారా డిస్ట్రక్టివ్ అలయన్స్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. టీడీపీ కార్యాలయాలు చాలావరకు అనుమతుల్లేకుండా నిరి్మంచినవేనని తెలుసుకుని, అప్పుడు తమ పార్టీ ఆఫీస్‌కి నోటీసులిస్తే బెటర్ అని సూచించారు. -
కూల్చివేతకు గురైన YSRCP పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన అంబటి
-
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం కూల్చివేతపై అంబటి రాంబాబు రియాక్షన్
-
చంద్రన్న ప్రజాస్వామ్యవాదా?.. విధ్వంసకారుడా?
-
KSR Live Show: కక్ష సాధింపు.. బాబు ప్రతీకార రాజకీయాలు
-
ఏపీలో మొదలైన విద్వాంస పాలన
-
తాడేపల్లిలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం కూల్చివేత
-
నేడు వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 20న గురువారం తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది. -
నేడు వైఎస్ జగన్ ను కలిసిన కీలక నేతలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు నేతలు కలిశారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉదయం నుండి క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అందరినీ కలిసిన వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు.రేపు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే జూన్ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. -
ఈ నెల 20న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. టీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపటి (జూన్ 19నాటి) పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం పలువురు నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్‌రాజ్, పొన్నాడ సతీష్, సింహాద్రి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాబూరావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చిర్ల జగ్గిరెడ్డి, విశ్వాసరాయ కళావతి, బుట్టా రేణుక, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, శోభా హైమావతి, వంగా గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, ఎల్ అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. -
మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. ⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు, పోలింగ్ బూత్‌ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు. ఎన్నికల తీరుపై అనుమానాలుఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైస్ ఛైర్మన్ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాహిత పాలన కొనసాగాలని, ఆయనకు మరోసారి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ.. 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం బుధవారం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్‌తో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. పూర్ణాహుతికి వినియోగించే ద్రవ్యాలకు సీఎం జగన్‌తో షోడశోపచార పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చండీయాగ నిర్వాహకులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద రెడ్డి, విజయశారదా రెడ్డి దంపతులు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
-
డా. బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల… pic.twitter.com/Da4B5jWmQo — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2024 -
పిఠాపురంలో జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి శేషకుమారి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్‌తో అసలు పవన్‌ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరు’ అని తెలిపారు. నన్ను జనసేనలోకి రమ్మనటం పవన్ అవివేకం డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్‌ను కూడా నేను మా వైఎస్సార్సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్‌కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు’ అని వంగా గీత అన్నారు. -
సీఏఏపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక ప్రకటన చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించబోమన్నారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు. కులాలు, మతాల మీద వివక్ష చూపటం కరెక్టు కాదు. వైఎస్సార్సీపీకి అన్ని వర్గాలూ ముఖ్యమే. .. అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ సీఏఏ తెచ్చిన బీజేపీతో కలవటం కరెక్టు కాదు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్తారు’ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. -
‘2014లో పొత్తులతో గెలిచిన బాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?’
సాక్షి, తాడేపల్లి: యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?. పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? అని మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు. మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు?. చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి?. టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?. పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో కలిశారో కూడా చెప్పాలి. ...అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది?. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు. 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?. నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా?. సీఎం జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా?. సీఎం జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా?’ అని మార్గాని భరత్ అన్నారు. -
నేడు కవయిత్రి మొల్ల జయంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: నేడు 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి. కాగా, మొల్ల జయంతి సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాగా, ఈరోజు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తంలు పాల్గొని నివాళులు అర్పించారు. ఇక, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. -
మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
Watch Live: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం
-
Tadepalli: ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని, అంతే తప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు. తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు. ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు. జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదన్నారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: YSRCPకి 13 ఏళ్లు పూర్తి.. విశ్వసనీయతకు ప్రతీక పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘‘జగన్ అంటేనే విశ్వసనీయత. చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్‌ది అని కొనియాడారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, జగన్ లాంటి సీఎం మాకూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. చరిత్ర సృష్టించటం జగన్‌కే సాధ్యం.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్‌ని ఓడించి తీరుతాం. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్లీ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. -
ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది. రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాక్షాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఖరీఫ్ వర్షాభావం వల్ల, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►సాగుచేసిన ప్రతి ఎకరాకూడా ఇ-క్రాప్ కింద నమోదు చేస్తున్నాం ►ఎవరు ఎంత సాగు చేశారు? ఏ పంట వేశారనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తోంది ►రైతులు ప్రకృతివైపరీత్యాల కారణంగా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం ►ఇలాంటి గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోకి వచ్చింది ►అవినీతికి, వివక్షకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నాం ►మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ►దీనికి నేను చాలా సంతోషిప్తున్నాను, ఆనందపడుతున్నాను ►ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే నమ్మకాన్ని కలిగించాం ►తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేశాం ►రైతులు నష్టపోకుండా అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకున్నాం ►3.25లక్షల టన్నుల రంగుమారిన, తడిసన ధాన్యాన్ని కొనుగోలు చేశాం ►అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం తోడుగా నిలిచి, అందాల్సిన సహాయాన్ని సమయానికే ఇస్తామన్న భరోసాను కల్పించాం ►వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సుమారుగా రూ.1300 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నాం ►మొట్టమొదటి సారిగా ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లు రైతులకు చెల్లించాం ►గత ఐదేళ్లతో పోలిస్తే రూ. 3,411 కోట్లు మాత్రమే రైతులకు బీమా ఇచ్చారు ►ఆ ఐదేళ్లలో ప్రతి ఏటా కరువు వస్తున్నా కేవలం 30 లక్షలమంది రైతులకు మాత్రమే 3,411 కోట్లు మాత్రమే ఇచ్చారు ►ఈ సంవత్సరంలో కాస్త వర్షాభావ పరిస్థితులు తప్పిస్తే ప్రతిఏటా కూడా మంచి వర్షాలు పడ్డాయి ►నాలుగేళ్లకాలంలో ఒక్క మండలాన్నికూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు ►అలాంటి పరిస్థితుల్లో కూడా 54 లక్షలమందికిపైగా రైతులకు బీమాను అందించిన తోడుగా నిలిచాం ►ఇ-క్రాప్ చేసి రైతులకు ఆటోమేటిక్‌గా ఉచిత పంట బీమాను అందిస్తున్నాం ►ఈ 58 నెలల కాలంలో కొత్త ఒరవడిని తీసుకు రాగలిగాం ►పెట్టుబడి సహాయంగా ఏటా రూ.13500 ఇస్తున్నాం ►గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు ►63 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమిమాత్రమే ఉంది ►87 శాతం మంది రైతులకు హెక్టారులోపే భూమి ►తాజాగా సబ్ డివిజన్లు జరిగిన తర్వాత వచ్చిన డేటా ఇది ►క్రమం తప్పకుండా వీరికి రైతు భరోసా అందుతోంది ►ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల కరువు మండలాలను ప్రకటించాం ►వారికి కూడా ఇన్పుట్ సడ్సిడీ ఇస్తున్నాం ►అలాగే తుపాన్ కారణంగా నష్టపోయిన వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీ విడుదలచేస్తున్నాం ►వీరందరికీ కూడా ఈ జూన్‌లో బీమా డబ్బు కూడా చెల్లిస్తాం ►రైతులు ఎక్కడా కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ►ఉలవలు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న లాంటి పంటలకు సంబంధించి విత్తనాలు పంపిణీ చేశాం ►తుపాను వల్ల డిసెంబర్ 4న రైతులకు నష్టం జరిగితే డిసెంబర్ 8 కల్లా వారికి సబ్సిడీపై విత్తనాలు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశాం ►ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన విధంగా తోడుగా నిలుస్తుంది -
సీఎం జగన్ అధ్యక్షతన 27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇదీ చదవండి: జనసేన పరిస్థితి ఇంత హీనమా?.. పవన్‌పై హరిరామజోగయ్య ఫైర్ -
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి బుధవారం కలిశారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రాలు తీసుకున్న అనంతరం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ఏప్రిల్ 2వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో పూర్తయ్యింది. నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో 11 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీకి 8 మంది సభ్యులున్నారు. ఇప్పుడు మిగతా మూడు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరాయి. దాంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమయ్యాయి. టీడీపీ బలం సున్నాకు చేరింది. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు.. 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలను సీఎం జగన్ ఆశీర్వదించారు. -
చంద్రబాబు సవాల్‌కు మేము సిద్ధమే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్‌లు అయినా చేస్తారని మండిపడ్డారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతాని ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా? అని ఫైర్ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నామని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలీదని సజ్జల ఎద్దేవా చేశారు. సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్‌పై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని తెలిపారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అన్నారు. చంద్రబాబు సవాల్‌కు తాము సిద్ధమేనని అన్నారు. చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-1) ‘గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు. చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు . మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం చంద్రబాబు సవాల్‌కు మేము సిద్దమే. మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు. అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి. సీఎం జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి. కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. ... మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్ గా చెప్పాలి. సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు . ఏ సభలోనూ సీఎం జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు. ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు. ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా? . 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు. ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు. సీఎం జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు?. ... రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు?. సీఎం జగన్ ఆస్థులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం. చేతిలో పచ్చ మీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు. చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు. ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని సీఎం జగన్‌కు చుడుతున్నాడు. జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి. కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి. త్వరలోనే మేనిఫెస్టోని ప్రకటిస్తాం. చేయగలిగినదే చెప్తాం. చేయలేనివి ఎందుకు చేయలేక పోయామో కూడా చెప్తాం’ అని సజ్జల అన్నారు. చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-2) -
Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ
ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. ‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్‌లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్ లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్‌గా వోకల్ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్ నా క్లాస్మేట్. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది. సంగీత గురువు సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్ బాలభవన్‌లో వయోలిన్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్‌లోనే ‘గాయక్ అసిస్టెంట్’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్కి వయోలిన్ సహకారం అందించాను. అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను. ఎన్టీఆర్‌గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్ రంగరాజన్‌గారి హయాంలో గవర్నర్ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్. నిరంతర గాన వాహిని నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్ కెనడా, యూఎస్, సింగపూర్లలో మ్యూజిక్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్‌లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్‌క్లాస్‌కు వచ్చారని, ఇంటర్మీడియట్ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు. మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్‌గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్‌గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్‌గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మంచి టీచర్ ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్ చానెల్ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. – తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్ విద్వాంసురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
తాడేపల్లి: సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం
-
విజన్ లేని బాబు.. పారిపోయేందుకు పవన్ సిద్ధం.. కోతికి కొబ్బరిచిప్పలా షర్మిల
సాక్షి, తాడేపల్లి: భీమిలిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తొలిసభ విజయం పార్టీ క్యాడర్‌కు మరింత నూతనోత్తేజం ఇచ్చిందని అన్నారు. అంబటి రాంబాబు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు, సెటైర్లు వేశారు. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పాలనను సీఎం జగన్ చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోని వైఫల్యాలను కూడా సీఎం జగన్ వివరించారు. సీఎం జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు కూడా సభలు నిర్వహిస్తున్నా ప్రజాస్పందన లేకుండా పోయింది. తాను ఇది చేశానని చెప్పుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. చంద్రబాబు పరిపాలన అంతా ఆయన వర్గం కోసమే. అయినా ప్రజల్ని మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. .. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు తనకు ఏం విజన్ ఉందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ కేసులో పట్టుబడి చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. తాను తప్పు చేయలేదని మాత్రం ఆయన చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతోనే బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే నాకు ముక్కుతాడు వేస్తాడట. అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు. ఆంబోతులకు ఆవుల్ని సరఫరా చేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఆయనకంటూ ఓ మంచి విజన్ లేదు. ఆయనకున్న విజన్.. అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు. మేనిఫెస్టో పేరుతో మోసం చేసిన ఘనత ఆయనది. అసలు మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేసి.. దాన్ని లేకుండా చేయడమే ఆయన విజన్. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. పవన్ కల్యాణ్ సిద్ధం అంటున్నారు... దేనికి సిద్ధం? . చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా?. చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? అని అంబటి ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ తనపై రాళ్ల దాడికి నేనే కారణం అని అంటున్నారు. ఆ అవసరం నాకు లేదు. సింపథీ కోసమే ఆయన అలా చేస్తున్నారు. బాబు, కన్నా నన్ను టార్గెట్ చేశారు. అయినా నేను భయపడను. కోతికి కొబ్బరి చిప్పలా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దొరికింది. ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె తెలంగాణకు తిరిగి వెళ్లడం ఖాయం అని అంబటి అన్నారు. ఏపీలో ఇల్లు లేని వాళ్లకు కూడా హడావిడి చేస్తున్నారని.. ఎన్నికలయ్యాక వీరంతా హైదరాబాద్‌కు వెళ్లిపోతారని అంబటి స్పష్టం చేశారు. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు జరిగిన మంచి.. రాష్ట్రాభివృద్ధి.. సంక్షేమ పథకాలే వైఎస్ జగన్‌కు తిరుగులేని విజయాన్ని అందిస్తాయి. అభిమన్యుడిలా ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహాన్ని ఛేదించి వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని అంబటి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది: జరగబోతున్న ఎన్నికలకు సర్వసన్నద్ధం అయ్యి మొన్న భీమిలిలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. ఆ సభ కనీవినీ ఎరుగని రీతిలో అశేష ప్రజానీకం పాల్గొని మరింత నూతనోత్సాహాన్ని ఇచ్చారు. ప్రత్యర్థి రాజకీయ వర్గాల గుండెల్లో దడ పుట్టించేలా పెద్ద ఎత్తున ఈ సభ జరిగింది. ఆ సభలో జగన్ గారు అనేక విషయాలను మాట్లాడారు. వైఎస్సార్సీపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చారో చెప్పారు. దానితో పాటు చంద్రబాబు పరిపాలన విధానాలను ప్రజలకు వివరిస్తూ ఆయన్ను సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. మేం ఇన్ని కార్యక్రమాలు చేశాం..జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ మార్క్‌ను వేశాం..మీరు ఏ గ్రామమైనా వెళ్లి నడిబొడ్డున నిలబడి ఈ గ్రామానికి ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. చంద్రబాబు కూడా సభలు పెడుతున్నారు కానీ జగన్ గారు సూటిగా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా తప్పుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదంటే..అది ప్రజా సంక్షేమం కోసం జరిగిన పరిపాలన కాదని అర్ధమవుతోంది. కేవలం తన వర్గాన్ని, తన తాబేదార్లు, పెత్తందార్ల కోసం మాత్రమే ఆయన పరిపాలన చేశాడు. సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసం, బాలయ్య సినిమాలో డైలాగులు చెప్పుకుంటూ పోతున్నాడు. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు..అదే చంద్రబాబు విజన్: జగన్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తాను అధికారంలోకి వచ్చాక రాజకీయంగా, ఆర్థికంగా బలపడేలా చేశానని చెప్పారు. సుమారు రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు అందించానని చెప్పారు. మీరు పద్నాగేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేశారా అంటే మాత్రం మాట్లాడడు. కానీ నాకో విజన్ ఉంది అని చంద్రబాబు, ఆయన పత్రికలు మాత్రం డప్పు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌లో జైళ్లో ఉన్నాడు. కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్షాధారాలతో న్యాయస్థానాలు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపాయి. ఆ 53 రోజులు చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటూ ఆయన, ఆయన పత్రికలు చెప్పుకొచ్చాయి. ఆయన వళ్లంతా భయంకరమైన పరిస్థితి వచ్చింది..ఆయనకు గుండె జబ్బు ఉంది..ఆయనకు ప్రాణాపాయం ఉందంటూ ఎల్లో మీడియా రాసుకొచ్చారు. బయటకు వచ్చారు..ఇప్పుడు ఆయనకు ప్రాణాపాయం ఉందా? లోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు..బయటకు వస్తే అరుపులు కేకలు పెట్టడమే ఆయన విజన్. చంద్రబాబు విజన్ ఏంటంటే అందితే జుట్టు..అందకపోతే కాళ్లు..అదే చంద్రబాబు విజన్. ఇలాంటి విజన్ చేసిన చంద్రబాబుకు మరో విజన్ కూడా ఉంది. ఎన్నికలకు ముందు దస్తాలకు దస్తాలు మేనిఫెస్టో విడుదల చేసే విజన్ కూడా ఉంది. లేనిపోనివన్నీ చెప్తాడు..దానిలో పొందుపరుస్తాడు..అసాధ్యమైనవి కూడా చేస్తానంటాడు. రైతులకు రుణమాఫీ చేస్తానంటాడు..డ్వాక్రా మహిళల రుణమాఫీ చేసేస్తా..కాపులకు కోట్లకు కోట్లు ఇస్తా..కాపులను బీసీల్లో చేర్చేస్తా అని చెప్పే విజన్ బాబుది. ఎన్నికలయ్యాక గెలిస్తే ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు..వెబ్సైట్లో నుంచి తీసేయడమే ఆయన విజన్. చంద్రబాబు శరీరంలో అణువణువూ విషమే: నాది విజన్..జగన్‌ది పాయిజన్ అంటాడు. జగన్ గారి విజన్..పాయిజన్ అయితే రూ.2.53 లక్షల కోట్లు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషం ఎలా అవుతుంది చంద్రబాబూ..? నువ్వు విషం..నీ ఆలోచనలు విషం..నీ శరీరంలో ప్రతి అణువణువూ విషమే. ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు అంతటి విషపూరిత రాజకీయ వేత్త ఎవరూ లేరు. అరికాలి నుంచి తల వరకూ విషంతో నిండిపోయిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. అత్యంత విషపూరితమైన నల్లత్రాచును తీసుకొచ్చి చంద్రబాబు ముందు పెడితే..ఆయన అలా చూస్తే చాలు అది విషం కక్కుకుని చావకపోతే నన్ను అడగండి. అంత విషపూరితమైన మనిషి చంద్రబాబు...నేడు జగన్ గారిని పాయిజన్ అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు..ఆ విషయం ఆయనే చెప్పుకున్నాడు. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నాకు ఎన్నికలు లేవు..అసెంబ్లీకి రాను అన్నాడు. అది ఖాయమైంది..అందుకే ఏ విధంగానైనా అబద్ధాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్ గారిపై విషం చిమ్మి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలి అనే ఆత్మస్థైర్యం లేని వ్యక్తిగా చంద్రబాబు నిలిచాడు. మీరంతా తట్టాబుట్టా సర్ధుకుని హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధం: జగన్ గారు బీమిలిలో సిద్ధం అన్నారు...మా 175 మంది అభ్యర్థులు సిద్ధం అన్నారు.. మేం సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే చంద్రబాబు రెస్పాండ్ కాలేదు కానీ పవన్ కల్యాణ్ మేము కూడా సిద్ధం అంటున్నాడు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే ప్రకటించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న మీరు ఇక దేనికి సిద్ధం..? పవన్ కల్యాణ్ ఎక్కడ నిలబడతాడో తెలియదు..చంద్రబాబు ఒకచోటా..రెండు చోట్ల నిలబడతాడో తెలియదు. ఒకదానికి మాత్రం వీళ్లంతా సిద్ధం..ఎన్నికల తర్వాత తట్టాబుట్టా సర్ధుకుని హైదరాబాద్ నివాసానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లకు ఎలాగూ ఇక్కడ ఇళ్లు కూడా లేవు కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్ధుకోడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ మీరు దేనికి సిద్ధం..? చంద్రబాబు, లోకేష్‌లను భుజానేసుకుని మోయడానికి సిద్ధమా? ప్యాకేజీ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా?..ఓ కొణిదెల పవన్ కల్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం..? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాడానికి సిద్ధమా..? జగన్ గారు సిద్ధం అన్నారు కాబట్టి మేమూ అనాలని అనడం తప్ప వేరేది లేదు. మీకు సిద్ధం ఎక్కడుంది..పెద్ద అయోమయంలో ఉన్నారు. మీరు ఓడిపోతారని భయంతో ప్రయాణం చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. జగన్ గారు అర్జునుడిలా వైఎస్సార్సీపీ జెండా మళ్లీ ఎగురవేయబోతున్నారు చంద్రబాబు, ఆయన సైన్యం జగన్ గారిపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. మీది కౌరవ సైన్యం..జగన్ గారు అర్జునుడిలా కురుక్షేత్ర యుద్ధంలో గెలవబోతున్నారు. అభిమన్యుడు కాదు..ఎంత సైన్యం వచ్చినా పద్మవ్యూహాన్ని కూడా జయించి ఏపీలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఐదేళ్లు చిత్తశుద్ధితో పరిపాలన చేశారు..చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు. ప్రతి వాగ్ధానాన్ని అమలు చేశారు. మేనిఫెస్టోలోని ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ గారు. మేనిఫెస్టోని దగా చేసి తగలేసిన దౌర్భాగ్యులు మీరు.. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు. జగన్ గారి లాంటి ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకోడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తిరిగి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ రాజ్యాన్ని తెచ్చుకోడానికి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ గారు రూ.2.53 లక్షల కోట్లు బటన్ నొక్కి సిద్ధంగా ఉన్నారు..ఫ్యాన్ గుర్తుకు రెండో సారి బటన్ నొక్కేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మధ్యలో మీరు మాత్రం దిష్టిబొమ్మల్లా నిలబడి ఉన్నారు. మీరు త్వరలోనే ప్యాకేజీ తీసుకుని ప్యాకప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. రాళ్లు వేయించి, దాడులు చేయించే సంస్కృతి నా చరిత్రలో లేదు: నా ప్రత్యర్థి టీడీపీ తరఫున పోటీకి సిద్ధం అవుతున్న కన్నా లక్ష్మీనారాయణ తొండపి గ్రామం వెళ్తే అక్కడ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్లు నేనే వేయించానని, ఆయనపై హత్యాయత్నం చేయించానని నా పై బురదజల్లే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులపై రాళ్లు వేయించడం, దాడులు చేయించడం నా చరిత్రలో లేదు..ఉండదు కూడా. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనే సత్తా ఉన్న రాజకీయ పార్టీలో జగన్ నాయకత్వంలో నేనున్నాను. ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సందర్భం నా జీవితంలో లేదు.. నన్ను టార్గెట్ చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కన్నాపై దాడి చేశారని చెప్పించి సింపతీ పొందాలని చూస్తున్నారు. అంబోతు రాంబాబు రాళ్లేయించాడు...అంటూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముక్కుతాడు వేస్తాను అంటున్నాడు. నువ్వు అధికారంలో వచ్చేది లేదు..సచ్చేది లేదు.. నీ వాళ్లకే నువ్వు ముక్కుతాళ్లు వేయలేదు. నీ చరిత్ర ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే నువ్వు ముక్కుతాడు వేస్తావా? మేం మళ్లీ అధికారంలోకి వస్తాం..నువ్వు ఎక్కడున్నా పట్టుకుని నీ చేతిపై ‘ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్త’ అని పచ్చబొట్టు వేయిస్తా. మాట్లాడితే ఆంబోతు అంటున్నావ్...పనికిమాలిన, నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి నువ్వే. నన్ను గిల్లాడు..నేనూ గిల్లుతున్నాను..ఆయన ముక్కుతాడు వేయగలిగితే..నేను పచ్చబొట్టు వేయించలేనా? -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ‘‘సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/JzQs860tFe — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2024 -
కాసేపట్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టు ఫలితాలు విడుదల
సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక సహాయకుల పోస్టుల రాత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://apaha-recruitment.aptonline.in/ వెబ్ సైట్లో చూసుకోవచ్చు. కాగా సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసి.. గత డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: ముత్యాల ముగ్గులు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర… — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2024 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిట్ ముందు లొంగిపోయిన చంద్రబాబు
-
మహిళల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పూర్తి మద్దతు ఉందని, వారి సహకారంతోనే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లిలో గురువారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు పోతుల సునీత, రుతు కళ్యాణి నేతృత్వంలో రాష్ట్ర కమిటి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మహిళా సాధికారత అమలు చేసినట్లు తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా మహిళా సాధికారతకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. మహిళలకు ఉద్దేశించి రూపొందించిన అన్ని పథకాలూ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికేనని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి. దేశ స్థూల ఉత్పత్తి అభివృద్దికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్దిలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలన్నదనే సీఎం జగన్ ఉద్దేశ్యమని అన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. మొత్తం జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారికి 30 శాతం కన్నా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రధాని కలిసిన ప్రతిసారీ మహిళా సాధికారత, రిజర్వేషన్లు గురించి ప్రస్థావించడంతో కల సాకారమయ్యిందని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాలుగా వివిధ పథకాల కింద ఆర్థిక తోడ్పాటు అందించారన్నారు. డీబీటీ ద్వారా 3,43,02,005 మహిళా లబ్దిదారులు రూ.95,867 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 30,76,018 మందికి రూ.75,670 కోట్లు ఆర్థిక సహకారం అందించారన్నారు. ఈ గణాంకాలు మహిళలపై జగన్ ప్రభుత్వం చిత్తశుద్దికి అద్దం పడుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం, విద్య, వైద్యం, రక్షణ కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు, నవరత్నాలు కింద 2023 బజ్డెట్ లో మొత్తం రూ.27697 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, స్వేచ్ఛా కార్యక్రమం, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న బడుగు వికాసం మహిళలకు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. వైకాపాతోనే కాపులకు న్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేస్తం పథకం కింద సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాల్లో రూ.75 వేలు మొత్తం 357844 మంది మహిళల ఖాతాల్లో రూ.2028.77 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అయితే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులకు ఏమి చేశారో చెప్పలేకపోయారని అన్నారు. వైఎస్సార్ హౌసింగ్ స్కీం కింద 3076018 మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారని అన్నారు. అలాగే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 41770406 మంది మహిళా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో 55.1 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం పగడ్బంధీగా అమలు చేయడంతో గతంలో కంటే మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మహిళలపై నేరాలు 2019లో 67.09 శాతం ఉండగా, 2020లో 65 శాతానికి తగ్గినట్ల తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ఎస్) డేటా ప్రకారం రాష్ట్రంలో మహిళలపై లింగ వివక్ష, హింస 43.04శాతం నుండి 30 శాతానికి తగ్గినట్లు తెలిపారు. జాతీయ స్థాయికి మించి ఏపీలో బాలికల ఎన్రోల్మెంట్ అలాగే మాధ్యమిక విద్యా స్థాయిలో బాలికల ఎన్రోల్మెంట్ జాతీయ స్థాయిలో 79.04 ఉండగా ఏపీలో 84 ఉందన్నారు. దేశంలో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఏపీ ఉందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళల్లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని, మహిళా కార్మికులు భాగస్వామ్యం 10.86 శాతం పెరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల కోసం రూ.12628 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళలకు వైఎస్సార్సీపీ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర పార్టీలు ఇవ్వడం లేదని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళల సపోర్టుతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. గతంలో నామినేటెడ్ పోస్టులు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేని వారికి ఈ సారి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న మంచి, లబ్దిని జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని కోరారు. సమావేశాలకు లబ్ధి పొందుతున్న వారందరికీ అలాగే తటస్థులను ఆహ్వానించాలని సూచించారు. పార్టీ రూపొందించిన బ్రోచర్స్ పంపిణీ చేయాలని కోరారు. కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, కోనసీమ, ఏలూరు, ప్రకాశం. వెస్ట్ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి మహిళా కమిటీలు ప్రకటించారని, తిరుపతి త్వరలో ప్రకటిస్తారని అన్నారు. క్రిష్ణా, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు , చిత్తూరు, సత్యసాయి, విశాఖ, అన్నమయ్య జిల్లాల కమిటీలు ప్రకటించాల్సి ఉందని అన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఈస్ట్ గోదావరి, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాలు పూర్తి చేయాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల కుట్రలు తిప్పుకొట్టాలి: ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మహిళలకు రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ గారు అనేక అవకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టర్లు మహిళలకే 50 శాతం కేటాయించేలా జగన్ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ,ఇతర పథకాల ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.. మహిళలకు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అందరికీ చెప్పాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు..జగన్ గారి మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను విమర్శలను తిప్పుకొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈ ప్రభుత్వం ఆదుకుందన్నారు.కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడితే, ఆ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ప్రగతి బాటలో మహిళలు: వరుదు కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్ మహిళ విభాగం మరో అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా మహిళా సాధికారతతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా దేశంలోనే మందుందని చెప్పారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సీఎం జగన్ ప్రతి పథకంలోనూ లబ్ధిదారులుగా గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో మహిళలు ప్రగతి బాటలో పయనిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పైగా పదవులు మహిళలకు ఇచ్చి జగన్ గౌరవించారని చెప్పారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90% పైగా మహిళలు లబ్ధిదారులు ఉన్నారని తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తుందని ఆమె చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర మహిళా విభాగానికి ఉందని పిలుపునిచ్చారు -
పండగ సంతోషాలు వెల్లివిరిసేలా.. జగనన్న తోడు
సాక్షి, తాడేపల్లి: ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ, వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా.. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా.. 3,95,000 చిరువ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు, మొత్తం16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను రేపు (గురువారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వారిని నిలబెడుతూ.. ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తూ, రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందించనున్నారు. రేపు(గురువారం) అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ.13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. రేపు(గురువారం) అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ.3,373.73 కోట్లు.సకాలంలో రుణాలు చెల్లించిన మీ తరపున వడ్డీని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భరించనుంది. లబ్దిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరందరికీ ‘‘జగనన్న తోడు’’.. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు. తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు. గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు. చేనేత మరియు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు. చిరువ్యాపారులను ఆదుకోవడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. ‘‘జగనన్న తోడు’’ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) ప్రభుత్వం కల్పించింది. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16,73,576 మందికి ‘‘జగనన్న తోడు’’ ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ క్రింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు అయితే రాష్ట్రంలో ‘‘జగనన్న తోడు’’ ద్వారా అందించిన రుణాలే అక్షరాల రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ క్రింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.138.49 కోట్లుగా ఉంటే ‘‘జగనన్న తోడు’’ ద్వారా రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లుగా ఉంది. చదవండి: APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ.. గురువారం నుంచి డోర్ పిక్ అప్ అండ్ డోర్ డెలివరీ -
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేశినేని నాని
-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని సమావేశం (ఫొటోలు)
-
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేశినేని నాని
-
సీఎం జగన్‌తో ముగిసిన కేశినేని నాని భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు. కాగా విజయవాడ ఎంపీ అయిన కేశినేని టీడీపీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఆమె తన పదవికి రాజీనామా సమర్పించారు. చదవండి: ఈ ఏడుపంతా.. మోసాల బాబు కోసమే కదా! -
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్‌కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్భం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు. చదవండి: ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అద్భుత విజయంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ శనివారం అద్భుత విజయం సాధించింది. ఆదిత్య వ్యోమనౌక సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలో లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ వ్యోమనౌక అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. చదవండి: Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం.. ఎల్ 1 పాయింట్లోకి ప్రవేశించిన వ్యోమనౌక -
AP: మున్సిపల్ కార్మికులతో చర్చలు
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. చదవండి: టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ -
‘మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు’
సాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ‘మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే’.. అంటూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు.. నా పేరు శాంతిశ్రీ అన్నా.. నేను కాపునేస్తం మూడు విడతల్లో తీసుకున్నా అన్నా. నాలుగోసారి మిస్ అయితే వాలంటీర్లు నాకు రాకపోవడానికి కారణం కనుక్కొని మరీ నాలుగో విడత వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియడంతో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లు ఆనందం కలిగిందన్నా. నాకు కాపు నేస్తంతో చాలా సహాయం అందుతుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మా కాపులను మీరు గుర్తుపెట్టుకొని, కాపులకు సాయం చేయాలనే తపనతో మాకు మీరు ఈ పథకాన్ని ఇచ్చారన్నా. కాపులు గురించి ఆలోచించి మీరు మంచి పని చేశారు. కాపు నేస్తం ద్వారా కుట్టుమిషన్ కొనుక్కొని అదే నా జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నా అన్నా. నా భర్త వికలాంగుడు అన్నా.. జనవరి 1 తేదీనే వాలంటీర్ మా ఇంటికి వచ్చి మరీ పించన్ డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అన్నా. నాకు కొడుకులు లేరన్నా.. నా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడని మా భార్యభర్తలు ఇద్దరం చాలా సంతోషపడుతున్నాం అన్నా. -శాంతి శ్రీ, కాపు నేస్తం లబ్దిదారు (రాజమండ్రి రూరల్ హకుంపేట్ గ్రామం) మా అమ్మ సంతోష ఉంది.. మీరు సల్లంగా ఉండాలి.. నమస్తే జగన్ సర్.. గత రెండు నెలలుగా ఆటో డబ్బులు పడినాయ్ సార్. మూడోసారి పడలేదు.. వాలంటీర్ నాకు రాకపోవడానికి కరెంట్ బిల్లు సమస్య అని చెప్పి.. ఆ సమస్యను తీర్చి మళ్లీ మూడోసారి నాకు డబ్బులు పడేలా చేశారు. మాకు ముందు నుంచి ఈ పథకాలు లేకున్నా.. మీరు మాకు ఈ పథకం ఇస్తున్నందుకు మా ఆటోనడిపేవారందరీ తరఫున ధన్యవాదాలు సర్. మీ ద్వారా మా అమ్మకు పించన్ వస్తుంది. పించన్ మూడు వేల రూపాయలు కావటం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సర్.. మీరు సల్లంగా ఉండాలి. - వాహన మిత్ర లబ్దిదారు (ఖాజా హుస్సేన్, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు) మీ సాయం.. నా జీవితానికి ఓ మలుపు ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కరం. నా పేరు సాయి ప్రత్యూష అన్నా.. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మగారు చిన్న హస్టల్లో పనిచేసేవారు. మా నాన్న గారు చిన్న సామాన్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు మా అమ్మగారు మరణించారు. అలాంటి సమయాలో నేను పైచదువులు చదవాలన్న ఆలోచనను వదులుకున్నా అన్నా. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నా. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ నాకు సాయం చేయలేదన్నా. అలాంటి సమయంలో మా వాలంటీరు స్వయంగా మా ఇంటికి వచ్చి.. ‘జగనన్న చేదోడు’ పథకం కింద టైలర్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. దాని నేను చాలా సంతోషించా. మీరిచ్చే చేదోడు పదివేలతో పెట్టుబడి పెట్టి ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని పెద్దగా తీసుకువెళ్లాలని అనుకున్నా. ఉదయం టైలరిగ్ చేస్తూ.. సాయంత్రం ట్యూషన్ చెబుతూ జీవనం సాగిసున్నా అన్నా. మీరు చేదోడు పథకం ద్వారా ఇచ్చే పదివేల సాయం చాలా చిన్నది కావొచ్చు.. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇదొక మలుపు తిరిగే పాయింట్ అన్నా. మీరు ఇచ్చే ఈ పట్టుబడితో నా కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నా. -సాయి ప్రత్యూష, జగనన్న చేదోడు లబ్ధిదారు, (శ్రీకాకుళం పట్టణం) -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ శాంత
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జే. శాంత మంగళవారం వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కాగా అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జే శాంత వాల్మీకి సామాజికి వర్గానికి చెందినవారు. 2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శాంతమ్మ మాట్లాడుతూ.. జగన్ పాలనలోనే వాల్మీకిలకు ప్రాధాన్యం లభించిందన్నారు. వైఎస్సార్సీపీ సిద్దాంతాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇక నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్సార్సీపీలో పని చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ తాను తోడుంటానని.. అందరం కలిసి జగన్‌కు అండగా ఉందామన్నారు. జగన్ చేస్తున్న మంచి పనులు దేశమంతటా తెలుసన్నారు జే శాంత. ఒక ఇంటికి పెద్దకొడుకు ఎలా బాధ్యతగా ఉంటారో సీఎం జగన్ అలా పని చేస్తున్నారని తెలిపారు. ఏపీ రాష్ట్రం జగన్ పాలనకు దాసోహం అంటోందని.. అలాంటి పార్టీలో తాను కూడా ఒక సైనికురాలిగా పని చేస్తానని చెప్పారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో పని చేయటానికి వచ్చానని పేర్కొన్నారు. తాను ఒక బీసీ వర్గానికి చెందిన మహిళని, వాల్మీకి కులానికి గతంలో ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జగన్ మాత్రమే వాల్మీకిలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారని కొనియాడారు. చదవండి: అలాంటివాళ్లు వెళ్లిపోతేనే మంచిది: ఏపీ మంత్రి అమర్నాథ్ -
New year: సీఎం జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సీఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ క్రమంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు.. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను టీటీడీ వేదపండితులు, దుర్గ గుడి వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చకులు అందించారు. ఇక, దుర్గ గుడి వేదపండితులు అమ్మవారి చిత్రపటం, క్యాలెండర్, ప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
AP: సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆరోగ్య మంత్రి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మాండవీయ సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహుకరించారు. -
తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ‘‘తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్‌దే. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘తండ్రికి మించిన తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయి. గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా?. అధికారంలో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఈడ్చి కొట్టారు. అయినాసరే మళ్ళీ ప్రజలను నమ్మించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇదీ చదవండి: జయహో జననేతా..ఏ దైవం పంపించాడో! -
పేద విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తే తప్పేంటీ: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బైజూస్‌పై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులపై మీకు(రామోజీరావు) ఎందుకు అంత అక్కసుని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తే తప్పేంటీ? అని నాగార్జున యాదవ్ సూటీగా ప్రశ్నించారు. చదవండి: చుక్కలు చూపిస్తానన్న పవన్‌కు డిపాజిట్ కూడా రాలేదు: సీఎం జగన్ -
CM Jagan Review On Cyclone: తుపానుపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు అధికారులతో సమీక్ష జరిపారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మరోమారు సమీక్ష చేస్తానని ఆయన తెలిపారు. పొలాల్లో, కలాల్లో ఉన్న ధాన్యం తడిపోకుండా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం.. తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. చదవండి: ముంచుకొస్తున్న మిచాంగ్ -
టీడీపీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి ధర్మాన
-
పరిశ్రమలకు శంకుస్థాపన
-
క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
పలు పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
పూలే బాటలో సీఎం జగన్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, తెలుగు, సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పూలే బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, పూలే ఆశించిన సామాజిక సాధికారత సీఎం జగన్ సాధించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అణగదొక్కాలనుకున్నారని, బలహీన వర్గాల గుండె చప్పుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సీఎం జగన్‌కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన జర్నలిస్టులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్ -
సీఎం జగన్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోవిడ్ సమయంలో ఏపీ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. మహమ్మారి అవతరించిన సమయంలోనూ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన పొందారని పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా మంచి ప్రగతిని సాధించామని తెలిపారు. విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నామని సజ్జల పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 2019లో ఏపీ జీఎస్డీపీ 22వ స్థానం కాగా.. 2021-22లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. వ్యవసాయంలో ఏపీ 6వ స్థానం.. 16,500 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని సజ్జల చెప్పారు. వ్యవసాయంలో గత హయాంలో 27వస్థానం ఉంటే.. అప్పట్లో వృద్ధి రేటు 6.5శాతం ఉండేందని ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఏపీ 6వ స్థానంలో ఉందని, వృద్ధిరేటు 8శాతం సాధించామని తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నామని, ఈ మ్యానిఫెస్టోనే వైస్సార్సీపీ ప్రభుత్వానికి గీటురాయని పేర్కొన్నారు. చదవండి: ‘చంద్రబాబుకు దృష్టిలోపం.. అందుకే పేదల వైపు చూడలేకపోయాడు’ రేపటి నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ‘గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం జగన్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఇది కదా అభివృద్ధి అనే విధంగా ప్రజలకు చూపిస్తాం. కుట్రపూరితంగా మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. బాబు పాలనలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్ ఉంది. ప్రతి స్కీమ్‌లోనూ వచ్చే లాభంపైనే చంద్రబాబు ఫోకస్. కులమతాలకు అతీతంగా పారదర్శక పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. త్వరలో డోర్‌టు డోర్ క్యాంపెయిన్ మొదలు పెడతాం’ అని సజ్జల పేర్కొన్నారు. -
‘ప్రజలు ఛీ కొట్టినా నారా లోకేష్‌కు బుద్ది రాలేదు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఉందా? అని ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. దొంగచాటుగా మంత్రి అయిన లోకేష్.. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని, ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా లోకేష్‌కు బద్ది రాలేదని జోగి రమేష్ దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్‌కు ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా? అని జోగి రమేష్ నిలదీశారు. కక్షసాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయారని అన్నారు. ‘సీఎం జగన్ హీరో.. లోకేష్ జీరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని సీఎం జగన్ హీరో అయ్యారు. చంద్రబాబు తప్పు చేయలేదని లోకేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? 3,300 కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు ఆధారాలతో సహా స్కిల్ స్కామ్ కేసులో బాబు దొరికిపోయారు కనుకే జైలుకు వెళ్లాడు. స్కాం బయట పడ్డాక రిమాండ్‌కు వెళ్లారు. రాజ్ భవన్ బయట లోకేష్ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. చంద్రబాబుని అరెస్టు చేశారనీ, జైలుకు పంపారని ఏడుపు మొదలెట్టాడు. అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? గవర్నర్‌కు ప్రజాస్వామ్యం, చట్టం గురించి తెలియదని లోకేష్ అనుకుంటున్నారు. సిద్దార్దలూత్ర లాంటి గంటకు కోటన్నర తీసుకునే లాయర్లతో వాదించినా ఎందుకు బెయిల్ రాలేదు?. కన్ను బాగలేదు, కాలు బాగులేదని చెప్పుకుని బయటకు వచ్చారు. చంద్రబాబుకు మెడికల్ గ్రౌండ్స్లేనే తప్ప సాధారణ బెయిల్ ఎందుకు రాలేదో తెలుసుకో లోకేష్. మమ్మల్ని తొక్కితాడంట. ఆల్రెడీ మేము తొక్కేసి, తాట తీశాం అన్న సంగతి తెలుసుకో. ఇదే స్కిల్ స్కాంలో ఈడీ అధికారులు నలుగురిని అరెస్టు చేశారని ఎందుకు చెప్పలేదు?. సీఐడీ మా పరిధిలో ఉందన్నావు సరే మరి ఈడీ, ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వలేదా? టీడీపీకి కాదు, తన జాతికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. అధికారం ఉంటే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదా?. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యూహాలు వేసినా టీడీపీ అడ్రస్ గల్లంతే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి జగనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది గుర్తు పెట్టుకుని లోకేష్ పిచ్చిప్రేలాపనలు మానుకోవాలి’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
ఇంటి పంటగా కుంకుమ పువ్వు!
కశ్మీర్‌లోని చల్లని ప్రదేశాల్లోనే సహజంగా ఆరుబయట పొలాల్లో కుంకుమ పువ్వు పండుతుంది. అయితే, కృత్రిమ శీతల వాతావరణం సృష్టించిన గదుల్లో కూడా ఈ పంటను పండిస్తున్నారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎరట్రి దారాల్లాంటి కేసరాలు ఉంటాయి. వాటిని సేకరించి జాగ్రత్తగా నీడన ఎండబెట్టి భద్రపరిచి వాడుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్యోగం చేస్తున్న కె. శైలజారెడ్డి తన ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వును ఇంటిపంటగా పండిస్తున్నారు. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గర్భవతులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. స్వీట్లు, ఖీర్, బిర్యానీ, ఫ్రూట్ సలాడ్లలో దీన్ని వాడుతుంటారు. శ్రీఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీనిధి అనే యువతి కుంకుమ పువ్వు సాగు చేస్తున్న వీడియోలు యూట్యూబ్‌లో చూసి స్పూర్తి పొందిన శైలజారెడ్డి తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు చేపట్టారు. ఇండియా మార్ట్ ద్వారా కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం అక్కడ రైతులకు, విత్తనాలను సేకరించి అమ్మే వారికి మధ్య వివాదం రావడంతో ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని శైలజారెడ్డి తెలిపారు. రూ. 4 లక్షల పెట్టుబడి శైలజారెడ్డి తన మూడు బెడ్రూమ్లతో కూడిన ఇంట్లోనే.. 12“12 అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో ఇనుప ర్యాక్‌లలో ఫైబర్ టబ్‌లు, కృత్రిమ వెల్తురు సదుపాయాలను సమకూర్చి కుంకుమ పువ్వు పండిస్తున్నారు. విత్తనాలకు, ఈ ఏర్పాట్లకు రూ. 4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. చల్లని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనువైనది. మనం గదిలో కృత్రిమ శీతల వాతావరణాన్ని కల్పించి నిశ్చింతగా సాగు చేయవచ్చని శైలజారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గదిలో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. గాలిలో తేమ శాతం 80% ఉండాలి. ఇందుకోసం గదిలో చిల్లింగ్ యంత్రాన్ని, హ్యుమిడిఫయర్‌ను ఏర్పాటు చేశారు. కృత్రిమ కాంతితో కూడిన తగుమాత్రపు వేడి కోసం గదిలో 20 వరకూ గ్రోలైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ లైట్లు వెలిగిస్తే సరిపోతుంది. పూత దశలో తప్ప ఇతర కాలాల్లో గది పగటి ఉష్ణోగ్రత 16–17 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్న శైలజారెడ్డి ఇటీవలే తొలి పంట తీశారు. ఇప్పటి వరకూ 1441 పువ్వులు పూస్తే అందులో నుంచి 10 గ్రాముల కుంకుమ పువ్వు కేసరాల దిగుబడి వచ్చింది. గ్రాము రూ. ఏడు వందల చొప్పున ఆరు గ్రాములను అమ్మారు. మిగిలిన కుంకుమ పువ్వును తనతోపాటు పనిచేసే వారికి కొంచెం కొంచెం బహూకరించాలని నిర్ణయించుకున్నట్లు శైలజారెడ్డి చెప్పారు. తాను గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన కుంకుమపువ్వును ఇప్పుడు తాను పండించిన కుంకుమ పువ్వుతో పోల్చి పరిశీలించినప్పుడు, అది కల్తీది అని స్పష్టంగా అర్థమైందన్నారు. గ్రోలైట్ల వెలుగులో కుంకుమ పూల సాగు వాడకానికి సిద్ధమైన కుంకుమ పువ్వు ఎయిరోపోనిక్స్..? కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమం (మట్టి 50%, ఇసుక 40%, వర్మీ కంపోస్టు పది మట్టి%)లో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. అంటే.. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే. నవంబర్– డిసెంబర్లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని శైలజారెడ్డి వివరించారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని శైలజారెడ్డి వివరించారు. మొదటి ఏడాదే పెట్టుబడి! ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి సంవత్సరమే పెట్టుబడి అవసరమవుతుంది. రెండో సంవత్సరం నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు. ఈ అనుభవాలను ఇతరులకు పంచాలని ‘శాన్వి శాఫ్రన్ ఫార్మ్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశాను. – కె. శైలజారెడ్డి, కుంకుమ పువ్వు సాగుదారు, తాడేపల్లి, గుంటూరు జిల్లా . మొబైల్: 94912 33492. (సా. 7 గం. తర్వాత ఫోన్ చేయొచ్చు) www.youtube.com/ @ShanviSaffronFarms – దాళా రమేష్ బాబు, సాక్షి, బ్యూరో ఇన్చార్జ్, గుంటూరు (చదవండి: టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!) -
ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై(ఎస్ఐపీబీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల ఉత్పాదకతలో విప్లవాత్మక మార్పు పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహణ చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలని, ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శకత విధానాల ద్వారా అత్యంత సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగామని అన్నారు. ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని, ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు,. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ‘పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం. అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వర్గాలనుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరుచేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాలి. ఎంఎస్ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ముందుకు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలి. గత ప్రభుత్వంలో కన్నా పరిశ్రమలకు పోత్సాహకాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం. ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం. ఇన్సెంటివ్‌లు ఇస్తూ వారికి చేదోడుగా నిలిచాం. ఎంఎస్ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎక్కువమంది వీటిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వంమీదున్న బాధ్యత’ అని సీఎం తెలిపారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. 1. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు. 2. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. రూ.531 కోట్లు పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 3. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. రూ.1750 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 4. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్‌స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్)కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్. రూ.166 కోట్ల పెట్టుబడి, దాదాపు 5 వేలమందికి ఉద్యోగాలు. 5. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్ధానంలో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎస్ఐపీబీ ఆమోదం. రూ.6,174 కోట్ల పెట్టుబడి, 600 మందికి ప్రత్యక్షంగానూ, 2000 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 6. ఇవికాక మరో మూడు కంపెనీల విస్తరణకూ ఎస్ఐపీబీ ఆమోదం, ఆమేరకు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్రాపేపర్ లిమిటెడ్ విస్తరణ. రూ.4వేల కోట్ల పెట్టుబడి, 3 వేలమందికి ఉద్యోగాలు. 7. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ. రూ.679 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు. 8. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ. రూ.933 కోట్ల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు. 9. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్. 310 మందికి ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. 10. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ పుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు. -
నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అర్భన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. సీఎం ఆదేశాలు ఇవే.. ►వర్షాకాలం ముగిసి పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి. ►త్వరగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ►నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ►సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి వినియోగించేలా చూడాలి. ►విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►ముడసర్లోవ పార్క్ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. ►విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలి. ►కన్వెన్షన్ సెంటర్, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలి. ►విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ►కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ చేపట్టాలి. ►జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి. ►ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం తెస్తున్న అత్యాధునిక యంత్రాలను సద్వినియోగం చేయాలన్నారు. -
సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రై రేషన్ పంపిణీపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని చెప్పారు. అందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ బుధవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలని పేర్కొన్నారు. వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని.. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని, జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులపై క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: చంద్రబాబు ప్లాన్ రివర్స్.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్! -
సీఎం జగన్‌ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందన్న ప్రతినిధులు.. పారదర్శకంగా, వివక్ష లేకుండా వారికి పథకాలు అందుతున్నాయని కొనియాడారు. పాస్టర్లకూ గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలవటంపై క్రైస్తవ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందనీ, బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉందని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, దీనికి తోడుగా నిలవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందని పేర్కొన్నారు. శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేని చోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని సీఎం వివరించారు. చదవండి: ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ -
ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం సమీక్షలు చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న ఆరోగ్య సురక్ష సహా పలు అంశాలపై సంబంధిత అధికారులతో వైఎస్ జగన్ చర్చించారు ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసినట్టు అధికారులు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని తెలిపారు. పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాలన్నారు. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: చంద్రబాబు ఇంటి భోజనంపై అనుమానాలు?: మంత్రి అమర్నాథ్ సీఎం జగన్ ఇంకేం మాట్లాడారో ఆయన మాటాల్లోనే.. ► ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది. ►అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి. ►నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేయాలి. ►తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ►ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. -
సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ సీపీ గుర్నాని
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్ర సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్ర విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. చదవండి: సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్ -
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం(నేడు) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉంటారు. గురువారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ 1 జన్‌పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించింది. -
పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు -
45 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
-
కలెక్టర్లు అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి: సీఎం జగన్
-
గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములే
-
జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట వరం
-
ఏడు రకాల వైద్య పరీక్షలను ఇళ్ల వద్దనే నిర్వహించనున్న వైద్యులు: సీఎం జగన్
-
ప్రతి ఇంటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సమస్య నయం అయ్యేవరకు తోడుంటాం: సీఎం జగన్
-
ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
జల్లెడ పట్టి మరీ ఆరోగ్య సమస్యకు పరిష్కారం: సీఎం జగన్
-
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం: సీఎం జగన్
-
అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనన్నారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘‘ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తారు’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’ -
బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారు: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై జైలులో ఉంటే.. పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారని విమర్శించారు. స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని.. చంద్రబాబు తన అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామి కాదా? అని నిలదీశారు. పవన్, బాబులు కలిసే ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసు అని.. చేసిన పాపాలు పండి బాబు జైలుపాలయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌తో యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయడమేనని అన్నారు. కోటిమంది డ్వాక్రా అక్కచెల్లెళ్ళపై, 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగుల మీద యుద్ధం చేయటమేనని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. చదవండి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష ‘ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో ఒక పీకే కనిపించాడు. పవన్ సినిమా తీయాలనుకుంటే ఇదే పేరు పెట్టుకోవచ్చు. ట్యాగ్ లైన్ కింద బొక్కలో బాబు, 7691 అని పెట్టుకోవచ్చు. చంద్రబాబు పరామర్శకి పవన్ వెళ్లినప్పుడు ఆయన బాగోగులు అడగాలి. జైలులోకి పవన్ వెళ్లేటప్పుడు బీజేపీతో ఉండి.. అక్కడ చంద్రబాబుతో తాళి కట్టించుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బయటకు వచ్చాక పొత్తు ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమా డైలాగులు వేస్తే కుదరదు. తండ్రి జైల్లో ఉంటే కొడుకు స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లటానికి సిగ్గుండాలి. తన తండ్రి నిజ స్వరూపాన్ని లోకేష్ జాతీయ స్థాయిలో చెప్తాడంట. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకోవటానికే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. గంటకి కోటిన్నర చొప్పున లాయర్లకి ఇచ్చి వాదించినా కోర్టులు నమ్మలేదు. చంద్రబాబు, పవన్ పొత్తుల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా?. ఇవ్వాళ కొత్తగా పొత్తు గురించి చెప్పాలా? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గోదావరి, కృష్ణానదిలో కొట్టుకుపోవాల్సిందే’నని జోగి రమేష్ దుయ్యబట్టారు. -
సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య సురక్ష: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యసురక్షపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని విడుదల చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష తర్వాత.. సీఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారుల సమీక్షలో సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలి. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలి. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్ రోజు నాడు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలా జల్లెడ పట్టిన ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరకి ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో సూచిస్తాం. ఒకవైపు తనిఖీలు చేస్తూనే.. మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలి’’ అని సీఎం చెప్పారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పనిచేయడంతో పాటు వారిని చేయిపట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలతో పాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం