తలవంచని అమ్మతనం | Tadepalli Woman Request To Government For Electrical Wheelchair In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

తలవంచని అమ్మతనం

May 12 2025 8:08 AM | Updated on May 12 2025 9:57 AM

Tadepalli Woman Request to Electrical wheelchair

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. 

వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్‌ లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్‌ వీల్‌ చైర్‌ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement