wheel chair
-
వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
26 బంతుల్లో సెంచరీ.. శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
పురుషుల వీల్ చైర్ క్రికెట్ టోర్నీలో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. View this post on Instagram A post shared by DCCI (@dcci.official)ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 310 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో సందీప్ కుందు, సౌరభ్ మాలిక్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. View this post on Instagram A post shared by Cricket Addictor (@cricaddictor)అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా దారుణ ఓటమిని మూటగట్టుకుంది.26 బంతుల్లో శతక్కొట్టిన సందీప్..ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ సందీప్ కుందు కేవలం 26 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన కుందు ఇన్నింగ్స్ మొత్తంలో 37 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 149 పరుగులు చేశాడు. -
వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!
పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్‌చైర్‌కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్‌లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్‌పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీల్ చైర్లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్చైర్లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా) -
Mumbai Airport: వీల్ చైర్ లేక గుండెపోటుతో వృద్ధుడి మృతి
ముంబై : నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఓ వీల్‌చైర్ అడిగాడు. వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు. దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘వీల్ చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవు. ఇందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదీ చదవండి.. 11 మంది సజీవ దహనం -
‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్నచీరతో’..
అది 1984, అక్టోబరు 31.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఎవరూ ఊహించని విధంగా ఒక ఘటన చోటుచేసుకుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని రక్తమోడుతున్న స్థితిలో బుల్లెట్ గాయాలతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ పరిస్థితిని మాటల్లో వర్ణించడం కష్టం. ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీకి శస్త్ర చికిత్స చేసి, ఆమె శరీరం నుంచి బుల్లెట్లు వెలికితీసిన డాక్టర్ పి వేణుగోపాల్ నాటి ఆ భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోలేదు. ఆరోజు ఇందిరాగాంధీ ప్రాణాలు కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు, సర్జన్లు,నర్సింగ్ సిబ్బంది నాలుగు గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేశారని నాటి తన జ్ఞాపకాల దొంతరలోని వివరాలను వెల్లడించారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ పుస్తకంలో.. వేణుగోపాల్ ఆ రోజల్లో ఎయిమ్స్ కార్డియాక్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1994 ఆగస్టులో భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడిని నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఇటీవల ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రాసిన పుస్తకం విడుదలైంది. రక్తంతో తడిసిన ఆమె చీరలోంచి నేలపైకి జారి పడిన బుల్లెట్లు, రక్తమార్పిడి, తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకారంపై ఆసుపత్రి కారిడార్‌లో జరిగిన రాజకీయ చర్చ... ఇవన్నీ 39 ఏళ్ల తర్వాత కూడా నాకు స్పష్టంగా గుర్తున్నాయని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ శరీరం చుట్టూ రక్తపు మడుగు మంచం మీద కదలలేని స్థితిలో ఉన్న ఇందారాగాంధీని చూసి తాను చలించిపోయానని ఆయన ఆ పుస్తకంలో రాశారు. ఆ సమయంలో ఆమె కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఆమె శరీరం రక్తంతో పూర్తిగా తడిసిపోయింది. మొహం పాలిపోయింది. శరీరంలోని రక్తం అంతా వేగంగా బయటకు ఉబికివచ్చింది. అక్కడ రక్తపు మడుగు ఏర్పడింది. ఇందిరాగాంధీని ఆమె నివాసంలోని లాన్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు. దుండగులు ఆమెపై 33 బుల్లెట్లు కాల్చారు. వాటిలో 30 ఆమెను తాకాయి. 23 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. ఏడు బుల్లెట్లు మరింత లోపలికి దూసుకెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం.. వేణుగోపాల్ (81) ఆ పుస్తకంలో నాటి వివరాలను తెలియజేస్తూ ఇందిరా గాంధీకి ఓ-నెగటివ్ రక్తం అవసరమయ్యింది. ఆ రక్తం వెంటనే లభించలేదు. ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం నెలకొంది. ఎయిమ్స్ సిబ్బంది అక్కడకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే రోజు డైరెక్టర్‌గా తన బాధ్యతలకు వీడ్కోలు చెబుతున్న టాండన్.. బాధ్యతలు స్వీకరించబోతున్న డాక్టర్ స్నేహ భార్గవ.. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏం చెయ్యాలా? అనే సందేహంతో నా వైపు చూశారు. కార్డియాక్ సర్జరీ విభాగం అధిపతిగా నేను వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రక్తస్రావం ఆపడానికి నేను ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించాను. ముందుగా ఇందిరాగాంధీ శరీరం నుంచి కారుతున్న రక్తస్రావాన్ని బైపాస్ మిషన్ సహాయంతో ఆపాలన్నది నా ప్లాన్. ఇందుకోసం నాలుగు గంటల పాటు వైద్యసిబ్బంది అంతా పోరాడారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇందిరా గాంధీ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ వార్త బయటివారికి ఎంతో నిస్సహాయ స్థితిలో తెలియజేశాను. దేశంలోని తూర్పు ప్రాంతంలో పర్యటిస్తున్న రాజీవ్ గాంధీ ఎయిమ్స్‌కు వస్తున్నారని, ఆయన రాక కోసం వేచి చూడాలని సిబ్బంది అభిప్రాయపడ్డారు. ‘అదే జరిగివుంటే బతికేవారు’ దేశంలో 50,000 గుండె శస్త్రచికిత్సలు చేసిన వేణుగోపాల్ ఆ పుస్తకంలో మరో కీలక విషయం రాశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదటి బుల్లెట్ తగిలిన వెంటనే కిందపడిపోయారని, ఆమెతో పాటు ఉన్నవారు ఆమెను నేలపై ఒంటరిగా వదిలి, వెనక్కి పరిగెత్తారని తనకు తెలిసిందని, వారు అలా చేయకుండా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించివుంటే ఆమె బతికేవారని వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ఆమెతో పాటు ఉన్నవారు అక్కడి నుంచి పారిపోవడం హంతకుడిలో ధైర్యాన్ని నింపిందని, ఫలితంగానే అతను తన మెషిన్ గన్ నుండి పలు రౌండ్ల బుల్లెట్లను కాల్చగలిగాడని వేణుగోపాల్ ఆపుస్తకంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు -
అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!
అతిగా ఫోన్ వాడకం ఓ మహిళను వీల్‌చైర్‌కు పరిమితం చేసింది. యూకేకి చెందిన 29 ఏళ్ల ఫెనెల్లా ఫాక్స్ వర్టిగో అనే వ్యాధి బారినపడింది. తాను సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ 14 గంటల పాటు నిరంతరంగా ఫోన్ వాడానని ది మిర్రర్ వార్తా సంస్థకు ఆమె వివరించింది. ఐప్యాడ్, ఐఫోన్లలో గంటలకొద్దీ గడపడం తనకు భారీ చేటును కలిగించిందని, వెర్టిగో వ్యాధితో మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫాక్స్ పోర్చుగల్‌లో ఉన్నప్పుడు తలనొప్పి, మైకం వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయి. 2021 నవంబర్ నాటికి అవి తీవ్రమయ్యాయి. ‘నేను నిజంగా సరిగ్గా నడవలేనట్లు అనిపించింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అప్పటి పరిస్థితి నాకు బాగా గుర్తుంది. కానీ ఎక్కువగా వివరించలేను. ఈ అనర్థాలకు కారణం నా ఫోన్ అని అప్పుడు నాకు తెలియదు. ఇది కోవిడ్ లాంటిదే. నేను వంట చేయలేకపోయాను. ఇంటికి చేరుకోవడానికి వీల్‌చైర్ కావాల్సివచ్చింది. నా తల్లిదండ్రులు నన్ను చూసుకోవాల్సి వచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు ఆ పరిస్థితి అనుభవించాను’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. (ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) ప్రస్తుతం ఫెనెల్లా ఆరోగ్యం మెరుగుపడిందని, ఇకపై వీల్‌చైర్ అవసరం ఉండదని ఆమె ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే తన ఫోన్‌ను ముందులాగే గంటలకొద్దీ ఉపయోగిస్తే మళ్లీ ఆ ఘోర పరిస్థితులు తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు. -
తల్లి రుణం తీర్చుకోవడానికి.. ఓ తనయుడి కష్టాలు
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో తల్లి మరణించింది.. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ నవమాసాలు మోసి కని పెంచిన తల్లి గనుక పుట్టెడు దుఃఖంలోనూ ఎలాగైన చివరి మజిలీ పూర్తి చేయాలన్న సంకల్పం అతన్ని శ్మశానం వరకు తీసుకెళ్లిగలిగింది. నాలుగేళ్లుగా ఆ తల్లి కోసం తెచ్చిన వీల్‌చైర్ అతనికి దిక్కయింది. తల్లి మృతదేహాన్ని అందులో కూర్చోబెట్టుకుని శ్మశానానికి తరలించాడు. ఆదరించే వాళ్లు ఎవరూ లేకపోవడం, ఆర్థిక కష్టాలు పెరగడంతో వీల్‌చైర్‌నే పాడెగా మార్చుకోవాల్సి వచ్చిందని ఆ తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుచ్చి జిల్లా మనప్పారై భారతీయార్ నగర్‌కు చెందిన మురుగానందం ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన తల్లి రాజేశ్వరి(74) అంటే మురుగానందంకు ఎంతో ప్రేమ. నాలుగేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో వీల్‌చైర్‌కు పరిమితం కావడంతో అన్నీ తానై సేవలు చేశాడు. ఇటీవల ఆమె శరీరంపై దద్దుర్లు రావడంతో ఆప్తులు, ఇరుగు పొరుగు వారు ఆ ఇంటి వైపు రావడం మానేశారు. దురదతో కూడిన ఈ పుండ్లు అంటువ్యాధి అని ప్రచారం జరగడంతో ఆమెకు సేవలు అందిస్తున్న మురుగానందంను కూడా దూరం పెట్టేశారు. ఆర్థిక కష్టాలతో.. తల్లిని ఇంట్లోనే ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చిన మురుగానందకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. రానురాను ఆదరించే వాళ్లు, ఆదుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో తల్లికి వైద్యం అందించడం భారంగా మారింది. పనికి వెళ్లలేక ఇంటి పట్టునే ఉండి తల్లిని చూసుకునేవాడు. ఈ పరిస్థితుల్లో గురువారం వేకువజామున రాజేశ్వరి కన్నుమూసింది. ఆమె ఒంటిపై అధికంగా పుండ్లు ఉండడంతో అంత్యక్రియలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని తెలిసి, ఆర్థిక ఇబ్బందులతో పాడె కట్టడానికి కూడా డబ్బుల్లేక మృతదేహాన్ని ఇన్ని రోజులు తన తల్లి కోసం వినియోగించిన వీల్‌చైర్‌నే పాడెగా మార్చేశాడు. అందులో మృతదేహాన్ని ఉంచి పడిపోకుండా, ఆమె చీర సాయంతో కట్టేశాడు. ఎవరి కంట పడకుండా 2.5 కి.మీ దూరం వీల్‌చైర్‌లోనే శవాన్ని మనప్పారై నగరపాలక సంస్థ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకొచ్చాడు. వీల్‌చైర్‌తో వస్తున్న వ్యక్తిని చూసి అక్కడి సిబ్బంది ప్రశ్నించారు. తన దీన పరిస్థితిని వారికి మురుగానందం విన్నవించాడు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది శ్రీధరన్‌తో పాటు మరికొందరు మురుగానందం పరిస్థితిని అర్థం చేసుకుని తమవంతుగా అంత్యక్రియలకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసి, సాంప్రదాయబద్ధంగా లాంఛనాలను పూర్తి చేయించారు. అలాగే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మురుగానందంకు మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. చదవండి: దేశాలు దాటిన ప్రేమ..తల్లిదండ్రుల అనుమతితో -
24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్.. రూ.10 వేల తక్షణ సాయం, వీల్ ఛైర్
శంఖవరం : పుట్టుకతోనే బుద్ధిమాంద్యం గల బాలుడి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఔదార్యం మరోమారు ప్రశంసలు అందుకుంది. గురువారం సీఎం పాయకరావుపేట పర్యటనలో రోడ్డు పక్కన విలపిస్తున్న ఓ తల్లిని గమనించడం, కాన్వాయ్ ఆపించి ఆమెతో మాట్లాడటం, రెండు గంటల్లోనే ఆమె కుమారుడు ధర్మతేజకు వికలాంగ పింఛన్ మంజూరు కావడం, తక్షణ సాయంగా రూ.10 వేలు, రూ.30 వేల విలువైన వీల్ ఛైర్‌ను కలెక్టర్ కృతికా శుక్లా ద్వారా అందజేయడం తెలిసిందే. (చదవండి: మానవత్వమై నిలిచి..) వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు. అతి తక్కువ సమయంలో తమ సమస్యను పరిష్కరించినందుకు బాలుడి తల్లిదండ్రులు నక్కా చక్రరావు, తనూజ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ) -
తోటివారే! తక్కువ చేయకండి!
మనం పెట్టుకున్న నిబంధనలకైనా మానవీయ కోణం తప్పనిసరి. వినియోగదారులను దేవుళ్ళుగా భావించాల్సిన సేవల రంగం సహా అనేక చోట్ల అది మరీ ముఖ్యం. తద్విరుద్ధంగా రాంచీ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒక దివ్యాంగ టీనేజ్ కుర్రాడి విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు నివ్వెరపరిచింది. ‘తోటి ప్రయాణికుల భద్రతకు భంగకరం’ అనే సాకుతో, హైదరాబాద్‌కు రావాల్సిన ఆ వీల్‌ఛెయిర్ కుర్రాడినీ, అతని తల్లి తండ్రులనూ విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది చూపిన అమానుషత్వం తీవ్ర విమర్శల పాలైంది. మన దేశంలో దివ్యాంగుల పట్ల సరైన రీతిలో సున్నితంగా స్పందిస్తున్నామా? వారినీ సమాజంలో ఓ భాగంగా కలుపుకొని పోతున్నామా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తోటి ప్రయాణికులు సైతం అభ్యర్థిస్తున్నప్పటికీ, అవసరమైతే తామున్నామని ప్రయాణికుల్లోని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ ప్రైవేట్ విమానయాన సిబ్బంది పెడచెవినపెట్టడం పరాకాష్ఠ. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయిన ఆ సంఘటనపై చివరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించి చర్యలకు ఆదేశించాల్సి వచ్చింది. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) సమగ్ర విచారణకు దిగింది. సదరు ప్రైవేట్ విమాన సంస్థ అధిపతులు ‘ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమది మంచి నిర్ణయమే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, క్షమాపణ చెప్పారు. ఆ దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ ఇస్తామన్నారు. కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారీ మీడియాలో వివాదం రేగడం, పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టడం మామూలైంది. మానవీయత పరిమళించాల్సిన ఆధునిక సమాజంలో ఇవాళ్టికీ ఇలాంటి దుర్విచక్షణ కొనసాగడం విచారకరం. నిజానికి, దివ్యాంగుల పట్ల డీజీసీఏ నియమావళి కూడా ఇక్ష్వాకుల కాలం నాటిది. మారిన కాలంతో పాటు కొత్తగా వచ్చిన సమస్యలు, సవాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సి ఉంది. ప్రవర్తన అదుపులో లేని ప్రయాణికుల గురించి నివేదించమనీ, ప్రమాదకరమైన అలాంటి వ్యక్తులను విమానంలోకి ఎక్కనివ్వవద్దనీ నియమావళిలో ఉండవచ్చు గాక. దాన్ని అడ్డం పెట్టుకొని, అభం శుభం తెలియని దివ్యాంగుడి ప్రయాణం నిరాకరించడం మానవత్వం అనిపించుకోదు. గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశీయ, విదేశీ విమానాశ్రయాలు, అలాగే ప్రైవేట్ విమానయాన సంస్థలు బాగా పెరిగాయి. ఫలితంగా, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానయానం పలువురికి అనువుగా మారింది. అందుబాటులోకి వచ్చింది. అలాగే, ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగుల విభాగంలోని ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. కానీ, వారు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తగిన వసతులు కల్పించడం, సేవలు అందించడం కరవైంది. విమానయాన టికెట్లు బుక్ చేసుకుంటున్న ప్పుడు దివ్యాంగులకు లభించే సేవలపై స్పష్టత పూజ్యం. విమానాశ్రయాల్లో, చెక్–ఇన్ సందర్భాల్లో, బోర్డింగ్ నియమాల్లో, విమానాల్లో ఆతిథ్యంలో వారి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు వసతులూ అంతంత మాత్రం. రైళ్ళలోనూ, ప్రభుత్వ రవాణా సదుపాయాల్లోనూ ఇదే పరిస్థితి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారిలో 20 శాతం మంది కదలడంలో, ప్రయాణంలో సమస్యలున్నవారే. ప్రయాణ సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాలను వారికి కూడా సౌకర్యంగా ఉండేలా మార్చాలని 2015లోనే ప్రభుత్వం ‘యాక్సెసిబుల్ ఇండియా’ పేరిట కార్యక్రమం చేపట్టింది. కానీ, ఆ లక్ష్యాలను ఇప్పటికీ అందుకోలేదన్నది చేదు నిజం. పౌర భవనాలన్నిటినీ దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని 2017లోనే సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇవాళ్టికీ అది అమలైంది చాలా కొద్దిగానే! అందుకే, మన తోటివారైన దివ్యాంగుల పట్ల కనీసపు అక్కర, వారి సమస్యలను అర్థం చేసుకొనే సహృదయం పని ప్రదేశాల్లో, ప్రయాణ వసతుల్లో లోపిస్తోందనడానికి తాజా ఇండిగో ఘటన ఓ మచ్చుతునక మాత్రమే. విమానాల్లోనే కాదు... రైళ్ళు, బస్సులు, వినోదశాలలు, చివరకు విద్యాల యాలు, కార్యాలయాల్లో కూడా వారి శారీరక, మానసిక ప్రత్యేకతల రీత్యా ఏర్పాట్లు చేయడం కీలకం కాదా? ఆ మాత్రం చేయడం కనీస మానవ ధర్మం, వ్యవస్థపై ఉన్న బాధ్యత కావా? ఆ మధ్య సినీ నటి – దివ్యాంగ నర్తకి సుధా చంద్రన్ కృత్రిమ పాదం పట్ల విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నుంచి అవమానం ఎదురైంది. నెల రోజుల క్రితమే రెండు బ్యాటరీలతో నడిచేదే తప్ప నాలుగు బ్యాటరీలతో నడిచే వీల్‌ఛైర్‌ను అనుమతించబోమంటూ ఓ దివ్యాంగ ప్రొఫెసర్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. అయితే, ప్రభుత్వ విధానాలు, ఆదేశాలతో పాటు సామాజిక ఆలోచనలో మార్పు మరీ కీలకం. బౌద్ధిక, గ్రహణ సామర్థ్యాల విషయంలో కొందరిలో ఉండే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, సంస్థలు సహానుభూతితో వ్యవహరించే సంస్కారం కావాలి. దివ్యాంగులూ మన లాంటి మనుషులే నన్న భావంతో, మానవీయంగా వ్యవహరించేలా చైతన్యం తేవాలి. అన్నిటికన్నా ముందుగా... ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మనమే! విమానాల్లో పక్షులు, జంతువులకు కూడా తగిన చోటిచ్చే మనం, మన వ్యవస్థ మన సోదర దివ్యాంగుల్ని లోకువగా చూడడమేంటి? -
కాళ్లలో లేదు చలనం ఆశల్లో ఉంది జీవనం
19 ఏళ్లు..ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు..ఎగసే అలల్లా జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..ఈ చురుకైన యువకుడ్ని చూసి విధికి కన్నుకుట్టింది. 2009లో జరిగిన ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబంలో నిశ్శబ్ధ వాతావరణం..ఎదిగిన తమ బిడ్డ ఇలా దివ్యాంగుడిగా మారిపోవడం తల్లిదండ్రులు జీర్జించుకోలేకపోయారు. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయితే ఆ యువకుడు కుంగిపోలేదు. సంద్రంలో అలలే స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. జీవితంలో అవిటితనం ఓ చిన్న సమస్యే..అంతకు మించి జిందగీలో చాలా ఉందని భావించాడు. సూర్యుడు ఉదయిస్తాడు... అస్తమిస్తాడు... అస్తమించినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు...ఈ రవివర్మ కూడా అంతే...ఉదయించే సమయంలో విధి ఓటమి పాల్జేస్తే... నడవలేని స్థితిలో రవి ఆ విధిపై విజయం సాధించాడు. ర్యాప్ అనే ఫౌండేషన్ స్థాపించి ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...ఆ విజేతే మన సీతమ్మధారకు చెందిన రవివర్మ. సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రమాదానికి ముందు రవివర్మకు పర్యాటక ప్రాంతాలు వీక్షించడమంటే చాలా ఇష్టం. అయితే నడవలేని స్థితిలో ఉన్న రవి దాదాపు చాలా రోజులు యాత్రలకు వెళ్లలేకపోయాడు. తరువాత తనకుతాను స్ఫూర్తి నింపుకున్నాడు. ఇది కాదు జీవితం...లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...దానిని ఆస్వాదించాలనుకున్నాడు. తన పనులు తాను చేసుకునేస్థాయిలో వచ్చాడు. వీలు చైర్లోనే నగరంలో తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కారుకు ప్రత్యేక మార్పులు చేయించాడు. తనుకు అనుకూలంగా కారును డిజైన్ చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖ నుంచి సోమవారం బయలుదేరాడు. వెలుగు రేఖ వెతకాలి జీవితంలో ఓటమి ఎదురైందని చీకట్లో కూర్చుంటే వెలుగే కనిపించదు..మనసులో కుంగిబాటు అనే కర్టెన్ తీసేయాలి..అప్పుడు ఎంతటి బాధనైనా... అంగవైకల్యమైనా మనల్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. నా జీవితమే ఇందుకు ఓ ఉదాహారణ. కుంగిపోయి కూర్చుంటే నేనీరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేసే స్థాయికి చేరుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్..వాటిని అధిగమిస్తే విజేతగా నిలవవచ్చు. వంద రోజులకు పైగా దేశవ్యాప్త యాత్రలో వేల మంది దివ్యాంగులను కలిసి వారికి మనోధైర్యం నింపాలన్నదే నా లక్ష్యం. – రవి వర్మ ఇటువంటి యాత్రలంటే ఇష్టం రవి వర్మకు ప్రమాదం జరగక ముందు నుంచి ఇంటువంటి యాత్రలు చేయడం ఇష్టం. ప్రమాదం జరిగిన తరువాత మేమంతా ధైర్యం కోల్పోయాం. రవివర్మ మాత్రం ధైర్యం తెచ్చుకొని తన సాధారణ జీవితం గడిపేలే ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కారు యాత్రకు వెళ్తూ అందరిలో స్ఫూర్తి నింపాలనుకోవడం చాలా గర్వంగా ఉంది. – తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత. సాహసయాత్ర ప్రారంభం వీలుచైర్ కారు ద్వారా 24 వేల కిలోమీటర్లు యాత్ర చేస్తున్న రవివర్మ అందరికీ స్ఫూర్తి అని ఎంపీ ఎంవీవీ సత్యరాయణ అన్నారు. యాత్రను ఆయన సోమవారం బీచ్‌రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ వ్యక్తికి సైతం 24 వేల కిలోమీటర్లు కారు యాత్ర చేయటం చాలా కష్టం. అటువంటిది రవివర్మ చేయడం నిజంగా సాహసమే. యాత్రలో ఎటువంటి ఇబ్బందుల లేకుండా విజవంతంగా పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!) -
తనిఖీ పేరుతో దుస్తులు విప్పమని బలవంతం చేశారు.. అవమానించారు1
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో చాలా మది ప్రముఖులు సిబ్బంది తనిఖీల దృష్ట్యా ఈ మధ్య కాలంలో పలు చేదు అనుభవాలను చూసిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కాలంలో ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్ తన కృత్రిమ అవయవాన్ని తొలగించమని ముంబై విమానాశ్రయంలో సిబ్బంది కోరినప్పుడు తాను చాలా అవమానానికి గురైయ్యానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పైగా మాలాంటి వాళ్ల పట్ల ఇలా ప్రవర్తించవద్దని ఎయిర్ పోర్ట్ సిబ్బందిని కోరారు కూడా. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది సుధా చంద్రన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పడు అచ్చం అలాంటి చేదు అనుభవమే 80 ఏళ్ల దివ్యాంగురాలికి ఎదురైంది. ఈ ఘటన గౌహతి ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 80 ఏళ్ల దివ్యాంగురాలు తన మనవరాలలితో కలిసి వచ్చింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణిలను తనిఖీ చేయడం సహజం అదే విధంగా వారిని ఆ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేశారు. అయితే సదరు మహిళ తుంటి ఎముక(హిప్ ఇపంప్లాంట్)కు సర్జరీ చేయించుకుంది. అయితే సిబ్బంది తనిఖీల సమయంలో ఆమె శరీరంలోని మెటల్ పీస్ ఇండికేటర్ ఆన్‌లో ఉండటంతో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో ఆమెను ఫిజికల్ టెస్ట్‌ల తనిఖీ నిమిత్తం ఫ్రిస్కింగ్ బూత్‌కి తీసుకువెళ్లారు. అంతేకాదు తుంటి ఎముక సర్జరీ జరిగిన ప్రాంతం చూపించమంటూ సిబ్బంది బలవంతం చేశారు. పైగా ఆమె లోదుస్తులను తొలగించి నగ్నంగా చెక్ చేశారు. దీంతో ఆ మహిళ కూతురు కికాన్ ట్విట్టర్లో.. "నా 80 ఏళ్ల తల్లి టైటానియం ఇంప్లాంట్‌కు ప్రూఫ్ కావాలని ఆమెను దుస్తులు విప్పమని బలవంతం చేసారు. ఈ విధంగానా సీనియర్ సిటిజన్ల పట్ల వ్యవహరించేది అని మండిపడ్డారు". అంతేకాదు ఆమె ట్విట్టర్ వేదికగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐఎస్ఎఫ్ గౌహతిలో జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఆ ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సదరు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామని పేర్కొంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ట్విట్టర్లో ఫిర్యాదుదారుపై స్పందిస్తూ..తాను కూడా ఈ విషయమై విచారణ చేస్తున్నాని తెలియజేయడమే కాకుండా సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. (చదవండి: వీడియో: హుషారుగా గంతులేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. అందులో ఎక్స్పర్ట్ కూడా!) -
ఇంట్లో వీల్‌చైర్.. రోడ్డుపై స్కూటర్!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డ్‌కు చెందిన చంద్రకాంత్ 2018లో అనారోగ్య సమస్య రావడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. తనకు వచ్చిన కొత్త ఆలోచనలతో పరిగెడుతున్నారు. చెన్నైలోని ఐఐటీ స్టాండప్ కంపెనీ వారు తయారుచేసిన వీల్ చైర్ కం స్కూటీ రూ.95 వేల ఖర్చుతో ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెప్పించుకున్నారు. ఈ వాహనం ఇంట్లో వీల్ చైర్ లాగా.. బయటకు వెళ్తే స్కూటీ లాగా ఉపయోగించుకోవచ్చు. 4 గంటలు చార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చంద్రకాంత్ తెలిపారు. -
ఎంత మంచి మనసో: రూ. 2 కోట్ల ఇంటిని కేవలం రూ. 100కే అమ్మకం
లండన్: సాటి మనుషి కష్టంలో ఉంటే స్పందించే గుణం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు కుటుంబాన్ని, సమాజాన్ని సమానంగా ప్రేమిస్తారు. జగమంత కుటుంబం వారి సిద్దాంతం. ఈ కోవకు చెందిన దంపతుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. వారిది ఎంత మంచి మనసు అంటే.. మానసిక వికలాంగ పిల్లల కోసం రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని అమ్మకానికి పెట్టారు. అది కూడా కేవలం వంద రూపాయలకు మాత్రమే. మంచి పని కోసం చేస్తున్నప్పుడు ఇంత తక్కువ ఖరీదు ఎందుకంటే.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇది చదవండి యూకేకి చెందిన ఆడమ్ త్వైట్స్, అతని భార్య లిజ్, కుమార్తె ఎమిలీతో కలిసి సౌత్ టైన్‌సైడ్, ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. లిజ్.. గ్రేస్ హౌస్ అనే చారిటీ సంస్థలో పని చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వడం, అలాంటి పిల్లలతో ఎలా మసులుకోవాలనే గురించి వారి కుటుంబ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం, వారి కోసం కొన్ని రకాల గేమ్స్ రూపొందించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా చేయడం, ఇతర యాక్టీవిటీలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. (చదవండి: సంచలన కేసు.. ఆ డాక్టర్ వల్లే మా అమ్మ నన్ను లోపంతో కనింది) ఈ క్రమంలో ఓ సారి ఆడమ్, తన భార్య లీజ్ కోసం గ్రేస్ హౌస్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ రిజిస్టర్డ్ మేనేజర్ని వీల్‌చైర్ యాక్సెస్ చేయగల ఊయల అవసరం గురించి అడిగాడు. దాని ధర 13 వేల పౌండ్లు (12,98,074.18 రూపాయలు) అని తెలిసి ఆశ్చర్యపోయాడు. తమ కుమార్తె ఎమిలీకి కూడా ఊయల అంటే చాలా ఇష్టం అని ఆడమ్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఎమిలీలానే అందరి పిల్లలకు ఊయల ఊగే అవకాశం లేకపోవడం అతడిని కలచి వేసింది. ( ప్రతీకాత్మక చిత్రం) దాని గురించే ఆలోచిస్తున్న ఆడమ్‌కు ఓ ఆలోచన వచ్చింది. దాని గురించి భార్యకు చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఆ దంపతులు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని కేవలం వంద రూపాయలకే అమ్మాలని నిర్ణయించారు. మూడు బెడ్రూంలు, లివింగ్ రూం, కార్ పార్కింగ్, గార్డెన్ సదుపాయలు గల ఇంటిని వంద రూపాయలకే అమ్మకానికి పెట్టారు. (చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!) కాకపోతే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇంటిని అమ్మడం కోసం ఆడమ్ దంపతులు 100 రూపాయలు ఖరీదు చేసే 2 లక్షల టికెట్లు ముద్రించారు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. తమ ఇంటిని వారు వంద రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్‌గా మార్చారు. అలా 2 లక్షల టికెట్లను ప్రింట్ చేసి అమ్మసాగారు. అంటే రెండు లక్షల మంది ఈ టికెట్లను కొంటే ఒక్క లక్కీ విన్నర్‌కి.. ఇల్లు సొంతమవతుంది అన్నమాట. అయితే ఇంటిని ఇలా అమ్మడం వెనక ఆడమ్ దంపతుల మంచి మనసు గురించి తెలుసుకున్న జనాలు.. టికెట్ కొనడం కోసం ఎగబడ్డారు. అంతేకాక వారి మంచి మనసును ప్రశంసిస్తున్నారు. చదవండి: ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు -
అవార్డు గ్రహీత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నాయకుడు అంటే అందలం ఎక్కి అధికారాన్ని అనుభవించేవాడు కాదు. తనను నమ్ముకున్న వారిని ముందుండి నడిపించేవాడు.. అండగా ఉండేవాడు.. కష్టంలో ఆదుకునేవాడు.. సేవకు వెనకడుగు వేయనివాడు. ఈ లక్షణాలన్ని పుణికి పుచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయనలో సీఎం అనే గర్వం ఇసుమంత కూడా ఉండదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తండ్రి, మహానేత వైఎస్సార్ నుంచి అలవర్చుకున్నారు సీఎం జగన్. ఆయన మాటతీరు, చెరగని చిరునవ్వు.. చూడగానే మన మనిషి అనిపిస్తాయి. ఏమాత్రం బేషజాలు చూపని వ్యక్తి సీఎం జగన్. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: YSR Awards: ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సం) వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చూపిన హుందాతనం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రచయిత కత్తి పద్మారావుకు అవార్డ్ అందజేశారు జగన్. ఆ సమయంలో పద్మారావు వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేశారు సీఎం జగన్. అంతేకాక పద్మారావు చేయి పట్టుకుని.. ఆయన నిల్చోడానికి సాయం చేశారు. అవార్డు గ్రహీతకు ఎంతో గౌరవం ఇచ్చి.. సామాన్య వ్యక్తిలా ప్రవర్తించిన సీఎం జగన్ హుందాతనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. చదవండి: సీఎం జగన్ చర్యలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం -
Neena Nizar: ఇది నాకు పెద్ద షాక్.. పేరు లేని విలన్ కాటేసింది!
ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటం ఎక్కడా ఆపకూడదని... ఎన్ని ఒడిదొడుకులకు లోనైనా ఎక్కడా ఆగిపోకూడదని... నినా నైజర్ జీవితం చాటి చెబుతుంది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి వెంటాడినా ఆ వ్యాధి తనను వీల్‌చెయిర్‌కే పరిమితం చేసినా చదువుల రాణిగా వర్ధిల్లింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగింది. తనకు పుట్టిన పిల్లలనూ అదే వ్యాధి కబళించి అడుగడుగునా నిరాశ తరుముతున్నా విధి విసిరిన ఛాలెంజ్‌ను చిరునవ్వుతో స్వీకరించింది. ‘అరుదైన వ్యాధి కారణంగా మేం ఒంటరిగా, బలహీనులుగా అనిపించవచ్చు. కానీ, మా కథను పంచుకోవడం ద్వారా చావు అంచున నిలబడిన వారిలో చిన్న ఆశను మిగిలిస్తే చాలు’ అంటోంది నీనా నైజర్. నాలుగు పదుల వయసు దాటిన నీనా నైజర్ దుబాయిలో ఓ వ్యాపారస్తుడి కుటుంబంలో పుట్టింది. పుట్టుకతోనే వెన్నెముకలో అరుదైన వ్యాధికి లోనైంది. ఏళ్లకేళ్లుగా చికిత్స జరుగుతూనే ఉంది. కానీ, వ్యాధి పేరేంటో తెలియలేదు. వెన్నెముకలో లోపాల వల్ల శరీరం అంతగా ఎదగలేదు. ఈ కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. ఇండియా వచ్చి వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకుంది. లండన్, అమెరికాలోనూ ట్రీట్మెంట్ తీసుకుంది. ఏమంత ప్రయోజనం లేకపోయింది. అయినా ఆమె చదువుల తల్లిని వదిలిపెట్టలేదు. పీహెచ్‌డి పట్టా పుచ్చుకొని.. ‘చదువు ధైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. అందుకే, నా దృష్టి అంతా చదువు మీదే. నాకు 16 ఏళ్ల వయసులో అమెరికాలోని క్రైటన్ విశ్వవిద్యాలయం లో చదువుకోవడానికి పూర్తి స్కాలర్షిప్ తో అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా శరీరం శస్త్రచికిత్సల కారణం గా మరింత బలహీనంగా ఉంది. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. అంతదూరం పంపించడానికి ఒప్పుకోలేదు. కానీ, నేను చదువుకోవాల్సిందే అని బలంగా చెప్పి, వెళ్లాను. 2018 లో క్రైటన్ విశ్వవిద్యాలయం నుండి ఎడ్యుకేషన్ లీడర్‌షిప్‌లో పీహెచ్‌డి పట్టాతో బయటకు వచ్చాను’ అని వివరించే నినా నైజర్ చదువులోనే కాదు వ్యాస రచన, పెయింటింగ్, చర్చాపోటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. దేశవిదేశాల్లో మోటివేషనల్ స్పీచుల్లో పాల్గొంది. తలకిందులైన ప్రపంచం.. పునర్నిర్మాణం తను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే ఆడమ్‌ను కలుసుకున్న నినా పెళ్లి తర్వాత ప్రయాణం గురించి వివరిస్తూ ‘పిల్లలు కలగరనే భయంతో పెళ్లే వద్దనుకున్నాను. ఆడమ్ తన ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను’ అని వైవాహిక జీవితం గురించి ఆనందంగా చెప్పే నైజర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. నైజర్కు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి లోపం కనిపించలేదు. చాలా ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత పుట్టిన చిన్నకొడుకులో మాత్రం పుట్టుకతోనే అరుదైన వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద కొడుకుని పరీక్షించడంతో వాడిలోనూ ఈ అరుదైన సమస్య ఉందని, ఇది మెటాఫిసల్ కొండ్రోడైస్పా›్లసియా అని, జన్యుపరమైనదని వైద్యులు తేల్చారు. ‘ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను’ అంటున్న నినా, తన ఇద్దరు కుమారులతో వైద్య పరిశోధనల్లో భాగమైంది. ముగ్గురూ వీల్చైర్లలో ఉండటంతో వారు ఇంటి నుండి బయటకు రావాలంటే మరొకరి సహాయం కావాలి. కానీ, తన కుటుంబంలో నిత్యం నవ్వులు పూయించడానికి తపిస్తూనే ఉంది నినా. ‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇది వైకల్యం ఉన్నవారిలో కలిగే స్వతంత్ర భావనగా నేను ఆనందిస్తాను. మీ లక్ష్యం కేవలం ప్రయాణికుడిగా ఉంటే చాలదు, జీవితానికి బాధ్యత వహించాలి. ఈ రోజు నా కొడుకులు అర్షాన్, జహాన్ సూపర్ హీరోల్లా నాకు కనిపిస్తుంటారు. వారి ఆటపాటలు, అల్లరిని చూస్తుంటే ఎంతటి శత్రువునైనా ఓడించగల బలం వచ్చేస్తుంది’ అని ఆనందంగా వివరిస్తుంది నినా నైజర్. ఇప్పటికీ జీవితంలోని ఒడిదొడుకులను సవాళ్లుగా తీసుకొని చిరునవ్వుతో నిత్య పోరాటం చేస్తున్న నినా నైజర్ ఎంతో మంది నిరాశావాదులకు ఆశాదీపంలా కనిపిస్తుంది. ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను. – నినా నైజర్ భర్త, పిల్లలతో నినా నైజర్ -
ఇతడు మొనగాడురా బుజ్జీ!
సాహసం సాహసం కోసమే చేసేవాళ్లు ఉన్నారు. పదిమందికి సహాయం కోసం సాహసం చేసేవాళ్లు ఉన్నారు. హాంకాంగ్‌కు చెందిన 35 సంవత్సరాల లై చి రెండో కోవకు చెందిన సాహసి. పదిసంవత్సరాల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ వల్ల లై చి వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన వీల్‌చైర్‌నే విల్పవర్గా మార్చుకున్నాడు. ధైర్యసాహసాలకు ప్రతీక గా చెప్పుకునే 495 మీటర్ల లైన్రాక్ పర్వతాన్ని అయిదుసంవత్సరాల క్రితం వీల్‌చైర్‌తోనే అధిరోహించాడు.‘ఈ సాహస ప్రయాణంలో నేను దివ్యాంగుడిననే ఆలోచన ఎప్పుడూ రాదు’ అంటాడు లై చి. రాక్ క్లైంబింగ్లో నాలుసార్లు ఏషియన్ ఛాంపియన్‌గా నిలిచిన లైచి తాజాగా మరో సాహస ఘట్టానికి తెర తీశాడు. 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్‌ను వీల్‌చైర్‌తోనే అధిరోహించి ‘భళా!’ అనిపించుకున్నాడు. పర్వతాన్ని అధిరోహించడం కంటే అద్దాల ఆకాశహర్మ్యాన్ని అధిరోహించడమే చాలా కష్టమని చెబుతున్నాడు. స్పైనల్ కార్డ్ పేషెంట్ల కోసం నిధుల సమీకరణలో భాగంగా ఈ సాహసం చేశాడు లై చి. -
దివ్యాంగులను మన దేశంలో తేడాగా చూస్తారు
ఎదగాలనుకునే మనిషికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. విధి కావచ్చు. వ్యక్తులు కావచ్చు. ఆగకూడదు.... సాగిపోతూనే ఉండాలి.. అంటారు హసిత ఇళ్ల.ఫ్రెడ్రిచ్ అటాక్సియా వ్యాధి తనను ఆపలేకపోయిందని కూడా అంటారు.హైదరాబాద్‌కు చెందిన హసిత ఇళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పుణేలో ఉంటున్నారు. తన లోపాన్ని ఏ మాత్రం మనసుకి పట్టించుకోకుండా, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. మా అమ్మవాళ్లది కాకినాడ. నాన్నగారిది హైదరాబాద్. నాకు తొమ్మిది నెలల వయసున్నప్పుడు మేమంతా అమెరికా వెళ్లిపోయాం. నాకు పది సంవత్సరాలు వచ్చేవరకు అందరిలాగే సాధారణంగానే ఉన్నాను. అప్పుడు చిన్న అనారోగ్యం చేసింది. డాక్టర్లకు చూపించారు. అక్కడ ఏదో పొరపాటు జరగటంతో నాకు ఫ్రెడ్రిచ్ అటాక్సియా అనే న్యూరో డిసీజ్ వచ్చిందని చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఈ వ్యాధి వచ్చిన కొత్తల్లో బాగానే నడిచేదాన్ని. ఆ తరవాత ఊగుతూ, గోడలు పట్టుకుంటూ నడిచేదాన్ని. స్కూల్లో పిల్లలంతా ఆటపట్టించేవారు. అప్పుడు చిన్నదాన్ని కావటం వల్ల రోజూ ఏడిచేదాన్ని. అలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అమ్మే నా ధైర్యం.. నా బాధ అమ్మ చూడలేకపోయింది. తనకు మెడిటేషన్ తెలుసు. నాకు నిరంతం ధైర్యం నూరిపోసేది. ‘నువ్వు దివ్యాంగురాలివి అనే భావన మనసులోకి రానియ్యకు..’ అని నిత్యం చెబుతుండేది. శారీరకంగా ఎంత బలం ఉన్నా మనోధైర్యం లేకపోతే ఉపయోగం లేదనీ జీవితంలో పైకి రాలేమనీ తెలుసుకున్నాను. మెడిటేషన్ కోసం మా కుటుంబమంతా చెన్నై వచ్చేశాం. అక్కడ నాలుగేళ్లు ఉన్నాం. తమ్ముడి సహాయంతో స్కూల్‌కి వెళ్లేదాన్ని. నిరంతరం నన్ను నేను మోటివేట్ చేసుకోవటం ప్రారంభించాను. 12 వ తరగతి అయ్యాక బిటెక్ పుణేలో హాస్టల్ ఉంటూ చదువుకోవటం వల్ల మరింత ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. హైదరాబాద్ సిసిఎంబిలో ఆరు నెలలు ఇంటర్న్‌షిఫ్ చేయటానికి వచ్చాను. ఇక్కడ అందరూ నన్ను ఎంతో ప్రోత్సహించారు. మెడిటేషన్ సెంటర్ నుంచి... మెడిటేషన్ సెంటర్లో నేర్చుకుంటున్నప్పుడే అనుకోకుండా ఒక స్పీచ్ ఇచ్చే అవకాశం వచ్చింది. శంకర్‌మహదేవన్ కచేరీ. 50 వేలకు పైగా ప్రేక్షకులు వచ్చారు. మెడిటేషన్ వాళ్లే నన్ను మాట్లాడమని ప్రోత్సహించారు. భయం భయంగా వెళ్లాను. నోటిలో నుంచి మాట వస్తుందా రాదా అని బిక్కుబిక్కుమంటూనే స్పీచ్ ప్రారంభించాను. ఎలా పూర్తి చేశానో నాకే తెలియదు. స్పీచ్ పూర్తి కాగానే చాలామంది నా ఆటోగ్రాఫ్ కోసం రావటం నేను ఇప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నా మీద నాకు నమ్మకం మరింత కలిగింది. ఆ తరవాత నుంచి స్పీచ్ కాకుండా నా సొంత బ్లాగ్ క్రియేట్ చేసి, రాయటం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా, అందుకని యూ ట్యూబ్ చానల్ ప్రారంభించాను. అందరిలాగే చూడాలి... దివ్యాంగులను మన దేశంలో చాలా తేడాగా చూస్తారు. ‘అయ్యో! పాపం!’ అంటూ సానుభూతి ప్రకటిస్తారు. అటువంటి ఆలోచనలను దూరం చేయాలి. ఎన్ని లోపాలున్నా మనం విజయాలు సాధించటానికి అవేవీ అవరోధాలు కావని నిరూపించటానికే నేను ఇన్ని సాధనాలను ఉపయోగించుకుంటున్నాను. పొద్దున్నే నాన్న, తమ్ముడు, వాకర్ల సహాయంతో మార్నింగ్ వాక్ చేస్తున్నాను. సాయంత్రాలు వీల్‌చెయిర్‌లో మా కాంపౌండ్‌లో ఒక్కర్తినే తిరుగుతాను. నాకు తిరగటం, మాట్లాడటం అంటే చాలా ఇష్టం. కోవిడ్ వల్ల బయటకు వెళ్లలేకపోతున్నాను. అవెన్ నాకు అందుతుంది కనుక, అప్పుడప్పుడు కేక్ తయారు చేస్తుంటాను. వీల్ చెయిర్ – విల్ పవర్... జుంబా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ సరదాగా చేసి ఫన్నీ వీడియోలు పెడుతున్నాను. కామెడీ చేస్తుంటాను. వీల్‌చైర్ ట్యాగ్‌తో ‘స్టేహోమ్’ అని చెబుతున్నాను. ప్రతి నెల ఒకటి, మూడు వారాల్లో వీడియోలు పోస్టు చేయటం. రెండు, నాలుగు వారాల్లో బ్లాగులో పోస్టింగు. నాలాగే వీల్‌చెయిర్‌కి పరిమితమైన వాళ్లకు సలహాలు ఇస్తుంటాను. నేను స్వేచ్ఛగా అన్ని పనులు చేసుకోవటానికి అనుగుణంగా మాన్యుయల్ వీల్ చెయిర్ కాకుండా ఎలక్ట్రికల్ వీల్ చెయిర్ వాడాలని ఉంది. వాటి ధర లక్ష రూపాయల దాకా ఉంది. టూరిస్టు ప్రదేశాలలో వీల్ చెయిర్‌తో తిరిగేలా చేస్తే బావుంటుంది. నాలోని ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పాజిటివ్ ఆలోచనలకుగాను ‘గ్లోబల్ ఎంపవర్మెంట్ అవారు’్డ 2019 నవంబరులో ఢిల్లీలో అందుకున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
వికలాంగుడికి తోడుగా..
-
నడక నేర్పిన స్నేహం
అది 2015 సంవత్సరం. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ. ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ అతడి సహచరులు నలుగురైదుగురి మధ్య గాఢమైన స్నేహబంధం ఉండేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నంతగా అల్లుకుపోయారు. వారిలో తరుణ్ అనే స్నేహితుడు వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. మడమ పైభాగంలో కాలు విరగడంతో కొన్నాళ్లు వీల్ చెయిర్‌కే తరుణ్ పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రచ్‌ల సాయంతో నడిచినా కష్టంగా ఉండేది. సీన్ కట్ చేస్తే ఇటీవలే.. శ్రీనివాస్ అతడి మిత్రులు అరవింద్ సురేశ్, అంబాల పూజా, గిరిష్ యాదవ్‌లు తరుణ్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. స్నేహితుల దినోత్సవం రోజున తరుణ్‌కు వాళ్లిచ్చిన కానుక వెల కట్టలేనిది. తరుణ్ నడిచేందుకు వీలుగా ఓ క్రచ్‌ను స్వయంగా డిజైన్ చేసి ఇచ్చారు. దీని సాయంతో ఎలాంటి రోడ్డుపై అయినా అవలీలగా నడవొచ్చు. మంచు కురుస్తున్నా, బురదగా మారినా, రాళ్లూరప్పలు ఉన్నా.. మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఎంతో హాయి. వీటి కిందభాగం మృదువుగా ఉండటమే కాకుండా అడుగు వేస్తే ఎలాంటి నొప్పి కలగదు. ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తరుణ్‌కు ఆసరాగా ఉండేందుకు ఈ ప్రోటోటైప్ క్రచ్‌ల డిజైన్ మొదలు పెట్టారు. బిరాక్, ఒయాసిస్ అనే అధ్యయన సంస్థలతో కలసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్రచ్‌ను రూపొందించారు. వీటిని ఫ్లెగ్జ్మో క్రచ్‌లని పిలుస్తారు. పోలియో వ్యాధిగ్రస్తులు, ఆపరేషన్ అయినవారు ఈ క్రచ్‌లని వినియోగించుకోవచ్చు. వీటిని ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యులు కూడా పరీక్షించి చూసి కితాబిచ్చారు. ఈ నెల 9న ఈ క్రచ్‌లను మార్కెట్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఒక స్నేహితుడి కోసం వారు పడ్డ తపన, ఇప్పుడు ఎందరో జీవితాలకు ఆసరాగా మారుతోంది. నడవ లేని వారి జీవితాలను ఈ క్రచ్ మార్చేస్తుందని తరుణ్ ఆనందబాష్పాల మధ్య చెప్పాడు. -
అబ్దుల్ గఫర్, ప్రతిమ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వీల్ చెయిర్ టెన్నిస్ టోర్నమెంట్లో కర్ణాటక క్రీడాకారులు అబ్దుల్ గఫర్, ప్రతిమా రావు శుభారంభం చేశారు. హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ తొలిరౌండ్లో విజయం సాధించారు. ఎల్బీ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీని అగ్రశ్రేణి కథానాయిక అక్కినేని సమంత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బుధవారం జరిగిన పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌లో అబ్దుల్ గఫర్ 9–2తో దేవేంద్ర (కర్ణాటక)పై గెలుపొందగా. మహిళల విభాగంలో ప్రతిమా రావు 9–0తో సుధ (కర్ణాటక)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శిల్ప 9–6తో నళిని కుమారిపై, వీరాస్వామి శేఖర్ (కర్ణాటక) 9–0తో కుందరాగి బసవరాజు (కర్ణాటక)పై గెలుపొందారు. ఇతర పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో అంజినప్ప (కర్ణాటక) 9–5తో కేదార్ మండల్ (ఢిల్లీ)పై, శరవణన్ (కర్ణాటక) 9–3తో ఇందుధర బీఎస్ (కర్ణాటక)పై, దేవ గౌడ (కర్ణాటక) 7–5తో కేశవన్ (కర్ణాటక)పై, మౌలాలి (కర్ణాటక) 9–4తో హనుమంతప్ప (కర్ణాటక)పై నెగ్గారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఇండియన్ వీల్‌చెయిర్ టెన్నిస్ టూర్ (ఐడబ్ల్యూటీటీ) చైర్మన్ సునీల్ జైన్, భారత టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
నడవలేక నడిచాడు.. ప్రాణాలు విడిచాడు..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): అసలే కాలేయ వ్యాధి.. అడుగు తీసి వేయడానికి నరకయాతన పడుతున్నాడు.. ఆస్పత్రి ఓపీ వద్దకు వెళ్లాలంటే.. చాలా దూరం. తన భర్త అంతదూరం నడవలేడని భావించిన ఆ ఇల్లాలు స్ట్రెచర్/వీల్‌చైర్‌ను ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సిబ్బందిని వేడుకుంది. వారు కనికరించకపోవడంతో చేసేదేంలేక అతికష్టం మీద భర్తను నడిపించుకుంటూ తీసుకెళుతుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై ఓపీ వద్ద మెట్లెక్కుతూ ప్రాణాలొదిలాడు. ఈ ఘటన గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. బెలుం గ్రామానికి చెందిన ఐజన్న కొద్దికాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం భార్య శిరోమణి ఓ వాహనంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చింది. ముందుగా సర్జికల్ ఓపీకి వెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి జీర్ణకోశ వ్యాధుల విభాగం ఓపీ (ఓపీ నెం.26)కి వెళ్లాలని సూచించారు. అసలే నడవలేని మనిషి.. ఆ ఓపీ విభాగం ఎక్కడుందో చూసొస్తే బాగుంటుందని భర్తను అక్కడే ఉంచి ఓపీ వద్దకెళ్లింది. తన భర్త ఇంత దూరం నడవలేడని భావించి.. క్యాజువాలిటీకి వెళ్లి అతని పరిస్థితిని వివరించిం స్ట్రెచర్/వీల్‌చైర్ ఇవ్వాలని బతిమాలింది. ఇక్కడి రోగులకే స్ట్రెచర్ ఇస్తామని, బయటి వారికి ఇచ్చేదిలేదని సిబ్బంది చెప్పడంతో చేసేదేంలేక భర్తను మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళుతుండగా అలసిపోయి పడిపోయాడు. సపర్యలు చేశాక మొదటి అంతస్తులో ఉండే ఓపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఐదు మెట్లు ఎక్కగానే ఐజన్న తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. -
నాన్నకు నేనే వీల్ చైర్..
సర్పవరం(కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ... జిల్లాలోని పేద, బడుగు వర్గాలకు ఆశాదీపం...ఆ ఆశతో వచ్చినవారికి నిరాశే ఎదురవుతోంది. ఈ చిత్రం చూశారా! కాకినాడ గొడారిగుంటకు చెందిన జల్దారపు అప్పారావు ప్రమాదవశాత్తూ మంచంపై నుంచి పడి గాయపడ్డాడు. నడవలేని స్థితికి చేరాడు. దీంతో అతడి ముగ్గురు కుమార్తెలు తండ్రిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎముకల వార్డు నుంచి బయటకు రావడానికి వీల్ చైర్ అడిగితే ఆసుపత్రి సిబ్బంది కుదరదన్నారు.. బతిమలాడినా వారి మనసు కరగలేదు. దీంతో చేసేది లేక నడవలేని తండ్రిని ఎత్తుకొని చిన్న కుమార్తె జల్దారపు అన్నపూర్ణ ఇలా ఆసుపత్రి లోపలికి, వెలుపలికి తీసుకువచ్చింది. ఇది చూసినవారు ‘కంటే కూతురునే కనాల’ని ప్రశంసించి ఆసుపత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. -
చైర్లో వస్తువులు..చేతులపై రోగులు
నడపలేని స్థితిలో ఉన్న రోగుల కోసం ఆస్పత్రుల్లో వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంటాయి. కేజీహెచ్‌లోనూ అవి ఉన్నాయి.. కానీ వాటిని రోగుల కోసం కాకుండా మందులు, బెడ్షీట్లు, ఇతరత్రా సామగ్రి తరలించడానికి వినియోగిస్తున్నారు. రోగులను మాత్రం వారి సహాయకులు చేతులపై మోసుకొని, ఎత్తుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొంది. పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): సర్కారీ ఆసుపత్రుల్లో ట్రాలీలు, వీల్చైర్లు, స్ట్రెట్చర్ల కొరత పట్టిపీడిస్తోంది. కేజీహెచ్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. అరకొరగా ఉన్న వాటిని సిబ్బంది మందులు, గోనె సంచులు, చెత్తబుట్టలు, ఆక్సిజన్ సిలిండర్లు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో రోగులను వారి వారి బంధువులు చేతులమీద, వీపుపై ఎక్కించుకుని తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు అవసరమైన పరికరాలు లేకపోవడంతో రోగుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వార్డు నుంచి లేదా ఓపీ నుంచి నడవలేని వ్యక్తిని ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం ఎక్స్‌రే, స్కానింగ్‌లకు తీసుకువెళ్లేందుకు రోగి సహాయకులు నానాపాట్లు పడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని రోగులకు ముందుగా సహాయం అందిలే చూడాలని పలువురు కోరుతున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో ‘వీల్ చైర్ లిఫ్ట్’
శంషాబాద్: దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో వీల్ చైర్ లిఫ్ట్(వెర్టి లిఫ్ట్)ను ఏర్పాటు చేశారు. బ్యాగేజీ క్లైమ్ వరకు దీనిని ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రయాణికులు వినియోగించుకో వచ్చు. ఎలక్ట్రికల్ యంత్రంతో ఏర్పాటు చేసిన వెర్టి లిఫ్ట్‌తో సునాయాసంగా పైకి వెళ్లవచ్చు. ‘ప్రయాణికులే అత్యంత ప్రాధాన్యం’ కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా వీల్‌చైర్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశామని ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ తెలిపారు. -
మొన్న క్రేన్.. ఇప్పుడు వీల్ చెయిర్!
ఆమె వయసు కేవలం 36 సంవత్సరాలు.. బరువు మాత్రం 500 కిలోలకు పైమాటే. ఆ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఫిబ్రవరి రెండో వారంలో ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చేరారు. ఈజిప్టుకు చెందిన ఈమెను అక్కడి నుంచి సాధారణ విమానంలో తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో.. కార్గో విమానంలో తెచ్చారు. అక్కడినుంచి టెంపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మొదటి అంతస్తుకు ఆమెను మామూలుగా తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో.. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, భారీ క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. ఇదంతా రెండు నెలల క్రితం మాట. ఇప్పుడు ఆమె బరువు బాగా తగ్గిపోయింది. దాదాపు సగానికి పైగా బరువును ఆమె కోల్పోవడంతో.. ఇప్పుడు వీల్‌చెయిర్‌లో కూడా కూర్చునే పరిస్థితికి చేరుకుంది. ఎక్కువ సేపు కూర్చోడానికి కూడా ఆమె శరీరం అనువుగా ఉందని ఆమెకు చికిత్స అందించిన సైఫీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతంతో పోలిస్తే చాలా సన్నగా.. సంతోషంగా ఉన్న ఇమాన్ అహ్మద్ అబ్దులాటి వీడియో ఒకదాన్ని ఆస్పత్రి వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు నెలల క్రితం కనీసం ఆమె ఎప్పటికైనా కూర్చోగలదా అన్న అనుమానం తమకు ఉండేదని, కానీ ఇప్పుడు వీల్‌చెయిర్‌లో ఎక్కువసేపు కూర్చోగల సామర్థ్యం ఆమెకు వచ్చిందని డాక్టర్ అపర్ణా గోవిల్ తెలిపారు. ఇంతకుముందు కంటే ఆమె చాలా అప్రమత్తంగా ఉంటోందని, క్రమం తప్పకుండా ఆమెకు ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని వివరించారు. ఆమెకు ముందునుంచి ఉన్న నరాల సమస్యల గురించే వైద్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని తాలూకు ప్రభావం ఇప్పటికీ ఇమాన్ మీద కనిపిస్తోంది. చదవండి: భారీ కాయాన్ని మోయలేక..