శంషాబాద్: దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో వీల్ చైర్ లిఫ్ట్(వెర్టి లిఫ్ట్)ను ఏర్పాటు చేశారు. బ్యాగేజీ క్లైమ్ వరకు దీనిని ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రయాణికులు వినియోగించుకో వచ్చు. ఎలక్ట్రికల్ యంత్రంతో ఏర్పాటు చేసిన వెర్టి లిఫ్ట్‌తో సునాయాసంగా పైకి వెళ్లవచ్చు. ‘ప్రయాణికులే అత్యంత ప్రాధాన్యం’ కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా వీల్‌చైర్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశామని ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు.