న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో చాలా మది ప్రముఖులు సిబ్బంది తనిఖీల దృష్ట్యా ఈ మధ్య కాలంలో పలు చేదు అనుభవాలను చూసిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కాలంలో ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్ తన కృత్రిమ అవయవాన్ని తొలగించమని ముంబై విమానాశ్రయంలో సిబ్బంది కోరినప్పుడు తాను చాలా అవమానానికి గురైయ్యానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పైగా మాలాంటి వాళ్ల పట్ల ఇలా ప్రవర్తించవద్దని ఎయిర్ పోర్ట్ సిబ్బందిని కోరారు కూడా. దీంతో ముంబై ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సుధా చంద్రన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పడు అచ్చం అలాంటి చేదు అనుభవమే 80 ఏళ్ల దివ్యాంగురాలికి ఎదురైంది. ఈ ఘటన గౌహతి ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే....గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 80 ఏళ్ల దివ్యాంగురాలు తన మనవరాలలితో కలిసి వచ్చింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణిలను తనిఖీ చేయడం సహజం అదే విధంగా వారిని ఆ విమానాశ్రయంలోని సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేశారు. అయితే సదరు మహిళ తుంటి ఎముక(హిప్ ఇపంప్లాంట్)కు సర్జరీ చేయించుకుంది. అయితే సిబ్బంది తనిఖీల సమయంలో ఆమె శరీరంలోని మెటల్ పీస్ ఇండికేటర్ ఆన్‌లో ఉండటంతో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో ఆమెను ఫిజికల్ టెస్ట్‌ల తనిఖీ నిమిత్తం ఫ్రిస్కింగ్ బూత్‌కి తీసుకువెళ్లారు.
అంతేకాదు తుంటి ఎముక సర్జరీ జరిగిన ప్రాంతం చూపించమంటూ సిబ్బంది బలవంతం చేశారు. పైగా ఆమె లోదుస్తులను తొలగించి నగ్నంగా చెక్ చేశారు. దీంతో ఆ మహిళ కూతురు కికాన్ ట్విట్టర్‌లో.. "నా 80 ఏళ్ల తల్లి టైటానియం ఇంప్లాంట్‌కు ప్రూఫ్ కావాలని ఆమెను దుస్తులు విప్పమని బలవంతం చేసారు. ఈ విధంగానా సీనియర్ సిటిజన్ల పట్ల వ్యవహరించేది అని మండిపడ్డారు". అంతేకాదు ఆమె ట్విట్టర్ వేదికగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీఐఎస్‌ఎఫ్ భద్రతా దళాలకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీఐఎస్‌ఎఫ్ గౌహతిలో జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఆ ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సదరు సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశామని పేర్కొంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ట్విట్టర్‌లో ఫిర్యాదుదారుపై స్పందిస్తూ..తాను కూడా ఈ విషయమై విచారణ చేస్తున్నాని తెలియజేయడమే కాకుండా సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
(చదవండి: వీడియో: హుషారుగా గంతులేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. అందులో ఎక్స్‌పర్ట్ కూడా!)
Comments
Please login to add a commentAdd a comment