CISF
-
గన్నవరం విమానాశ్రయానికి త్వరలో సీఐఎస్ఎఫ్ భద్రత
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం భద్రతను త్వరలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది. ఈ మేరకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమోదించిన నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా ఖరారు చేసింది. దీనిని కేంద్ర విమానయాన శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం భద్రతపట్ల సందేహాలకు తెరపడనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవ గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరుగుతుండటంతో దేశంలోని ఇతర విమానాశ్రయాలతో సమాన స్థాయిలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐఎస్ఎఫ్ బలగాలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ భద్రత విధులు నిర్వర్తిస్తాయి.బంగారం, ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటాయి. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ భద్రత కోరింది. ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అంగీకరించింది. ఈ ఏడాది జూలై 2 నుంచి విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. అడ్డుకున్న కూటమి ప్రభుత్వం కాగా, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయం భద్రత రాష్ట్ర పోలీసు పరిధిలోని ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్పీఎఫ్) చేతుల్లోనే ఉండాలని భావించింది. దాంతో జూలై 2న గన్నవరం విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్’కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత ఇలా..ప్రస్తుతం ఎస్పీఎఫ్కు చెందిన 250 మంది గన్నవరం విమానాశ్రయం భద్రత విధుల్లో ఉన్నారు. అయితే, వారిలో 70 మంది మాత్రమే ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్‌వే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తే ఏకంగా 350 మందిని కేటాయిస్తారు. వారిలో 150 మందిని ప్రత్యేకంగా ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్ వే భద్రతకు నియోగిస్తారు. తద్వారా భద్రత మరింత పటిష్టమవుతుంది.బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన కేంద్రం ఇటీవల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఏఏఐ అప్రమత్తమైంది. గతంలో ఆమోదించినట్టుగా గన్నవరం విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయిస్తూ కేంద్ర విమానయాన, హోం శాఖలకు ప్రతిపాదనలు పంపింది. దీంతో జూలై 2న విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణాలను కేంద్ర హోం శాఖ వాకబు చేసింది. సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. కాగా, వచ్చే జనవరిలోనే గన్నవరం విమానాశ్రయ భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్టు తెలిసింది. -
పార్లమెంట్ వద్ద తోపులాటలో ఎంపీలకు గాయాలు.. CISF కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ తెలిపారు.పార్లమెంట్ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు సీఐఎస్ఎఫ్ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు.పరస్పరం పోలీసులకు ఫిర్యాదుపార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్‌పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఉభయ సభల్లోనూ వాగ్వాదంఅంతకుముందు.. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘బాంబు’ అలజడి
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్! -
సీఐఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా బెటాలియన్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్)లో మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది. పూర్తిగా మహిళలతో కూడిన ఈ బెబాలియన్లో వెయ్యి మంది సభ్యులుంటారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాలు, ప్రముఖుల భద్రత విధులు సీఐఎస్ఎఫ్కు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ నిర్ణయం వెలువరించినట్లు సమాచారం.సీఐఎస్ఎఫ్కు మంజూరైన 2 లక్షల మంది బలగాల్లోనే మహిళల రిజర్వుడు బెటాలియన్ కూడా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మొత్తం 1,025 మంది సభ్యులకుగాను సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నాయకత్వం వహిస్తారు. తాజాగా ప్రకటించిన బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కేటాయించే విధులకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లోని 1.80 లక్షల మందిలో ఏడు శాతం వరకు మహిళలున్నారు.కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా వ్యవహరించే ఉగ్రవాదులు ఎందరన్న దానిపై నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. మొత్తం 119 మంది ఉగ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదుల ఉనికి, వారి కార్యకలాపాల తీవ్రత, కొత్త వారిని చేర్చుకుంటున్న తీరును బట్టి నిఘా వర్గాలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుమొత్తం 119 మందిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని ఉత్తర ప్రాంతంలో 79 మంది ఉండగా వీరిలో 16 మంది స్థానికులు కాగా, 61 మంది విదేశీయులని తేలింది. పర్వత శ్రేణుల దక్షిణ భాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్న 40 మంది ముష్కరుల్లో ఏకంగా 34 మంది విదేశీయులు కాగా, ఆరుగురు మాత్రమే స్థానికంగా ఎంపికైన వారిగా నిఘా వర్గాలు గుర్తించాయి. -
Video: సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప చెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి.
జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమ ఉద్యోగికి ఎయిర్‌లైన్స్ సంస్థ అండగా నిలిచింది. పోలీస్ అధికారి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.అతని నుంచి అసభ్య పదజాలం, లైంగిక వేధింపులు మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ద్యోగి వద్ద సరైన ప్రవేశ పాస్ కలిగి ఉన్నప్పటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించాడని, అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. డ్యూటీ తరువాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్టు వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగి తరపున ఎయిర్‌లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపింది.Why is @flyspicejet trying to save it's female employee who was trying to enter through wrong-gate and then slapped #CISF officer? Has #SpiceJet done even a bit of investigation before jumping to support its errant employee?🤨#SpiceJetSlapGate #Jaipurpic.twitter.com/v24theSBaB pic.twitter.com/6di1KG5seP— India Crooks (@IndiaCrooks) July 11, 2024 కాగా అనురాధ రాణి అనే మహిళ స్పైస్‌జెట్ సంస్థలో ఫుడ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ గేటు మీదుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు ఆమెకు తగిన అనుమతి లేదని అన్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్టు వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించారు. అయితే, ఆ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు, అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. -
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ : ఆమె బెంగళూరుకు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు.చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్‌పై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
‘కంగన’కు చెంపదెబ్బ.. సంజయ్‌రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీఎంపీ కంగనా రనౌత్‌ను మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు వేస్తారు. కొందరు చెంపదెబ్బలు కొడతారు. కంగనా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆమెపై నాకు సానుభూతి ఉంది.ఆమె ఇప్పుడు ఒక ఎంపీ. ఎంపీపై దాడి జరగకూడదు. ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెబుతున్నట్లు ఆమె తల్లి గనుక రైతుల ధర్నాలో ఉంటే కోపం వస్తుంది. రైతుల పోరాటానికి వ్యతిరేకంగా కంగన మాట్లాడింది. నాకు రైతుల పట్ల గౌరవం ఉంది’అని సంజయ్‌రౌత్ అన్నారు.ఛండీగఢ్ ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం సంచలనం రేపింది. కంగన రైతుల పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడినందునే తాను కొట్టినట్లు కానిస్టేబుల్ తెలిపింది. కాగా, గతంలో మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నప్పుడు కంగన శివసేనకు వ్యతిరేకంగా తరచూ సవాళ్లు విసురుతూ ఉండేది. ఒక దశలో ముంబైలోని కంగనా స్టూడియో భవనాన్ని మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. -
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. కుల్విందర్ కౌర్ అరెస్ట్
బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌ను కానిస్టేబుల్ చెంపదెబ్బ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఆపై ఆమెను అరెస్ట్ చేసింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..బీజేపీ నేత, మండీ లోక్‌సభ ఎంపీ కంగన రనౌత్ చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగు పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న కంగనను కుల్విందర్ కౌర్ చెంప పగలగొట్టింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా2020లో మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమేనని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చెపట్టారు. దీంతో తలొగ్గిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.సింగర్ రిహానా మద్దతుఆ సమయంలో ప్రముఖ సింగర్ రిహానా భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని రిహానా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో పలువురు ప్రముఖ ఆమెకు మద్దతుగా నిలిచారు. నోరు పారేసుకున్న కంగనా రనౌత్రిహానా ట్వీట్‌పై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీగా మార్చాలని అనుకుంటున్నారు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. మేం మాదేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు’ అంటూ రిహానాపై కంగానా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు.టైమ్ మ్యాగజైన్లో బిల్కిస్దీనికి తోడు టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఆయా దేశాలకు 100మంది అత్యంత ప్రభావశీలురు జాబితాను విడుదల చేస్తోంది. 2019లో టైమ్ మ్యాగజైన్ .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్ బాగ్‌లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్ బాగ్ దాదీగా పేరొందిన 82 ఏళ్ల (నాడు) బిల్కిస్ ముందుండి నడిపించారు. బిల్కిస్‌ను ప్రస్తావిస్తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో బిల్కిస్ పాల్గొన్నారని, ఆమె రోజువారీ కిరాయి ప్రాతిపదికన అందుబాటులో ఉంటారని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఉద్యోమంలో పాల్గొనందుకు ఆమెకు ఆహారం, బట్టలు, అవార్డ్లు, పాకెట్ మనీ ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆట్వీట్‌ను కంగాన రీట్వీట్ చేస్తూ “హ హ హ ఆమె అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో కనిపించిన అదే దాదీ. ఆమె రూ.100 రూపాయలకే ధర్నాలో పాల్గొన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రతీకారం తీర్చున్న కుల్విందర్ కౌర్ఈ నేపథ్యంలో నాడు కంగానా చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్‌ఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఎయిర్ పోర్ట్‌లో ప్రతీకారం తీర్చున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్ పోర్ట్‌లోకి వచ్చిన కంగనాను కుల్విందర్ కౌర్ చెంప చెళ్లుమనిపించారు.అందుకే కొట్టాఅనంతరం రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది. కాగా, కంగనాను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ విభాగం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధుల నుంచి తొలగించింది. -
ఎయిర్‌పోర్ట్‌లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను కుల్వీందర్ కౌర్‌గా గుర్తించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024 -
సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్
ఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్ నియమితులయ్యారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఆమె.. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రాను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ఈయన మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ అనీష్ దయాళ్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈయన చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(IB)కోసం పనిచేశారు. డిసెంబర్ 11న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దయాళ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్ఎఫ్ను కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కొత్త, పాత పార్లమెంట్ భవనాల భద్రత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుంది. సీఐఎస్ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీసు దళంలో భాగంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలకు కాపలాగా ఉంటుంది. అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్స్టాలేషన్లను కూడా కాపాడుతోంది. పార్లమెంటు భవన సముదాయాన్ని సర్వే చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. తద్వారా సీఐఎస్ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగాన్ని సమగ్ర నమూనాలో మోహరించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో అలజడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నలుగురు దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని పట్టబట్టాయి. ఈ క్రమంలో దాదాపు 150 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ -
అన్న సీఐఎస్ఎఫ్.. చెల్లి సీఆర్పీఎఫ్
కరీంనగర్: వ్యసాయం మీదనే ఆ కుటుంబం ఆధారపడి బతుకుతోంది. కానీ వారి పిల్ల లను మాత్రం కేంద్ర బలగాలకు పంపాలనుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు సీఐఎస్ఎఫ్, సీఆర్పీఫ్కు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పోతుల ప్రభాకర్–రాజమణి కూతురు పోతుల స్రవంతి పదోవ తరగతి వరకు స్థానిక మోడల్ స్కూల్లో విద్యనభ్యసించిది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఇటీవల సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది. ఆదివారం విడుదలైన ఫలితాలలో కానిస్టేబుల్‌గా ఎంపికై ంది. అంతకుముందు ఎస్సైకి దరఖాస్తు చేసుకోగా విఫలమైంది. కానీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అదేవిధంగా పోతుల స్రవంతి చిన్నాన పోతుల చంద్రయ్య–ఇందిరల కుమారుడు పోతుల శ్రావణ్ కూడా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శ్రావణ్ పదో తరగతి వరకు స్థానిక మోడల్ స్కూల్లో చదివాడు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇద్దరు ఒకే కుటుంబం నుంచి కేంద్ర సాయుధ బలగాలకు ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్తులు వారిని అభినందించారు. ఇద్దరు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నారు, కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మహత్యాయత్నం.. భర్తతో గొడవపడి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. గత రాత్రి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే.. అది గమనించిన సీఐఎస్ఎఫ్ బలగాలు.. ఆ యువతిని రక్షించారు. శుక్రవారం రాత్రి డిపార్చర్ విభాగం వద్ద పైనుంచి దూకేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. వెంటనే అధికారులు ఆమెను కాపాడి.. మహిళా ఎయిర్పోర్ట్ అధికారులకు అప్పగించారు. సదరు యువతిని బెంగళూరు(సౌత్)కి చెందిన శ్వేతగా గుర్తించారు. భర్త విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేతతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనారోగ్యాన్ని తట్టుకోలేకపోయాడు! చివరకు ఆ కానిస్టేబుల్.. -
ఎయిర్‌పోర్టుల్లో ‘బిచ్చగాడు’.. ఓ యువకుడి నకిలీ యాచన!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు కూడళ్లు, ప్రార్థనా స్థలాలు, ఫంక్షన్ హాళ్లు తదితర చోట్ల యాచకులను చూస్తూనే ఉంటాం. వృద్ధాప్యం వల్లో లేదా శారీరక వైకల్యం వల్లో యాచించే వారు కొందరైతే దీన్నే దందాగా మార్చుకొని జీవించే వారు ఇంకొందరు కనిపిస్తుంటారు. కానీ ఇలా రోజంతా అడుక్కున్నా ఎవరికైనా లభించేది చిల్లరే... అందుకే సులువుగా నోట్ల కట్టలు సంపాదించేందుకు ఓ యువకుడు ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకొని ‘బిచ్చగాడి’అవతారం ఎత్తాడు! శంషాబాద్ ఎయిర్పోర్ట్ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులు సహా అనేక మంది నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పర్సు పోవడంతో ఎదురైన అనుభవంతో.. చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్... బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు. ముందస్తు షెడ్యూల్‌తో ముష్టి కోసం.. విమానాశ్రయాలనే టార్గెట్‌గా చేసుకొని ప్రయాణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విఘ్నేష్ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్ విమాన టికెట్లు బుక్ చేసుకొనేవాడు. ఖరీదైన క్యాజువల్స్ ధరించి, చేతిలో లగేజ్ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్ షెడ్యూల్ టైమ్‌కు దాదాపు 4–5 గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్ (సైలెంట్ మోడ్‌లో ఉంచి) మాట్లాడినట్లు నటించేవాడు. తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. ఇప్పటివరకు ఫిర్యాదులులేకపోవడంతో.. ఈ పంథాలో విఘ్నేష్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. విఘ్నేష్ మోసగించిన వారిలో అత్యధికులు విదేశీయులే కావడంతో వారికి ఇది మోసమని తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నే‹Ùను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ హైదరాబాద్‌లో సాగించిన ‘భిక్షాటన’గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
గాల్లో విమానంలో అనూహ్య ఘటన
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్‌పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, హైదరాబాద్/జవహర్‌నగర్: ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ సీఐఎస్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్మారక స్తూపం వద్ద సీఐఎస్ఎఫ్ అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని కేంద్ర ప్రభుత్వ భవన సముదాయాలు, ఎయిర్‌పోర్టుల వంటి అనేక కీలక సంస్థలకు భద్రత కల్పించడంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని.. కేంద్ర హోం మంత్రిగా తాను ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వందో స్వాతంత్య్ర వేడుకల వరకు 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సేకరణను లక్ష్యంగా నిర్ధేశించారని, ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేందుకు భద్రత అనేది కీలక అంశమని అన్నారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉంటేనే ఇది సాధ్యమని హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. 1930 మార్చి 12న మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్రం కోసం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారని, అదే రోజున సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత విధుల్లో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ సమయంలోనూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అధికారులు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి, మానవీయ కోణంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో సేవలందించారని ప్రశంసించారు. సమస్యలను సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని జవాన్లకు సూచించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. గతంతో పోలిస్తే కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు తగ్గాయని, ప్రజల్లోనూ కేంద్ర బలగాలపై విశ్వాసం పెరుగుతోందని అమిత్‌షా అన్నారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రధాని మోదీ సర్కార్ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, సీఐఎస్ఎఫ్ డీజీపీ షీల్వర్ధన్ సింగ్, నిసా డైరెక్టర్ కె.సునీల్ ఇమ్మాన్యుయెల్, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విన్యాసాలు.. సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హకీంపేటలోని నిసాలో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్రమూకల దాడులను ఎలా తిప్పికొడతారు.. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది పనితీరు, అగ్నిప్రమాదాల సమయంలో సహాయక చర్యల వంటి విన్యాసాలను కళ్లకుకట్టినట్టు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చూపారు. మహిళా సిబ్బంది ప్రదర్శించిన కలరిపయట్టు విన్యా సాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకు ముందు నిసా ప్రాంగణంలోనే ‘అర్జున’పేరిట ఫైరింగ్ రేంజ్‌ను అమిత్‌షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన అధికారులు, జవాన్లకు బహుమతులను అందజేశారు. -
సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
Updates.. ► అమిత్ షా మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. సీఐఎస్ఎఫ్లో డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తాం. సీఐఎస్ఎఫ్ సేవలను చూసి దేశం గర్విస్తోంది. ► వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ► సీఐఎస్ఎఫ్ భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా సాక్షి, హైదరాబాద్: హకీంపేటలో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. -
హకీంపేట్ లో CISF రైజింగ్ డే పరేడ్
-
శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: శ్రీహరికోటలో మరో విషాదం నెలకొంది. సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన వికాస్‌సింగ్‌ని చూసేందుకు.. భార్య ప్రియా సింగ్ ఉత్తర ప్రదేశ్ నుంచి షార్కు వచ్చారు. విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి మనస్తాపంతో షార్‌లోని నర్మదా అతిథి గృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వికాస్‌సింగ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి, తండ్రి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కాగా, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటలో వ్యవధిలోనే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్‌సింగ్, కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య) -
షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం కలిగించింది. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఎస్ఐ కాల్చుకోవడాన్ని చూసిన సిబ్బంది శ్రీహరికోట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చింతామణి ఆత్మహత్య సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ చిన్నకన్నన్ శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు) -
సీఐఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య
జవహర్‌నగర్: హైదరాబాద్ నగర శివారులోని జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎస్)కు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం .. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట్ గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ (30)కు భార్య శిరీష, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. 2017లో సీఐఎస్ఎఫ్లో చేరిన రవీందర్‌ను కొన్ని కారణాలతో 2020లో తొలగించారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పని రవీందర్ రెండేళ్లుగా నిత్యం యూనిఫాం ధరించి హకీంపేట పరిధిలోని సింగాయపల్లిలో ఉంటున్న ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తున్నాడు. మంగళవారం సైతం భార్యకు ఇలాగే చెప్పి వెళ్లిన రవీందర్ కౌకూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అడవికి వెళ్లిన గొర్లకాపరులు ఈ విషయాన్ని జవహర్‌నగర్ పోలీసులకు చెప్పడంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
తనిఖీ పేరుతో దుస్తులు విప్పమని బలవంతం చేశారు.. అవమానించారు1
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో చాలా మది ప్రముఖులు సిబ్బంది తనిఖీల దృష్ట్యా ఈ మధ్య కాలంలో పలు చేదు అనుభవాలను చూసిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కాలంలో ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్ తన కృత్రిమ అవయవాన్ని తొలగించమని ముంబై విమానాశ్రయంలో సిబ్బంది కోరినప్పుడు తాను చాలా అవమానానికి గురైయ్యానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పైగా మాలాంటి వాళ్ల పట్ల ఇలా ప్రవర్తించవద్దని ఎయిర్ పోర్ట్ సిబ్బందిని కోరారు కూడా. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది సుధా చంద్రన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పడు అచ్చం అలాంటి చేదు అనుభవమే 80 ఏళ్ల దివ్యాంగురాలికి ఎదురైంది. ఈ ఘటన గౌహతి ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 80 ఏళ్ల దివ్యాంగురాలు తన మనవరాలలితో కలిసి వచ్చింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణిలను తనిఖీ చేయడం సహజం అదే విధంగా వారిని ఆ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేశారు. అయితే సదరు మహిళ తుంటి ఎముక(హిప్ ఇపంప్లాంట్)కు సర్జరీ చేయించుకుంది. అయితే సిబ్బంది తనిఖీల సమయంలో ఆమె శరీరంలోని మెటల్ పీస్ ఇండికేటర్ ఆన్‌లో ఉండటంతో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో ఆమెను ఫిజికల్ టెస్ట్‌ల తనిఖీ నిమిత్తం ఫ్రిస్కింగ్ బూత్‌కి తీసుకువెళ్లారు. అంతేకాదు తుంటి ఎముక సర్జరీ జరిగిన ప్రాంతం చూపించమంటూ సిబ్బంది బలవంతం చేశారు. పైగా ఆమె లోదుస్తులను తొలగించి నగ్నంగా చెక్ చేశారు. దీంతో ఆ మహిళ కూతురు కికాన్ ట్విట్టర్లో.. "నా 80 ఏళ్ల తల్లి టైటానియం ఇంప్లాంట్‌కు ప్రూఫ్ కావాలని ఆమెను దుస్తులు విప్పమని బలవంతం చేసారు. ఈ విధంగానా సీనియర్ సిటిజన్ల పట్ల వ్యవహరించేది అని మండిపడ్డారు". అంతేకాదు ఆమె ట్విట్టర్ వేదికగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐఎస్ఎఫ్ గౌహతిలో జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఆ ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సదరు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామని పేర్కొంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ట్విట్టర్లో ఫిర్యాదుదారుపై స్పందిస్తూ..తాను కూడా ఈ విషయమై విచారణ చేస్తున్నాని తెలియజేయడమే కాకుండా సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. (చదవండి: వీడియో: హుషారుగా గంతులేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. అందులో ఎక్స్పర్ట్ కూడా!) -
భద్రత.. నిబద్ధత
-
ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే
కర్ణాటక: ఉదయం లేచిన దగ్గర నుంచి మన పనులన్నింటిని సవ్యంగా పూర్తి చేసుకుని.. రాత్రి ఇంటికి చేరుకుని.. ఏ భయం లేకుండా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోతున్నామంటే అందుకు ప్రధాన కారణం భద్రతా సిబ్బంది. వారు కుటుంబాలకు దూరంగా, నిద్రాహారాలు మాని.. మన కోసం పని చేస్తున్నారు కాబట్టే.. మనం సురక్షితంగా ఉండగల్గుతున్నాం. అలాంటి వారి పట్ల మనం గౌరవమర్యాదలు కలిగి ఉండటం వారికిచ్చే అసలైన ప్రశంస. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నాలుగేళ్ల కుర్రాడు.. రక్షణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూసి.. వారికి సెల్యూట్ చేస్తాడు. ప్రతిగా వారు చిన్నారికి అభివాదం చేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ) ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనిలో నాలుగెళ్ల చిన్నారి వీర్ అర్జున్ తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ విమానాశ్రయం లోపలకి వెళ్తుంటాడు. ఆ సమయంలో వీర్‌కు ఎదురుగా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్లు తన విధులకు హాజరయ్యేందుకు వాహనంలో వస్తుంటారు. వారిని గమనించిన వీర్.. తండ్రి చేయి వదిలిపెట్టి.. సీఐఎస్ఎఫ్ వాహనానికి ఎదురుగా నిలబడి.. వారికి సెల్యూట్ చేస్తాడు. వీర్ని గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రతిగా సెల్యూట్ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వీర్ తండ్రి తొలుత ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజనులు వీర్‌పై ప్రశంసలు కురిపించసాగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వీడియోని రీ పోస్ట్ చేస్తూ.. ‘‘గౌరవం, దేశభక్తి వంటి అంశాలను బాల్యంలోనే నేర్పించాలి’’ అంటూ వీర్‌పై ప్రశంసలు కురిపించడంతో ఇది మరోసారి వైరలయ్యింది. ఇప్పటికే ఈ వీడియో ని 4 లక్షల మందికిపైగా లైక్ చేశారు. (చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది) ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘ఈ చిన్నారి దేశభక్తిని చూసి ఫిదా అయ్యాను. చిన్నారిని అతడి తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచుతున్నారు.. ఇలాంటి మంచి లక్షణాలను బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. బాలుడికి సెల్యూట్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అభినందనలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ At #Bengaluru airport - a young Indian snaps off a salute to our men in uniform. Respect n Patriotism is learnt young. #Respect #JaHind 🇮🇳🙏🏻👏🏻 Video courtesy @MihirkJha 🙏🏻 pic.twitter.com/IeEkTZCnIH — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 24, 2021 -
సుధా చంద్రన్ ఆవేదన.. క్షమాపణలు తెలిపిన సీఐఎస్ఎఫ్
సుధా చంద్రన్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ప్రముఖ నాట్యకారణి అయిన సుధా చంద్రన్ ఓ ప్రమాదంలో తన కాలును కోల్పోగా కృత్రియ కాలును అమర్చుకున్నారు. కృత్రిమ కాలుతో కూడా తన నాట్యాన్ని కొనసాగిస్తూ ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల సుధ చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రతిసారి తన కృత్రిమ కాలును తొలగించమని అడుగుతునట్లు సుధా చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’ తాజాగా సుధాచంద్రన్ పట్ల ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రవర్తించి తీరుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్పందించింది. ఈ మేరకు ట్విటర్లో సుధాచంద్రన్‌కు క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్ ప్రకారం విమనాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో కొన్ని అసాధారణ పరిస్థితులలో మాత్రమే కృత్రిమ అవయవాలు కూడా తొలగించి పరిశీలించడం తమ సిబ్బంది విధి అని స్పష్టం చేసింది. అయితే సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా తమ సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. CISF apologises to actor Sudhaa Chandran after she shared a video on being stopped at airport for prosthetic limb. "We'll examine why the lady personnel concerned requested Sudhaa Chandran to remove prosthetics & assure that no inconvenience is caused to travelling passengers." pic.twitter.com/oaVThYB0Lv — ANI (@ANI) October 22, 2021 ఇదిలా ఉండగా.. సుధా చంద్రన్ ఎయిర్‌పోర్టులో తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. నేను ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. -
కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర భద్రత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతాబలగాల (సీఐఎస్ఎఫ్)తో రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని హోంశాఖను కేంద్ర జల శక్తి శాఖ కోరింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియా మకానికి సంబంధించి బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, చేసుకోవాల్సిన ఒప్పందాలు తదితర అంశాలతో హోంశాఖ గోదావరి, కృష్ణా బోర్డు లకు లేఖ రాసింది. సిబ్బందికి కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలు, వాహ నాలు, కార్యాలయాల ఏర్పా టు, వారి జీతభత్యాలకు సం బంధించి కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ అశుతోష్ కుమార్ బోర్డులకు ఓ ముసా యిదా పత్రాన్ని పం పారు. అన్నింటికీ సీఐఎస్ఎఫ్ భద్రత కృష్ణా, గోదావరి నదులు, ఉప నదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ కేంద్ర గెజిట్‌లోని మొదటి షెడ్యూల్లో చేర్చగా, షెడ్యూల్– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు వంద శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, చివరకు ఫర్నిచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోనికి తీసుకుని రోజువారీ నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర గెజిట్ మేరకు ఈ ప్రాజెక్టులన్నిటికీ సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాల్సి ఉంది. బోర్డుల కసరత్తు నేపథ్యంలో.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు అన్నింటినీ కృష్ణా బోర్డు తన స్వాధీనంలో ఉంచుకోనుండగా, గోదావరిలోని అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు తన పరిధిలోకి తెచ్చు కోనుంది. ఆయా ప్రాజెక్టులు, సిబ్బంది, కార్యాలయాల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఇప్పటికే బోర్డులు ఆదే శించాయి. ఎత్తిపోతల పథకాలు, కాలువలు, విద్యుత్కేం ద్రాలు, విద్యుత్ సరఫరా లైన్లు, ఆఫీసులు, సిబ్బంది వివరాలను అందజేయాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత దిశగా హోంశాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పె క్టర్లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, వారి బ్యారక్ లు, కార్యాలయాలు, వాటి నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై ముసాయిదా రూపొందించి బోర్డులకు పంపింది. ఈ ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం తెలుగు రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. -
న్యాయమూర్తుల రక్షణకు భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల రక్షణకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) మాదిరిగా భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశం సలహా ఇవ్వదగినది కాదని పేర్కొంది. ధన్‌బాద్ న్యాయమూర్తి హత్య కేసు సమోటో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు స్పష్టం చేశారు. న్యాయమూర్తుల భద్రతను తీవ్రంగా పరిగణించాల్సి అంశంగా తుషార్ మెహతా పేర్కొన్నారు. సమోటో కేసుకు సంబంధించి గత విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటరు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ నెల 14న కేంద్రం కౌంటరు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి హోంశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ తరహాలో భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యంకాదు, సలహా ఇవ్వదగినది కాదు’’ అని అఫిడవిట్లో పేర్కొంది. ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు స్థానంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రాలు అమలు చేస్తే చాలని పేర్కొంది. విచారణలో భాగంగా.. రాష్ట్రాలతో కలిసి చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది. హోం కార్యదర్శులతోనా, పోలీసు చీఫ్‌లతో ఎవరితో సమావేశం నిర్వహించాలని తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. సీసీటీవీలకే సొమ్ములు లేవని రాష్ట్రాలు చెబుతున్నాయని, రాష్ట్రాలు, కేంద్రం తేల్చుకోవాల్సి అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారో పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత విచారణ సమయంలోనే దాఖలు చేయాలని ఆదేశించిన పలు రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆయా రాష్ట్రాలు రూ.లక్ష జరిమానా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని పేర్కొంది. మణిపూర్, జార్ఖండ్, గుజరాత్‌లు సోమవారం కౌంటరు అఫిడవిట్ దాఖలు చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్రం కౌంటరు దాఖలు చేసిందని తెలిపింది. కేరళ తరఫు న్యాయవాది పదిరోజులు సమయం కోరగా అనుమతించిన ధర్మాసనం మిగిలిన రాష్ట్రాలు కూడా పది రోజుల్లో దాఖలు చేయాలని, రూ.లక్ష సుప్రీంకోర్టు బార్ అసోసియేన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని స్పష్టం చేసింది. పది రోజుల్లో దాఖలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. -
బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
సితాల్‌కుచీ/సిలిగురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అతిపెద్ద హింసాకాండ శనివారం చోటుచేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతాభంగా పోలింగ్ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల నుంచి తుపాకులు లాక్కొనేందుకు స్థానికులు ప్రయత్నించారని, దాడికి దిగారని పోలీసు అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మృతులు తమ పార్టీ మద్దతుదారులని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. క్యూఆర్టీ వాహనం ధ్వంసం ఓట్లు వేయడానికి వచ్చినవారిపై తొలుత కొందరు రాళ్లు రువ్వారని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారని తెలిపారు. కేంద్ర బలగాలకు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్(క్యూఆర్టీ) వాహనాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదని, భద్రతా సిబ్బందిపైకి దూసుకొచ్చారని, తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించారని వివరించారు. ఆత్మరక్షణతోపాటు పోలింగ్ బూత్‌ను, ఎన్నికల సిబ్బందిని రక్షించడానికి అల్లరి మూకపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారన్నారు. నలుగురు మరణించగా, మరో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4 మృతదేహాలను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో ఓటర్ కాల్చివేత కూచ్‌బెహార్ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్(18)ను పఠాన్‌తులీలో 85వ నంబర్ పోలింగ్ బూత్ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్ మరణించాడు. 126/5 బూత్‌లో పోలింగ్ నిలిపివేత సితాల్‌కుచీ నియోజకవర్గంలోని 126/5 పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరగడం, నలుగురు మరణించడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర బలగాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో దా దాపు 400 మంది వెంటనే 126/5 పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారని, కేంద్ర జవాన్లను ఘెరావ్ చేశారని కూచ్‌బెహార్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిజానికి పోలింగ్ బూత్ వద్ద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోతే భద్రతా సిబ్బంది సపర్యలు చేశారని అన్నారు. కానీ, అతడిని కాల్చి చంపారని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు ఎన్నికల సందర్భంగా బెంగాల్లో పలు చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దిన్హతా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. బెహలా పూర్బా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి పాయల్ సర్కారు కారుపై అల్లరి మూక దాడికి పాల్పడింది. వారి బారి నుంచి ఆమె క్షేమంగా తప్పించుకున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీపైనా టీఎంసీ మద్దతుదారులు దాడికి దిగారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆమె కారును ధ్వంసం చేశారు. హౌరా జిల్లాలోని బాల్లీలో బీజేపీ అభ్యర్థి బైశాలీ దాల్మియా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్ ఖాన్‌ను టీఎంసీ శ్రేణులు ఘెరావ్ చేశాయి. జాదవ్‌పూర్‌లో సీపీఎం ఏజెంట్‌పై కొందరు దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బంగోర్ నియోజకవర్గంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటిదాకా 8 మంది అరెస్టు కూచ్‌బెహార్ జిల్లాలో రెండు హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అరీఫ్ అఫ్తాబ్ చెప్పారు. రెండు ఘటనలపై కూచ్‌బెహార్ జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. సితాల్‌కుచీ అసెంబ్లీ స్థానం పరిధిలో జోర్పాట్కీ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయన్నారు. పఠాన్‌తులీలో యువకుడిని కాల్చి చంపిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగో దశలో 76.16 శాతం ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. 15,940 పోలింగ్ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలను, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్ అధికారి సూచిస్తే తప్ప పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లొద్దని కేంద్ర బలగాలకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. కూచ్‌బెహార్ జిల్లాలో అశాంతి తలెత్తకుండా రాజకీయ నాయకుల ప్రవేశంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాబోయే 72 గంటల వరకూ ఎవరూ జిల్లాలో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఐదో దశ ఎన్నికల్లో ‘సైలెన్స్ íపీరియడ్’ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్లో మరో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం కూచ్‌బెహార్ జిల్లాలో మూడో దశ ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకోవడం, నలుగురు మరణించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు బెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1,000 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి. -
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా భద్రతా, మౌలిక సదుపాయాలను అందించాలని భారతీయ రైల్వే ఆలోచన చేస్తోంది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగిన భారతీయ రైల్వే, 2019లో ప్రైవేట్-కంపెనీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) కింద కొన్ని స్టేషన్లను నడుపుటకు అనుమతి ఇచ్చింది. ఇప్పడు మరికొన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు చూస్తుంది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐఆర్ఎస్ డిసి) ఆ రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ భాద్యతలను పర్యవేక్షిస్తుంది. ఈ 90 రైల్వే స్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలనే దానిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పిఎఫ్), అన్ని రైల్వే జోన్ల ప్రధాన చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ల నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) మాదిరిగానే ఈ స్టేషన్లలో అలాంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే, ప్రైవేట్ సంస్థలే సీఐఎస్ఎఫ్ బలగాలకు వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న భద్రతాపరమైన వ్యవస్థను ప్రైవేట్ స్టేషన్లలో అమలు చేయాలనీ బోర్డు చూస్తుంది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను మార్చి 15లోగా తెలపాలంటూ రైల్వే బోర్డు కోరింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం బ్లూప్రింట్ రూపొందించడానికి ఒక కమిటీని 2019 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్ సర్, సబర్మతి, నెల్లూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్డింగ్ అర్హత ప్రక్రియను సెప్టెంబర్‌లో ప్రారంభించినట్లు గతేడాది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే గాంధీనగర్, హబీబ్‌గంజ్ వంటి స్టేషన్లలో పునరాభివృద్ధిపై పనులు ప్రారంభమయ్యాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ వంటి రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధికి కాంట్రాక్టులు ఇచ్చారు. రైల్వే పునరాభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో రైలు ఛార్జీలపై అదనపు రుసుము వసూలు చేయాలనీ చూస్తుంది. ఇంకోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదట 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి 151 రైళ్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తుంది. చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
2 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: డొమెస్టిక్ విమాన సర్వీసులు సోమవారం తర్వాత పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యే అవ కాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు విమానాశ్ర యాలకు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన, అధి కారులు చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విభాగమే విమానాశ్రయాల సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షి స్తుండటం తెలిసిందే. ‘వందే భారత్’విమానాల రాకపోకల సందర్భంగా పలు విషయాలు గమనిం చిన విమానాశ్రయాల సెక్యూరిటీ విషయంలో పలు మార్పులు చేసినట్లు సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ శుక్రవారం తెలిపారు. తొలుత మే 1 నుంచి దేశీయ విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని యోచిం చారు. అయితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఇవి మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాలతోపాటు మరి కొన్ని చోట్ల సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఇతర విభాగాల అధికారు లకు ఎలాంటి వ్యాప్తి జరగలేదు. దీంతో తనిఖీలు, సోదాలు చేసే విషయంలో పలు మార్పుచేర్పులు చేశారు. ప్రయాణికులను తాకాల్సిన అవసరం లేకుండా, భౌతిక దూరం పాటిస్తూ తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు డొమెస్టిక్ ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ తీసుకుంటే 45 నిమిషాలు, లేకుంటే గంట ముందు విమానా శ్రయంలో రిపోర్ట్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని రెండు గంటలకు పెంచారు. ప్రతి ప్రయాణికుడు తన ఫోన్లో కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ప్రతి ప్రయాణికుడు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలి. వీలున్నంత వరకు ప్రయాణికులు తమ వెంట ప్రింట్ చేసిన లేదా ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాసులు కలిగి ఉండటం ఉత్తమం. ప్రతి ఒక్క ప్యాసింజర్ కచ్చితంగా ఫేస్‌మాస్క్ ధరించాలి. భౌతిక దూరం తప్పనిసరి డిపార్చర్ గేటు వద్ద క్యూలో నిర్దేశించిన బాక్సులు/సర్కిల్స్‌లో నిల్చుని ఉండాలి. ఈ దూరాన్ని కనిష్టంగా నాలుగు, గరిష్టంగా 6 అడుగులుగా నిర్దేశించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హ్యాండ్ శానిటైజర్ కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాటి వద్ద చేతులను శానిటైజ్ చేసుకోవాలి. గేటు వద్దకు వెళ్లిన తర్వాత థర్మల్ ్రస్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు ఉంటే వారిని క్యూ నుంచి వేరు చేసి, తదుపరి పరీక్షల కోసం హెల్త్ డెస్క్‌కు పంపిస్తారు. పీపీఈ సూట్స్ లేదా ఫేస్‌మాస్క్, షీల్డ్స్‌లో ఉండే సీఐఎస్ఎఫ్ సిబ్బంది సైతం ప్రయాణికుడి సమీపం నుంచి తనిఖీలు చేయరు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల వద్ద ప్రయాణికులు తమ టికెట్, గుర్తింపు కార్డులను ప్రదర్శించాలి. వీటిని వెబ్‌క్యామ్ లేదా ట్యాబ్‌ల్లో తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికుడిని పంపుతారు. ప్రయాణికులు తమ వెంట హ్యాండ్ బ్యాగేజ్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. లగేజ్‌లో కూడా 20 కేజీల కంటే తక్కువ బరువు ఉండాలి. తమ వెంట గరిష్టంగా 350 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. విమానయాన సంస్థలు సైతం ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను యథాత«థంగా వినియోగించేందుకు అనుమతి లేదు. బోర్డింగ్ పాసులు, టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఒకటి విడిచి మరొకటి పని చేయాల్సి ఉంటుంది. వీలున్నంత వరకు టికెట్ స్కానర్లు, బోర్డింగ్ పాస్ ప్రింటర్లు, బ్యాగ్ ట్యాగ్ ప్రింటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానంలో ఎక్కడా విమానయాన సంస్థ సిబ్బందితో పని ఉండదు. సిబ్బందికి పీపీఈ కిట్లు.. కౌంటర్ల వద్ద ఉద్యోగులు, ప్రయాణికుడికి మధ్య గ్లాస్లు ఏర్పాటు చేయనున్నారు. కౌంటర్ నుంచి పిలుపు వచ్చే వరకు ప్రయాణికులు బాక్సులు, సర్కిల్స్‌లోనే నిల్చుని ఉండాలి. సెక్యూరిటీ చెక్ జరిగే ప్రదేశంలోనూ బాక్సులు, సర్కిల్స్ గీస్తున్నారు. వీటిలో నిల్చునే ప్రయాణికులు తమంతట తాముగా తమ ఒంటిపై ఉన్న లోహంతో కూడిన వస్తువుల్ని తీసి ట్రేలో పెట్టాల్సి ఉంటుంది. డీఎఫ్‌ఎండీల ద్వారా ప్రయాణికుడు వచ్చినప్పుడు బీప్ శబ్దం వస్తే వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నారు. బోర్డింగ్ కార్డులపై ఎలాంటి స్టాంపింగ్స్ ఉండవు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్డీ సీసీటీవీల ద్వారా వీటిని మానిటర్ చేయనున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, హ్యాండ్ హెల్డ్ మెటర్ డిటెక్టర్లు తప్పనిసరి చేశారు. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుల్ని బోర్డింగ్ గేట్స్ వద్ద ప్రత్యేకంగా మార్కింగ్ చేసిన సీట్లలో కూర్చోబెడతారు. ఈ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఆర్డర్ చేయడం, డెలివరీ అన్నీ కాంటాక్ట్ లెస్‌గానే జరుగుతుంది. ప్రయాణికుడు విమానం ఎక్కేందుకు విమానం బయల్దేరడానికి 15 నిమిషాల ముందే అనుమతించేవారు. ఇప్పుడు గంట ముందే అనుమతించనున్నారు. ప్రయాణికుల్ని విమానం వరకు తరలించే బస్సుల్ని రోజూ కనీసం రెండు మూడుసార్లు శానిటైజ్ చేయనున్నారు. విమానం లోపల స్వాగతం పలికే ఎయిర్‌హోస్టెస్ పీపీఈ కిట్లు ధరించేలా చూడాలని భావిస్తున్నారు. విమానం లోపల ఆహారం సరఫరా చేయడానికి ముందు శానిటైజర్ ఇవ్వనున్నారు. విమాన ప్రయాణం పూర్తయ్యే వరకు మాస్క్ ధరించే ఉండాలి. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే లోపు మరికొన్ని మార్పులకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకం: సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్ఎఫ్ కరోనా విస్తరణ నేపథ్యంలో విమానయానంలో సీఐఎస్ఎఫ్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. దీంతో సిబ్బంది, అధికారులు ఇకపై ‘మినిమం టచ్.. మినిమం ఎక్స్పోజర్’విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. తనిఖీలు సహా ఏ విషయంలో ప్రయాణికుల్ని నేరుగా తాకాల్సిన అవసరం లేకుండా వీలున్నంత వరకు అత్యాధునిక పరిజ్ఞానంతో పని చేయనున్నారు. ప్రయాణికులు సైతం ఈ విషయంలో తమకు సహకరించాల్సిన అవసరముంది. లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన 2 నెలలుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక సంసిద్ధతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక తర్ఫీదు పొందారు. – సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్ఎఫ్ -
కరోనాతో సీఐఎస్ఎఫ్ అధికారి మృతి
కోల్‌కతా : భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భద్రత బలగాలను కూడా వీడటం లేదు. కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన సీఐఎస్ఎఫ్తోపాటు బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా బారిన పడి సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జారు బర్మన్కు కరోనా సోకింది. అయితే కరోనా చికిత్స తీసుకుంటున్న క్రమంలో సోమవారం ఆయన మృతిచెందినట్టు సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి : ‘సార్స్’లాగా ‘కరోనా’ కూడా అదృశ్యం...?) కొద్ది రోజుల ముందు బర్మన్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్టగా తెలిసింది. దీంతో అధికారులు బర్మన్.. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. ఇంతకుముందు కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అధికారి కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న 758 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆరుగురు మృతిచెందినట్టుగా గణంకాలు చెబుతున్నాయి. (చదవండి : లాక్డౌన్ : 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే) -
పల్లీల్లో పచ్చనోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ బలగాలు బుధవారం చెప్పాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్–3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ ప్యాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. -
విజేత సీవీ ఆనంద్
సాక్షి, విశాఖ స్పోర్ట్స్: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ప్లేయర్‌కు పురుషుల సింగిల్స్ టైటిల్ లభించింది. వైజాగ్‌లో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) సీవీ ఆనంద్ చాంపియన్‌గా అవతరించారు. సీఐఎస్ఎఫ్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్ ఫైనల్లో 8–4తో సత్యనారాయణ (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆనంద్ సెమీఫైనల్లో శైలేశ్ కుమార్ (బీఎస్ఎఫ్)ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత 20 ఏళ్లలో ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సీఐఎస్ఎఫ్కు ఓ విభాగంలో టైటిల్ లభించడం ఇదే ప్రథమం. టీమ్ చాంపియన్íÙప్ విభాగంలో సీఆర్పీఎఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఐటీబీపీపై సీఆర్పీఎఫ్ గెలిచింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 19 జట్ల నుంచి 103 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ అలోక్ ప్రభాకర్, విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు. -
కుక్కగా పుట్టి.. సైనికుడిగా వీడ్కోలు
‘శునకంలా జన్మించి.. సైనికుడిగా పదవీ విరమణ పొందుతున్నాయి. సీఐఎస్ఎఫ్ కే9 యూనిట్ జాగిలాల వీడ్కోలు కార్యక్రమం. వాటిని ఎన్జీవోలకు అప్పగిస్తున్నాం. ఇన్నాళ్లు సేవలు అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సైన్యం జాగిలాలకు భావోద్వేగ వీడ్కోలు పలికింది. జెస్సీ, లక్కీ, లవ్లీ ఈరోజు అధికారికంగా విధుల నుంచి విరమణ పొందుతున్నారంటూ వాటి ఫొటోలను అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా ఢిల్లీ మెట్రోకు అనుసంధానం చేసిన సీఐఎస్ఎఫ్ బృందంలో భాగమైన ఏడు జాగిలాలకు అధికారిక లాంఛనాలతో సైన్యం వీడ్కోలు పలికింది. ఇందులో భాగంగా ఎనిమిదేళ్లుగా ఢిల్లీ మెట్రో పారామిలిటరీ విభాగంలో సేవలు అందించిన శునకాల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు వాటిని వివిధ పతకాలతో సత్కరించడంతో పాటుగా.. మెమొంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇక జాగిలాలకు ఈ విధంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం సీఐఎస్ఎఫ్ చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో జాగిలాల విషయంలో సీఎస్ఎఫ్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
మెట్రోలో రూ. కోటి తీసుకెళుతూ..
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసుల కళ్లుగప్పి కోటి రూపాయల నగదు తీసుకువెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ మెట్రో స్టేషన్లో గురువారం సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జంగ్‌పుర మెట్రో స్టేషన్ వద్ద నిందితులు రాజస్ధాన్‌కు చెందిన వికాస్ చౌహాన్ (30), మధ్యప్రదేశ్ నివాసి ఆర్తి (20)ల బ్యాగ్‌లను స్కాన్ చేయగా అందులో పెద్దమొత్తంలో నగదును గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. వారి బ్యాగ్‌లను తనిఖీ చేయగా రూ కోటి పట్టుబడిందని, ఈ నగదుపై వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని సీఐఎస్ఎఫ్ ఏఐజీ హేమేంద్ర సింగ్ చెప్పారు. భారీమొత్తం నగదుతో పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. -
అవమాన ప్రయాణం
కోల్‌కతా ఎయిర్పోర్ట్. వీల్ చైర్ కావాలని ఎయిర్‌లైన్ సిబ్బందిని కోరారు జీజా ఘోష్. ఎంతసేపటికీ రాలేదు. అదేమని విచారిస్తే ‘‘ఈరోజు స్టాఫ్ తక్కువగా ఉన్నారు’’ అని సమాధానం వచ్చింది సిబ్బంది నుంచి. ఎట్టకేలకు దీర్ఘ నిరీక్షణ తర్వాత వీల్ చైర్ వచ్చింది. తీరా చెకిన్ కౌంటర్‌కు వెళ్లాక ‘‘ఎవరూ తోడు లేకుండా మీరొక్కరే ప్రయాణం చేయడానికి వీల్లేదు’’ అని చెప్పారు ‘గో ఎయిర్’ చెకిన్ కౌంటర్లో. ఆశ్చర్యపోయారు జీజా.. ‘‘ఒంటరి ప్రయాణం నాకు కొత్తకాదు.. ప్రపంచమంతా ఒక్కదాన్నే చుట్టొస్తుంటా’’ అని. ఆ విషయాన్నే సిబ్బందితో చెప్పారు కూడా. అయినా ససేమిరా అన్నారు వాళ్లు. దాంతో తనతోపాటు న్యూఢిల్లీకి ప్రయాణం చేసే మిగతా సహచరులు వచ్చేవరకు ఆమెకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఆ సహచరుల్లోనే ఒకరైన కుహూ దాస్‌కూ ఇలాంటి అవమానమే ఎదురైంది! ఆమెకు పోలియో. దాంతో క్యాలిపర్స్ పెట్టుకొని వచ్చారు. సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) తనిఖీ కోసం ప్యాంట్స్ తీసేయమన్నారట. షాక్ అయ్యారు కుహూ దాస్.. ఇన్నేళ్లుగా ఫ్లైట్లలో ప్రయాణం చేస్తున్న తనకు ఏ రోజూ ఇలాంటి అవమానం ఎదురు కాలేదు. ‘‘వాళ్లు ఆ మాట అనగానే ఒక్క క్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయా. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏ ఆఫీసర్ ఇలా అడగలేదు. ఇంత ఇన్సల్ట్ చేయలేదు’’ అన్నారు కుహూ. కుహూనే కాదు జీజా ఘోష్ కూడా వికలాంగురాలే. 2019 ఎలక్షన్ కమిషన్ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ కూడా అయిన జీజాకు సెరిబ్రల్ పాల్సి. ఈ ఇద్దరూ.. న్యూఢిల్లీలో జరగబోయే వికలాంగ మహిళల హక్కుల సమావేశానికి హాజరయ్యేందుకు మొన్న ఆదివారం కోల్‌కతా నుంచి బయలుదేరారు. ఆ సమయంలో వాళ్లకు జరిగిన అవమానం ఇది. ఈ సంఘటనలతో వాళ్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ వివక్ష మీద అక్కడే నిరసననూ తెలిపారు. దాంతో ఆ చెకిన్ కౌంటర్లోని వ్యక్తి ‘సారీ’ చెప్పింది ఈ ఇద్దరికి. ‘‘ఆ అమ్మాయి మీద మాకేం కోపం లేదు. ఇది ఆ అమ్మాయి ఒక్కరి తప్పు కాదు.. మాలాంటి వాళ్లను ఎయిర్‌లైన్ ఎలా ట్రీట్ చేస్తుందో.. ఎంత చులకనగా చూస్తుందో అనడానికి ఇదొక ఎగ్జాంపుల్’’ అన్నారు జీజా, కుహూ. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది జీజా ఘోష్, కుహూ దాస్‌లను క్షమాపణ కోరుతూ.. జరిగిన తప్పిదాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే పూచీని సంబంధిత ఎయిర్‌లెన్స్ అధికారులకు అప్పగించామని కోల్‌కతా ఎయిర్ పోర్ట్ సిబ్బంది ట్వీట్ చేశారు. ►మన దేశంలో దాదాపు ఎనిమిదికోట్ల మంది వికలాంగులున్నారు. రకరకాల వైకల్యాలతో బాధపడుతున్న వాళ్లకు కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాల సంగతేమో కాని పనిగట్టుకొని ఇలా అవమానించకుండా ఉంటే చాలు. -
‘లేచి నిలబడు..డ్రామా ఆపమంటూ అరిచారు’
న్యూఢిల్లీ : వెన్నెముక గాయంతో బాధ పడుతున్న తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారని అమెరికా జాతీయురాలు విరాళీ మోదీ(28) ఆరోపించారు. దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్న విరాళీ... 2006లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తీవ్ర గాయాపాలయ్యారు. ఈ క్రమంలో ఆమె వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. దాంతో ప్రయాణాల్లో భాగంగా తనతో పాటు ఎల్లప్పుడూ వీల్ చెయిర్‌ను వెంటతీసుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించిన తనకు చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు...‘ నాకున్న అసౌకర్యం కారణంగా వీల్ చెయిర్‌ను కార్గోలో పంపిస్తారు. నాకు సహాయం చేసేందుకు, నన్ను సీట్లో కూర్చోబెట్టేందుకు పోర్టర్ సహాయం తీసుకుంటాను. అయితే మీ మహిళా అధికారి కారణంగా నాకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. లేచి నిలబడాలంటూ పదే పదే నన్ను ఆమె ఇబ్బంది పెట్టారు. నేను నిలబడలేనని నా సహాయకులు చెప్పినా ఆమె వినలేదు. కావాలంటే నన్ను తనిఖీ చేసుకోమని సూచించినా వినలేదు. సీనియర్ అధికారిని తీసుకు వచ్చి నన్ను చూపించారు. నా పాస్‌పోర్టు చూసిన తర్వాత నేను వీల్ చెయిర్ యూజర్‌ను అనే విషయం వాళ్లకు బోధపడింది. అప్పటి దాకా డ్రామా ఆపమంటూ ఇష్టం వచ్చినట్లుగా నన్ను నానా మాటలు అన్నారు’ అంటూ భద్రతా విభాగం అధిపతి(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్)కి చేసిన ఈ-మెయిల్‌ను విరాళీ ట్విటర్లో షేర్ చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతంలో కూడా తనకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయంటూ విరాళీ ఆరోపించగా ఎయిర్‌పోర్టు అధికారులు ఆమె మాటలను కొట్టిపారేశారు. “YOU HAVE TO STAND UP FOR SECURITY CHECKING! STOP DOING DRAMA!,” - The CISF at Delhi airport said this to me. @jayantsinha @CISFHQrs @DelhiAirport @debolin_sen @BookLuster @guptasonali PLEASE RT - THIS TREATMENT TOWARDS THE DISABLED IS RIDICULOUS pic.twitter.com/WGYFULblUm — Virali Modi (@Virali01) 9 September 2019 -
ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!
చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య.. జీవీఎంసీలో కొందరు అధికారుల ‘పచ్చ’పాత కుట్రలతో ఎన్నికల్లో గట్టెక్కామనిపించుకున్న టీడీపీ నగర ఎమ్మెల్యేలు తమ పాత శైలినే అందిపుచ్చుకుంటున్నారు. తమ ట్రేడ్‌మార్క్ వెర్రివేషాలు, విన్యాసాలు మళ్లీ మొదలెట్టేశారు. అందులోనూ వెలగపూడి, వాసుపల్లిల ఓవర్ యాక్షన్ ఏపాటిదో నగర ప్రజలకు తెలియంది కాదు. ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడే వెలగపూడి..చీప్ ట్రిక్కులు, చిల్లర వేషాలతో వాసుపల్లి చేసే విన్యాసాలు నగర ప్రజలకు కొత్తకాదు. అధికార మదంతో ఇప్పటివరకు విర్రవీగిన వీరిద్దరినీ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నుంచైనా ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తారని, ప్రజలతో మమేకమవుతారని అందరూ ఆశించారు. కానీ తమ నైజం మారలేదని వారిద్దరు శనివారం నిరూపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ప్రజాక్షేత్రంలోకి రాని.. వారి సమస్యలు పట్టని వీరు.. తమ అధినేతను ఎక్కడో ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసి అవమానించారంటూ గగ్గోలు పెడుతూ.. వీరావేశంతో చొక్కాలిప్పి గంతులేశారు. సాక్షి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే అదేదో మహాఅపరాధంలా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్)తోపాటు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేతలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండని స్పష్టం చేశారు. పౌర విమానయాన శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం విమానాశ్రయాల్లో చెక్ ఇన్ వద్ద తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రముఖుల జాబితా కూడా బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయినా సరే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అన్యాయం, అవమానం జరిగిందంటూ ఊదరగొడుతూ వచ్చాయి. ఇక విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లిలైతే శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని పార్టీ శ్రేణులకు సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యేలే చొక్కాలిప్పేసి, గొంతుచించుకుని గగ్గోలు పెట్టారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ చీప్ ట్రిక్స్ మొదలెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును నిబంధనల మేరకు తనిఖీ చేసి అవమానించారని గొంతు చించుకుంటున్న టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నిబంధనలను గౌరవించి.. విమానాశ్రయాల్లో తనను తనిఖీ చేసేందుకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ.. టీడీపీ ఎమ్మెల్యేల వెకిలి వేషాలను ఏవగించుకుంటున్నారు. -
స్టీల్ ప్లాంట్‌లో దొంగలు
సాక్షి, విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి పిగ్ ఐరన్‌ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన లారీ పట్టుబడింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న బడా వ్యాపారి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. స్టీల్‌ప్లాంట్ నుంచి పిగ్ ఐరన్‌ను కొన్న వ్యాపారులు ఎల్ఎస్జీపీ తీసుకుని లారీల ద్వారా రవాణా చేస్తుంటారు. ఇందులో భాగంగా లోపలికి ప్రవేశించే ఖాళీ లారీ బరువును చూసి ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు సరుకుతో బరువును తూయడం ద్వారా వ్యాపారి కొన్న సరుకును బయటకు పంపుతారు. అక్రమ రవాణాకు అలవాటుపడిన వ్యాపారులు గతంలో లారీ బాడీ కింద భాగంలో ఇసుక మూటలు వేసుకుని వాటితో ఖాళీ లారీ బరువు తూయించుకోవడం, లోపల ఇసుక మూటలను తొలగించి ఎక్కువ సరుకును తరలించడం జరిగేది. వాటిని పసిగట్టిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాడీ కింద కూడా తనిఖీ చేయడంతో ఆ తరహా తరలింపు ఆగింది. ఇటీవల వ్యాపారులు కొత్త తరహాలో అక్రమ రవాణా ప్రారంభించారు. ఇందులో భాగంగా బాడీలో ఇసుక, స్లాగ్‌తో గట్టిగా తయారు చేస్తారు. గేట్లలో తనిఖీ చేసే సిబ్బంది బాడీను లిఫ్ట్ చేసినపుడు అది కింద పడకుండా ఉంటుంది. మొన్న శనివారం రాత్రి షిఫ్ట్‌లో వ్యాపారికి చెందిన లారీ ప్లాంట్‌లో ఆ విధంగా ప్రవేశించింది. నైట్ రౌండ్స్‌లో సీఐఎస్ఎఫ్ క్రైమ్ సిబ్బంది ఎఫ్ఎండీ విభాగం సమీపంలో అనుమానస్పదంగా ఉన్న లారీను తనిఖీ చేయగా నాలుగు టన్నుల బరువుతో కూడిన ఇసుక, స్లాగ్ గుట్ట బయటపడింది. వెంటనే లారీను స్వాధీనం చేసుకుని స్టీల్‌ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ పట్టుబడటంతో సదరు వ్యాపారి ఆ లారీకు తనకు సంబంధం లేదన్నట్లు సమాచారం. కాగా, మార్కెట్ రేటు ప్రకారం టన్ను పిగ్ ఐరన్ సుమారు రూ. 27 వేలుగా ఉంది. ఒక్కో లారీలో నాలుగు టన్నులు అంటే రూ. లక్షకు పైగా పిగ్ ఐరన్ అక్రమంగా తరలిపోతోంది. ఇలా ఎన్ని నెలల నుంచి కోట్లాది రూపాయల విలువైన పిగ్ ఐరన్ అక్రమ రవాణా జరుగుతుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే దొరికిన లారీ అంశంపై స్టీల్‌ప్లాంట్ పోలీసులు చాలా లైట్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది లారీను తెచ్చిస్తే వారినే ప్రశ్నించడం ద్వారా కేసును నీరుగార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి చీటింగ్ కేసు పెట్టి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
సీఐఎస్ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
న్యూఢిల్లీ: సింగిల్ లైన్ సైకిల్ పరేడ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం ద్వారా సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి ఈ ఘనతను సాధించారు. ‘నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ వే లో నిర్వహించిన ఈ పరేడ్‌లో ఎక్కడా ఆగకుండా సైకిళ్లకు మధ్య సమ దూరాన్ని పాటిస్తూ పరేడ్ నిర్వహించారు’ అని అధికారి ఒకరు తెలిపారు. ఈ సైకిల్ పరేడ్ ఏకబిగిన 3.2 కిలోమీటర్ల మేర సాగిందని, ఇప్పటివరకు ఈ రికార్డు ఒకే వరుసలో 1,235 సైకిళ్లతో హుబ్బాల్లి సైకిల్ క్లబ్ ఆఫ్ ఇండియా పేరున ఉందని సీఐఎస్ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. పరేడ్‌ను సక్రమంగా నిర్వహించాలంటే పూర్తి క్రమశిక్షణ అవసరమని, రెండు సైకిళ్ల మధ్య దూరం మూడో సైకిల్‌ను మించరాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఈమేరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్, ఇతర సీనియర్ అధికారులకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేసినట్లు వెల్లడించారు. -
2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాలకు చెందిన 96 మంది జవాన్లు 2018లో వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే నివేదిక ద్వారా 2016లో 90 మంది, 2017లో 121 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాల పని పరిస్థితుల మెరుగుదల అనేది ఒక స్థిరమైన ప్రయత్నమని, అవసరమైనపుడు హోంశాఖ తగు సూచనలు చేస్తుందని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కాలానుగుణంగా సమీక్ష నిర్వహిస్తోందని వివరించారు. జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఒత్తిడికి గల కారణాలపై ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో జవాన్లు పని చేసిన తర్వాత ఒత్తిడి తగ్గించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్‌గా అధికారులతో జవాన్లు తమ సమస్యలు చెప్పుకునే సమావేశాలు ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పని వేళలు కూడా తగ్గించి జవాన్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నట్లు, పని ఒత్తిడి మరింత తగ్గించేందుకు క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బులెట్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారుల సోదాల్లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో విమానంలో (6ఈ 7201) విజయవాడ వెలుతున్న సత్యదుర్గ అనే వ్యక్తి వద్ద 9ఎమ్ఎమ్ బులెట్లను సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. -
గోల్డెన్ వాక్
-
ఇండిగోకు బాంబు బెదిరింపు
ముంబై : ముంబై నుంచి ఢిల్లీ మీదుగా లఖ్‌నవూ వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానంలో బాంబు పెట్టారనే సమాచారం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణాన్ని వాయిదా వేసి విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేశారు. అనంతరం విమానంలో ఎటువంటి బాంబ్ లేదని నిర్ధారించిన తరువాత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం శనివారం ఉదయం 6.05 గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి లఖ్‌నవూ బయల్దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ అవడానికి ముందు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ మహిళ విమానాశ్రయం టర్మినల్ 1 వద్ద ఉన్న ఇండిగో చెకిన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. ఇండిగో 6ఈ 3612(ముంబయి-లఖ్‌నవూ మార్గం) విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పారు. అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఫొటోలను సాక్ష్యాలుగా చూపించారు. సదరు వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని మహిళ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక బాంబు బెదిరింపుల అసెస్మెంట్ కమిటీ(బీటీఏసీ) కూడా ప్రమాదం జరగొచ్చని అనుమానాలు వ్యక్తం చేయడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ప్రయాణికులను దింపేసి విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. రెండు గంటల ఆలస్యం తరువాత ఉదయం 8. 40 గంటలకు ప్రారంభయ్యింది. అనంతరం సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విచారణ నిమిత్తం సదరు మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకేళ్లారు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఇంతవరకూ స్పందించలేదు. అంతేకాక ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని గురించి కూడా సమాచారం లేదు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : ఎయిర్‌పోర్టు ఆఫీసర్ బదిలీ
-
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : ఎయిర్‌పోర్టు ఆఫీసర్ బదిలీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత అందులోనూ కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చోటుచేసుకోవడంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రముఖుల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. వైజాగ్ ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్‌ను చెన్నై ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. -
సీవీ ఆనంద్‌కు ఎయిర్‌పోర్టుల రక్షణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్‌ను దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్) నియమించింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనకు.. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రత బాధ్యతను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత అందిస్తోంది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లు, మరో 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను ఆనంద్ పర్యవేక్షించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా.. ఇదివరకు ఎయిర్‌పోర్టుల భద్రతను పర్య వేక్షించేందుకు కేవలం అదనపు డీజీపీ, ఒక ఐజీ పోస్టు మాత్రమే సీఐఎస్ఎఫ్లో ఉండేది. నెల క్రితం మరో ఐజీ పోస్టును సృష్టించిన సీఐఎస్ఎఫ్.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతను ఆనంద్‌కు అప్పగించింది. ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షించనున్నారు. -
విజయవాడ ఎయిర్‌పోర్టుకు సీఐఎస్ఎఫ్ రక్షణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌర విమానాశ్రయాలకు భద్రత కల్పించే కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ(సీఐఎస్ఎఫ్) త్వరలోనే షిర్డీ(మహారాష్ట్ర), జామ్‌నగర్(గుజరాత్), విజయవాడ(ఆంధ్రప్రదేశ్),జబల్పూర్(మధ్యప్రదేశ్) ఎయిర్‌పోర్టులకు రక్షణ కల్పించనుంది. ఈ నాలుగు విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని గతంలోనే కేంద్రం నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సిబ్బందిని ఇప్పటివరకూ కేటాయించలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ 59 పౌర విమానాశ్రయాలకు రక్షణ కల్పిస్తోంది. సీఐఎస్ఎఫ్లో ప్రత్యేక విభాగమైన ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ హైజాకింగ్‌తో పాటు ఎయిర్‌పోర్టులపై ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. -
కేంద్ర సర్వీసులకు సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. ఆయన సీఐఎస్ఎఫ్ ఐజీగా అయిదేళ్లపాటు పని చేయనున్నారు. ప్రస్తుతం సీవీ ఆనంద్ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్వీసులో ఐదేళ్ల పాటు పనిచేయాలన్న నిబంధన కారణంగా సీవీ ఆనంద్ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. -
ఉన్నతాధికారులు వేధిస్తున్నారు.. కాపాడండి!
హైదరాబాద్: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకపోతున్నానని, ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చెందిన కానిస్టేబుల్ దౌడ్ సంతోష్ శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, బీడ్ జిల్లా పర్లి గ్రామానికి చెందిన తాను దేశంపై భక్తితో సీఐఎస్ఎఫ్లో చేరానని చెప్పారు. మూడేళ్లుగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో విధులు నిర్వహిస్తున్నానని, అక్కడి అసిస్టెంట్ కమాండర్ సావంత్, ఇన్స్పెక్టర్ చమన్‌లాల్ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. నెలకు ఒకసారి వారాంతపు సెలవుల లిస్ట్ వస్తుందని, దాని ప్రకారం తాను సెలవు తీసుకుంటే ఫోన్లు చేసి డ్యూటీకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 10 వారాంతపు సెలవులు కూడా తీసుకోలేదని తెలిపారు. సెలవులు లభించడంలేదని ప్రశ్నించడంతో తనపై కక్ష పెంచుకున్నారన్నారు. కమాండర్ ఇంట్లో గార్డెనింగ్ విధులు చేయాలని ఒత్తిడి చేస్తే తాను అంగీకరించలేదని, ఇన్స్పెక్టర్ చమన్‌లాల్ కొన్ని ప్రైవేట్ సంస్థలకు చెందిన బ్రష్, టూత్ పేస్ట్, సబ్బులు విక్రయిస్తుంటారని, వాటిని తాను కొనుగోలు చేయకపోవడంతో తనను వేధిస్తున్నారని తెలిపారు. ఇక్కడి అన్యాయాలపై కమాండర్‌కు, డీఐజీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చినందుకు తనపై చర్యలు తీసుకుంటారని, తనకు ఏం జరిగినా పరవాలేదని, తన తోటి సోదరులకైనా న్యాయం జరగాలని అన్నారు. వారానికి ఒక సెలవుఇవ్వాలని, కుదరని పక్షంలో నెలకు 3 రోజులైనా సెలవులు ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్లేడుతో చేయి కోసుకునేందుకు యత్నం అధికారుల తీరుకు తీవ్ర మానసిక వేదనకు గురైన దౌడ్ సంతోష్ శివాజీ ఓవైపు సమావేశం జరుగుతుండగానే తన వెంటతెచ్చుకున్న బ్లేడుతో చేయికోసుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న మీడియా సిబ్బంది అడ్డుకుని బ్లేడ్ లాక్కున్నారు. -
ఇస్రో క్యాంపస్‌లో విస్ఫోటనమా..!
సాక్షి, చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడు క్యాంపస్‌లో విస్పోటనం జరిగిందంటూ దుష్ప్రచారం జరగడంపై సంబంధిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇస్రోపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని క్యాంపస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత జూన్ 23న తిరునెల్వేవి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో క్యాంపస్‌లో చిన్న మంట రాజుకుని పొగలు వ్యాపించాయని ప్రచారం జరిగింది. దీనిపై యాంటీ నక్సల్ టీమ్, సీఐఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోగా.. క్యాంపస్‌లో ప్రమాదం జరిగిందంటూ ప్రచారం చేశారని విచారణాధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు. -
మెట్రోలో మహిళా దొంగలు
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా మనం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో దొంగలు పట్టుబడుతుండటం సర్వసాధారణం. దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైళ్లలో కూడా దొంగలు గతం కంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగానే పట్టుబడుతున్నారు. విచిత్రమేమంటే... పట్టుబడిన వారిలో మహిళా దొంగలు ఎక్కువగా ఉండటం విశేషం. తాజాగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఈ సంవత్సరం ఢిల్లీ మెట్రో రైళ్లలో 521 మంది జేబు దొంగలను పట్టుకుంది. అయితే వీరిలో 90 శాతం మంది మహిళలే. పైగా గత సంవత్సరంలో పట్టుబడిన జేబుదొంగలతో పోల్చితే ఈ ఏడాది పట్టుబడినవారి సంఖ్య మూడింతలుందని సీఐఎస్ఎఫ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఢిల్లీలోని ప్రతి రూట్లో యాంటీ థెఫ్ట్ స్క్వాడ్ జవాన్లను యూనిఫామ్‌లో, సివిల్ డ్రెస్ లో మోహరించినట్లు సీఐఎస్ఎఫ్ తెలిపింది. ఈ జవాన్లు ప్రయాణీకుల జేబు కత్తిరించే జేబుదొంగలను అరెస్టు చేస్తున్నారని తెలిపింది. రద్దీగా ఉండే ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లలో జేబుదొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజీవ్ చౌక్. సెంట్రల్ సెక్రటేరియట్, కశ్మీరీ గేట్, హుడా సిటీ సెంటర్, షహదరా స్టేషన్లలో జేబుదొంగలు ఎక్కువగా పట్టుబడ్డారు. పట్టుబడిన జేబు దొంగలలో 401 మంది మహిళలు కాగా, 120 మంది పురుషులున్నారు. -
హ్యాండ్ బ్యాగ్‌లకు ఇక ట్యాగులుండవు
న్యూఢిల్లీ: పాట్నా, చెన్నైతోపాటుగా ఆరు విమానాశ్రయాల్లో జూన్ 1నుంచి హ్యాండ్ బ్యాగులకు ట్యాగులు, స్టాంపిగ్ వేసే విధానాన్ని ఎత్తేస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) ప్రకటించింది. జైపూర్, గువాహటి, లక్నో, తిరువనంతపురం విమానాశ్రయాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు. ‘కొన్ని వారాలుగా ఈ ఎయిర్‌పోర్టులో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. కొత్త భద్రతాప్రమాణాలతోపాటుగా సీసీటీవీలు విస్తృతంగా అమర్చాం. జూన్ 1నుంచి స్వదేశీ ప్రయాణికుల బ్యాగుల ట్యాగింగ్‌ను ఎత్తేయాలని నిర్ణయించామ’ ని ఆయన తెలిపారు. వచ్చే సోమవారం నుంచి విశాఖపట్టణం, గోవా, పుణే, వారణాసి, భువనేశ్వర్ విమానాశ్రయాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. -
విమానాశ్రయాలు ఇక దుర్భేద్యం
న్యూఢిల్లీ: దేశంలోని పౌర విమానాశ్రాయాలు మరికొన్ని నెలల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లతో శత్రుదుర్భేద్యంగా మారనున్నాయి. ఉగ్రవాద దాడుల నుంచి రక్షణ కోసం స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, తక్షణం స్పందించే జవాన్లు, రక్షక కవచ వాహనాలు, పటిష్ట ఫెన్సింగ్, ట్యాగ్ రహిత బ్యాగేజీ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) దీనికి సంబంధించి ప్రణాళికా పత్రాన్ని రూపొందిస్తోంది. విమానాశ్రయాల భద్రత అంశాలన్నీ సమన్వయం, ఏకీకృతం చేసేలా పత్రాన్ని రూపొందిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జరనరల్ ఓపీ సింగ్ చెప్పారు. మొత్తం ప్రాంతాన్ని రికార్డు చేసేలా సీసీటీవీలను ఆధునీకరించాల్సి ఉంటుందని భద్రతా సంస్థలు రూపొందించిన బ్లూప్రింట్‌లో పేర్కొన్నారు. -
ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్: షామీర్‌పేట్‌లోని సీఐఎస్ఎఫ్లో ట్రైనీ ఎస్ఐ సచిన్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరికి వేలాడుతూ కనిపించడం గమనించిన సహచరులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సచిన్ స్వస్థలం హర్యానా. గత అక్టోబర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఆ జవాను మానసిక స్థితి సరిగా లేదు
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు సహచరులు మృతి చెందిన ఘటనకు సీఐఎస్ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. కాల్పులు జరిపిన బల్బీర్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, దీనికోసం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. బల్బీర్ తల్లి మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందరికీ తెలుసు అని అన్నారు. స్నేహితులు సైతం అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గతంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు సీఐఎస్ఎఫ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. గతంలో బొకారోలో విధులు నిర్వర్తించే సమయంలో సైతం బల్బీర్.. ఓ కారు డ్రైవర్‌ను చంపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. బల్బీర్ మానసిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా సీఐఎస్ఎఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బల్బీర్ జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుళ్లు బచ్చా శర్మ, అమర్నాథ్ మిశ్రాతో పాటు.. ఏఎస్ఐ జీఎస్ రామ్, హవల్దార్ అరవింద్ రామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
జవాను కాల్పులు నలుగురి మృతి
ఔరంగాబాద్ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ(సీఐఎస్ఎఫ్) జవాను ఒకరు తన సీనియర్ సహచరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నబీనగర్ పవర్ జనరేటింగ్ కంపెనీ వద్ద విధులు నిర్వహిస్తున్న బల్వీర్ బుధవారం అర్ధరాత్రి సమయంలో డ్యూటీలు మారుతున్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. సెలవుల విషయంలో తీవ్ర వాగ్వాదం తర్వాత తన రైఫిల్‌తో పాతిక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బల్వీల్ను జవాన్లు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పులపై సీఐఎస్ఎఫ్ సైనిక విచారణకు ఆదేశించింది. అలీగఢ్‌కు చెందిన బల్వీర్ మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇటీవల యోగా కోర్సు చేశాడు. -
కిలాడీ లేడీలు
న్యూఢిల్లీ: నేషనల్ కేపిటల్ రీజియన్ లో కిలాడీ లేడీలు పెరిగిపోతున్నారు. ఢిల్లీ మెట్రో రైళ్లలో జేబులు కత్తిరించేస్తూ పోలీసులకు పట్టుబడిన వారిలో 91శాతం మహిళలే ఉన్నారు. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పోలీసులు ఈ ఏడాది ఢిల్లీ మెట్రో స్టేషన్లలో నిర్వహించిన 100కు పైగా ఆపరేషన్లలో 438 మంది మహిళలు జేబులు కత్తిరించేస్తూ పట్టుబడగా.. కేవలం 41 మంది పురుషులు పిక్ పాకెటింగ్ చేస్తూ దొరికిపోయారు. గత కొద్ది సంత్సారాలుగా జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని సీఐఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. పిల్లవాడిని చంకలో పెట్టుకునో లేక గుంపుగా ఉంటూనో మహిళలు ప్రయాణీకుల పర్సులు కాజేస్తున్నట్లు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి సీఐఎస్ఎఫ్ పోలీసులు సాధారణ దుస్తుల్లో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో చెల్లని నోట్లు
టీనగర్: ఎయిర్‌పోర్టులో రెండు లక్షల రూపాయల చెల్లని నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్ పరికరం ద్వారా కారు పార్కింగ్, పా ర్కుల వద్ద శుక్రవారం రాత్రి తనిఖీలు జరిపారు. ప్రయాణికుల లగేజీలను తీసుకువెళ్లే ఒక ట్రాలీలో ఎవరికీ చెందని ఒక బ్యాగ్ కనిపించింది. అందులో తనిఖీ చేయగా ఒక పక్క చిరిగిన బ్యాగులో చెల్లని రూ.500, వెయి రూపాయల నోట్లు కనిపించాయి. ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు దాన్ని ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను విప్పి చూడగా చెల్లని నోట్లు రూ. 2.1 లక్షలు, మలేషియాలో విక్రయించే చాక్లెట్లు కనిపిం చాయి. బ్యాగ్‌లోని చిరునామాను బట్టి చూడగా మలేషియాకు చెందిన సయ్యద్ మహ్మద్ (38)కి చెందినదిగా వెల్లడైంది. శనివారం విమానాశ్రయానికి వచ్చిన సయ్యద్ మహ్మద్ విమానాశ్రయ మేనేజర్‌తో తన లగేజీ వ దిలి వెళ్లడం గురించి వివరించి నగదు కు సంబంధించిన పత్రాలు చూ పాడు. తిరుచ్చిలో ఉన్న బంధువు ఇం టికి వచ్చి విహారయాత్రకు వెళ్లనున్న ట్లు, ఇందుకోసం మలేషియా నుంచి భారత కరెన్సీగా మార్చుకుని తీసుకొచ్చినట్లు తెలిపాడు. దీనిపై ఎయిర్‌పోర్టు మేనేజర్ విచారణ జరిపిన అనంతరం నగదు, చాక్లెట్లను సయ్యద్ మహ్మద్‌కు అప్పగించారు. -
ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
నోట్ల రద్దు.. అనంతరం బంగారంపై ఆంక్షలు.. దీంతో దేశవ్యాప్తంగా కేజీలకు కేజీల బంగారం గుట్టురట్టవుతోంది. కర్ణాటకలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో సీక్రెట్ బాత్రూమ్లో 32 కేజీల బంగారాన్ని ఐటీ శాఖ పట్టుకున్న కొద్దిసేపటికే చెన్నై, రాంచీ ఎయిర్‌పోర్టులోనూ భారీగా బంగారం బయటపడింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తనిఖీల్లో చెన్నై ఎయిర్‌పోర్టులో 28 కేజీల బంగారం, రాంచీ ఎయిర్‌పోర్టులో 4 కేజీల బంగారం పట్టుబడింది. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ బలగాలు, వాటిని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు తరలించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం బంగారంపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, అక్రమ సంపాదనల వెలికితీతలపై ఎన్ఫోర్స్మెంట్, ఐటీ శాఖ ద్వారా రైడ్స్ నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా గుట్టలుగుట్టలుగా బంగారం బయటికి వస్తోంది. మొన్న చెన్నైలో ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 100 కిలోల బంగారం వరకు బయటపడింది. అంతేకాక విశాఖ ఎయిర్‌పోర్టులోనూ భారీ ఎత్తున్న బంగారం పట్టుబడింది. మగ్గురు వ్యక్తుల నుంచి కస్టమర్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు1.966 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముమ్మరంగా సాగుతుండటంతో ప్రస్తుతం బంగారాన్ని విమానాల ద్వారా ఇతర ప్రాంతాలను తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. -
ఏడాది సస్పెన్షన్!
సాక్షి, చెన్నై: సీఐఎస్ఎఫ్తో వివాదం తొమ్మిది మంది న్యాయవాదులకు సంకటంగా మారింది. ఏడాది పాటు వారిని సస్పెండ్ చేస్తూ కర్ణాటక బార్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లడానికి న్యాయవాదులు కసరత్తుల్లో పడ్డారు. మద్రాసు హైకోర్టు ఆవరణలో కొందరు న్యాయవాదుల చర్యలు వివాదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. వాటికి ముగింపు పలికే విధంగా ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్‌కౌల్ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టును సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. దీన్ని నిరసిస్తూ పలువురు న్యాయవాదులు వివాదాల్ని కొని తెచ్చుకున్నారు. మహిళా న్యాయవాదిని తనిఖీ చేసే క్రమంలో సీఐఎస్ఎఫ్ వర్గాలు హద్దులు మీరి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు కయ్యానికి కాలు దువ్వడం వివాదాస్పదంగా మారింది. సీఐఎస్ఎఫ్తో దురుసుగా వ్యవహరించారన్న నెపంతో పలువురు న్యాయవాదుల్ని సస్పెండ్ చేస్తూ తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలూ సాగారుు. చివరకు జాతీయ బార్ కౌన్సిల్ జోక్యం చేసుకుని ఈ వ్యవహారాన్ని కర్ణాటక బార్ కౌన్సిల్‌కు అప్పగించింది. ఆదివారం ఆ బార్ కౌన్సిల్ తొమ్మిది మంది న్యాయవాదుల్ని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. దీన్ని వారి సహచరులు జీర్ణించుకోలేకున్నారు. కొత్తగా ఏర్పడ్డ న్యాయవాద సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయంపై అప్పీలుకు సిద్ధమవుతున్నారు.ఈ పరిణామాలు మళ్లీ ఎక్కడ విచారణలకు ఆటంకాలుగా మారనున్నాయో వేచి చూడాల్సిందే. హైకోర్టుకు తాళం: శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు హైకోర్టు పరిధిలోని అన్ని గేట్లకు ఓ వ్యక్తి తాళం వేసి, ఆ చెవిని ప్యారిస్‌లోని పెరుమాల్ ఆలయంలో సమర్పించాడు. ప్రతి ఏటా నవంబర్ చివరి ఆదివారం 24 గంటల పాటు హైకోర్టుకు తాళం వేయడం ఆ చెవిని తీసుకెళ్లి ప్యారిస్‌లోని పెరుమాల్ ఆలయంలో ఉంచడం, ఆ సమయం గడిచినానంతరం కోర్టు భద్రతా వర్గాలకు అప్పగించడం జరుగుతూ వస్తోంది. ఇలా ఉండగా శనివారం రాత్రి ఎనిమిది గంటల తాళం వేసి ఆలయంలో చెవిని సమర్పించారు. దీంతో న్యాయవాదుల ప్రవేశ మార్గంతో పాటు మరో ఆరు మార్గాలకు తాళం పడింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత మళ్లీ చెవిని తీసుకొచ్చి ఆ తాళం తెరిచారు. -
స్పోర్ట్స్ టవర్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు గచ్చిబౌలి స్పోర్ట్స్ టవర్ క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర క్రీడల మంత్రి టి. పద్మారావు బుధవారం ఈ టవర్‌ను పునఃప్రారంభించారు. అనంతరం ఆయన ఈ టవర్లోని గదులను, అక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అంతర్జాతీయ మిలిటరీ గేమ్స్ (2007) సందర్భంగా గచ్చిబౌలిలోని క్రీడాగ్రామంలో రూ. కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించారు. అయితే నిర్మించిన సంస్థతో ఒప్పంద వివాదం, నిర్వహణ కరువవడంతో ఇది పూర్తిగా నిరుపయోగంగా మారింది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ టవర్‌ను క్రీడాకారుల కోసం నవీకరించింది. ఇప్పుడు ‘సీఐఎస్ఎఫ్ ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్’ కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఈ పోటీలు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం 5 స్టార్ సదుపాయాలున్న స్పోర్ట్స టవర్‌ను ఇవ్వడం పట్ల సీఐఎస్ఎఫ్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. -
పీవీ సింధూలను తయారు చేస్తాం!
హైదరాబాద్: పోలీస్ శాఖలో కూడా మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి, తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆలిండియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అడిషనల్ డీజీ ధర్మేంద్ర కుమార్ అన్నారు. భవిష్యత్తులో తమ శాఖనుంచి కూడా ఒలింపిక్ రజత పతాక విజేత సింధులాంటి ఆటగాళ్లను తయారు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 3నుంచి 7 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ సారి పోటీలను సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ధర్మేంద్ర కుమార్ పోటీల వివరాలను వెల్లడించారు. ‘పోలీస్ సంస్థల మధ్య సత్సంబంధాలు పెంచడంతో పాటు క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పోలీస్ శాఖనుంచి మేరీకోమ్, విజేందర్ సింగ్, సమరేశ్ జంగ్లాంటి ఆటగాళ్లు ప్రపంచ స్థాయి విజయాలు సాధించి మా శాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టారు. అదే బాటలో మున్ముందు ప్రతిభ గల పోలీసులను గుర్తించి సింధు స్థాయిలో తీర్చిదిద్దడమే మా లక్ష్యం. గతంలో రెండు సార్లు ఈ పోటీలను నిర్వహించిన సీఐఎస్ఎఫ్కు మళ్లీ అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’ అని ఆయన చెప్పారు. చాంపియన్‌షిప్‌లో స్ప్రింట్, త్రోయింగ్ ఈవెంట్లు, జంపింగ్ ఈవెంట్లు కలిపి మొత్తం 44 అంశాల్లో పురుషులు, మహిళలకు పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ శాఖలకు చెందిన 40 జట్లనుంచి 1000 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. 3న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథి కాగా, సింధు కూడా పాల్గొననుంది. ముగింపు ఉత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో సీఐఎస్ఎఫ్ డీఐజీ ఎంఆర్ నాయక్, ఐజీ జగ్బీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో రైలుకిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య
నడుస్తున్న మెట్రో రైలు ముందు దూకి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్(30) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పటేల్ చౌక్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్గావ్లోని హుడా సెంటర్ నుంచి బయల్దేరిన రైలు పటేల్‌చౌక్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో రెండో ప్లాట్‌ఫాంపై నుంచి దూకటంతో ఈ ఘటన చోటు చేసుకున్న సీఐఎస్ఎఫ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్‌లో పనిచేస్తున్న సంజయ్ ప్రసాద్‌గా గుర్తించినట్లు తూర్పు ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు. -
‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!
న్యూఢిల్లీ: వారిద్దరు స్నేహితులు.. ఇండోర్ చెందిన వారు గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సొంతూరికి బయలుదేరారు. విమానం ఎక్కేందుకు క్యూలో నిలబడినప్పుడు ఓ మిత్రుడు సరదాగా జోక్ చేశాడు. ‘దయచేసి.. నేను బాంబు తీసుకెళ్లవచ్చా’ అని స్నేహితుడితో అన్నాడు. ఈ మాట ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది చెవిన పడింది. వారేదో నిజంగా ‘బాంబు’తో ఎక్కుతున్నట్టు హడలిపోయిన సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)కు ఈ విషయాన్ని చేరవేశారు. ఎయిర్పోర్ట్ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ స్నేహితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. వారిని చాలాసేపు విచారించి.. ప్రశ్నించి.. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించికున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులని వదిలేశారు. కానీ, ఆ ఇద్దరు సరదాగా వేసిన జోక్.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి బాంబు కలకలాన్ని రేపింది. సరదాకు ‘బాంబు’ అన్న పదాన్ని ఉచ్చరించినందుకు చిక్కుల్లో పడ్డ ఆ ఇద్దరు స్నేహితులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఇటీవలికాలంలో ఉగ్రవాద ముప్పు భారీగా పొంచి ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అనుమానమున్నా.. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. గత నెల ఓ కశ్మీరి మెడికల్ విద్యార్థిని కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. ఆమె బ్యాగుపై ‘ఇందులో బాంబు ఉండొచ్చు’ అన్న గ్రాఫిటీ ఉండటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. -
నేపాల్‌ను వణికిస్తున్న మరో భూతం
కఠ్మాండు: ప్రకృతి ప్రకోపంతో భీతిల్లిన నేపాల్‌ను ఇపుడు మరో భూతం వణికిస్తోంది. అసలే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కు పెట్టింది పేరుగా ఉన్న నేపాల్ దేశంలో మహిళల అక్రమ రవాణా మరింత పెరగొచ్చనే ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ట్రాఫికర్స్ రెచ్చిపోవచ్చనే అనుమానాలు వణికిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అరాచక శక్తులకు అడ్డుకట్టవేసేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు దగ్గర, విమానాశ్రయాల దగ్గర హై అలర్ట్ ప్రకటించి, ఆయా ప్రదేశాలలో సీఐఎస్ఎఫ్ దళాలను, మఫ్టీ పోలీసులను మోహరింపచేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళా ప్రయాణీకుల వివరాలపై శ్రద్ధ పెట్టారు. నిపుణులతో కూడిన ఒక కమిటి ప్రయాణీకుల వివరాలను, వారి వీసా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని, దీనికి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేశామని, ముఖ్యంగా రోడ్డు మార్గం, టాక్సీ బూత్, టాక్సీ యూనియన్లపై ఓ కన్నేసి ఉంచామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రముఖ హెటళ్ళ దగ్గర కూడా నిఘా పెట్టామన్నారు. కాగా భీకరంగా విరుచుకుపడిన భూకంపం నేపాల్ దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. వేలాదిమంది మృత్యువాత పడగా, శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి. తమ ఆప్తుల జాడ తెలియక ఇప్పటికీ అనేకమంది అల్లాడుతున్నారు. -
180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంది..
ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. రకరకాల సమస్యలతో కునారిల్లిపోతూ రైలు పట్టాలపై ప్రాణాలర్పించేందుకు సిద్ధమైన బాధితులను గుర్తించి.. కౌన్సిలింగ్ ఇచ్చి జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా చేశారు. ఇదంతా చేసింది ఏ స్వచ్ఛంద సంస్థో కాదు. ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం.. ప్రజలు ఆందోళనలకు దిగినప్పుడల్లా అణచివేతకు దిగే అర్ధ సైనిక బలగం సీఐఎస్ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. గడిచిన ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్వే ట్రాక్ లపై ఆత్మహత్యలకు ప్రయత్నించిన 180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంటోంది. ఎయిర్ పోర్టుల తర్వాత బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది మెట్రో రైళ్లలోనే కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో రైల్ స్టేషన్ల వద్ద రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్లో సీఐఎస్ఎఫ్ పలు నేరాల్ని అడ్డుకుంది. వాటిలో కొన్నే ఇవి.. * దాదాపు 10 వేల మంది పురుషుల్ని మహిళల కోచ్ ల నుంచి దింపేశారు. * 6 ఆయుధాలు, 120 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. * రూ.10.2 విలువైన బంగారంతోపాటు రూ. 10.8 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించారు. * 382 మంది జేబు దొంగల్ని అరెస్టు చేశారు. అందులో చోరీకి పాల్పడినవారిలో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. -
మహిళా సంరక్షణకు మెరుగైన భద్రత
న్యూఢిల్లీ: రాత్రి వేళల్లో ఢిల్లీ మెట్రోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మెరుగైన భద్రత కల్పించాలని కేంద్ర పరిశ్రమల భద్రత దళం(సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. కేవలం మెట్రోల్లో భద్రత కల్పించడమే కాకుండా, వారు క్షేమంగా ఇంటికి చేరుకునేలా ఆటో, రిక్షా, బస్సు వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చాలని తమ మహిళా సిబ్బందికి సీఐఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డీఎంఆర్సీ పరిధిలో 136 మెట్రో సేష్టన్లు ఉండగా, పురుషులు, మహిళలు కలిపి 4,800 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా ప్రయాణికులకి సాయమందించాలని మేము మా సిబ్బందికి చెప్పాం. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆటోలు, రిక్షా వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చి, వాటి నంబర్లను నోట్ చేసుకోవాలని చెప్పాం. తద్వారా తమను గమనిస్తున్నారనే భయంతో మహిళా ప్రయాణికులతో డ్రైవర్లు సక్రమంగా నడుచుకుంటారు. దీంతో మహిళలు క్షేమంగా ఇంటికి వెళ్లగలుగుతారు’ అని సీఐఎస్ఎఫ్ డీజీ అర్వింద్ రంజన్ చెప్పారు. సోమవారం సీఐఎస్ఎఫ్ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మెట్రో స్టేషన్లలో ఉన్న సీసీటీవీలు కూడా తమకు తోడ్పాటునందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 180 సంఘటనల్లో ఇవి ఉపయోగిపడ్డాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ట్రాక్‌లపై నడుస్తున్న 500 మంది పై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మంచి ప్రవర్తన, నైపుణ్యాలను నేర్పించి తమ సిబ్బందిని మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం నియమించామని తెలిపారు. అలాగే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, చాందినీ చౌక్, కష్మీరీ గేట్, చౌరీ బజార్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి ఆరు ప్రాంతాల్లో గ్లాస్ డోర్ కారిడార్ల ఎత్తు పెంచాలని డీఎంఆర్సీకి ప్రతిపాదించింది. స్టేషన్లలో 90 శాతం దొంగతనాలు మహిళా దొంగలు చేస్తున్నారని తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హెల్ప్‌లైన్ నంబరు స్థానంలో సులభంగా గుర్తుండేలా నాలుగు సంఖ్యల నంబరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఐఎస్ఎఫ్ అధికారులు డీఎంఆర్సీకి సూచించారు. తద్వారా ప్రజలు సీఐఎస్‌ఎఫ్‌ని సంప్రదించడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. -
అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ వీరంగం
పళ్లిపట్టు: విచక్షణ కోల్పోయిన ఓ జవాన్ కాల్పుల్లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రగాయూలపాలయ్యూరు. ఈ సంఘటన బుధవారం ఉదయం కాంచీపురం జిల్లా కల్పాక్కంలోని అణు విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా కల్పాక్కంలోని అణువిద్యుత్ కేంద్రం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్ఎప్) కట్టుబాటులో ఉంది. బుధవారం వేకువ జామున జవాన్లు రోల్‌కాల్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విజయప్రతాప్‌సింగ్ బ్యారక్స్‌లో నిద్రిస్తున్న తన పై అధికారి రాజస్థాన్‌కు చెందిన మోహన్ సింగ్ (42)ను చేతిలో ఉన్న 9 ఎమ్ఎమ్ గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ రోల్‌కాల్ నిర్వహిస్తున్న జవాన్లు ఆందోళనతో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. జవానును సమీపిస్తున్న తరుణంలో విజయప్రతాప్ సింగ్ వారిపైనా కాల్పులు జరిపాడు. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ గణేశన్(58), హెడ్ కానిస్టేబుల్ సుబ్బురాజ్(54) కూడా మృతి చెందగా, ప్రతాప్‌సింగ్, గోవర్ధన ప్రశాం త్ తదితరులు గాయపడ్డారు. అయినా పైరిం గ్ను విజయ్‌ప్రతాప్‌సింగ్ నిలపకపోవడంతో తక్కిన జవాన్లు చాకచక్యంగా ప్రతాప్‌సింగ్‌ను పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. గాయూలపాలైన జవాన్లను వెంటనే చెన్నై కేళంబాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో గోవర్ధన ప్రతాప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన జవాన్ల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరుగులు తీసిన డీఐజీ, ఎస్పీ డీఐజీ సత్యమూర్తి, కాంచీపురం ఎస్పీ విజయకుమార్ తదితరులు సంఘటన ప్రాంతం చేరుకుని కాల్పుల సంఘటన పట్ల విచారణ జరిపా రు. ఇందులో జవాన్ల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధమే ఫైరింగ్‌కు దారితీసిందని ప్రాథమికంగా తెలిసింది. కాల్పులు జరిపి ముగ్గురు మృతికి కారకుడైన విజయప్రతాప్సింగ్ను కల్పాక్కం పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆపరేషన్ ‘కాళి’
మెట్రో రైళ్లలో త్వరలో సీఐఎస్ఎఎఫ్ మహిళా సిబ్బంది సాక్షి, న్యూఢిల్లీ : మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం (సీఐఎస్ఎఫ్) అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా మహిళా సిబ్బందిని నియమించనుంది. ఆపరేషన్ కాళీ పేరిట ఈ చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ కింద మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బందిని మెట్రో రైళ్లలో మోహరించనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కకుండా నివారించడం కోసం సుశిక్షితులైన మహిళలను ఈ బోగీల్లో నియమిస్తారు. ఇందుకోసం సీఐఎస్ఎఫ్ రెండు బ్యాచ్‌ల సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బందికి ‘పెకిటి తిర్సియా కాళీ’ అనే ఫిలిప్పీన్స్ యుద్ధవిద్యలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం వారంపాటు జరిగింది. ఈ నెల 29వ తేదీనుంచి మూడో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల కోసం కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి రోజూ పురుషులు భారీ సంఖ్యలో ఈ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ 25 నుంచి 50 మంది పురుష ప్రయాణికులకు సంబంధిత మెట్రో స్టేషన్ల సేషన్ కంట్రోలర్లు రూ.250 చొప్పున జరిమానా విధిస్తున్నారు. అయినప్పటికీ మహిళా కోచ్‌లలోకి ఎక్కి దిగమంటూ మొండికేసే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది అటువంటి ప్రయాణికులను బలవంతగా మెట్రో రైలునుంచి దింపడమేకాకుండా వారిని మెటో రైలు పోలీసులకు అప్పగిస్తారు. అంతేకాక ఈ మహిళలు ఈవ్ టీజింగ్ వంటి ఘటనలలోనూ మహిళా ప్రయాణికులకు అండగా నిలుస్తారు. -
అనుమానాస్పద విమాన ప్రయాణికులపై నిఘా
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో చేపట్టే భద్రతా చర్యల్లో సీఐఎస్ఎఫ్ సమూల మార్పులు చేసింది. ఇప్పటివరకూ అమలు చేస్తున్న ప్రయాణికుల సాధారణ తనిఖీల స్థానంలో వ్యూహాత్మక తనిఖీ పద్ధతులను అవలంబించనుంది. ప్రయాణికుల టికెట్ వివరాల ఆరాకు ఎక్కువ సమయం పడుతుండటంతో ఇకపై అనుమానాస్పద ప్రయాణికులపై నిఘా పెట్టేలా సిబ్బందిని సాధారణ దుస్తుల్లో ఎయిర్‌పోర్టు టెర్మినళ్లలో మోహరించనుంది. పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టుపై ఉగ్ర దాడుల నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆస్తుల పరిరక్షణలో భేష్
- సీఐఎస్ఎఫ్ ట్రెయినింగ్ సెక్టార్ ఐజీ అనిల్‌కుమార్ - హకీంపేట్ సీఐఎస్ఎఫ్లో 62 మందికి శిక్షణ - కేంద్ర అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పెరేడ్ శామీర్‌పేట్ రూరల్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు కేంద్ర అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ట్రెయినింగ్ సెక్టార్ ఐజీ అనిల్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని హకీంపేట్ పరిధిలోని సీఐఎస్ఎఫ్లో అగ్నిమాపక కానిస్టేబుల్, డ్రైవర్, పంప్ ఆపరేటర్ల 12వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ (పీఓపీ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ విపత్కాలంలో అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో కష్టించి దేశ ప్రజలకు మంచి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనపర్చిన జవాన్లకు బహుమతులు అందజేశారు. ముందుగా శిక్షణ పొందిన సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 62 మంది ఇందులో శిక్షణ పొంది పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫైర్ ట్రెయినింగ్ ప్రిన్సిపాల్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయాల్లో తనిఖీ సమయం సగానికి తగ్గింపు
న్యూడిల్లీ: తరచూ విమానాల్లో ప్రయాణిస్తూ సిబ్బంది తనిఖీలతో విసుగెత్తి ఉన్నవారికో శుభవార్త. తనిఖీ సమయాన్ని సగానికి తగ్గించాలని కేంద్ర పారిశ్రామిక భదత్రా సిబ్బంది (సీఐఎస్ఎఫ్) నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 59 పౌర విమానాశ్రయాల్లో తనిఖీలకోసం కొత్తగా ఫోర్ పాయింట్ ఫార్ములాను తయారు చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాల్లో ఒక్కో వ్యక్తిని తనిఖీ చేయడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల సమయం పడుతోంది. ఈ సమయాన్ని నాలుగు నిమిషాలకు తగ్గించనున్నామని సీఐఎస్ఎఫ్ విమానాశ్రయ భద్రతా యూనిట్ ప్రధానాధికారి ఓ.పి.సింగ్ తెలిపారు. కొత్తగా తయారు చేసిన ఈ యంత్రాంగం ద్వారా ప్రయాణికుడు సరైన వ్యక్తేనా, నకిలీనా, అనుమానస్పదుడా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది సులభంగా గుర్తించగలుగుతారు. దీని తరువాత భద్రతా సిబ్బంది ప్రయాణికుడి విమాన టిక్కెట్లో ఉన్న నంబర్, తేదీ, సమయం, సరైన గుర్తింపు కార్డు ఉందా లేదా అని తనిఖీ చేస్తారని సీఐఎస్ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ సింగ్ తెలిపారు. దేశంలో అనేక విమానాశ్రయాల్లో తనిఖీలకోసం ఎదురుచూస్తూ ప్రయణికులు ఇబ్బంది పడుతున్నారని ఓ సర్వేలో తేలడంతో భద్రతా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కొత్త పద్ధతులను ఇందిరాగాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ప్రయోగించామని, వచ్చేవారం నుంచి దీనిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి అందజేస్తామని సింగ్ తెలిపారు. అయితే ప్రయాణికులు తప్పనిసరిగా విమాన టిక్కెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని, లేని యెడల టికెట్ పీడీఎఫ్ కాపీనీ ఫోన్లోనైనా సీఐఎస్ఎఫ్ అధికారి చెప్పారు. దీనివల్ల తనిఖీ సమయం ఇంకా తగ్గుతుందని సింగ్ తెలిపారు. -
కార్మికుడి కాల్చివేత
సాక్షి, చెన్నై : కడలూరు జిల్లా నైవేలిలో కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న లిగ్నైట్ కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇక్కడి సిబ్బంది తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా తరచూ ఆందోళనలకు దిగడం, ఇటీవల సమ్మె బాట సైతం పట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ యాజమాన్యానికి, కార్మికుల మధ్య డిమాండ్ల సాధనపై చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో నైవేలి భద్రతకు నియమించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)ను వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌ను యాజమాన్యానికి కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి. ఈ దళం తమతో దురుసుగా ప్రవర్తిస్తోందని, వీరిని వెనక్కు పంపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదే ఫోర్స్ ఓ కార్మికుడిని కాల్చి చంపడం నైవేలిలో రణరంగానికి దారి తీసింది. పేలిన తూటా: సోమవారం మధ్యాహ్నం కాంట్రాక్టు కార్మికుడు ఒకరు నైవేలి ప్రధాన మార్గం గుండా సొరంగం వైపు వెళ్లేందుకు యత్నించి నట్టు సమాచారం. అయితే, అతడిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది తుపాకీతో కాల్చారు. దీంతో ఆ పరిసరాల్లోని ఇతర సిబ్బంది ఉలిక్కి పడి, పరుగున బయటకు వచ్చారు. తల ఛిద్రమై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని కాంట్రాక్టు కార్మికుడు రాజాగా గుర్తించారు. దీంతో నైవేలి కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఉద్రిక్తత: ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిం చేందుకు సీఐఎస్ఎఫ్ వర్గాలు ప్రయత్నించడంతో కార్మికులు తిరగబడ్డారు. సీఐఎస్ఎఫ్ దళాలు మరింతగా రెచ్చి పోయాయి. కనిపించిన కార్మికులందరినీ తరిమి తరిమి కొట్టారు. గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. నైవేలిలోని వాహనాల మీద తమ ప్రతాపం చూపించారు. ద్విచక్ర వాహనాలనూ వదిలి పెట్టలేదు. రాళ్లు రువ్వారు. రాస్తారోకోలకు దిగడంతో వాహనాలు బారులు తీరారుు. దీంతో ఆ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. సమాచారం అందుకున్న కడలూరు ఎస్పీ రాధిక నేతృత్వంలో సిబ్బంది నైవేలి కార్పొరేషన్ వద్దకు ఉరకలు తీశారు. ఎన్నికల విధులకు పోలీసు సిబ్బంది వెళ్లడంతో ఉన్న వాళ్లతో పరిస్థితిని కట్టడి చేయడానికి ఎస్పీ యత్నించారు. కార్మికులు అడ్డుకోవడంతో గం టల తరబడి మృతదేహం అక్కడే పడి ఉన్నది. చివరకు పెద్ద ఎత్తున బలగాల్ని రప్పించి, ఆ పరిసరాల్లో పరిస్థితి అదుపు తప్పకుండా మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాజాను కాల్చి చంపిన సీఐఎస్ఎఫ్ జవాన్ ఎవరోనని విచారిస్తున్నారు. ఆగ్రహం: సీఐఎస్ఎఫ్ తీరుపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. సిబ్బందిని ఎందుకు కాల్చారని ప్రశ్నిస్తే తమ మీద లాఠీలు ఎక్కుబెట్టారని, కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని జీవా ఒప్పంద కార్మిక సంఘం నాయకుడు వెంకటేష్ , సీఐటీయూ నాయకుడు వేల్ మురుగన్ పేర్కొన్నారు. జీతం తీసుకునే నిమిత్తం రాజా నైవేలికి వచ్చాడని వివరించారు. గుర్తింపుకార్డు ఉన్నా, అనుమతించక పోవడంతో లోనికి వెళ్లేం దుకు రాజా ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాజా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాల్సి ఉందన్నారు. నేరుగా కాల్చి చంపడం ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. మూడు రౌండ్ల కాల్పులతో రాజా తల ఛిద్రమయ్యిందని, సీఐఎస్ఎఫ్ను ఇప్పటికైనా వెనక్కు పంపించాలని డిమాండ్ చేశారు. రాజా కుటుంబానికి న్యాయం చేయాలని, నష్ట పరిహారంతో పాటు, ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం నిరంతర ఆందోళనకు సిద్ధం అవుతున్నామన్నారు. -
గొడవపడి ఇన్స్పెక్టర్ను కాల్చేసిన సీఐఎస్ఎఫ్ జవాన్
కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) జవాన్ తన పైస్థాయి అధికారితో గొడవపడి ఆవేశంతో అతణ్ని తుపాకితో కాల్చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన కోల్‌కతా పోర్టు ట్రస్టు వద్ద సీఐఎస్ఎఫ్ శిబిరంలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ గురుపాద షీత్, ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జవాన్ తన రైఫిల్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపడంతో గురుపాద అక్కడికక్కడే మరణించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కోల్‌కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిసాకుమార్ తెలిపారు. అతన్ని కోర్టులో హాజరు పరచనున్నట్టు చెప్పారు. -
ప్రగతి మైదాన్‌కు భారీ భద్రత
న్యూఢిల్లీ: అనునిత్యం ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలతో రద్దీగా కనిపించే ప్రగతి మైదాన్ భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది. ఇక్కడ పటిష్ట భద్రత కోసం 125 మంది జవాన్ల బృందాన్ని నియమించనుంది. ప్రగతి మైదాన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు భద్రతాపరమైన ముప్పు ఉందనే హెచ్చరికలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భద్రత కల్పన కోసం కేంద్ర హోంశాఖ విధివిధానాలను రూపొందిస్తున్నప్పటికీ.. వేదికల వద్ద విధుల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం నెరుపుతామని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ప్రగతి మైదాన్‌కు సాయుధ భద్రత కల్పించడం ఇదే తొలిసారి. వచ్చే నెల వరకు 125 మంది సీఐఎస్ఎఫ్ జవాన్ల బృందాన్ని పంపిస్తామని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అధీనంలో పనిచేసే భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సూచన మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనదేశ వాణిజ్య సంస్థల సత్తాను అంతర్జాతీయంగా చాటిచెప్పడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 124 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 16 హాళ్లు ఉన్నాయి. మరో 10 వేల చదరపు మీటర్ల సువిశాల ప్రదర్శనప్రాంతం కూడా ఉంది. దీనికి సీఐఎస్ఎఫ్ 24 గంటల భద్రత కల్పిస్తోంది. ఏవైనా సంక్షోభ పరిస్థితులు తలెత్తితే దీనికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయి కాబట్టి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సీఎండీ రీటా మీనన్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు.