న్యూఢిల్లీ: పాట్నా, చెన్నైతోపాటుగా ఆరు విమానాశ్రయాల్లో జూన్ 1నుంచి హ్యాండ్ బ్యాగులకు ట్యాగులు, స్టాంపిగ్ వేసే విధానాన్ని ఎత్తేస్తున్నట్లు సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) ప్రకటించింది. జైపూర్, గువాహటి, లక్నో, తిరువనంతపురం విమానాశ్రయాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు.
‘కొన్ని వారాలుగా ఈ ఎయిర్‌పోర్టులో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. కొత్త భద్రతాప్రమాణాలతోపాటుగా సీసీటీవీలు విస్తృతంగా అమర్చాం. జూన్ 1నుంచి స్వదేశీ ప్రయాణికుల బ్యాగుల ట్యాగింగ్‌ను ఎత్తేయాలని నిర్ణయించామ’ ని ఆయన తెలిపారు. వచ్చే సోమవారం నుంచి విశాఖపట్టణం, గోవా, పుణే, వారణాసి, భువనేశ్వర్ విమానాశ్రయాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
హ్యాండ్ బ్యాగ్‌లకు ఇక ట్యాగులుండవు
Published Tue, May 30 2017 12:32 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
Advertisement
Advertisement