airports
-
అదానీ ఎయిర్‌పోర్ట్స్ ‘ఏవియో’ యాప్
న్యూఢిల్లీ: అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ తాజాగా ‘ఏవియో’ డిజిటల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ల ట్రాఫిక్, బ్యాగేజ్ ఫ్లో, గేట్ల దగ్గర పట్టే వెయిటింగ్ సమయం, కన్వేయర్ బెల్టుపై బ్యాగ్‌లు మొదలైన వివరాలను రియల్–టైమ్‌లో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ (సీఐఎస్ఎఫ్), ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌కి ఈ యాప్ యాక్సెస్ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బ్యాగేజ్ ఫ్లోను పర్యవేక్షించేందుకు ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు/మేనేజర్లు ఏవియోను ఉపయోగిస్తారు. విమానయాన రంగ సంస్థలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్లాట్‌ఫాం సహాయకరంగా ఉండగలదని సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 12 నుంచి 14 చోట్ల ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు నిరి్మంచాలన్నది ప్రభుత్వ ఆలోచన అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముందుగా కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, మూలపేటలో వీటిని నిరి్మస్తామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తునిలో కూడా వీటి నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలను తీసుకురావాలని చెప్పారు.విమానాశ్రయాల ద్వారా సరకు రవాణా ప్రాజెక్టులు రూపొందించాలని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిన, రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు, ఏపీ మారిటైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వివిధ ప్రాజెక్టుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఏపీ మారిటైం మాస్టర్ ప్లాన్‌తో పాటు మారిటైం పాలసీ తెస్తామని తెలిపారు. జీఏడీ పరిధిలోకి ఏవియేషన్ కార్పొరేషన్ ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌ను జీఏడీ పరిథిలోకి, డిజిటల్ కార్పొరేషన్‌ను ఐ అండ్ పీఆర్ పరిథిలోకి తేవాలని సీఎం చెప్పారు. ఏపీ టవర్స్ కార్పొరేషన్‌ను స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో విలీనం చేయాలన్నారు. కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, టవర్స్ కార్పొరేషన్, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లను గాడిలో పెట్టాలని ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యతగా ‘పోలవరం’ పోలవరం ప్రాజెక్టు పనులను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రెండు సీజన్లలో పూర్తిచేసి.. ప్రధాన డ్యాం పనులు చేపట్టాలని సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి–పెన్నా, వంశధార–నాగావళి నదుల అనుసంధానం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. గోదావరి డెల్టా కంటే ముందుగా కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మొదలయ్యేలా పూర్తిస్థాయిలో నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. యూట్యూబ్, గూగుల్ హెడ్లతో వర్చువల్ సమావేశం యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్గుప్తాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆన్లైన్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. -
ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
సాక్షి, ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య భారత్ సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ఇబ్బందులకు దృష్టిపెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇక, మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మెహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా 41 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు!
న్యూఢిల్లీ: దేశంలో 41 ఎయిర్‌పోర్ట్‌లలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో వరుస బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌తో అప్రమత్తమైన కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దేశం మొత్తం జల్లెడపట్టి అవి నకిలీ బెదిరింపులేనని నిర్ధారించారు.దేశంలోని తమిళనాడులోని చెన్నై,కోయంబత్తూర్,బీహార్‌లోని పాట్నా, గుజరాత్‌లోని వడోదర, రాజస్థాన్‌లోని జైపూర్ 41 విమానాలలో బాంబు హెచ్చరిక ఈమెయిళ్లు వచ్చాయి. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని,ఎలాంటి ఆధారాలు లభించలేదేని సీనియర్ అధికారులు వెల్లడించారు.ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం 13ఏళ్ల బాలుడు ఎయిర్ కెనడా విమాన బెదిరింపు ఈమెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు. -
హై అలర్ట్: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు. బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు. -
ప్రపంచంలో తొలి 20 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..(ఫొటోలు)
-
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 30 నిమిషాలే టైమ్!
Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. -
ఎయిర్‌పోర్ట్‌ల విభాగాన్ని లిస్టింగ్ చేస్తాం - వీపీ జీత్ అదానీ
హైదరాబాద్: నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన తర్వాత సమీప భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్స్ విభాగాన్ని లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అదానీ ఎంటర్ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ జీత్ అదానీ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఉన్న విమానాశ్రయాలను విస్తరిస్తున్నామని, గతేడాది అన్ని ఎయిర్‌పోర్ట్‌ల నుంచి 8 కోట్ల మంది ప్యాసింజర్లు ప్రయాణించినట్లు ఆయన చెప్పారు. లక్నో, గువాహటి ఎయిర్‌పోర్ట్‌లలో కొత్త టెర్మినల్స్‌ను ప్రారంభించనున్నామని, నవీ ముంబై విమానాశ్రయం ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని చెప్పారు. అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. భారత నేవీ కోసం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తయారు చేసిన దృష్టి 10 స్టార్‌లైనర్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో జీత్ పాల్గొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్ఎల్) మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, తిరువనంతపురం, ముంబై తదితర విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (ఎంఐఏఎల్) 73% వాటా ఉంది. ఎంఐఏఎల్‌కు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 74% వాటాలు ఉన్నాయి. ప్రయాణికుల పరంగా 25% వాటా, ఎయిర్ కార్గో ట్రాఫిక్‌లో 33% వాటాతో ఏహెచ్ఎల్ దేశీయంగా అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా సంస్థగా ఉంది. -
ఆరు విమానాశ్రయాల లీజుతో ఏటా రూ. 515 కోట్లు ఆదా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ఆరు విమానాశ్రయాల నిర్వహణను లీజుకివ్వడం ద్వారా 2018 నుంచి ప్రభుత్వానికి ఏటా ర. 515 కోట్లు ఆదా అవుతోందని పౌర వివనయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ప్రైవేట్ కాంట్రాక్టరుకు (కన్సెషనైర్) లీజుకివ్వడానికి ముందు ఈ ఎయిర్‌పోర్టులపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ. 2,767 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టరు ముందస్తుగా చెల్లించినట్లు పేర్కొన్నారు. 2018లో మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, తిరువనంతపురంట్జైపూర్, గువాహటి వివనాశ్రయాలను లీజుకిచ్చారు. వీటిలో అహ్మదాబాద్ విమానాశ్రయంపై ఏటా రూ. 137 కోట్లు, జైపూర్ (రూ. 51 కోట్లు), లక్నో (రూ. 63 కోట్లు)మంగళూరు (రూ. 53 కోట్లు), తిరువనంతపురం (రూ.142 కోట్లు), గువాహటి వివనాశ్రయంపై రూ. 68 కోట్లు ఏటా ఆదా అయినట్లు వీకే సింగ్ చెప్పారు. ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి కన్సెషనైర్‌కు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుపై రూ. 506 కోట్లు, జైపూర్ (రూ. 251 కోట్లు), లక్నో (రూ. 365 కోట్లు) మంగళూరు (రూ. 118 కోట్లు), తిరువనంతపురం (రూ. 350 కోట్లు), గువాహటి విమానాశ్రయంపై రూ. 248 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం పీపీపీ కింద 14 వివనాశ్రయాలను ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన ఎయిర్‌పోర్టులు మాత్రమే లాభాలు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. -
Disha Naik: ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్
గోవాకు చెందిన దిశా నాయక్ చరిత్ర సృష్టించింది. విమానాశ్రయాల్లో అగ్ని ప్రమాదాలను నివారించే భారీ వాహనం ‘క్రాష్ ఫైర్ టెండర్’ను నడిపే తొలి భారతీయ వనితగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమోట్ అయ్యింది. గోవా వాసులు సరే, విమానయాన రంగం కూడా ఆమెను ప్రశంసగా చూస్తోంది. అగ్నిప్రమాదాలు ప్రాణాంతకం. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే అగ్ని ప్రమాదాలు మరీ తీవ్రం. సెకన్ల వ్యవధిలో చావు బతుకులు నిర్ణయమవుతాయి సరిగ్గా స్పందించకపోతే. అందుకే ప్రత్యేకంగా ‘ఏరోడ్రోమ్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్’ (ఏ.ఆర్.ఎఫ్.ఎఫ్.) సర్వసమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే ఈ విభాగంలో స్త్రీల ప్రాతినిధ్యం చాలా తక్కువ. 2021 వరకు గోవాలో ఒక్క మహిళ కూడా ఈ విభాగంలో లేదు. దిశా నాయక్ ఈ ఉద్యోగంలో చేరి గోవాలో తొలి ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ‘క్రాష్ ఫైర్ టెండర్’ నడిపే ఫైర్‌ఫైటర్‌గా ప్రమోట్ అయ్యింది. దాంతో మన దేశంలో క్రాష్ ఫైర్ టెండర్‌ను ఆపరేట్ చేసే తొలి సర్టిఫైడ్ ఉమన్ ఫైర్‌ఫైటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. క్రాష్ ఫైర్ టెండర్ (సి.ఎఫ్.టి.) అంటే? ఇది హైటెక్ ఫైర్ ఇంజిన్. అగ్నిమాపక దళంలో కనిపించే ఫైర్ ఇంజిన్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో, విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలార్పేలా ఈ ఫైర్ ఇంజిన్‌ను తయారు చేస్తారు. దీనిని నడపడానికి, మంటలు ఆర్పేలా ఆపరేట్ చేయడానికి తీవ్రశిక్షణ అవసరం. సాధారణంగా మగవారు రాణించడానికే కొంత శ్రమ పడతారు. అలాంటిది దిశా నాయక్ అన్ని పరీక్షలు పాసై సి.ఎఫ్.టి.ని ఆపరేట్ చేసే మహిళా ఫైర్‌ఫైటర్ అయ్యింది. యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని.. గోవాలోని పెర్నెమ్కు చెందిన దిశా నాయక్‌కు బాల్యం నుంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కోరిక. అయితే చదువు పూర్తయ్యాక అలాంటి ఉద్యోగం ఏమీ దొరకలేదు. 2021లో గోవాలోని ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’లో ఫైర్‌ఫైటర్ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం లో అప్పటికి ఎవరూ అమ్మాయిలు లేకపోయినా దిశా అప్లై చేసింది. ‘మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు. మోటర్ సైకిల్ నడిపేది. రన్నింగ్ బాగా చేసేది. ఆమె ఫైర్‌ఫైటర్‌గా చేరతానంటే రాణిస్తుందనే నమ్మకంతోనే ప్రోత్సహించాం’ అంటారు తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహంతో జూన్ నెలలో ఉద్యోగంలో చేరింది దిశా. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దిశాలోని చురుకుదనం, అంకితభావం పై అధికారులు గమనించారు. కేవలం సహాయక సిబ్బందిగా ఉండటం కంటే క్రాష్ ఫైర్ టెండర్‌ను నడిపేందుకు ఆమె ఆసక్తి చూపడం గమనించి ఆమెను ట్రైనింగ్‌కి పంపారు. తమిళనాడులోని నమక్కల్‌లో ఆరునెలల పాటు శిక్షణ తీసుకుంది దిశ. ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించే తీరు, ఏ ప్రమాదంలో సి.ఎఫ్.టి.ని ఎలా ఉపయోగించాలి... అక్కడ ఆమెకు నేర్పించారు. తిరిగి వచ్చాక ఉన్నతాధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఆమె ప్రావీణ్యాన్ని నిర్థారించి సి.ఎఫ్.టి ఆపరేటర్‌గా ప్రమోట్ చేశారు. ‘ఆమె అన్నిరకాల పరీక్షల్లో ఉత్తమంగా నిలిచింది’ అని తెలిపారు. అన్నివిధాలా సిద్ధంగా ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే సంఘటనాస్థలికి చేరుకోవడం కంటే చేరుకున్నాక ఏం చేయాలన్నదే ఎక్కువ ముఖ్యం. ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా పని చేసేవారికి ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రవేశమార్గాలు, కీలకమైన ద్వారాలు, ముఖ్యస్థానాలు మైండ్‌లో ప్రింట్ అయి ఉండాలి. ప్రమాదం జరిగితే ఎక్కడికి చేరి ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఈ ఉద్యోగంలో క్షణాల్లో యూనిఫామ్‌లోకి మారి వెహికిల్‌లో కూచోవాలి. శారీరక బలంతో పాటు మానసిక బలం ప్రదర్శించాలి. సాంకేతిక జ్ఞానం కూడా తప్పనిసరి’ అని తెలిపింది దిశ. -
AP: విమానయానం ఫుల్ జోష్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయానరంగం జోరుమీద కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 23,45,795 మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది 27,49,835కు చేరింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖలో అత్యధిక వృద్ధి... పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం విమానాశ్రయం అన్నిటికంటే అత్యధికంగా 30.5శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది విశాఖ నుంచి 11.50 లక్షల మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 15.03 లక్షలకు పెరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, గత కొన్ని నెలలుగా నమోదవుతున్న గణాంకాలే దీనికి నిదర్శనమని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. విశాఖ తర్వాత గడిచిన ఆరు నెలల్లో విజయవాడ నుంచి 5.41 లక్షల మంది, తిరుపతి నుంచి 4.30 లక్షల మంది, రాజమండ్రి నుంచి 2.11 లక్షల మంది ప్రయాణించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 41,056 మంది, కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి 21,326 మంది ప్రయాణించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు కావడంతో తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారి సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైందని, రానున్నకాలంలో ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘భోగాపురం’తో డబుల్ ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్‌ఫోర్స్ వారిది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది. చదవండి: వావ్..విశాఖ! -
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
ఫ్రాన్స్ విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు
ప్యారిస్: ఫ్రాన్స్‌లో బాంబు బెదిరింపులు కలవరం రేపాయి. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని దుండగులు ఈమెయిళ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా ఎయిర్‌పోర్టులను ఖాలీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. పారిస్‌కు సమీపంలో ఉన్న లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాల్లో బాంబులు పేలుళ్లు జరగనున్నాయని ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీనిని ధ్రువీకరించిన అధికారులు తనిఖీలు చెపడుతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ‘గిరిజన్’ బ్రాండ్ పేరుతో అందిస్తున్న సహజసిద్ధమైన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ప్రధానంగా అరకు వ్యాలీ కాఫీతోపాటు గిరిజన తేనె, షర్బత్, జీడిపప్పు, చిరుధాన్యాలు, త్రిఫల పౌడర్, హెర్బల్ ఆయిల్, సబ్బులు వంటి 80 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రత్యక్షంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన జీసీసీ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక నగరాల్లోను జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్లో జీసీసీ అవుట్లెట్ ఏర్పాటు చేశారు. దేశంలో 13 విమానాశ్రయాల్లోను గిరిజన ఉత్పత్తులను అమ్ముతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంలో పూర్తిగా జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో జీసీసీ ఏర్పాటు చేసిన స్టాల్ విక్రయాలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ట్రైబల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) భాగస్వామ్యంతో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. జైపూర్, గోవా, త్రివేండ్రం, మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్టు (ఉదయ్‌పూర్), కోయంబత్తూరు, పుణె, కేబీఆర్ (లద్దఖ్), మాతా దంతేశ్వరి (జగదల్పూర్), కొచ్చిన్, లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ (గౌహతి), ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రూ.85.56 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీసీసీ విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన అటవీ ఫలసాయాలకు మంచి ధర దక్కేలా జీసీసీ దోహదం చేస్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన వాటిని అనేక రకాల ఉత్పత్తులుగా విక్రయిస్తోంది. ఈ క్రమంలో గిరిజనులకు మరింత మేలు చేసేలా జీసీసీ సేవలు విస్తృతం చేస్తోంది. దీన్లో భాగంగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో జీసీసీ అవుట్‌లెట్స్ ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో గతేడాది (2022–23లో) రూ.85.56 లక్షల విలువైన జీసీసీ గిరిజన్ ఉత్పత్తులు విక్రయించాం. దేశంలో ఎక్కడైనా జీసీసీ ఫ్రాంచైజీ అవుట్లెట్లు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహం అందిస్తాం. – శోభ స్వాతిరాణి, జీసీసీ చైర్పర్సన్ -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ షాపులకూ పరోక్ష పన్ను వర్తింపు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి ఎలాంటి పరోక్ష పన్నులు వసూలు చేయరాదని ఏప్రిల్ 10వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచి్చన తీర్పును తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెనక్కు తీసుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలలో అరైవల్, డిపార్చర్ టెరి్మనల్స్ వద్ద డ్యూటీ ఫ్రీ షాపులు కస్టమ్స్ చట్టాల పరిధిలోనికి రావని, సేవా పన్ను వంటి పరోక్ష పన్ను విధింపు కూడదని ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 10న రూలింగ్ ఇచ్చింది. అయితే ఈ రూలింగ్‌లో లోపాలున్నాయని సెంటర్ అండ్ కమీషనర్ ఆఫ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ ముంబై ఈస్ట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ చేసిన వాదనలతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది. ఈ కేసులో ప్రభుత్వ వాదనలను ద్విసభ్య ధర్మాసనం వినలేదని, తద్వారా ‘‘సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన’’ జరిగిందని అదనపు సొలిసటర్ జనరల్ చేసిన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. తీర్పును రీకాల్ చేసినందున ప్రభుత్వం సేవా పన్నుగా వసూలు చేసిన రూ.200 కోట్లను తిరిగి పొందే ప్రయత్నాలను (పన్ను రిఫండ్ క్లెయిమ్) విరమించుకోవాలని కూడా ఈ కేసులో పారీ్టగా ఉన్న ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్‌కు సుప్రీం సూచించింది. -
200కు పైగా ఎయిర్‌పోర్ట్‌లు అవసరం
న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే ఐదేళ్లలో 200కు మించి ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇదే కాలంలో ఎయిర్‌లైన్స్ సంస్థలు 1,400 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. నరేంద్రమోదీ సర్కారు తొమ్మిదేళ్ల హయాంలో విమానయాన రంగం సాధించిన పురోగతిపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 వరకు 74 ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్‌పోర్ట్‌లే ఉండేవని, ఇవి రెట్టింపై ప్రస్తుతం 148కి చేరినట్టు చెప్పారు. ‘‘2013–14లో దేశీయంగా ఆరు కోట్ల మంది ప్రయాణించారు. ఇప్పుడు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 14.5 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో అంతర్జాతీయ ప్రయాణికులు 50 శాతం పెరిగి 4.7 కోట్ల నుంచి 7 కోట్లకు చేరారు. దేశ, విదేశీ కార్గో పరిమాణం ఇదే కాలంలో 2.2 మిలియన్ టన్నుల నుంచి 3.6 మిలియన్ టన్నులకు (65 శాతం అధికం) పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రగతిశీల విధానాల ఫలితంగా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది’’అని మంత్రి వివరించారు. విమానాల సంఖ్య కూడా 2014 నాటికి 400గా ఉంటే, ఇప్పుడు 700కు చేరినట్టు చెప్పారు. ‘‘ఎయిర్ ఇండియా 70 బిలియన్ డాలర్ల విలువైన 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది కేవలం ఆరంభమే. భారత విమానయాన సంస్థలు రానున్న ఐదేళ్లలో 1,200 నుంచి 1,400 విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నాయి. రానున్న ఐదేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ల రంగంలోకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయి’’అని సింధియా పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ ప్రయాణికుల సంఖ్య 45 కోట్లకు (వార్షికంగా) చేరుకుంటుందన్నారు. హెలీకాప్టర్ల వినియోగాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఉడాన్ ఫ్లయిట్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. -
ఎయిర్‌పోర్టుల్లో ‘బిచ్చగాడు’.. ఓ యువకుడి నకిలీ యాచన!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు కూడళ్లు, ప్రార్థనా స్థలాలు, ఫంక్షన్ హాళ్లు తదితర చోట్ల యాచకులను చూస్తూనే ఉంటాం. వృద్ధాప్యం వల్లో లేదా శారీరక వైకల్యం వల్లో యాచించే వారు కొందరైతే దీన్నే దందాగా మార్చుకొని జీవించే వారు ఇంకొందరు కనిపిస్తుంటారు. కానీ ఇలా రోజంతా అడుక్కున్నా ఎవరికైనా లభించేది చిల్లరే... అందుకే సులువుగా నోట్ల కట్టలు సంపాదించేందుకు ఓ యువకుడు ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకొని ‘బిచ్చగాడి’అవతారం ఎత్తాడు! శంషాబాద్ ఎయిర్పోర్ట్ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులు సహా అనేక మంది నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పర్సు పోవడంతో ఎదురైన అనుభవంతో.. చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్... బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు. ముందస్తు షెడ్యూల్‌తో ముష్టి కోసం.. విమానాశ్రయాలనే టార్గెట్‌గా చేసుకొని ప్రయాణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విఘ్నేష్ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్ విమాన టికెట్లు బుక్ చేసుకొనేవాడు. ఖరీదైన క్యాజువల్స్ ధరించి, చేతిలో లగేజ్ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్ షెడ్యూల్ టైమ్‌కు దాదాపు 4–5 గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్ (సైలెంట్ మోడ్‌లో ఉంచి) మాట్లాడినట్లు నటించేవాడు. తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. ఇప్పటివరకు ఫిర్యాదులులేకపోవడంతో.. ఈ పంథాలో విఘ్నేష్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. విఘ్నేష్ మోసగించిన వారిలో అత్యధికులు విదేశీయులే కావడంతో వారికి ఇది మోసమని తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నే‹Ùను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ హైదరాబాద్‌లో సాగించిన ‘భిక్షాటన’గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టులు కట్టాను: చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు రూరల్: సమస్యలు చెప్పుకోవడానికి రైతులు తన వద్దకు వస్తుంటే రాకుండా అడ్డుకుని భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తాను వస్తుంటే.. రైతులను రానీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేసి ధనవంతులకు బాగా ఉపయోగపడ్డానని గుర్తు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే కోస్తాలో ఆక్వా కల్చర్, రాయలసీమలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆక్వా జోన్ పరిమితి లేకుండా ఆక్వా సాగుదారులందరికీ రూ.1.50కే కరెంట్ ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు దళారులుగా మారారని ధ్వజమెత్తారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. పరిహారం ఇవ్వాలని అడిగినా అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చదవండి: ‘వరం’ పోయిందని కడుపు మంట సంక్షోభంలో ఉన్న రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకూ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వస్తుందని చెబుతుంటే తన మీద విమర్శలు, ప్రతిదాడి చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాను 72 గంటల సమయం ఇచ్చినా రైతుల సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడతానని చెప్పారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని వెల్లడించారు. -
అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 722 కోట్లను దాటింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 304 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా విమానాశ్రయాలు, రహదారుల బిజినెస్‌లు లాభాల్లో వృద్ధికి దోహదం చేశాయి. మొత్తం ఆదాయం సైతం రూ. 25,142 కోట్ల నుంచి రూ. 31,716 కోట్లకు జంప్ చేసింది. 7 ఎయిర్‌పోర్టులలో ప్రయాణికుల సంఖ్య 74 శాతం ఎగసి 21.4 మిలియన్లను తాకగా.. కార్గో 14 శాతం బలపడింది. ఈ బాటలో రహదారులు, మైనింగ్ బిజినెస్‌లు లాభదాయకతకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. దేశీయంగానేకాకుండా, ప్రపంచ స్థాయిలో విజయవంతమైన వ్యాపారాభివృద్ధికి కంపెనీ ప్రతీకగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. నిర్వహణ, ఆర్థిక పటిష్టతకు గతేడాది ఫలితాలు కొలమానమని విశ్లేషించారు. పాలన, నిబంధనల అమలు, పనితీరు, నగదు ఆర్జనలపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం అదానీ ఎంటర్ప్రైజెస్ నికర లాభం 218 శాతం దూసుకెళ్లి రూ. 2,473 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 96 శాతం జంప్‌చేసి రూ. 1,38,175 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రెట్టింపునకుపైగా వృద్ధితో రూ. 10,025 కోట్లయ్యింది. ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రయాణికుల సంఖ్య 74.8 మిలియన్లకు చేరింది. 2023 మార్చికల్లా కంపెనీ స్థూల రుణభారం రూ. 41,024 కోట్ల నుంచి తగ్గి రూ. 38,320 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 4.7 శాతం జంప్‌చేసి రూ. 1,925 వద్ద ముగిసింది. -
ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు
న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. -
పెరుగుతున్న గోల్డ్, వెండి అక్రమ రవాణా.. 11,735 కిలోల బంగారం..
సాక్షి, అమరావతి: దేశంలో బంగారం, వెండి అక్రమ రవాణా ఏటికేడాది పెరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలతో 2020–21లో కొంతమేర వీటి అక్రమ రవాణా తగ్గినప్పటికీ తరువాత 2021–22, 2022–23 సంవత్సరాల్లో బాగా పెరిగింది. స్వాధీనం చేసుకున్న వాటిని చూస్తేనే అక్రమ రవాణా పెరిగిందంటే.. ఇక స్వాధీనం చేసుకోకుండా ఎంత అక్రమ రవాణా అయిందో ఎవరికీ తెలియదు. దేశంలో 2019–20 నుంచి 2022–23 ఫిబ్రవరి వరకు అక్రమ రవాణా చేస్తున్న 11,735.04 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 13,205 కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో 7,632.52 కిలోల వెండి స్వాధీనం చేసుకుని 49 కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో ఆర్థికశాఖ వెల్లడించింది. అత్యధికంగా విమానాల ద్వారానే బంగారం, వెండి అక్రమ రవాణా అవుతున్నాయని, తరువాత ఇతర మార్గాలు, ఓడరేవుల ద్వారా కూడా అక్రమ రవాణా సాగుతోందని తెలిపింది. శరీరంలో దాచి మరీ బంగారం అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొంది. బంగారం, వెండి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కస్టమ్స్ క్షేత్రస్థాయి బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయని, ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా విమానాలు, కార్గో సరుకుల లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నాయని తెలిపింది. స్మగ్లర్లు ఉపయోగించే కొత్తకొత్త విధానాలు, పద్ధతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. విమాన క్యాబిన్ సిబ్బందితోపాటు విమానాశ్రయ సిబ్బంది బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. బంగారం, వెండి అక్రమ రవాణాకు పాల్పడిన క్యాబిన్ సిబ్బంది, విమానాశ్రయ సిబ్బందిని అరెస్టు చేయడంతోపాటు కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. 2019–20 నుంచి 2022–23 ఫిబ్రవరి వరకు బంగారం, వెండి అక్రమ రవాణాకు పాల్పడిన క్యాబిన్, విమానాశ్రయ సిబ్బంది 84 మందిని అరెస్టు చేసి 181.61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బంగారం, వెండి అక్రమ రవాణాను అరికట్టడానికి నిరంతరం నిఘా ఉంచడంతో పాటు అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా రిస్క్‌బేస్డ్ ఇంటర్‌డిక్షన్ సహాయంతో ప్రయాణికుల ప్రొఫైలింగ్ వంటి కార్యాచరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా 3 ఎయిర్‌పోర్టులే సాధ్యం: వీకే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూడు ప్రాంతాలను మాత్రమే కొత్తగా విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతికంగా అనువైన ప్రదేశాలుగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) చేసిన అధ్యయనం ప్రకారం ఈమేరకు కేంద్రం వెల్లడించింది. వరంగల్ (బ్రౌన్‌ఫీల్డ్), ఆదిలాబాద్ (బ్రౌన్‌ఫీల్డ్), జక్రాన్‌పల్లి (గ్రీన్‌ఫీల్డ్) ప్రాంతాలు మాత్రమే సాంకేతికంగా సాధ్యమయ్యేవని ఏఏఐ నివేదికలో పేర్కొంది. అయితే తక్షణ భూసేకరణ అవసరాన్ని నివారించడానికి చిన్న విమానాల ప్రైవేట్ కార్యకలాపాల కోసం ఈ మూడు ప్రాంతాల్లో సాధ్యమయ్యే స్థలాలను అభివృద్ధి చేసి, ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏఏఐ కోరిందని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏవియేషన్ వర్సిటీకి నో హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ జాతీయ ఏవియేషన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి 2018లో వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఆర్జీఎన్ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించలేదని వెల్లడించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈమేరకు బదులిచ్చారు. -
అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్‌లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్‌వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్‌లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్‌లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్‌లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. -
రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్. రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్‌కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్‌గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 40 రోజులు కీలకం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్‌లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి పాజిటివ్.. చైనా వేరియంట్?