న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ఆరు విమానాశ్రయాల నిర్వహణను లీజుకివ్వడం ద్వారా 2018 నుంచి ప్రభుత్వానికి ఏటా ర. 515 కోట్లు ఆదా అవుతోందని పౌర వివనయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ప్రైవేట్ కాంట్రాక్టరుకు (కన్సెషనైర్) లీజుకివ్వడానికి ముందు ఈ ఎయిర్‌పోర్టులపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ. 2,767 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టరు ముందస్తుగా చెల్లించినట్లు పేర్కొన్నారు.
2018లో మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, తిరువనంతపురంట్జైపూర్, గువాహటి వివనాశ్రయాలను లీజుకిచ్చారు. వీటిలో అహ్మదాబాద్ విమానాశ్రయంపై ఏటా రూ. 137 కోట్లు, జైపూర్ (రూ. 51 కోట్లు), లక్నో (రూ. 63 కోట్లు)మంగళూరు (రూ. 53 కోట్లు), తిరువనంతపురం (రూ.142 కోట్లు), గువాహటి వివనాశ్రయంపై రూ. 68 కోట్లు ఏటా ఆదా అయినట్లు వీకే సింగ్ చెప్పారు.
ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి కన్సెషనైర్‌కు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుపై రూ. 506 కోట్లు, జైపూర్ (రూ. 251 కోట్లు), లక్నో (రూ. 365 కోట్లు) మంగళూరు (రూ. 118 కోట్లు), తిరువనంతపురం (రూ. 350 కోట్లు), గువాహటి విమానాశ్రయంపై రూ. 248 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం పీపీపీ కింద 14 వివనాశ్రయాలను ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన ఎయిర్‌పోర్టులు మాత్రమే లాభాలు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment