
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో లోపాల వల్ల కస్టమర్ల ఖాతాల్లోకి వేరే వాళ్ల డబ్బులొచ్చి పడుతుండటం, బ్యాంకులు నాలిక్కర్చుకుని మళ్లీ వెనక్కి తీసుకునే ఉదంతాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది వేలు, లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌లోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే, ఒకటి రెండూ లక్షలు కాదు ఏకంగా లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో!
సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ఉద్యోగి ఓ కస్టమర్ ఖాతాలోకి 280 డాలర్లు క్రెడిట్ చేయబోయి.. అక్షరాలా 81 లక్షల కోట్ల డాలర్లను క్రెడిట్ చేశారు. లావాదేవీలను పర్యవేక్షించాల్సిన మరో ఉద్యోగి కూడా దాన్ని క్లియర్ చేశారు. ఈ దెబ్బతో సిటీగ్రూప్ ఖజానా ఖాళీ అయిపోయింది. దాదాపు గంటన్నర తర్వాతెప్పుడో జరిగిన పొరపాటును ఇంకో ఉద్యోగి గుర్తించడంతో, ఇది బైటపడింది. చివరికి ఆ లావాదేవీని రివర్స్ చేసి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.
నిజానికి సిటీ గ్రూప్ గత ఏడాది కాలంగా సుమారు 100 కోట్ల డాలర్ల మొత్తానికి సంబంధించి ఇలాంటి పది పొరపాటు లావాదేవీలను తృటిలో తప్పించుకుంది. వాస్తవానికి ఇలాంటి పొరపాట్ల సంఖ్య పదమూడు నుంచి పదికి తగ్గిందట. ఇలాంటి పొరపాట్లను నివారించడంలో ఆశించినంత పురోగతి సాధించనందుకు గాను సిటీగ్రూప్‌కు నియంత్రణ సంస్థ 13.6 కోట్ల డాలర్ల జరిమానా విధించగా, రిస్కులు.. డేటా వైఫల్యాలకు గాను 40 కోట్ల డాలర్ల పెనాల్టీ కూడా పడింది.
Comments
Please login to add a commentAdd a comment