Citi Group
-
ఒకే బ్యాంకులో వచ్చే రెండేళ్లలో 20 వేలకు పైగా లేఆఫ్స్..!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కాస్ట్‌కటింగ్ వల్ల స్టార్టప్ కంపెనీలతోపాటు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ లేఆఫ్స్ సెగ బ్యాంకింగ్ రంగాన్ని తాకింది. దాంతో బ్యాంకులు తమ ఉద్యోగులను కొలువు నుంచి తొలగిస్తున్నాయి. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ తాజా త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ ఇటీవల రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. తిరిగి లాభాల బాట పట్టడానికి, వాటాదారులకు నగదును తిరిగి ఇవ్వడానికి సిటీ గ్రూప్ 'కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ' చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే రెండేళ్లలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సిటీగ్రూప్‌లో ప్రస్తుతం 2,39,000 మంది పని చేస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే రెండేళ్లలో ఇరవైవేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతంగా ఉంది. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! సిటీ గ్రూప్ 2022 ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 1.9 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు) నష్టాన్ని మూటగట్టుకుంది. ఆదాయం మూడు శాతం తగ్గి దాదాపు 17.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్ విభాగం నుంచి వచ్చే ఆదాయం అంతకు ముందు సంవత్సరం కంటే 19 శాతం తగ్గి రూ.36 వేలకోట్లకు చేరుకుంది. -
యాక్సిస్ చేతికి ‘సిటీ ఇండియా’
న్యూఢిల్లీ: అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్‌కి చెందిన భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపార విభాగాన్ని దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 12,325 కోట్లుగా ఉండనుందని యాక్సిస్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. 2023 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కాగలదని పేర్కొంది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కొనుగోలుతో యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు, బర్గండీ (ప్రీమియం) కస్టమర్లు 2.3 లక్షల పైచిలుకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరతాయి. డీల్ ప్రకారం .. విలీనం పూర్తయ్యేవరకూ కస్టమర్లకు సర్వీసులు అందించినందుకు గాను రూ. 1,500 కోట్ల వరకూ సిటీ బ్యాంక్‌కు యాక్సిస్ చెల్లించనుంది. నియంత్రణ సంస్థ నుంచి తొమ్మిది నెలల్లో అనుమతులు రాగలవని, చెల్లింపులు పూర్తయిన తర్వాత సంక్లిష్టమైన అనుసంధాన ప్రక్రియ మొదలు కాగలదని భావిస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. సంస్థాగత క్లయింట్ల వ్యాపార విభాగం ఈ డీల్‌లో భాగంగా ఉండదని సిటీగ్రూప్ తెలిపింది. ఆయా విభాగాల్లో మరింతగా విస్తరిస్తామని సిటీ ఇండియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆషు ఖుల్లార్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు ఈ కొనుగోలు ఉపయోగపడనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం (రూ. 12,500 కోట్లు) .. ఈ స్థాయి డీల్స్‌తో చివరిది. జీవితకాల అవకాశం.. సిటీ బ్యాంక్ డీల్‌ను ‘జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశం‘గా యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి అభివర్ణించారు. వ్యాపార వృద్ధి ప్రయోజనాలు గణనీయంగా ఉండటంతో ఈ డీల్వైపు మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కొనుగోలు వల్ల వడ్డీ ఆదాయంతో పాటు ఫీజు, వడ్డీయేతర ఆదాయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఎఫ్‌వో పునీత్ శర్మ చెప్పారు. సిటీబ్యాంక్ ఖాతాదారులకు యథాప్రకారంగా రివార్డులు, ఆఫర్లు మొదలైనవి కొనసాగుతాయని చౌదరి తెలిపారు. సిటీ బ్యాంక్ కస్టమర్లంతా యాక్సిస్ బ్యాంక్‌కు మారేందుకు తమ సమ్మతి తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. కస్టమర్లు యాక్సిస్ బ్యాంకుకు మారేందుకు ఇష్టపడితే యథాప్రకారం తమ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ఇతర లావాదేవీలు కొనసాగించవచ్చు. లేదా నిష్క్రమించవచ్చు. యాక్సిస్ బ్యాంక్ విస్తృత నెట్వర్క్, ఆఫర్లు సిటీబ్యాంక్ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయని చౌదరి పేర్కొన్నారు. ఒకవేళ కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిన పక్షంలో ఆ మేరకు యాక్సిస్ చెల్లించే మొత్తం కూడా తగ్గే విధంగా ఒప్పందంలో షరతులు ఉన్నాయని, అలాగే ఇరు పక్షాలు కూడా ఏ కారణంతోనైనా వైదొలిగేందుకు కూడా వీలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయని వివరించారు. సిటీగ్రూప్ ఇకపై భారత్‌లో సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగింపుపై దృష్టి పెట్టనుంది. కార్డుల్లో టాప్ 3లోకి యాక్సిస్.. దాదాపు 86 లక్షల కార్డులతో యాక్సిస్ బ్యాంక్ దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో నాలుగో స్థానంలో ఉంది. సిటీగ్రూప్ డీల్‌తో కొత్తగా మరో 25 లక్షల క్రెడిట్ కార్డుహోల్డర్లు జతవుతారు. దీంతో కార్డుల వ్యాపార విభాగంలోని టాప్ 3 బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటిగా ఎదుగుతుంది. డిపాజిట్ల పరిమాణం మరో రూ. 50,200 కోట్ల మేర పెరుగుతుంది. అలాగే, సిటీ వెల్త్.. ప్రైవేట్ బ్యాంకింగ్ సాధనాలకు సంబంధించి రూ. 1,10,900 కోట్ల విలువ చేసే ఆస్తులు (ఏయూఎం) కూడా యాక్సిస్‌కు జతవుతాయి. తద్వారా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో 3వ అతి పెద్ద బ్యాంకుగా యాక్సిస్ ఎదగనుంది. సిటీ బ్యాంక్‌కు 18 నగరాల్లో ఉన్న 7 కార్యాలయాలు, 21 శాఖలు, 499 ఏటీఎంలు, దాదాపు 3,600 మంది ఉద్యోగులు యాక్సిస్ బ్యాంక్ కిందకి చేరతారు. 30 లక్షల మంది కస్టమర్లు జతవుతారు. యాక్సిస్ బ్యాంక్ రిటైల్ వ్యాపార పోర్ట్‌ఫోలియో రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. శతాబ్దం క్రితం సిటీగ్రూప్ ఎంట్రీ.. సిటీగ్రూప్ 1902లో భారత్‌లో అడుగుపెట్టింది. 1985లో కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. సిటీ రిటైల్ ఖాతాల పరిమాణం రూ. 68,000 కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్ రుణాల ఖాతాలు రూ. 28,000 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సిటీగ్రూప్ లాభాల్లో భారత విభాగం వాటా 1.5 శాతం స్థాయిలో ఉంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సిటీబ్యాంక్ ఇండియా నికర లాభం రూ. 4,918 కోట్ల నుంచి రూ. 4,093 కోట్లకు తగ్గింది. నికర మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 143 కోట్లు, స్థూల ఎన్పీఏలు రూ. 991 కోట్లుగాను ఉన్నాయి. తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్ సారథ్యంలోని సిటీబ్యాంక్ అధిక రాబడులు అందించే ఆదాయ వనరులపై దృష్టి పెట్టే క్రమంలో 13 మార్కెట్లలో రిటైల్ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని గతేడాది నిర్ణయించుకుంది. భారత మార్కెట్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే సిటీగ్రూప్ తాజా డీల్ కుదుర్చుకుంది విదేశీ బ్యాంకుల గుడ్‌బై.. ఏఎన్జెడ్, ఆర్బీఎస్ తదితర బ్యాంకుల నిష్క్రమణ కొన్నాళ్లుగా పలు విదేశీ బ్యాంకులు భారత మార్కెట్ నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఏఎన్జెడ్ గ్రిండ్లేస్, ఆర్బీఎస్, కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి దిగ్గజాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించేసుకున్నాయి. కార్పొరేట్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి పెట్టే దిశగా 2012లో బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం బార్క్లేస్ భారత్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను భారీగా తగ్గించేసుకుంది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! నాన్–మెట్రో ప్రాంతాల్లో మూడో వంతు శాఖలను మూసేసింది. 2016లో కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా .. భారత మార్కెట్ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) కూడా అంతర్జాతీయంగా తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో కార్పొరేట్, రిటైల్, సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపార విభాగాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. గ్రిండ్లేస్ బ్యాంకును స్టాండర్డ్ చార్టర్డ్‌కు 1.34 బిలియన్ డాలర్లకు విక్రయించడం ద్వారా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, 2011లో ముంబైలో కొత్త శాఖను ప్రారంభించడం ద్వారా దేశీ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. మరికొన్ని.. ఇక, 2011లో డాయిష్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్‌కు విక్రయించేసింది. 2013లో యూబీఎస్.. భారత్ నుంచి నిష్క్రమించింది. మోర్గాన్ స్టాన్లీ తన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ.. ఇతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన లైసెన్సును అప్పగించేసింది. అదేవిధంగా 2015లో మెరిల్ లించ్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ మొదలైనవి తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. హెచ్ఎస్బీసీ రెండు డజన్ల పైగా శాఖలను మూసివేసి, కార్యకలాపాలను సగానికి తగ్గించుకుంది. 2020లో బీఎన్పీ పారిబా తన వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపార విభాగాన్ని మూసివేసింది. చదవండి: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..! -
యాక్సిస్ బ్యాంక్ చేతికి సిటీ బ్యాంక్ బిజినెస్
సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్‌లను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసే ఒప్పందం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం గురించి ఇరు సంస్థలు త్వరలోనే ప్రకటించనున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఒప్పందాన్ని కూడా ఆమోదించనుంది. సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు ఉద్యోగ భద్రతను కల్పించనుంది. ఈ విలీనం సుమారు ఆరు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అన్ని ఒప్పందాల మాదిరిగానే ఒప్పందం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. భారత్ నుంచి ఎగ్జిట్..! గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా దేశంలోని రిటైల్ బ్యాంకింగ్ నుంచి ఎగ్జిట్ అవుతామని గత ఏడాది ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ప్రకటించింది. రిటైల్ బిజినెస్‌లలో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్‌లు, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి సెగ్మెంట్లు కలిసి ఉంటాయి. సిటీ బ్యాంక్‌కు దేశంలో 35 బ్రాంచులు ఉన్నాయి. మొత్తం 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్‌ను లెక్కించేటప్పుడు డిపాజిట్లు, కస్టమర్లు, అసెట్స్, లయబిలిటీస్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ డీల్ పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అమాంతం పెరుగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, సిటీ గ్రూప్ 1902 లో ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. 1985 లో రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఐతే రిటైల్ బిజినెస్‌ను అమ్మేసినా, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ బిజినెస్‌లో సిటీ గ్రూప్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గత ఏడాది భారత్‌కు గుడ్‌బై..! ఇప్పుడు మళ్లీ రిఎంట్రీ ఇవ్వనున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..! -
భారీ తప్పిదం : వేల కోట్లు మళ్లిపోయాయి
న్యూయార్క్ : అతిపెద్ద బ్యాంకు సిటీబ్యాంక్ ఒక చిన్న తప్పు కారణంగా భారీ వివాదంలో చిక్కుకుంది. న్యూయార్క్ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న క్లరికల్ తప్పిదం కారణంగా ఏకంగా 900 మిలియన్ డాలర్లు (సుమారు 6700 కోట్ల రూపాయలు) ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇపుడు ఈ సొమ్మును రాబట్టుకునేందుకు సిటీ గ్రూపు నానా కష్టాలు పడుతోంది.తాజా నివేదిక ప్రకారం కొంత డబ్బును బ్యాంక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రముఖ కాస్మొటిక్ కంపెనీ రెవ్లాన్ వివాదానికి దారి తీసింది. ఈ ఊహించని పరిణామంతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఇరుక్కున్న రెవ్లాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది. అంతేకాదు కంపెనీ మొత్తం బకాయిలకు ఈమొత్తానికి సమానం కావడం మరింత ప్రకంపనలు పుట్టించింది. ఈ పొరపాటు సిటిగ్రూప్ను చాలా కాలం పాటు వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్, సుమారు బిలియన్ డాలర్ల మేరకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై దావా వేసింది. ఈ కేసులో సిటీ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిగేడ్, హెచ్‌పీఎస్, సింఫనీతో సహా రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. తమకు అందిన సొమ్ము రుణానికి, వడ్డీకి సమానమని వాదిస్తున్నాయి. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఇది ఈ శతాబ్దానికే అతి పెద్ద తప్పిదమంటూ దివాలా సలహాదారు మైఖేల్ స్టాంటన్ విమర్శించారు. అయితే ఈ పరిణామంపై సిటీ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. అటు అసలు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్ తెగేసి చెప్పింది. -
బిర్లాసాఫ్ట్- హింద్ జింక్.. రికార్డ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల రంగ కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క విదేశీ రీసెర్చ్ సంస్థ సిటీ బయ్ రేటింగ్ ప్రకటించిన నేపథ్యంలో మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ దాదాపు రూ. 56 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 35 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 915 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత బిర్లాసాఫ్ట్ షేరు 18 శాతం దూసుకెళ్లి రూ. 149ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 16 శాతం జంప్‌చేసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. హిందుస్తాన్ జింక్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ హిందుస్తాన్ జింక్ కౌంటర్‌కు విదేశీ దిగ్గజం సిటీ బయ్ రేటింగ్‌ను ప్రకటించింది. టార్గెట్ ధరను సైతం గతంలో ఇచ్చిన రూ. 205 నుంచి రూ. 240కు పెంచింది. రానున్న రెండేళ్లలో ఈ షేరు 8 శాతం డివిడెండ్ ఈల్డ్‌ను అందించగలదని సిటీ తాజాగా అంచనా వేసింది. దీనికితోడు ఎల్‌ఎంఈలో జింక్, సిల్వర్ ధరలు బలపడుతుండటం కంపెనీకి లబ్దిని చేకూర్చగలదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత హిందుస్తాన్ జింక్ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 236ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 230 వద్ద ట్రేడవుతోంది. -
గత వారం యూఎస్ మార్కెట్ 3.3% అప్
చైనాతో వాణిజ్య వివాదాలు మళ్లీ తలెత్తనున్న అంచనాలతో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 9 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 24,465 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 7 పాయింట్లు(0.23 శాతం) బలపడి 2,955 వద్ద స్థిరపడింది. నాస్డాక్ మరికొంత అధికంగా 40 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 9,325 వద్ద ముగిసింది. బ్లూచిప్స్ చెవ్రాన్ కార్ప్, కేటర్పిల్లర్ 2-1.4 శాతం మధ్య నీరసించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. కాగా.. గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం జంప్‌చేసింది. ఏప్రిల్ 9 తదుపరి ఇది అత్యధిక లాభంకాగా.. ఎస్అండ్పీ, నాస్డాక్ 3.2 శాతం చొప్పున ఎగశాయి. చిన్న స్టాక్స్‌కు ప్రాతినిధ్యంవహించే రసెల్-2000 ఇండెక్స్ సైతం 7 శాతం పురోగమించింది. మార్కెట్ల జోరుకు ప్రధానంగా కోవిడ్-19 చికిత్సకు మోడార్నా ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పరీక్షలు తొలి దశలో సఫలమయ్యాయన్న వార్తలు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు పలు రాష్ట్రాలలో లాక్‌డవున్‌ను పాక్షికంగా ఎత్తివేయడంతో ఆర్థిక వ్యవస్థ రికవర్‌కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. రిటైల్ జోష్ గత వారం ప్రధానంగా రిటైల్ దిగ్గజాలు బలపడ్డాయి. టీజేఎక్స్ 13 శాతం జంప్‌చేయగా.. గ్యాప్ ఇంక్ 8 శాతం ఎగసింది. ఈ బాటలో బ్యాంకింగ్ దిగ్గజాలు సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో 3 శాతం పుంజుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఓవైపు అమెరికా, చైనా మధ్య వివాదాలు రాజుకుంటున్నప్పటికీ.. మరోపక్క కోవిడ్-19కు వ్యాక్సిన్ ప్రయోగాలు క్లినికల్ పరీక్షలలో సఫలమవుతున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో శుక్రవారం మోడర్నా ఇంక్ షేరు 3 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో అలీబాబా 6 శాతం పతనమైంది. -
భారీగా క్షీణించిన ఇన్ఫోసిస్ షేరు!
హైదరాబాద్: సిటీ గ్రూప్ డౌన్ గ్రేడ్ చేయడంతో ఐటీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ తోపాటు టెక్ మహీంద్ర, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. బుధవారం మార్కెట్ లో ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర గ్రూప్ 5 శాతం, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో 3 శాతానికి పైగా శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్ కంపెనీ షేరు 5 శాతంతో 173 రూపాయలు క్షీణించి 3,658 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీ రంగాలకు చెందిన కంపెనీ షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 26234 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7841 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.