భారీ తప్పిదం : వేల కోట్లు మళ్లిపోయాయి | Citigroup accidentally wired $900 million to Revlon lenders | Sakshi
Sakshi News home page

భారీ తప్పిదం : వేల కోట్లు మళ్లిపోయాయి

Published Mon, Aug 17 2020 1:52 PM | Last Updated on Mon, Aug 17 2020 3:11 PM

Citigroup accidentally wired $900 million to Revlon lenders - Sakshi

న్యూయార్క్ : అతిపెద్ద బ్యాంకు సిటీబ్యాంక్‌ ఒక చిన్న తప్పు కారణంగా భారీ వివాదంలో చిక్కుకుంది. న్యూయార్క్‌ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న క్లరికల్ తప్పిదం కారణంగా ఏకంగా 900 మిలియన్ డాలర్లు (సుమారు 6700 కోట్ల రూపాయలు) ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇపుడు ఈ సొమ్మును రాబట్టుకునేందుకు సిటీ గ్రూపు నానా కష్టాలు పడుతోంది.తాజా నివేదిక ప్రకారం కొంత డబ్బును బ్యాంక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ  ప్రముఖ కాస్మొటిక్  కంపెనీ రెవ్లాన్ వివాదానికి దారి తీసింది. ఈ ఊహించని పరిణామంతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఇరుక్కున్న రెవ్లాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది. అంతేకాదు కంపెనీ మొత్తం బకాయిలకు ఈమొత్తానికి సమానం కావడం మరింత ప్రకంపనలు పుట్టించింది. ఈ పొరపాటు సిటిగ్రూప్‌ను చాలా కాలం పాటు వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్‌ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్‌‌, సుమారు బిలియన్‌ డాలర్ల మేరకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ  పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై దావా వేసింది. ఈ కేసులో సిటీ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్‌ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. అయితే  ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిగేడ్, హెచ్‌పీఎస్, సింఫనీతో సహా రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. తమకు అందిన సొమ్ము రుణానికి, వడ్డీకి సమానమని వాదిస్తున్నాయి. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఇది ఈ శతాబ్దానికే అతి పెద్ద తప్పిదమంటూ దివాలా సలహాదారు మైఖేల్ స్టాంటన్ విమర్శించారు.

అయితే ఈ పరిణామంపై సిటీ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. అటు అసలు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్‌ తెగేసి చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement