mistakenly
-
రూ.7 వేల లక్షల కోట్ల కుబేరుడు.. 90 నిమిషాలే
వాషింగ్టన్: కేవలం 280 డాలర్లు (రూ.24,478) జమ చేయాల్సిన బ్యాంకు ఖాతాలో ఏకంగా 81 ట్రిలియన్ డాలర్లు(రూ.7,081,00000,0000000) జమ చేస్తే? సదరు ఖాతాదారుడు క్షణాల్లో కుబేరుడైపోతాడు. చిన్న చిన్న దేశాలనే కొనేసే స్థోమత వచ్చేస్తుంది. సాక్షాత్తూ కుబేరుడికే అప్పులు ఇచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ, ఇక్కడ ఆ ఖాతాదారుడికి అంత భాగ్యం దక్కలేదు. అతడి కుబేరుడి హోదా 90 నిమిషాల్లోనే మటుమాయమైపోయింది. అమెరికాలో సిటీగ్రూప్ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన సిటీ బ్యాంకు సిబ్బంది గత ఏడాది ఏప్రిల్‌లో ఒక కస్టమర్ బ్యాంకు ఖాతాల్లో 280 డాలర్లకు బదులు ఆన్లైన్లో పొరపాటున 81 ట్రిలియన్ డాలర్లు జమచేశారు. ఇదంతా ఇద్దరు ఉద్యోగుల నిర్వాకం. తాము చేసిన తప్పును వారు గుర్తించలేకపోయారు. కానీ, మరో ఉద్యోగి 90 నిమిషాల్లో గుర్తించాడు. వెంటనే బ్యాంకు అధికారులకు అప్రమత్తం చేయడంతో సదరు లావాదేవీ ‘రివర్స్’అయిపోయింది. బ్యాంకు సొమ్ము భద్రంగా తిరిగి వచ్చేసింది. ఖాతాల్లో ఎక్కువ సొమ్మును జమ చేయడం లాంటి పొరపాట్లను బ్యాంకింగ్ పరిభాషలో ‘నియర్ మిస్’అంటారట! భారీ మొత్తంలో సొమ్ము ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్లైన్లో బదిలీ అయితే హెచ్చరించే డిటెక్టివ్ కంట్రోల్ వ్యవస్థ బ్యాంకుల్లో ఉంటుంది. సిటీ బ్యాంకులో జరిగిన రూ.7,081 లక్షల కోట్ల లావాదేవీని ఈ వ్యవస్థ కనిపెట్టినట్లు సదరు బ్యాంకు ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన వల్ల తమ బ్యాంక్‌కు గానీ, ఖాతాదారులకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. సిటీ బ్యాంక్‌లో 2024లో 10 ‘నియర్ మిస్’ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక బిలియన్ డాలర్ల(రూ.8,740 కోట్లు) సొమ్ము పొరపాటున ఖాతాల్లోకి వెళ్లిపోయింది. 2023లో అయితే 13 నియర్ మిస్ ఘటనలు జరిగాయి. -
నన్ను ప్రశంసించడానికి కాల్ చేస్తే.. రాంగ్ కాల్ అని పొరబడ్డా : సుధామూర్తి
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్ వస్తే రాంగ్ కాల్ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్ నడిపేవారు. దీన్ని అబ్దుల్ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
విలక్షణమైన రెస్టారెంట్: అక్కడ ఆర్డర్ తారుమారైనా పొరపాటు కాదు!
ఎన్నో రెస్టారెంట్లు చూసుంటారు. కానీ ఇలాంటి రెస్టారెంట్ చూసే అవకాశమే లేదు. ఎందుకంటే? ఎక్కడైన కస్టమర్ ఆర్డర్ చేసింది కాకుండా మరోకటి ఆర్డర్ తీసుకువస్తే..జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా రెస్టారెంట్‌నే క్లోజ్ అయ్యేలా గొడవ చేస్తారు కస్టమర్లు. కానీ ఇక్కడ ఆర్డర్ తప్పుగా తెచ్చిన సద్దుకుపోతారు కస్టమర్లు. పైగా రెస్టారెంట్‌కి జనాలు రావడం తగ్గించరు కూడా. అదేంటీ? అనిపిస్తుంది కదూ!. ఐతే ఆ రెస్టారెంట్ ఏంటో ఎక్కడ ఉందో చదివేయండి మరీ..! ఇదో విలక్షణమైన రెస్టారెంట్. జపాన్ రాజధాని టోక్యో పశ్చిమ శివార్లలో ఉందిది. దీని పేరు ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’. ఇక్కడ మీరు సుషి ఆర్డరిస్తే, మీ టేబుల్ మీదకు నూడుల్స్ రావచ్చు. నూడుల్స్ ఆర్డరిస్తే, సూప్ రావచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చేది ఒకటైతే, మీ టేబుల్ మీదకు వచ్చేది మరొకటి కావడం ఈ రెస్టారెంట్లో సర్వసాధారణం. ఒక్కోసారి మీరు ఆర్డరిచ్చిన ఐటెమ్స్ ఎంతసేపటికీ మీ టేబుల్ మీదకు రాకపోవచ్చు. ఏదైనా ఒక రెస్టారెంట్లో ఇంత అవకతవకగా సర్వీస్ ఉన్నట్లయితే, కస్టమర్లు గొడవలకు దిగుతారు. పద్ధతి మార్చుకోకపోతే, రెస్టారెంట్‌కు రావడమే మానేస్తారు. చివరకు రెస్టారెంట్ మూతబడే పరిస్థితి వస్తుంది. అయితే, ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’ మాత్రం విజయవంతంగా నడుస్తోంది. ఆర్డర్లు తారుమారైనా ఇక్కడకు వచ్చే కస్టమర్లు ఏమాత్రం పట్టించుకోరు. టేబుల్ మీదకు వచ్చిన దాంతోనే సర్దుకుపోతారు. ఒకటి ఆర్డరిస్టే, మరొకటి తీసుకొచ్చినందుకు సర్వర్లపై విరుచుకుపడరు. వారిని సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ సర్వర్లుగా పనిచేసేవారు వయోవృద్ధులు, పైగా డెమెన్షియా బాధితులు. అందువల్ల వారు ఆర్డర్లను తారుమారు చేసినా, కస్టమర్లెవరూ వారి మీద కోపగించుకోరు. డెమెన్షియా వల్ల మతిమరుపుతో బాధపడే వయోవృద్ధులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే షిరో ఒగుని అనే వ్యాపారవేత్త ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. (చదవండి: మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!) -
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?
తమిళనాడులోని పళనికి చెందిన రాజ్‌కుమార్ అనే డ్రైవర్‌కి ఉన్నట్టుండి తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు డిపాజిట్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 వేల కోట్ల జమ కావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తరువాత విషయం తెలుసి సంబరాలు చేసుకునేలోపే జరిగిన పరిణామానికి ఉసూరు మన్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలోని క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్ ఎదురైనా అనుభవం ఇది. ఇంతకీ ఏమైంది అంటే.. రాజ్‌కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి తన ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్ కావడంతో ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అతని ఖాతాలో రూ.105 మాత్రమే ఉంది. ఆ తరువాత ఇదేదో స్కాం అనుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఒకసారి టెస్ట్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. లావాదేవీపూర్తియిందా లేదా ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆశ్చర్యంగా.. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఇది నిజమేనని నిర్ధారించుకున్నాక ఎగిరి గంతేశాడు. కానీ అరగంటలోనే ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. మరుసటి రోజు ఉదయం తూత్తుకుడి బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని ఫ్రెండ్‌కి ట్రాన్సఫర్ చేసిన సొమ్ము మొత్తం అప్పగించాల్సిందేని డిమాండ్ చేశారు. దీంతో కంగు తిన్న రాజ్‌కుమార్ లాయర్లతో బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేశాడు. చివరికి రూ. 21 వేలను వాహనరుణంగా సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...: వీడియో వైరల్
స్మార్ట్ఫోన్లు ప్రజల జీవితంలో ఎంత పెద్ధ స్థానాన్ని ఆక్రమించాయో చెప్పనవసరం లేదు. ఫోన్ లేకపోతే మనుగడే లేదన్నంతగా వాటిపై ఆధారపడిపోయాడు. అంతేగాదు ఆ స్మార్ట్ఫోన్లతో ఏ చిన్న ఆనందాన్నైనా సెల్ఫీ అంటూ....వీడియోల్లో బంధించి ముచ్చటపడిపోతుంటాం. ఇటీవల కాలంలో ఈ సెల్ఫీల క్రేజ్ జనాల్లో మాములుగా లేదు. ఎంతలా ఉందంటే ప్రాణాంతకమైన ప్రదేశాల్లో సైతం సెల్ఫీలు దిగి ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నావారు కొందరైతే. మరికొందరూ సెల్ఫీ ఆనందంలో ఏం చేస్తున్నారో మరిచిపోయి విలువైన వస్తువులను పొగొట్టుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా సెల్ఫీ తీసకుంటూ ఆ ఆనందంలో ఫోన్‌ని విసిరేసి...అబ్బా! అంటూ తలపట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే...ఒక వ్యక్తి సరదాగా సముద్రంలో బోట్‌తో షికారు కొడుతుంటాడు. అతను బోట్లో నుంచుని ఒక చేతితో చేపను పట్టుకుని సెల్పీలు తీసుకుంటాడు. రకరకాల యాంగిల్స్‌లో.. వివిధ ఫోజులలో ఫోటోలు తీసుకున్నాడు. ఆ సెల్పీ ఆనందం అయిపోగానే చేపను పడవేయబోయి పొరపాటున ఫోన్‌ని సముద్రంలో విసిరేస్తాడు. దీంతో పాపం ఆ వ్యక్తి ఫోన్‌ని ఎలాగైనా పట్టుకోవాలని బోట్ వద్దకు వచ్చి వంగి తెగ ప్రయత్నిస్తాడు కూడా. కానీ దురదృష్టం అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగవైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి 😂 pic.twitter.com/i9aFrSYeRg — Tansu YEĞEN (@TansuYegen) September 11, 2022 (చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్) -
రిషి సునాక్ ‘తప్పు’: ఆడేసుకుంటున్న నెటిజన్లు, ఏం జరిగిందంటే
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో దూసుకుపోతున్న బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోషల్ మీడియాలోసంచలనంగా మారారు. అయితే రాజకీయంగా తన ప్రతిభను చాటుకోబోతున్నందుకు కాదు.. సోషల్ మీడియా పోస్ట్‌లో తప్పులో కాలేసిందుకు. అయితే ఈ సెటైర్లకు, విమర్శలకు కూల్‌గా సమాధానమిచ్చారు. ప్రధాని పదవికి సంబంధించిన పోటీ రెండో రౌండ్లో అత్యధిక ఓట్లను గెలుచుకుని టాప్‌లో ఉన్న రిషి తన ప్రచార బ్యానర్లో స్పెల్లింగ్ తప్పుగా రాయడంతో నెటిజన్లు సునాక్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తన మొదటి టెలివిజన్ డిబేట్ సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ట్విటర్లో ‘క్యాంపెయిన్’ స్పెల్లింగ్‌ను తప్పుగా రాయడంతో ఆయన నెటిజన్లుకు దొరికియారు. పలు కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా గూగుల్ ట్రెండింగ్‌లో కూడా సునాక్ పేరు నిలిచింది. అవ్వడానికి బిలియనీర్..కానీ క్యాంపెయిన్ అనే పదాన్ని సరిగ్గా రాయలేకపోయారని ఒక యూజర్ కమెంట్ చేశారు. మరోవైపు వీటిపి రిషి సునాక్ స్పందించారు..తన స్లోగన్ రడీ ఫర్ రిషిలా...రడీ ఫర్స్పెల్ చెక్ అంటూ హుందాగా సమాధామిచ్చారు. కాగా బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతోంది. మొదటి రౌండ్లో నాలుగింట ఒక వంతు ఓట్లను సాధించి, రెండో రౌండ్లో మూడు అంకెలకు పైగా సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ప్రచారంలో భాగంగా మిగిలిన ప్రత్యర్థులు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టోరీ బ్యాక్ బెంచర్ టామ్ తుగెన్ధాట్లతో వారాంతపు టెలివిజన్ డిబేట్లలో పాల్గొననున్నారు రిషి. Slick https://t.co/OXNLfiwNul — Guido Fawkes (@GuidoFawkes) July 15, 2022 When people ask me why I'm supporting @RishiSunak for leader, here's why: Not only does he have the right skills and experience to be our next PM, but the right character, too. He's a thoroughly decent person - as this clip from last night's debate shows...#Ready4Rishi pic.twitter.com/oP8F15tJOg — Nigel Huddleston MP (@HuddlestonNigel) July 16, 2022 -
పోర్న్ వీడియో? ట్విటర్ తప్పులో కాలు
సాక్షి, న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్ తప్పులో కాలేసింది. ఐఫోన్ 12 మినీ వీడియోను అప్లోడ్ చేసినందుకు ఒక యూజర్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వీడియోను పోర్న్ వీడియోగా పొరబడి అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో సదరు లబోదిబోమన్నాడు. వివరాల్లో వెళ్లితే నిఖిల్ చావ్లా అనే యూజర్, ఐఫోన్ 12 మినీ వీడియో టీజర్‌ను తన ట్విటర్ ఖాతాలో అప్లోడ్ చేశాడు. అంతే పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత అతని ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ ఉందంటూ ఈ వీడియోను తొలగించింది. ఆ తరువాత ఖాతాను అన్‌లాక్ చేసి, అభ్యంతరమైన, అశ్లీల కంటెంట్‌ను తొలగించడమో,రిపోర్ట్ చేయడమో చేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చేలోపే తన అకౌంట్‌ను మరో 24 గంటలు బ్లాక్ చేశారని వాపోయాడు. చివరకు ట్విటర్ పాలసీ టీంను సంప్రదించి తన ఖాతా అన్‌లాక్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే యూజర్ పోస్ట్ చేసిన ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో కంటెంట్‌ను ట్విటర్ అల్గోరిథం అభ్యంతరకరమైందిగా గుర్తించిందని ట్విటర్ తెలిపింది. ఇలాంటి వాటిని నిరోధించేందుకు వినియోగదారులు సేఫ్టీ సెటింగ్స్‌లో మీడియా సెన్సెటివ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది. Working with the @Twitter @Policy team to get our founder @nikhilchawla’s account back with the iPhone 12 Mini video tweet that was erroneously marked as intimate content. We have filed an appeal! @TwitterIndia @manishm @keyamadhvani @jack Thank you all for your support! pic.twitter.com/ZgKiJtOzmL — The Unbiased Blog (@TheUnbiasedBlog) January 5, 2021 -
భారీ తప్పిదం : వేల కోట్లు మళ్లిపోయాయి
న్యూయార్క్ : అతిపెద్ద బ్యాంకు సిటీబ్యాంక్ ఒక చిన్న తప్పు కారణంగా భారీ వివాదంలో చిక్కుకుంది. న్యూయార్క్ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న క్లరికల్ తప్పిదం కారణంగా ఏకంగా 900 మిలియన్ డాలర్లు (సుమారు 6700 కోట్ల రూపాయలు) ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇపుడు ఈ సొమ్మును రాబట్టుకునేందుకు సిటీ గ్రూపు నానా కష్టాలు పడుతోంది.తాజా నివేదిక ప్రకారం కొంత డబ్బును బ్యాంక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రముఖ కాస్మొటిక్ కంపెనీ రెవ్లాన్ వివాదానికి దారి తీసింది. ఈ ఊహించని పరిణామంతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఇరుక్కున్న రెవ్లాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది. అంతేకాదు కంపెనీ మొత్తం బకాయిలకు ఈమొత్తానికి సమానం కావడం మరింత ప్రకంపనలు పుట్టించింది. ఈ పొరపాటు సిటిగ్రూప్ను చాలా కాలం పాటు వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్, సుమారు బిలియన్ డాలర్ల మేరకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై దావా వేసింది. ఈ కేసులో సిటీ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిగేడ్, హెచ్‌పీఎస్, సింఫనీతో సహా రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. తమకు అందిన సొమ్ము రుణానికి, వడ్డీకి సమానమని వాదిస్తున్నాయి. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఇది ఈ శతాబ్దానికే అతి పెద్ద తప్పిదమంటూ దివాలా సలహాదారు మైఖేల్ స్టాంటన్ విమర్శించారు. అయితే ఈ పరిణామంపై సిటీ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. అటు అసలు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్ తెగేసి చెప్పింది. -
నీళ్లనుకుని లైజాల్ తాగి...
సాక్షి, తెనాలి: నీళ్లనుకుని లైజాల్ (యాసిడ్) తాగి మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన జంపాని అక్కమ్మ (50) పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో, తెనాలి మండలం అంగలకుదురులోని చెల్లి వెంకటేశ్వరమ్మ వద్ద ఉంటోంది. మానసిక రుగ్మతతో బాధపడే ఆమె ఇళ్లలో పనులకు వెళ్తుంటుంది. ఒంట్లో నలతగా ఉండడంతో రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. తాగునీరనుకుని ఫ్లోర్‌ను కడిగేందుకు వాడే లైజాల్‌ను తాగింది. వాంతులు చేసుకుంటుండడంతో కుటుంబసభ్యులు గమనించారు. తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నోరు జారిన అమిత్ షా!
-
సెలక్ట్ అయ్యారంటూ మెయిల్.. అంతలోనే
బఫేలో, న్యూయార్క్: ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 5000 మంది విద్యార్థులకు సెలక్ట్ అయినట్టుగా యూనివర్సిటీ నుంచి మెయిల్లు అందాయి. అయితే కొద్ది సేపట్లోనే.. తూచ్ అంటూ మరో మెయిల్.. విషయమేంటంటే ముందు వచ్చిన మెయిల్ తప్పంటూ దాని సారంశం. దీంతో సెలక్ట్ అయ్యామన్న ఆనందం విద్యార్థుల్లో కొద్ది సేపైనా లేకుండా పోయింది. ఇంత పెద్ద తప్పిదం చేసింది ప్రపంచంలోనే మేటి యూనివర్సిటీలలో ఒకటైన ది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్(యూనివర్సిటీ అట్ బఫేలో ). తమ యూనివర్సిటీలో అడ్మిషన్లకోసం దరఖాస్తు చేసుకున్న 5000 మంది విద్యార్థులకు యాక్సెప్టెన్సీ మెయిల్స్ పంపింది. అయితే పొరపాటున దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించక ముందే సెలక్ట్ అయినట్టుగా మెయిల్స్ పంపామని యూనివర్సిటీ అధికార ప్రతినిధి జాన్ డెల్లా తెలిపారు. తప్పిదాన్ని గుర్తించి మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే విద్యార్థులను క్షమాపణ కోరుతూ మరో మెయిల్ పంపామని జాన్ పేర్కొన్నారు. అప్లికేషన్ డేటాబెస్ నుంచి తప్పుగా ఈమెయిల్స్ లిస్ట్ జనరేట్ అవ్వడం వల్లే ఈ తప్పిదం జరిగిందని యూనివర్సిటీ అట్ బఫేలో అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే తప్పుగా ఈ మెయిల్స్ వచ్చిన వారిలోనూ.. తమ యూనివర్సిటీలో దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ యూనిర్సిటీలో 30,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.