ఎన్నో రెస్టారెంట్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి రెస్టారెంట్ చూసే అవకాశమే లేదు. ఎందుకంటే? ఎక్కడైన కస్టమర్ ఆర్డర్ చేసింది కాకుండా మరోకటి ఆర్డర్ తీసుకువస్తే..జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా రెస్టారెంట్‌నే క్లోజ్ అయ్యేలా గొడవ చేస్తారు కస్టమర్లు. కానీ ఇక్కడ ఆర్డర్ తప్పుగా తెచ్చిన సద్దుకుపోతారు కస్టమర్లు. పైగా రెస్టారెంట్‌కి జనాలు రావడం తగ్గించరు కూడా. అదేంటీ? అనిపిస్తుంది కదూ!. ఐతే ఆ రెస్టారెంట్ ఏంటో ఎక్కడ ఉందో చదివేయండి మరీ..!
ఇదో విలక్షణమైన రెస్టారెంట్. జపాన్ రాజధాని టోక్యో పశ్చిమ శివార్లలో ఉందిది. దీని పేరు ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’. ఇక్కడ మీరు సుషి ఆర్డరిస్తే, మీ టేబుల్ మీదకు నూడుల్స్ రావచ్చు. నూడుల్స్ ఆర్డరిస్తే, సూప్ రావచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చేది ఒకటైతే, మీ టేబుల్ మీదకు వచ్చేది మరొకటి కావడం ఈ రెస్టారెంట్‌లో సర్వసాధారణం. ఒక్కోసారి మీరు ఆర్డరిచ్చిన ఐటెమ్స్ ఎంతసేపటికీ మీ టేబుల్ మీదకు రాకపోవచ్చు. ఏదైనా ఒక రెస్టారెంట్‌లో ఇంత అవకతవకగా సర్వీస్ ఉన్నట్లయితే, కస్టమర్లు గొడవలకు దిగుతారు. పద్ధతి మార్చుకోకపోతే, రెస్టారెంట్‌కు రావడమే మానేస్తారు.
చివరకు రెస్టారెంట్ మూతబడే పరిస్థితి వస్తుంది. అయితే, ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’ మాత్రం విజయవంతంగా నడుస్తోంది. ఆర్డర్లు తారుమారైనా ఇక్కడకు వచ్చే కస్టమర్లు ఏమాత్రం పట్టించుకోరు. టేబుల్ మీదకు వచ్చిన దాంతోనే సర్దుకుపోతారు. ఒకటి ఆర్డరిస్టే, మరొకటి తీసుకొచ్చినందుకు సర్వర్లపై విరుచుకుపడరు. వారిని సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ సర్వర్లుగా పనిచేసేవారు వయోవృద్ధులు, పైగా డెమెన్షియా బాధితులు. అందువల్ల వారు ఆర్డర్లను తారుమారు చేసినా, కస్టమర్లెవరూ వారి మీద కోపగించుకోరు. డెమెన్షియా వల్ల మతిమరుపుతో బాధపడే వయోవృద్ధులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే షిరో ఒగుని అనే వ్యాపారవేత్త ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.
(చదవండి: మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!)
Comments
Please login to add a commentAdd a comment