అనగనగా జపాన్‌లో ‘షచిభొకయ–యా’ అనే రెస్టారెంట్ ఉంది. నాగోయ నగరంలో ఉన్న ఈ రెస్టారెంట్‌కు రుచుల కోసం కాదు చెంపదెబ్బల కోసం కస్టమర్‌లు క్యూ కట్టేవారు. రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టగానే కస్టమర్ చెంప చెళ్లుమనిపిస్తుంది వెయిటర్. ఈ రెస్టారెంట్‌లో ఒక లేడి వెయిటర్ కస్టమర్ చెంప చెళ్లుమనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘ఇదెక్కడి చోద్యమమ్మా ’ అని ప్రపంచం బిత్తరపోతుండగానే రెస్టారెంట్ వాళ్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేశారు. ‘మా రెస్టారెంట్‌లో ప్రస్తుతం చెంపదెబ్బలు లేవు. రెస్టారెంట్‌కు రావడానికి ముందు ఈ విషయాన్ని గమనించాలని మనవి’ అనేది ఆ ప్రకటన సారాంశం.
పబ్లిసిటీ కోసం చెంపదెబ్బల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారా? లేక దీని వెనుక ‘ఈ రెస్టారెంట్‌లో చెంపదెబ్బ తింటే కలిసి వస్తుంది’ అనే సెంటిమెంట్ దాగుందా అనేది తెలియదుగానీ రుచులతో సంబంధం లేకుండానే ఈ రెస్టారెంట్ పేరు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం అయింది.
ఈ రెస్టారెంట్‌లో చెంపదెబ్బలు వడ్డిస్తారు!
Published Sun, Dec 10 2023 4:24 AM | Last Updated on Sun, Dec 10 2023 3:22 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment