slaps
-
కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సునిల్ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. శుక్రవారం పుణె కంటోన్మెంట్‌లోని సస్సూన్ జనరల్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెల్యే సునిల్ కాంబ్లే హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి కానిస్టేబుల్ ఎదురయ్యారు. దీంతో, ఎమ్మెల్యే ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. శనివారం బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే కాంబ్లే ఘటనపై స్పందిస్తూ.. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానంతే’అని చెప్పారు. -
ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు!
అనగనగా జపాన్‌లో ‘షచిభొకయ–యా’ అనే రెస్టారెంట్ ఉంది. నాగోయ నగరంలో ఉన్న ఈ రెస్టారెంట్‌కు రుచుల కోసం కాదు చెంపదెబ్బల కోసం కస్టమర్లు క్యూ కట్టేవారు. రెస్టారెంట్లోకి అడుగు పెట్టగానే కస్టమర్ చెంప చెళ్లుమనిపిస్తుంది వెయిటర్. ఈ రెస్టారెంట్లో ఒక లేడి వెయిటర్ కస్టమర్ చెంప చెళ్లుమనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఇదెక్కడి చోద్యమమ్మా ’ అని ప్రపంచం బిత్తరపోతుండగానే రెస్టారెంట్ వాళ్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేశారు. ‘మా రెస్టారెంట్లో ప్రస్తుతం చెంపదెబ్బలు లేవు. రెస్టారెంట్‌కు రావడానికి ముందు ఈ విషయాన్ని గమనించాలని మనవి’ అనేది ఆ ప్రకటన సారాంశం. పబ్లిసిటీ కోసం చెంపదెబ్బల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారా? లేక దీని వెనుక ‘ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బ తింటే కలిసి వస్తుంది’ అనే సెంటిమెంట్ దాగుందా అనేది తెలియదుగానీ రుచులతో సంబంధం లేకుండానే ఈ రెస్టారెంట్ పేరు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం అయింది. -
కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP — Naveena (@TheNaveena) October 6, 2023 -
గ్రామ సర్పంచ్ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
అల్లుడు బైక్ అడిగినందుకు చెప్పుదెబ్బలతో సాగనంపిన మామ
-
భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ యునికార్న్ భారత్‌పే-తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై క్రిమినల్ కేసు, సివిల్ దావా దాఖలు చేసింది. మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై రూ. 88.67 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని భారత్ పే డిమాండ్ చేసింది. ఇది చదవండి: రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్ దాదాపు 2,800 పేజీల ఫిర్యాదులో భారత్‌పే గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. నకిలీ బిల్లుల చెల్లింపు, కంపెనీకి సేవలు అందించడానికి కల్పిత విక్రేతల సృష్టి, రిక్రూట్మెంట్ కోసం కంపెనీకి అధిక చార్జీ వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు గ్రోవర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానాలు చెప్పాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా పడింది. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నైపథ్యం ఇదీ.. నైకా ఐపీఓ కోసం నిధులను పొందడంలో విఫలం కావడానికి సంబంధించి కోటక్ గ్రూప్ ఉద్యోగిపై గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ అనుచిత పదజాలం ఉపయోగించి, బెదిరించిన కేసులో ఈ సంవత్సరం ప్రారంభంలో నాలుగు సంవత్సరాల భారత్‌పే వార్తల్లో నిలిచింది. ఈ పరిస్థితిల్లో సంస్థ కార్పొరేట్ పాలన సమీక్షను నిర్వహించడానికి, గ్రోవర్ ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడో లేదో తెలుసుకోవడానికి అల్వారెజ్ మార్సల్, శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్, పీడబ్ల్యూసీలను భారత్‌పే నియమించింది. ఇది మార్చిలో కంపెనీ, ఆ సంస్థ బోర్డు నుండి గ్రోవర్, ఆయన భార్య తొలగింపునకు దారితీసింది. వారితోపాటు దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉద్యోగులందరిపై చర్యలు తీసుకో వాలని సంస్థ నిర్ణయించింది. అష్నీర్ గ్రోవర్ నిరోధిత షేర్లను వెనక్కి తీసుకోవడంసహా, ఆయన పా ల్పడిన అవకతవకలపై చర్యలకూ ఉపక్రమించింది. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు -
వైరల్ వీడియో.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలుసా!
ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు మహిళలు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. నాసిక్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. మాటమాట పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. టోల్ సిబ్బంది, కారులోని మహిళ రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. టోల్ ఫీజు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా కారులోని మహిళ బయటకు దిగి టోల్గేట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగి చేతులను మెలితిప్పి దాడి చేసింది. దీంతో సిబ్బంది కూడా మహిళపై ఘర్షణకు దిగింది. ఇద్దరూ మరాఠీలో తిట్టుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. నడిరోడ్డుపై ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని చెంపలు వాయించుకున్నారు. ఇంత జరుగుతుంటే అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారే గానీ ఆపేందుకు ప్రత్నించలేదు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. नासिक में कल शाम एक टोलबूथ पर हुआ हंगामा। टोल भरने को लेकर हुए विवाद पर 2 महिला आपस में भिड़ गई। @iamvinodjagdale #maharastra #WATCH pic.twitter.com/mAEHARg33l — News24 (@news24tvchannel) September 15, 2022 -
కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకున్న శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన ఫుడ్ కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకుని, దుర్భాషలాడుతున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహరాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా భాగంగా కూలలీలకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో తానే స్యయంగా పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. అంతేకాదు కూలీలకు నాశిరకం భోజనం అందిస్తున్న సదరు మేనేజర్ పై చేయి చేసుకుని, గట్టిగా చివాట్లు పెట్టారు. ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన పార్టీలో చేరారు. శివ సేన నాయకత్వం ఆయనను హింగోలి ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు గతంలో సంతోష్ బంగర్ ఓ వైరల్ వీడియోలో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అధ్యక్షతన తిరుబాటు చేసిని ఎమ్మెల్యేలను తిరిగి వచ్చేయండి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మిమ్మల్ని క్షమిస్తాడంటూ వార్తల్లో నిలిచారు. (చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా..) -
రిక్షా డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ: వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్: చిన్నప్రమాదానికి పెద్ద రాద్ధాంతం చేసింది నోయిడాలోని ఒక మహిళ. నోయిడాలోని ఒక రిక్షా డ్రైవర్ ఆమె కారు పైకి పొరపాటున తన రిక్షాని పోనిచ్చాడు. అంతే ఒక్కసారిగా ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. సదరు రిక్షా డ్రైవర్ కాలర్ పట్టుకుని లాక్కెళ్లుతూ దుర్భాషలాడింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని పదేపదే చెంపదెబ్బలు కొట్టడం ప్రారంభించింది. అతని జేబులోంచి డబ్బులు కూడా లాక్కొని అదేపనిగా చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు రికార్డు చేయడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు సదరు మహిళని కిరణ్ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. Incident from NOIDA: A WOMAN slapped a poor e-rickshaw driver. 17 slaps in less than 90 seconds, she constantly kept abusing the poor e-rickshaw wala. #PurushAayog demands strict action against the woman for taking law in her hand !!@noidapolice#DomesticViolenceOnMen pic.twitter.com/u2VbarbNW9 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) August 13, 2022 (చదవండి: కారుపై 'హర్ ఘర్ తిరంగ' థీమ్‌తో హల్చల్ చేస్తున్న యువకుడు) -
ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
ఓ కాలేజీ ప్రిన్స్‌పాల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా.. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ సరైన సమాధానం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్‌పాల్.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో, సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone This happens when power goes to head Shame😈 pic.twitter.com/8RTCCud8Mo — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022 ఇది కూడా చదవండి: సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు -
పెళ్లి పీఠలపైనే పెళ్లి కూతుర్ని చితకొట్టిన పెళ్లి కొడుకు..!!
-
వైరల్ వీడియో: పెళ్లిలో వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు
ఇటీవల సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోల్లో దాదాపు పెళ్లికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని డ్యాన్స్, ఎంజాయ్‌మెంట్‌తో సరదాగా ఉంటే మరికొన్ని పెళ్లిని పెటాకులు చేసే సీరియస్ వీడియోలూ ఉన్నాయి. తాజాగా పెళ్లిలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కోపంతో ఊగిపోయిన వరుడు ఒక్కసారిగా వధువు చెంపపై లాగి ఒకటిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి అనంతరం దండలు మార్చుకునే సందర్భంలో వరుడు, వధువు ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ఇంతలో వుధువుకి వరుడు స్వీట్ తినిపిస్తుండగా.. ఆమె నిరాకరించింది. దీంతో అతను స్వీట్‌ను కోపంతో పెళ్లి కూతురు ముఖంపై విసిరాడు. పెళ్లి కొడుకు చేసిన పనికి కోపం తెచ్చుకున్న వధువు కూడా స్వీట్స్‌ను అతని ముఖంపై విసిరింది. ఇంకేముంది ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న వరుడికి ఆవేశం మరింత ఎక్కువై అతిథులందరి ముందే పెళ్లి కూతురి చెంపచెళ్లుమనిపించాడు. చదవండి: అక్కడ యాక్సిడెంట్ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే! ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు గానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్టు చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 23వేల లైకులు, 1500 కామెంట్లు వచ్చి చేరాయి. అయితే కొంతమంది వీడియోను చూసి నవ్వుకుంటుంటే మరికొంతమంది వధువును కొట్టే అధికారం వరుడికి లేదంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో -
కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
సాక్షి, రాయచూరు రూరల్ (కర్ణాటక): మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డిని అరెస్ట్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర న్యాయ సలహాదారుడు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారని, ఈ ఘటన జరిగిన ఐదు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు . కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్య ఆధ్వర్యంలో నవంబరు 3న జరిగిన నిరసన కార్యక్రమంలో సదరు మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి రెచ్చిపోయాడు. ఏకంగా .. కానిస్టేబుల్ రాఘవేంద్రను పట్టుకుని దూశించాడు. అంతటితో ఆగకుండా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే ఎమ్మెల్యేపై తగిన చర్యలు కోవాలని రామన్న అధికారులను కోరారు. చదవండి: పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి.. -
పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్!
పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకుంటారు. కానీ అన్ని అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు పెళ్లిలో ఊహించని సంఘటనలు సైతం జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపం మీద వధూవరులు కూర్చొని ఉండగా వారి చుట్టూ బంధువులు చేరారు. అప్పటి వరకు అంతా ఉత్సాహంగా ఉన్న కార్యక్రమంలో ఒక్కసారిగా వధువు ముఖం కోపంగా పెట్టింది. చదవండి: మొబైల్ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో దీనికి కారణం తనకు కాబోయే భర్త పొగాకునములుతున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో ఏమాత్రం ఆగకుండా ఆగ్రహంతో వరుడి చెంపచెల్లుమనిపించింది. అతనితోపాటు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని సైతం కొట్టింది. పెళ్లి కూతురు చర్యతో కంగుతున్ని వరుడు వెంటనే అక్కడి నుంచి లేచి నోటిలోని పొగాకును ఉమ్మేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవ్వడంతో వధువు చర్యను ప్రశంసిస్తున్నారు. పెళ్లి పీటలపై పొగాకు తింటున్న వరుడిపై మండిపడుతున్నారు. అయితే ఇది నిజంగా జరిగిందా లేక కావాలనే చేశారా అన్నది మాత్రం తెలియరాలేదు. చదవండి: 8 కేజీల వెడ్డింగ్ లెహంగాతో వధువు పుష్ అప్స్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
అధికారులపై మహిళ వీరంగం
-
నో మాస్క్: అధికారులపై మహిళ వీరంగం..జుట్టు పట్టుకొని!
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి.. అంటే దాదాపు ఏడాదిన్నరగా మాస్కు ధరించడం, భౌతిక దూరం అనివ్యార్యమైపోయింది. వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారిని అడ్డుకునేందుకు కోవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి అయ్యింది. కరోనా తగ్గినట్లే తగ్గి కొత్త కొత్త అవతారాల్లో పుట్టుకొస్తుంది. అందుకే మాస్క్ ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న వారిపై ఇప్పటికీ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరిలో మార్పు రావడం లేదు. మొండి వైఖరి వీడకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాక కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మాస్క్ ధరించమని అడగిన అధికారులపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. పీరాగారి మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలను ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. మాస్క్ లేనందుకు జరిమానా కట్టాలని చలాన్ విధించారు. దీంతో మహిళలకు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత ఇద్దరిలో ఓ మహిళా.. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి తెగబడింది. చెంపదెబ్బలు కొడుతూ, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అధికారుల జుట్టు పట్టుకొని వీరంగం సృష్టించింది. ఆమెను ఆపేందుకు అక్కడి వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అతడి చెంప పగలకోడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్
ఆమిర్ ఖాన్ స్టోర్స్ డ్రామా ‘దంగల్’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఫాతిమా సనా షేక్. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఫాతిమా సన. ఓ సారి తాను ఓ ఆగంతకుడి చెంప పగలకొట్టాని.. అయితే అతడు తిరిగి తనను కొట్టాడని తెలిపారు సన. దీని గురించి సనా మాట్లాడుతూ.. ‘‘ఓ సారి జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ వ్యక్తి నా వైపు రావడం గమనించాను. అప్పటికే అతడు కాస్త తేడాగా అనిపించాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడు వెంటే వచ్చాడు’’ అని తెలిపారు. ‘‘నేను ఆగి ‘ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు’ అని అతడిని ప్రశ్నించాను. అందుకతడు ‘అది నా ఇష్టం’ అన్నాడు. వెంటనే నేను కోపంతో ‘తన్నులు తినాలని ఉందా ఏంటి’ అన్నాను. దానికతడు ‘కొట్టు’ అన్నాడు. అప్పటికే నా ఓపిక నశించింది. దాంతో అతడిని కొట్టాను. వెంటనే అతడు తిరిగి నన్ను కొట్టాడు. నేను మా నాన్నని పిలిచాను. ఆయన నా సోదరుడితో పాటు అతడి ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నేను జరిగిన విషయం చెప్పాను. వెంటనే మా నాన్న, మిగతవారు నన్ను కొట్టిన అతడిని పట్టుకునేందుకు పరిగెత్తారు. కానీ అతడు దొరకలేదు’’ అని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తాను ఎన్నో చేదు అనుభవాలని ఎరదొర్కాన్నాని.. చాలా మంది దర్శకులు తమతో గడిపితేనే అవకాశాలు ఇస్తామన్నారని తెలిపారు ఫాతిమా సన. చాలా సార్లు తనకు వచ్చిన అవకాశాలను తిరిగి తీసుకున్నారని వెల్లడించారు. ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా తను తాను నిరూపించుకున్నాను అన్నారు ఫాతిమా సన. చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’ -
కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి
సాక్షి, న్యూఢిల్లీ : తనను అనుచితంగా తాకి, ,లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని చీల్చి చెండాడేసిందో యువతి. తన వర్క్‌ప్లేస్‌కు నడుచుకుంటూ పోతుండగా కీచకుడు రెచ్చిపోయాడు. నలభైఏళ్ల ప్రబుద్ధుడు అదను చూసి తన దుష్టబుధ్దిని చాటుకున్నాడు. అంతే.. కడుపు రగిలిన ఆమె అతడిని దొరకబుచ్చుకుని రఫ్పాడించింది. నోయిడాలోని సహారా రెడ్ లైట్ సమీపంలో శుక్రవారం (మార్చి 12) ఈ సంఘటన జరిగింది. వివరాలను పరిశీలిస్తే నోయిడా సెక్టార్ 12 లోని పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న యువతి తన ప్లేస్‌కు వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తోంది. ఇంతలో కారు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించుకుని ముందుకు పోతున్న సమయంలో ఎప్పటినుంచో ఆమెను గమనిస్తున్న వ్యక్తి సైకిల్ వచ్చి ఆమె ఛాతీపై తాకి ఉడాయించాడు. దీంతో క్షణం షాకైనా.. వెంటనే తేరుకుని సివంగిలా మారిపోయింది. వెంబడించి,వెంటాడి అతడి చొక్కాపట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి పడేసింది. ఆనక తీరిగ్గా సదరు వ్యక్తి క్షమాపణ చెప్పినా వదల్లేదు. ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదని ఆమె పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కానీ ఎపుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, వేధింపులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారని ఆమె చెప్పారు. కొంతమంది బాటసారులు అక్కడ గుమిగూడినా, ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని వాపోయారు. అయితే ఇలాంటి దుశ్చర్యలను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు నోయిడా అడిషనల్ డీసీపీ రణవిజయ్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేయాల్సిందిగా బాధిత మహిళను కోరారు. ఈ మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. -
లైవ్‌లో నటుడి చెంప చెళ్లుమనిపించింది
హిందీ నటులు షెహనాజ్ గిల్-సిధార్థ్ శుక్లా.. బిగ్‌బాస్-13తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్దరు తారలు.. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సిద్నాజ్’ పేరుతో లైవ్ సెషన్ నిర్వహించారు. సిద్నాజ్కు ఉన్న అభిమానుల గురించి మాట్లాడారు. ఈ వీడియోలో సిధార్థ్ లైవ్‌లో తమను ప్రత్యక్షంగా చూస్తోన్న అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘చూడండి మేం ఇద్దరం కలిసే ఉన్నాం. మరి మీరు దేని గురించి గొడవ పడుతున్నారు.. ఆందోళన చెందుతున్నారు’ అని అడిగారు. అంతేకాక కొందరు కావాలనే ద్వేషాన్ని ప్రచారం చేస్తారని.. అలాంటి వారిని పట్టించుకోవద్దని కోరారు. సిధార్థ్ ఇలా మాట్లాడుతుండగా అతని పక్కనే ఉన్న షెహ్నాజ్ అతడి చెంప మీద కొట్టింది. వెంటనే అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘సీరియస్‌గా కాదు. ట్రోల్ చేసేవారికి మీరు ఇలానే సమాధానం చెప్పండి’ అన్నది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. (చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్) View this post on Instagram Always positive like #sidnaaz ❤❤ . . . #sidnaaz #shehnaazgill #sidharthshukla #sidnaazforever💕💕 #sidnaazfam🌹💫 #stayblessed #stayhappy @realsidharthshukla @shehnaazgill A post shared by H€artb£@t_$idnaaz (@sidnaazmerijnn) on Aug 1, 2020 at 8:13pm PDT షెహ్నాజ్-సిధార్థ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీళ్లు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని ఇప్పటికే చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షెహ్నాజ్ తన ప్రేమను వ్యక్తపరిచినా.. సిధార్థ్ మాత్రం తాము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్నాడు. -
మహిళా మేయర్‌పై చేయి చేసుకున్న బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీజేపీ నేత ఒకరు మాజీ మహిళా మేయర్‌పై చేయి చేసుకున్నారు. పార్టీ కార్యాలయం ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వివరాలు.. బీజేపీ మెహ్రౌలీ అధ్యక్షుడు ఆజాద్ సింగ్.. దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్, తన భార్య అయిన సరితా చౌదరిపై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పార్టీ సీనియర్ నాయకులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఆజాద్ సింగ్, అతని భార్య కూడా హాజరయ్యారు. అయితే ఈ దంపతులు మధ్య గత కొన్నేళ్లుగా విడాకులు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పార్టీ సమావేశానికి హాజరైన వీరు ఏదో విషయం గురించి గొడవపడ్డారు. అది కాస్తా ముదిరి చేయి చేసుకునే వరకు వెళ్లింది. .@BJP4Delhi leader Azad singh slaps his wife inside Delhi BJP HQ, complaint registered. @ManojTiwariMP @RSSorg @geetv79 @priyankagandhi pic.twitter.com/wM3mou3PmC — Simran Kaur (@simran100kaur1) September 19, 2019 దీని గురించి ఆజాద్ మాట్లాడుతూ.. ‘నా భార్యే మొదట నాతో గొడవపడటం ప్రారంభించింది. తనే నా మీద దాడి చేసింది.. దాంతో నన్ను నేను కాపాడుకోవడం కోసం ఆమెను తోసేశాను’ అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుతూ... ‘ఇది భార్యభర్తల విషయం. దీనికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వారి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు జవదేకర్ అక్కడ లేరు. ఆజాద్ దంపతులు కూడా ఇలా బహిరంగంగా కొట్టుకుంటారని అనుకోలేదని’ తెలిపారు. దీని గురించి పోలీసులను సంప్రదించగా.. ఆ విషయం గూర్చి తమకు తెలియదని.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
రిలయన్స్ ఇన్ఫ్రా మరో భారీ డిఫమేషన్
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూపు మరోసారి భారీ డిఫమేషన్ సూట్‌ను దాఖలు చేసింది. రాఫెల్ డీల్ పై అవాస్తవాలను, అబద్ధాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఇటీవల ఎన్డీటీవీ పై 20వేల కోట్ల రూపాయల దావా వేసిన అనిల్ రిలయన్స్ గ్రూపు ఇపుడు మరో మీడియా సంస్థను టార్గెట్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ది సిటిజెన్ వ్యవస్థాపకుడు-సంపాదకుడు సీమా ముస్తఫాకు వ్యతిరేకంగా 7వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. రాఫెల్ ఒప్పందంలో తమ కవరేజ్ నేపథ్యంలో తమపై ఈ దావా నమోదైనట్టు సిటిజెన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తమకు మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అంబానీ అరోపణలను తిరస్కరించిరన సిటిజన్ తాము వాస్తవాలకు కట్టుబడి నిజాలను నిర్భీతిగా ప్రజలకు అందించేందుకు, నిజాయితీ, జవాబుదారీతనం, సమగ్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. అలాగే రాజకీయ లేదా కార్పొరేట్ నిధులు లేని స్వతంత్ర మీడియా జర్నలిజం భవిష్యత్తు కీలకమైనదని విశ్వసిస్తున్నామని పేర్కొంది. -
ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో రూ.59 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు మార్చి 26, 2018న ఆర్బీఐ ఒక నోటీసు జారీ చేసింది. సెక్యూరిటీల అమ్మకంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించినందుకు బ్యాంకుపై ఈ పెనాల్టీ విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47ఏ (1) (సి) లోని నిబంధనల ప్రకారం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు/మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ చర్య బ్యాంక్ వినియోదారులను ప్రభావితం చేయదని తెలిపింది. ఆర్బీఐ హెచ్‌టీఎమ్ పోర్ట్ ఫోలియో నుంచి నేరుగా సెక్యూరిటీల అమ్మకాలపై ఐసీఐసీఐ బ్యాంకునకు రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. ఈ కేటగిరి కింద మొత్తం పెట్టుబడులు బ్యాంకు మొత్తం పెట్టుబడిలో 24శాతాన్ని మించకూడదు. కాగా ఇటీవల వివిధ నిబంధనల ఉల్లంఘనలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లకు ఆర్బీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఆమెను వ్యభిచారి అన్నారు.. కేసు పెట్టాం
-
ఆమెను వ్యభిచారి అన్నారు.. కేసు పెట్టాం
సాక్షి, చెన్నై : బీజేపీకి చెందిన మహిళా నేత ఒకరు ఆలయంలో అనుచితంగా ప్రవర్తించారు. కరపత్రాలను పంచుతున్న కొంతమంది రైతులపైనా, వారి నాయకుడిపైనా చెప్పుతో దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కారు. పైగా ఆమె దాడి చేయడమే కాకుండా తనకు ఇబ్బంది కలిగించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ చిర్రుబుర్రులాడారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోగల ఆలయానికి నెళ్లయమ్మాల్ అనే ఆ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వచ్చారు. అదే సమయంలో కొంతమంది రైతుల అసోసియేషన్ అదే ఆలయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు. జన్యుపరమైన మార్పులు చేసే వ్యవసాయాన్ని కేంద్రం ఆధరించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రాలు ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నెళ్లయమ్మాల్ వారితో వాగ్వాదానికి దిగారు. వారిపై దుర్భాషలాడారు. ఆ రైతులంతా కూడా పెద్ద వయసులో ఉన్నారని కూడా చూడకుండా తన చెప్పును తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. మున్ముందు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటావని కూడా ఆమె ఆ రైతు నాయకుడిని బెదిరించారు. అయితే, ఆ రైతులపై కేసులు నమోదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర విభాగం చెప్పింది. రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను ఆమెను వ్యభిచారి అంటూ దుర్భాషలాడారని, అందుకే అక్కడ పరిణామాలు చోటు కేసుకున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది. -
రిలయన్స్ అధినేతకు భారీ షాక్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదంలో ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి భారీ పరిహారాన్ని విధించింది. ఈ వివాదంలో 1.55 బిలియన్ డాలర్లు( సుమారు 10వేల312 కోట్లు) జరిమానా విధించింది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్-జీసీ -రిలయెన్స్ సంస్థకు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ మధ్య నడుస్తున్న గ్యాస్ వివాదంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా కేజీ బేసిన్లో సహజవాయువును తోడుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వాముల నుంచి ఈ పరిహారాన్ని కోరుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది కాగా ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. 6652.75 కోట్లుగా) లెక్క కట్టింది. ఈ అంచనాలను ఆయిల్ మంత్రిత్వ శాఖకు అందచేసిన సంగతి తెలిసిందే. -
మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు
-
మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు
షాకింగ్ సంఘటన..కరాచీలో ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ మహిళా రిపోర్ట్‌పై పాకిస్తానీ పోలీసు గార్డు చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యలను లైవ్ రిపోర్టు చేసే మహిళా జర్నలిస్టును పాక్ పోలీసు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సైమా కన్వల్ అనే మహిళా యాంకర్ పాకిస్తాన్‌లోని కే-21 చానల్లో పనిచేస్తుంది. కరాచీలోని నాద్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లైవ్ రిపోర్టు చేయడానికి ఆమె అక్కడికి వచ్చింది. అక్కడ గార్డ్‌గా పనిచేస్తున్న ఫ్రాంటియర్ కానిస్టేబులరీ(ఎఫ్‌సీ) సైనికుడు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. మొదట కెమెరామెన్ షూటింగ్‌ను ఆపడానికి ప్రయత్నించిన అతను, కన్వల్ కెమెరాను వేరేవైపు మరల్చడంతో, ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ మొత్తం సంఘటన చిత్రీకరణ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహిళా రిపోర్టుపై దాడికి పాల్పడ్డ ఆ ఎఫ్‌సీ సైనికుడిపై గుల్బహార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసినట్టు ఎస్ఎస్పీ సెంట్రల్ ముఖదాస్ హైదర్ పాకిస్తానీ మీడియాకు తెలిపారు. ఆ గార్డును తమకు కస్టడీకి ఇప్పించాలని ఎఫ్‌సీ అథారిటీలను పోలీసులు కోరారు. టీవీ చానల్ రిపోర్టర్‌కు వ్యతిరేకంగా కూడా ఓ ఎఫ్ఐఆర్ను నాద్రా అధికారులు నమోదుచేసినట్టు హైదర్ చెప్పాడు. ఆమె అధికారిక పనిలో అవాంతరాలు కలిగిస్తుందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపాడు. మరోవైపు ఈ ఘటనను సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాద్రా ఆఫీసులో తన కూతురు/చెల్లెలి లాంటి మహిళ జర్నలిస్టుపై చేయిచేసుకున్న ఆ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎంఎన్ఏ పాకిస్తాన్ సల్మాన్ ముజాహిద్ బ్లాచ్ డిమాండ్ చేశారు. కే 21 న్యూస్ చానల్ మహిళా జర్నలిస్టును ఎఫ్‌సీ గార్డు కొట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ టీవీ జర్నలిస్టు ఫేస్బుక్ పోస్టు చేశారు. ఆ గార్డుపై యాక్షన్ తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది
ముంబయి: ఇప్పుడొక వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ యువతి విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన ఈ నెల (జూన్)15న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో చూపిన ప్రకారం మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఓ యువతి నేరుగా వెళ్లి ఓ పోలీసుతో వాదనలు పడటమే కాకుండా అసభ్యంగా తిడుతూ కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయిచేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? వారి మధ్యలో జరగుతున్న సంభాషణ ఏమిటీ? ఆ యువతి ఎందుకలా ఎస్సైని కొట్టింది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఆర్జే చెంపచెళ్లు మనిపించిన హీరో!
ముంబై: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సంయమనాన్ని కోల్పోయి రేడియో జాకీ(ఆర్జే) చెంప చెళ్లు మనిపించారు. 'కీ అండ్ కా' చిత్ర ప్రమోషన్ లో భాగంగా అర్జున్ ముంబైలోని రేడియో మిర్చీ ఆఫీసుకు వెళ్లారు. సినిమాల్లో నటించడానికి పాత్రలు దొరకకపోవడంతోనే అమ్మాయిలకు సంబంధించి పాత్రలు వేస్తున్నారా అని ఆర్జే, అర్జున్ను ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై.. ఆ ఆర్జే చెంప చెల్లు మని పించాడు అర్జున్. ఇదంతా రికార్డవుతుందని ఆర్జే చెబుతుండగానే అతన్ని బయటకు నెట్టేశాడు. అక్కడున్న కెమెరాలను కిందకు విసిరాడు. అయితే ఇప్పటికే ఎన్నో ప్రమోషన్లలో ఇంతకన్నా ఘాటైన ప్రశ్నలకు చాలా సున్నితంగా అర్జున్ బదులిచ్చాడు. కానీ, ఇంత చిన్నదానికే మరీ అంతలా రియాక్ట్ అవ్వాలా అనుకుంటున్నారా. సినిమా ప్రమోషన్ల కోసం హీరోలు చేసే ఎన్నో ప్రయత్నాలను మనం ఇప్పటి వరకు చూశాము. అయితే ఏప్రిల్ 1న(ఫూల్స్ డే రోజు) 'కి అండ్ కా' విడుదల అవుతుండటంతో మరో కొత్త పద్దతికి అర్జున్ శ్రీకారం చుట్టాడు. అభిమానులకు ఫూల్స్ డే స్పేషల్‌గా వీడియోను విడుదల చేసి ఆటపట్టించడమే కాకుండా సినిమాను కూడా ప్రమోట్ చేయాలనుకున్నాడు. రెడియో టీం, అర్జున్ కపూర్ కలిసి ఈ ప్రాంక్ వీడియోను తీశారు. కానీ ఏప్రిల్ 1కి కొంచెం ముందుగానే వీడియో బయకు రావడంతో అడ్వాన్స్గానే అభిమానులు ఫూల్స్ అయ్యారు. 'కి అండ్ కా' చిత్రంలో భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్, జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో కరీనా కపూర్ నటించారు. -
2 చెప్పుదెబ్బలతో రేపిస్టు విడుదల
లక్నో: యూపీలో పంచాయతీ పెద్దల తీర్పుపై సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులను రెండు చెప్పుదెబ్బలు కొట్టి వదిలేయాలని తీర్పునిచ్చారు. డిసెంబర్ 19న హాపూర్ గ్రామంలో ఓ యువతిపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక పంచాయతీ పెద్దలను వేడుకుంది. దీంతో రేపిస్టులు తలో ఐదులక్షల రూపాయలు చెల్లించాలని పంచాయతీ ఆదేశించింది. అంత ఇచ్చుకోలేమని వారు చెప్పటంతో.. సరే రెండు చెప్పుదెబ్బలు కొట్టి వదలేయమని.. బాధితురాలని గ్రామపెద్దలు సూచించారు. దీనిపై యూపీ సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అకారణంగానే చెంప చెళ్లుమనిపించిందా?
చెన్నై: 'తుపాకి' నటి మీనాక్షి.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించడం వివాదం రేపింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుడిపై మీనాక్షి చేయిచేసుకుంది. చెన్నై పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారట. సదరు సహాయ దర్శకుడికి మద్దతుగా యూనిట్ సభ్యులు, ఇతర టెక్నీషియన్లు ఆందోళనకు దిగారు. అకారణంగా,. అన్యాయంగా ఆమె కొట్టిందంటూ వారంతా మండిపడ్డారు. సహాయ దర్శకుడికి క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి కదలనివ్వబోమని పట్టుబట్టారు. దీంతో మీనాక్షి.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు క్షమాపణలు చెబుతూ, లేఖ రాసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని, బుద్ధిగా ఉంటానని మీనాక్షి చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తుపాకి' చిత్రంలో హీరోయిన్ కాజల్ స్నేహితురాలి పాత్రలో నటించిన మీనాక్షి.. ప్రస్తుతం నేర్ముగమ్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అయితే ఇద్దరి మధ్య బయటకు చెప్పుకోలేని గొడవ ఏదైనా జరిగిందా? అసలు ఏం జరిగిందనేది ఎవరికీ అంతుబట్టక మల్లగుల్లాలు పడుతున్నారట. మీనాక్షి ఎందుకు అలా ప్రవర్తించిందనే విషయం ఎటూ తేలక సినీజనం ఆరా తీస్తున్నారు. -
వామ్మో...అలారం
-
వామ్మో...అలారం
స్వీడన్: పొద్దున్నే మర్చిపోకుండా నిద్ర లేవాలంటే ఎవరైనా ఏం చేస్తాం.. అలారం పెట్టుకుంటాం. అయనా ఠంచన్ గా అలారం మోగినా లేవడానికి బద్దకించేవాళ్లు చాలామందే ఉన్నారు. అంతేకాదు దాని నెత్తిమీద ఒకటి మొట్టి మరీ మళ్లీ ముసుగు తన్ని పడుకోవడం కూడా కామనే... అవునా.. కాని ఇపుడు ఓ అలారం ఆ పప్పులేవీ ఉడకవు అంటోంది. పాఠం అప్పచెప్పకపోతే బెత్తం తీసుకుని వాయించే టీచర్ లా.. లేచే దాకా మొఖం మీద ఫెడీ. ఫెడీ వాయిస్తూనే ఉంటానంటోంది. ఎంతటి కుంభకర్ణులకైనా దెబ్బకు దెయ్యం అదేనండి..నిద్ర పారిపోవాల్సిందే అంటోంది. దీనికి సంబంధించి స్వీడిస్ మహిళ విడుదల చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వేకప్ అలారాన్ని చూసిన నెటిజన్లు, ఇదేమీ అలారం రా బాబూ అనుకుంటూనే లైక్ ల మీద కొడుతూ, వేల కొద్దీ షేర్ లు చేస్తున్నారట. -
దర్శకుణ్ణి కొట్టిన రాఖీ ఫ్రెండ్.. పబ్లిసిటీ స్టంటా!
-
దర్శకుడిని కొట్టిన రాఖీ సావంత్ ఫ్రెండ్
ముంబయి : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె స్నేహితురాలు కారణంగా రాఖీకి ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. వివరాల్లోకి వెళితే...ముంబైలో 'ముంబై కెన్ డ్యాన్స్ సాలా' (Mumbai Can Dance Saala) సినిమా మ్యూజిక్ లాంఛ్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్, డైరెక్టర్ సచేంద్ర శర్మ ఇతర టీమ్ మొత్తం స్టేజ్‌పై బిజీగా ఉంది. ఇంతలో రాఖీ ఫ్రెండ్, ఓ మోడల్ వేదికపైకి దూసుకొచ్చింది. వస్తూ వస్తూనే డైరెక్టర్‌ను లాగి పెట్టి ఒక్కటిచ్చింది. అమ్మడి చెంప దెబ్బకు డైరెక్టర్‌కు దిమ్మ తిరిగిపోయింది. దాంతో కాసేపు ఇద్దరి మధ్య ఢిష్యుం డిష్యూం జరిగింది. ఇంతకీ మ్యాటరేంటీ అంటే? రాఖీ స్నేహితురాలకి సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూనే, అందుకోసం ఆమె చాలా చాలా పనులు చేయాలని దర్శకుడు శర్మ షరతులు పెట్టాడట. ఆ విషయాన్నే నిలదీస్తూ ఆమె స్టేజ్‌పై దర్శకుడికి సినిమా చూపించింది. అక్కడితో ఆగలేదు.. రాఖీ, ఆమె స్నేహితురులు కలిసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పబ్లిసిటి కోసమే రాఖీ సావంత్ ఇదంతా చేస్తోందని కొంతమంది ఆరోపిస్తుండగా .. అలాంటిదేమీ లేదని ఆమె కొట్టిపారేస్తోంది. మరోవైపు అసలేం జరిగిందంటూ దర్శకుడు శర్మను అడిగితే.. అదంతా చీప్ పబ్లిసిటి కోసం చేసిన డ్రామా అని చెప్పటం విశేషం. అయితే ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే.. రాఖీ సావంత్ తన ఫ్రెండ్‌తో కలిసి కావాలనే అలా చేసిందా లేక నిజంగానే అనేది వాళ్లకే తెలియాలి మరి. ఇంతకీ ఆ ఫ్రెండ్ పేరు కూడా ఎవరికీ తెలియక పోవటం గమనార్హం.