ఆర్జే చెంపచెళ్లు మనిపించిన హీరో! | Arjun Kapoor slaps RJ, throws cameras on ground | Sakshi
Sakshi News home page

ఆర్జే చెంపచెల్లు మనిపించిన హీరో!

Published Wed, Mar 30 2016 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

ఆర్జే చెంపచెళ్లు మనిపించిన హీరో!

ఆర్జే చెంపచెళ్లు మనిపించిన హీరో!

ముంబై:  
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సంయమనాన్ని కోల్పోయి రేడియో జాకీ(ఆర్జే) చెంప చెళ్లు మనిపించారు. 'కీ అండ్ కా' చిత్ర ప్రమోషన్ లో భాగంగా అర్జున్ ముంబైలోని రేడియో మిర్చీ ఆఫీసుకు వెళ్లారు. సినిమాల్లో నటించడానికి పాత్రలు దొరకకపోవడంతోనే అమ్మాయిలకు సంబంధించి పాత్రలు వేస్తున్నారా అని ఆర్జే, అర్జున్‌ను ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై.. ఆ ఆర్జే చెంప చెల్లు మని పించాడు అర్జున్. ఇదంతా రికార్డవుతుందని ఆర్జే చెబుతుండగానే అతన్ని బయటకు నెట్టేశాడు. అక్కడున్న కెమెరాలను కిందకు విసిరాడు.


అయితే ఇప్పటికే ఎన్నో ప్రమోషన్‌లలో ఇంతకన్నా ఘాటైన ప్రశ్నలకు చాలా సున్నితంగా అర్జున్ బదులిచ్చాడు. కానీ, ఇంత చిన్నదానికే మరీ అంతలా రియాక్ట్ అవ్వాలా అనుకుంటున్నారా. సినిమా ప్రమోషన్ల కోసం హీరోలు చేసే ఎన్నో ప్రయత్నాలను మనం ఇప్పటి వరకు చూశాము. అయితే ఏప్రిల్ 1న(ఫూల్స్ డే రోజు) 'కి అండ్ కా' విడుదల అవుతుండటంతో మరో కొత్త పద్దతికి అర్జున్ శ్రీకారం చుట్టాడు. అభిమానులకు ఫూల్స్ డే స్పేషల్‌గా వీడియోను విడుదల చేసి ఆటపట్టించడమే కాకుండా సినిమాను కూడా ప్రమోట్ చేయాలనుకున్నాడు. రెడియో టీం, అర్జున్ కపూర్‌ కలిసి ఈ ప్రాంక్ వీడియోను తీశారు. కానీ ఏప్రిల్ 1కి కొంచెం ముందుగానే వీడియో బయకు రావడంతో అడ్వాన్స్‌గానే అభిమానులు ఫూల్స్ అయ్యారు. 'కి అండ్ కా' చిత్రంలో భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్,  జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే  లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో  కరీనా  కపూర్ నటించారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement