అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్, భూమీ ఫడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘మేరే హాబ్జెండ్‌కీ బీబీ’. ‘లవ్ ట్రయాంగిల్ నహీ హై... సర్కిల్ హై’ (ప్రేమ ముక్కోణం కాదు... వలయం) అనేది ఈ సినిమా క్యాప్షన్. ముదస్సర్ అజీజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మరి... లవ్ సర్కిల్‌లో ఫైనల్‌గా ఏ ఇద్దరి ప్రేమ గెలిచిందో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఇక ఈ సినిమాయే కాకుండా హిందీలో అజయ్ దేవగన్ ‘దే దే ఫ్యార్ దే 2’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు రకుల్. అలాగే కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఇండియన్ 3’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ లీడ్ రోల్‌లో నటించారు. ‘దే దే ఫ్యార్ దే 2’ జూలైలో విడుదల కానుంది. ‘ఇండియన్ 3’ కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. అయితే విడుదల తేదీపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment