షూటింగ్‌కు రకుల్‌ రెడీ .. ఆరోజే స్టార్ట్‌ | Rakul Preet Singh And Arjun Kapoor To Resume Shooting on August 25 | Sakshi
Sakshi News home page

షూటింగ్‌కు రెడీ అవుతున్న రకుల్‌.. ఆరోజే స్టార్ట్‌

Published Thu, Aug 20 2020 11:54 AM | Last Updated on Thu, Aug 20 2020 12:05 PM

Rakul Preet Singh And Arjun Kapoor To Resume Shooting on August 25 - Sakshi

ముంబై : కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌లో అన్ని భాషల్లోని సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.. ఇటీవల అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా కేంద్రం షూటింగ్‌లను గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఆమిర్‌ ఖాన్‌ వంటి నటులు తన సినిమా షూటింగ్‌లను తిరిగి ప్రారంభించగా.. కరోనా జాగత్తలు పాటిస్తూ మరి కొంత మంది షూటింగ్‌లలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ త్వరలో మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నారు. అయితే అది తెలుగు సినిమా కాదు బాలీవుడ్‌. (రకుల్‌ ప్రీత్‌, మంచు లక్ష్మి సైక్లింగ్‌ ఫోటోలు)

నిర్మాత బోనీ కపూర్‌ కొడుకు అర్జున్‌ కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ​ ఓ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరును వెల్లడించలేదు. ఈ మూవీ షూటింగ్‌ ఆగష్టు 25 నుంచి ముంబైలో ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో వెల్డించారు. ప్రస్తుతం 10 రోజులపాటు షెడ్యూల్‌ ఉందని, ఆ తర్వాత సెప్టెంబర్‌ చివరలో మరో నాలుగు రోజు షూట్‌ చేయనున్నట్లు తెలిపారు. లవ్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కాశ్వీ నాయర్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, క్రిషన్ కుమార్, మోనిషా అద్వానీ నిర్మిస్తున్నారు. (కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement