arjun kapoor
-
షూటింగ్ సెట్లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు గాయాలు!
బాలీవుడ్ మూవీ షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో అర్జున్ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు ముదస్సర్ అజీజ్‌కు గాయాలయ్యాయి. మేరే హస్బెండ్‌కి బీవీ మూవీ షూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఈనెల 18న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా బయటకొచ్చింది. మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేశామని తెలిపారు.బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఎవరికీ పెద్ద గాయాలు ఏమీ లేవు. కానీ అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే స్టూడియోలో పైకప్పు కూలిపోయింది. కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్ ఆపేశారు. సినీ పరిశ్రమలోని సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపాం. భవనాలు ఏదో ఒక రోజు కూలిపోయేలా ఉన్నాయని ఫిలిం సిటీకి కూడా లేఖ రాశాం. ఈ ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం కనిపించలేదు. చిత్ర పరిశ్రమ అంతా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అన్నారాయన.కాగా.. అర్జున్ కపూర్ గాయంతోనే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. మేరే హస్బెండ్ కి బీవీ ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలోకి రానుంది. నిర్మాత జాకీ భగ్నానీ గతేడాది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
లవ్ ట్రయాంగిల్ నహీ హై!
అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్, భూమీ ఫడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘మేరే హాబ్జెండ్కీ బీబీ’. ‘లవ్ ట్రయాంగిల్ నహీ హై... సర్కిల్ హై’ (ప్రేమ ముక్కోణం కాదు... వలయం) అనేది ఈ సినిమా క్యాప్షన్. ముదస్సర్ అజీజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మరి... లవ్ సర్కిల్లో ఫైనల్‌గా ఏ ఇద్దరి ప్రేమ గెలిచిందో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ సినిమాయే కాకుండా హిందీలో అజయ్ దేవగన్ ‘దే దే ఫ్యార్ దే 2’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రకుల్. అలాగే కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఇండియన్ 3’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ లీడ్ రోల్లో నటించారు. ‘దే దే ఫ్యార్ దే 2’ జూలైలో విడుదల కానుంది. ‘ఇండియన్ 3’ కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. అయితే విడుదల తేదీపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. -
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక) -
నో ఆల్కహాల్, నో టాక్సిక్ పీపుల్ మలైకా పోస్ట్: షాకవుతున్న ఫ్యాన్స్
చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్‌తో నుంచి బ్రేకప్ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల కొన్ని పోస్ట్‌ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది. మద్యం,నిద్రతోపాటు టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించేనా అంటూ షాక్ అవడం అభిమానుల వంతైంది.శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్‌ను ప్రకటించింది. మలైకా నవంబర్ ఛాలెంజ్ 1. మద్యం దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం 5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. శారీరంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్ రిలేషన్లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్ ఈవెంట్లో తాను ఇంకా సింగిల్ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం తేల్చి చెప్పేశాడు. సింగం ఎగైన్ మూవీలో విలన్‌గా అర్జున్ కపూర్ మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
ఏళ్లతరబడి ఫ్లాప్స్.. డిప్రెషన్లో హీరో.. జనాలు ఆదరిస్తారా అని..?
బాలీవుడ్ హీరో కమ్ విలన్ అర్జున్ కపూర్ హిట్ అందుకుని చాలాకాలమే అయింది. 2017 తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత సింగం అగైన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే చాలాకాలంగా అతడు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడట!నా పరిస్థితి దారుణం..దీనిగురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. సింగం అగైన్ సినిమాకు సంతకం చేసినప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, శారీరకంగా, మానసికంగా అన్ని కోణాల్లోనూ బాధలో కూరుకుపోయాను. డైరెక్టర్ రోహిత్ శెట్టి నా లుక్ మార్చుకునేందుకు కొంత టైమ్ ఇచ్చాడు. అప్పటికే సినిమాపై నాకు ప్రేమ పోయింది. జనాలు ఆదరిస్తారా?ఇప్పుడీ సినిమా చేయాలా? మళ్లీ సినిమాతో ప్రేమలో పడాలా? జనాలు నిజంగా నన్ను ఆదరిస్తారా? లేదంటే తిరస్కరిస్తారా? ఇలా ఉండేవి నా ఆలోచనలు. హిట్టు అందుకుని ఏళ్లు గడిచిపోతుంటే మనపై మనకే అనుమానం రావడం సహజమే కదా! పైగా లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడిని. డిప్రెషన్ సినిమానే జీవితం అనుకున్న నేను మూవీస్ చూసి ఎంజాయ్ చేయలేకపోయాను. పైగా ఇతరుల సినిమాలు చూస్తూ నాకిలాంటి ఛాన్స్ వస్తుందా? అని ఆలోచించేవాడిని. నిద్ర రావడానికి యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చూసేవాడిని. గతేడాదే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు థెరపీ తీసుకోవడం మొదలుపెట్టాను.హషిమోటో వ్యాధి ఎప్పుడూ చెప్పలేదు కానీ నాకు హషిమోటో అనే వ్యాధి ఉంది. మా అమ్మకు, సోదరి అన్షులాకు కూడా ఉంది. ఈ వ్యాధి వల్ల నా బరువు అదుపులో ఉండేది కాదు అని చెప్పుకొచ్చాడు. హషిమోటో అనేది ఆటోఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంధిని డ్యామేజ్ చేస్తుంది.చదవండి: భార్య కాళ్లు మొక్కినందుకు ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే? -
మన జీవితంలో ఆ ఒక్క సెకన్ చాలు : మలైకా అరోరా
బాలీవుడ్ భామ మలైకా అరోరా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అంతకుముందే 2018 నుంచి అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత తమ రిలేషన్‌పై వీరిద్దరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.అయితే తాజాగా ముంబయిలోని దివాళీ బాష్‌కు అర్జున్ కపూర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మలైకా అరోరా గురించి కొందరు ఆరా తీశారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్‌తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. అతని మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హృదయం, ఆత్మ అంటూ మలైకా రాసుకొచ్చారు. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ మనసులో మాటను బయటపెట్టింది.బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో
ప్రేమలో పడటం, రిలేషన్షిప్లో ఉండటం, కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పడం.. ఇలాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని బయటపడతాయి. కొన్ని బయటపడవ్ అంతే! తాజాగా హీరో అర్జున్ కపూర్ తన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా అరోరాతో విడిపోవడం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఇద్దరూ ఎవరికీ వాళ్లు దూరం పాటించారు. దీంతో బ్రేకప్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం మలైకా తండ్రి చనిపోతే ఆమెకు అర్జున్ అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. తాజాగా దీపావళి ఈవెంట్లో పాల్గొన్న అర్జున్ కపూర్.. మైక్‌లో మాట్లాడుతున్న టైంలో 'మలైకా ఎలా ఉంది?' అని ఒకరు అడిగారు. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని బదులిచ్చాడు. అంటే బ్రేకప్‌ని కన్ఫర్మ్ చేసినట్లే.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Movie Talkies (@movietalkies) -
మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?
బాలీవుడ్లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.బాలీవుడ్నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు -
హీరో బర్త్‌డే.. అందరూ ఉన్నా ఒకరు మాత్రం మిస్సింగ్!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బర్త్‌డే నేడు (జూన్ 26). అన్నయ్య బర్త్‌డే అంటే ఎలా ఉండాలి? ఆ రోజు తనను ఎంత సంతోషంగా ఉంచాలి? అని ఆలోచించినట్లుంది అన్షులా కపూర్. అందుకే అర్ధరాత్రి అర్జున్‌తో కేక్ కట్ చేయించింది. ఈ బర్త్‌డే పార్టీకి సంజయ్ కపూర్, వరుణ్ ధావన్ సహా తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ ఫోటోలను అన్షులా షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మై నెంబర్ 1. ఎంతో పెద్ద మనసున్న నువ్వు అన్నింటినీ దాటుకుని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్నది సాధించాలి. నీ కష్టాలు తగ్గిపోవాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.. లవ్ యూ అన్నయ్య అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ బర్త్‌డే పార్టీలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మిస్సయింది. ప్రియుడి పుట్టినరోజు అనగానే అందరికన్నా ముందుగానే విషెస్ చెప్పే ఆమె ఈసారి మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయింది. పార్టీలో సైతం కనిపించలేదు. దీంతో వీళ్లిద్దరూ విడిపోయిన మాట వాస్తవమేనని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)చదవండి: పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్ -
మరో జంట బ్రేకప్..విడిపోయిన మలైకా, అర్జున్ కపూర్ ?
-
బంధం ముగిసింది.. విడిపోయిన బాలీవుడ్ స్టార్ జంట!
బాలీవుడ్లో ఓ స్టార్ జంట బ్రేకప్ చెప్పుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఏళ్ల తరబడి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా- అర్జున్ కపూర్ ఎవరి దారి వారు చూసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ లవ్ బర్డ్స్ ఇంతవరకు స్పందించలేదు. వారి బంధానికి కాలపరిమితి ముగిసిందని, అందుకే విడిపోయారని పలువురూ భావిస్తున్నారు. మనసులో స్థానం అలాగే..జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఈ బ్రేకప్‌పై స్పందిస్తూ.. మలైకా, అర్జున్‌ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వారు దాన్ని కొనసాగిస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు వారు సుముఖత చూపడం లేదు. దీని గురించి చర్చ జరగడం కూడా వారికి ఇష్టం లేదు అని తెలిపారు.ఐదేళ్లుగా ప్రేమాయణంకాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2019లో తాము డేటింగ్లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. పార్టీలు, ఫంక్షన్స్‌కు సైతం కలిసి వెళ్లేవారు. కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అయితే గతేడాది.. వీరి ప్రేమ బంధం ముగిసిందంటూ వార్తలు రాగా వాటిని మలైకా కొట్టిపారేసింది. తనకంటే చిన్నవాడితో లవ్అలాగే తనకంటే 12 ఏళ్లు చిన్నవాడిని ప్రేమించిందని విమర్శలు రాగా దానికి కూడా గట్టి కౌంటరిచ్చింది. ప్రేమకు వయసుతో పనేంటని ప్రశ్నించింది. ఇంతలా ఒకరికొకరు తోడునీడుగా ఉన్న వీళ్లు విడిపోయారని మరోసారి వార్తలు వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. మలైకా- అర్జున్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ -
తండ్రి మరణించిన 10 రోజులకే పనిలో.. సాయం చేస్తానన్న హీరో
ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతుంది. సంపాదనతో ఫ్యామిలీని పోషించే మనిషి లేకుంటే అంతా తలకిందులవుతుంది. చాలా సందర్భాల్లో పిల్లలు బడి మానేసే దుస్థితి ఏర్పడుతుంది. వయసుకు మించిన పని చేయడానికీ వెనుకాడరు. ఇటీవల ఢిల్లీలో జస్ప్రీత్ అనే పిల్లవాడు తన తండ్రిని కోల్పోవడంతో ఆయనలాగే చపాతీలు చేసే పనిలోకి దిగాడు. పదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. చేయూతనిచ్చేందుకు రెడీతల్లి పంజాబ్‌లోని గ్రామంలో ఉండగా జస్ప్రీత్ తన సోదరితో కలిసి వాళ్ల ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇతడి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు చేయూతనిచ్చేందుకు రెడీ అయ్యాడు.సెల్యూట్ ఈ పదేళ్ల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి చనిపోయిన పది రోజులకే ఆయన పనిని చేసేందుకు రంగంలోకి దిగిన అతడి గుండెధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. అతడికి లేదా అతడి సోదరికి మంచి విద్య అందించేందుకు సాయం చేయాలనుకుంటున్నాను. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్‌ది ఎంత గొప్ప మనసు అని కొనియాడుతున్నారు.చదవండి: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్! -
పెళ్లి ప్రపోజల్ పై అర్జున్ కపూర్ కు ఫ్యూజులెగిరిపోయే సమాధానమిచ్చిన మలైకా..!
-
సింగమ్ వర్సెస్ సైతాన్ .. అదిరిపోయిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్!
బాలీవుడ్ సింగమ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. కాగా ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్గా అభివర్ణిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు రోహిత్ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్ పాత్రను ఉద్దేశించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు అజయ్ దేవగన్. రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్’, 2014లో ‘సింగమ్ రిటర్న్స్’ ఇప్పుడు ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Rohit Shetty (@itsrohitshetty) -
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్‌లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్‌ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్‌కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
ఆమెకు 50, అతడికి 38.. లవ్‌పై ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే?
సెలబ్రిటీలను ఇష్టపడేవాళ్లుంటారు.. ఉత్తి పుణ్యానికే వాళ్లపై విమర్శలు గుప్పించేవాళ్లూ ఉంటారు. వారు ఏదైనా ఫోటో షేర్ చేసినా, బయటకు వెళ్లినా, ఖరీదైన వస్తువులు కొన్నా, బ్రాండెడ్ అండ్ వెరైటీ డ్రెస్సులు వేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ప్రియురాలికి బ్రేకప్ చెప్పినా, భార్యకు విడాకులిచ్చినా.. ఏం చేసినా సరే తిట్లదండకం అందుకోవడానికి రెడీగా ఉంటారు. ఆమెకు 50 అతడికి 38.. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. కానీ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్ కపూర్‌కు మరింత దగ్గరైంది మలైకా. వయసు వ్యత్యాసంపై ట్రోలింగ్ అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకును తీసుకొచ్చే అమ్మాయిని పార్ట్నర్గా ఎంచుకోవడమేంటి? నీకంటే 12 ఏళ్లు పెద్ద.. అలాంటి ఆంటీతో లవ్వేంటి? అని నెటిజన్లు తరచూ సూటిపోటి మాటలతో అర్జున్ను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్న అర్జున్ ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. 'ట్రోలింగ్ వల్ల ఎప్పుడో ఒకసారైనా బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఎలా డీల్ చేస్తామనేది ముఖ్యం. లైకుల కోసం చిల్లరపనులు.. ఈ ట్రోలింగ్ వల్ల.. తప్పుడు కామెంట్లు చేసేవారి పద్ధతులు, వక్రబుద్ధి బయటపడుతుంది. ఏదిపడితే అది కామెంట్లు చేసి మన దృష్టిని ఎలాగోలా ఆకర్షించాలనుకుంటారు. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు స్పందించాలనుకున్నాను. కానీ వారికి నేను అటెన్షన్ ఇవ్వడమేంటని తర్వాత లైట్ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తుంటారు. మళ్లీ ఇలాంటివారే మనం కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతారు' అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. చదవండి: వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్.. అక్కడే స్ట్రీమింగ్ -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. ఇంత వైల్డ్ ఏంట్రా బాబు!
ఇటీవలే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీతో అలరించిన నటి భూమి ఫడ్నేకర్. తాజాగా అర్జున్ కపూర్ సరసన ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్, భూమి ఫడ్నేకర్ మధ్య శృంగార సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరింత వైల్డ్‌గా చూపించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అర్జున్ కపూర్‌కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ది లేడీ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించనుంది. అర్జున్ చివరిసారిగా ఏక్ విలన్ రిటర్న్స్‌లో కనిపించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, తారా సుతారియా, దిశా పటాని నటించారు. మరోవైపు భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీలతో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. -
హీరోయిన్‌పై బ్రేకప్ రూమర్స్.. ఆ ఒక్క వీడియోతో !
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. బ్రేకప్ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మలైకా ఆరోరా గట్టి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్జున్ కపూర్‌తో లంచ్ డేట్‌కు వెళ్లి మలైకా ఆరోరా రూమర్స్‌కు చెక్ పెట్టారు. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్లతో సహా అర్జున్ కుటుంబాన్ని మలైకా అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ వచ్చాయి. కాగా.. ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్‌కి రిలేషన్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించింది. కాగా.. గతంలో తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు మలైకా వెల్లడించింది. మలైకా అరోరా బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. అయితే 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది. ఆ తర్వాత 2017తో తన భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉంది. (ఇది చదవండి: అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల (జూన్ 26) పుట్టినరోజు వేడుకును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.అతని ప్రేయసి మలైకా అరోరా స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్‌లో దిల్ సే చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ఛైయ్యా ఛైయ్యాకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే చర్చ జోరందుకుంది. దీని ధర అక్షరాల 99వేల రూపాయలట. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు. స్లీవ్‌లెస్ వైట్ గౌన్‌పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్ చేశారు. మలైకా వైట్ అండ్ రెడ్ గౌనులో మెరిసిపోవడమేకాదు, కిల్లింగ్ స్టెప్స్‌తో ఇరగదీసింది. ఈ వేడుకలో అతని సోదరి ఖుషీ కపూర్, అన్షులా కపూర్‌తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్, కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు సందడి చేశారు. -
నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆ ఫోటో ఏంటి?: నటిపై నెటిజన్స్ ఫైర్
స్పెషల్ సాంగ్స్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో పలు చిత్రాలు నిర్మించిన ఆమె టీవీ షోలతో పాటు ఓటీటీలోనూ మెరుస్తోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె మలైకా పెళ్లెప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఆమె ప్రియుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా లేజీ బాయ్(బద్ధకస్తుడు)' అంటూ అర్జున్ ఒంటిపై దుస్తులు లేని ఫోటోను వదిలింది. ఇది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. 'ప్రేమకు వయసుతో పని లేదు, సరే, మీ జీవితం మీ ఇష్టం.. కానీ ఒక టీనేజ్ పిల్లవాడికి తల్లయి ఉండి సోషల్ మీడియాలో ఇలాగేనా ప్రవర్తించేది? నువ్విలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఎంతమంది అతడిని ప్రశ్నలతో గుచ్చిగుచ్చి చంపుతారు..' 'పాపం ఈమె చేసే చీప్ పనుల వల్ల అతడు తన స్కూల్ లేదా కాలేజీలో నవ్వులపాలు కావాల్సి వస్తోంది', 'అరె.. నీకేమైనా పిచ్చి పట్టిందా? మరీ హద్దు మీరుతున్నావు. ఇలాంటివి పోస్ట్ చేయడం అవసరమా?', 'సొంత కొడుకే తనతో ఎక్కువగా ఉండటానికి ఎందుకిష్టపడడో నాకిప్పుడు అర్థమవుతోంది', 'నీ బెడ్రూమ్ విషయాలు కూడా నెట్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు' అని ట్రోల్ చేస్తున్నారు. కాగా మలైకా మూవింగ్ ఇన్ విత్ మలైకా షోతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అటు అర్జున్ కపూర్ లేడీకిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది -
ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో స్టార్ హీరో చెల్లెలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూతురు, హీరో అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బీటౌన్‌లో జోరుగా వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని అన్షులా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ..హార్ట్ ఎమోజితో 366 అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ ట్యాగ్‌ని కూడా యాడ్ చేసింది. ఈ పోస్టు చేసి జాన్వీ, ఖుషీ కపూర్లతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేశారు. తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో త్వరలోనే అన్షులా కపూర్ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. కాగా గతంలో అధిక బరువుతో ఇబ్బంది పడిన అన్షులా ఇటీవలి కాలంలో బరువు తగ్గి నాజుగ్గా మారిపోయింది. ఇదిలా ఉంటే బోనీకపూర్‌కు తొలుత మోనా కపూర్‌తో వివాహమైంది. బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆయనకు మోనా కపూర్‌తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్. ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నా శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్.. జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నారు. అప్పట్నుంచి పలు పార్టీలు, ఫంక్షన్లకు కలిసే హాజరవుతుంటారు. -
నిజాన్ని నొక్కేస్తున్నారు, ఇంతలా దిగజారాలా?: నటుడు
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టేస్తుందంటారు.. సెలబ్రిటీల విషయంలో అక్షరాలా ఇదే జరుగుతుంది. వాళ్లు ఏం చేసినా దానికి నానార్థాలు తీస్తుంటారు. కొత్తవ్యక్తితో కనిపిస్తే లవ్‌లో ఉన్నారని, వదులైన డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అని ఇలా ఏదేదో అనేస్తుంటారు. కొందరు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోయినా మరికొందరు మాత్రం ఘాటుగానే జవాబిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరా గర్భం దాల్చిందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. ఇదే నిజమంటూ ఓ వెబ్సైట్ కథనం కూడా రాసేయడంపై మలైకా ప్రియుడు, నటుడు అర్జున్ కపూర్ ఫైర్ అయ్యాడు. మీరు ఎంతో సాధారణంగా భావించి రాసే వార్త మాకు ఎంత సెన్సిటివ్‌గా అనిపిస్తుందో మీకేం తెలుసు? ఇంత అనైతికంగా దిగజారి ఇలాంటి చెత్తవార్తలు ఎలా రాస్తున్నారు? ఇదే కాదు, చాలా వార్తలు ఈమె ఇలాగే రాసింది. మేము ఇలాంటి కథనాలపై స్పందించట్లేదు కదా అని ఈ ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి నిజాన్ని నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునేంత ధైర్యం చేయకండి అని ఓరకంగా వార్నింగే ఇచ్చాడు. చదవండి: టికెట్ టు ఫినాలే టాస్క్ విజేత ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: నటి -
49ఏళ్ల వయసులో నటుడితో మలైకా రెండో పెళ్లి!.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ దాచలేదు. వెకేషన్స్, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్‌లో మలైకా-అర్జున్‌ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అవును నేను, అంగీకరించాను అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో అర్జున్-మలైకాలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. మరి నిజంగానే వీళ్లు పెళ్లిపీటలు ఎక్కనున్నారా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన స్టంటా? అన్నది త్వరలోనే తేలనుంది. కాగా మలైకా ఆరోరాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్‌తో పెళ్లయింది. 17ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ప్రస్తుతం మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial)