హద్దులుదాటిన ప్రేమకథ | John Abraham-Aditi Rao Hydari first look from Arjun Kapoor film | Sakshi
Sakshi News home page

హద్దులుదాటిన ప్రేమకథ

Published Thu, Aug 27 2020 6:11 AM | Last Updated on Thu, Aug 27 2020 6:11 AM

John Abraham-Aditi Rao Hydari first look from Arjun Kapoor film - Sakshi

జాన్‌ అబ్రహాం, అదితీరావు హైదరీ తాత–నానమ్మ పాత్రల్లో కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లుక్‌ ఈ పాత్రలకు సంబంధించినదే. మరి.. ఫొటోలో యంగ్‌గా కనిపిస్తున్నారు కదా అనుకుంటున్నారా? ఆ సీక్రెట్‌ త్వరలో చెబుతారట. ప్రస్తుతానికి ఈ లుక్స్‌ని విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ ఇద్దరి నటీనటుల పాత్రలు వస్తాయట. అర్జున్‌కపూర్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఓ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సరిహద్దులు దాటిన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిఖిల్‌ అద్వాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్‌కపూర్‌ నానమ్మ, తాతయ్యల పాత్రల్లో అదితి, జాన్‌ అబ్రహాం కనిపిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement