John Abraham
-
మా సినిమాను ఓటీటీలు తిరస్కరించాయి.. ఎందుకంటే?: జాన్ అబ్రహం
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఇటీవలే ఓ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది డిప్లొమాట్ ఈనెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన తొలివారంలోనే రూ.20 కోట్ల మార్క్ చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఓ ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్ తన మూవీని కొనేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదని అన్నారు. స్టూడియోలతో పాటు ఓటీటీలు కూడా ఆసక్తి చూపలేదని వెల్లడించారు.ది డిప్లొమాట్పై జాన్ అబ్రహం మాట్లాడుతూ..'మొదట మా సినిమా స్టూడియోలు నమ్మలేదు. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓటీటీలను సంప్రదిస్తే వారు కూడా తిరస్కరించారు. ఎందుకంటే మా సినిమాను తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ సామర్థ్యంపై వారికి నమ్మకం లేదు. అందువల్లే మా సినిమాపై వారికి ఎలాంటి అంచనాలు లేవు. అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత వారి నిర్ణయం తప్పు అని నిరూపించాం. జీరో నుంచి మొదలై ప్రేక్షకుల అభిమానం సాధించాం. మా చిత్రంపై సున్నా అంచనాలు ఉండటమే మాకు కలిసొచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొంతమంది వచ్చి గత పదేళ్లలో ఈ బ్యానర్లో ఉత్తమ చిత్రం ఇదే అని అన్నారని' వెల్లడించారుకాగా.. ది డిప్లొమాట్ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో ఆయన పాత్రలో జాన్ కనిపించాడు. ఈ మూవీలో సాదియా ఖతీబ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని జాన్స్ జేఏ ఎంటర్టైన్మెంట్తో పాటు టీ సిరీస్, ఫార్చ్యూన్ పిక్చర్స్, సీతా ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. మార్చి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ కాదా..!
-
F4 రేస్‌లో సత్తా చాటి టైటిల్ గెల్చిన అక్కినేని నాగచైతన్య టీం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (చిత్రాలు)
-
సినిమా అట్టర్ ఫ్లాప్.. ఏళ్ల తరబడి మాటల్లేవ్
సినిమా ఫెయిలైతే బాధపడనివారు ఎవరుంటారు? కానీ ఇక్కడ హీరో, దర్శకుడు బాధతో కొన్ని ఏండ్లపాటు మాట్లాడుకోకుండా ఉన్నారు. వాళ్లే హీరో జాన్ అబ్రహం, డైరెక్టర్ నిఖిల్ అద్వాణీ. వీరిద్దరూ 2007లో వచ్చిన సలాం ఇ ఇష్క్ సినిమాకు కలిసి పని చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా వర్కవుట్ కాకపోవడంతో ఇద్దరూ మాట్లాడుకోలేదు. మాటల్లేవ్..ఈ విషయాన్ని నిఖిల్ అద్వాణీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సలాం ఇ ఇష్క్ తర్వాత మేము సత్యమేవ జయతే సినిమా టైంలోనే మళ్లీ కలుసుకున్నాం. ఆ మధ్య కాలంలో తన పని తాను చూసుకున్నాడు, నా పని నేను చూసుకున్నాను. మేమసలు మాట్లాడుకోనేలేదు. సలాం.. ఫెయిల్యూర్‌తో నేను ముంబై వదిలేసి అలీబాగ్‌కు వెళ్లిపోయాను. అన్నింటికీ దూరంగా..ఎవరితో మాట్లాడలేదు. ఆఖరికి నా కూతురితో కూడా మాట్లాడలేదు. అందరికీ, అన్నింటికీ దూరంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా జాన్-నిఖిల్ కాంబినేషన్లో 2018లో సత్యమేవ జయతే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వీరి కాంబోలో వచ్చిన మూడో చిత్రం వేద. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.చదవండి: ఎప్పుడూ ఏడుపుగొట్టు సీన్లు.. ఇక నావల్ల కాదు: మీర్జాపూర్ నటి -
అలా చేస్తే డైరెక్ట్‌గా చావును అమ్మినట్లే: జాన్ అబ్రహం కామెంట్స్!
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం యాక్షన్-థ్రిల్లర్ వేదా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో.. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్న హీరోలపై విమర్శలు చేశారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అభిమానులకు తాను రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకుంటానని తెలిపారు.జాన్ అబ్రహం మాట్లాడుతూ.. 'నేను నిజాయితీగా జీవిస్తేనే రోల్ మోడల్‌గా ఉంటా. ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేస్తే తొందరగా దాన్ని గుర్తిస్తారు. ఇక్కడ కొందరు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు. కానీ అదే వ్యక్తులు పాన్ మసాలా గురించి ప్రచారం చేస్తారు. నేను నా సహ నటులందరినీ గౌరవిస్తా. ఇక్కడ కేవలం నా గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మరణాన్ని అమ్మాలనుకోవడం లేదు. మనదేశంలో పాన్ మసాలా వార్షిక టర్నోవర్ రూ.45 వేల కోట్లు అని మీకు తెలుసా? అంటే ప్రభుత్వం కూడా దీనికి మద్దతిస్తోంది. అందుకే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. వీటి గురించి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇన్‌డైరెక్ట్‌గా చావును ప్రజలకు అమ్మినట్లే. అలా వచ్చిన డబ్బులతో మీరెలా బతుకుతున్నారు' అని విమర్శించారు. కాగా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటనలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇలాంటి యాడ్స్‌లో పాల్గొనబోనని అక్షయ్ ప్రకటించాడు. కాగా.. జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహం.. ఆ తర్వాత ధూమ్, గరం మసాలా, టాక్సీ నెం 9211, దోస్తానా, ఫోర్స్, దేశీ బాయ్జ్, రేస్ 2, పఠాన్ వంటి చిత్రాల్లో నటించారు. -
హలో, మెడల్ సాధించినట్లు ఆ పోజేంటి?.. హీరోపై ఆగ్రహం
ఒలంపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలపింక్స్‌లో విజయకేతనం ఎగురవేసిన ఆమె ఇండియాకు తిరిగొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఆమెను స్వయంగా కలిసి అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఒలంపిక్ పతకంతో హీరోఅందులో జాన్, మనూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అయితే జాన్ అబ్రహం మను సాధించిన ఓ పతకాన్ని తన చేతితో పట్టుకుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది నెటిజన్లకు మింగుడుపడలేదు. ఆమె కష్టపడి సాధించిన పతకాలను తాకే అర్హత ఎవరికీ లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. కరెక్ట్ కాదు'తను భారత్ గర్వపడేలా చేసింది. ఆమెను కలిసే అవకాశం వచ్చినందుకు సంతోషపడాలి. కానీ ఇలా తన పతకంతో ఫోజివ్వడం కరెక్ట్ కాదు..', 'ఒకరు సాధించిన మెడల్‌ను తాకే హక్కు నీకు లేదు, సారీ..', 'ఆ పతకం నువ్వు సాధించినట్లే బిల్డప్ ఇస్తున్నావేంటి?'అది నీ కష్టఫలం'ఆమెకు రెండు చేతులున్నాయిగా.. మరి నువ్వెందుకు పట్టుకోవడమో..', 'మనూ.. నువ్వు సాధించిన పతకాన్ని ఎవరి చేతికీ ఇవ్వకు.. అది నీ కష్టానికి దక్కిన ప్రతిఫలం' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'వేద'. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) -
అంతకుమించి వేదా ఉంటుంది
‘‘వేదా’ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే రెగ్యులర్ యాక్షన్ సినిమాల్లానే ఈ కాన్సెప్ట్ ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ చూసి ఇతర సినిమాలతో ‘వేదా’ ని ΄ోల్చకండి. యాక్షన్ చిత్రాలకు మించి మా ‘వేదా’ ఉంటుంది’’ అంటున్నారు హీరోయిన్ తమన్నా భాటియా. జాన్ అబ్రహాం హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేదా’. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా భాటియా, శార్వరీ వాఘ్, అభిషేక్ బెనర్జీ నటించారు. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత జాన్ అబ్రహాం, నిఖిల్ అద్వానీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూ΄÷ందింది. జాన్ అబ్రహాం, మోనీషా అద్వానీ, మధు భోజ్వాని నిర్మించిన ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న హిందీతో ΄ాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఇటీవల ముంబైలో ‘వేదా’ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ΄ాల్గొన్న తమన్నా ‘వేదా’ మూవీపై స్పందించారు. ‘‘మన దేశంలోని గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహాం ఒకరు. ఆయన ‘వేదా’ వంటి వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. అలాగే డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు తమన్నా భాటియా. -
అలా నిర్ణయించడం కరెక్ట్ కాదు.. ఆ హీరో సినిమాపై తమన్నా కామెంట్స్!
మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామ తమన్నా. ఇటీవల స్ట్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఆజ్ కీ రాత్ అనే ఐటమ్ పాటలో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా తమన్నా వేదా చిత్రంలో నటిస్తోంది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ముంబయిలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు తమన్నా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఓ సంఘటన గురించి తమన్నా స్పందించారు. కేవలం పోస్టర్లు చూసి సినిమాపై ఓ అంచనాకు రావొద్దని ట్వీట్ చేశారు. తమన్నా తన ట్వీట్లో రాస్తూ..'కేవలం ట్రైలర్, పోస్టర్స్ చూసి వేదా సినిమాను అంచనా వేయకండి. నేను చెప్పేది కాస్తా వినండి. ఇది యాక్షన్ ఫిల్మ్‌కు మించి ఉంటుంది. మన దేశంలో గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహం ఒకరు. అతడు ఈ జానర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ నేపథ్యంతో పాటు భిన్నమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే, దర్శకుడు నిఖిల్ దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. శార్వరీ నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. యాక్షన్ చిత్రాలకు ఈ సినిమా సరికొత్త నిర్వచనంగా నిలుస్తుంది. జాన్, నిఖిల్ సర్, శర్వరి, అభిషేక్ బెనర్జీతో నటిస్తుందుకు చాలా సంతోషంగా ఉంది' పోస్ట్ చేశారు.అయితే 'వేద' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో జాన్ అబ్రహం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ సినీ జర్నలిస్ట్ మీరెప్పుడు యాక్షన్ చిత్రాలే చేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో మీరు సినిమా చూశారా? అంటూ అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నకు మిమ్మల్ని మూర్ఖులు అని పిలవొచ్చా? అని అబ్రహం మండిపడ్డారు. కాగా.. నిఖిల్ నిక్కిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో అభిషేక్ బెనర్జీ విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో తమన్నా భాటియా, మౌని రాయ్ కూడా అతిథి పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కానుంది. Don't judge Vedaa by its cover - Trust me when I say, it's more than just an action film!My friend @TheJohnAbraham , one of the nation’s favorite action heroes is bringing his incredible influence to a genre he's totally mastered. This time, he's telling a different kind of… pic.twitter.com/TYhN9ra2Xc— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 2, 2024 -
తిక్క ప్రశ్నలు.. కాస్తైనా తెలివిలేదంటే నీకెలా ఉంటుంది?: హీరో ఫైర్
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వేదా. శార్వరి, అభిషేక్ బెనర్జీ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ విలేఖరి.. ఇందులో కొత్తగా ఏముంది.. మీరు ఎప్పుడూ చేసే యాక్షన్ మూవీలాగే ఉందని కామెంట్ చేశాడు. అతడి వ్యాఖ్యలపై జాన్ అబ్రహం మండిపడ్డాడు. నువ్వు సినిమా చూశావా? అని ప్రశ్నించాడు.సినిమా చూశాక..నీవన్నీ చెత్త ప్రశ్నలు.. ఇలాంటివి అడిగేవారందరూ తెలివితక్కువవారు అని నేనంటున్నానా? లేదు కదా.. ఇదొక డిఫరెంట్ మూవీ అని మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్ సినిమాల కంటే ఇందులో నా నటన కొత్తగా ఉంటుంది. మీరింకా సినిమా చూడలేదు కాబట్టి తెలీదనుకోండి. కాబట్టి ముందు మూవీ చూడండి. తర్వాత ఏదైనా అనండి. అంతేకానీ ఇలా ముందుకుముందే తప్పుగా ప్రచారం చేస్తే మాత్రం అస్సలు సహించను అని వార్నింగ్ ఇచ్చాడు.ఆగస్టు 15న రిలీజ్నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజు స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే చిత్రాలు రిలీజవుతున్నాయి. తెలుగులో రామ్ పోతినేని - డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ - తంగలాన్, ప్రియదర్శి - 35: చిన్న కథ కాదు, నార్నే నితిన్ - ఆయ్: మేం ఫ్రెండ్సండి.. వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి బాక్సాఫీస్ ఫైట్ వద్ద ఏ మూవీ నిలదొక్కుకుంటుందో చూడాలి! #JohnAbraham calls a journalist "Idiot" for asking a bad question at the #Vedaa trailer event. pic.twitter.com/CyqfXu5D11— $@M (@SAMTHEBESTEST_) August 1, 2024 చదవండి: తెలుగు డైరెక్టర్ రెండు నెలలు తనతోనే ఉండాలన్నాడు: నటి -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'వేదా' ట్రైలర్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం- తమన్నా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘వేదా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత హీరో జాన్ అబ్రహాం, డైరెక్టర్ నిఖిల్ అద్వానీ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ మరో హీరోయిన్గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం నిర్మించారు. భారీ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా రిలీజ్ అవుతుంది. -
బన్నీతో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న బాలీవుడ్ హీరో
‘పుష్ప..పుష్పరాజ్..నీయవ్వ తగ్గేదే లే’అంటూ వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు అల్లు అర్జున్. ఇప్పుడా ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి పుష్పరాజ్‌తో పోటీ పడేందుకు బడా హీరోలెవరు సాహసించలేదు. ‘పుష్ప’కు వచ్చిన టాక్‌తో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. దీంతో అప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలు కూడా వెనక్కి తగ్గి.. పుష్పరాజ్ హవా తగ్గిపోయిన తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. బాలీవుడ్లో ఆగస్ట్ 15న రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్ విడుదల కావాల్సింది. పుష్ప 2 కంటే ముందే రోహిత్ శెట్టి రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఎప్పుడైతే పుష్ప 2 అనౌన్స్మెంట్ వచ్చిందో రోహిత్ వెనక్కి తగ్గాడు. కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ పుష్పరాజ్‌తో పోటీ పడేందుకు ఎవరూ సాహసించలేదు. ఇక పుష్పరాజ్‌కి పోటీ లేదు అనుకుంటున్న తరుణంలో.. బాక్సాఫీస్ వార్కి నేను సై అంటూ ముందుకు వచ్చాడు జాన్ అబ్రహం. ఆయన హీరోగా నటించిన వేదా సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. దీంతో బాలీవుడ్ మీడియాలో పుష్ప వర్సెస్ వేదా అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్లోనే పుష్ప2 సినిమాకు ఎక్కువ బజ్ ఉంది. అక్కడే ఎక్కువ మార్కెట్ జరుగుతోంది. అయినా కూడా బన్నీతో జాన్ అబ్రహం పోటీ పడుతున్నాడు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోతో పోటీ పడే స్థాయి జాన్ అబ్రహంకి లేదని అంటున్నారు. ‘పుష్పరాజ్’తో పోటీ అంత వీజీ కాదంటున్నారు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. -
పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..
-
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్ హీరోలా లుక్ మెయింటెయిన్ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్ చేయడం కుదరదు. అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్ తర్వాత షర్ట్ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్ అబ్రహం తన ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. బ్రిటిష్-పాకిస్తానీ నటుడు అలీఖాన్ జాన్ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్నెస్ సీక్రెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జాన్ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్నెస్ సీక్రెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్. ఇక జాన్ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్ స్టయిల్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు జాన్. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్ మెయిటెయిన్ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్. వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్‌ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్ డ్రింక్స్ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్. అంతేగాదు సిగరెట్ కంటే పాయిజన్ చక్కెరే అని జాన్ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్ కదూ..!(చదవండి: ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్) -
అభిమాని బర్త్‌డే.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్
హీరోల కోసం అభిమానులు ఎక్కడివరకైనా వెళ్తారు. తమ పుట్టినరోజు కూడాసెలబ్రేట్ చేసుకుంటారో లేదో కానీ తారల బర్త్‌డేను మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. వారి సినిమా రిలీజవుతుందంటే పండగ చేసుకుంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. అంతలా ఆరాధిస్తారు. అందుకే చాలామంది తారలు అభిమానులనే అసలైన ఆస్తిగా పరిగణిస్తారు.అందుకే ఇక్కడో హీరో అభిమానికి గుర్తుండిపోయే బహుమతిచ్చాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం.. అక్షయ్ కేదరి అనే అభిమానిని అతడి బర్త్‌డే రోజు కలుసుకున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ తన ఫేవరెట్ గిఫ్టుల మీద గిఫ్టులిచ్చాడు. అందులో అతడికిష్టమైన బైక్స్ బొమ్మలున్నాయి. అవన్నీ చూసి ఆశ్చర్యపోయిన జాన్ అబ్రహం అభిమానికి సైతం మర్చిపోలేని బహుమతిచ్చాడు. రూ.22,000 ఖరీదు చేసే కాస్ట్లీ షూలను గిఫ్టిచ్చాడు. అంతేకాదు.. స్వయంగా తనే అతడి షూ లేస్ కట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thank You So Much Bro Kriti Diiii!!!♥️♥️😇💫 https://t.co/BM7erGyIzA— Akshay Kedari (@AkshayK10275683) May 2, 2024Dream Come True Moment 😇♥️ https://t.co/svbxFgrKhw— Akshay Kedari (@AkshayK10275683) May 1, 2024చదవండి: -
'వేదా'గా వచ్చేస్తున్న జాన్ అబ్రహాం
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించిన తాజా యాక్షన్ మూవీ ‘వేదా’. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత హీరో జాన్ అబ్రహాం, డైరెక్టర్ నిఖిల్ అద్వానీ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం నిర్మించారు. పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్ డ్రామాగా ‘వేదా’ రూపొందింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశాను. ఈ మూవీ మన సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది’’ అని నిఖిల్ అద్వానీ పేర్కొన్నారు. -
పాత బంగ్లా కోసం కోట్లు ధారపోసిన బాలీవుడ్ స్టార్!
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించాడీ నటుడు. అటు హీరోగా, ఇటు విలన్‌గానూ సినిమాలు చేస్తున్న ఇతడు పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇందులో విలన్‌గా నటించిన జాన్ అబ్రహం తాజాగా ముంబైలో బంగ్లా కొన్నాడట! 7,722 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డిసెంబర్ 27న జాన్ అబ్రహం ఈ బంగ్లాను కొనుగోలు చేశాడు. బంగ్లా కోసం రూ.70.8 కోట్లు ఖర్చు చేయగా, స్టాంప్ డ్యూటీ కోసం అదనంగా రూ.4.25 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముంబైలోని ఖర్ లింకింగ్ రోడ్డులో ఈ భవంతి ఉంది. అయితే ఇది పాత బంగ్లా కావడం గమనార్హం. బహుశా ఈ బాలీవుడ్ యాక్టర్ ఈ భవంతిని ఆధునీకరించి అద్దెకు ఇస్తాడేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి జాన్ అబ్రహం కమర్షియల్ ప్రయోజనాల కోసం ఆ బంగ్లా కొన్నాడా? లేదంటే దాన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కడతాడా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: హాయ్ నాన్న.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. సినీ ఇండస్ట్రీలో కొంతమంది తనపై కావాలనే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో తనపై గూఢచర్యం చేశారంటూ ఆరోపించింది. ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్, రణ్వీర్ సింగ్‌ను ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో తొలిసారి ఓ హీరోను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్లో నెగెటివ్ పీపుల్ గురించి విన్నా.. కానీ ఓ మంచి వ్యక్తి కూడా ఉన్నాడని ప్రస్తావించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో నోట్ రాసుకొచ్చింది. ఇంతకీ ఆ గొప్ప మనసున్న హీరో ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'చిరంజీవి ఇబ్బంది పెడుతున్నారా?'.. వైరలవుతోన్న భోళాశంకర్ నిర్మాత వాట్సాప్ చాట్!) కంగనా రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో నేను నెగెటివ్ వ్యక్తుల గురించి నేను చాలా మాట్లాడా. కానీ స్ఫూర్తిదాయకమైన వారిని మాత్రం ఎప్పటికీ మరచిపోకూడదు. నేను జాన్ అబ్రహంతో కలిసి పనిచేశాను. అతను ఎంత మంచివారో చెప్పడానికి నా వద్ద మాటల్లేవ్. ఈ విషయం చాలా మందికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే అతన్ని పొగిడేందుకు తాను ఎవరికీ డబ్బులు ఇవ్వడు.' అని అన్నారు. జాన్ గురించి చెబుతూ.. 'అతను చాలా దయగల వ్యక్తి. వివాహం కాలేదు. ఎవరితోనూ రిలేషన్లో లేరు. ఇతరుల గురించి నెగెటివ్‌గా మాట్లాడరు. మహిళలను వేధించడం, వారి నుంచి ఎలాంటి ప్రయోజనం పొందడం లాంటి పనులు చేయలేదు. జాన్ కేవలం ఓ అద్భుతమైన మనిషి. అతను కేవలం 'సెల్ఫ్ మేడ్ మ్యాన్' మాత్రమే కాదు.. అన్ని విధాలుగా విజయవంతమైన వ్యక్తి' అని కంగనా ప్రశంసించింది. జాన్ గురించి ఇంకా రాస్తూ..' "బాంద్రా ఏరియాలో నివసించే సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ.. ఇంట్లో పనివాళ్లను తీసుకొచ్చేఒక ఏజెంట్ ఇలా ఉన్నాడు. అతను ఒకసారి మా మేనేజర్‌తో మాట్లాడారు. హౌస్ హెల్ప్, డ్రైవర్లను చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు చాలా చీప్‌గా, చెడుగా చూస్తారు. అతని కెరీర్ మొత్తంలో పరిశ్రమలోని ఇద్దరు వ్యక్తులే మాత్రమే మంచివారని చెప్పారు. వారి ఇంట్లో పనివాళ్లను సొంత కుటుంబంలా చూసుకుంటారు. వారిలో మొదటి వ్యక్తి జాన్ అబ్రహం, రెండు కంగనా రనౌత్ అని చెప్పాడంటూ. ' పోస్ట్ చేసింది. కాగా.. కంగనా జాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది. షూటౌట్ ఎట్ వాడాలా (2013)లో జాన్ సరసన కనిపించింది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో అనిల్ కపూర్, తుషార్ కపూర్, మనోజ్ బాజ్‌పేయి, సోనూ సూద్ కూడా నటించారు. ఇది 2007లో షూటౌట్ ఎట్ లోఖండ్వాలా చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం మే 3, 2013న విడుదల కాగా..మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: సర్జరీ చేయించుకోనున్న యంగ్ రెబల్ స్టార్.. కారణం అదే!) -
వెయ్యి కోట్ల క్లబ్లో పఠాన్.. రేర్ రికార్డు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో నటించిన హిందీ స్పై ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఫిబ్రవరి 20 (సోమవారం) కి ‘పఠాన్’ చిత్రం రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దేశంలో 623.. విదేశాల్లో 377 కోట్లు దేశవ్యాప్తంగా రూ. 623 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో రూ. 377 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ‘పఠాన్’ రాబట్టిందని చిత్ర యూనిట్ పేర్కొంది. అలాగే సినిమా విడుదలైన తొలి దశలోనే రూ. 1000 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన తొలి హిందీ చిత్రంగా కూడా ‘పఠాన్’ నిలిచిందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ చిత్రం ఆల్రెడీ వెయ్యి కోట్లు వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డుల్లో ఉంది. అయితే తొలిసారి రిలీజ్ చేసినప్పుడే ఈ ఫీట్ సాధించలేదట. ఆ తర్వాత కొన్ని నెలలకు చైనాలో రిలీజ్ చేశాక ఈ సినిమా వసూళ్లు జోరందుకున్నాయని, దీంతో ‘దంగల్’ వెయ్యి కోట్లు వసూలు చేసిన హిందీ చిత్రంగా నిలిచిందని బాలీవుడ్ టాక్. ఇక విడుదలైన తక్కువ రోజుల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రం ‘పఠాన్’ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ‘దంగల్’ తర్వాత హిందీలో వెయ్యి కోట్లు సాధించిన రెండో చిత్రం రికార్డ్ ‘పఠాన్’దే. కాగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఐదో ఇండియన్ సినిమా భారతీయ చిత్రాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లను సాధించిన తొలి సినిమా రికార్డు ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ ‘దంగల్’, ఎన్టీర్ – రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’, యశ్ ‘కేజీఎఫ్’ చిత్రాలు ఉన్నాయి. అయితే అత్యధిక వసూళ్ల పరంగా మాత్రం ఈ జాబితా కాస్త మారుతుంది. ఈ లెక్కల ప్రకారం ‘దంగల్’ (దాదాపు 2000 కోట్లు) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దాదాపు 1800 కోట్లు, కేజీఎఫ్: ఛాప్టర్ 2 దాదాపు 1200 కోట్లు, దాదాపు‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లు (ప్రస్తుతానికి జపాన్ వసూళ్లను కలుపుకుని... ఇంకా అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శితమవుతోంది) సాధించాయి. బాద్షా ఈజ్ బ్యాక్ ‘పఠాన్’కు ముందు షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘జీరో’ (2018). ఈ చిత్రం పరాజయాన్ని చవి చూసింది. దీంతో షారుక్ మరో చిత్రం ఒప్పుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఎన్నో కథలు విని ఫైనల్‌గా ‘పఠాన్’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. షారుక్ నిర్ణయం ఎంత కరెక్టో ఈ సినిమా వసూళ్లు చెబుతున్నాయని బాలీవుడ్ అంటోంది. అలాగే నాలుగేళ్ల తర్వాత ఈ బాలీవుడ్ బాద్షా బ్లాక్బాస్టర్ హిట్ సాధించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిజానికి ‘పఠాన్’ రూ. 970 కోట్ల (22 రోజులకు) గ్రాస్ సాధించిన సమయంలో వసూళ్లు కాస్త నెమ్మదించాయి. దీంతో సినిమా యూనిట్ టికెట్ ధరలను తగ్గించింది. ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఒక రోజు మొత్తం రూ. 110కే టికెట్స్‌ను అమ్మారు. ఆ తర్వాత కూడా కొన్ని మల్టీ ప్లెక్స్‌లలో ‘పఠాన్’ సినిమా టికెట్ ధరలు కాస్త తగ్గి ఉన్నాయి. ఎప్పుడైతే టికెట్ ధర తగ్గిందో అప్పుడు ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదే వెయ్యి కోట్ల క్లబ్లో చేరేందుకు దోహదపడిందని తెలుస్తోంది. అలాగే కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘సెహ్జాదా’ (తెలుగు హిట్ ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్) సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది. కానీ ‘పఠాన్’ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17న రిలీజ్ చేశారు. అయితే ‘సెహ్జాదా’ హిందీ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సినిమా వారం రోజులు ఆలస్యంగా విడుదల కావడం మాత్రం బాక్సాఫీస్ పరంగా ‘పఠాన్’కు కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే ఫిబ్రవరి 17న విడుదలైన హాలీవుడ్ మూవీ ‘యాంట్ మ్యాన్’ తాజా వెర్షన్ కూడా ‘పఠాన్’ కలెక్షన్స్‌ను ప్రభావితం చేయలేక΄ోయింది. -
లగ్జరీ బైక్‌తో ‘పఠాన్’ స్టార్ హల్చల్: వీడియో వైరల్
సాక్షి, ముంబై: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు లగ్జరీ కార్లు, బైకులపైన ఎక్కువ క్రేజు ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్ స్టార్ 'జాన్ అబ్రహం' ఒక ఖరీదైన సుజుకి హయబుసా బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'పఠాన్' సినిమా అతి తక్కువ కాలంలోనే గొప్ప విజయం సాధించిన తరువాత 'జాన్ అబ్రహం' ఈ సరికొత్త 2023 మోడల్ హయబుసా కొనుగోలు చేశారు. ఈ మోడల్ ఇంకా భారతీయ మార్కెట్లో విడుదల కాలేదు. ధూమ్ సినిమాలో హయబుసా రైడ్ చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచిన జాన్ ఇప్పుడు లేటెస్ట్ హుయాబుసా సొంతం చేసుకున్నాడు. ఈ 2023 హయబుసా బైకుని CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి చేసుకోవాలి. ఈ బైక్ 1,340cc ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 187.4 బిహెచ్పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాన్ అబ్రహం ఇప్పటికే తన గ్యారేజిలో యమహా వి-మ్యాక్స్, డుకాటి పానిగేల్, MV అగస్టా, కెటిఎమ్ 390, బిఎండబ్ల్యు ఎస్1000ఆర్ఆర్, అప్రిలియా RSV4 RF వంటి బైకుయ్లను కూడా కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు హయబుసా కొత్త అతిధిగా తన గ్యారేజిలో అడుగుపెట్టింది. నిజానికి జాన్ అబ్రహం కాలిఫోర్నియా సూపర్ బైక్ స్కూల్ నుంచి ప్రత్యేక రైడింగ్ శిక్షణ పొందాడు. -
‘పఠాన్’ సెలెబ్రేషన్స్‌లో షారుఖ్, దీపికా పదుకొణె (ఫొటోలు)
-
Pathaan Review: ‘పఠాన్’ మూవీ రివ్యూ
టైటిల్: పఠాన్ నటీనటులు: షారుఖ్ ఖాన్, జాన్అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్ కపాడియా, అశుతోశ్ రానా తదితరులు నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాత: ఆదిత్య చోప్రా దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్ సంగీతం: సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా విడుదల తేది: జనవరి 25,2023 కథేంటంటే.. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కోపంతో రగిలిపోతుంది. భారత్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నుతుంది. దీని కోసం ప్రైవేట్ ఏజెంట్ జిమ్(జాన్ అబ్రహం)ను సంప్రదిస్తాడు పాక్ జనరల్ కల్నల్. కశ్మీర్‌ని పాకిస్తాన్‌కి అప్పగించాలని, లేదంటే ఇండియాపై అటాక్ చేయాలని కోరతాడు. దీంతో ఇండియాపై బయో వార్ చేసేందుకు ప్లాన్ వేస్తాడు జిమ్. దాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడు ఇండియన్ ఏజెంట్ పఠాన్(షారుఖ్ ఖాన్). అసలు జిమ్ వేసిన రక్తభీజ్ ప్లాన్ ఏంటి? ఇండియాపై జిమ్ ఎందుకు పగ పడతాడు? పఠాన్, జిమ్‌కు ఉన్న సంబంధం ఏంటి? సీక్రెట్ ఏజెన్సీ ‘జోకర్’ని పఠాన్ ఎందుకు ఏర్పాటు చేశాడు? రక్తభీజ్ ప్లాన్‌ని చేధించే క్రమంలో పఠాన్, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై(దీపికా పదుకొణె) మధ్య ఏం జరిగింది? పాకిస్తాన్ కుట్రను అడ్డుకునే క్రమంలో భారత ఆర్మీ అధికారిణి (డింపుల్ కపాడియా) చేసిన త్యాగమేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో ‘పఠాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'వార్' మూవీతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీ విజయం అందుకున్నాడు. ఆ సినిమాలోని యాక్షన్, ఎమోషన్స్.. అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడు షారుఖ్‌తో సినిమా అనేసరికి ‘పఠాన్’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ‘ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై'తో పాటు ‘వార్’ లాంటి స్పై థ్రిల్లర్స్ నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరించడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. అందుకు తగ్గట్టే భారీ యాక్షన్స్ సీక్వెన్స్, విజువల్స్‌తో పఠాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే కథ మాత్రం రొటీన్‌గా ఉంటుంది. యాక్షన్స్ సీన్స్, విజువల్స్... ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలలో చూసినట్లుగానే ఉంటాయి. అయితే ఆ సినిమాల్లో పండిన ఎమోషన్ 'పఠాన్'లో పండలేదు. షారుఖ్ స్టార్డమ్తో సినిమాను లాక్కొచ్చారు. పస్టాఫ్ అంతా సాధారణంగా సాగుతుంది. జాన్ అబ్రహం, షారుఖ్ తలపడే సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే కథ మాత్రం ముందుకు వెనక్కి వెళ్తూ.. గందరగోళానికి గురి చేస్తుంది. రక్తభీజ్ను గుర్తించే క్రమంలో హెలికాప్టర్‌పై షారుఖ్, దీపికాలు చేసే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కానీ స్పై థ్రిల్లర్స్ తరహా సినిమాలు చూసేవాళ్లు ఆ ట్విస్ట్‌ని పసిగట్టే చాన్స్ ఉంది. ఇక సెకండాఫ్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ప్రీక్లైమాక్స్ ముందు వచ్చే ఇండియన్ ల్యాబ్ సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో షారుఖ్, జాన్ అబ్రహం యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. పఠాన్ కోసం టైగర్(సల్మాన్ ఖాన్) రావడం.. వారిద్దరు కలిసి చేసే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. షారుఖ్ అభిమానులకు, యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడేవారికి ‘పఠాన్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఇండియన్ జవాన్ పఠాన్ పాత్రలో షారుఖ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం షారుఖ్ పడిన కష్టమంతా తెరపై కనబడుతుంది. ప్యాక్డ్ బాడీతో కనిపించి అభిమానులను అలరించాడు. జాన్ అబ్రహం నెగెటివ్ రోల్లో అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్‌లో షారుఖ్‌తో పోటీపడి నటించాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబైగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందాలను ప్రదర్శించడమే కాదు.. యాక్షన్స్ సీక్వెన్స్‌లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె చేసే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అశుతోష్ రానా, డింపుల్ కపాడియాలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అంబానీ ఇంట్లో ఫంక్షన్‌కు ఆ డ్రెస్‌లో వెళ్తావా?: నటుడిపై ట్రోలింగ్
రిలయస్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలో గురువారం జరిగిన వీరి ఎంగేజ్మెంట్కు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా, అర్జున్ కపూర్, బోనీ కపూర్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, జాన్వీ, ఖుషి కపూర్, అనన్య పాండే సహా తదితరులు హాజరయ్యారు. దాదాపు అందరూ సాంప్రదాయ దుస్తుల్లోనే వేడుకలో పాల్గొన్నారు. కానీ నటుడు జాన్ అబ్రహం మాత్రం జీన్స్, టీ షర్ట్ అండ్ బ్లాక్ బేజర్ ధరించి ఫంక్షన్‌కు వెళ్లాడు. అంత క్యాజువల్‌గా ఫంక్షన్‌కు వెళ్లడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'భారతీయ సాంప్రదాయ వేడుకలకు ఎలా రెడీ అవ్వాలో తెలియదా? ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ సెలక్ట్ చేసుకోవాల్సింది, అయినా నీకే డ్రెస్సూ దొరకలేదా? మరీ జీన్స్‌లో వెళ్తావా?' అని క్లాస్ పీకుతున్నారు. 'అంబానీ ఫంక్షన్‌కు అంత సింపుల్‌గా వెళ్లిపోయావంటే నమ్మబుద్ధి కావట్లేదు, కాస్త మంచి డ్రెస్ వేసుకోవాల్సింది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా జాన్ అబ్రహం పఠాన్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: బంగారు బహుమతులిచ్చిన కీర్తి సురేశ్! భర్త ఎఫైర్లు భరించలేక విడాకులు కోరుతున్న నిర్మాత భార్య -
హీరోలకు చోటు లేదు.. ఆసక్తిగా 'ఏక్ విలన్ 2' పోస్టర్స్
Ek Villain 2 First Look Posters Of John Abraham Arjun Kapoor Out: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన తారగణంగా నటించిన చిత్రం 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సీక్వెల్లో ఎవరు నటించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించే నటీనటులను దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా రహస్యంగా ఉంచగా, తాజాగా వారి పేర్లను బయటపెట్టారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత నిరీక్షణకు తెరదింపారు. 'ఏక్ విలన్'కు సీక్వెల్‌గా వస్తున్న 'ఏక్ విలన్: రిటర్న్స్' చిత్రంలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
జస్ట్ నాలుగొందలకు నా సినిమాలు చూడటమేంటి, నాకది నచ్చదు: హీరో
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన యాక్షన్ మూవీ 'అటాక్: పార్ట్ 1' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడిన విషయం తెలిసిందే! నిజానికి ఇది మేలో ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సింది. కానీ దాన్ని వాయిదా వేసి నేరుగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా జాన్ అబ్రహం 'ఏక్ విలన్ రిటర్న్స్' మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూలై 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఒక నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఇష్టపడతాను. ఓటీటీ ఆడియన్స్ కోసం సినిమాలు తీస్తాను. కానీ నటుడిగా మాత్రం నేను వెండితెరపై కనిపించడానికి మాత్రమే ఇష్టపడతాను. జనాలు నెలకు రూ.300 లేదా రూ.400 కట్టి నన్ను ఓటీటీలో చూడటం నాకస్సలు నచ్చదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని నా సినిమా చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు, మధ్యలో వాష్‌రూమ్ అంటూ బ్రేక్ తీసుకుంటారు. కేవలం మూడు, నాలుగు వందల రూపాయలకు నేను వారికి అందుబాటులో ఉండను. నేను బిగ్ స్క్రీన్ హీరోను. అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం. 2014లో వచ్చిన ఏక్ విలన్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ కపూర్, తారా సుతారియా, దిశా పటానీ నటించారు. టీ సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ నిర్మించింది. కాగా జాన్ అబ్రహానికి జాన్ అబ్రహం ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్‌పై అతడు విక్కీ డోనర్, మద్రాస్ కేఫ్ సినిమాలు నిర్మించాడు. ఇకపోతే అతడు నటించిన 'అటాక్: పార్ట్ 1' ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ఓటీటీలో హిట్ కొట్టిన అనకాపల్లి డైరెక్టర్, ఇంతకీ ఆయనెవరో తెలుసా? ఎలా కన్నావని అడుగుతున్నారు? వారికి నా ఆన్సరేంటంటే.. -
ఓటీటీలో బాలీవుడ్ హీరో మూవీ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన యాక్షన్ మూవీ అటాక్ పార్ట్ 1. లక్ష్య రాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో మే 27 నుంచి అటాక్ స్ట్రీమింగ్ కానుంది. సుమారు 190కి పైగా దేశాల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఎంచక్కా ఇంట్లోనే అటాక్ ఫస్ట్ పార్ట్‌ను వీక్షించేయండి. activating the world digital premiere of #Attack on the 27th of May, only on #ZEE5! #AttackOnZEE5 pic.twitter.com/YI9siM4CpD — ZEE5 (@ZEE5India) May 14, 2022 చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? -
నా కెరీర్ ఖతమన్నారు, ఇప్పటికీ అలాగే రాస్తున్నారు: హీరో
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తాజాగా నటించిన యాక్షన్ మూవీ ఎటాక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో నెగెటివ్ రివ్యూలను, నెగెటివ్ కామెంట్లను తానసలు పట్టించుకోనంటున్నాడు జాన్ అబ్రహం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా సినిమాల గురించి నెగెటివ్‌గా రాసే వార్తలను నేను పట్టించుకోను. నా ప్రతి సినిమాకు నా కెరీర్ క్లోజ్ అంటూ రాస్తారు. కానీ అలా రాసేవాళ్లలో చాలామంది(పేర్లు చెప్పను) రచయితగా పని ఇప్పించమని వచ్చారు. వారికి నేను చేతనైనంత సాయం చేశాను. అప్పుడు వాళ్లు సారీ చెప్పి, మీ గురించి తెలీక అలా రాశాము. ఆరోజు ఏదో చికాకులో అలా రాసేశాం అని చెప్పేవారు.' 'బహుశా వాళ్లకు వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. లైఫ్‌లో సంతోషంగా లేకపోవచ్చు, లేదంటే ఉదయాన్నే మూడ్ ఆఫ్ అయి ఉండొచ్చు అని అర్థం చేసుకునేవాడిని. అలాగే రచయితగా అవకాశం ఇప్పించమని వచ్చినప్పుడు నాకు వీలైన సాయం చేసేవాడిని. అందులో కొందరు క్రిటిక్స్ తీరు మార్చుకున్నారు, మరికొందరు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇతర ఆర్టిస్టుల మీద పడుతూ వాళ్ల కెరీర్ ఖతమంటూ ఇంకా నెగెటివ్ రివ్యూలు రాస్తూనే ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న అకీరా, స్పందించిన రేణు దేశాయ్ బన్నీకి మెగాస్టార్ క్రేజీ విషెస్, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్ -
తెలుగు ఇండస్ట్రీపై సెటైర్లు, ఆ హీరో తలెక్కడ పెట్టుకుంటాడో?
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ బ్రేకుల్లేని బుల్డోజర్లా రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. బాక్సాఫీస్ మీద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం హిందీలోనూ మంచి వసూళ్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక ఏప్రిల్ 1న హిందీ హీరో జాన్ అబ్రహాం మూవీ ఎటాక్ రిలీజవగా దానికంటే నాలుగు రెట్లు ఎక్కువే రాబడుతూ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో పలువురు ఎటాక్ సినిమాపై, జాన్ అబ్రహంపై సెటైర్లు విసురుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జాన్ అబ్రహాం ఎటాక్ సినిమా ప్రమోషన్స్‌లో తెలుగు సినిమా స్థాయిని కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే! తానో హిందీ హీరోనని, తెలుగుతో పాటు ఎటువంటి ప్రాంతీయ సినిమాలో నటించబోనని తేల్చి చెప్పాడు. డబ్బుల కోసం వేరే తెలుగు సినిమా చేయనని దురుసుగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై సినీప్రియులు భగ్గుమన్నారు. తాజాగా ఎటాక్ సినిమా వసూళ్లను, ఆర్ఆర్ఆర్ కలెక్షన్లతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ రెండో శుక్రవారం కూడా రూ.13 కోట్లు సాధిస్తే ఎటాక్ తొలి రోజు కేవలం మూడు కోట్లు మాత్రమే రాబట్టింది, మరిప్పుడు జాన్ అబ్రహం తలెక్కడ పెట్టుకుంటాడో!' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది! -
తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
John Abraham Comments On Telugu and Regional Movie: తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజా చిత్రం ఎటాక్ ఏప్రిల్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మూవీ టీంతో కలిసి జాన్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్ అబ్రహం తెలుగు, ప్రాంతీయ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మూవీ ప్రమోషన్లో జాన్ అబ్రహం ఆయన అప్‌కమింగ్ సినిమాలపై స్పందించాడు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే, దక్షిణాది భాషలు మాత్రమే ఇక్కడ.. ఈ సందర్భంగా సలార్ మూవీలో ఆయన నటిస్తున్నట్టు వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. అనంతరం తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు చేయను. నేను ఓ హిందీ హీరోని. ఎన్నడు ఇతర భాషల్లో సెకండ్ హీరో, సహానటుడి పాత్రలు చేయను. ఇతర నటుల మాదిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటింబోయే ప్రసక్తే లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో 'మల్లి' పాత్ర చేసిన చిన్నారి ఎవరో తెలుసా? కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కితున్న పాన్ ఇండియా చిత్రం సలార్‌లో జాన్ అబ్రహం ఓ కీ రోల్ పోషించబోతున్నట్లు గతంలో జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అలాగే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పఠాన్ కోసం త్వరలోనే స్పెయిన్‌కు వెళుతున్నట్లు తెలిపాడు. పఠాన్ షూటింగ్లో భాగంగా తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, త్వరలోనే ముంబై వచ్చి ఆ తర్వాత స్పెయిన్‌కు పయనమవుతాన్నాడు. జాన్ అబ్రహం లీడ్ రోల్లో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ‘ఎటాక్’ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. -
మీ బ్రెయిన్‌ను ఇంట్లో పెట్టి వచ్చినట్టున్నారు.. రిపోర్టర్లపై విరుచుకుపడ్డ స్టార్ హీరో
John Abraham Calls Journalists As Dumb In Attack 1 Movie Press Meet: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో జాన్ అబ్రహం ఆగ్రహానికి లోనై రిపోర్టర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ జాన్‌ను మీ సినిమాల్లో యాక్షన్ ఓవర్ డోస్ ఉంటుంది. మీరు నలుగురైదుగురితో పోరాడుతుంటే బాగుంటుంది. కానీ మీరు ఒక్కరే 200 మందితో ఫైట్ చేయడం బైక్‌లను విసిరేయడం, మీ చేతులతో ఛాపర్లను ఆపడం వంటివి కొన్ని చూస్తే కొంచెం అతిగా అనిపిస్తూ ఉంటుంది. అని అన్నాడు. చదవండి: ఇండియాస్ సూపర్ సోల్జర్‌పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్ దీనికి కోపగించుకున్న జాన్ 'మీరు దేని గురించి మాట్లాడుతున్నారు' అని ఆ జర్నలిస్ట్‌ను అడగ్గా.. 'సత్యమేవ జయతే' గురించి అని అతను బదులిచ్చాడు. అందుకు జాన్ అబ్రహం 'నేను ఎటాక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు దీంతో ఏమైనా సమస్య ఉంటే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నిజంగా బాధపెట్టాను.' అని వెటకారంగా సమాధానమిచ్చాడు జాన్. అనంతరం ఫిట్నెస్ గురించి అడిగిన ప్రశ్నకు 'శారీరకంగా ఫిట్‌గా ఉండటం కంటే కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ప్రయత్నిస్తుంటాను. క్షమించండి సార్. మీరు మీ మెదడును ఇంట్లో వదిలేసి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుతున్నాను. పర్వాలేదు. మరోసారి బాగా ప్రయత్నించండి.' అంటూ వ్యంగంగా మాట్లాడాడు జాన్ అబ్రహం. చదవండి: అదరగొడుతున్న సూపర్ సోల్జర్.. 'ఎటాక్' రెండో ట్రైలర్ రిలీజ్ -
అతని తపన నాకు ఎంతో నచ్చుతుంది: జాక్వెలిన్ ఫెర్నాండేజ్
Jacqueline Fernandez Says Working With John Abraham In Attack 1 Movie: హౌస్‌ఫుల్ 2, రేస్ 2, ఢిష్యుం తర్వాత బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎటాక్: పార్ట్ 1'. ఎక్ థా టైగర్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి యాక్షన్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, 'రాకెట్ సింగ్' మూవీకి దర్శకత్వం వహించిన లక్ష్యరాజ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పా ఠక్ షా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాక్వెలిన్. చదవండి: ఇండియాస్ సూపర్ సోల్జర్‌పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్ 'ఎటాక్-1 ఓ కొత్త రకమైన ఆసక్తికరమైన కథ. ఇది భారతదేశంలో తెరకెక్కిన తొలి సూపర్ సోల్జర్ సైన్స్ ఫిక్షనల్ స్టోరీ. ఇందులో అవకాశం రావడం సంతోషంగా, గౌరవంగా ఉంది. జాన్ అబ్రహంతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సంతోషంగా, సరదాగా, సౌకర్యవంతగా ఉంటుంది. సినిమా కోసం జాన్ అబ్రహం పడే తపన నాకు ఎంతో నచ్చుతుంది.' అని జాక్వెలిన్ తెలిపింది. ఈ మూవీకి పెన్ స్టూడియోస్, జెఏ ఎంటర్టైన్మెంట్, అజయ్ కపూర్ ప్రొడక్షన్ సమర్పణలో డాక్టర్ జయంతిలాల్ గడా, హీరో జాన్ అబ్రహం, అజయ్ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది వరకూ ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
అదరగొడుతున్న సూపర్ సోల్జర్.. 'ఎటాక్' రెండో ట్రైలర్ రిలీజ్
John Abraham Attack Part 1 Movie Second Trailer Release: ఇప్పటివరకూ దేశాన్ని కాపాడేందుకు సైనికులు చేసిన సాహసాలు చూశాం. దుష్ట శక్తులతో పోరాడి కష్టాల్లో ఉన్న వారిని రక్షించిన సూపర్ హీరోలను వీక్షించాం. ఇప్పుడు ఒక కొత్త సూపర్ సోల్జర్ను చూడబోతున్నాం. అటు సూపర్ హీరోల అద్భుత శక్తి, ఇటు సైనికుల దేశభక్తిని పుణికిపుచ్చుకుని వస్తున్నాడు ఈ సూపర్ సోల్జర్. అతనెవరో కాదు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం. 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్: పార్ట్ 1'. ఉగ్రవాదులను ఏరిపారేసే తొలి సూపర్ సోల్జర్‌గా కనిపించనున్నాడు జాన్ అబ్రహం. ఇది వరకు ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆ ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగళవారం (మార్చి 22) ఈ మూవీ రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్లానే ఈ ట్రైలర్ అదిరిపోయింది. బీజీఎం, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఒక సోల్జర్‌కు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అమర్చి, దేశ భద్రతను కాపాడలనే సరికొత్త కథతో ఈ సినిమా రూపొందింది. సైన్స్ ఫిక్షన్, హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. -
ఇండియాస్ సూపర్ సోల్జర్‌పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్
John Abraham Attack Movie Part 1 Trailer Released: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎటాక్ సినిమా మొదటి పార్ట్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి మనం పుట్టిన రోజు. మరొకటి మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో కట్టిపడేసింది. చాలా థ్రిల్లింగ్‌గా యాక్షన్ ఉంది. శశ్వాత్ సచ్దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్స్ సీన్స్‌లో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం వావ్ అనిపిస్తుంది. ఈ మూవీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొనే సూపర్ సోల్జర్ పాత్రలో జాన్ అబ్రహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎటాక్ అనేది 'జాన్ అబ్రహం ఎంటర్టైన్మెంట్' సొంత స్వదేశీ కాన్సెప్ట్. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాలు అసమానంగా ఉంటాయి. ఈ సినిమాలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ట్రైలర్లో వాటిని చూపించలేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్‌లను వెండితెరపైనే చూడాలి.' అని నిర్మాతల్లో ఒకరైనా జాన్ అబ్రహం తెలిపాడు. అలాగే ఈ చిత్రం గురించి డైరెక్టర్ లక్ష్య రాజ్ 'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. అద్భుతమైన నటీనటులు, చిత్ర యూనిట్‌తో తెరకెక్కించాం. మేము పడిన కష్టాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడనున్నారు.' అని పేర్కొన్నాడు. -
బిగ్ అప్డేట్: ఎట్టకేలకు ‘బాద్షా’ నుంచి పఠాన్ టీజర్, రిలీజ్ డేట్
ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నుంచి మూవీ అప్డేట్ వచ్చింది. షారుక్ వెండితెరపై సందడి చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. జీరో మూవీ తర్వాత షారుక్ నటిస్తున్న చిత్రం పఠాన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి షారుక్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. పఠాన్ మూవీ టీజర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాడు. ఈ మేరకు షారుక్ ట్వీట్ చేస్తూ.. ‘నాకు తెలుసు చాలా ఆలస్యం అయ్యిందని. కానీ డేట్ గుర్తు పెట్టుకోండి. చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు ‘పఠాన్’ టైం వచ్చింది. 2023 జనవరి 25న బిగ్ స్క్రీన్‌పై కలుసుకుందాం’ అంటూ రాసుకొచ్చాడు. ఇక టీజర్ విషయానికి వస్తే ఈ మూవీలోని జాన్ అబ్రహం, దీపికా పదుకొనెల పాత్రలను పరిచయం చేస్తూ షారుక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలగే చివరిలో షారుక్ ఎంట్రీ ఇవ్వడం బాద్షా అభిమానులకు సర్ప్రైజింగ్ ఉందా. చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ షారుక్ ఇలా చూడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో 50వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. I know it’s late… But remember the date… Pathaan time starts now… See you in cinemas on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you. @deepikapadukone |@TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/dm30yLDfF7 — Shah Rukh Khan (@iamsrk) March 2, 2022 -
కరోనా కలకలం: స్టార్ హీరో దంపతులకు కోవిడ్ పాజిటివ్
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, నటి నోరా ఫతేహీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఆయన భార్య ప్రియా రుంచల్ కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి ‘కొద్ది రోజుల క్రితం నేను కలిసి ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా నాకు, నా భార్య ప్రియకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇటీవల మేమిద్దరం వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం. అయినా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి’ అని వెల్లడించాడు. అంతేగాక ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో తనని కలిసిన వారు వెంటనే టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్‌కు వెళ్లాలని జాన్ అబ్రహం సూచించాడు. కాగా ఇటీవల కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువురు రాజకీయ నేతలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. -
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ బర్త్‌డే.. జాన్ అబ్రహం స్టార్ కాకముందు
John Abraham Birthday Special On His Career: బాలీవుడ్ యాక్టర్, కండల వీరుడు జాన్ అబ్రహం పుట్టినరోజు నేడు. 1972 డిసెంబర్ 17న కేరళలో జన్మించిన జాన్ అబ్రహం తల్లి పార్సీ, తండ్రి మలయాళీ. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన జాన్ అబ్రహంకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. జాన్ నేటికి (డిసెంబర్ 17) 48 ఏళ్లు. మోడలింగ్ సమయంలో డబ్బు లేకపోవడంతో అతడు కొన్ని రోజులు మీడియా ప్లానర్‌గా పనిచేశాడు. ఈ విషయం అతి తక్కువ మందికి తెలుసు. జాన్ అనేక మ్యూజిక్ వీడియోలు, అడ్వర్టైజ్మెంట్స్ చేశాడు. అనంతరం 2003లో 'జిస్మ్' సినిమాతో బాలీవుడ్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత 'సాయా', 'పాప్' సినిమాల్లో కనిపించాడు. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) 2004లో వచ్చిన 'ధూమ్' సినిమా జాన్ అబ్రహం సినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. అభిషేక్ బచ్చన్ పోలీసు పాత్రలో నటించగా, జాన్ అబ్రహం దొంగ పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తర్వాత పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. గరం మసాలా, దోస్తానా, వెల్కమ్ బ్యాక్, ఫోర్స్-2, అటామిక్, సత్యమేవ జయతే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఎన్నారై ప్రియా రుంచల్ను 2014లో వివాహం చేసుకున్నాడు జాన్ అబ్రహం. అయితే ప్రియా ఒక బ్యాంకర్, సినిమాలను పట్టించుకోదని ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం చెప్పాడు. ఇద్దరూ పూర్తిగా విభిన్న రంగాలకు చెందిన వారైన జాన్ అలవాట్లంటే తనకు చాలా ఇష్టమని ప్రియా చెప్పుకొచ్చేది. జాన్ అబ్రహం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని మెచ్చుకునేది ప్రియా. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) జాన్ అబ్రహంకు బైక్‌లంటే చాలా ఇష్టం. అతని దగ్గర రూ. లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ, హోండా సీబీఆర్, అప్రిలియా, యమహా, ఎంవీ అగస్టా, డుకాటీ ఉన్నాయి. జాన్ 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్' అని నిరూపించాడు. జాన్ ఎలాంటి ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు లేవు. అంతేకాకుండా అలాంటి ఏ పార్టీల్లో పాల్గొనడట. జాన్ అబ్రహం జంతు ప్రేమికుడు కూడా. వివిధ సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ బీటౌన్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ఈ హ్యాండ్సమ్ హంక్. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) -
బిగ్‌బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో
John Abraham Cries In front Of Amitabh Bachchan: బాలీవుడ్ హీరో, కండల వీరుడు జాన్ అబ్రహం రియాలిటీ షో వేదికపై ఒక్కసారిగా కన్నీటి పర్యంతరమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు అతిగా జాన్ అబ్రహం వచ్చాడు. ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోన్న ఈ షో ది. ‘సత్యమేవ జయతే 2’ హీరోహీరోయిన్ అయిన జాన్ అబ్రహాం, దివ్యా ఖోస్లా కుమార్ సందడి చేశారు. చదవండి: Priyanak Chopra-Nick Jonas: తమ విడాకుల రూమార్లపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను సోనీ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇందులో జాన్ అబ్రహాం తనదైన శైలిలో హాట్ సీట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన సిక్స్ ప్యాక్‌ను ప్రదర్శించాడు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా కేకలతో హోరెత్తించారు. ఆ వెంటనే బిగ్‌బి అంతా అమ్మాయిలే కేకలేస్తున్నారంటూ చమత్కిరించారు. హాట్ సీట్‌పై కూర్చున్న జాన అబ్రహం ‘ధూమ్’ సినిమా తర్వాత ఓసారి తాను అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. చదవండి: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్? ‘‘నేను బైక్‌పై మీ ఇంటికి అభిషేక్‌ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సహించవద్దంటూ మీరు నాకు చెప్పారు.. గుర్తుందా!’’ అంటూ చెప్పాడు. అయితే అభిషేక్ కిందకురాగానే ‘వావ్.. బైక్ చాలా బాగుంది’ అంటూ మీరు మాట మార్చేశారని జాన్ అనడంతో బిగ్‌బి గట్టిగా నవ్వేశారు. ఇక ఏమైందో తన వ్యక్తిగత విషయం చెబుతూ జాన్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రోమో ఎండింగ్లో జాన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. మరి, అతడి దు:ఖానికి కారణమేంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
సీక్రెట్‌గా వీడియో రికార్డ్.. ఫోన్ లాక్కున్న స్టార్ హీరో
John Abraham Snatches Fans Phone Video Goes Viral: తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. వారితో ఒక్క ఫోటో అయినా దిగాలని తెగ ఆరాటపడుతుంటారు. మరికొందరైతే కనీసం వాళ్ల అనుమతి కూడా తీసుకోకుండా ఫోటోలు క్లిక్‌మనిపిస్తారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన స్నేహితుడిగా కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంతలోనే జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్ లాక్కున్నాడు. అనంతరం కెమెరా వైపు చూస్తూ.. హాయ్ గాయ్స్ ఇప్పుడు ఒకేనా..? అంటూ నవ్వుతూ మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరో అయ్యిండి కూడా అభిమానులను ఫన్నీగా ఆటపట్టించడం భలేగుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో సత్యమేవజయతే-2 చిత్రంలో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. -
Kusu Kusu Song: మరోసారి కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నోరా ఫతెహీ
నోరా ఫతేహీ.. ఈ పేరు వింటే చాలు అందరికీ గుర్తు వచ్చేది దిల్బర్ సాంగ్. ఆ పాటలో తన హావాభావాలతో యువతను ఎలా పిచ్చెక్కించిందో చూశాం. ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని కొల్లగొట్టేందుకు కొత్త సాంగ్‌తో వచ్చేసిందీ డ్యాన్స్ క్వీన్. బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహమ్ అప్‌కమింగ్ మూవీ సత్యమేవ జయతే 2 లోని 'కుసు కుసు' సాంగ్ ఇవాళ విడుదలైంది. ఈ పాటలో నోరా తన అందం, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్, సొగసైన బెల్లీ డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. సత్యమేవ జయతే 2 లోని మేరీ జిందగీ హై తూ పాట తర్వాత నిర్మాతలు నోరా ఫతేహీ నటించిన కుసు కుసు సాంగ్‌ను రిలీజ్ చేశారు. జారా ఎస్ ఖాన్, దేవ్ నేగీలు పాడిన ఈ పాటకు తనిష్క్ బగ్చీ లిరిక్స్ రాశారు. 2018లో వచ్చిన సత్యమేవ జయతే భారీ సక్సెస్ తర్వాత జాన్ అబ్రహమ్‌తో సీక్వెల్ తీశారు. అన్యాయం, అధికార దుర్వినియోగంపై పోరాటమే సత్యమేవ జయతే 2 కథ. 'ఈసారి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ రెట్టింపు అవుతుంది' అని జాన్ అబ్రహమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) మిలాప్ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ పిల్లయ్, అనూప్ సోనీ, సాహిల్ వాయిద్ నటిస్తున్నారు. నవంబర్ 25న సత్యమేవ జయతే 2 సినిమా విడుదల కానుంది. -
Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ
పిల్లలు ఉన్న చోట పెద్దలు ఉండక తప్పదు. కాని ఆ పెద్దలకు ఒక బాల్యం ఉంటుంది. బతికిన ఒక ఊరు ఉంటుంది. ఏదో ఒక స్థలంతో, ఆవాసంతో బంధం ఉంటుంది. తమ చివరి రోజుల్లో వాటిని ఒకసారి చూసుకోవాలని వారికి ఉంటుంది. పిల్లలకు అది పట్టదు. కాని వారిని అర్థం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుస్తే వారు పొందే ఆనందం చాలా విలువైనది. ‘సర్దార్ కా గ్రాండ్సన్’లో ఒక నానమ్మ చివరి సందర్శనను మనవడు నెరవేరుస్తాడు. ఆదివారం సినిమా పరిచయం. వృద్ధాప్యంలో జ్ఞాపకం పెద్ద ఊతంగా ఉంటుంది. గతం ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా వాటిలో ఉంటాయి. కాని వాటి గాఢత, ఆ సందర్భాలను దాటి రావడం వల్ల పూర్తిగా తగ్గి, ఆ అనుభవాల పునఃసందర్శనకు కూడా శక్తి ఉంటుంది. ఇక మంచి జ్ఞాపకాలనైతే వెతుక్కుంటూ వెళ్లాలని ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నవారి మనసుల్లో ఏం కోరిక ఉందో పిల్లలకు పెద్దగా పట్టదు. వారిని బాగా చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతారు. కాని ఇవాళ్టి వృద్ధులు ఒకప్పటి యవ్వనవంతులు, యువతీ యువకులు, భార్యాభర్తలు, ఉద్యోగులు, సంసారులు. వారి జీవనంతో పెనవేసుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటిని వారు ఆఖరిశ్వాస వరకూ పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటారు. తాము పోయేలోపు ఆ ఫలానా స్థలాన్నో, వ్యక్తినో, ఊరినో తిరిగి చూడాలనుకుంటారు. ఆ కోరిక తీరిస్తే వారికి కలిగే ఆనందం అనంతం. ‘సర్దార్ కా గ్రాండ్’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సినిమా. అమృత్‌సర్‌లో స్థిరపడిన శ్రీమంతురాలైన 90 ఏళ్ల వృద్ధురాలి కథ అది. ఆమె పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆమె కూడా ఇక హాయిగా చివరి శ్వాస తీసుకోవచ్చు. కాని ఆమె మనసులో ఒక కోరిక. తాను మరణించేలోపు తను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చూడాలనేది. అదేం పెద్ద కోరిక అనుకోవచ్చు. కాని ఆ ఇల్లు లాహోర్‌లో ఉంది. దేశ విభజన సమయంలో దానిని ఆమె విడిచి వచ్చేసింది. అక్కడ ఉండగా భర్తతో ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కట్టుకుంది. అందులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. అందులోనే నాటి అల్లర్లలో భర్త ప్రాణం విడిచాడు. ఆ ఇంటిని చూసుకోవాలని ఉంటుంది. కాని ఆమె ఆరోగ్యరీత్యా వేరే కారణాల రీత్యా ఎవరూ ఆ కోరికను మన్నించరు. కాని ఆమె మనవడు ఆమె కోరికను అర్థం చేసుకుంటాడు. దానిని నెరవేర్చాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంది. ఇంటినే కదిలించి అమృత్‌సర్‌లో ఉన్నవారు పాకిస్తాన్‌కు వెళ్లిరావడం పెద్ద సమస్య కాదు. కాని మనవడికి వీసా వస్తుంది కాని నానమ్మకు రాదు. దానికి కారణం గతంలో ఒక క్రికెట్ మేచ్‌లో ఆమె చేసిన అల్లరే కారణం. అందుకని మనవడు లాహోర్ వెళతాడు. ఏ ఇంటికైతే తన నానమ్మ రాలేదో ఆ ఇంటినే అమృత్‌సర్‌కు తీసుకువస్తాడు. అంటే దానిని పునాదులతో సహా పెకలించి ట్రక్కు మీద పెట్టి అమృత్సర్ తీసుకువస్తాడు. అయితే అదంత సులువు కాదు. దాని కోసం అతడు ఏమేమి తిప్పలు పడ్డాడనేది కథ. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంట్‌తో సినిమా మొదటి పదిహేను నిమిషాలు స్లోగా ఉన్నా తర్వాత అందుకుంటుంది. నీనా గుప్తా సర్వమై ఈ సినిమా గత నెల విడుదలైంది. ఆశించినంత స్పందన రాలేదు. దానికి కారణం ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండొచ్చు. అయితే ఈ సినిమా ఒకసారి చూసేంతగా ఆకట్టుకోవడానికి కారణం వృద్ధురాలిగా నటించిన నీనా గుప్తా నటన. ఆమె మన మనసులోని భావాలను, నాటి అనుభవాల గాఢతను తెర మీద వ్యక్తం చేయడంలో గొప్ప నటన చూపించింది. ఈ సినిమా చూసినంత సేపు మన ఇంట్లో నానమ్మో, తాతయ్యో, ఇరువురో ఉంటే ‘మీకేం కావాలి... మీరేం చూడాలనుకుంటున్నారు... మీరెవరిని కలవాలనుకుంటున్నారు’ అని అడిగేలా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ నటించారు. లాహోర్ ఫ్లాష్‌బ్యాక్‌లో జాన్ అబ్రహామ్, అదితి రావ్ హైదరీ మెప్పిస్తారు. జాన్ అబ్రహామ్ దీని నిర్మాత. -
Bipasha Basu Love Story: బ్రేకప్ నరకమే, కానీ..
ప్రేమ జీవితపు కాలపు గ్యారెంటీ, వారెంటీ ఇవ్వదు.. ఈ కథకు బిపాషా బసు, జాన్ అబ్రహమ్లే నాయికా, నాయకులు! ఇద్దరూ మధ్యతరగతి విలువలతో పెరిగి జీవన ప్రయాణంలోని అనుభవాలతో పరిణతి సాధించిన వాళ్లే! ఇద్దరూ నిజాయితీని ఆస్తిగా భావిస్తారు. . అందం.. హ్యాండ్సమ్నెస్లో ఎవరికివారే సాటి. ఆమెను చూస్తే మహిళలకు గుండె ధైర్యం పెరుగుతుంది.. మగవాళ్ల గుండె జారుతుంది. అతను.. పురుషులకు అద్భుతంగా కనిపిస్తాడు.. స్త్రీలకు కనికట్టు చేస్తాడు. ఈ పర్ఫెక్ట్నెస్తోనే వాళ్ల మధ్య ప్రేమ ఇమడలేకపోయింది. ఇద్దరినీ చెరో ఒడ్డుకి చేర్చింది. ‘జిస్మ్’ సినిమా సెట్స్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బిపాషా బోల్డ్‌నెస్‌ను గౌరవించాడు అతను. పనిపట్ల జాన్‌కున్న సీరియస్‌నెస్‌ను ఆమె ఆరాధించింది. పరస్పరం ఉన్న ఇష్టాన్ని వ్యక్తపర్చుకున్నారు. స్క్రీన్ మీద ఈ జంటకు అభిమానులు పెరిగారు. వీళ్లు కలిసి నటించిన సినిమాల్లో కొన్నయితే కథతో సంబంధం లేకుండా కేవలం వీళ్ల కెమిస్ట్రీ పండే హిట్ అయ్యాయి. రియల్ లైఫ్‌లోనూ వీళ్ల ప్రేమ వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. ఆ ఇద్దరు కూడా ఏ రోజూ వాళ్ల వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. ‘మేం మామూలు ఫ్రెండ్స్ అంతే’ అనే ఫేక్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. ముఖ్యంగా బిపాషా.. జాన్‌తో తాను సహజీవనం చేస్తున్నాననే చెప్పింది. అయిదేళ్లు గడిచాకా.. ఒకసారి ‘కాఫీ విత్ కరణ్ షో’కి బిపాషా, జాన్‌లను పిలిచాడు కరణ్. ఆ ఇద్దరికీ కంపాటబులిటీ టెస్ట్ పెట్టాడు విడివిడిగా. ఇద్దరూ ఇంచుమించు పదికి తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు. ఆ షోలో ఒకరి పరోక్షంలో ఒకరు తమ సహచరి/ సహచరుడి అభిరుచులు, అలవాట్లు, సర్దుబాట్ల గురించి చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. ఇంప్రెస్ చేశాయి. ఆ ప్రేమ జంటకు వీరాభిమానులను చేశాయి. షో యూట్యూబ్ స్ట్రీమింగ్కు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను చేర్చాయి. తొమ్మిదేళ్లు కావొచ్చాయి.. కెరిర్లో ఇద్దరూ బిజీ అయిపోయారు. అయినా బిపాషా జాన్‌తో పెళ్లే ముఖ్యమనుకుంది. ఆ ప్రేమను కాపాడుకోవడమే పరమావధిగా తీసుకుంది. జాన్‌ను అడుగుతూనే ఉంది ‘పెళ్లెప్పుడు చేసుకుందాం?’ అంటూ. అతణ్ణించి స్పష్టమైన సమాధానం రాలేదు. కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడులే.. చేయనీ. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాడు కదాని ఊరుకుంది. మరింత కాలం సాగింది ముందుకు. ఇద్దరికీ ఫిట్నెస్ అంటే పిచ్చి. ఇద్దరూ కలిసి ఒకే జిమ్‌కు వెళ్లేవారు. ఒకరోజు ఆ జిమ్‌కి ఒక అమ్మాయి వచ్చింది. ఎన్ఆర్ఐ. పేరు.. ప్రియ రంచల్. పరిచయాలు అయ్యాయి. రోజూ ముగ్గురు కలిసే జిమ్ చేయడం స్టార్ట్ చేశారు. బిపాషా వెళ్లిపోయాక కూడా జాన్ ఇంకొచెం సేపు ఉండి జిమ్ చేయసాగాడు. ప్రియ కూడా తన అదనపు సమయాన్ని వెచ్చించ సాగింది. అక్కడ ఆకర్షణ పెరుగుతూంటే బిపాషాతో జాన్ గడిపే వ్యవధి తగ్గిపోతూ రాసాగింది. బిపాషా అతని కోసం ఎదురు చూడ్డం అలవాటు చేసుకుంది. రోజురోజుకూ ఆమె ఎదురు చూసే టైమ్ పెరగసాగింది. అన్యోన్యత ముభావాన్ని నేర్చుకుంది. కలిసి మాట్లాడుకోవడమే కరువైంది. ఒకే ఇంట్లో అపరిచితులైపోయారిద్దరూ. తామిద్దరికీ ‘పెళ్లి’ ముడి లేదని అర్థమైపోయింది బిపాషాకు. జాన్ కూడా గ్రహించాడు ఆ సహజీవనానికి అర్థంలేదని. పెద్దగా వాదోపవాదాలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు లేకుండానే మీడియా ముందు తమ బ్రేకప్ను ప్రకటించింది ఆ జంట. ఫీల్డ్‌లో.. బయటా అంతా షాక్. పెళ్లి కబురు వినిపిస్తారనుకుంటే ఇదేంటిలా విడిపోతున్నామంటున్నారు? అని. తమ ఇంట్లోని పిల్లలే బ్రేకప్ మాట చెప్పినంత బాధపడ్డారు. తమ ఇంటి జంటే విడిపోయినంత నొచ్చుకున్నారు. ఇద్దరి పట్లా టన్నుల కొద్దీ సానుభూతి పెంచుకున్నారు. ఇలా జరక్కుండా ఉంటే బాగుండు అనుకున్నారు. అయితే ఆ ఎడబాటు వాళ్లు ప్రకటించుకున్నంత సులభంగా.. స్నేహపూర్వకంగా జరగలేదు. బిపాషా ఒక వార్తా దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తేలింది. ‘ఏ ప్రేమా స్నేహంగా బ్రేకప్ చెప్పుకోదు. స్నేహమే ఉంటే బ్రేకప్ దాకా ఎందుకు వస్తుంది? మాదీ అంతే. ఆ ఇంట్లో నేను అనాథనైపోయాననిపించింది. మా అనుబంధం పట్ల జాన్‌కు సీరియస్‌నెస్ లేదని, అతనికి నన్ను పెళ్లిచేసుకునే ఆలోచనే లేదని తేలింది. నా కెరీర్ కన్నా ప్రేమే ముఖ్యమనుకున్నా. దానికోసం కెరీర్‌నూ పట్టించుకోలేదు. ఆఖరికి ఆ ప్రేమ కూడా లేదని తెలిసింది. మోసపోయాననే ఫీలింగ్ వెంటాడింది. నిజాయితీ లేని చోట ఉండలేకపోయా’ అని చెప్పింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో జాన్ కూడా స్పందించాడు..‘ బిపాషా అడిగినప్పుడు పెళ్లి పట్ల నేనంత సీరియస్‌గా లేని మాట నిజమే. కాని నిజాయితీ లేని, అబద్ధాలాడే నేపథ్యం నుంచి వచ్చినవాడినైతే కాదు. బ్రేకప్ నరకమే. అన్నేళ్ల సహజీవనం ఎన్నో జ్ఞాపకాలను మిగిలుస్తుంది. మరిచిపోవడం అంత సులభం కాదు. కానీ తప్పదు.. ముందుకు సాగాలి కదా’ అని జాన్ చెప్తున్నప్పుడు అతని గొంతు జీరబోయింది బాధతో. బ్రేకప్ అయిన తర్వాత జానే ముందుగా పెళ్లిచేసుకున్నాడు ప్రియా రంచల్ని. తర్వాత బిపాషా పెళ్లాడింది టీవీ, సినీ స్టార్ కరణ్ సింగ్ గ్రోవర్‌ను. - ఎస్సార్ చదవండి: టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? -
సల్మాన్ ‘రాధే’కు పోటీయే లేదు.. ‘సత్యమేవ జయతే 2’ వాయిదా
సాధారణంగా ఈద్ పండుగ అంటే బాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి మాములుగా ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది బాలీవుడ్లో పెద్ద చిత్రాలేవీ రాలేదు. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఓ సినిమాను విడుదల చేసే సల్మాన్ ఖాన్ సైతం గత ఏడాది ఖాళీగా ఉన్నాడు. ఇక ఈ సారి ఏదేమైనా ఈద్‌కి వచ్చేస్తానని ప్రకటించాడు సల్మాన్. అన్నట్లుగానే ఈద్ సందర్భంగా తన లేటెస్ట్ సినిమా ‘రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ని మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలలో కూడా విడుదల చేయనున్నాడు. మరోవైపు జాన్ అబ్రహం ’సత్యమేవ జయతే 2' కూడా అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహంకి, సల్మాన్‌కి మధ్య వార్ తప్పదని భావించారు అంతా. కానీ జాన్ అబ్రహం ఒక అడుగు వెనక్కి వేశాడు. తన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. అందువల్ల మా సత్యమేవ జయతే సినిమాను వాయిదా వేస్తాం. తర్వాత రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’ అంటూ 'సత్యమేవ జయతే2' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. దీంతో ఒక్క ‘రాధే’ తప్ప, ఇతర సినిమాలేవి థియేటర్లలో విడుదల కావడంలేదు. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలు కూడా తాజా సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్సేన్ 'పాగల్' సినివాలు కూడా వాయిదాపడ్డాయి. -
జాన్ అబ్రహాం, అభిషేక్‌ల మూవీకి డైరెక్టర్ ఫిక్స్
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించనున్నారు. మలయాళ వెర్షన్లో బిజూ మీనన్ చేసిన క్యారెక్టర్‌ను జాన్ అబ్రహాం, పృథ్వీరాజ్ చేసిన పాత్రను అభిషేక్ బచ్చన్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ‘మిషన్ మంగళ్’ సినిమాను డైరెక్ట్ చేసిన జగన్ శక్తి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ‘దస్వీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటు జాన్ అబ్రహాం కూడా ‘ఏక్ విలన్ రిటర్న్స్’, షారుక్‌ఖాన్ ‘పటాన్’ సినిమాలు చేస్తున్నారు. -
సల్మాన్ వర్సెస్ జాన్
సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్’ రంజాన్ సందర్భంగా మే 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే రోజు రావడానికి జాన్ అబ్రహామ్ రెడీ అయ్యారు. మూడేళ్ల క్రితం జాన్ అబ్రహామ్ హీరోగా మిలాప్ ఝవేరీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘సత్యమేవ జయతే 2’ రంజాన్ రిలీజ్‌కి రెడీ అయింది. మే 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో జాన్ అబ్రహామ్ రెండు పాత్రలు చేశారు. సినిమాలో జాన్ వర్సెస్ జాన్ అయితే బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ వర్సెస్ జాన్ అనాలి. రంజాన్ సల్మాన్‌కి కలిసొచ్చే పండగ. ఈ సీజన్లో విడుదలైన సల్మాన్ సినిమాలు ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘కిక్’, ‘బజరంగీ భాయీజాన్’, ‘సుల్తాన్’ వంటివి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించాయి. ‘రాధే’ కూడా ఈ హిట్ లిస్ట్‌లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘సత్యమేవ జయతే 2’ని కూడా తక్కువ చేయడానికి లేదు. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలూ హిట్టవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక అభిమానులంటారా? తమ అభిమాన హీరో సినిమానే హిట్టవ్వాలని కోరుకోవడం సహజం. ఏది ఏమైనా ‘సల్మాన్ వర్సెస్ జాన్’ అనేది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
పిస్తోలు ఫ్యాషన్ కోసమే.. భయపెట్టడానికి నా పేరు చాలు
ముంబైలో జాన్ అబ్రహమ్ డాన్‌గా మారి ఒక రాజకీయ నాయకుడి తమ్ముణ్ణి చంపేశాడు. ఇప్పుడు అతని తలమీద పదికోట్ల బహిరంగ విలువ నిర్థారించబడింది. ఎవరు ఆ తలను తెస్తే వారికి పది కోట్లు. ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ హష్మీ రంగంలోకి దిగాడు. ఈ తాజా మాస్ మసాలా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ‘కాంటె’, ‘జిందా’, ‘షూట్ అవుట్ ఎట్ వడాలా’ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సంజయ్‌గుప్తా దీని నిర్మాత, దర్శకుడు. జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి ప్రధాన తారాగణం. మన కాజల్ అగర్వాల్ మరో ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. ఎనభైలలో జరిగిన ఈ కథను నాటి బాంబే గూండాయిజాన్ని ఈ సినిమాలో కథాంశంగా తీసుకున్నారు. గూండా మామూళ్లను ఎదిరించి గూండాగా మారిన పాత్రలో జాన్ అబ్రహమ్ కనిపిస్తాడు. ‘పిస్తోలు ఊరికే ఫ్యాషన్ కు పెట్టుకుంటాను. భయపెట్టడానికి నా పేరు చాలు’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. చూడాలి ప్రేక్షకులు ఏం తీర్పు చెబుతారో. -
యాక్షన్ ఇన్ బూర్జ్ ఖలీఫా
రెండేళ్ల విరామం తర్వాత షారుక్ ఖాన్ చేస్తున్న చిత్రం ‘పతాన్’. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. జాన్ అబ్రహామ్ విలన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బూర్జ్ ఖలీఫాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట ‘పతాన్’ చిత్రబృందం. బూర్జ్ ఖలీఫాలో చిత్రీకరణ జరుపుకోనున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్, ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ వంటి హాలీవుడ్ సినిమాలను ఈ భవనంలో చిత్రీకరించారు. ‘పతాన్’ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది. -
అజిత్‌తో అతిథిగా!
తమిళ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘వలిమై’. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ కథానాయిక. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో రేసర్ పాత్రలో జాన్ కనిపిస్తారట. బైక్స్, బేక్ రేసింగ్ అంటే జాన్ అబ్రహాంకి ఆసక్తి అనే విషయం గుర్తుండే ఉంటుంది. ఇది జాన్ అబ్రహాంకి తొలి తమిళ సినిమా అవుతుంది. -
ప్రభాస్ సలార్ అప్డేట్, విలన్ అతడేనా!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. చదవండి: ప్రభాస్ అభిమానులకు ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ హామీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ మినహా మిగతా నటీనటుల ఎంపికను ఇంకా ఫైనల్ కాలేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్యాస్టింగ్, టెక్నికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ భామ దిశా పటాని నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సలార్ సినిమాలో విలన్ పాత్రలో కూడా ఓ బాలీవుడ్ స్టార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటుడు జాన్ అబ్రహం విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు పవర్ఫుల్ విలన్ ఉండాలని భావించిన చిత్ర యూనిట్ జాన్ అబ్రహాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జాంబీ రెడ్డి’ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్ -
వణక్కమ్ దీపికా
దీపికా పదుకోన్‌కి తమిళ పరిశ్రమ వణక్కమ్ చెప్పబోతోందని సమాచారం. అంటే.. స్వాగతం అని అర్థం. విషయం ఏంటంటే... తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న ఓ చిత్రంలో దీపికాను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్యాన్ ఇండియా మూవీలో దీపిక హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు సినిమాకి సై అన్న దీపికా అటు తమిళ చిత్రాన్ని కూడా ఒప్పుకోవాలనుకుంటున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం విజయ్‌కి 65వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విజయ్‌కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని రూపొందించనుందట. అందుకే భారీ తారాగణం ఉండేలా చూస్తున్నారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారట. కాగా విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
రెండేళ్ల తర్వాత మేకప్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. సున్నాకి సున్నా అని కొంతమంది జోకులు కూడా వేశారు. ఈ సినిమాకి ముందు షారుక్ చేసిన ‘జబ్ హ్యరీ మెట్ సెజల్’ కూడా అంతగా ఆడలేదు. దాంతో షారుక్ డైలమాలో పడ్డారు. ఇక లాభం లేదు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తపడాలనుకున్నారు. 2018 డిసెంబర్లో ‘జీరో’ విడుదలైంది. ఆ తర్వాత ఏడాది పాటు కథలు విన్నారు షారుక్. అయినా ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈలోపు ఈ ఏడాది కోవిడ్ బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ లో బాగా ఆలోచించుకుని, ‘పఠాన్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు షారుక్. రెండేళ్ల తర్వాత హీరోగా మేకప్ వేసుకుని, బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని టాక్. మరి.. పరాజయాల్లో ఉన్న షారుక్‌కి ఈ చిత్రం భారీ విజయాన్ని అందిస్తుందా? అనేది వేచి చూడాలి. -
నెగటివ్ రోల్ కోసం.. రూ. 20 కోట్లు!
ముంబై: ‘‘జీరో’’ సినిమా డిజాస్టర్ తర్వాత చాలాకాలం పాటు వెండితెరకు దూరమైన బాలీవుడ్ బాద్షా యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. ఈ సినిమాకు ‘పఠాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఇక తన గత చిత్రం ‘వార్’ మాదిరిగానే ఇందులోనూ భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశాడట డైరెక్టర్. అందుకే యాక్షన్ హీరో జాన్ అబ్రహాంను ఇందులో విలన్‌గా నటింపజేస్తున్నారట. ఇందుకోసం నిర్మాతలు అతడికి సుమారు రూ. 20 కోట్లు చెల్లిస్తున్నట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తోంది. తన బిజీ షెడ్యూల్లోనూ ఈ సినిమా కోసం సుమారు 60 రోజుల పాటు కాల్షీట్లు కేటాయించిన జాన్ అబ్రహం ఇందుకు అర్హుడే అంటూ అతడి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. షారుక్‌తో అతడు తలపడే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి అంటున్నారు. (చదవండి: ఈద్‌కి సత్యమేవజయతే 2) కాగా ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ తదితర సినిమాల్లో షారుక్‌కు జోడీగా నటించిన దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్గా కనిపించనున్నారు. ఇందుకోసం ఆమెకు సైతం భారీ మొత్తంలోనే పారితోషికం చెల్లిస్తున్నారట. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జాన్ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్’లో హీరోగా నటిస్తుండగా, ఆయన నటించిన ‘సత్యమేవ జయతే 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాక మలయాళంలో సూపర్ హిట్‌కొట్టిన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ హక్కులు దక్కించుకుని నిర్మాతగానూ బిజీ అయ్యాడు. ముంబైకి చెందిన రేవతీ రాయ్ జీవితం ఆధారంగా ఓ సినిమా కూడా నిర్మించేందుకు జాన్ అబ్రహాం సిద్ధమయ్యాడు. -
అవినీతి అంతు చూడటానికి మళ్లీ వస్తున్న సత్యమేవ జయతే
సత్యమేవ జయతే 2 షూటింగ్‌కు అన్ని సిద్దమయ్యాయి. జాన్ అబ్రహమ్, దివ్య కోశ్లా కుమార్ కలిసి నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మంగళవారం లక్నోలో మంగళవారం మొదలయ్యింది. ఈ సినిమా నిర్మాణం పూర్తయ్యే సరికి వచ్చే ఏడాది జనవరి వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం లక్నోలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ముంబాయిలో జరగనుంది. ఈ సినిమాను మిలప్ జవేరీ డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాలను ప్రముఖ సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అవినీతిని రూపుమాపే బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. SHOOT BEGINS TODAY... Filming of #SatyamevaJayate2 - starring #JohnAbraham and #DivyaKhoslaKumar - begins in #Lucknow today... Will continue till Jan 2021... Will also be shot at a #Mumbai studio early next year... Directed by #MilapZaveri... 12 May 2021 release. #Eid #Eid2021 pic.twitter.com/A86gqNtDFz — taran adarsh (@taran_adarsh) October 20, 2020 చదవండి: ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్ -
ఈద్‌కి సత్యమేవజయతే 2
జాన్ అబ్రహాం హీరోగా మిలాప్ జావేరి దర్శకత్వంలో 2018లో విడుదలైన చిత్రం ‘సత్యమేవ జయతే’. తాజాగా ఈ చిత్రం సీక్వెల్ ‘సత్యమేవ జయతే 2’కు విడుదల తేదీని ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నాగలి పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు జాన్ అబ్రçహాం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ కానుకగా మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో జాన్‌కు జోడీగా దివ్య కోస్లా కుమార్ కనిపిస్తారు. ‘మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్ రెండింతలు ఎక్కువగా ఉంటాయి’ అన్నారు దర్శకుడు మిలాప్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
సత్యమేవ జయతే 2 పోస్టర్: రక్తం కూడా త్రివర్ణంలో
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తాజాగా నటించిన సత్యమేవ జయతే 2 పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 2020 అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇందులో అబ్రహం చేతిలో నాగలి.. శరీరంపై ఉన్న గాయాల నుంచి రక్తం త్రివర్ణ పతాకంలో ని మూడు రంగుల్లో కారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ అతడి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి ‘గంగా మాత ప్రవహించే భూమిలో.. రక్తం కూడా త్రివర్ణంలో ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. (అది నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా) ఈ చిత్రానికి మిలాప్ జావేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహం తరనపున దివ్య ఖోస్లా కుమార్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అవినీతికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం చుట్టూ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ విడుదుల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా మే 12న విడుదల కానుంది. కాగా.. ఇది, 2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాకు ఇది సీక్వెల్ కావడం విశేషం. (స్వయంగా లేఖ రాసుకున్న కరీనా) View this post on Instagram Jis desh ki maiyya Ganga hai, wahan khoon bhi Tiranga hai! #SatyamevaJayate2 in cinemas on 12th May, EID 2021. #SMJ2EID2021 @divyakhoslakumar @milapzaveri @onlyemmay @madhubhojwani @nikkhiladvani #BhushanKumar #KrishanKumar @tseriesfilms @tseries.official @emmayentertainment @dabbooratnani @houseofaweindia A post shared by John Abraham (@thejohnabraham) on Sep 20, 2020 at 7:31pm PDT -
హద్దులుదాటిన ప్రేమకథ
జాన్ అబ్రహాం, అదితీరావు హైదరీ తాత–నానమ్మ పాత్రల్లో కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లుక్ ఈ పాత్రలకు సంబంధించినదే. మరి.. ఫొటోలో యంగ్‌గా కనిపిస్తున్నారు కదా అనుకుంటున్నారా? ఆ సీక్రెట్ త్వరలో చెబుతారట. ప్రస్తుతానికి ఈ లుక్స్‌ని విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ ఇద్దరి నటీనటుల పాత్రలు వస్తాయట. అర్జున్‌కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ ఓ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సరిహద్దులు దాటిన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిఖిల్ అద్వాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్‌కపూర్ నానమ్మ, తాతయ్యల పాత్రల్లో అదితి, జాన్ అబ్రహాం కనిపిస్తారట. -
షారుక్ వర్సెస్ జాన్
ఓ భారీ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించనున్నారు. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. తన గత చిత్రం ‘వార్’లానే (హృతిక్ వర్సెస్ టైగర్ ష్రాఫ్) ఇద్దరు హీరోలతో ఈ యాక్షన్ చిత్రం ప్లాన్ చేసినట్టున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. షారుక్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో హీరో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో నటించనున్నారట. జాన్ అబ్రహాంతో షారుక్ తలపడే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమాకు ‘పఠాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం ఇండియాలోనే జరగనుందని టాక్. -
హిందీలోకి అయ్యప్పనుమ్ కోషియుమ్
ఈ ఏడాది మలయాళం బాక్సాఫీస్ వద్ద ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం బంపర్‌హిట్ సాధించింది. దాదాపు 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇతర ఇండస్ట్రీ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. పృథ్వీరాజ్, బిజు మీనన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం దక్కించుకున్నారు. ‘‘స్టోరీ, యాక్షన్, థ్రిల్ అంశాలను ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రంలో బాగా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాని మా సంస్థ (జేఏ ఎంటర్టైన్మెంట్స్)లో రీమేక్ చేయబోతున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు జాన్ అబ్రహాం. మరి.. ఈ సినిమాలో ఆయన నటిస్తారా? లేక వేరే నటుడిని నటింపజేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఓ మాజీ హవల్దార్, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మధ్య తలెత్తే ఈగో నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో కూడా రీమేక్ కానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ అగ్రనిర్మాత ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారని సమాచారం. మరోవైపు తమిళంలో కూడా ఓ నిర్మాత రీమేక్ చేయనున్నారట. -
‘రేవతి’ కథతో జాన్ అబ్రహం సినిమా
రేవతీ రాయ్ ఎవరో చాలామందికి తెలుసు. అయినా చెప్పుకోవాలి. అప్పుల బాధ, అనారోగ్యంపాలైన భర్త, ముగ్గురు పిల్లల ఆలనాపాలనా... ఇలా రేవతి జీవితం కష్టాలకు కేరాఫ్ అడ్రస్ అనే పరిస్థితి. చివరికి భర్త కూడా చనిపోతాడు. ఇక ముగ్గురు పిల్లల బాధ్యత తన మీదే. ఒంటరి మహిళ. ఉద్యోగం కోసం వెతికితే ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘ఫర్ షీ’. తనకు తెలిసిన డ్రైవింగ్‌నే ఉపాధిగా ఎంచుకున్నారు రేవతి. క్యాబ్ డ్రైవర్‌గా మారారు. తనలా కష్టపడే వారి కోసం ‘ఫర్ షీ’ అనే క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసి, ఉపాధి కల్పించారు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కొట్టి, మందులు, నిత్యావసర వస్తువులు కావాలని చెబితే, తక్కువ సమయంలో మహిళా సిబ్బంది అందజేసేలా ‘హే దీదీ’ పేరుతో డెలివరీ సర్వీస్ ప్రారంభించారామె. ముంబైకి చెందిన రేవతీ రాయ్ జీవితంలో ఒక సినిమాకి సరిపోయే కథ ఉంది. మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆమె జీవితంతో హిందీ నటుడు జాన్ అబ్రహామ్ సినిమా నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌ని జాన్‌తో కలిసి మరో ఇద్దరు నిర్మాతలు నిర్మిస్తారు. రాబ్బీ గ్రేవాల్ దర్శకుడు. ‘‘ఎన్నో కష్టనష్టాలను తట్టుకుని నిలబడి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రేవతి జీవితాన్ని సినిమాగా తీస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాన్. ‘‘ఇది నా కథ మాత్రమే కాదు. ఇతర మహిళలకు ఓ బాట చూపించిన మహిళలందరి కథ కూడా. పుట్టుకతోనే పోరాట యోధులుగా పుడతారు మహిళలు. వారికి ఒక్క అవకాశం ఇస్తే వృథా కాదు’’ అన్నారు రేవతీ రాయ్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
బిజీ బిజీ
బాలీవుడ్ ‘ఎటాక్’లో జాయిన్ అయ్యారు రకుల్‌ప్రీత్ సింగ్. జాన్ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్ దర్శకత్వంలో హిందీలో ‘ఎటాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. 2008లో ఢిల్లీలో జరిగిన ఓ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్ అబ్రహాం. గత ఏడాది డిసెంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం జాన్ , రకుల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఎటాక్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు అజయ్ దేవగన్–సిద్దార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో రకుల్ కథానాయికగా చాన్స్ కొట్టేశారు. ఈ మూడు సినిమాలతో రకుల్ ఈ ఏడాది బాలీవుడ్లో బిజీ బిజీ. -
ఆగస్ట్ 15న బాక్సాఫీస్‌పై ‘ఎటాక్’
ముంబై : వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న తన తాజా చిత్రం ఎటాక్ విడుదలవుతుందని ఆ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం వెల్లడించారు. ఈ పోస్టర్లో గన్ చేతపట్టి తీక్షణంగా చూస్తున్న జాన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో జాన్ అబ్రహం సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఆడిపాడనున్నారు. లక్ష్యరాజ్ ఆనంద్ నిర్ధేశకత్వంలో రూపొందే ఎటాక్ మూవీ పెన్ స్టూడియోస్, జేఏ ఎంటర్టైన్మెంట్, అజయ్ కపూర్లు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోంది. జాన్ అబ్రహం గత చిత్రాలు సత్యమేవజయతే, బాట్లాహౌస్ కూడా ఆగస్ట్ 15న విడుదలైన సంగతి తెలిసిందే. -
రకుల్ ఎటాక్
బాలీవుడ్‌పై హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ‘ఎటాక్’ చేసినట్లున్నారు. వరుస అవకాశాలను ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్లో కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దేదే ప్యార్ దే, మర్జావాన్ చిత్రాల్లో హిందీ తెరపై కనిపించారు. ఇటీవల అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా అంగీకరించారు. ఇప్పుడు జాన్ అబ్రహాం హీరోగా హిందీలో తెరకెక్కనున్న ‘ఎటాక్’ సినిమాకి సైన్ చేశారు. లక్ష్యరాజ్ ఆనంద్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రకుల్ ఓ కథానాయికగా నటించనున్నారు. మరో నాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తారు. ‘‘మంచి స్క్రిప్ట్ కుదిరింది. జాన్‌తో మరోసారి నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది. రకుల్‌ది కూడా చాలా మంచి పాత్ర’’ అని జాక్వెలిన్ పేర్కొన్నారు. -
నా లక్ష్యం అదే!
‘‘ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చాలెంజ్‌లాంటిదే. యాక్టర్ నుంచి వాళ్లు ఊహించినది కాకుండా విభిన్నమైనది వస్తే ఆశ్చర్యపడతారు. అది బావుంటే కచ్చితంగా ఆదరిస్తారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలన్నదే నటిగా నా లక్ష్యం’’ అన్నారు ఇలియానా. ‘పాగల్‌పంతి’ అనే మల్టీస్టారర్ కామెడీతో ఈ నెల 22న థియేటర్స్‌లోకి రాబోతున్నారామె. జాన్ అబ్రహామ్, అనిల్ కపూర్, ఇలియానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఇలియానా ఫుల్ కామెడీ పండించబోతున్నారట. వినోదం చేయడం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘ముబారకన్’ సినిమాలో ఫస్ట్‌టైమ్ పూర్తిస్థాయి కామెడీ ట్రై చేశాను. నా గురించి ఆలోచించినప్పుడు ప్రేక్షకులకు కామెడీ మైండ్లోకి రాదు. ‘ఆ సినిమాలో మీ పాత్ర చూసి ఆశ్చర్యపోయాం’ అని చాలా మంది అన్నారు. అలా ఆశ్చర్యపరచడం చాలా కష్టం. దానికోసం ఎలాంటి క్రేజీ పాత్ర అయినా చేయాలనుకుంటాను’’ అన్నారామె. -
నిరంతర యుద్ధం
‘‘మహిళలకు పెద్ద పీట వేస్తూ.. విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసేవారికి పెద్దగా ప్రోత్సాహమేమీ లభించడం లేదు’’. ఈ ఆవేదన జాన్ అబ్రహమ్ది. ‘‘నా దగ్గర స్త్రీ ప్రాధాన్యంగా సాగే రెండు కథలున్నాయి. కాని షూటింగ్ కోసం స్టూడియోలే దొరకట్లేదు. అలాంటి సినిమాలు ఆడవనే నమ్మకంతో స్టూడియోలను అద్దెకివ్వట్లేదు. అద్దె ఖర్చులూ రావనే భయమూ వారికి ఉన్నట్లుంది. ‘కాదు వాటిని అమ్మే పూచీ నాది’ అని స్టూడియో సిబ్బందిని కన్విన్స్‌చేసి సినిమా తీయడం గగనంగా ఉంది. మార్పు గురించి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాక్టికల్‌గా ఇదో నిరంతరం యుద్ధం’’ అంటున్నాడు జాన్ అబ్రహం. సమాజంలో మిగతా మార్పుల కోసం మన ప్రయత్నాలు ఎలా ఉన్నా.. స్త్రీల విషయంలో మాత్రం పోరాటమే పెద్ద మార్పు. జాన్.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మీరు కోరుకున్న మార్పూ వచ్చి తీరుతుంది చూడండి. -
టవర్ సే నహీ పవర్ సే!
పేరు వైఫై భాయ్. ఇతని నెట్వర్క్ టవర్ నుంచి కాదు... అతని పవర్‌తో నడుస్తుందట. ఈ పవర్ సిగ్నల్స్‌కి ముందుగా రాజ్ కిషోర్, సంజనలు స్పందిస్తారు. మరి.. తన పవర్‌తో వైఫై భాయ్ ఏమేం పనులు చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఇలియానా, జాన్ అబ్రహాం, అర్షద్ వార్షి ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్ పంతీ’. పుల్కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, ఊర్వశీ రౌతేలా, సౌరభ్ శుక్లా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల లుక్స్‌ను విడుదల చేశారు. వైఫై భాయ్ పాత్రలో అనిల్ కపూర్, సంజన పాత్రలో ఇలియానా, రాజ్ కిషోర్ పాత్రలో జాన్ అబ్రహాం కనిపిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’ సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతోన్నా కింగ్‌ఖాన్ మళ్లీ థియేటర్లలో కనిపించనేలేదు. దీంతో ఈ రేస్ యాక్టర్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రస్తావన రాగానే ‘రాజ్‌కుమార్ హిరాని నుంచి అబ్బాస్ జాఫర్లతో పాటు మరో ప్రముఖ దర్శకుల సినిమాలకు షారుక్ సైన్ చేశారు’ అనే వార్తలు సోషల్ మీడియాల్లో షికార్లు చేస్తున్నాయి. అయితే వాటన్నింటికి కింగ్ ఖాన్ ఫుల్స్టాప్ పెడుతూ.. ‘ప్రస్తుతానికి నేను ఏ సినిమాలకు సైన్ చేయలేదని’ ట్వీట్ చేశాడు. ఇటీవల ట్విటర్లో షారుక్ నిర్వహించిన ‘ఆస్క్ షారుక్‌ఖాన్’ సెషన్లో బాద్షాను ‘మీరు ధూమ్ 4 సినిమాకు సంతకం చేశారా?’ అని ఓ అభిమాని అడిగాడు. దానికి కింగ్‌ఖాన్ ‘ఇది నేను కూడా విన్నాను... నాకు ఆ సినిమాలో నటించాలనే ఉంది, దీనిపై ఇంకేమైన వివరాలు వస్తే నాకు తెలపండి’ అంటూ సరదాగా బదులిచ్చారు. కాగా షారుక్ ఖాన్‌ను తన అభిమానులు డిడిఎల్జేలో రాహుల్‌గా ప్రేమించారు. అలాగే డర్, అంజమ్, బాజిగర్లతో పాటు డాన్ వంటి చిత్రాలలో ప్రతినాయక పాత్రలో కూడా షారుక్ మెప్పించాడు. దీంతో యశ్‌రాజ్ ‘ధూమ్’ సిరీస్‌లో విలన్లుగా నటించిన హీరోలు ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల సరసన కింగ్ ఖాన్ చేరతాడా లేదో మరి వేచిచూడాలి. Maine bhi suna hai. Tumhein kuch aur khabar mile toh dena... https://t.co/m7y5sEVk39 — Shah Rukh Khan (@iamsrk) October 8, 2019 -
సీక్వెల్ షురూ
యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న బాలీవుడ్ టాప్ హీరోలలో జాన్ అబ్రహాం ఒకరు. పోలీసాఫీసర్‌గా జాన్ నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమా గత ఏడాది పంద్రాగస్టుకు విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి హిట్ సాధించింది. జాన్ కెరీర్‌కు మంచి మైలేజ్ ఇచ్చిన చిత్రం ఇది. మిలాప్ జవేరి దర్శకడు. తాజాగా ‘సత్యమేవ జయతే’ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు జాన్ అబ్రహాం. తొలి పార్ట్‌కు దర్శకత్వం వహించిన మిలాప్నే రెండో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్య కౌశల కుమార్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయనున్నట్లు జాన్ వెల్లడించారు. -
నో మోదీ.. కేరళ బ్యూటీ అదే: బాలీవుడ్ హీరో
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్షన్ హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘మద్రాస్ కేఫ్’, ‘సత్యమేవ జయతే’, ‘బాట్లా హౌస్’ వంటి వరుస హిట్లతో ఈ హీరో దూసుకపోతున్నాడు. అయితే గతంలో సినిమాలు తప్ప వేరే జోలికి వెళ్లని జాన్ అబ్రహం.. ఈ మధ్యకాలంలో రాజకీయ విషయాలను ప్రస్తావిస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. బాలీవుడ్ వందశాతం సెక్యులర్ కాదని, పరిశ్రమ మతపరంగా చీలిపోయిందని, ఇది అక్షర సత్యమని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జాన్ పలు రాజకీయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. కేరళ ఇంకా ఎందుకు మోదీ వశం కాలేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘దటీజ్ బ్యూటీ ఆఫ్ కేరళ’అంటూ సమాధానమిచ్చాడు. దీంతో అక్కడి వారంతో ఆశ్యర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానికి వివరణ కూడా ఇచ్చాడు. ‘కేరళలో ప్రతీ పది మీటర్లకొక టెంపుల్, మసీద్, చర్చిలు ఉంటాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా మతపరమైన గొడవలు జరగలేదు. జరగవు కూడా. ప్రపంచ వ్యాప్తంగా చూసినా అన్ని మతాల వారు ప్రశాంత వాతావరణంలో జీవించే రాష్ట్రం కేరళ మాత్రమే. అంతేకాకుండా చాలావరకు మలయాళీ ప్రజల్లో కమ్యూనిజం భావజాలం ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణించినపుప్పుడు ఒక్క కేరళ మినహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆయనకు సంబంధించిన ఫ్లేక్సీలు, నివాళులు అర్పించడం చూడలేదు. మా నాన్న ఎక్కువగా నన్ను కమ్యూనిజంకు సంబంధించిన విషయాలను తెలుసుకునేలా ప్రభావితం చేశారు. సమానత్వం, అందరికీ సమాన సంపద అనే వాటిని నమ్ముతున్నాం కాబట్టే కేరళ రోజురోజుకు అభివృద్ది చెందుతోంది’అంటూ జాన్ అబ్రహం పేర్కొన్నాడు. ప్రస్తుతం జాన్ అబ్రహం వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు అబ్రహంకు మద్దతు నిలవగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. అబ్రహం చేసిన వ్యాఖ్యల్లో పెద్ద అంతరార్థమే దాగుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి హవా నడిచినా.. కేరళలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాగా, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ 19 స్థానాల్లో గెలిచి బలమైన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’ చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అక్షయ్ చిత్రానికి ధీటుగా బాట్లా హౌస్ కలెక్షన్లను సాధించింది. చదవండి: బాలీవుడ్‌పై బాంబ్ పేల్చిన హీరో! -
ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు
పాపులర్ పాటల్ని రీమిక్స్ చేసే ట్రెండ్‌ను కొనసాగిస్తూనే ఉంది బాలీవుడ్. పాత పాటలకి ట్రెండీ టచ్ ఇచ్చి సినిమాకు కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంటోంది. లేటెస్ట్గా రెండు పాత పాటల్ని ఒకే సినిమాలో రీమిక్స్ చేయాలనుకుంటున్నారు. జాన్ అబ్రహాం, ఇలియానా, అనిల్ కపూర్ నటించిన చిత్రం ‘పాగల్ పంతీ’. అనీజ్ బజ్మీ దర్శకుడు. ఈ సినిమా కోసం సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన ‘చాల్బాజ్’లోని ‘తేరా బీమార్ మేరా దిల్..’ పాటను రీమిక్స్ చేశారట. మరో పాట ఏంటనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒరిజినల్ పాటలో సన్ని, శ్రీదేవి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచినట్టు, జాన్, ఇలియానా కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో ఓ హెలైట్ అవుతుందట. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
బోలెడన్ని గెటప్పులు
ముంబై అండర్‌వరల్డ్, అక్కడి గ్యాంగ్‌స్టర్ కథలు ఎప్పటికీ బోర్ కొట్టవు. ఇప్పుడు మరో ముంబై గ్యాంగ్‌స్టర్ సినిమా సిద్ధం అవుతోంది. ‘ముంబై సాగా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్ అబ్రహాం హీరో. కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇందులో జాన్ అబ్రహాంకు జోడీగా కాజల్ కనిపిస్తారు. కాజల్ పాత్ర వివిధ వయసుల్లో ఉంటుందట. అందుకోసం రకరకాల గెటప్స్‌లో కాజల్ కనిపిస్తారని తెలిసింది. టీ సిరీస్, వైట్ ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది. -
తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!
ముంబై: గత నాలుగేళ్లుగా బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ తన సినిమాలను పండగల రోజున విడుదల చేస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాల విడుదల అనగానే ఈద్ గుర్తుకు వచ్చినట్లే, అక్షయ్ కూడా తన సినిమాలను పంద్రాగష్టుకు విడుదల చేస్తూ సక్సెస్ కొడుతున్నాడు. ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన అక్షయ్ తాజా సినిమా ‘మిషన్ మంగళ్’ గురువారం వెండితెర మీదకు వచ్చింది. అక్షయ్ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది. రూ.29.16 కోట్లు కలెక్ట్ చేయడంతో అక్షయ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. కాగా స్పూర్తిదాయక కథాంశంతో తెరకెక్కిన అక్షయ్ గత సినిమా ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ 2017 ఆగష్టు 15న విడుదలైన మొదటి రోజే రూ .13.1 కోట్లు సాధించింది. ఇక జగన్ శక్తి దర్శకత్వంలో మిషన్ మంగళ్ కూడా అక్షయ్‌కు హిట్‌నిచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటుగా ప్రముఖ నటి విద్యబాలన్, తాప్సీ పన్నూ, సోనాక్షి సిన్షా, నిత్యా మీనన్, కీర్తి కుల్హరిలు ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ఇక నిన్న విడుదలైన జాన్ అబ్రాహం సినిమా ‘బాట్ల హౌస్’... అక్షయ్ ‘మిషన్ మంగళ్’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేక చతికిలపడింది. -
బాలీవుడ్‌పై బాంబ్ పేల్చిన హీరో!
ముంబై: టాప్ హీరో జాన్ అబ్రహం తాజాగా హిందీ చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఎంతమాత్రం లౌకికవాదం లేదని ఆయన తేల్చిచెప్పారు. బాలీవుడ్ సెక్యులర్‌గా ఉంటుందన్న వాదన ఫేక్ అని ఆయన కొట్టిపారేశారు. తన తాజా సినిమా ‘బాట్లా హౌస్’ ప్రమోషన్లో బిజీగా ఉన్న జాన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సెక్యులరిజంపై ఆయన మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ సెక్యులర్ పరిశ్రమ అని ఎవరు చెప్పారు మీకు? బాలీవుడ్ వందశాతం సెక్యులర్ కాదు. పరిశ్రమ మతపరంగా చీలిపోయింది. ఇది జీవితకాల సత్యం’ అని పేర్కొన్నారు. ప్రపంచమే మతపరంగా చీలిపోయందని, ప్రస్తుతమున్న ప్రపంచాన్ని మాత్రమే చిత్రపరిశమ్ర ప్రతిబింబిస్తోందని ఆయన వివరించారు. మతపరమైన చీలిక అనేది ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచమంతటా ఉందని, ఇదే విషయమై తన సినిమాలో డైలాగ్ కూడా ఉందని జాన్ పేర్కొన్నారు. ‘నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఒక వర్గమని కాదు. యావత్ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. (డొనాల్డ్) ట్రంప్‌ను చూడండి. బ్రెగ్జిట్‌ను చూడండి. బోరిస్ జాన్సన్‌ను చూడండి. ప్రపంచమే నేడు మతపరంగా చీలిపోయింది. మనం ఈ ప్రపంచంలోనే నివసిస్తున్నాం. దీని మనం ఎదుర్కొని తీరాలి’.. ఇక నా వరకు ప్రపంచంలో మనం దేశం ఉత్తమమైనదని, మన చిత్ర పరిశ్రమ కూడా బెస్ట్ అని భావిస్తాను’ అని జాన్ తెలిపారు. నిజజీవిత సంఘటనలు, నిజజీవిత వ్యక్తులు ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, యూరి, సూపర్ 30 వంటి సినిమాల విజయాలు ఇందుకు నిదర్శనమని జాన్ అభిప్రాయపడ్డారు. -
మేము ఇద్దరం కలిస్తే అంతే!
ముంబై : బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలు నటించిన మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు ఈ నెల 15న విడుదల కానున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని గాసిప్ప్ గుప్పుమన్నాయి. అలాంటిదేమి లేదని ఈ ఇద్దరు హీరోలు తాజాగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాన్ అబ్రహం మాట్లాడుతూ.. ‘మీరు ఎప్పుడైన గమనించారా... పెద్ద హీరోల సినిమాలన్ని సెలవుల్లో లేదా పండుగ రోజుల్లో విడుదల చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలోనే ప్రేక్షకులు కుటుంబంతో కలిసి సినిమాకి వస్తారు. అందుకే నా సినిమాను సెలవు రోజున విడుదల చేస్తున్నాం. అక్షయ్ నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నంత మాత్రాన మా మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాద’ని అన్నాడు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఇదే విషయంపై మిషన్ మంగళ్ ట్రైలర్ ఫంక్షన్లో మాట్లాడుతూ.. ‘ఒక సంవత్సరంలో దాదాపు 210 పైగా హిందీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సంవత్సరానికి 52 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ఒకే రోజున రెండు సినిమాలు విడుదల కావడం పెద్ద విశేషం కాద’ని పేర్కొన్నాడు. తామిద్దం కలిసినప్పుడల్లా ఇలా అల్లరి చేస్తుంటామని జాన్ అబ్రహాం తనను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను అక్షయ్ కుమార్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ఫోటోకి ‘బ్రదర్ ఫ్రమ్ అనెదర్ మదర్’ అని క్యాప్షన్ పెట్టాడు. -
జాన్ ఎటాక్
బాలీవుడ్ యాక్షన్ హీరోల జాబితాలో జాన్ అబ్రహాం పేరు ముందు వరుసలో ఉంటుంది. వెండితెరపై యాక్షన్ హీరోగా ఆడియన్స్ చేత మంచి మార్కులు వేయించుకున్న జాన్ ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై ఎటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటించనున్న తర్వాతి చిత్రానికి ‘ఎటాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ధీరజ్ వాధవన్, అజయ్ కపూర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు జాన్. ఈ సినిమాతో లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకునిగా పరిచయం కానున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించ నున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు జాన్ అబ్రహాం. ‘ఎటాక్’ చిత్రాన్ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించాలని టీమ్ భావిస్తోందని టాక్. -
మాఫియాలోకి స్వాగతం
సౌత్‌లో మంచి జోరుమీదున్న పూజాహెగ్డే హిందీలో మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హిందీలో ‘ముంబై సాగ’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నారని బీటౌన్‌లో కథనాలు వస్తున్నాయి. మరి.. సంజయ్‌గుప్తా వెండితెర మాఫియాలో పూజా జాయిన్ అవుతారా? వెయిట్ అండ్ సీ. హృతిక్‌రోషన్ ‘మొహెంజోదారో’, అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాల్లో పూజా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. జాకీష్రాఫ్, సునీల్æశెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్న ‘ముంబై సాగ’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ప్రభాస్ (‘జాన్’వర్కింగ్ టైటిల్), అల్లు అర్జున్, వరుణ్‌తేజ్ (వాల్మీకి) సినిమాల్లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
హిందీ వేదాలంలో..
బాలీవుడ్లో సౌత్ రీమేక్‌ల హవా మరింత జోరు అందుకున్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కాంచన’, ‘ఆర్ఎక్స్ 100’, ‘ప్రస్తానం’... ఇలా మరికొన్ని దక్షిణాది సినిమాలు బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా అజిత్ ‘వేదాలం’ కూడా చేరిందన్నది బాలీవుడ్ ఖబర్. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ‘వేదాలం’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారట. ఇందులో జాన్ అబ్రహాం హీరోగా నటించడానికి ఆసక్తి చూపించారని తెలిసింది. స్క్రిప్ట్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్లు మార్పులు చేస్తారట. ఈ సినిమా ఎవరు దర్శకుడు అనే చర్చల్లో కొందరి ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
శాకాహారం మాత్రమే
బాలీవుడ్లో ఫిట్‌గా కనిపించే నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ హీరో డైట్లో పెద్ద మార్పు తీసుకొచ్చారట. నాన్‌వెజ్ (మాంసాహారం)ని మానేసి పూర్తి స్థాయి వెజిటేరియన్‌గా మారిపోయారట. ఆరోగ్యంగా ఉండటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. నాలుగు నెలల నుంచి వెజిటేరియన్ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకున్నారట అక్షయ్ కుమార్. ఆల్రెడీ జాన్ అబ్రహామ్, అనుష్కశర్మ వెజిటేరియన్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ‘కేసరి’ అనే పీరియాడికల్ చిత్రంలో నటించారు అక్షయ్‌కుమార్. 21 మంది సిక్కు జవాన్లు 10వేల మంది ఆఫ్ఘాన్ సైనికులను దేశంలోకి రానివ్వకుండా ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. -
భిన్న ముఖాలు!
వెండితెరపై ఓ ఆపద నుంచి దేశాన్ని రక్షించేందుకు ఓ మిషన్‌ను స్టార్ట్ చేశారు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం. గూఢచారిగా ఆ ఆపద నుంచి అతను దేశాన్ని ఎలా రక్షించాడు? అనే విషయం సమ్మర్లో తెలుస్తుంది. జాన్ అబ్రహాం హీరోగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘రోమియో అక్బర్ వాల్టర్’. రోబ్బీ గ్రేవాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గూఢచారిగా నటిస్తున్నారు జాన్. ఈ సినిమాకు సంబంధించిన రెండు లుక్స్‌ను విడుదల చేశారు. ‘ఒక వ్యక్తి. భిన్నముఖాలు. దేశాన్ని కాపాడటం కోసం చేసే ఓ మిషన్’ అంటూ ఈ లుక్స్‌ను రిలీజ్ చేశారు జాన్. ఇందులో జాన్ అబ్రహాం ఎనిమిది డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. మౌనీ రాయ్, జాకీ ష్రాఫ్, సుచిత్రా కృష్ణమూర్తి తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. -
లండన్ కాలింగ్
ఈ నెల చివర్లో కొత్త సినిమా కోసం లండన్ వెళ్లడానికి జాన్ అబ్రహాం ప్లాన్ చేశారు. ఇందుకోసం ఇలియానా కూడా సై అన్నారు. కానీ వీరి లండన్ ట్రిప్ నెక్ట్స్ మంత్కి వాయిదా పడింది. ఈ లోపు ఈ టీమ్‌తో కలిశారు కృతీ కర్భందా. ‘నో ఎంట్రీ, వెల్కమ్’ చిత్రాల ఫేమ్ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పాగల్ పంతి’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో ఒక కథానాయికగా ఆల్రెడీ ఇలియానాను తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్గా కృతీ కర్భందాను టీమ్ సెలక్ట్ చేశారు. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా ప్యాచ్ వర్క్‌తో బిజీగా ఉన్నారు కన్నడ భామ కృతీ కర్భంద. ఇది కంప్లీట్ కాగానే కొత్త సినిమా కోసం జాన్, ఇలియానాతో కలిసి కృతీ లండన్‌కి వెళతారు. తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కృతి ‘బ్రూస్లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్‌కే పరిమితమైన కృతి ఇప్పుడు నార్త్పై కూడా దృష్టి పెట్టారు. -
పంద్రాగస్టుకి బాక్సాఫీస్ పోటీ!
వచ్చే పంద్రాగస్టుకి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్ పోటీ పడనున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు కలెక్ట్ చేసిన హిందీ చిత్రాల జాబితాలో ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ‘బాహుబలి’ తన స్టామినా నిరూపించుకుంది. ఆ విధంగా ప్రభాస్ మార్కెట్ ఇతర భాషల్లోనూ పెద్దదైంది. అందుకే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. బీ టౌన్లో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మరో మూడు హిందీ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాల రిలీజ్‌ల గురించి బాలీవుడ్లో జోరుగా చర్చ మొదలైంది. అవి ‘మిషన్ మంగళ్’, ‘బాల్తా హౌస్’. ‘మేడ్ ఇన్ చైనా’. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. జగన్ శక్తి ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇస్రో (ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల కృషి ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ‘బాల్తా హౌస్’ గురించి చెప్పాలంటే.. దాదాపు పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆపరేషన్ బాల్తా హౌస్ ఇన్సిడెంట్ ఆధారంగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా మిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మేడ్ ఇన్ చైనా’. చైనా ప్రాడెక్ట్స్ గురించి ఈ సినిమా ఉంటుందని భోగట్టా. ఈ మూడు సినిమాలనూ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు వెల్లడించాయి. ఇప్పుడు ‘సాహో’ కూడా సీన్లోకొచ్చింది. ఒకేరోజు నాలుగు సినిమాలంటే బాక్సాఫీస్ కలెక్షన్స్ షేర్ అయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే గురువారం వచ్చింది. ఆ రోజు పబ్లిక్ హాలీడే. నెక్ట్స్ వీకెండ్ స్టారై్టపోయింది. గురు, శుక్ర, శని, ఆదివారం.. వరుసగా నాలుగు రోజులు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి, నాలుగు చిత్రాల నిర్మాతలూ తమ సినిమాని రిలీజ్ చేసే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేకపోవచ్చు. మరి.. వచ్చే పంద్రాగస్టుకి ఏ సినిమా నిర్మాత ఆలోచన అయినా మారుతుందా? వెయిట్ అండ్ సీ. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’, ఈ ఏడాది ఆయన నటించిన ‘గోల్డ్’ సినిమాలు ఆగస్టు 15న విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇదే సెంటిమెంట్‌తో అక్షయ్ కుమార్ ‘మిషన మంగళ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. సేమ్ జాన్ అబ్రహాం ఈ ఏడాది హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ ఆగస్టు 15న విడుదౖలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అందుకే ‘బాల్తా హౌస్’ చిత్రాన్ని కూడా సేమ్ రిలీజ్‌కు అబ్రహాం రెడీ చేశారని బాలీవుడ్ టాక్. ‘సత్యమేవ జయతే, బాల్తా హౌస్’ రెండు చిత్రాల్లో జాన్ అబ్రహాంది పోలీస్ క్యారెక్టర్‌నే కావడం విశేషం. ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్. వీళ్లందరీ కంటే వచ్చే ఏడాది పంద్రాగస్టు రిలీజ్ డేట్‌ను ఫస్ట్ ఫిక్స్ చేసుకుంది హీరో రణ్‌బీర్ కపూర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మాత. మూడు పార్ట్స్‌గా రానున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను ఆగస్టు 15కు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండటంతో వచ్చే ఏడాది తొలి పార్ట్‌ను క్రిస్మస్కు వాయిదా వేశారు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. ఈ సినిమాలో నాగార్జున, డింపుల్ కపాడియా కూడా కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం రాజ్‌కుమార్, మౌనీ ‘మిషన్ మంగళ్’ టీమ్ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ -
జోడీ కుదిరిందా?
ఈ ఏడాది ‘సత్యమేవ జయతే’ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం మంచి ఫామ్‌లో ఉన్నట్లున్నారు. ఇటీవల ‘రోమియో అక్బర్ వాల్టర్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన అబ్రహాం తాజాగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇందులో ఇలియానాను కథానాయికగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే నిజమైతే కెరీర్లో తొలిసారి జాన్‌తో జోడీ కట్టనున్నారు ఇలియానా. అలాగే ఈ స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాకు మరో హీరో అవసరం ఉందట. ఇందుకోసం సంజయ్‌దత్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. మరి..ఫైనలైజ్ అయ్యారా? లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి ‘పాగల్పాంటీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. జాన్ అబ్రహాం నటించిన ‘బట్లా హౌస్’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్లో లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్ హీరోలుగా రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఇలియానా పేరు తెరపైకి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. -
70 ఎన్కౌంటర్లు... 33 కేసులు
ఈ ఏడాది ఆగస్టు 15కి ‘సత్యమేవ జయతే’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించారు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించారాయన. వచ్చే ఏడాది అదే తేదీన ‘బట్లా హౌస్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి నిఖిల్ అద్వాని దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎన్కౌంటర్లు, 33 కేసులు, 22 నేరారోపణలు... మోస్ట్ కాంట్రవర్శల్ కాప్ అంటూ ఇలా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు జాన్ అబ్రహాం.ఈ సినిమాలో ఆఫీసర్ సంజయ్ యాదవ్ కుమార్ పాత్రలో కనిపిస్తారు జాన్ అబ్రహాం. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కానీ ‘బట్లా హౌస్’ చిత్రంతో పాటు అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’, రాజ్‌కుమార్‌రావు ‘మేడ్ ఇన్ చైనా’ సినిమాలు కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15కే విడుదలకు రెడీ అవుతున్నాయి. -
ఆ సినిమా మా మనోభావాలు దెబ్బతీసింది!
సాక్షి, హైదరాబాద్: జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘సత్యమేవ జయతే’పై నగరంలో కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని షియా వర్గం సోమవారం కేసు నమోదు చేసింది. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై గతంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. ముస్లింలు పవిత్రంగా భావించే మొహర్రం ఊరేగింపును మతమనోభావాలు దెబ్బతీసేవిధంగా చిత్రం ట్రైలర్లో చూపించారని, ఈ సనివేశాలను వెంటనే తొలగించి.. చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు గతంలో కోరాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో కేసు నమోదు కావడం గమనార్హం. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యమేవ జయతే’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం సరసన అమృత ఖన్విల్కర్ నటించారు. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
వివాదంలో ‘సత్యమేవ జయతే’
బాలీవుడ్ నటులు జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సత్యమేవ జయతే. మిలాప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ వివాదాస్పదమయ్యింది. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయంటు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పవిత్ర మొహరం సంతాప దినాల్లో హీరో (జాన్ అబ్రహం) ఓ వ్యక్తిని హత్య చేసినట్టుగా ట్రైలర్లో చూపించారు. ఈ సీన్స్ తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయంటూ హైదరాబాద్, పాతబస్తీ డబీర్ పురాకు చెందిన అడ్వకేట్ జాఫర్ నదీం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రఫి యాక్ట్ 5బి ప్రకారం సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని.. చిత్ర దర్శక, నిర్మాతలతో పాటు ఆ సన్నివేశంలో నటించిన జాన్ అబ్రహంపై చర్యలు తీసుకోవాలని జాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నిలకడగా ‘పరమాణు’ కలెక్షన్స్
జాన్ అబ్రహాం, డయానా పెంటీ జంటగా నటించిన పరమాణు చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. దర్శకుడు అభిషేక్ శర్మ ఈ చిత్రాన్ని పొఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక పక్క రేస్ 3, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. వాటి పోటీని తట్టుకుని ఈ చిత్రం నిలబడింది. పరమాణు చిత్ర కలెక్షన్స్‌కు సంబంధించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ.. రేస్ 3 వంటి కమర్షియల్ సినిమాని తట్టుకుని 62.14 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాలు గడిచినప్పటికి రోజు వారి కలెక్షన్స్‌లు బాగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, వికాస్ కుమార్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
అర్థం మారింది
జనరల్‌గా ‘రా (ఆర్.ఏ.డబ్యూ)’ అంటే డిఫెన్స్ డిక్షనరీలో ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ అని అర్థం వస్తుంది. కానీ రీల్‌పై రా అంటే... ‘రోమియో అక్బర్ వాల్టర్’ అంటున్నారు హిందీ హీరో జాన్ అబ్రహాం. రోబీ గ్రేవాల్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో కథానాయికగా మునీ రాయ్ నటిస్తున్నారు. హిందీ చిత్రం జాకీష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ‘స్పై’ పాత్రలో నటిస్తున్న జాన్ అబ్రహాం డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. గుజరాత్, ముంబై, ఢిల్లీలో మేజర్ షూటింగ్ జరపాలనుకుంటున్నారు. ‘కొత్త సినిమా జర్నీ మొదలైంది’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. -
క్లాస్‌టీచర్ మీద క్రష్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం హ్యాండ్సమ్ యాక్టర్. ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. చాలా మంది అమ్మాయిల క్రష్ ఈ హీరో. మరి మీకెప్పుడైనా ఎవరి మీదైనా క్రష్ ఏర్పడిందా? అని జాన్ అబ్రహాంని అడిగితే – ‘‘చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే తను అందంగా ఉండటంతో పాటు చాలా తెలివైనది. నా సెకండ్ క్లాస్ టైమ్‌లో తన మీద క్రష్ ఏర్పడింది. ‘మా క్లాస్ టీచర్ మిసెస్. ఆనంద్ అంటే నాకు చాలా ఇష్టం’ అని ఓ రోజు ధైర్యం చేసి మా నాన్నగారితో చెప్పేశాను. చిన్న వయసు కాబట్టి ఆయన ఏమీ అనలేదు’’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. -
రహస్య విజయం
ఆగస్టు 15, 1947. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన రోజు. ఆ రోజును ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. జాతీయ జెండాను ఎగురవేసి రొమ్ము విరుచుకొని రోమాలు నిక్కబొడుచుకొనేలా దిక్కులు పిక్కటిల్లేలా ‘భారత్ మాతా కీ జై’ ‘మేరా భారత్ మహాన్’ ‘జెహింద్’ అంటూ దేశం నలుమూలలా సంబరాలు జరుపుకుంటాం. అలా దేశమంతా ఒక్కతాటిపైకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటి చెప్పే రోజుగా మనందరం పంద్రాగస్టును గుర్తుపెట్టుకుంటాం. అలాంటి ఒక రోజుతో పాటు భారతీయుల మేథాశక్తికి గుర్తుగా ‘నేషనల్ టెక్నాలజీ డే’ అని ఓ రోజును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఆ రోజే మే 11. భారతదేశమంతా గర్వించిన రోజు. విజయగర్వంతో ఉప్పొంగిన రోజు. టెక్నాలజీ డేగా ఎందుకు ఆ రోజునే ప్రకటించిందంటే– మొదటిసారిగా భారతదేశంలో అణుపరీక్ష జరిగి విజయవంతమైన రోజు. మేము ఎవ్వరికంటే తక్కువ కాదు అని ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన రోజు. అందుకే ఆ రోజుకంతటి విశిష్టత.ఇక ‘పరమాణు’ సినిమా విషయానికొస్తే ఇది ఒక ట్రూ స్టోరీ అని అందరికి తెలిసిన విషయమే. అణు పరీక్ష నిర్వహించాలంటే ప్రపంచ దేశాలు ఓ పట్టాన ఈ పరీక్ష నిర్వహించటానికి ఒప్పుకోవు. అందుకే ఇది దేశంలోని అన్నిటికంటే చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎంతో రహస్యంగా ఈ మిషన్‌ను ఇండియన్ ఆర్మీ పూర్తిచేసింది. ‘పరమాణు’ పూర్తిగా భారత్ నిర్వహించిన ‘పోఖ్రాన్’ అణుపరీక్షపై రూపొందిన సినిమా. ‘పరమాణు’ సినిమాను ఆద్యంతం ఉత్కంఠతో ముందుకు నడిపించారు దర్శకుడు‘అభిషేక్ శర్మ’. నిజానికి ఇటువంటి తరహాలో సినిమాలు రావడం ఇది మొదలు కాదు... అలియా భట్ ప్రముఖ పాత్రలో నటించిన ‘రాజీ’, తెలుగులో రానా ‘ఘాజీ’ కూడా ఇలాంటివే. పరమాణు కథ..... ఈ సినిమా అభిషేక్ శర్మ దృష్టి కోణం నుండి చూస్తే ప్రధానమంత్రి రక్షణ కార్యాలయం నుండి కథ ప్రారంభం అవుతుంది. అశ్వథ్ రాణా (జాన్ అబ్రహామ్) ఓ సిన్సియర్ ఐ.ఏ.ఎస్ అధికారి. అణుపరీక్షలను నిర్శహించటానికి 1995లో అప్పటి ప్రభుత్వం నియమించిన కమిటీలో కీలక సభ్యుడు. ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తారు. ఆ కమిటీ మీటింగ్‌కు హాజరైన వారందరూ అదొక దేశానికి సంబంధించిన కీలక సమావేశంలా కాకుండా ఏదో పిచ్చాపాటి మీటింగ్‌లా వ్యవహరిస్తుంటారు. ఆ మీటింగ్‌లో అశ్వథ్ రాణా మాత్రం తాను ఎన్నో విషయాలను చర్చించటానికి వచ్చాను ఇలా పిచ్చాపాటి మాట్లాడుకోటానికి కాదు అని చెప్తాడు. అక్కడ ఉన్న అందరూ ఇతన్ని చూసి నవ్వుకొంటారు. అయినప్పటికీ తను ఊరుకోకుండా తన దగ్గర ఎంతో విలువైన సమాచారంతో పాటు ఈ అణు పరీక్షను ఏ విధంగా నిర్వహించాలి అనే దాని గురించి క్లియర్‌గా వివరిస్తాను అని ప్రధానమంత్రి కార్యాలయ అధికారికి వివరిస్తాడు. ఆ మీటింగ్‌లో ఉన్నవారందరూ అతన్ని చూసి నవ్వుతుంటే ‘ఇంకా టీ, సమోసా రావాటానికి ఎట్లాగూ టైం ఉంది. ఈలోపు నువ్వు చెప్పదలుచుకుంది, మాట్లాడవలసింది నిర్భయంగా చెప్ప’మంటాడు అక్కడున్న ఆఫీసర్. తన ఫ్లాపీలో కొంత సమాచారం ఉందని, దాన్ని ఓపెన్ చేస్తే విషయం తెలిసిపోతుందని అంటాడు అశ్వథ్. ఆ మాట పూర్తి అయ్యేలోపు టీ వస్తుంది. ఆ మీటింగ్‌లో ఉన్న ఒకతను ఆ ఫ్లాపీని తీసుకొని తన టీ కప్ కింద బాటమ్లా పెట్టుకుంటాడు. అది చూసి చిన్నబుచ్చుకుంటాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహిస్తునట్లు అగ్రదేశమైన అమెరికా గుర్తించి భారత్‌ను హెచ్చరిస్తుంది. అప్పటికి ఆ పరీక్ష విఫలమవుతుంది. ఆ సంఘటనతో అశ్వథ్ రాణాను విధులనుండి తొలగిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత సంవత్సరమే ప్రభుత్వం మారుతోంది. అప్పుడు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉంటారు. ఆయన సెక్రటరీగా హిమాన్ష్ శుక్లా (బొమన్ ఇరానీ) చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయన ఈ మిషన్ చేస్తున్నట్లు ఎవ్వరికి తెలియకుండా ‘ఆపరేషన్ శక్తి’ అనే పేరుతో సస్పెండైన ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అశ్వథ్‌ను తిరిగి అణుపరీక్షను తన ఆధ్వర్యంలో నిర్వహించమని అడుగుతాడు. అప్పుడు జాన్ అబ్రహం ఎటువంటి షరతులతో తాను విధి నిర్వహణలో పాల్గొంటాడో బొమన్ ఇరానీకి చెప్తాడు. అలా కుదిరిన ఆ ఒప్పందం వల్ల ఏం జరిగింది అనేది తర్వాత కథ. మిషన్‌లో పాల్గొన్న వారికి వారి వారి సొంత పేర్లు కాకుండా మారు పేర్లు పెట్టుకునే సీన్ చాలా బావుంటుంది. మహాభారతంలో పంచ పాండవుల పేర్లతో వీరిని వ్యవహరించడం అందరినీ ఆకట్టుకునే విషయం. కృష్ణుడి పాత్రను అశ్వథ్ రాణా (జాన్ అబ్రహం) పోషించడమే కాదు, మెప్పించాడు కూడా. ఈ మిషన్ కంప్లీట్ చేసే క్రమంలో శాటిలైట్ కంటపడకుండా అణుపరీక్ష ఎలా నిర్వహించారో, ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కావటంతో తమ ఇంట్లో వాళ్లకి కూడా తెలియకుండా ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అనే సీన్స్‌ని చాలా కన్విన్సింగ్‌గా మలిచారు దర్శకుడు. ఈ ‘ట్రూ స్టోరీ’లో భారతదేశ రక్షణ విభాగాలైన బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్), డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఇస్రో ( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఇండియన్ ఆర్మీ తదితర అంతర్గత ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ మిషన్ విజయవంతమైనట్లుగా సినిమాలో చూపించారు. మధ్య మధ్యలో ఆయా దేశాలకు చెందిన అప్పటి ప్రధానమంత్రులు బిల్ క్లింటన్ (అమెరికా) అటల్ బిహారీ వాజ్‌పేయ్ (ఇండియా) బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ (పాకిస్తాన్)ల ఒరిజినల్ ప్రసంగాలను సినిమాలో ఆయా సందర్భాలకు తగ్గట్టు చూపించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు జాన్ అబ్రహాం కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కెమెరా పనితీరును ఖచ్చితంగా మెచ్చుకోవలసిందే. ‘పరమాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ 2018 పేరుతో ప్రపంచవ్యాపంగా శుక్రవారం రిలీజైంది. సినిమా బడ్జెట్ సుమారు 50 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఎంత వసూళ్లను రాబడుతుందో వెయిట్ అండ్ సీ.... తారాగణం : జాన్ అబ్రహాం, బొమన్ ఇరానీ, డైయానా పెంటీ దర్శకుడు : అభిషేక్ శర్మ నిర్మాణ సంస్థలు : జే ఏ(జాన్ అబ్రహాం) స్టూడియోస్, జీ స్టూడియోస్ మ్యూజిక్ : సచిన్ జిగర్ కెమెరా : అశీమ్ మిశ్రా, జూబిన్ మిస్త్రీ. – శివ మల్లాల -
భారత్ శక్తిని చాటిచెప్పిన రోజది..
సాక్షి, సినిమా : భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సంఘటన అది. భారీ ఎత్తున అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నా తలొగ్గక దేశానికి అణు సామర్ధ్యాన్ని సాధించుకున్న పోఖ్రాన్ అణు పరీక్షలపై నిర్మించిన చిత్రం పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్. సహనిర్మాతల న్యాయపోరాటాల అనంతరం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. పరమాణులో జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను యూనిట్ గురువారం విడుదల చేసింది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం అనంతరం జాతిని ఉద్దేశించి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే పేరుతో చేసిన ప్రసంగంతో టీజర్ ప్రారంభం అవుతుంది. బొమన్ ఇరానీ వాయిస్ ఓవర్‌తో భారత్ ఘనతలను వరుసగా చూపించారు. 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో పోఖ్రాన్లో జరిపిన అణు పరీక్షలను పూర్తి చేయడంలో కీలకంగా ఉన్న ఆర్మీ ఆఫీసర్‌గా జాన్ అబ్రహం కనిపించారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన పరమాణు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
`పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్' మూవీ టీజర్
-
ఈసారైనా... వస్తారా
వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.. హిందీ మూవీ ‘పరమాణు’ థియేటర్లోకి రావడానికి. నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ‘పద్మావతి’ మూవీ ఎఫెక్ట్‌తో కుదర్లేదు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌కు మోక్షం లభించలేదు. రీసెంట్గా నిర్మాతలకు గొడవలు అయ్యాయి. అంతే.. సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు మరో రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది చిత్రబృందం. మే 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి.. ఈసారైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో? లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగక తప్పదు. జాన్ అబ్రహాం, డయానా పెంటీ, బొమన్ ఇరానీ ముఖ్య తారలుగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పరమాణు’. క్రీర్జ్ ఎంటర్టైన్మెంట్, జేఏ ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్, కైట ప్రొడక్షన్స్ నిర్మించాయి. పొఖ్రాన్–2 అణుపరీక్షల బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించారు. ‘‘చరిత్రను చూపించడం అంత ఈజీ కాదు. న్యూక్లియర్ స్టేట్‌కి వచ్చే దారి ఫుల్ ఆఫ్ చాలెంజెస్‌తో ఉంది. సినిమాను మే 25న రిలీజ్ చేయనున్నాం’’ అని జాన్ అబ్రహాం పేర్కొన్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
రాజీ ట్రైలర్ నిడివి 2 ని. 41 సె. హిట్స్ 21,55,563 బాలీవుడ్‌కు వర్తమానంలో కథలు దొరకడం లేదు. అందుకే బయోపిక్‌లు, చారిత్రక ఘటనలు, యుద్ధ సమయాలు అంటూ వెనక్కు వెళ్లి వెతుక్కుంటున్నారు. తాజాగా 1971 ఇండో–పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన దేశపు అమ్మాయి అక్కడి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలా మనకు గూఢచారిగా పని చేసిందనే కథను ‘రాజీ’గా తీశారు. ఇది నిజ జీవిత ఆధార కథ. గతంలో నేవీలో ఆఫీసర్‌గా పని చేసిన హరిందర్ సిక్కా అనే వ్యక్తి తనకు తారసపడిన ఒక ఆఫీసర్ చెప్పిన వాస్తవ గాథ ఆధారంగా ‘కాలింగ్ సెహమత్’ అనే నవల రాస్తే దాని ఆధారంగా ఈ సినిమా తీశారు. ‘రాజీ’ అనే ఉర్దూ మాటకు అర్థం ‘అంగీకారం’ అని. దేశం కోసం త్యాగం చేయాలనే అంగీకారంతో పాకిస్తాన్‌కు వధువుగా వెళ్లి ఆమె ఎలాంటి కష్టాలు పడిందనేది కథ. ఆలియా భట్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. మేఘనా గుల్జార్ దీని దర్శకురాలు. కరణ్ జొహర్ ఒక నిర్మాత. పాకిస్తాన్ నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు అండర్ కవర్ ఏజెంట్లుగా వెళ్లినవాళ్లు అజ్ఞాతంగా రాలిపోవాల్సిందే తప్ప నలుగురికీ తెలియరు. వాళ్లను ఆయా దేశాలు తమ ఏజెంట్లుగా బయటకు చెప్పవు కూడా. అటువంటి కథను తీసుకొని ఈ సినిమా తీయడం కుతూహలం రేపుతోంది. రంగమ్మా మంగమ్మా వీడియో సాంగ్ నిడివి 5 ని. 58 సె. హిట్స్ 45,91,926 ఒక పాట హిట్ అయితే దాని ఆధారంగా వీడియో సాంగ్స్ తయారు కావడం మామూలే. కానీ ‘రంగస్థలం’లోని ‘రంగమ్మా మంగమ్మా’ పాట వీడియో సాంగ్ చాలామందికి నచ్చుతున్నట్టే ఉంది. దీప్తి సునయన ఈ పాటకు డ్యాన్స్ చేసి ఒరిజినల్ పాట అందుబాటులో లేని లోటును తీరుస్తోంది. పెద్ద సినిమాల్లో నటించాలనే అభిలాష ఇలా తీర్చుకునే వీలు దొరకడం వల్ల ఔత్సాహికులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అఖిల్ జాక్సన్, సాత్విక్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. మంచి పల్లె వాతావరణంలో కలర్ఫుల్గా ఉన్న ఈ పాట ఒరిజినల్ ట్రాక్ వల్ల కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలో ఈ పాట పాడిన మాన్సి ఈ పాటతో పెద్ద స్టార్ అయ్యింది. అలాగే ఈ వీడియోకు డ్యాన్స్ చేసిన దీప్తి కూడా యూట్యూబ్ స్టార్ అవుతుందని ఆశిద్దాం. పరమాణు ట్రైలర్ నిడివి 1 ని. 11 సె. హిట్స్ 15,03,370 ‘బుద్ధుడు నవ్వాడు’ అని మెసేజ్ పాస్ అయ్యింది వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పైస్థాయి అధికారులకు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం అయ్యాక ఆ సమాచారాన్ని అందచేయడానికి వాడిన కోడ్‌వర్డ్ అది. భారతదేశాన్ని ‘న్యూక్లియర్ స్టేట్’గా ప్రకటించే సమయం ఆసన్నమయ్యిందని నాటి పాలకులు, సైన్యం భావించింది. దానికి తగిన పనులు ఎంతో రహస్యంగా జరిగాయి. ఆ ‘మిషన్’ వెనుక జరిగిన కథ పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడు అదంతా ‘పరమాణు’ పేరుతో సినిమాగా తయారయ్యింది. జాన్ అబ్రహమ్ ప్రధాన పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్, 2017కే విడుదల కావాల్సి ఉంది. కానీ ‘పద్మావత్’ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయని పోస్ట్‌పోన్ చేశారు. మే 4 విడుదల. -
నిర్మాతపై ప్రముఖ హీరో కేసు!
సాక్షి, ముంబై: జాన్ అబ్రహం, దియానా పెంటీ జోడీగా తెరకెక్కిన తాజా సినిమా ‘పరమాణు: ద స్టోరీ ఆఫ్ పొఖ్రాన్’ ఇప్పట్లో థియేటర్లోకి వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా సహ నిర్మాతల మధ్య తగవు తారాస్థాయికి చేరుకుంది. జాన్ అబ్రహంకు చెందిన జేఏ ఎంటర్టైన్మెంట్, క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్ మధ్య కలహాలు తీవ్రమై.. పోలీసు కేసుల వరకు వెళ్లింది. తాజాగా సినిమా సహ నిర్మాత అయిన క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ప్రేరణ అరోరాపై జాన్ అబ్రహం మూడు క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. చీటింగ్, పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీయడం, పరువుకు నష్టం కలిగించడంతోపాటు సమాచార చట్టం కింద పలు అభియోగాల కింద ప్రేరణ అరోరాపై కేసులు నమోదుచేసినట్టు జేఏ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పరమాణు’ సినిమా విషయంలో జేఏ ఎంటర్టైన్మెంట్, క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాణంలో ఉమ్మడిగా తెరకెక్కించాలని ఒక ఒప్పందానికి వచ్చాయని, ఇందులో భాగంగా ప్రొడక్షన్ ఖర్చులు, నటీనటులకు చెల్లింపులు, ఇతర వ్యయాల కోసం క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్ రూ. 35 కోట్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నామని, ఇందుకు బదులుగా 50శాతం ఐపీఆర్ హక్కులు, ఇతర హక్కులు ఈ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించామని, కానీ, ఈమేరకు చెల్లింపులు చేయకుండా, తప్పుడు బ్యాంకు ట్రాన్స్ఫర్లతో తమను మోసగించిందని, దీంతో క్రిఅర్జ్ కంపెనీతో జాన్ అబ్రహం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారని, ఒప్పందంలోని వివరాలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదుచేశారని జేఏ ఎంటర్టైన్మెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ప్రేరణ అరోరా అక్రమంగా తమ సినిమా ఆన్లైన్ పబ్లిసిటీ సమాచారాన్ని బ్లాక్ చేసిందని, ఇప్పటికే సినిమా కోసం చేసిన చెల్లింపులను తిరిగి పొందిన ప్రేరణ.. జాన్ అబ్రహంకు రావాల్సిన బకాయిలను మాత్రం చెల్లించడం లేదని పేర్కొంది. -
జాన్‌తో జోడీగా
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో జత కట్టనున్నారని బాలీవుడ్ టాక్. జాన్ అబ్రహాం, మనోజ్ భాజ్‌పాయి ముఖ్య పాత్రల్లో మిలాప్ జావేరి దర్శకత్వం వహించనున్న ఓ యాక్షన్ మూవీలో తమన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట చిత్రబృందం. ఈ రోల్ ఆమెకు బాగా సూట్ అవుతుందని, స్క్రిప్ట్ తమన్నాకు కూడా బాగా నచ్చిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాలో తమ్మూ కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వాని నిర్మించనున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు తమన్నా నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. సో.. ఈ సినిమాతో అయినా సూపర్ సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. తమన్నా ప్రస్తుతం ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘క్వీన్ వన్స్ ఎగైన్’, కల్యాణ్ రామ్ సరసన ఒక సినిమా చేస్తున్నారు. -
హిట్ కోసం ఐదోసారి!
తమన్నాకు హిట్స్ కొత్త కాదు. సౌత్‌లో పలు హిట్, సూపర్‌హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ, హిందీలో హిట్ అనేది ఇప్పటివరకూ అందని ద్రాక్షలా ఆమెను ఊరిస్తోంది. ‘హమ్‌షకల్స్’, ‘హిమ్మత్వాలా’, ‘ఎంటర్టైన్మెంట్’... తమన్నా చేసిన మూడు స్ట్రయిట్ హిందీ సినిమాలు నిరాశను మిగిల్చాయి. గతేడాది నటించిన త్రిభాషా సినిమా ‘అభినేత్రి’ కూడా ఫ్లాప్ జాబితాలో చేరింది. అయినా... పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో తమన్నా హిందీ తెరపై హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా... జాన్ అబ్రహాం హీరోగా నటించనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఛోర్ నికల్ కే భాగ్’లో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. అయితే... హీరోయిన్గా కాదు, హీరోకు ధీటుగా అతనితో మైండ్ గేమ్స్ ప్లే చేసే కీలక పాత్ర. ఇందులో తమన్నా ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నారు. ఈసారి హిట్ కన్ఫర్మ్ అని తమన్నా ధీమాగా ఉన్నారట! హిందీ సినిమాల సంగతి పక్కన పెడితే... తెలుగులో ఆమె నటించిన ‘బాహుబలి–2’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో ఆమె రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. -
జాన్ హ్యాండ్సమ్
→ జాన్ అబ్రహం రాత్రి తొమ్మిదింటికి నిద్రపోతాడు. ఉదయం నాలుగు Výæంటలకి లేచి ఎక్సర్సైజులు చేస్తాడు. → జాన్‌కు తల్లి మీద అభిమానం ఎక్కువ. అనుక్షణం ఆమె తన వెంట ఉండాలని కోరుకుంటాడు. → జాన్ ప్రతి 2 గంటలకు ఒకసారి భోజనం చేస్తాడు. ‘మద్రాస్ కెఫె’ చిత్రం కోసం కేరళలో షూటింగ్లో ఉండగా బ్రేక్‌ఫాస్ట్‌లో 26 ఆప్పవ్ులు తినేసేవాడు. ఏ క్షణమైనా సరే రెండు కిలోల కాజూ బర్ఫీ ఒక్క దమ్మున తినేయగలడు. → జాన్ అంటే సల్మాన్‌ఖాన్‌కు ఎందుకనో సదభిప్రాయం లేదు. → జాన్ ఆల్కహాల్ ముట్టడు. డ్రగ్స్ వాడడు. మాంసాహారం కూడా అప్పుడప్పుడే. → జాన్ ‘పెటా’ సభ్యుడు. మూగజీవాలపై హింసను వ్యతిరేకిస్తాడు. జాన్ అబ్రహం సెట్‌కు రాగానే సాధారణంగా ప్రతి డైరెక్టర్ అరిచే అరుపు– ‘జాన్... ముందు ఆ చొక్కా విప్పి పడేయ్’... ఎస్. జాన్ చొక్కా విప్పేయాలి. కండలు చూపించాలి. నలుగురిని చావబాదాలి. ప్యాకప్ చెప్పి వెళ్లిపోవాలి. ‘ఒరి వెధవా. నాక్కూడా బుర్రుందిరా. చదువుంది. జ్ఞానం ఉంది. విషయ పరిజ్ఞానం ఉంది. నన్నొక మనిషిగా చూడవా నువ్వూ.’ 1991 మే 21న రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. అందుకు కారకులెవరో తేల్చడానికి ఆ తర్వాత జస్టిస్ జైన్ ఆధ్వర్యంలో కమిషన్ నియుక్తమైంది. కమిషన్ విచారణ చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత 3000 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. దానిని ఎంతమంది చదివారో లేదో కానీ జాన్ అబ్రహం చదివాడు. రాజీవ్ గాంధీ మరణం ఒక సాధారణ మరణం కాదు. దేశాన్ని మలుపు తిప్పిన మరణం. దీనిని వార్తా పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. కాని పాపులర్ మీడియా అయిన సినిమాలో కూడా ఈ ఉదంతం రికార్డ్ చేయాలి. దీనిని సినిమాగా తీయాలి. జైన్ కమిషన్ ఆధారంగా జాన్ అబ్రహం ఈ సినిమా తీయాలనుకున్నాడు. తనే హీరోగా అంటే సినిమాలో విచారణ అధికారిగా నటించాలనుకున్నాడు. స్క్రిప్ట్ తయారైంది. స్టూడియోలకు ఎక్కే గడప దిగే గడపగా తిరగడం మొదలుపెట్టాడు. ‘ఇదేం స్క్రిప్ట్’ అని ఒకరు, ‘ఇందులో మసాలా ఏముంది’ అని ఒకరు, ‘ఇందులో నువ్వు చొక్కా విప్పవు కదా ఏం ఆడుతుంది’ అని ఇంకొకరు, ‘చివరలో నువ్వు చచ్చిపోతావా? అయితే వేస్ట్’ అని మరొకరు – ఇలా జాన్‌ను ఛీ కొట్టారు. జాన్ మాత్రం ఆ సినిమా తీయాలని పట్టుబట్టాడు. చివరకు తీశాడు. ‘మద్రాస్ కెఫే’. జాన్‌ను నిర్మాతగానే కాదు బుర్రున్న ఒక మనిషిగా, నటుడిగా కూడా ఈ సినిమా నిలబెట్టింది. అరె.. జాన్ పుట్టింది కేవలం చొక్కా విప్పడానికి కాదా అని ఒకరిద్దరు పాత డైరెక్టర్లు ఆశ్చర్యపోయారు. దీనికి ముందు కూడా జాన్‌కు బుర్ర ఉందని నిరూపితం అయ్యింది. ఒక కథ. ఏమిటంటే ఒక కుర్రాడు తన వీర్యాన్ని అమ్ముతూ ఉంటాడు. దాని వల్ల నిజ జీవితంలో సమాజ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు అనేది చూపించాలి. దీనిని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అసలు వీర్యం అనే మాటను సినిమాలో ఎలా పలకడం. కాని జాన్ అబ్రహం ధైర్యం చేశాడు. తానే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చాడు. సినిమా తయారైంది. పేరు– ‘విక్కీ డోనర్’. చిల్లర డబ్బుతో తీసిన ఆ సినిమా కోట్లు సంపాదించింది. ఇటీవల తెలుగులో ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ కూడా అయ్యింది. జాన్ మీద తండ్రి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన మలయాళీ. ముంబయ్‌లో ఆర్కిటెక్ట్‌గా చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. అక్కడే ఒక జొరాష్ట్రియన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. జాన్ పెద్ద కొడుకు. తల్లి అతడికి ఫర్హాన్ అనే పేరు పెట్టుకుంది. తండ్రి జాన్ అని పెట్టుకున్నాడు. చివరకు జాన్ అబ్రహంగా స్థిరపడింది. చిన్నప్పుడు జాన్ క్లాస్‌లో బుద్ధిగా చదువుకునేవాడు. చూట్టానికి బాగుండేవాడు. కాని కాలేజీ వయసుకు వచ్చేసరికి ముఖమంతా మొటిమలే. వాటిని వదిలించుకోలేక సిగ్గుపడేవాడు. అద్దం చూసుకోవడానికే భయం. కానీ తెర మీద ఎలా చూసుకోగలిగాడు? ఒకసారి ఒక సినిమా వచ్చింది. హాలీవుడ్ సినిమా. అందులో హీరో యమాగా ఉన్నాడు. తీర్చిదిద్దిన కండలతో ఉన్నాడు. మనిషి కూడా గొప్ప అందగాడు. రాకెట్ లాంచర్ పేల్చాడంటే విలన్ డెన్ తుక్కు తుక్కు కావాల్సిందే. జాన్ కాలేజీ చదువుతుండగా ఆ సినిమా వచ్చింది. వెళ్లి థియేటర్లో చూశాడు. చూశాక ఏమనిపించిందంటే ఇప్పటికిప్పుడు ఆ హీరోలా తయారవ్వాలని. హాలు నుంచి బయటకు వస్తే అరటిపండ్ల బండి కనిపించింది. వెంటనే వెళ్లి ఒక డజను పండ్లు తినేశాడు. అరటి పండ్లు తింటే కండలొస్తాయి మరి. కండలు రాలేదు కాని మనసులో హీరో కావాలనే కోరిక మాత్రం పుట్టింది. ఆ తర్వాత నిజంగానే హీరో అయ్యాడు. అందుకు అతడు ఆ హాలీవుడ్ హీరోకు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. అతడి పేరు – సిల్వర్‌స్టర్ స్టాలెన్. జాన్‌ది తండ్రి పోలిక. చూడటానికి చక్కగా ఉంటాడు. ఫొటోలకు సరిపడినట్టుగా ఆ ముక్కు ఉంటుంది. ‘గ్లాడరాక్స్’ అనే మేగజీన్ ఏదో కుర్రాళ్ల పోటీ పెడితే అందులో జాన్ పాల్గొన్నాడు. ఫొటోలు బయటికొచ్చాయి. ఒక ఏజెన్సీ వాళ్లు చూసి ‘లెవీ జీన్స్’ కోసం పేపర్ యాడ్ చేయమంటే చేశాడు. పెద్ద హిట్. ఆ తర్వాత అలాంటివే చాలా యాడ్స్ వచ్చాయి. ఫ్యాషన్ షోస్... ర్యాంప్ వాక్స్. అయితే ఏ వృత్తిలో అయినా ఆ వృత్తికి సంబంధించిన చీకాకులు ఉంటాయి. ఒకసారి ఢిల్లీలో ర్యాంప్ వాక్ ఉందని కబురు చేశారు. మరో మోడల్ డినో మోరియాతో కలిసి వెళ్లాడు. ర్యాంప్ వాక్కు సిద్ధమయ్యాక తెలిసింది అదో అండర్ వేర్ కంపెనీకి సంబంధించిన వాక్ అనీ... అండర్ వేర్ ధరించి అందరి ముందు నడవాలనీ. సిగ్గుతో చచ్చి సున్నమయ్యాడు. అయితే అలా నడిచినా సరే... అతడు గ్రీకు శిల్పంలా ఉన్నాడని మార్కులు పడ్డాయి. హాలీవుడ్లో ఆల్రెడీ ఒక కండల వీరుడు ఉన్నాడు.... సల్మాన్ ఖాన్. మరో యాక్షన్ హీరో ఉన్నాడు.... అక్షయ్ కుమార్. రొమాంటిక్ హీరోలు... షారుఖ్, ఆమిర్ ఉన్నారు. జాన్ లాంటి కొత్త హీరోలకు చోటు లేదు. కాని తను హీరో కావాలనుకున్నాడు. ఎలా? ఇండస్ట్రీలో ఏ అండా లేని వారికి భట్ కుటుంబమే అండ. మహేశ్ భట్, అతని కుమార్తె పూజా భట్ కలిసి నిర్మిస్తున్న సినిమా– ‘జిస్మ్’ (2003)లో ఛాన్స్ వచ్చింది. ఆడవాళ్లంటే పడి చచ్చే ఒక తిరుగుబోతు పాత్ర అది. ఒక వివాహితతో సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకొనే పాత్ర. ఆ పాత్ర హిట్ అయ్యింది. అందులోని ‘జాదూ హై నషా హై’... పాట కూడా. అయితే ఆ వెంటనే వచ్చిన అవకాశాలు పెద్దగా లాభించలేదు. లాభం ఏదైనా ఉంటే అది బిపాషా బసూయే. ఆమె ‘జిస్మ్’ హీరోయిన్. అప్పుడే అయిన తాజా పరిచయం. జాన్ అబ్రహంను, బిపాషా బసును ఇండస్ట్రీలో ‘సూపర్ కపుల్’ అని పిలిచేవారు. వారి అనుబంధం, ‘లివ్ ఇన్ రిలేషన్’ ఇవాళ ఉండి, రేపు పోయేది కాదు. దాదాపు 8 సంవత్సరాలు కొనసాగింది. ‘ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇక మీదట కూడా కలిసే ఉంటాం. మేం విడిపోయే సమస్యే లేదు’ అని బిపాష ఒక సందర్భంలో అంది. కాని ఆమె నమ్మకం తప్పని తేలింది. 2011లో వాళ్లిద్దరూ విడిపోయారు. ఇండస్ట్రీలో పెద్ద గోల అయ్యింది. ఎందుకు ఎందుకు... అని అందరూ ఆరా తీశారు. కాని జాన్ అబ్రహం నోరు మెదపలేదు. తన జీవితంలో 8 ఏళ్ల పాటు కలిసి జీవించిన జీవితాన్ని ఇచ్చిన స్త్రీని గౌరవించాలని అతనికి తెలుసు. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఇప్పటికీ. ఎక్కడా. ఆమె కూడా సంయమనం పాటించింది. చాలా మర్యాదకరంగా వారిరువురూ విడిపోయారు. ఆ తర్వాత జాన్ ఫైనాన్స్ అనలిస్ట్ అయిన ప్రియా రుచల్ను (2014)లో, బిపాషా టీవీ నటుడైన కరణ్ సింగ్ గ్రోవర్ (2016)ను వివాహం చేసుకున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్‌కు ఇదివరకే రెండు సార్లు పెళ్లయ్యిందనేది కేవలం అదనపు సమాచారం. జాన్ అబ్రహంకు బైక్ అంటే తెగ పిచ్చి. మన ఇళ్లల్లో బైక్స్ ఎప్పుడైనా గమనించారా? 100 సిసి, 125 సిసి ఇలా ఉంటాయి. జాన్ దగ్గర ఉన్న బైక్ కేవలం 1700 సిసి మాత్రమే. అలాంటి బైక్ తీసుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టని సమయంలో రాత్రి పూట అతడు చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఇలాంటి బైక్ పిచ్చే అతడికి యశ్‌చోప్రా ‘ధూమ్’లో అవకాశం ఇచ్చింది. ఆ సినిమా కలెక్షన్లలో దుమ్ము రేపింది. రాత్రికి రాత్రి జాన్ పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియదర్శన్ దర్వకత్వంలో వచ్చిన ‘గరం మసాలా’ (2005), నానా పటేకర్‌తో నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) జాన్‌ను బాలీవుడ్లో స్థిరమైన హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘దోస్తానా’ (2008) జాన్‌ను కథకు అనుగుణమైన పాత్రలు వేసే హీరో ఇమేజ్ వచ్చింది. దోస్తానాలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్ తమ పొట్ట కూటి కోసం ‘గే’ అవతారాలెత్తి నవ్వులు పండిస్తారు. పురుషుల కండల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి కరణ్ జోహార్ ఈ సినిమాలో జాన్‌ను అరమరికలు లేకుండా చూపించి, అభిమానులకు కనువిందు చేయించాడు. 2016లో జాన్ అబ్రహంవి 3 సినిమాలు వచ్చాయి. ‘రాకీ హ్యాండ్సమ్’, ‘డిషూమ్’, ‘ఫోర్స్ టు’. మొదటిది ఒక మోస్తరుగా ఆడినా మిగిలిన రెండు పెద్ద హిట్టయ్యాయి. ఇంకా చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. హీరోగా, నిర్మాతగా, ఫుట్‌బాల్ టీమ్ యజమానిగా జాన్ చాలా పనుల్లో ఉన్నాడు. సినిమా అతడి జీవితంలో ఒక భాగం మాత్రమే. మనిషిగా బాధ్యత గల పౌరుడిగా ఉండటమే ముఖ్యమని అతడు భావిస్తాడు. జాన్ డిఫరెంట్. ఆ సంగతి కాలం గడిచే కొద్దీ అందరికీ అర్థమైంది. మిగిలిన హీరోల్లా అవార్డు ఫంక్షన్లకు వెళ్లడు. పార్టీలకు వెళ్లడు. డబ్బున్న వాళ్ల పెళ్లిళ్లకు వెళ్లి చిల్లర కోసం డాన్సులు చేయడు. పెద్దగా కాంట్రవర్సీల్లో ఇరుక్కోడు. తను.. తన పని.. అంతే. ఒకప్పుడు జాన్ వచ్చిన వెంటనే డైరెక్టర్ ‘జాన్... చొక్కా విప్పెయ్’ అనేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ వెండితెరకు కొత్త సంస్కారాన్ని కుట్టే పాత్ర కోసం జాన్‌ను ఎంచుకుంటున్నారు.జాన్– ఇప్పుడు ఒక రెస్పెక్టబుల్ హీరో.రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. రెస్పెక్ట్ ఊరికనే మాత్రం రాదు. – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
అమ్మ, నాన్న అండ్ వైఫ్
⇒ ఇక్కడ వీడున్నాడు చూడండి.. నాన్న చంకలో.. జాన్ అబ్రహాం! బాలీవుడ్ యాక్టర్. నాన్న పక్కన ఉంది అమ్మ. ⇒ నాన్న మలయాళీ. అమ్మ పార్శీ. ⇒ వీడికి ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం అలవాటు. చైల్డ్‌హుడ్ అలవాటు కాదు. ఇన్ని కండలు పెంచాక.. ఇప్పుడు కూడా! ⇒ సినిమాల్లో అడ్డగాడిదలా రైడ్లు, నైట్ పార్టీలు అని తిరుగుతుంటాడు కానీ, లైఫ్‌లో చాలా డీసెంట్. నో క్లబ్స్, నో పార్టీస్. ఇక రైడ్స్ అంటారా.. పాపం వీడి బైక్.. పెళ్లయ్యాక (వీడికి పెళ్లయ్యాక) పెద్దమనిషి తరహాలోకి మారిపోయింది! ⇒ జాన్ అబ్రహాం అని కాకుండా వీడికి బాగా సూట్ అయ్యే ఇంకో పేరు ‘స్మైల్’. ఈ మాట మనం అనడం కాదు. అస్తమానం వీడితో దెబ్బలాడి మీద పడిపోతుండే బిపాషా బసు అనే మాట. ఇప్పుడు నో బిపాషా. ఓన్లీ ప్రియా రంచల్. వీడి భార్య (పైన రెడ్ షర్ట్‌లో). బిపాషతో చాలాకాలం క్రితమే బ్రేకప్ అయింది. ⇒‘స్మైల్’ (మనం కూడా ఇలాగే పిలుద్దాం) వెరీ సింపుల్. ఎక్కడికెళ్లినా కాళ్లకు స్లిప్పర్స్‌తోనే వెళ్తాడు. ఫ్రెండ్స్ తిడుతుంటారట.. ఆ స్లిప్పర్స్ మాని, షూ వేస్కోరా అని! ⇒ బైక్స్ అంటే ఇష్టం. ఫస్ట్ బైక్ 18 ఏళ్లప్పుడు కొన్నాడు. యమహా ఆర్.డి.350. ⇒ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడికెళ్లినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే. ⇒ స్మైల్ అమ్మానాన్న కూడా చాలా సింపుల్. ఉద్యోగానికి నాన్న.. బస్‌లో వెళ్లొచ్చేవారు. అమ్మ.. ఆటోలో వెళ్లొచ్చేవారు. ⇒స్మైల్ నాన్న క్యాన్సర్ పేషెంట్. అమ్మ కేరింగే నాన్నను బతికించింది అంటాడు స్మైల్. ⇒ వీడి గురించి ఫైనల్‌గా ఇంకో మాట. ఒకప్పుడు స్మోకర్. అయితే ఆ పాడు అలవాటు చాలాకాలం క్రితమే వదిలేశాడు. గుడ్ బాయ్ అయిపోయాడు. (ఈ రోజు ఈ గుడ్‌బాయ్, ఈ స్మైలింగ్ బాయ్, ఈ సింపుల్ బాయ్.. బర్త్ డే! హ్యాపీ బర్త్‌డే రాకీ హ్యాండ్సమ్!!) -
భారత్‌లో ఈ కారు మరొకటి లేదు: హీరో
-
భారత్‌లో ఈ కారు మరొకటి లేదు!
ముంబై: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమాల విషయంలో కాదండోయ్.. అందుకు కారణం ఓ లేటెస్ట్ ఎడిషన్ కారు. నిస్సాన్ జీఎటీ-ఆర్ బ్లాక్ ఎడిషన్ మోడల్ కారు మీకు తెలుసుకదండీ. ఇటీవల మార్కెట్లోకి లాంచింగ్ అయిన ఈ కారు దేశంలో కేవలం ఒక్కటే ఉంది. అది కూడా తన వద్దే ఉందని లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా జాన్ అబ్రహం స్వయంగా తెలిపాడు. సాధారణంగా ఈ యాక్షన్ హీరోకు ఖరీదైన, లేటెస్ట్ కార్లు, బైక్స్ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ ఖరీరైన కారు ఖరీదు భారత్ లో దాదాపు రెండు కోట్లు(రూ.1.99 కోట్లు). మొదట తాను నిస్సాన్ జీఎటీ-ఆర్ బ్లాక్ ఎడిషన్ ఫస్ట్ కస్టమర్ అని చెప్పిన ఈ హీరో అసలు విషయాన్ని దాచాడు. ఫస్ట్ కస్టమర్ మాత్రమే కాదు వన్ అండ్ ఓన్లీ కస్టమర్ అని. తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ వీడియోతో పాటు కారు వివరాలను పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఆ వీడియోను 14 లక్షల మంది వీక్షించారంటే మాటలు కాదు. అయితే నిస్సాన్ కంపెనీ గతంలో తీసుకొచ్చిన మోడల్స్ కంటే కూడా ఈ ఎడిషన్ అందర్నీ ఆకట్టుకుంటుందని సమాచారం. 3.8 లీటర్ల వీ6 ఇంజిన్ ఉన్న ఈ కారు కేవలం మూడు సెకన్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. -
హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..?
బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. 2011లో రిలీజ్ అయిన ఫోర్స్ సినిమాతో ఆకట్టుకున్న జెనీలియా లాంగ్ గ్యాప్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ లో నటిస్తోంది. అయితే తొలి భాగం చివర్లో జెనీలియా పాత్ర చనిపోతుంది. మరి ఈ రెండు భాగంలో ఆమె పాత్రను ఎలా చూపిస్తారు. దెయ్యంగా వస్తుందా లేక.. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. సోనాక్షి సిన్మా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఫోర్స్ టు నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
ఈ సెలబ్రిటీలు.. అలా నిద్రపోతారట!
సెలబ్రిటీలు దగ్గినా, తుమ్మినా వార్తే అవుతుంది. అభిమానుల్లో వాళ్లకుండే క్రేజ్ అలాంటిది మరి. కొంతమంది సినీతారలు వ్యక్తిగత జీవితం విషయంలో చాలా గోప్యత పాటిస్తారు. కానీ మరికొంతమంది ఓపెన్‌గా అన్నీ చెప్పేస్తుంటారు. అలా కొందరు తారలు ఓపెన్‌గా చెప్పిన ఓ చిత్రమైన అలవాటేంటో తెలుసా.. దుస్తులు లేకుండా నిద్రపోవడం. బాలీవుడ్ మ్యాన్లీ హీరో జాన్ అబ్రహాం నటించిన 'డిష్యూం' సినిమా ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన జాన్ కేవలం టవల్ మాత్రమే కట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాన్ పక్కన వరుణ్ ధావన్ కూడా అదే పోజ్‌లో ఉన్నాడనుకోండి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తనకి దుస్తులు లేకుండా నిద్రపోవడం ఇష్టమంటూ ఫ్యాన్స్‌ను పరేషాన్ చేశాడు ఈ డిష్యూం స్టార్ అలాగే 'డిష్యూం' బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అదే మాట చెప్పి అభిమానులను ఆశ్చర్యపరచింది. నిద్రపోయేటప్పుడు దుస్తులు వేసుకోవడం చాలా చిరాకుగా ఉంటుందంటూ టాప్ సీక్రెట్‌ను చల్లగా రివీల్ చేసింది. నేనేమైనా తక్కువా అంటూ మరో అడుగు ముందుకేసింది మోడల్, నటి పూనమ్ పాండే. ఈమె నటనతో కన్నా నోటితోనే పాపులర్ అయ్యింది. నగ్నంగానే నిద్రపోవాలి.. ఏమో ఎవరికి తెలుసు, కలలో ఎవరిని కలుసుకుంటామో అంటూ తనకలవాటైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాకెక్కింది. అంతేనా.. ఇంత 'ఓపెన్'గా నిద్రపోయే సెలబ్రిటీలు చాలామందే ఉన్నారట. ఇలాంటి వార్తలు ఎంతమంది ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తాయో! అయినా వ్యక్తిగత విషయాన్ని చిత్రంగా వాళ్లే చెప్పుకున్నప్పుడు.. విచిత్రంగా మనం మాట్లాడుకోమా ఏంటి? -
బాలీవుడ్లోనే ఖరీదైన ఫైట్ సీన్
బాలీవుడ్ హీరోలు జాన్ అబ్రహం, వరుణ్ ధవన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా డిష్యుం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రముఖులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో హెలికాప్టర్‌తో ఓ యాక్షన్ సీన్‌ను చూపించారు. ఈ ఒక్క సీన్ షూట్ చేయడానికి ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అంతేకాదు ఈ యాక్షన్ సీన్ దాదాపు 12 నిమిషాల నిడివితో ఊపిరి బిగబట్టి చూసేంత ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు చెపుతున్నారు చిత్రయూనిట్. మొరాకోలో షూట్ చేసిన ఈ సీన్స్‌లో హెలికాప్టర్లతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ ఫైటర్స్ కూడా పాల్గొన్నట్టు తెలిపారు. టీమిండియాలో టాప్ బ్యాట్స్‌మన్ విరాజ్ కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ ధవన్, జాన్ అబ్రహం ఇన్వస్టిగేషన్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. రోహిత్ ధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, అక్షయ్ ఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
ఈ హీరో ఏంచేశాడో చూడండి!!
బాలీవుడ్ సినిమా 'డిష్యూమ్' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రచార చిత్రం విడుదల సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాడెజ్ చేసిన చిలిపి పనులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ తో కలిసి జాక్వెలైన్ పాల్గొంది. వెరైటీ డ్రెస్సులో వేదికపైకి వచ్చిన అందాల భామ వరుణ్ తో కలిసి అల్లరి చేసింది. అతడిని చేయి పట్టుకుని లాక్కుపోయింది. తర్వాత ఆమెను వరుణ్ చేయి పట్టి లాగాడు. ఆ తర్వాత ఆమెను వెనుక నుంచి తోస్తున్నట్టుగా నటించాడు. భయపడినట్టుగా నటించి వెంటనే తన మోచేయితో అతడిని డొక్కలో ఒక్క గుద్దు గుద్దినట్టు నటించి నవ్వులు పూయించింది. తర్వాత వారిద్దరూ వేదిక దిగివెళ్లిపోయారు. సినిమా ప్రమోషన్ కోసం వీరు చేసిన ఫిట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వరుణ్ సోదరుడు రోహిత్ దర్శకత్వం వహించిన 'డిష్యూమ్' జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది. -
'ఆ సినిమాతో పోలికే లేదు'
ముంబై: 'డిష్యూమ్' సినిమాతో 'ధూమ్'కు పోలిక ఉండదని హీరోలు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ తెలిపారు. ఈ రెండు సినిమాలకు ఎటువంటి పోలికలు లేవని స్పష్టం చేశారు. తమ సినిమా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. 'డిష్యూమ్' సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇందులో కబీర్, జునైద్ గా నటించామని... వీరిద్దరూ ఎదుర్కొనే సమస్యలు, వాటిలోంచి బయటడేందుకు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయన్నారు. 'ధూమ్' సినిమాలోనూ కబీర్ గా జాన్ అబ్రహం నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సీక్వెల్స్ తీస్తున్నారు. అయితే రెండు సినిమాల్లో తన పాత్ర పేరు ఒకటే అయినా రెండు డిఫరెంట్ రోల్స్ అని చెప్పాడు. వరుణ్ సోదరుడు రోహిత్ దర్శకత్వం వహించిన 'డిష్యూమ్'లో జాక్వెలెస్ ఫెర్నాడెంజ్, అక్షయ్ ఖన్నా ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది. -
పెళ్లి గురించి అడిగితే మైక్ విసిరికొట్టిన హీరో
ప్రేమలు పలు విధములు. వ్యక్తీకరణలు(ఎక్స్ ప్రెషన్స్) బహువిధములు. మనసు దోచిందనో, మాయ చేసిందనో, మోసంతో వంచన చేసిందనో లేక విధికి తలవంచి వీడిపోయిందనో.. మాజీ ప్రియురాళ్లపై ప్రియులు లేదా మాజీ ప్రియులపై ప్రియురాళ్లు అప్పుడప్పుడూ నోరుపారేసుకోవటం లేదంటే ఆగ్రహం వ్యక్తం చేయటం(నిజానికి ఇవి కూడా ప్రేమ వ్యక్తీకరణలే) లాంటివి చేస్తుంటారు. ఇప్పడు వంతు బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో జాన్ అబ్రహామ్ ది. ఏళ్లకిందటే ప్రేమ పెళ్లి చేసుకుని సెటిల్(వైవాహికంగా) అయిపోయిన జాన్.. మాజీ ప్రేయసికి సంబంధించిన ప్రశ్నను ముల్లులా భావించాడు. 'బిపాషా బసూ పెళ్లి చేసుకోబోతోందికదా.. మీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగిన పాపానికి విలేకరిపై అంతెత్తు ఎగిరిపడ్డాడు. కోపంగా మైక్ విసిరికొట్టి, ఆగ్రహంతో వెళ్లిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన జరిగింది. హీరో ప్రదర్శించిన అసహనం అఅక్కడున్న కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తే, మరికొంత మంది మాత్రం 'ప్రేమ పలు విధములు.. వ్యక్తీకరణలు బహువిధములు..' అనుకున్నారట! 'డ్రీమ్ కపుల్'గా ముద్రపడ్డ జాన్ అబ్రహాం, బిపాషా బసులు తొమ్మిదేళ్లపాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జాన్ అబ్రహాం.. తన స్నేహితురాలు ప్రియా రాంచల్ను ప్రేమ వివాహం చేసుకోగా, ఇప్పుడు బిపాషా తన సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 30వ తేదీన వీరి వివాహం జరుగనుంది. వివాహానికి సంబంధించిన వేడుకల్లో మునిగి తేలుతుంది పెళ్లికూతురు. మొహమాటానికైనా జాన్‌కు ఇన్విటేషన్ పంపలేదట బిపాషా బసు. ఇదిలాఉంటే బిప్స్ మరో మాజీ ప్రేమికుడు డినోమారియా మాత్రం 'తను పిలవకపోయినా బిపాషా పెళ్లికి వెళతాను'అని మరో తరహా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సౌత్ సినిమాలో జాన్ అబ్రహం
సాధారణంగా సౌత్ హీరోలు బాలీవుడ్లో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ధూమ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం. ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకునే సినిమాలు చేయలేకపోయినా బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్నాడు ఈ మ్యాన్లీ హీరో. ప్రస్తుతం తానే నిర్మాతగా మారి రాకీ హ్యాండ్సమ్ పేరుతో ఓ యాక్షన్ సినిమాను తెరకెక్కించాడు. మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకుడు. ఈ సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న జాన్, సౌత్‌లోనూ ఈ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే రీమేక్ చేయడం కన్నా డగ్ చేసి రిలీజ్ చేయటం బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై జాన్ అబ్రహం ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. -
చక్రాలు లేకుండానే సెలబ్రిటీల చక్కర్లు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటీనటులు, క్రికెట్ సెలబ్రిటీలతో ఆటో ఎక్స్పో అదరహో అనిపిస్తోంది. ఈ ఆటో ఎక్స్పో లో సెలబ్రిటీలు కాళ్లకు చక్రాలు లేకుండానే చక్కర్లు కొడుతున్నారు. బాలీవుడ్, క్రికెట్ దిగ్గజాలందరూ ఆటోఎక్స్ పోకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ ఆటోఎక్స్‌పోతో నోయిడా కళకళలాడుతోంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, జహీర్ ఖాన్, మహింద్రా అమర్‌నాథ్‌లంతా ఆటోఎక్స్పోలో సందడి చేయడంతో, ఈ వేదిక ఒక్కసారిగా క్రికెట్ గ్రౌండ్‌ను తలపించింది. సచిన్ టెండూల్కర్ ఆటోఎక్స్‌పోకు రావాలా వద్దా అనే డైలమా నుంచి తేరుకుని, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌కు సెలబ్రిటీగా నిలిచారు. ఈ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసిన కార్ల మోడళ్ల గురించి సచిన్ వివరించారు. తనకు కార్లంటే చాలా ఇష్టమని.. ఇలాంటి ఆటో ఎక్స్ పోలు తన లాంటివారికి ఎంతో నచ్చుతాయన్నారు. ఈ ఎక్స్పో లో ఆవిష్కరించే అన్ని బీఎమ్‌డబ్ల్యూ సిరీస్‌లకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలువనున్నారు. విరాట్ కోహ్లి, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్‌తో కలిసి ఆడీ ఆర్8 వి10 ప్లస్ కారును ఆవిష్కరించారు. ఆడీ కారుని తిలకిస్తూ వీరిద్దరూ సందడి చేశారు. ఆడీ కార్లకు విరాట్ బ్రాండ్ అంబాసిడర్. బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ, మెర్సిడస్ బెంజ్ కార్లకు పోటీగా దూసుకుపోతున్న జాగ్వార్ ఎక్స్ఈ కారుని బాలీవుడ్ తార కత్రినా కైఫ్ ఆవిష్కరించారు. అలాగే నటుడు జాన్ అబ్రహం కూడా నిస్సాన్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆటో ఎక్స్‌పోలో పాల్గొన్నాడు. సినీ తారలు, క్రికెట్ దిగ్గజాలే కాక కంపెనీ యాజమాన్యాలు తమ ప్రొడక్ట్స్ ప్రమోషన్లో మునిగిపోయాయి. పలు కంపెనీలు తమ కొత్త కార్లను ఆవిష్కరించాయి. ప్రపంచ కార్ల దిగ్గజ కంపెనీలు బీఎమ్‌డబ్ల్యూ, మెర్సెడస్, దేశీయ బ్రాండ్ కంపెనీలు మహీంద్రా, టాటా మోటార్స్‌లతో పాటు మొత్తం 65 ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లతో ఆటోఎక్స్పోలో సందడి చేస్తూ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ ఎక్స్‌పోతో దేశంలో కార్లకు మంచి డిమాండ్ పెరిగి, ఆటోమొబైల్ కంపెనీలకు లాభాలను చేకూరనుందని పలు కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. -
డిసెంబర్ 17న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు జాన్ అబ్రహాం (బాలీవుడ్ హీరో) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది వీరు పుట్టిన తేదీ 17 శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, వైట్, సిల్వర్, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, రోజూ వెన్నెలలో కాసేపు విహరించడం, ఇంటికొచ్చిన వారికి ప్రేమగా పాయసం తినిపించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
'ఆ ఇద్దరిని చూసి కామెడీ నేర్చుకుంటా'
ముంబై: అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం లాంటి హీరోలతో తెరను పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తానంటోంది బాలీవుడ్ భామ ఇషా గుప్తా. అభిషేక్, జాన్ ఇద్దరి కామెడీ భిన్న తరహాలో ఉంటుంది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రంలో వారిద్దరిని చూసి కామెడీ పాత్రల్లో నటించడంలో మెళకువలు నేర్చుకుంటానని చెప్పింది. నీరజ్ వోరా దర్శకత్వం వహిస్తున్న 'హిరా ఫెరీ 3'లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ఇషా నటిస్తున్న విషయం తెలిసిందే. 'బ్లఫ్ మాస్టర్', 'బోల్ బచ్చన్' మూవీలలో అభిషేక్ బచ్చన్ నటన తనకు నచ్చిందని, ఆ హీరోలిద్దరూ 'దోస్తానా'లో చాలా కామెడీ పండించారని చెప్పింది. అందుకే వారి నుంచి కామెడీ టిప్స్ నేర్చుకోవడంపై దృష్టిపెట్టినట్లు వివరించింది. ఫెరోజ్ నడియాడ్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2006లో వచ్చిన ఫిర్ హిరా ఫెరీకి సీక్వెల్. మొత్తంగా ఈ సిరీస్‌లో ఇది మూడో సినిమా. హమ్‌షకల్స్ తర్వాత ఇషా చేస్తున్న తాజా చిత్రమిది. పెద్ద బ్యానర్లో తీస్తున్న చాలా బిగ్ మూవీ అని.. ఇది తనకు చాలా గొప్ప అవకాశమని చెప్పుకొచ్చింది. ఇది తన రెండో కామెడీ ప్రధాన మూవీ అని, ఈ తరహా సినిమాల్లో నటించేందుకు కావాల్సిన ట్రిక్స్ నేర్చుకుంటానన్నది. మూవీ సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది. -
హీరోకు గాయాలు.. సర్జరీ!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంకు షూటింగ్లో గాయాలయ్యాయి. దీంతో ఓ చిన్నపాటి సర్జరీ కూడా చేయించుకున్న ఆయన ప్రస్తుతం బెడ్‌రెస్ట్ తీసుకుంటున్నారు. అభినయ్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫోర్స్-2' షూటింగ్లో భాగంగా జాన్ అబ్రహం హంగేరిలోని బుడాపెస్ట్‌లో ఉన్నారు. 50 రోజుల షెడ్యూల్లో భాగంగా యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండగా ఆయన మోకాలుకు తీవ్రంగా దెబ్బతగిలింది. దీంతో ఆయన వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించి.. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించారు. ఆ వెంటనే షూటింగ్లో పాల్గొనేందుకు జాన్ అబ్రహం ఉత్సాహం కనబర్చినప్పటికీ, దర్శకుడు మాత్రం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గాయం పూర్తిగా తగ్గిన తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభిద్దామని చెప్పారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. జాన్ అబ్రహం 2011లో నటించిన 'ఫోర్స్' సినిమాకు సీక్వెల్‌గా 'ఫోర్స్-2' తెరకెక్కుతున్నది. -
ఆవిడ కాస్ట్యూమ్స్ ఖర్చు... కోటికి పైనే!
నటి డింపుల్ కపాడియా పేరు చెప్పగానే సినీ ప్రియులకు ‘బాబీ’ రోజుల నుంచి ‘దిల్ చాహ్తా హై’ దాకా ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు వస్తాయి. తాజాగా ‘వెల్‌కవ్‌ు బ్యాక్’ సినిమాలో నటించారామె. సెప్టెం బర్ మొదటివారంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఈ సినిమాలో డింపుల్ వేసుకున్న దుస్తుల విలువ దాదాపు కోటి రూపాయల పైచిలుకట. ఈ విషయం గురించి బాలీవుడ్ జనం ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. హీరోయిన్గా చేసిన రోజులతో పోలిస్తే, క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా చేస్తున్నప్పుడు ఇంత ఖరీదైన కాస్ట్యూవ్‌ు్స ఏమిటని ఆశ్చర్యపోకండి. డింపుల్ ఈ వయసులో కాస్ట్యూవ్ు్సకి అంత డిమాండ్ చేసిందా అనుకోకండి. జాన్ అబ్రహవ్ు, శ్రుతీహాసన్, అనిల్ కపూర్, నానా పాటేకర్ లాంటి ప్రముఖ నటులున్న ఈ ‘వెల్‌కవ్‌ు బ్యాక్’ సినిమాలో డింపుల్ పాత్ర అలాంటిది మరి. డింపుల్ ఈ సినిమాలో రాజవంశపు మహారాణిగా నటిస్తున్నారు. దాంతో, పాత్రకు తగ్గట్లుగా రియల్‌గా కనిపించడం కోసం డింపుల్ కాస్ట్యూవ్‌ు్స మీదే కోటికిపైగా ఖర్చుపెట్టారట. చిత్ర దర్శకుడు అనీస్ బాజ్మీ స్వయంగా ఆ మాట చెప్పారు. మొత్తానికి, లేటు వయసులో కూడా డింపుల్ కపాడియాకు ఖరీదైన పాత్రే తగిలిందన్న మాట. -
అక్షయ్‌కుమార్ హోమో? ఏమో!
అక్షయ్‌కుమార్‌కు సంబంధించి ఇప్పుడీ సంచలనాత్మక వార్త ప్రచారంలో ఉంది. ఈ బాక్సాఫీస్ హీరో హోమోసెక్సువల్ పాత్రలో కనిపించనున్నారట. రోహిత్ ధావన్ దర్శకత్వంలో రోహిత్ సోదరుడు వరుణ్ ధావన్, జాన్ అబ్రహమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు నటిస్తున్న ‘డిషూమ్’లో ఈ వింత గెటప్ ఆయన వేస్తున్నట్లు భోగట్టా. తొలి చిత్రం ‘దేసీ బాయిజ్’లో అక్షయ్ కుమార్ నటించడం కలిసొచ్చిందని రోహిత్ ధావన్ అభిప్రాయం. అందుకని, ఈ రెండో సినిమాలోనూ నటించాల్సిందిగా అక్షయ్‌ను కోరారట. స్క్రిప్ట్‌లో ఆయనకు తగ్గ పాత్ర ఏదీ లేకపోవడంతో, హోమోసెక్సువల్‌గా ప్రత్యేక పాత్ర సృష్టించారట. అక్షయ్ ఈ పాత్ర విని తమాషాగా ఉందన్నారనీ, నటించడానికి ఒప్పుకున్నారనీ ముంబయ్ సినీ జనాల కబురు. ఈ వార్తలో నిజానిజాల మాటేమో కానీ, నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను తెరకెక్కించడం ఇటీవల పెరిగిన హిందీ సినిమాల్లో అక్షయ్ లాంటి పెద్ద హీరో అలాంటి పాత్ర చేస్తే విశేషమే కదూ! -
అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్!
గాసిప్ జాన్ అబ్రహాంతో పదేళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత విడిపోయిన బిపాషా బసు ఇప్పుడు బుల్లితెర ఫేం కరణ్ సింగ్ గ్రోవర్తో ప్రేమ విహారాల్లో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కరణ్ సింగ్‌తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారామె. ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఈ బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటేనని కొందరు జోక్‌లు వేసుకుంటున్నారు. కరణ్‌తో బిపాషా వ్యవహారం ఆమె తల్లికి ఏ మాత్రం రుచించట్లేదట. దీనికి కారణం లేకపోలేదు. కరణ్ సింగ్ ఇప్పటి వరకూ శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింగెట్లను పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరికీ విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బిపాషాతో ప్రేమను ఆస్వాదిస్తున్నారు కరణ్. ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న కరణ్ సింగ్ గ్రోవర్తో కూతురు అంత చనువుగా ఉండటాన్ని బిపాషా తల్లి ఏ మాత్రం సహించలేకపోతున్నారట. కూతురి మీద ఫైర్ అయ్యారని సమాచారం. దాంతో కరణ్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని, వేరే ఏమీ లేదని తల్లికి వివరణ ఇచ్చుకున్నారట బిపాషా. ఏదో తల్లిని కూల్ చేయడానికి అలా అని ఉంటుందని ఈ తల్లీ కూతుళ్లు గిల్లికజ్జాలు తెలిసినవాళ్లు అంటున్నారు. -
సోనాక్షి వచ్చిందోచ్!
గాసిప్ నాలుగు సంవత్సరాల క్రితం జాన్ అబ్రహాం హీరోగా నటించిన ‘ఫోర్స్’ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కాక్కా కాక్కా’ సినిమాకు రిమేక్. ‘ఫోర్స్’లో జెనీలియా డిసౌజా జాన్ సరసన నటించింది. ‘ఫోర్స్-2’కు మాత్రం డెరైక్టర్, హీరోయిన్లు మారారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కోసం చాలామంది హీరోయిన్లను సంప్రదించారు దర్శక,నిర్మాతలు. రకరకాల కారణాలతో ఎవరూ ఒకే కాలేదు. ‘ఫోర్స్-2’లో కత్రినా కైఫ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని కత్రినా ఖండించారు. ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి పెంచడానికే ‘ఫోర్స్-2’ మేకర్స్ వ్యూహాత్మకంగా కత్రినా కైఫ్ పేరును ప్రచారంలో పెట్టారని కొందరు అంటారు. మరికొందరి కథనం ప్రకారం... భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ‘ఫోర్-2’లో నటించడానికి కత్రినా ఒప్పుకుందట. తీరా స్క్రిప్ట్ పూర్తిగా విన్న తరువాత నీరుగారి పోయిందట. దీనికి కారణం జాన్ అబ్రహం పాత్రతో పోల్చితే, తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనట. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడానికి దర్శక,నిర్మాతలు ఒప్పుకున్నా హీరోగారు మాత్రం ససేమిరా అన్నాడట. దీంతో కత్రినా ఆ సినిమా నుంచి తప్పుకుందట. జాన్ సరసన జోడిగా ఇప్పుడు సోనాక్షి సిన్హా ‘ఫోర్స్-2’లో నటించనుంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. తాను స్క్రిప్ట్‌లో సూచించిన చిన్న చిన్న మార్పులకు ఒప్పుకున్న తరువాతే సోనాక్షి ‘ఫోర్స్-2’ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే మాట కూడా వినబడుతోంది. అంటే, కండల కథనాయకుడు జాన్‌లాగే సోనాక్షి కూడా డిష్యుం డిష్యుం ఫైట్లు ఏమైనా చేయనుందా? వేచి చూడాలి మరి! -
బిపాసా రొమాంటిక్ డేట్?!
గాసిప్ ప్రేమ వ్యవహారాల్లో యమా ఫాస్టుగా ఉంటుంది బిపాసా. అప్పుడే ప్రేమ అంటుంది, అప్పుడే బ్రేకప్ అంటుంది అని బాలీవుడ్లో చాలామంది కామెంట్ చేస్తుంటారు ఆమె గురించి. డినో మోరియా, జాన్ అబ్రహామ్లతో ప్రేమలో పడి విఫలమయ్యాక... మరెవ్వరికీ దగ్గర కాలేను, ఒంటరిగా ఉండటంలోనే ఆనందం ఉందనిపిస్తోంది అంటూ ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అయితే అంతలోనే మనసు మార్చుకున్నట్టుంది. ‘అలోన్’ చిత్రంలో తన సహ నటుడైన కరణ్ గ్రోవర్తో ప్రేమలో పడిందట బిప్స్. ఇప్పటికే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో ఈ ఇద్దరూ స్విట్జర్లాండ్ టూర్ కూడా వెళ్లబోతున్నారని వినికిడి. -
ముద్దు వద్దన్నాడు!
పాత్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా శ్రుతీహాసన్ సిద్ధంగా ఉంటారు. అందంగా కనిపించడం మాత్రమే కాదు.. అందవిహీనంగా కూడా కనిపించడానికి వెనకాడరు. అందుకు నిదర్శనం ‘డీ-డే’. ఆ చిత్రంలో మొహంపై కుట్లుతో కనిపిస్తారామె. అలాగే, కథానుసారం చిత్రకథానాయకుడు అర్జున్ రామ్‌పాల్‌తో చుంభన సన్నివేశంలో కూడా నటించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న చిత్రాల్లో హిందీ ‘వెల్కమ్ బ్యాక్’ ఒకటి. ఇందులోనూ లిప్ లాక్ సీన్ ఉందట. అది లేకపోతే సన్నివేశం పేలవంగా ఉంటుందట. అందుకని, శ్రుతి ఆ సీన్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ, చిత్రకథానాయకుడు జాన్ అబ్రహాం మాత్రం తిరస్కరించారట. ఇప్పటివరకు బోల్డన్ని లిప్ లాక్ సీన్స్‌లో నటించిన జాన్ అబ్రహాం ఈసారి ససేమిరా అనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడాయన ఫ్యామిలీ మ్యాన్ కదా. ప్రేయసి ప్రియా రుంచల్‌ని పెళ్లి చేసుకున్నప్పట్నుంచీ వ్యక్తిగతంగా పద్ధతిగా ఉండటంతో పాటు వృత్తిపరంగా కూడా కొన్ని పద్ధతులు పాటించాలనుకున్నారట. ‘ఇక పెదవి ముద్దు సీన్స్‌లో నటించకూడదు’ అన్నది ఆయన మొదటి నిర్ణయం అని సమాచారం. తన నిర్ణయాన్ని ‘వెల్కమ్ బ్యాక్’ దర్శకుడు అనీస్ బజ్మీ దగ్గర చెప్పి, ఒప్పించారట. -
ఆయనే హాట్!
చూస్తుంటే బాలీవుడ్ రొమాంటిక్ క్వీన్ బిపాసాబసు టేస్ట్ చాలా డిఫరెంట్‌లా ఉంది. కండల వీరుడు జాన్ అబ్రహమ్‌తో చాన్నాళ్లు డేటింగ్లో మునిగితేలినా... టాలీవుడ్ ఆరడుగుల కుర్రాడు రానాతో ఫ్రెండ్షిప్ చేసినా... బీ-టౌన్లో హాటెస్ట్ మ్యాన్ మాత్రం డెబ్భై ఏళ్లు దాటినా ఇప్పటికీ అమితాబ్‌బచ్చనే అంటూ సెలవిచ్చి షాకిచ్చింది బిపాసా. తన ‘ఎలోన్’ చిత్రం ప్రమోషన్ కోసం ఓ టీవీ షోలో ఈ చిలిపి ప్రశ్న ఎదురైంది. ‘బచ్చన్ సర్‌కు పదికి పది. అలాగే అమ్మాయిల కలల రాకుమారుడు హృతిక్ రోషన్‌కు కూడా ఫుల్ మార్క్స్. హెయిరీ బాడీతో అలరించిన హీరో అనిల్‌కపూర్‌కు ఏడు మార్కులు‘ అని బిప్ను మరి మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు ఎన్ని అని అడిగితే... ‘కౌన్’ అంటూ ఎదురు ప్రశ్న వేసింది! -
ఔను... మేమిద్దరం విడిపోయాం!
జాన్ అబ్రహమ్‌తో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, అతడి నుంచి విడిపోయారు బిపాసా బసు. ఆ తర్వాత హీరో హర్మాన్ బవేజాతో ఆమె ప్రేమలో పడ్డారు. ‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆ మధ్య బిపాసా తన సన్నిహితులతో అన్నట్లు వార్త కూడా వచ్చింది. మూడు, నాలుగు నెలల్లో ఈ ప్రేమికులు భార్యా, భర్తలవుతారనే ఊహాగానాలు ఉండగా, ‘మేమిద్దరం విడిపోయాం’ అని బిపాసా బహిరంగంగా ప్రకటించేశారు. ఎందుకు విడిపోయామనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. బిపాసా ఇంకా చెబుతూ -‘‘హర్మాన్ కుటుంబమంటే నాకు గౌరవం. అతనికీ మా ఫ్యామిలీ అంటే గౌరవం ఉంది. మేం విడిపోయినా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. హర్మాన్నుంచి ప్రియురాలిగానే విడిపోయా. అతనితో ఎప్పటికీ స్నేహంగా ఉంటాను’’ అన్నారు. ఇది ఇలా ఉండగా, నటుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌కి దగ్గర కావడం వల్లే హర్మాన్కి బిపాసా దూరమయ్యారనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, బిపాసా ఆ వార్తలో నిజం లేదంటున్నారు. -
షో మాన్
నీల్సన్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 34 శాతంగా ఉన్న ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్‌కు ఇప్పుడు ఊపునిస్తోంది మగవాళ్ల సౌందర్యస్పృహే. ఈ మార్కెట్ పెరుగుదల వేగం మహిళల గ్రూమింగ్ మార్కెట్ వేగాన్ని అధిగమించిందట. మగాడికి ఏముందిలే ఎలా కనపడినా చెల్లిపోతుంది. ఆడది కాస్త కంటికి నదురుగా కనపడకపోతే ఎలా... ఇలాంటి పాత కాలపు భావాలకు కాలం చెల్లిందిక. ఇప్పుడు అందాల వేటలో ఆడవారిని ఆవలకు నెట్టేంత వేగంగా మగాడు ముందుకొచ్చేస్తున్నాడు. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. గ్లామర్ మేనియా వెనుక.. అందమైన కేశాలివిగో అంటూ గార్నియర్‌కు జాన్ అబ్రహాం, చర్మ సౌందర్యానికి నివియా టాక్ వాడాలని అర్జున్ రామ్‌పాల్ వంటి బాలీవుడ్ నటులు ప్రకటనల సాక్షిగా చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్న మగవాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో మగవాళ్లపై దృష్టి సారించాయి బ్రాండ్స్. ఐపీఎల్ సమయంలో మగవాళ్ల బ్యూటీ కాస్మెటిక్స్ గురించి గార్నియర్ రాజస్థాన్ రాయల్స్‌తో అసోసియేట్ అయింది. ‘ నిర్విరామంగా ఎండకి గురయ్యే పురుషుల చర్మంపై సూర్యుని నుండి వెలువడే యూవీ రేస్ తీవ్ర ప్రభావం చూపుతాయి. చక్కగా కనిపించడం మగవాళ్లకి అవసరం’- ఆ టీమ్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చిన్నితెరపై చేసే ఇలాంటి ప్రకటనలు మగవాళ్లను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బారులు తీరేలా చేస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న ఆదాయాలు కూడా ఒక కారణం. కార్పొరేట్ కంపెనీలు సిబ్బంది లుక్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దీంతో అందంగా, హుందాగా కనపడడం ఇప్పుడు పురుషులకు తప్పనిసరైంది. విభిన్న నేపధ్యాల నుంచి ఐటీ రంగంలోకి ఎంటరయ్యే పురుషుల్లో అందంపై స్పృహ పెంచడానికి ప్రత్యేకంగా సిటీలోని ఐటీ కంపెనీలు గ్రూమింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. బెస్ట్ డ్రెస్డ్ ఎంప్లాయ్ ఆఫ్ ది వీక్ వంటి అవార్డ్స్‌తో మగవాళ్లలో సెల్ఫ్లుక్పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. చక్కగా పనిచేయడం మాత్రమే కాదు చక్కగా కనపడడమూ అంతే ముఖ్యమని పలు సంస్థలు స్పష్టం చేస్తుండడం కూడా వీరిపై ప్రభావం చూపిస్తోంది. రియాలిటీ టీవీ షోస్, ఫ్యాషన్ షోస్‌లో మేల్ మోడల్స్‌కు డిమాండ్ పెరగడం, పురుషులకు ప్రత్యేకించిన బ్యూటీ కాంటెస్ట్‌లు దీనికి దోహదం చేస్తున్నాయి. ఈ విషయంలో ముంబయి, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా తర్వాత హైదరాబాద్ ముందంజలో ఉన్నాయి. పార్లర్స్‌లో పార్ట్‌టైమ్... వారాంతాల నుంచి దాదాపు రోజూ పార్లర్‌కు వెళ్లే మగవాళ్లు కూడా సిటీలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజువారీ మీటింగ్‌లు, పార్టీస్‌కి అటెండవ్వాల్సి రావడం వంటి అవసరాలతో డైలీ గ్రూమింగ్ రొటీన్‌కు పురుషులు అలవాటు పడుతున్నారు. ‘హెయిర్‌స్టైల్‌ని సెట్ చేసుకోవడం, షేవింగ్‌ల కోసం రోజూ మా సెలూన్‌కి వచ్చి మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ హవర్ స్పెండ్ చేసే మగవాళ్లకి కొదవలేదు’ అని బంజారాహిల్స్‌లోని మేనియా సెలూన్ నిర్వాహకులు సచిన్ అంటున్నారు. పురుషులకు ఉపకరించే స్కిన్ లెటైనింగ్, హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ పార్లర్స్‌లో తప్పనిసరి ఉంచాల్సిన ఉత్పత్తులుగా మారాయి. క్రీమ్స్, లోషన్స్, ఫేస్ స్కర్బ్స్, షవర్ జెల్స్ వంటివి వాడకానికి సిటీ మగాళ్లు గతంలోలా సిగ్గుపడడం లేదు. దేశంలోనే మొత్తం స్కిన్ క్రీమ్ ఉత్పత్తుల మార్కెట్ 27 శాతం కాగా మేల్ స్కిన్ క్రీమ్ 41శాతంతో అత్యంత వేగంగా పెరుగుతోంది. ‘మేల్ స్కిన్ కేర్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్‌లో ఒకటి. ఎక్సర్సైజ్, ఈటింగ్ రైట్లతో పాటుగా గ్రూమింగ్ రొటీన్ కూడా పురుషుల దినచర్యలో భాగమైంది’ అని ది బాడీషాప్ ఇండియా సీనియర్ మేనేజర్ సంజాలి గిరి అంటున్నారు. షాపింగ్‌కు సై... బ్యూటీ గ్రూమింగ్ మీద పెరిగిన ఆసక్తి సిటీ మగవాళ్లలో కొత్తగా షాపింగ్ సరదాను ప్రేరేపిస్తోందని ఓ కంపెనీ చేసిన స్టడీ వెల్లడించింది. ఈ కారణంగా గత దశాబ్ద కాలంలో సిటీ మగవాళ్లలో షాపింగ్ సరదా కూడా పెరిగింది. ముఖ్యంగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులైన మగవాళ్లు గ్రూమింగ్ మీద ఆడవాళ్ల కన్నా బాగా ఖర్చు పెడుతున్నారట. ఐటిసి లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు చెందిన బిజినెస్ హెడ్ నిరంజన్ ముఖర్జీ చెప్పిన ప్రకారం.. ‘మగవాళ్లు తమకు మాత్రమే ప్రత్యేకించిన ఉత్పత్తుల కోసం ఇన్నోవేటివ్ గ్రూమింగ్ కోసం చూస్తున్నారు’’.అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (అసోచామ్) చేసిన సర్వే ప్రకారం.. ఈ విషయంలో మహిళల కన్నా పురుషులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇదే సర్వే చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 85 శాతం మంది తమ గ్రూమింగ్ ప్రొడక్ట్స్‌ను ఇంటి అవసరాలతో, భార్యల కొనుగోళ్లతో సంబంధం లేకుండా విడిగా కొనుగోలు చేస్తున్నారట. మార్కెట్ విస్తృతికి ఇది దోహదం చేస్తోందని అసోచామ్ ప్రతినిధులు అంటున్నారు. వెటైనింగ్- ఫెయిర్‌నెస్ అంశాల్లో ఎదుగుతున్న పట్టణాలకు చెందిన పురుషులు ఆసక్తి చూపుతున్నారు అని నివియా ఇండియా రక్షిత్ హర్గావె అంటున్నారు. షేవింగ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్, ఎక్స్ఫొలయేటర్స్, హెయిర్‌కేర్, హెయిర్ స్టైలింగ్ సొల్యూషన్స్ వంటి వి పురుషుల ఎంపికగా మారుతున్నాయి. బాత్, షవర్ జెల్స్, ఫేస్ వాష్, డియోడరెంట్స్... తదితర అవసరమైన బాతింగ్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని అసోచామ్ సర్వే వెల్లడించింది. -
'ప్రేమతో చెబుతున్నా.. విజయం మాదే'
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) విజయవంతం కావడం భారత ఫుట్ బాల్ కు ఎంతో అవసరమని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అభిప్రాయపడ్డారు.నార్త్ ఈస్ యునైటెడ్ ఫుట్ బాల్ యజమాని అయిన జాన్ మాట్లాడుతూ..'మాకు గొప్ప మద్దతు ఉంది. మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు.అయితే ఒక్కటి మాత్రం నిజం. మేము గట్టి పోటీని ఎదుర్కొవాల్సి ఉంది' అని తెలిపారు. ప్రేమతో చెబుతున్నా.. విజయం మాత్రం మాదే అని స్పష్టం చేశాడు. రేపు జరుగనున్న ఐసీఎల్ పోరులో తమ జట్టు కేరళ బ్లాస్టర్స్ తో తలపడనుందన్నారు. . అక్టోబరు 12 నుంచి డిసెంబరు 20 వరకు ఐఎస్ఎల్ లో పలువురు ప్రముఖ క్రికెటర్లు భాగస్వామ్యం అయ్యారు. కేరళ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గోవా జట్టులో విరాట్ కోహ్లి, కోల్‌కతా జట్టులో గంగూలీ, చెన్నై జట్టులో వాటాలు కొనుగోలు చేసి సహ యజమానులుగా ఉన్నారు. -
ఛీ.. ఛీ...సహజీవనమా?
ఎవరి నోటి నుంచి ఎలాంటి మాట వినిపిస్తే.. ఆశ్చర్యం కలుగుతుందో ఇటీవల బిపాసా బసు అలాంటి మాటే అన్నారు. జాన్ అబ్రహాంతో ఆమె దాదాపు ఏడెనిమిదేళ్లు సహజీవనం చేసి, అనంతరం విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమాయణం సాగిస్తున్నారు. మీ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారా? అని ఎవరో అడిగితే.. ‘ఛీ.. ఛీ.. సహజీవ నమా? సమస్యే లేదు. కొన్నాళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం విజయవంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే. వివాహ బంధం పటిష్టంగా ఉండాలంటే భార్యా, భర్తల మధ్య మంచి అవగాహన అవసరం. మా అమ్మా, నాన్నల వైవాహిక జీవితం సూపర్ సక్సెస్. నా మ్యారీడ్ లైఫ్ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే సహజీవనం జోలికి వెళ్లను’’ అని చెప్పారు బిపాసా బసు. ఓసారి సహజీవనం ఇచ్చిన చేదు అనుభవంవల్లే ఆమె ఇలా మాట్లాడి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. త్వరలో హర్మాన్ బవే జాతో మూడు ముళ్లు వేయించుకోవడానికి బిపాసా సిద్ధపడుతున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఈ జంట అనుకుంటోందని బాలీవుడ్ సమాచారం. -
హర్మన్‌తో బిపాసా అఫైర్
కండల వీరుడు జాన్ అబ్రహాంతో ప్రేమాయణం సాగించిన బాలీవుడ్ భామ బిపాసా బసు, ఇప్పుడు హర్మన్ బవేజాతో అఫైర్ సాగిస్తోంది. హర్మన్‌తో తనకు సంబంధం ఉన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే, తానెప్పుడు స్థిరపడేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె అంటోంది. స్థిరపడటానికి తనపై తాను ఎలాంటి ఒత్తిడిపెంచుకోబోనని చెబుతోంది. దర్శకత్వం వైపు దియా మీర్జా చూపు నటిగానే కాకుండా, నిర్మాతగానూ తనను తాను విజయవంతంగా నిరూపించుకున్న దియా మీర్జా, త్వరలోనే ఏదైనా సినిమాకు దర్శకత్వం కూడా చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దర్శకత్వం చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరికగా ఉందని, అయితే, ఎప్పుడు దర్శకత్వం వహించేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె చెబుతోంది. మంచి కథ దొరికితే దర్శకత్వం గురించి ఆలోచిస్తానని అంటోంది. పంజాబీ చిత్రంతో మళ్లీ తెరపైకి ధర్మేంద్ర నిన్నటితరం హీరో ధర్మేంద్ర సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్నాడు. ‘డబుల్ ది ట్రబుల్’ పేరిట రూపొందుతున్న పంజాబీ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పంజాబీ హీరో జిప్పీ గ్రీవల్ కూడా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రంలోని ‘26 బన్గయీ’ పాట యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. -
రీబుక్ షోరూంను ప్రారంభించిన 'జాన్ అబ్రహామ్'
-
సాటర్ డే సర్ప్రైజ్
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం జూబ్లీహిల్స్‌లోని రీబాక్ షోరూంలో శనివారం ప్రత్యక్షమయ్యాడు. కస్టమర్లతో ముచ్చటించాడు. అభిమానులతోఫొటోలు దిగాడు. ఆటోగ్రాఫ్‌లిచ్చి అలరించాడు. - సిటీప్లస్ -
పురుషుల ధోరణి మారాలి
సమాజంలోని మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. భద్రతపై భరోసా కలిగించే వాతావర ణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నాడు. మద్రాస్ కేఫ్ సినిమాలో నటించిన ఈ 41 ఏళ్ల నటుడు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడి బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో సమాజంపట్ల తన మనోభావాలను పంచుకున్నాడు. ‘మహిళలపట్ల పురుషుల ధోరణిలో మార్పు రావడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. మహిళల విషయంలో ఔదార్యంతో ఉండాలనే విషయాన్ని పిల్లలకు వారి తల్లిదండ్రులు తరచూ తప్పనిసరిగా బోధి స్తూ ఉండాలి. భార్యపట్ల భర్త ఎలా ఉంటాడనే విషయాన్ని పిల్లలు గమనిస్తుంటారు. దానినే వారు కూడా అనుకరిస్తారు. పిల్లలకు విద్య అనేది ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. వారి జీవితంలో ఇదే కీలకపాత్ర పోషిస్తుంది’ అని అన్నాడు. దాడులకు పాల్పడేవారి విషయంలో చట్టాలు అత్యంత కటువుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. మహిళల భద్రత అంశంపై మాట్లాడే సమయంలో రాజకీయ నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నాడు. రాజకీయ నాయకులు మాటల ప్రభావం సమాజంపై తప్పనిసరిగా ఉంటుందన్నాడు. వికీ డొనార్, మద్రాస్ కేఫ్ తదితర సినిమాలను నిర్మించిన జాన్... సమాజంపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని నమ్ముతాడు. మనం తీస్తున్న సినిమాలు మహిళను కేంద్రీకృతంగా చేసి నిర్మించినవా లేక పురుషులను కేంద్రీకృతంగా చేసుకుని తీసినవా అనేది ప్రధానం కాకూడదన్నాడు. ఈ వివక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నాడు. సమాజం అంగీకరించే సినిమాల్నే నిర్మించాలని సూచించాడు. తాను చదువుకునే రోజుల్లో మహిళల భద్రత కోసం పోరాటాలు చేశానని వివరించాడు. -
మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలి: జాన్ అబ్రహాం
న్యూఢిల్లీ: సమాజంలోని మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. భద్రతపై భరోసా కలిగించే వాతావర ణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నాడు. మద్రాస్ కేఫ్ సినిమాలో నటించిన ఈ 41 ఏళ్ల నటుడు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడి బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో సమాజంపట్ల తన మనోభావాలను మీడియాతో పంచుకున్నాడు. ‘మహిళలపట్ల పురుషుల ధోరణిలో మార్పు రావడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. మహిళల విషయంలో ఔదార్యంతో ఉండాలనే విషయాన్ని పిల్లలకు వారి తల్లిదండ్రులు తరచూ తప్పనిసరిగా బోధిస్తూ ఉండాలి. భార్యపట్ల భర్త ఎలా ఉంటాడనే విషయాన్ని పిల్లలు గమనిస్తుంటారు. దానినే వారు కూడా అనుకరిస్తారు. పిల్లలకు విద్య అనేది ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. వారి జీవితంలో ఇదే కీలకపాత్ర పోషిస్తుంది’ అని అన్నాడు. దాడులకు పాల్పడేవారి విషయంలో చట్టాలు అత్యంత కటువుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. -
ఫుట్‌బాల్‌కు ఓ హీరో కావాలి
నటుడు జాన్ అబ్రహాం న్యూఢిల్లీ: భారతీయ ఫుట్‌బాల్‌కి మంచి కథానాయకుడు దొరికితే అది అందని తీరాలకు చేరుతుందని విపరీతంగా విశ్వసించే నటుడు జాన్ అబ్రహాం.. ఈ ఆట ఆధారంగా ఓ సినిమా కూడా తీస్తున్నాడు. ఫుట్‌బాల్ అంటే విపరీతమైన క్రేజ్ కలిగిన ఈ నటుడు అందుకు సంబంధించిన ఫ్రాంచైజీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. 2014 ఫిఫా వరల్డ్ కప్ వేడుకలను తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ‘మంచి క్రీడాకారుడు ఉంటే ఏ ఆటకైనా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. అందుకు ఉదాహరణ సానియా మీర్జా, నైనా నెహ్వాల్... వీరందరికంటే ముందు ప్రకాశ్ పదుకొణే. గోల్ఫ్‌లో టైగర్ఉడ్స్ కూడా ఇదే చేశాడు. భారతీయ ఫుట్‌బాల్‌కి కూడా అటువంటి కథానాయకుడు కావాలని నేను అనుకుంటున్నా’ అని జాన్ అన్నాడు. ‘భైచుంగ్ భాటియా దాదాపు అదే స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా అంతకంటే మంచి కథానాయకుడు అవసరం. అటువంటి కథానాయకుడు దొరికిన క్షణంలో భారతీయ ఫుట్‌బాల్ ఆట ఉన్నతస్థానానికి చేరుకుంటుంది’ అని చెప్పాడు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి చె ప్పాడు. అర్జెంటీనా ఆటగాడు డీగో మారడోనా ఆటలోకి దిగితే చాలు అబ్రహాం టీవీకి అతుక్కుపోతాడు. ‘డీగోని అతని తండ్రి తెల్లవారకముందే నిద్ర లేపేవాడు. అందువల్లనే డీగో మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడిలా రాటుతేలాడు.ఆ కారణంగానే డీగో ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ గొప్పదనం డీగో తండ్రిదే. నేను కూడా భారత్ తరఫున ఫుట్‌బాల్ ఫుట్‌బాల్ ఆడే వాడినేమో. అయితే ఫుట్‌బాల్ నేర్చుకోవాలా లేక ఎంబీయే చేయాలా అనే సమస్య తలెత్తింది. దీంతో నేను ఎంబీయేనే ఎంచుకున్నా’ అంటూ తన గతాన్ని గుర్తుతెచుకున్నాడు జాన్. -
భారత ఫుట్‌బాల్‌కు ఓ హీరో కావాలి:జాన్ అబ్రహాం
న్యూఢిల్లీ: భారతీయ ఫుట్‌బాల్‌కి మంచి కథానాయకుడు దొరికితే అది అందని తీరాలకు చేరుతుందని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఆట ఆధారంగా ఓ సినిమా కూడా తీస్తున్న ఈ నటుడు ఫుట్‌బాల్ అందుకు సంబంధించిన ఫ్రాంచైజీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. 2014 ఫిఫా వరల్డ్ కప్ వేడుకలను తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ‘మంచి క్రీడాకారుడు ఉంటే ఏ ఆటకైనా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. అందుకు ఉదాహరణ సానియా మీర్జా, నైనా నెహ్వాల్... వీరందరికంటే ముందు ప్రకాశ్ పదుకొణే. గోల్ఫ్‌లో టైగర్ ఉడ్స్ కూడా ఇదే చేశాడు. భారతీయ ఫుట్‌బాల్‌కి కూడా అటువంటి కథానాయకుడు కావాలని నేను అనుకుంటున్నా’ అని జాన్ అన్నాడు. ‘భైచుంగ్ భాటియా దాదాపు అదే స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా అంతకంటే మంచి కథానాయకుడు అవసరం. అటువంటి కథానాయకుడు దొరికిన క్షణంలో భారతీయ ఫుట్‌బాల్ ఆట ఉన్నతస్థానానికి చేరుకుంటుంది’ అని చెప్పాడు. -
తన గురించి ఒక్క వాక్యం కూడా చెప్పను!
గలగలా పారే గోదావరిలా బిపాసా బసు చాలా యాక్టివ్‌గా ఉంటారు. నాన్‌స్టాప్‌గా మాట్లాడటం ఆమెకు చాలా ఇష్టం. కానీ, ఈ మధ్య మాటలు తగ్గించేశారు. ముఖ్యంగా తన లవ్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. నటుడు హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించేశారు కూడా. జాన్ అబ్రహాంతో దాదాపు పదేళ్లు సహజీవనం చేసిన ఆమె, హర్మాన్‌తో బంధాన్ని మూడు ముళ్లతో పటిష్టం చేసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్‌గా తను ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తే తన జీవిత భాగస్వామి కాబోతున్నాడని, తనకన్నా హర్మాన్ మంచి మనిషి అని బిపాసా ట్విట్టర్లో పెట్టారు. హర్మాన్ గురించి ఇతర విశేషాలేమైనా చెబుతారా? అని ఇటీవల ఓ విలేకరి అడిగితే.. అస్సలు చెప్పనని నిర్మొహమాటంగా చెప్పారట బిపాసా. తమ బంధం గురించి ఏదైతే చెప్పాలనుకున్నానో అది ట్విట్టర్లోనే చెప్పేశానని, వేరే ఏ విషయలూ చెప్పనని, ప్రస్తుతానికి నిశ్శబ్దమే శ్రేయస్కరమని అన్నారట. జాన్‌తో ఎఫైర్ సాగించినప్పుడు, దాని గురించి ఎక్కువగా మాట్లాడేవారు బిపాసా. ఆ బంధం బెడిసికొట్టింది కాబట్టి, హర్మాన్‌తో అలా జరగకూడదనే ఆచి తూచి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారని ఊహించవచ్చు. -
సచిన్ తనయ సారా పరుగు
ముంబై: ‘ముంబై మారథాన్’ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం పూటే గజగజలాడే చలిలో ప్రారంభమైన ఈ మారథాన్‌లో పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటులు, పర్యావరణ వేత్తలు, వేలాది మంది ముంబైకర్లు పరుగులు తీశారు. మహిళలు, వయోధికులు, వికలాంగులు, విద్యార్థులు, విదేశీ అథ్లెట్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటులు దియా మీర్జా, తారా శర్మ, అఫ్తబ్ సదాశివ్దాసని, గుల్షన్ గ్రోవర్, నేహా ధూపియా, జూహీ చావ్లా, ప్రాచీ దేశాయ్, మహి గిల్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాన్ అబ్రహాం జెండా ఊపి మారథాన్ ప్రారంభించారు. సీఎస్టీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ మారథాన్ మెరైన్ డ్రైవ్, హజీఅలీ, వర్లీ సీ ఫేస్, వర్లీ-బాంద్రా సీలింక్ వంతెన మీదుగా బాంద్రాకు చేరుకొని అక్కడి నుంచి తిరిగి సీఏస్టీకి చేరుకుంది. పలు సామాజిక అంశాలు, రుగ్మతలపై ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు ఈ మారథాన్ నిర్వహించారు. -
ప్రియాతో జాన్ పెళ్లి?
జాన్ అబ్రహాం వివాహం అతని ప్రేయసి ప్రియా రుంచల్‌తో జరిగిందా? ఔననే చెబుతోంది ట్విట్టర్లో అతను పోస్ట్ చేసిన ఓ వార్త. నూతన సంవత్సరం సందర్భంగా, ‘మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రేమతో జాన్ మరియు ప్రియా అబ్రహాం’ అని ట్విట్టర్లో పెట్టారు జాన్. బిపాసా బసుతో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, ఆమె నుంచి ఆయన విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే ప్రియా రుంచల్‌తో ప్రేమలో పడ్డారు జాన్. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ కొత్త సంవత్సరంలో ఒకింటివారయ్యారని జాన్ చేసిన ట్వీట్ చెబుతుంది. ఈ ట్వీట్లో ప్రియా రుంచల్‌ని ప్రియా అబ్రహాం అని జాన్ పేర్కొన్నారు కాబట్టి పెళ్లయ్యిందని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ పెళ్లి ముంబై మహానగరంలో కాదు.. యూఎస్‌లో జరిగి ఉంటుంది. ఎందుకంటే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఇద్దరూ అక్కడికెళ్లారు. మరి.. ముంబై వచ్చిన తర్వాత పెళ్లి విషయాన్ని జాన్ అధికారికంగా ప్రకటిస్తారో లేక రహస్యంగా ఉంచేస్తారో చూడాలి. -
ఎట్టకేలకు ఓ ఇంటివాడైన జాన్ అబ్రహం!
ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓ ఇంటివాడయ్యాడు. బిపాసా బసుతో విడిపోయాకా గత కొద్దికాలంగా మరో యువతితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకలో తన స్నేహితురాలు ప్రియా రాంచల్ ను జాన్ అబ్రహం వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి గురించి స్వయంగా జాన్ అబ్రహం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు అని జాన్ అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ప్రియాతో కలిసి జాన్ అబ్రహం అమెరికాలో పర్యటిస్తున్నారు. ముంబైలో ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసే ప్రియా, జాన్ అబ్రహంల మధ్య ప్రేమ వ్యవహారం 2010 నుంచి నడుస్తోంది. గతంలో సుమారు 9 సంవత్సరాల పాటు బాలీవుడ్ తార బిపాసా బసుతో జాన్ రిలేషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. -
మళ్లీ ప్రేమలో పడింది
బిపాసా బసు మళ్లీ ప్రేమలో పడిందా?... అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. జాన్ అబ్రహాంతో బిపాసా దాదాపు తొమ్మిదేళ్లు ఎఫైర్ సాగించిన విషయం తెలిసిందే. అతన్ని పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని బిపాసా అభిప్రాయం. కానీ, జాన్ అబ్రహాం ఇప్పుడప్పుడే పెళ్లికి సుముఖత చూపకపోవడంతో అతన్నుంచి విడిపోయింది బిపాసా. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. కొన్నాళ్లు ఒంటరిగా ఉండి, సోలో లైఫ్ బాగుందని చెప్పుకుంటూ వచ్చింది బిపాసా. కానీ, ఆ తర్వాత తోడొకరుండిన మహాభాగ్యము అనుకుందో ఏమో.. హర్మాన్ బవేజాకి మనసిచ్చేసింది. ఈ ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. కానీ, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నలుగురి దృష్టిలోనూ పడ్డారు. ఇటీవల శిల్పాశెట్టి ఇచ్చిన ఓ పార్టీకి ఇద్దరూ జాయింట్‌గా హాజరయ్యారట. అలాగే, ఈ జనవరిలో తన బర్త్‌డేని హర్మాన్‌తో కలిసి గోవాలో జరుపుకుంది బిపాసా. అప్పుడు ఈత కొలనులో వీళ్లు చేసిన సందడి తాలూకు ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఇన్నాళ్టికి తనకు ‘మిస్టర్ రైట్’ దొరికాడనే భావనలో బిపాసా ఉందట. ఈ ముద్దుగుమ్మ తల్లి, సోదరీమణులకు కూడా హర్మాన్ అంటే మంచి అభిప్రాయం ఉందని, బిప్స్కి తగిన వరుడు అతనేనని కూడా ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ టాక్. అలాగే హర్మాన్ సోదరి, బిపాసా మధ్య కూడా మంచి అనుబంధం మొదలైందట. దాంతో వీరి ప్రేమకు పెద్దల అనుమతి కూడా లభించేసిందని, ఇక ఆ పెళ్లి ముచ్చట జరగడమే ఆలస్యం అని బాలీవుడ్ భోగట్టా. -
'మద్రాస్ కేఫే' సినిమా రివ్యూ!
‘విక్కి డోనర్’తో సంచలన విజయం సాధించిన శుజిత్ సర్కార్, జాన్ అబ్రహంలు మళ్లీ ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈసారి రెగ్యులర్ బాలీవుడ్ మసాలా చిత్రంతో కాకుండా.. శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగిన అంతర్యుద్ధం, భారత్‌లో మాజీ ప్రధాని హత్యకు కుట్ర ఎలా జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ పొలిటికల్ డ్రామా తెరెకెక్కిన ‘మద్రాస్ కేఫే’ చిత్ర కథను పరిశీలిద్దాం! ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాటం చేస్తున్న ఎల్టీఎఫ్కు శ్రీలంక ప్రభుత్వానికి మధ్య భీకరమైన దాడులు జరగడం, అందులో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం శాంతి సైన్యాన్ని ఆదేశానికి పంపిస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల శాంతి సైన్యాన్ని భారత్ వెనక్కి ర ప్పిస్తుంది. శాంతి సైన్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని భావించిన ఎల్టీఎఫ్ భారత ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలోనే భారత్‌లో ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని హత్యకు కుట్రపన్ని ఎలా చంపారనేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో విక్రమ్ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం ‘రా’ అధికారిగా నటించాడు. జాఫ్నాలో ఎల్టీ ఎఫ్ అధినేత అన్న ప్రభాకర్ అధిపత్యానికి గండి కొట్టడానికి జాఫ్నాకు పంపిన అధికారి పాత్రలో జాన్ అబ్రహం అద్బుతంగా నటించాడు. ఇప్పటి వరకు జాన్ చేసిన పాత్రలు ఒక ఎత్తు.. విక్రమ్ సింగ్ పాత్ర మరో ఎత్తు. ఈ చిత్రం ద్వారా జాన్ మీద మంచి నటుడి గా ముద్ర పడటం ఖాయం. మద్రాస్ కేఫే లాంటి విభిన్న కథా చిత్రానికి జాన్ అబ్రహం నిర్మాతగా వ్యవహరించడం మరో పెద్ద సాహసం. ఇక ఈ చిత్రంలో జయ అనే జర్నలిస్ట్ పాత్రలో బాలీవుడ్ తార నర్గీస్ ఫక్రీ నటించింది. శ్రీలంకలో యుద్ద వార్తలను కవరేజ్ చేసే బ్రిటిష్ జర్నలిస్టుగా నర్గీస్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో ఇంటలిజెన్స్ అధికారి ఆర్డీ పాత్రలో క్విజ్ మాస్టర్ సిద్దార్థ బసు నటించాడు. సిద్ధార్థ బసు నటనలో చక్కటి పరిణతి ప్రదర్శించి ఫుల్ మార్కులు కొట్టేశాడు. శ్రీలంకలో జరిగిన వాస్తవ సంఘటనలను, యాక్షన్ సీన్లను ఊపిరి బిగపెట్టి చూసేంతగా దర్శకుడు శుజిత్ సర్కార్ తెరకెక్కించాడు. వినోదానికి తావులేని స్క్రిప్ట్‌ను దర్శకుడు తెరపై నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్ర తొలి భాగంలో శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగే పోరాటాలు సహజసిద్దంగా ఉన్నాయి. ద్వితీయ భాగంలో భారత మాజీ ప్రధాని హత్యకు కుట్ర, ఆ కుట్రను భగ్నం చేసేందుకు ఇంటలిజెన్స్ అధికారుల ప్రయత్నాలు, క్లైమాక్స్ చిత్రీకరణ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. సంగీత దర్శకుడు శంతను మోయిత్రా, క మల్జీత్ నేగి ఫోటోగ్రఫి, చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ‘మద్రాస్ కేఫే’ను హైరేంజ్లో నిలిపాయి. ఈ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నా.. పెద్దగా పట్టించుకునే రేంజ్లో లేకపోవడం మద్రాస్ కేఫేకు కలిసి వచ్చే అంశం. యాక్షన్, పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ‘మద్రాస్ కేఫే’ తప్పక నచ్చుతుంది. -
'మద్రాస్ కేఫే'కు వ్యతిరేకంగా బీజేపీ, తమిళుల నిరసన
'మద్రాస్ కేఫే' విడుదల నిలిపివేయాలంటూ భారతీయ తమిళులు, బీజేపీ మద్దతు దారులు ముంబైలోని ప్లకార్డులతో నిరసన చేశారు. 'మద్రాస్ కెఫే' చిత్రంలో తమ మనోభావాలకు వ్యతిరేకంగా సన్నివేశాలు చిత్రించారనే ఆరో్పణలతో తమిళులు నిరసన తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 23 తేదిన విడుదలవుతోంది. -
‘మద్రాస్‌కేఫ్ లో జాన్, నర్గిస్ల నటన అద్భుతం’
ముంబై:. శ్రీలంక పౌరయుద్ధం ఆధారంగా తీసిన మద్రాస్‌కేఫ్ సినిమా జాన్ అబ్రహం, నర్గిస్ ఫక్రికి మంచి పేరు తెస్తుందని షూజిత్ సర్కార్ ఘంటాపథంగా చెబుతున్నాడు. తన కొత్త సినిమా మద్రాస్ కేఫ్ ఫలితంపై దర్శకుడు ఎంతో ధీమాగా ఉన్నాడు. నటుల్లోని రక్తం పీల్చి అయినా వారి నుంచి ఫలితం రాబట్టడం తనకు తెలుసన్నాడు. మద్రాస్కేఫ్లో వీళ్లద్దరూ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు. పదేళ్లుగా బాలీవుడ్లో ఉంటూ ధూమ్, దోస్తానా, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, షూటౌట్ ఎట్ వాడాలా వంటి పెద్ద చిత్రాల్లో నటించినా జాన్‌కు ఇప్పటికీ పెద్దనటుడిగా గుర్తింపు లేదు. రాక్‌స్టార్‌తో హిందీ సినిమాల్లోకి వచ్చిన నర్గిస్ ఫక్రి నటన ఏమీ బాగాలేదని విమర్శలు రావడంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. శుక్రవారం విడుదలవుతున్న మద్రాస్‌కేఫ్ చూసిన తరువాత ప్రేక్షకులు జాన్, నర్గిస్‌పై ఇది వరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని సర్కార్ అంటున్నాడు. -
ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ అనలేదు: జాన్ అబ్రహం
'మద్రాస్ కేఫ్' చిత్రంలో తాము ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ గా చిత్రీకరించలేదని బాలీవుడ్ నటుడు, నిర్మాత జాన్ అబ్రహం వివరణ ఇచ్చారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్ టీ టీఈ) గ్రూప్ ను టెర్రరిస్టులుగా చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలకు జాన్ అబ్రహం వివరణ ఇచ్చారు. 'తాము ఎవ్వరిని కూడా నొప్పించలేదు. ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదు. మద్రాస్ కేఫ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారికి చిత్రాన్ని చూపిస్తాం' అని జాన్ తెలిపాడు. వాస్తవ పరిస్థితులు, నిజాల ఆధారంగానే మద్రాస్ కేఫ్ ను రూపొందించాం అని అన్నాడు. ఎల్టీటీఈ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చిత్రాన్ని రూపొందించారనే ఆరోపణలతో 'మద్రాస్ కేఫ్'ను నిషేధించాలని తమిళ సంస్థ నామ్ తమీజార్ వ్యవస్థాపకుడు సీమాన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో జాన్ అబ్రహం స్పందించారు. ఆగస్టు 23న విడుదలవుతున్న ఈ చిత్రంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి 'మద్రాస్ కేఫ్' ను చూపించడానికి సిద్ధంగా ఉన్నామని.. అయినా.. ఈ చిత్రాన్ని రాజకీయ లబ్దికి ఉపయోగించుకోవాలని చూస్తే.. దానికి తాను ఏమి చేయలేనని ఆయన అన్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన మద్రాస్ కేఫ్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాన్ అబ్రహం పాల్గొన్నాడు.