Attack: Jacqueline Fernandez Says Working With John Abraham In Attack 1 Movie - Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: అతని తపన నాకు ఎంతో నచ్చుతుంది: జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్

Published Sat, Mar 26 2022 11:58 AM | Last Updated on Sat, Mar 26 2022 1:02 PM

Jacqueline Fernandez Says Working With John Abraham In Attack 1 Movie - Sakshi

Jacqueline Fernandez Says Working With John Abraham In Attack 1 Movie: హౌస్‌ఫుల్‌ 2, రేస్‌ 2, ఢిష్యుం తర్వాత బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ జాన్‌ అబ్రహం, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎటాక్‌: పార్ట్‌ 1'. ఎక్‌ థా టైగర్, బ్యాంగ్‌ బ్యాంగ్‌ వంటి యాక్షన్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, 'రాకెట్‌ సింగ్‌' మూవీకి దర్శకత్వం వహించిన లక్ష్యరాజ్ ఆనంద్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. ఈ మూవీలో రకుల్ ప్రీత్‌ సింగ్, ప్రకాష్‌ రాజ్‌, రత్న పా ఠక్‌ షా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాక్వెలిన్. 

చదవండి: ఇండియాస్‌ సూపర్‌ సోల్జర్‌పై 'ఎటాక్‌'.. అదరగొడుతున్న ట్రైలర్‌

'ఎటాక్‌-1 ఓ కొత్త రకమైన ఆసక్తికరమైన కథ. ఇది భారతదేశంలో తెరకెక్కిన తొలి సూపర్‌ సోల్జర్‌ సైన్స్‌ ఫిక్షనల్‌ స్టోరీ. ఇందులో అవకాశం రావడం సంతోషంగా, గౌరవంగా ఉంది. జాన్‌ అబ్రహంతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సంతోషంగా, సరదాగా, సౌకర్యవంతగా ఉంటుంది. సినిమా కోసం జాన్‌ అబ్రహం పడే తపన నాకు ఎంతో నచ్చుతుంది.' అని జాక్వెలిన్ తెలిపింది. ఈ మూవీకి పెన్‌ స్టూడియోస్, జెఏ ఎంటర్టైన్‌మెంట్‌, అజయ్‌ కపూర్‌ ప్రొడక్షన్‌ సమర్పణలో డాక్టర్‌ జయంతిలాల్‌ గడా, హీరో జాన్‌ అబ్రహం, అజయ్‌ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది వరకూ ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement