
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) ఇంట విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కిమ్ ఫెర్నాండేజ్ (Kim Fernandez) కన్నుమూసింది. మార్చి 24న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించింది. జాక్వెలిన్ తల్లి మృతి పట్ల పలువురూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
జాక్వెలిన్ బ్యాక్‌గ్రౌండ్
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకవాసి. అక్కడ టీవీ రిపోర్టర్‌గా పని చేసింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటం గెల్చుకుంది. మోడలింగ్‌లో భాగంగా ఇండియాకు వచ్చినప్పుడు సుజయ్ ఘోష్ తనకు అలాద్దీన్ సినిమా ఆడిషన్‌కు రమ్మన్నాడు. ఆడిషన్‌లో పాస్ అవడంతో అలాద్దీన్ సినిమాతో భారతీయ ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఐఫా అవార్డు అందుకుంది.
సినిమా
అయితే తనకు గుర్తింపును, కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన మొదటి చిత్రం మర్డర్ 2. హౌస్‌ఫుల్ 2, రేస్ 2 చిత్రాలతో మరింత స్టార్‌డమ్ సంపాదించుకుంది. భాగీ 2, రాధే, సెల్ఫీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది. ప్రభాస్ సాహో మూవీలో బ్యాడ్ బాయ్ అనే ఐటం సాంగ్ చేసింది. ఇటీవల వచ్చిన ఫతే సినిమాలో కథానాయికగా అలరించింది. ప్రస్తుతం రైడ్ 2లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. అలాగే వెల్‌కమ్ టు ద జంగిల్, హౌస్‌ఫుల్ 5 చిత్రాల్లో నటిస్తోంది.