బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్‌మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ముంబై బాంద్రావెస్ట్‌లో ఉండే నౌరోజ్ హిల్ సొసైటీలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమె ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అందులో 14వ ఫ్లోర్‌లో ఉండే ఒక ఫ్లాట్‌లో బుధవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. కానీ 15వ ఫ్లోర్‌లో జాక్వెలిన్ ఉంటుంది. ఈ మంటలు ఆమె ఉండే నివాసం వరకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేయడంతో వెంటనే వారు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం.
దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ. ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు కూడా చేసింది. కానీ ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సుఖేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేయడమే కాకుండా తన భావోద్వేగాలతో ఆడుకుని, తన కెరీర్, జీవనోపాధిని నాశనం చేశాడని చెప్పిన జాక్వెలిన్.. సుఖేశ్ వల్ల తనకు ప్రాణాపాయం ఉన్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు కిందనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment