Sukesh Chandrasekar
-
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. పలు అనుమానాలు
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ముంబై బాంద్రావెస్ట్లో ఉండే నౌరోజ్ హిల్ సొసైటీలో ఒక అపార్ట్మెంట్లో ఆమె ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అందులో 14వ ఫ్లోర్లో ఉండే ఒక ఫ్లాట్‌లో బుధవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. కానీ 15వ ఫ్లోర్లో జాక్వెలిన్ ఉంటుంది. ఈ మంటలు ఆమె ఉండే నివాసం వరకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేయడంతో వెంటనే వారు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం. దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ. ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు కూడా చేసింది. కానీ ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేయడమే కాకుండా తన భావోద్వేగాలతో ఆడుకుని, తన కెరీర్, జీవనోపాధిని నాశనం చేశాడని చెప్పిన జాక్వెలిన్.. సుఖేశ్ వల్ల తనకు ప్రాణాపాయం ఉన్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు కిందనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. -
కోర్టుకు బ్లాక్ డ్రెస్‌లో రావా బేబీ.. వెలుగులోకి సుఖేష్ మెసేజ్‌లు
ఢిల్లీ:రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాక్వెలిన్‌కు సుఖేష్ పంపించిన మెసేజ్‌లు కీలకంగా మారాయి. కోర్టులో విచారణ సందర్భంగా జాక్వెలిన్‌ను బ్లాక్ డ్రెస్‌లో కనిపించాలని జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. జాక్వెలిన్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. 2023 జూన్ 30న జాక్వెలిన్‌కు సుఖేష్ మెసేజ్ చేశాడు.'బేబీ వచ్చే 6వ తేదీ కోర్టులో విచారణ ఉంటుంది. హాజరైతే దయచేసి నల్ల కుర్తా ధరించు. తద్వారా నా మెసేజ్‌లన్నీ చూస్తున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటా. మిస్సింగ్ యూ.. ఐ లవ్ యూ బేబీ గర్ల్. నువ్వు ఎప్పటికీ నా దానివే' అని సుఖేష్ రాసుకొచ్చాడు. 'తాజా ట్రోల్‌లతో కలత చెందుతున్నావని నాకు తెలుసు. కానీ బాధపడకు. ఇవేవీ పెద్దవి కావు. నువ్వు నా యువరాణివి. సూపర్ స్టార్ అవుతావు.' అని పేర్కొన్న సుఖేష్.. జాక్వెలిన్ బ్లాక్ డ్రెస్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మెసేజ్ చేశాడు. 'బేబీ, కోర్టులో విచారణ సందర్భంగా బ్లాక్ డ్రెస్ ధరించకపోవడం చాలా బాధ కలిగించింది. ఏమి ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు. ఏ విధంగానైనా సహాయం చేస్తానంటే నీకు తోడుగా ఉంటా. నీకు అవసరాలను ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నా.' అని సుఖేష్ మెసేజ్ చేశాడు. అంతేకాకుండా దర్శకుడు, సంగీత రచయిత లవ్ రంజన్ ఒక సినిమా కోసం జాక్వెలిన్‌ను కలుస్తారని పేర్కొన్నాడు. కాగా.. ఈ కేసులో ఫెర్నాండెజ్ పాత్ర ఉందని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశాడు. దీంతో సుఖేష్‌పై ఫెర్నాండేజ్ తిరగబడ్డారు. సుఖేష్ బెదిరింపుల నుండి రక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సుకేష్ చంద్రశేఖర్ లక్షిత దాడిలో తాను అమాయకురాలినని, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..
గత ఏడాదిలో సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. తాజాగా ఆమె కొత్త ఇల్లు కొనడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో జాక్వెలీన్ కొత్త ఇంటిని కొనింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్-ఆలియా భట్, కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి బడా హీరోలు నివసించే ప్రాంతంలో 'మర్డర్-2' బ్యూటీ కొత్త ఇంటిని తీసుకుంది. (ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ) ఇదే ప్రాంతంలో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారని తెలిసిందే. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంటి వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉండే పాలి హిల్‌లో ఇంటిని కొనుగోలు చేసింది ఈ బ్యూటీ. వ్యాపారా నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో 3 BHK, 4 BHK ఇళ్లు కొనాలన్నా రూ. 12 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ బ్యూటీ ఎన్ని బెడ్ రూమ్స్ ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఇంకా తెలియరాలేదు. కానీ సుమారు రూ. 20 కోట్లతో కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. జాక్వెలిన్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వచ్చాయి. సుకేష్ బహుమతిగా పంపించాడా అని ఒకరు ప్రశ్నిస్తే.. ఇదంతా సుకేష్ నుంచి వచ్చిన ప్రాప్తం అంటూ మరోకరు కామెంట్ చేశారు. మరోకరు అయితే ఏకంగా 'సుకేష్ డబ్బుతోనా లేక సల్మాన్ భాయ్తోనా?' ఇని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆమెకు బెమధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. సుకేశ్ మాత్రం జైళ్లోనే ఉన్నాడు. (ఇదీ చదవండి: జాక్వెలిన్‌కు కాకుండా నాటునాటుకు ఆస్కార్.. అసూయ వెల్లగక్కిన హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) (ఇదీ చదవండి: (Kajal Aggarwal: నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్) -
మహానేరగాడిలో వికసించిన మానవత్వం.. రూ.10 కోట్లు విరాళం
ఒడిశా: రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో అరెస్టై మాండోలి జైలులో ఊచలు లెక్కబెడుతున్న కరుడుగట్టిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మంచివాడిగా మారి ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులకు రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జైలు నుంచే ఒక లేఖ కూడా రాశాడు. ఎవరీ సుఖేష్.. కోర్టు ధిక్కారణతోపాటు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మాల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుండి సుమారు రూ.200 కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. అయితే తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ ఈ నేరానికి పాల్పడటం ఆశ్చర్యకరం. కేవలం మాటలతోనే మాయ చేయగల ఈ మహా నేరగాడిలో ఉన్నట్టుండి మానవత్వం పరిమళించి రైలు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారికి, అనాథలైన పిల్లలకు రూ. 10 కోట్లు ఆర్ధిక సాయం అందించనున్నట్లు సుఖేష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. లేఖలో ఏమని రాశాడంటే.. "నేను పంపిస్తున్న మొత్తం నగదు చట్టబద్ధంగా సంపాదించినది. దీనికి టాక్స్ కూడా కట్టాను. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో పాటు రూ.10 కోట్ల డీడీను కూడా పంపిస్తాను. ఒడిశా రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎలాగూ అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల మంచి పౌరుడిగా నేను కూడా వారికి నా వంతుగా రూ.10 కోట్లు సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం సొమ్ము తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ అభ్యర్ధనను అంగీకరించి విరాళాలు సేకరించే సంబంధిత శాఖ వివరాలను తెలపగలరు." అని రాశాడు. మహా నేరగాడు, మానవత్వం, రైలు ప్రమాదం, ఒడిశా రైలు ప్రమాదం, సుఖేష్ చంద్రశేఖర్, చట్టబద్ధం, ప్రమాద బాధితులు, ప్రభుత్వం ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
కవిత స్పందన బ్లేమ్గేమ్లా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: తన క్లయింట్ సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్ (పరిష్కారం కోసం చూడకుండా నిందలు వేయడం)లా ఉందని న్యాయవాది అనంత్ మాలిక్ విమర్శించారు. సుకేశ్ ఎవరో తనకు తెలియదంటూ కవిత విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేర కు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశాలపై కవిత జారీ చేసిన ప్రకటన చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది. సుకేశ్ తన ఆరోపణలను అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65బీ కింద ధ్రువపత్రం కూడా ఇచ్చారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించకుండా అస్పష్టమైన ఆరోపణలతో దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని యత్నించడం నీటిని ఒడిసి పట్టుకొని ఉంచాలనుకోవడమే. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడెవరైనా విచారణ స్వాగతించేవారు. కవిత స్పందన చూస్తుంటే దాగుడుమూతలు ఆడడంలో ఉన్న నైపుణ్యం కనిపిస్తోంది. ఈ అంశం ప్రత్యేక దర్యాప్తు సంస్థల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినదే కానీ, ప్రజల్లో ప్రజాదరణ కోసం పోటీ కాదు. అయితే నా క్లయింట్ కూడా ఈ వారంలోనే పూర్తిస్థాయిలో స్పందిస్తారు’ అని అనంత్ తెలిపారు. -
లిక్కర్ స్కాం లో మరో సంచలన లేఖ విడుదల చేసిన సుకేష్
-
‘ఢిల్లీ లిక్కర్ స్కాం.. నెక్ట్స్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్’
మనీలాండరింగ్ కేసులో శుక్రవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సుకేశ్ చంద్రశేఖర్ హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుకేశ్.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తదుపరి అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్‌దే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రశేఖర్ గతంలో కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో దూకుడు పెంచింది. ఈ క్రమంలో ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసుకు సంబంధించి తరువాత అరెస్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్న చంద్రశేఖర్.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని తెలిపాడు. క్రిమినల్ కేసులో అరెస్టయిన తన భర్తకు బెయిల్ ఇప్పించేందుకు మల్వీందర్ సింగ్ భార్య జప్నా సింగ్‌ను రూ. 3.5 కోట్లకు మోసం చేశాడని ఆరోపిస్తూ సుకేష్ చంద్రశేఖర్ గతేడాది అరెస్టయ్యాడు. సింగ్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్. తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. శుక్రవారం చంద్రశేఖర్ కోర్టుకు హాజరు కాగా.. న్యాయస్థానం అతనికి మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఈడీ దర్యాప్తులో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీ, మరికొంత మంది పేర్లు బయటపడిన సంగతి తెలిసిందే. -
జైలులోనే ప్రపోజ్ చేశాడు.. బుల్లితెర నటి సంచలన ఆరోపణలు
రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో కాన్మన్ సుకేశ్ చంద్రశేఖర్‌పై బాలీవుడ్ తారల ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతనిపై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా మరోనటి అతనిపై విమర్శలు చేసింది. తీహార్ జైలులో ఉన్నప్పుడు సుకేశ్ చంద్రశేఖర్ తనకు ప్రపోజ్ చేశాడని నటి చాహత్ ఖన్నా ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు తీహార్ జైలు వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షల డిమాండ్ చేశారని చాహత్ పేర్కొన్నారు. సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు విచారణ సమయంలో ప్రముఖంగా వినిపించిన బుల్లితెర నటి పేరు చాహత్ కన్నా. దీంతో ఆమె సుకేశ్ తనను మోసం చేశాడని.. తీహార్ జైలులోనే తనకు ప్రపోజ్ చేశాడని పేర్కొంది. ఎంజెల్ నన్ను మోసం చేసింది సుకేశ్ సహాయకురాలు పింకీ ఇరానీ తనను ఏంజెల్ ఖాన్‌గా పరిచయం చేసుకుని.. దిల్లీలో ఓ స్కూల్ ఈవెంట్‌కు తనను ఆహ్వానించినట్లు చాహత్ చెప్పారు. అయితే ఆమె తనను దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా తీహార్ జైలుకు తీసుకువెళ్లిందని.. అక్కడ ఆమె సుకేష్‌ను కలిసిందని చెప్పింది. ఏంజెల్ తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశ చూపిందని పేర్కొంది. అయితే ఆ తర్వాత కొంతమంది తెలియని వ్యక్తులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆమె వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు తనను తీహార్ జైలుకు తీసుకెళ్లినప్పుడు విడిచిపెట్టమని ఏంజెల్‌ను వేడుకున్నానని చాహత్ తెలిపారు. తీహార్ జైలులోని ఒక చిన్న గదికి తనను తీసుకెళ్లి.. ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, వాచీలు, లగ్జరీ బ్యాగ్‌లు ఆశ చూపారని వెల్లడించింది. 'బడే అచ్ఛే లాగ్తే హై' సిరీస్ చూసిన తర్వాత నేను మీ అభిమానిగా మారానని సుకేశ్ అన్నాడని చాహత్ తెలిపింది. సుకేశ్ మోకాళ్లపై నిలబడి వివాహం చేసుకోవాలని తనకు ప్రపోజ్ చేశాడని వివరించింది. చాహత్ ఖన్నా మాట్లాడుతూ..' నాకు పెళ్లయింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనితో గట్టిగా అరిచా. నేను చాలా ఆందోళన చెందా. ఆ తర్వాత నేను ఏడవటం మొదలుపెట్టా.'ఆమె నటి చాహత్ పేర్కొంది. -
మనీ లాండరింగ్ కేసు.. ఆ నటిపై ఈడీ సంచలన ఆరోపణలు
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె దేశం విడిచి పారియేందుకు యత్నించిందని.. ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించిందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున విదేశాలకు వెళ్లలేకపోయిందని ఈడీ తెలిపింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు సహకరించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆమె తన మొబైల్ డేటాను డిలీట్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించారని ఈడీ కోర్టుకు వివరించింది. జాక్వెలిన్, మరో నటి నోరా ఫతేహీ ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన కార్లు బహుమతులుగా స్వీకరించారని ఈడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ పొడిగింపు: మరోవైపు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆమె మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు ప్రకటించింది. తాజాగా నటి పిటిషన్‌పై మళ్లీ విచారణ చేపట్టిన ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ గడువు తేదీని పొడిగించింది. ఆ బెయిల్ గడువు తేదీని నంవబర్ 10 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్
Jacqueline Fernandez Bail: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. కాగా సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగాపేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్‌ను ఆగస్టు 17న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 26 కోర్టుల ఎదుట హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ అవగా, సోమవారం జాక్వెలిన్ న్యాయవాదితో కలిసి కోర్టుకు హాజరయ్యింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. దీనిపై అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ ఈడీ స్పందన కోరింది. అయితే అప్పటికే రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరారు. దీన్ని అంగీకరిస్తూ రూ.50 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ను ఢిల్లీ పాటియాల కోర్టు మంజూరు చేసింది. -
జైలు నుంచే అక్రమాలు.. లక్షల్లో ముడుపులు.. దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్టై జైలుకు వెళ్లినా క్రమంలో.. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసం ఢిల్లీ రోహిణి జైలులోని 81మంది అధికారులకు సుకేష్ భారీగా లంచాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత సుకేష్‌ను తిహార్ జైలుకు మార్చారు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. జైలు బయట ఉన్న తన అనుచరులతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ వంటివి అందించినట్లు దిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) తేల్చింది. సుకేష్ నుంచి ముడుపులు అందుకున్న జైలు అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. తన భార్య లీనాతో ఉండేందుకు ఒక్క రాత్రికే జైలు అధికారులకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సుకేష్ ఇచ్చినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు ఆసుపత్రికి వెళ్లిన సుకేశ్.. అక్కడి నర్సింగ్ స్టాఫ్ సాయంతో అనుచరులతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దిశగానూ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. తిహార్ జైలులో తమకు ప్రాణహాని ఉందని, దిల్లీ వెలుపలి జైలుకు తమని తరలించాలని గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు సుకేష్, ఆయన భార్య లీనా. జైలులో తమకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న అధికారుల నుంచే తమకు ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. దిల్లీ బయటి జైలుకు తమని మార్చాలని కోరారు. 2017లో ఎన్నికల సంఘం అధికారులకు లంచం కేసుకు సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో గత ఏప్రిల్ 4న సుకేష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే.. ఇప్పటే ఆరోగ్య విభాగం ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ సహా పలువురు ప్రముఖ వ్యక్తులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నేరం కింద అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్నాడు సుకేష్. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు మోడల్స్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర -
ఆమెను తప్పుపట్టొద్దు.. సుకేష్ చంద్రశేఖర్ ఆసక్తికర లేఖ
బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం సుకేష్ చంద్రశేఖర్‌తో రిలేషన్లో ఉండటమే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో జాక్వెలిన్‌కు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్‌కు మద్దతుగా నిలిచాడు సుకేష్ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్‌తో ఓ ప్రకటన విడుదల చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, ఆమెను చెడుగా చిత్రీకరించవద్దని కోరాడు. 'ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. అలా ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.' అని సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. -
సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్
Jacqueline Fernandez Trolls Old Video Her Bodyguard Better Than Sukesh: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఇటీవల తన వ్యక్తిగత ఫొటోలు ప్రసారం చేయొద్దని విన్నవించుకున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ మధ్యలో సుకేష్‌తో జాక్వెలిన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీంతో మీడియా మొత్తం జాక్వెలిన్‌పై దృష్టి సారించింది. అయితే తాజాగా ఈ శ్రీలంక భామ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 'సుకేష్ ఎక్కడా ఉన్నాడు. అస్సలు కనపడట్లేదుగా' అని ఒక యూజర్ రాస్తే సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బాగున్నాడు అని మరొకరు స్పందించారు. 'ఇంకా పీఆర్ వాళ్ల కష్టం బాగా తెలుస్తోంది', 'ఇదంతా డ్యామెజ్ కంట్రోల్ కోసం', 'జాక్వెలిన్‌ను ఇలా చూసే సుకేష్ ఫిదా అయింటాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ త్రోబ్యాక్ వీడియోలో ఎరుపు రంగు సాటిన్ దుస్తులు ధరించి ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్ ఫొటోలకు ఫోజులిచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. అవి ప్రసారం చేయొద్దని -
జాక్వెలిన్‌ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట..
Jacqueline Fernandez Interesting News About Sukesh: శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుకేష్ బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్, నోరాకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో వార్తల్లో ప్రధానంశంగా మారింది. అయితే జాక్వెలిన్‌ను సుకేష్ ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు, పలికిన ప్రగల్బాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జాక్వెలిన్ కోసం వరుస సినిమాలను నిర్మిస్తానని సుకేష్ మాట చెప్పాడట. విలాసవంతమైన బహుమతులు ఇచ్చిన సుకేష్ తనకు కేంద్ర ప్రభుత్వంలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో స్నేహం కోసం సుకేష్ పొగడ్తలతో ముంచెత్తాడని ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీలా ఉంటుందని, తనకన్న నువ్వేం తక్కువా కాదని ఆకాశానికెత్తాడట సుకేష్. అంతేకాకుండా రూ. 500 కోట్లతో 3 భాగాలతో మహిళా సూపర్ హీరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తానని నమ్మబలికాడట. ఇండియాలో ఇదే హీరోయిన్ ఒరియెంటెడ్ సూపర్ హీరో సినిమా అవుతుందని స్వీట్‌గా మాయమాటలు చెప్పాడని పుకార్లు వినిపిస్తున్నాయి. సూపర్ హీరో కథలతో హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో సినిమా నిర్మిస్తున్నానని మాట కూడా ఇచ్చాడట సుకేష్. జాక్వెలిన్‌ను ముగ్గులోకి దింపడానికి సుకేష్ సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ పనులపై కొంచెం పరిశోధన చేసాడని సమాచారం. ఇదీ చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. అయితే బాలీవుడ్లో సాంగ్స్ మినహా పెద్దగా సినిమా అవకాశాలు లేని జాక్వెలిన్ సుకేష్ స్వీట్ మాటలకు పడిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపినట్లు సమాచారం. తనకు సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ 2015 నుంచి తెలుసని, ఆమెకు ఎన్సీబీ కేసులో సహాయం చేసినట్లు సుకేష్ ఈడీ విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో బయటకు రావడానికి కూడా హెల్ప్ చేసినట్లు తెలిపాడట. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర
Actors Jacqueline Fernandez and Nora Fatehi:మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు ఐఫోన్ నుండి బిఎమ్‌డబ్ల్యూ కారు వంటి ఖరీదైన బహుమతులను అదించడంలో అతని భార్య లీనా మారియా పాల్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్లో పేర్కొంది. అంతేకాదు దర్యాప్తులో ఆ ఇదరూ బాలీవుడ్ నటులు సుకేష్ నుండి అందుకున్న బహుబమతులు గురించి వివరించారు. (చదవండి: ‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు) అయితే ఫెర్నాండెజ్‌తో స్నేహం చేయడానికి సుకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయ నంబర్‌ను "స్పూఫ్" కాల్ చేయగా, నోరా ఫతేహిని అతని భార్య ద్వారా పరిచయం చేసుకున్నట్లు వెళ్లడించింది. ఈ మేరకు ఈడీ విచారణలో నోరాకి సుకేశ్ బీఎండబ్ల్యూ కారు, అతని భార్య లీనా ఖరీదైన బ్యాగ్, ఐఫోన్ వంటి బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన ఫెర్నాండెజ్, సుకేశ్ నుండి రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, మల్టి స్టోన్ చెవిపోగులు, బహుమతులతో పాటు 1.5 లక్షల డాలర్ల రుణాన్ని తీసుకున్నట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్‌పై ఉన్న అభియోగాల నేపథ్యంలో ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులను ఈడీ విచారించింది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) -
బాలీవుడ్ భామ జాక్వెలిన్‌కు షాక్.. ఎయిర్పోర్ట్ వద్ద అడ్డుకున్న అధికారులు
Jacqueline Fernandez Stopped At Mumbai Airport: బాలీవుడ్ భామ, శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. ఇండియా నుంచి వెళ్తున్న జాక్వెలిన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్ అవడంతో ఈ భామ చిక్కుల్లో పడింది. అప్పట్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంది. అప్పుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ కొట్టిపారేసింది. ఇది జరిగిన వారాలా తర్వాత సుఖేష్‌ను ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఇదీ చదవండి: జాదుగాడితో జాక్వెలిన్ కిస్సింగ్ ఫోటో లీక్ అంతకుముందు ఈ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్, నోరా ఫతేహి, సుఖేష్ చంద్రశేఖర్, అతని భార్య లీనా పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. పలు నివేదికల ప్రకారం జాక్వెలిన్‌ను సుకేష్ నాలుగు సార్లు చెన్నైలో కలిశారని సమాచారం. అంతేకాకుండా ఆమె కోసం ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశాడట. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పాల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి -
సుకేశ్ చంద్రశేఖర్ మామూలోడు కాదు...
నిండా మూడు పదులు నిండకుండానే వందల కోట్ల ఆస్తులకు కూడగట్టాటంటే అతని నేరసామ్రాజ్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈసీకి టీటీవీ దినకరన్ లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన ‘బ్రోకర్’ సుకేశ్ చంద్రశేఖర్ మామూలోడు కాదు. అతని నేర జీవితం మొగ్గతొడిగింది బెంగళూరులోనే. చంద్రప్ప లేఔట్లో పుట్టిపెరిగిన ఇతనిపై పలు పీఎస్‌లలో పదులసంఖ్యలో చీటింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సాక్షి, బెంగళూరు: పార్టీ రెండు ఆకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు కోట్ల రూపాయల్లో లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన సుకేశ్ చంద్రశేఖర్ నేర ప్రవృత్తికి పునాది పడింది బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచే అక్రమాల బాట పట్టిన ఇతడు 19 ఏళ్ల వయస్సులోనే మొదటిసారిగా శ్రీ కృష్ణ జన్మస్థానానికి వెళ్లడం గమనార్హం. అన్నా డీఎంకే పార్టీ చిహ్నమైన రెండు ఆకుల గుర్తును తమకే కేటాయించడానికి శశికళ వర్గం ప్రముఖుడు టీటీవి దినకరన్... సుకేశ్ ద్వారా లంచం ఇవ్వజూపారని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం తెలిసిందే. సుకేష్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం ఢిల్లీలో అరెస్టు చేయడం విదితమే. పెద్ద పెద్దవాళ్ల పేర్లతో బుట్టలోకి బెంగళూరు నగరంలోని చంద్రప్ప లేఔట్‌కు చెందిన సుకేష్ 19 ఏళ్ల ప్రాయంలోనే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తరువాత మోసాల్లో ముదిరిపోయాడు. ముఖ్యమంత్రులు, ఎంపీలకు తాను ఆప్తుడినంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ అమాయకులను బుట్టలోకి వేసుకునేవాడు. 2011లో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన ఒక సంస్థ ఎండీ పొన్నుదురైతో పరిచయం చేసుకున్నాడు. కర్ణాటకలో బడి పిల్లలకు రూ.5లక్షల విలువ చేసే ఖర్జూరాలను కొనాలని చెప్పాడు. ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే తనకు కమీషన్ ముట్టజెప్పాలని సూచించాడు. ఇది నమ్మిన పొన్నుదురై రూ.80వేలను సుకేశ్ ఖాతాలో జమ చేశాడు. కొద్దిరోజుల తరువాత మరో రూ.2లక్షల చెల్లించాలంటూ పొన్నుదురైకి సూచించాడు. అయితే ఈసారి కొంచెం జాగ్రత్త వహించిన పొన్నుదురై ప్రభుత్వ లెటర్‌హెడ్‌పై వివరాలను అందించాలంటూ తెలిపారు. దీంతో తప్పించుకు తిరగసాగాడు. ఇతని మోసంపై పొన్నుదురై అప్పటి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ జ్యోతిప్రకాశ్ మిర్జీకి ఫిర్యాదు చేశాడు. విధానసౌధ పోలీసులు ఆ కేసును సీసీబీకి బదిలీ చేశారు. దీంతో సీసీబీ సుకేశ్‌ను అరెస్ట్ చేసి విచారించగా, మరిన్ని నేరాలు వెలుగుచూశాయి. కొన్నిరోజుల తర్వాత ఈ కేసులో బెయిల్ పై విడుదలై బయటికి వచ్చాడు. నటి లీనాపాల్తో కలిసి చీటింగ్‌లు సుకేశ్ కన్నడ వర్ధమాన నటి లీనా పాల్‌తో స్నేహం చేశాడు. ఆ స్నేహం సహజీవనం వరకూ వెళ్లింది. ఇద్దరూ కలిసి చెన్నై, ముంబయి వ్యాపారవేత్తలను కోట్ల రూపాయలకు మోసగించినట్లు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఇద్దరూ బెంగళూరు వద్ద ఒక ఫాంహౌస్‌లో ఉండగా చెన్నై పోలీసులు అరెస్టుచేశారు. ఫాంహౌస్‌లో అత్యంత ఖరీదైన మెర్సిడెస్ కార్లు దొరికాయి. ఇదేరీతిలో జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ తనకు మంచి స్నేహితుడని వ్యాపారవేత్తలను నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అనేక మంది వ్యాపారవేత్తలను మోసం చేసినట్లు ఫిర్యాదులున్నాయి. సామాన్యులనూ వదల్లేదు అంతేకాకుండా బీడీఏలో పనులు పూర్తి చేయిస్తానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నగరవ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 2013లో ఫేస్బుక్ ద్వారా కన్నడ చిత్ర నటీమణులను పరిచయం చేసుకొని పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్లు కూడా ఫిర్యాదులున్నాయి. రిటైర్డ్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం... సుకేశ్‌పై 100కు పైగా మోసానికి పాల్పడ్డట్లు ఫిర్యాదులు అందగా 25 నుంచి 30 వరకు కేసులు నమోదయ్యినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అతని సమాచారం కోసం బెంగళూరుకు రానున్నట్లు తెలుస్తోంది.