Actors Jacqueline Fernandez and Nora Fatehi:మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు ఐఫోన్ నుండి బిఎమ్‌డబ్ల్యూ కారు వంటి ఖరీదైన బహుమతులను అదించడంలో అతని భార్య లీనా మారియా పాల్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాదు దర్యాప్తులో ఆ ఇదరూ బాలీవుడ్ నటులు సుకేష్ నుండి అందుకున్న బహుబమతులు గురించి వివరించారు.
(చదవండి: ‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు)
అయితే ఫెర్నాండెజ్‌తో స్నేహం చేయడానికి సుకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయ నంబర్‌ను "స్పూఫ్" కాల్ చేయగా, నోరా ఫతేహిని అతని భార్య ద్వారా పరిచయం చేసుకున్నట్లు వెళ్లడించింది. ఈ మేరకు ఈడీ విచారణలో నోరాకి సుకేశ్ బీఎండబ్ల్యూ కారు, అతని భార్య లీనా ఖరీదైన బ్యాగ్, ఐఫోన్ వంటి బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది రెండుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన ఫెర్నాండెజ్, సుకేశ్ నుండి రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, మల్టి స్టోన్ చెవిపోగులు, బహుమతులతో పాటు 1.5 లక్షల డాలర్ల రుణాన్ని తీసుకున్నట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్‌పై ఉన్న అభియోగాల నేపథ్యంలో ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులను ఈడీ విచారించింది.
(చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!)
Comments
Please login to add a commentAdd a comment