nora fatehi
-
ఔరా! అనిపించే అందాలతో కవ్విస్తోన్న నోరా ఫతేహి ఫొటోస్
-
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
-
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.ఈ నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్, పెట్స్ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు. అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. (బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించిందిమరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి కూడా ప్రభావితమయ్యారు. ప్రియాంక పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు. ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!) -
డైరెక్టర్ పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్.. ట్రైన్లో వెళ్తూ చిల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను పంచుకుంది.ట్రైన్లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
విశాఖపట్నం : ‘మట్కా’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బాలీవుడ్ బ్యూటీ 'నోరా ఫతేహి' స్టన్నింగ్ లుక్స్ చూశారా (ఫోటోలు)
-
ఆ ఐటం సాంగ్స్‌కు డబ్బు తీసుకోలేదు: నోరా ఫతేహి
నోరా ఫతేహి.. ఐటం సాంగ్స్‌తో అల్లాడించే బ్యూటీని ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయట! అలాంటి దీన పరిస్థితిలోనూ రెండు ఐటం సాంగ్స్‌ను ఉచితంగా చేశానంటోంది అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ఫారిన్ వెళ్తున్న సమయంలో దిల్బర్, కమరియా పాటలు ఆఫర్ చేశారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించాను. డబ్బు అవసరం.. అయినా..మొదట కమరియా పాట షూటింగ్, రెండు వారాల తర్వాత దిల్బర్ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను. ఈ రెండు సాంగ్స్‌కు నేను పారితోషికం అందుకోలేదు. ఫ్రీగానే చేశాను. నిజానికి అప్పుడు నాకు డబ్బు అవసరం చాలా ఉంది. తినడానికి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బు లేదు. అయినా సరే మనీ కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాను. అలాగే వాటిని ఐటం సాంగ్లా కాకుండా స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లా చూపించాలనుకున్నాను. కొరియోగ్రఫీపై ఎక్కువ ఫోకస్ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలన్నాను. కొరియోగ్రఫీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అలా దిల్బర్ సాంగ్‌లో నాతో పాటు స్టేజీపై ఉన్న డ్యాన్సర్లతో వారం రోజులపాటు ప్రాక్టీస్ చేయించాను. ఆ పాటకోసం నాకు చాలా చిన్న బ్లౌజ్ తీసుకొచ్చారు. అందంగా కనిపించాలి కానీ వల్గర్‌గా కాదని దాన్ని వేసుకోనన్నాను. దీంతో బ్లౌజు సైజు పెంచి తీసుకొచ్చారు అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: హౌస్‌మేట్స్‌కు దీపావళి సర్ప్రైజ్ -
బాస్కెట్ బాల్ గేమ్ కోసం అబుదాబి వెళ్లిన 'మట్కా' బ్యూటీ నోరా ఫతేహి (ఫోటోలు)
-
ప్రభాస్‌తో డ్యాన్స్ చేసిన బ్యూటీ.. గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేసిన బ్యూటీ ఉంది. ఇప్పుడామె డ్యాన్స్ ఐకాన్‌గా మారింది. తనెవరో కాదు, డ్యాన్సర్ నోరా ఫతేహి. ఈ ఫోటోలో ఆమె ఎక్కడుందో గుర్తుపట్టారా? ఎడమ నుంచి మొదటి వ్యక్తి నోరా.డ్యాన్స్ నేర్పించా..తాజాగా ఈ ఫోటోను నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది పదిహేడేళ్ల వయసులో స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటో అని పేర్కొంది. స్టేజీపై డ్యాన్స్ చేయడానికి ముందు దిగిన ఫోటో అని తెలియజేసింది. నాకన్నీ తెలుసన్నట్లుగా నా స్నేహితురాళ్లకు డ్యాన్స్ నేర్పించాను. మేమంతా కలిసి కొన్నివారాలపాటు రిహార్సల్స్ చేశాం. కొన్ని ఎప్పటికీ మారవుఇదిగో ఫోటోలో ఉన్న అవుట్‌ఫిట్స్ ధరించాం. మా స్కూల్లో అందరి ముందు డ్యాన్స్ చేశాం.. కొన్ని పాటలకైతే బెల్లీ డ్యాన్స్ కూడా చేశాం. కొన్ని ఎప్పటికీ మారవు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. నోరా చాలా క్యూట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోకముందు కూడా ఈ బ్యూటీ అందంగా ఉందని చెప్తున్నారు. ఈ స్కూల్ గర్ల్ ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ఇది చూసిన నోరా ఫ్యాన్స్.. చిన్నప్పుడు, ఇప్పుడు మీరందరూ ఒకేలా ఉన్నారా? తనూ అంతే! అని వెనకేసుకొస్తున్నారు. నటుడు కరణ్ సింగ్ చాబ్రా అయితే.. అప్పటి స్కూల్ గర్ల్ ఇప్పుడు గ్లోబల్ డ్యాన్స్ ఐకాన్ అని ప్రశంసించాడు. కాగా నోరా ఫతేహి.. ప్రభాస్ బాహుబలి మూవీలో మనోహరి సాంగ్‌తో తెలుగునాట ఫేమస్ అయింది. ఈ ఒక్కటే కాకుండా టెంపర్, కిక్ 2,లోఫర్, ఊపిరి చిత్రాల్లోనూ ఐటం సాంగ్స్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) చదవండి: తడిబట్టలతో అబ్బాయిల ముందు సోనియా! మళ్లీ విష్ణుప్రియకు నీతి సూక్తులు -
ఐదు నిమిషాల పాట.. 'బాహుబలి' బ్యూటీ రెమ్యునరేషన్ రూ.2 కోట్లా? (ఫొటోలు)
-
Nora Fatehi: గ్లామర్ స్టిల్స్‌తో అలజడి రేపుతున్న నోరా ఫతేహి (ఫోటోలు)
-
స్త్రీవాదమే సమాజాన్ని నాశనం చేసింది: నటి కామెంట్స్ వైరల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ ఇటీవల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ జంటలపై సంచలన కామెంట్స్ చేసింది. వారంతా కేవలం డబ్బు, పేరు కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని విమర్శించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. అందుకే ఎవరితోను డేటింగ్లో చేయడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఓ పాడ్‌కాస్ట్‌లో నోరా మాట్లాడుతూ ఫెమినిజంపై విమర్శలు గుప్పించింది. స్త్రీవాదం అనేది సమాజాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించింది. అది కేవలం మహిళలనే కాకుండా పురుషులను కూడా బ్రెయిన్‌వాష్ చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫెమినిజంపై నోరా మాట్లాడుతూ..'ఇలాంటి ఆలోచన ఎవరికీ అవసరం లేదు. స్త్రీవాదమనే ఈ విషయాన్ని నేను అస్సలు నమ్మను. నిజంగా స్త్రీవాదమే మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మహిళలు పెళ్లి చేసుకోకూడదు. పిల్లలను కనకూడదనే ధోరణిని తాను విశ్వసించను. ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ పురుషులు డబ్బు, ఫుడ్ కోసం పనిచేస్తుంటే.. ఒక స్త్రీ పిల్లలు, ఇల్లు చూసుకోవడం, వంట చేయడం లాంటివి చేస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లి పని చేయాలి.. వారు సొంతంగా జీవించాలని కోరుకుంటున్నారు.. కానీ అది కొంత వరకేనని' చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది పురుషుల ధోరణి మారింది. ఇప్పుడు చాలా మంది ఫెమినిజం ద్వారా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారంటూ నోరా తెలిపింది. మనమందరం సెంటిమెంట్స్‌లో సమానమే కానీ.. సామాజికపరంగా సమానం కాదని నోరా పేర్కొంది. స్త్రీవాదం అంతర్లీనంగా, ప్రాథమిక స్థాయిలో గొప్పదే.. నేను కూడా మహిళల హక్కుల కోసం వాదిస్తానని.. బాలికలు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటానని తెలిపింది. అయితే, స్త్రీవాదం రాడికల్‌గా మారినప్పుడే సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని వెల్లడించింది. అయితే ఫెమినిజం పునాదులు గట్టిగానే ఉన్నప్పటికీ .. గత 20 ఏళ్లలో పోలిస్తే చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు. అయితే నోరా ఫతేహీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీ మాటలు చాలా కామెడీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీవాదం లేకపోతే ఇండియాలో నీకు పని చేసే అవకాశం లభించేది కాదని అంటున్నారు. అలా అయితే మీరు వెంటనే పని మానేసి పెళ్లి చేసుకోండి.. అలాగే మీరు ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేయకుండా భర్తపైనే ఆధారపడి జీవించండి అంటూ ఓ నెటిజన్ చురకలంటించారు. అసలు మహిళలు కేవలం సంరక్షకులుగా ఉండాలని.. పురుషులే పోషించాలని.. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందని నోరా ఫతేహి ఎలా మాట్లాడాతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
బాలీవుడ్ జంటలపై నోరా ఫతేహి సంచలన కామెంట్స్
-
కేవలం దాని కోసమే పెళ్లి.. జీవితాలు త్యాగం చేసి: నటి షాకింగ్ కామెంట్స్
ఇటీవల మడ్గావ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఆస్వాదిస్తోంది బాలీవుడ్ భామ. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన నోరా రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో కూడా మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నోరా బాలీవుడ్ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ప్రముఖ జంటలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ బీ టౌన్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. నోరా మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో డబ్బు, పేరు కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు ప్రేమించని వ్యక్తిని వివాహం చేసుకోవడం కంటే దారుణం ఇంకోటి లేదు. ఇష్టం లేకపోయినా ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తున్నారు. బాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది అలాంటి పనికిమాలిన వాళ్లే ఉన్నారు. వారు కేవలం ఆ సర్కిల్లో మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వారి కెరీర్ ఎక్కడికి వెళుతుందో వారికి తెలియదు. అందుకే వారికి కొంత బ్యాకప్ ప్లాన్ కావాలి.' అని అన్నారు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ లేరన్న విషయంపై నోరా స్పందించింది.' చాలామంది నన్ను కేవలం వాళ్ల ఫేమ్ కోసమే వాడుకుంటున్నారు. అందుకే అలాంటి వారు నాతో ఉండలేరు... అందుకే నేను అబ్బాయిలతో డేటింగ్ చేయడం మీకు కనిపించడం లేదు. బాలీవుడ్ పరిశ్రమలో కేవలం డబ్బు, పరపతి కోసమే పెళ్లి చేసుకుంటారు. వీరంతా బార్య, భర్తలుగా కాకుండా తమ సర్కిల్లో డబ్బు, పేరు కోసం ఆ బంధాన్ని వాడుకుంటున్నారు. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మూడేళ్లపాటు రిలేషన్లో ఉంటున్నారు. ఆ తర్వాత అతనితో కొన్ని సినిమాలు చేసి.. అవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగానే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారని' చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్లో జీవిస్తున్నారని నోరా తెలిపింది. వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎందుకలా త్యాగం చేస్తున్నారో నాకు అర్థం కాలేదని పేర్కొంది. అయితే నోరా ఫతేహీ ప్రత్యేకంగా ఏ జంట పేర్లను ప్రస్తావించలేదు. కాగా.. రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత గర్మి, సాకి సాకి, జెహ్దా నాషా, మనీకే, డాన్స్ మేరీ రాణి, కుసు కుసు, జాలిమా కోకా కోలా, దిల్బార్ లాంటి చిత్రాల్లో మెరిసింది. -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్‌ఫుల్ డ్రెస్‌లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్‌లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్‌లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ఛాన్సులు లేకపోతే డిప్రెషన్.. నా స్ట్రాటజీనే వేరు!
ఎన్నో దెబ్బలు పడితే కానీ రాయి శిల్పంలా మారదు.. మనిషి జీవితమూ అంతే! ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ విజయం సొంతం కాదు. ఇందుకు సెలబ్రిటీలు అతీతం కాదు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చినా.. ఇక్కడ జయాపజయాలతో నిత్యం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఓటమితో ఫేడవుట్ అయిపోకుండా తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎవరికీ అంత తీరిక ఉండదు దీని గురించి డ్యాన్సింగ్ క్వీన్, హీరోయిన్ నోరా ఫతేహి మాట్లాడుతూ.. 'మనకు ఛాన్సులు రాకపోతే అవతలివారిని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్లు ఒక మూస పద్ధతిలో వెళ్తుంటారు. పెద్ద పెద్ద స్టార్స్‌ను కలవాలని, వారితో పరిచయం పెంచుకోవాలని, వీలు కుదిరితే కలిసి సినిమా తీసి హిట్ కొట్టాలని ఆశపడుతుంటారు. వారికి మనల్ని గుర్తించే సమయం ఉండదు. నేను ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. నన్ను నేనే అనుకుంటున్నాను. వారు నాకు సమయమిచ్చేలా నన్ను నేను నిరూపించుకోవాలి. నేనేంటో నిరూపించుకుంటాను నేనదే చేశాను. నేను ఒక ఆర్టిస్టును.. డ్యాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, మ్యూజిక్ ఆల్బమ్స్ నిర్మిస్తాను, యాక్ట్ చేస్తాను, డ్యాన్స్ షోలకు జడ్జిగానూ వ్యవహరించగలను. ఇది నా పర్సనాలిటీ! ఎవరో నా టాలెంట్ గుర్తిస్తారని ఎదురుచూస్తే ఉండేకన్నా నేనేంటో నేనే నిరూపించుకుంటే బెటర్ కదా! అన్నింట్లోనూ ఓ చేయేశాను కాబట్టే అవకాశాలు లేవనో, ఖాళీగా ఉన్నాననో ఎప్పుడూ డిప్రెషన్లోకు లోనవలేదు. వారిలా ఒత్తిడికి లోనవను పెద్దపెద్ద స్టార్ హీరోహీరోయిన్లు ఛాన్సులు రావడం లేదని, సక్సెస్ లేదని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. వారి సినిమా ఆడలేదంటే దాదాపు ఏడెనిమిది నెలల దాకా ఒక్క ఛాన్స్ రాదు. దీంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. నేను వారిలా ఉండాలనుకోవడం లేదు. జీవితం చాలా చిన్నది. పాజిటివ్‌గా ఉండాలి. ఇండస్ట్రీకి మన మనసును, ధైర్యాన్ని ముక్కలు చేసే శక్తి ఇవ్వకూడదు. మన ప్రతిభకు తగ్గ అవకాశాలు ఆలస్యంగానైనా వస్తాయి. వాటి కోసం ఎదురుచూడాలి' అని నోరా చెప్పుకొచ్చింది. చదవండి: మెగాస్టార్ సాంగ్‌లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా -
సెట్లో అసభ్య ప్రవర్తన.. చెంప చెల్లుమనిపించిన బాహుబలి నటి!
2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాదిలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అతి స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరింది. అంతే కాకుండా కిక్- 2, షేర్, లోఫర్, ఊపిరి లాంటి చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా తన సత్తా చాటింది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్‌తో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్‌లో యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటే నోరాకు ఇన్‌స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ రియాల్టీ డాన్స్ షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్న నోరా.. అందరి నోళ్లు మూయించేలా ఉన్నతస్థాయికి ఎదిగింది. సహనటుడి అసభ్య ప్రవర్తన తాజాగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను వివరించింది. ఇండస్ట్రీలో మొదటి నుంచి ఇబ్బందులు పడిన నోరాకు.. ఓ షూటింగ్ సెట్లో జరిగిన అవమానంపై తొలిసారి నోరు విప్పింది. గతంలో ది కపిల్ శర్మ షోకు హాజరైన భామ ఈ విషయాన్ని వెల్లడించింది. 'రోర్: టైగర్ ఆఫ్ ది సుందర్బన్స్' షూటింగ్ సమయంలో సహనటుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. బంగ్లాదేశ్‌లో రోర్ మూవీ షూటింగ్లో ఈ సంఘటన జరిగిందని నోరా పేర్కొంది. మొదట అతను నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడే లాగి చెంప దెబ్బ కొట్టానని తెలిపింది. కానీ ఆ గొడవ అంతటితో ఆగిపోలేదని.. అతను తిరిగి నా జుట్టును పట్టుకుని లాగాడని వివరించింది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందని వెల్లడించింది. దీంతో డైరెక్టర్ జోక్యం చేసుకుని మా ఇద్దరికి సర్దిచెప్పి విడదీయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ గొడవ జరిగిన సమయంలో తాను చాలా బాధపడినట్లు నోరా ఫతేహీ తెలిపింది. కాగా.. ప్రస్తుతం నోరా క్రాక్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న వెండితెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, అమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇండియాలోనే మొట్టమొదటి 'ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్'గా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తోన్న హౌస్‌ఫుల్-5లో నటించనుంది. -
Nora Fatehi మొదట్లో మొఖం మీదే నవ్వారు, కట్ చేస్తే ..నోట్ల వర్షం!
అధునిక డ్యాన్స్‌లకు పర్యాయపదం ఆమె. ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్ అయినా తన స్టైల్లో ఇరగదీసి కుర్రకారు మతులను కొల్లగొడుతుంది. ఐటెం సాంగ్స్‌తో ఐటెం గర్ల్‌గా, స్టార్‌గా పాపులారీటీ సంపాదించుకుంది. అయితే ఈ జర్నీ నల్లేరు మీద నడకలా సాగిందనుకుంటే మాత్రం పొరపాటే. ఆరంభంలో ఈ స్టార్‌కి కూడా వేధింపులు తప్పలేదు. హిందీ భాష తెలియక అవమానాల పాలైంది. దర్శకులతోపాటు సెట్లో అందరూ ఆమెను చూసి నవ్వేవారట. కట్ చేస్తే..కేవలం ఒక సాంగ్‌కు దాదాపు రూ. 2 కోట్లకు పైగానే వసూలు చేస్తోంది. బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటతో దుమ్మురేపిన నోరా ఫతేహి పుట్టిన రోజు సందర్భంగా ఆమె జర్నీ గురించి మరికొన్ని విశేషాలు.. మొరాకో సంతతికి చెందిన నోరా ఫతేహి కెనడాలో పుట్టి పెరిగింది. టొరంటోలోని వెస్ట్వ్యూ సెంటెనియల్ సెకండరీ స్కూల్, ఆతరువాత యార్క్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను అభ్యసించింది. 2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్తో తన కెరీర్‌ను ప్రారంభించిన నోరా అతి స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరింది. డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా తన సత్తా చాటుకుంది. కానీ ఆరంభ రోజుల్లో చాలా ఉద్యోగాలు చేసింది. చివరికి హుక్కా బార్లో కూడా పనిచేసింది. అక్కడే డ్యాన్స్ బాగా నేర్చుకుంది. అలాగే ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో ఆడిషన్‌కి వెళ్లినపుడు కాస్టింగ్ డైరెక్టర్లు అవహేళన చేసేవారని గతంలో ఒక సందర్బంలో గుర్తు చేసుకుంది నోరా. ‘‘నీలాంటోళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారు..మీ దేశానికి తిరిగి వెళ్లిపో.. కత్రినా కైఫ్ లాగా మారి పోదామనుకుంటున్నావా’’ అని కూడా హేళన చేశారనీ, అయినా కష్టపడి భాష నేర్చుకుని, చివరికి సోదరుడి, పుట్టినరోజు, పెళ్లి అన్నీ పక్కన బెట్టేసి రూంలోనే ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి చేరినట్టు ఫతేహి చెప్పుకొచ్చింది. డ్యాన్సర్ కావాలనేది, అందర్నీ ఎంటర్టైన్ చేయాలనేదే తన కల అని తెలిపిందామె. బాలీవుడ్ సినిమాలతో తెరంగేట్రం చేసిన ఈ భామ. ‘‘దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్లో అలజడి రేపింది. ఇక టాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టేసింది. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి లాంటి మూవీలతో ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్‌తో మంచి క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్ మూవీస్‌లో యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. అన్నట్టు సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటే నోరాకు ఇన్‌స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లను సంపాందించు కోవడం విశేషమే మరి. అంతేనా టీవీ రియాల్టీ డాన్స్ షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. -
సెట్లో స్టార్ట్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘‘యావత్ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నాం. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా 1958–1982ల మధ్య జరుగుతుంది. అందుకుని 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేస్తున్నాం. అలా రీ క్రియేట్ చేసిన ఓ భారీ సెట్లోనే ‘మట్కా’ షూటింగ్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
అక్టోబరులో ఆరంభం
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రం రూ΄పొందుతున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, ఈ తొలి షెడ్యూల్ దాదాపు ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లోని విభిన్నమైన లొకేషన్స్‌లో జరుగుతుందని సమాచారం. వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా అప్పటి వైజాగ్‌ను తలపించేలా సెట్‌ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, ప్రలోభపరచడం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అప్పట్లో పెద్దగా బయటపెట్టేవారు కాదు గానీ ఇప్పుడు ధైర్యంగా ఆయా విషయాల్ని పంచుకుంటున్నారు. చిన్న యాక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల అందరూ ఇలాంటి ఏదో ఓ సందర్భంలో దీని బారిన పడినవాళ్లే. ప్రముఖ నటి నోరా ఫతేహి కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. గతంలో తనకు జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసింది. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) కాంప్రమైజ్ అవ్వమన్నారు 'కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా పదేపదే కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. కానీ నేను ఆరోజు వాటిని తలొగ్గలేదు. నాకున్న దారిలోనే నేను వెళ్లాను. విజయవంతం అయ్యాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి మరో వ్యక్తితో తిరగడం, ఆ హీరోతో రాసుకుపూసుకు తిరగడం అయితే కారణం కాదు' అని నటి నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. నోరా.. తెలుగులోనూ 2014లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్ 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి ఎంటర్టైన్ చేసింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర చిత్రాల్లో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ 'మట్కా'లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రత్యేక గీతంతో పాటు ఈమె పాత్రకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి ఈమె ఫొటోలు, వీడియో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు వెర్రెక్కిపోతుంటారు. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
పాన్ ఇండియా రేంజ్లో 'జూదం' అడేందుకు రెడీ అవుతున్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘మట్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. తొలి సీన్‌కి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు సురేష్‌బాబు, విజయేందర్ రెడ్డి, సీవీఎం కలిసి దర్శకుడు కరుణ కుమార్‌కు స్క్రిప్ట్ అందించగా, దర్శకుడు హరీష్ శంకర్ టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. ‘‘వరుణ్‌కు ‘మట్కా’ తొలి పాన్ ఇండియన్ మూవీ. ‘మట్కా’ అంటే ఒక రకమైన జూదం. 1958–1982 మధ్య కాలంలో దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారు. నాటి వైజాగ్‌ను తలపించేలా ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ తేజ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో వింటేజ్ సెట్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, కెమెరా: ప్రియా సేత్. -
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్‌లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్‌ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్‌తో దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యంత చెత్త ఫ్యాషన్‌తో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్‌కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్‌ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్‌షీట్, కర్టెన్ క్లాత్‌ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బాలీవుడ్ నటి నోరా ఫతేహి స్టైలిష్ ఫోటోలు
-
భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్ మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే!
‘‘నీళ్లు బాగా తాగుతాను. రోజూ నా భోజనంలో తాజా ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకుంటాను. తాజా పండ్లు సరేసరి! వారానికి ఒకసారి ఫేస్‌కి గ్రీన్ టీ ప్యాక్ వేసుకుంటా. గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి దాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటా. ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటా. ఇవన్నీకాక.. మొహం నిత్యం మెరుస్తూండడానికి నా చర్మానికి సరిపడే ఫేషియల్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటాను. గ్రీన్ టీ ప్యాక్, ఫేషియల్ ఆయిల్ మసాజ్‌లు మా అమ్మ చెప్పిన చిట్కాలే!’’ అంటోంది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ. కాగా మొరాకో మూలాలున్న నోరా కెనడాలో జన్మించింది. మోడల్, డాన్సర్, సింగర్, నటిగా రాణిస్తోంది. 31 ఏళ్ల ఈ బ్యూటీక్వీన్ డాన్స్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. రోర్ మూవీతో తెరంగేట్రం చేసిన నోరా ఫతేహి.. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పొలిటికల్ సైన్స్ అభ్యసించిన నోరా.. పేరుకు కెనడియన్‌ని అయినా ఆత్మీయత పంచడంలో భారతీయులకు ఏమాత్రం తీసిపోనంటూ పలు సందర్భాల్లో ఇండియాపై అభిమానం చాటుకుంది. ఇక దిల్ బర్ పాటలో నోరా స్టెప్పులకు ఫిదా కాని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను అంతలా మాయ చేసింది ఈ సోగకళ్ల బ్యూటీ! -
ఊ అంటావా పాటకు బాలీవుడ్ స్టార్ డ్యాన్స్.. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది సామీ!
'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' పాట టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్, సమంత స్టెప్పులు, ఎక్స్ప్రెషన్లు ఎవరూ మర్చిపోలేరు. తాజాగా ఈ పాటకు బాలీవుడ్ సెలబ్రిటీలు స్టెప్పులేశారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి స్టేజీపై ఊ అంటావా అంటూ అగ్గి రాజేశారు. యూఎస్ డల్లాస్‌లో వీరు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చాలామంది నెటిజన్లకు వీరి డ్యాన్స్ నచ్చలేదు. ఊ అంటావా పాటను నాశనం చేశారు కదరా అంటూ సదరు హీరోహీరోయిన్లను ఏకిపారేస్తున్నారు. 'మీరు అల్లు అర్జున్, సమంతను మ్యాచ్ చేయడం కాదు కదా వారికి దరిదాపుల్లోకి కూడా రాలేరు..', 'వాటే వల్గర్ డ్యాన్స్..', 'ఇంత నీచంగా డ్యాన్స్ చేస్తున్నారేంట్రా దేవుడా', 'డ్యాన్స్ దాకా ఎందుకు అక్షయ్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కటి చాలు ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి' అని కామెంట్లు చేస్తున్నారు. అయితే నోరా ఫ్యాన్స్ మాత్రం 'మా బ్యూటీ ఎంత బాగా స్టెప్పులేస్తుందో.. నిన్ను ఎవరూ బీట్ చేయలేరు నోరా' అని వెనకేసుకొస్తున్నారు. కాగా పుష్ప: ద రైజ్ సినిమాలో సమంత 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించి అదరగొట్టేసింది. మూడు నిమిషాల పాట కోసం ఆమె రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు భోగట్టా! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్కర్ట్ వేసుకుని స్టేజీపై డ్యాన్స్ చేసిన స్టార్ హీరో, వీడియో..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ యూఎస్ పర్యటనలో ఉన్నారు. నోరా ఫతేహి, దిశా పటానీ, మౌనీ రాయ్ సహా పలువురు సెలబ్రిటీలు 'ద ఎంటర్టైనర్స్ టూర్'లో భాగమయ్యారు. ఈ క్రమంలో అట్లాంటాలోని ఓ షోలో అక్షయ్ కుమార్ స్టేజీపై స్టెప్పులేశాడు. ఇటీవలే రిలీజైన 'సెల్ఫీ' చిత్రంలోని 'మే ఖిలాడీ..' పాటకు గాగ్రాలో చిందేశాడు. ఇంతలో బ్యూటీ నోరా ఫతేహీ కూడా అతడితో జోడీ కట్టింది. ఇక సాంగ్ ఊపందుకుంటున్న సమయంలో అక్షయ్ తన స్కర్ట్ విప్పేసి మరింత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ వేశాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లుక్‌లో అక్షయ్ రెడ్ ఖిలాడీలా ఉన్నాడని, కాకపోతే స్కర్ట్‌తో కొంత ఇబ్బంది పడినట్లు కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా వీరి మాస్ పర్ఫామెన్స్‌కు అక్కడున్నవారు ఈలలు, చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. అటు అక్షయ్ కుమార్ భగవంతుని నామస్మరణతో ఈ టూర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన నెక్స్ట్ టూర్ డల్లాస్లోనేనని తెలియజేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
నటుడి జుట్టు పట్టుకుని లాగి చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్
సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు సినిమా సెట్స్‌లో కూడా ఘర్షణలు జరుగుతుంటాయి. అవి మితిమీరిపోతేనే ఎక్కడలేని తలనొప్పులు వస్తాయి. హీరోయిన్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి తన తొలి సినిమా షూటింగ్‌లోనే గొడవపడిందట. రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ చిత్రంతో 2014లో వెండితెరపై అడుగుపెట్టింది నోరా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను గతంలో ఓ షోలో వెల్లడించగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోరా మాట్లాడుతూ.. 'బంగ్లాదేశ్‌లోని సుందర్బన్స్ అడవుల్లో రోర్ షూటింగ్ జరుగుతోంది. సంస్కారం లేని ఓ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నాకు కోపమొచ్చి వెంటనే అతడి చెంప పగలగొట్టాను. దీంతో అతడు కూడా తిరిగి నన్ను కొట్టాడు. నేను మళ్లీ తిరిగి కొట్టాను. అతడు నా జుట్టు పట్టుకుని లాగాడు, నేను కూడా అతడి జుట్టు లాగాను. అందరూ చూస్తుండగానే మేమిద్దరం గట్టిగట్టిగా కొట్టేసుకున్నాం. వెంటనే డైరెక్టర్ జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపాడు' అని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది విని అక్కడున్న అర్చన పూరన్ సింగ్, కపిల్, ఆయుష్మాన్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ నోరా మాత్రం ఆ సంఘటన గురించి చెప్తున్నంత సేపు పడీపడీ నవ్వుతూనే ఉంది. ఇది నెటిజన్లకు అస్సలు మింగుడుపడలేదు. నువ్వేమైనా జోక్ చెప్తున్నావా? ఎందుకంత నవ్వుతున్నావు? ఇదేదో కామెడీ అనుకుంటుందా? ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కపిల్ శర్మ షోలో మరోసారి తళుక్కుమంది నోరా. అప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. డేట్స్‌కు వెళ్లినప్పుడు తాను బిల్లు కట్టనని చెప్పింది. ఇప్పుడు లోకం మారిందని, అమ్మాయిలు కూడా బిల్లు కడుతున్నారని అర్చన చెప్పగా.. అయితే నువ్వు కట్టుకో, కానీ నేను మాత్రం కట్టనంటూ దురుసుగా మాట్లాడింది. ఇకపోతే నోరా విషయానికి వస్తే.. టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్ 2, ఊపిరి, లోఫర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపింది. దిల్బర్ పాట గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, షెహనాజ్ గిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 100% చిత్రంలో నటిస్తోంది. -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్‌తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్‌వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్‌ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్‌ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
హీరోయిన్‌తో షారుక్ ఖాన్ కొడుకు డేటింగ్? ఫోటోలు లీక్
బాలీవుడ్లో సెలబ్రిటీల మధ్య లవ్ ఎఫైర్లు, రిలేషన్స్‌షిప్స్‌కు కొదువ లేదు, ఇప్పటికే చాలామంది స్టార్స్ డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తాజాగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ బీటౌన్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహితో ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వీరిద్దరూ దుబాయ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25ఏళ్లు కాగా, నోరాకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. ఇక రీసెంట్గా నోరా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్‌తో కూడా డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో నోరా-ఆర్యన్ల రిలేషన్ నిజమేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. డ్యాన్స్ చేయనున్న బాలీవుడ్ నటి
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్‌ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది. ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. -
ఆమె వల్లే అన్ని కోల్పోయా.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కెరీర్ నాశనం చేసేందుకు యత్నించారని నోరా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలతో షోలు, ప్రముఖ బ్రాండ్ ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది. ఆ వార్తలు మీడియాలో రావడంతో తన పరువు పోయిందని ఆమె అన్నారు. జాక్వెలిన్ తన పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నోరా ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువునష్టం దావా వేసింది బాలీవుడ్ భామ. (ఇది చదవండి: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్) గతంలో జాక్వెలిన్ కోర్టు ముందు రాతపూర్వక వివరణ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ నన్ను తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి ప్రముఖులు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు కూడా పొందారని తెలిపింది. అయితే సుఖేష్ నుంచి తనకు ఎలాంటి బహుమతులు అందలేదని.. నేరుగా అతనితో ఎలాంటి సంబంధం లేదని నోరా పేర్కొంది. ఈ పిటిషన్లో అనేక మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె పేర్కొంది. మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేయడం సామూహిక దాడి చేయడంతో సమానమని నోరా ఫతేహీ ఆరోపించింది. తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలిపింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై చాలా గౌరవం ఉందని .. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు నటీమణులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు. -
ఈడీ విచారణకు బాలీవుడ్ నటి నోరా
మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. సుకేశ్ భార్య లీనా ఆహ్వానం మేరకు 2020లో చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆమె వెళ్లింది. ఆ సందర్భంగా కొత్త ఐఫోన్, ఖరీదైన బ్యాగ్‌తో పాటు బీఎండబ్యూ కారు అందజేశారని ఈ సందర్భంగా నోరా వెల్లడించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం ఆమెకు మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని తెలిపాయి. -
ఫిఫా వరల్డ్ కప్‌లో బాలీవుడ్ బ్యూటీ.. ఆ విషయంలో తొలి నటిగా..!
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2022లో ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో ప్రముఖులైన షకీరా, జెన్నీఫర్ లోపెజ్‌లతో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే ఏకైక నటిగా ఆమె నిలవనుంది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌లో నోరా ఫతేహీ నటించింది. అక్టోబర్ 7న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆమె ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లోనూ ప్రదర్శన ఇవ్వనుంది. నోరా తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ " ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాంగ్ "లైట్ ది స్కై" సేవ్ ది డేట్ 07/10/22..!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌లో జరగనుంది. డ్యాన్స్‌తో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దిల్బర్ దిల్బర్ సాంగ్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో భారత్, బాట్లా హౌస్, రోర్, సత్యమేవ జయతే చిత్రాల్లో కనిపించింది. ఆమె ప్రస్తుతం జడ్జిగా 'ఝలక్ దిఖ్ లా జా' ప్రోగ్రామ్‌కు వ్యవహరిస్తోంది. నోరాకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న థ్యాంక్ గాడ్ సినిమాలోని మాణికే సాంగ్‌లోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'థ్యాంక్ గాడ్' సాంగ్ రిలీజ్.. నోరా అందానికి నోరెళ్లబెట్టాల్సిందే..!
సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం'థ్యాంక్ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలంక సింగర్ యోహాని పాడిన 'మనికే మాగే హితే' సాంగ్‌ను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ పాటలోనూ యోహానీ తనదైన వాయిస్‌తో అలరించింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా చిత్రగుప్తగా అజయ్ దేవగణ్ కనిపించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనుంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ యూపీలోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. (చదవండి: చిక్కులు తెచ్చిన ట్రైలర్.. నటులపై కేసు నమోదు) -
బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ అక్రమార్జన కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం 6 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో ఈడీ కూడా ఇప్పటికే ఫతేహిని ప్రశ్నించింది. ఆమెతో పాటు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా సుకేశ్ నుంచి ఖరీదైన కార్లు, ఇతర వస్తువులను బహుమతిగా అందుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో జాక్వెలిన్‌పై ఆగస్ట్‌లో ఈడీ కేసు కూడా నమోదు చేసింది. జాక్వెలిన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే తెలిపారు. చదవండి: రూ.100 పేటీఎం లావాదేవీ.. రూ.6 కోట్ల దోపిడీ దొంగలను పట్టించింది! -
నోరా ఫతేహిని విచారించిన ఢిల్లీ పోలీసులు
-
ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?
Nora Fatehi Gets Trolled: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తనదైన హావాభావాలతో, డ్యాన్స్ మూమెంట్స్‌తో కట్టిపడేస్తుంది. 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే ఐటమ్ సాంగ్‌తో టాలీవుడ్లో ఎంటరైన ఈ భామ 'బాహుబలి' చిత్రంలో 'మనోహారి' పాటతో పాపులారిటీ దక్కించుకుంది. హిందీలో 'దిల్బర్' సాంగ్‌తో ఒక ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఆమె చేసిన ఓ పని నెటిజన్స్ విరుచుకుపడేలా చేసింది. డ్యాన్స్ రియాలిటీ షో అయిన 'డ్యాన్స్ దీవానే జూనియర్స్'కు నోరా ఫతేహీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు నోరా చీరలో వచ్చింది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. వర్షంలో కారు దిగబోతుండగా అక్కడ నీటిలో చీర తడిసిపోతుందని భావించి సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది. సెక్యూరిటీ గార్డు ఆమె చీరను పట్టుకోగా నోరా ఫతేహీ కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నోరాను నెటిజన్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. (చదవండి: 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !) 'ఆమె ఏ దేశపు యువరాణి', 'ఈ శతాబ్దంలో ఇలాంటి బానిసత్వాన్ని అంగీకరించలేం', 'ఆమె మహారాణి అయినప్పటికీ సెక్యూరిటీ గార్డ్‌పై కొంచెం కూడా దయలేదా. చీరను కాపాడేందుకు అతను వర్షంలో తడిసేలా చేసింది', 'ఒక గొడుగును కొనుక్కునేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవా ?' అంటూ నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
నోరాతో డేటింగ్? ష్, అది సీక్రెట్ అంటున్న కొరియోగ్రాఫర్!
బాహుబలి, టెంపర్‌తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోని ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది నోరా ఫతేహి. మెరుపులాంటి స్టెప్పులు, అదరగొట్టే ఎక్స్ప్రెషన్తో ఎంతోమందిని బుట్టలో వేసుకుందీ బ్యూటీ. అయితే నోరా సింగిల్ కాదని ఓ కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. డ్యాన్స్ మాస్టర్ టెరెన్స్ లూయిస్‌తో డేటింగ్ చేస్తోందని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై టెరెన్స్ స్పందించాడు. ఈ సీక్రెట్‌ను సీక్రెట్లాగే ఉంచితే బాగుంటుంది. కావాలంటే నేను మీకు కెమెరా ఆఫ్ చేశాక చెప్తాను. నాకు తెలిసి ఆన్‌స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనుకుంటున్నాను. నిజంగానే ఆమె ఎనర్జీ, వైబ్‌ను ఇష్టపడతాను. తను డ్యాన్సర్ కాబట్టి ఆ విషయం తనకూ తెలుసు. తనది చాలా కష్టపడి పనిచేసే స్వభావం. ఇకపోతే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడూ చెప్పను, కాకపోతే మా మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా నోరా పంజాబీ సింగర్ గురు రంధవతో కూడా డేటింగ్ చేస్తుందంటూ ఇటీవల కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నోరా ఫతేహి డ్యాన్స్ దీవానీ జూనియర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. హరిహర వీరమల్లులోనూ కథానాయికగా నటించనుందని ప్రచారం జరుగుతోంది. చదవండి: ఓటీటీల్లోకి బీస్ట్, అప్పటి నుంచే స్ట్రీమింగ్ ఏడాదవుతున్నా ఇంకా తొలిరోజు గాయంలా నొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది. -
'టెంపర్' బ్యూటీ ఇన్‌స్టా అకౌంట్ మాయం.. అసలు సంగతి ఏంటంటే ?
Nora Fatehi Return To Instagram After Hacking Attempt: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తన క్రేజీ బాడీ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. స్పెషల్ సాంగ్స్‌లో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రత్యేక గీతాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్‌తో అభిమానులను ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. అలాంటిది నోరా ఫతేహి ఇన్‌స్టా అకౌంట్ ఒక్కసారిగా మాయమైపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనతో నోరా ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. నోరానే తన ఇన్‌స్టా పేజీని డిలీట్ చేసిందని భావించారు. అయితే అదే రోజు రాత్రి అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది నోరా. శుక్రవారం రాత్రి మళ్లీ తన పేజీ రీస్టోర్ అయిందని పేర్కొంది. 'అందరికీ సారీ. నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నించారు. కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించారు. వారి టీమ్‌కు ధన్యవాదాలు.' అని రీస్టోర్ అయిన అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది ముద్దుగుమ్మ. నోరా ఫతేహీకి ఇన్‌స్టాలో 37 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల నోరా ఫతేహి పులి పిల్లలకు ఆహారం పెడుతున్న వీడియో పోస్ట్ చేశాక అకౌంట్ హ్యాక్ అయింది. 'బాహుబలి', 'టెంపర్' తదితర సినిమాల్లో నోరా ఐటమ్ సాంగ్స్‌లో అలరించిన సంగతి తెలిసిందే. -
కరోనా బారిన మరో బాలీవుడ్ బ్యూటీ, కొద్ది రోజులుగా బెడ్‌కే పరిమితం..
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. చదవండి: మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళన అక్కర్లేదంటూ ఎమోషనల్ ట్వీట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నా. నిజం చెప్పాలంటే ఈ వైరస్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా బెడ్‌కే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ ప్రభావం నాపై తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి ” అంటూ తెలియజేసింది నోరా ఫతేహి. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? -
అందంతో మతిపోగొడుతున్న నోరా ఫతేహి
-
జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర
Actors Jacqueline Fernandez and Nora Fatehi:మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు ఐఫోన్ నుండి బిఎమ్‌డబ్ల్యూ కారు వంటి ఖరీదైన బహుమతులను అదించడంలో అతని భార్య లీనా మారియా పాల్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్లో పేర్కొంది. అంతేకాదు దర్యాప్తులో ఆ ఇదరూ బాలీవుడ్ నటులు సుకేష్ నుండి అందుకున్న బహుబమతులు గురించి వివరించారు. (చదవండి: ‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు) అయితే ఫెర్నాండెజ్‌తో స్నేహం చేయడానికి సుకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయ నంబర్‌ను "స్పూఫ్" కాల్ చేయగా, నోరా ఫతేహిని అతని భార్య ద్వారా పరిచయం చేసుకున్నట్లు వెళ్లడించింది. ఈ మేరకు ఈడీ విచారణలో నోరాకి సుకేశ్ బీఎండబ్ల్యూ కారు, అతని భార్య లీనా ఖరీదైన బ్యాగ్, ఐఫోన్ వంటి బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన ఫెర్నాండెజ్, సుకేశ్ నుండి రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, మల్టి స్టోన్ చెవిపోగులు, బహుమతులతో పాటు 1.5 లక్షల డాలర్ల రుణాన్ని తీసుకున్నట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్‌పై ఉన్న అభియోగాల నేపథ్యంలో ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులను ఈడీ విచారించింది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) -
బాలీవుడ్ భామ జాక్వెలిన్‌కు షాక్.. ఎయిర్పోర్ట్ వద్ద అడ్డుకున్న అధికారులు
Jacqueline Fernandez Stopped At Mumbai Airport: బాలీవుడ్ భామ, శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. ఇండియా నుంచి వెళ్తున్న జాక్వెలిన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్ అవడంతో ఈ భామ చిక్కుల్లో పడింది. అప్పట్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంది. అప్పుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ కొట్టిపారేసింది. ఇది జరిగిన వారాలా తర్వాత సుఖేష్‌ను ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఇదీ చదవండి: జాదుగాడితో జాక్వెలిన్ కిస్సింగ్ ఫోటో లీక్ అంతకుముందు ఈ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్, నోరా ఫతేహి, సుఖేష్ చంద్రశేఖర్, అతని భార్య లీనా పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. పలు నివేదికల ప్రకారం జాక్వెలిన్‌ను సుకేష్ నాలుగు సార్లు చెన్నైలో కలిశారని సమాచారం. అంతేకాకుండా ఆమె కోసం ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశాడట. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పాల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి -
మరొక హాట్ డ్యాన్స్‌తో నోరా ఫతేహి.. నెట్టింట వీడియో హల్చల్
Nora Fatehi Hot Dance Video Goes Viral In The Internet: బాలీవుడ్ దివా, డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తను వేసుకునే ఫ్యాషన్ వేర్స్, హాట్ డ్యాన్స్, కైపెక్కించే హావాభావాలు, అందంతో ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఇటీవల విడుదలైన 'సత్యమేవ జయతే 2' చిత్రంలోని 'కుసు కుసు' సాంగ్‌లో ఎక్స్ప్రెషన్స్, బెల్లీ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. అలాగే బ్లూ బికినీ టాప్‌లో చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్ వీడియో తెగ వైరల్ అయింది. అలాగే ఏయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసిందీ మనోహరి. తాజాగా నోరా ఫతేహి తన కిల్లర్ డ్యాన్స్ కదలికలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఒక ఏయిర్పోర్ట్ ప్రాంతంలో కారులో తన హిట్ ట్రాక్ 'కుసు కుసు' పాటకు స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో నోరా బ్లాక్ డ్రెస్ ధరించి ప్రముఖ కొరియోగ్రాఫర్ అవేజ్ దర్బార్తో కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. డ్యాన్స్ చేసేటప్పుడు తన కదలికలు, ఎక్స్ప్రెషన్స్ వావ్ అనిపిస్తున్నాయి. అలాగే బ్లాక్ డీప్-నెక్ టాప్‌తో మ్యాచింగ్ బ్లాక్ లెదర్ ప్యాంట్ ధరించి ఆకర్షిస్తోందీ బెల్లీ డ్యాన్స్ క్వీన్. ఈ బ్యూటీ 'టెంపర్', 'బాహుబలి: ది బిగెనింగ్' సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నృత్యం చేసి ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
Kusu Kusu Song: మరోసారి కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నోరా ఫతెహీ
నోరా ఫతేహీ.. ఈ పేరు వింటే చాలు అందరికీ గుర్తు వచ్చేది దిల్బర్ సాంగ్. ఆ పాటలో తన హావాభావాలతో యువతను ఎలా పిచ్చెక్కించిందో చూశాం. ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని కొల్లగొట్టేందుకు కొత్త సాంగ్‌తో వచ్చేసిందీ డ్యాన్స్ క్వీన్. బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహమ్ అప్‌కమింగ్ మూవీ సత్యమేవ జయతే 2 లోని 'కుసు కుసు' సాంగ్ ఇవాళ విడుదలైంది. ఈ పాటలో నోరా తన అందం, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్, సొగసైన బెల్లీ డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. సత్యమేవ జయతే 2 లోని మేరీ జిందగీ హై తూ పాట తర్వాత నిర్మాతలు నోరా ఫతేహీ నటించిన కుసు కుసు సాంగ్‌ను రిలీజ్ చేశారు. జారా ఎస్ ఖాన్, దేవ్ నేగీలు పాడిన ఈ పాటకు తనిష్క్ బగ్చీ లిరిక్స్ రాశారు. 2018లో వచ్చిన సత్యమేవ జయతే భారీ సక్సెస్ తర్వాత జాన్ అబ్రహమ్‌తో సీక్వెల్ తీశారు. అన్యాయం, అధికార దుర్వినియోగంపై పోరాటమే సత్యమేవ జయతే 2 కథ. 'ఈసారి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ రెట్టింపు అవుతుంది' అని జాన్ అబ్రహమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) మిలాప్ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ పిల్లయ్, అనూప్ సోనీ, సాహిల్ వాయిద్ నటిస్తున్నారు. నవంబర్ 25న సత్యమేవ జయతే 2 సినిమా విడుదల కానుంది. -
ఈ భామ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Nora Fatehi Hand Bag Cost: సెలెబ్రిటీలు ధరించే డ్రెస్ నుంచి వారు వేసుకునే చెప్పులు.. గాగుల్స్, వాచీలు ఇలా ప్రతీదీ పెద్ద విషయమే. వాళు కదిలినా.. మెదిలినా అంతా విశేషాల పరంపరలే. వాళ్లు ఏ లుక్‌లో కనిపించినా… కెమెరా కళ్లు క్లిక్కుమంటాయి. వారిని టాప్ టూ బాటమ్ వరకూ స్కాన్ చేస్తేకానీ కెమెరాల కళ్లు శాంతించవు. ఆ ఫోటోలో చిన్న విశేషం కనిపించినా అదో పెద్ద వార్త అయి కూర్చుంటుంది. తాజాగా బాలీవుడ్ భామ నోరా ఫతేహి విషయంలో అదే జరిగింది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ కనిపించి కుర్రకారు మదిని దోచింది. తాజాగా ఈ భామ రూ. 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది. ఆ సమయంలో లక్షల రూపాయాల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది. బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి వచ్చిన నోరా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది. ప్రస్తుతం నోరా హ్యాండ్ బ్యాగ్ పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. దాదాపుగా రూ.1.95లక్షల విలువైన మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్‌ను ధరించి ఆమె కనిపించింది. ఆ బ్యాగ్ ధరను తెలుసుకొని అభిమానులు షాకవుతున్నారు. ఇక నోరా సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈ భామ అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘‘ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ’’ సినిమాలో స్పై పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాకు అభిషేక్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆ చిత్రం విడుదలయింది. -
రూ. 200 కోట్ల మనిలాండరింగ్ కేసులో నోరా ఫతేహికి సమన్లు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి ఎన్ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. రూ. 200 కోట్ల మనిలాండరింగ్ కేసులో తాజాగా ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసు నేపథ్యంలో ఆమెకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. కాగా ఇప్పటికే ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. కాగా 2017 ఎలక్షన్స్‌లో కమిషన్‌కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్‌ని విచారించగా పలువురి పేర్లు బయటపడ్డాయి. అందులో బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్ పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు చంద్రశేకర్ పై ఆరోపణలున్నాయి. గతంలో జాక్వెలిన్‌ను ఈ కేసులో ప్రశ్నించిన ఈడీ మొదట ఆమె ప్రమేయం ఉందని భావించింది. ఆ తర్వాత విచారణలో జాక్వెలిన్ ఈ కేసులో బాధితురాలిగా అధికారులు తేల్చారు. సుకేష్ చంద్రశేఖర్ ఆయన భార్య లీనా పాల్ ద్వారా జాక్వెలిన్‌ను మోసం చేశాడని, జాక్వెలిన్ తన మొదటి స్టేట్మెంట్లో ఈడీకి సుకేష్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన సమాచారాన్ని అందించినట్లుగా తెలిసిందే. -
‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్, బాలీవుడ్ భామ షాకింగ్ రెమ్యూనరేషన్!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్‌లుక్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సుక్కు అదిరిపోయే ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశాడట. చదవండి: షూటింగ్లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత దీని కోసం బాలీవుడ్ భామ నోరా ఫేతేహిని సంప్రదించాడట సుకుమార్. ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నోరా.. భారీగా డిమాండ్ చేసినట్లు సమాచారం.కేవలం ఒక్క అయిదు నిమిషాలక పాట కోసం ఆమె ఏకంగా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇంత పారితోషికం మన తెలుగులోని కొందరూ యంగ్ హీరోలకు కూడా ఉండదు. దీంతో ఆమె డిమాండ్ విన్న సుక్కు, మేకర్స్ ఒక్కసారిగా అవాక్కాయ్యారట. ఎందుకంటే గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో ఐటం సాంగ్ కోసం కేవలం రూ. 5 లక్షలు తీసుకున్న ఆమె.. ఇప్పుడు 2 కోట్లు అడగడంతో మేకర్స్ షాకయ్యారట. చదవండి: కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారు: బాలీవుడ్ బ్యూటీ అయితే ప్రస్తుతం నోరాకు వీపరితమైన క్రేజ్ ఉంది. బి-టౌన్లో ఆమె చేసిన ఐటెం సాంగ్‌లు అన్ని సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె డిమాండ్‌కు మరి మేకర్స్ ఒకే చేశారా? లేదా అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ బన్ని పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. -
కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారు: బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐటం సాంగ్స్‌లో తన స్టెప్పులతో కుర్రకారును అల్లాడిస్తుందీ భామ. సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గతంలో వెయిటర్‌గా పని చేసిందట. తాజాగా ఈ విషయాన్ని ఓ రియాలిటీ షోలో వెల్లడించింది. కెనడాలో 16 ఏళ్లకే వెయిటర్‌గా పని చేశానని తెలిపింది నోరా. వ్యక్తిగత కారణాల వల్ల 18 ఏళ్లు వచ్చేదాకా వెయిటర్‌గా విధులు నిర్వర్తించానని పేర్కొంది. వెయిటర్‌గా పని చేయాలంటే బాగా మాట్లాడగలిగే సామర్థ్యంతో పాటు, జ్ఞాపకశక్తి,, ఓపిక, సహనం కూడా ఉండాలంటోంది. కొన్నిసార్లు కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారని, అలాంటప్పుడు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో మనం స్వతాహాగా నేర్చుకోక తప్పదని చెప్పుకొచ్చింది. ఇక నోరా ఫతేహి సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిసారిగా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటించింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడటంతో పాటు కీలక పాత్ర పోషించింది. -
షూటింగ్లో గాయపడ్డ బ్యూటీ, రక్తం కారుతున్నా..
Nora Fatehi Injured: పై ఫొటోలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ నుదుటన రక్తం కారుతోంది. ఇది మేకప్ మహిమ అనుకునేరు, కానే కాదు! "భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" షూటింగ్లో జరిగిన గాయం తాలూకు గుర్తులివి. ఈ సినిమా షూటింగ్లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. అయితే తన గాయాన్ని పంటి కింద భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్లో పాల్గొందట ఈ భామ. దీంతో ఆ సీన్ చాలా సహజంగా వచ్చిందట. దీని గురించి నోరా మాట్లాడుతూ.. "భుజ్ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నాం. ఓ వ్యక్తి నా నుదుటి మీద గన్ పెట్టగా అతడిని నేను ఎదురించాలి. రిహార్సల్స్ పూర్తి బాగానే చేశాం. కానీ తీరా దీన్ని షూట్ చేసేటప్పుడు ఆ మెటల్ గన్ నా ముఖానికి చాలా బలంగా తగలడంతో ఒక్కసారిగా రక్తం చిందింది. ఆ తర్వాతి రోజు మరో యాక్షన్ సీన్లోనూ కాలికి గాయమైంది. ఈ దెబ్బల తాలూకు మచ్చలతోనే అన్ని సీన్లలో నటించాను. డూప్ లేకుండా గాయాలతోనే యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేయడం నా జీవితంలో మర్చిపోలేను" అని చెప్పుకొచ్చింది. కాగా అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'భుజ్' ఆగస్టు 13న హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతోంది. -
హాట్ స్టెప్పులతో ఇరగదీసిన నోరా.. వీడియో వైరల్
నోరా ఫతేహి.. సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. బాలీవుడ్లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. నోరా రిలీజ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లోనే ట్రెండింగా మారుతాయంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆ హాట్ బ్యూటీ మరో బ్యాన్స్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వన్ డ్యాన్స్ అనే మ్యుజిషియన్ డ్రేక్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ స్టెప్పులతో ఇరగదీసింది. పింక్ టాప్, బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించిన నోరా.. తన బాడీని మెలికలుగా తిప్పుతూ వయ్యారాల పోయింది. సమ్మర్ టైం అంటూ నోరా చేసిన ఈ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. అద్భుతంగా ఉందంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. చదవండి: ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్.. అదుర్స్ View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
4 రోజులుగా నిద్ర లేకుండా నటి షూటింగ్!
నోరా ఫతేహీ.. స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడే ఈమె ఆఫ్‌స్క్రీన్‌లోనూ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. షూటింగ్ మధ్యలో ఏ చిన్న గ్యాప్ దొరికినా తెగ అల్లరి చేస్తుంటుంది. తాజాగా ఆమె షూటింగ్ లొకేషన్లో సాంగ్‌కు రెడీ అవుతూ, ప్రాక్టీస్ చేసిన ఓ ఫన్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో తను వాడిన విగ్గును నిమురుతున్న నోరా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పని ఒత్తిడి కారణంగా కొంత అలిసిపోయినట్లు తెలుస్తోంది. "నాలుగు రోజులుగా కంటి నిండా నిద్ర పోకుండా మరీ షూటింగ్ చేశాం. తర్వాత హాయిగా ఓ కునుకు తీయాలి" అని పేర్కొంది. అయితే ఆమె నిద్రలేని రాత్రుళ్లు మాత్రమే కాదు, రాజస్తాన్‌లో చెమటలు కక్కించే మండుటెండలోనూ భారీ లెహంగాలు వేసుకుని నిప్పు ముందు డ్యాన్స్ చేసింది. ఇందులో రాజస్తాన్‌లోని బంజారాల డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆమె ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఆమె ఇంతలా కష్టపడింది ఆ మధ్య రిలీజైన 'చోర్ దేంగే..' సాంగ్ కోసమే.. అరవిందర్ ఖైరా డైరెక్ట్ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 25 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) ఇక నోరా గురించి ఆ సాంగ్ టీమ్‌లోని ఓ సభ్యుడు మాట్లాడుతూ.. 'అసలే ఎండాకాలం.. పైగా అది రాజస్తాన్. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డాం. అయినా సరే మేము షూటింగ్ పూర్తి చేశాం. నోరా బరువైన లెహంగాలు ధరించి, నిప్పు మధ్యలో డ్యాన్స్ చేసింది. ఆమె అంకితభావానికి మేమంతా ఆశ్చర్యపోయాం. చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా, ఏమాత్రం అలసట చెందకుండా షూటింగ్లో పాల్గొంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: మరో బాలీవుడ్ చిత్రానికి బాహుబలి రచయిత స్క్రిప్ట్ సన్నీడియోల్ మొదట ప్రేమించింది ఎవరినంటే? -
నాకు తైమూర్ అయితే ఓకే..
ముంబై: నోరా ఫతెహీ ప్రత్యేకమైన తన డ్యాన్స్ శైలితో ఐటెం సాంగ్స్ భామగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ‘సత్యమేవ జయతే’లో ‘దిల్భర్ దిల్బర్’, ‘బట్ల హౌజ్’లోని ‘ఓ సాకి సాకి’ పాటలలో అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌తో పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న నోరా ఇటీవల హీరోయిన్ కరీనా కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నరెడియో టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోరాను పెళ్లేప్పుడు అని అడిగ్గా.. కరీనా ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ పెద్దాయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఆమె సమాధానానికి షాకైయినా కరీనా.. తైమూర్‌కు కేవలం నాలుగేళ్లేనని, దానికి ఇంకా చాలా సమయం ఉందంటూ సరదాగా బదులియ్యడంతో.. నోరా పర్వాలేదు అప్పటి వరకు వేయిట్ చేస్తానంటూ కరీనాను ఆటపట్టించారు. (చదవండి: మార్ఫింగ్ చేశారు: క్లారిటీ ఇచ్చిన టెరెన్స్) ఇక చిత్ర పరిశ్రమలో తన కేరీర్ గురించి మాట్లాడుతూ.. ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘నేను కెనడా నుంచి ఇండియాకు వచ్చాక సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడు నన్ను లైంగికంగా వేధించాడు. అయితే అతడి పేరును బయటపెట్టాలనుకోవడం లేదు. కానీ అతడి వేధింపుల వల్ల నేను తిరిగి కెనడా వెళ్లిపోవాలనుకున్న’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా నోరా తదుపరిగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. ఇందులో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హాలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక కరీనా ‘లాల్ సింగ్ చద్దా’లో అమీర్ ఖాన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి తల్లి కాబోతున్న సందర్భంగా ఆమె ఈ సినిమాలోని తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. (చదవండి: వ్యవసాయం చేస్తున్న తైమూర్, సైఫ్) -
ఉఫ్...
‘పిల్ల జమిందార్, భాగమతి’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు అశోక్ .జి. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ చేస్తున్నారాయన. అనుష్క పోషించిన పాత్రను ఈ రీమేక్‌లో భూమీ ఫెడ్నేకర్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ రీమేక్ తర్వాతి చిత్రాన్ని కూడా హిందీలోనే తెరకెక్కించనున్నారట అశోక్. మూకీ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఉఫ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. సోహమ్ షా, నుష్రత్, ఓంకార్ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తెరకెక్కనున్న వెబ్ ఫిల్మ్ ఇదని బాలీవుడ్ టాక్. జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిసింది. -
డ్యాన్సర్‌పై కొరియోగ్రాఫర్ అనుచిత ప్రవర్తన..
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్, గీతా కపూర్, నటి మలైకా అరోరా సోనీ ఛానల్లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్స్‌ర్’ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నటి మలైకా కరోనా బారిన పడటంతో ఆమె స్థానంలో ప్రముఖ డ్యాన్స్ నోరా ఫతేహి న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ క్రమంలో కొరియోగ్రాఫర్ టెరెన్స్, డ్యాన్సర్ నోరాతో అనుచితంగా ప్రవర్తించాడని వార్తలు వినిపించాయి. ఇద్దరు కలిసి స్టేజ్‌పై నృత్యం చేస్తుండగా నోరాను అభ్యంతకరంగా తాకినట్లు ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. చదవండి: ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్.. అదుర్స్ తాజాగా ఈ వీడియోపై టెరెన్స్ లూయిస్ స్పందించాడు. అది అసలైన వీడియో కాదని, మార్ఫింగ్ చేసిన వీడియోనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నోరాపై తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఈ క్లిప్ వాస్తవమైతే నోరా ఎందుకు స్పందించకుండా ఉంటుందని అన్నాడు. ఆడవాళ్లపై అమిత గౌరవం ఉందని, ఇలాంటి చెడు పనులు జీవితంలో చేయలేదని, చేయనని పేర్కొన్నాడు. ఇలా చేయడానికి తనేం 17 ఏళ్లలో లేనని తన వయస్సు 45 సంవత్సరాలని క్లారిటీ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకొని నటి మలైకా తిరిగి డ్యాన్స్షో సెట్లో అడుగు పెట్టారు. చదవండి: సినిమాలకు 'కత్తి' హీరోయిన్ గుడ్‌బై -
ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్.. అదుర్స్
ఒక్క నటి డాన్స్ చేస్తేనే కళ్లు తిప్పకోకుండా చూస్తాం. అలాంటిది ఇద్దరు అందమైన ముద్దు గుమ్మలు స్టేజ్‌పై స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది. చూడటానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది. అచ్చం ఇలాగే నటి మలైకా అరోరా, డాన్సర్ నోరా ఫతేహితో కలిసి ఓ డాన్స్ షో వేదికపై చిందులు వేశారు. ఇద్దరూ కలిసి సల్మాన్ ‘దబాంగ్’ సినిమాలోని మలైకా నటించిన ఐటమ్ సాంగ్ ‘మున్నీ బద్నామ్ హుయ్’ అనే పాటకు ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోను మలైకా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే ఫన్ అందిస్తారా.. కాస్తా ఛేంజ్ కోసం ఈ రోజు సోనీ ఛానల్లో ప్రసారమయ్యే ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్స్ షో చూడడం మర్చిపోకండి.’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (మాస్క్ ఎలా ధరించాలో చెప్పిన నటి) ఇక వీడియోలో వీరి ఇద్దరు చేసిన డాన్స్‌ను చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. కాగా ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్స్ షో న్యాయ నిర్ణేతలలో మలైకా ఒకరు. ఇక షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దిల్ సే సినిమాలోని చయ్య చయ్య పాటతో ఊపేసిన మలైకా అరోరా మున్నీ బద్నామ్ హుయ్ పాటతో మరోసారి పాపులర్ అయ్యారు. తన సినిమాలు, డ్యాన్సులతోనే కాదు.. తన వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఎన్నో వివాదాలతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. (విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..) View this post on Instagram Why should only contestants have all the fun? Here’s just a small glimpse of what you can expect in tonight’s episode of #IndiasBestDancer with @NoraFatehi - the new Munni is town! Dont forget to watch #IndiasBestDancer tonight and tomorrow at 8 PM on @SonyTVOfficial @terence_here @geeta_kapurofficial #rolereversal A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Aug 28, 2020 at 10:46pm PDT -
పోనీ సవారీ
శుక్రవారం విడుదలైన బాలీవుడ్ డాన్స్ మూవీ ‘స్ట్రీట్ డాన్సర్ త్రీడీ’ లో నటి నోరా ఫతేహీ పోనీ టెయిల్‌తో కనిపిస్తారు. ఆ సినిమాలో శద్ధ్రాకపూర్ తర్వాత రెండో హీరోయిన్.. నోరా ఫతేహీ. అయితే ఆ పోనీ టెయిల్ కారణంగా కొన్ని చోట్ల నోరానే ప్రధాన నాయికగా అనిపిస్తారు! సినిమాలో పోనీ టెయిల్‌తో నోరా డాన్స్ చేస్తుంటే గుర్రంపై సవారీ చేస్తున్నట్లే ఉన్నారట! అయితే అది సహజమైన పోనీ టెయిల్ కాదు. 500 గ్రాముల బరువైన సహజ శిరోజాలతో తయారైన టెయిల్. అందుకు అయిన ఖర్చు... (ఆమె తలపై పోనీ టెయిల్‌ను స్టెయిల్‌గా తీర్చిదిద్దడానికి అయిన ఖర్చు) 2 లక్షల 50 వేలు! దుబాయ్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నోరా ఫతేహీ పాత్రకోసం ఆమె ముఖానికి సరిపడే విధంగా టెయిల్‌ను తయారు చెయ్యడానికి ముస్తాబు నిష్ణాతులు సైతం కొన్ని గంటలపాటు శ్రమించవలసి వచ్చిందని.. సినిమా రిలీజ్ అయి, అంతా తన పోనీ టెయిల్ బాగుందని చెబుతున్నప్పుడు నోరా గర్వంతో కూడిన సంతోషంతో చెప్పారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోరాతో పాటు ప్రభుదేవా, వరుణ్ ధావన్ ఉన్నారు. -
పరిణీతి అవుట్ నోరా ఇన్
హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ నుంచి కథానాయిక పరిణీతీ చోప్రా తప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. అభిషేక్ దుధియా దర్శకత్వంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, రానా, ప్రణీత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఇందులో గూఢచారిగా పరిణీతి చోప్రా నటించాల్సింది. కానీ, ఇప్పుడు ఆమె స్థానంలోకి నోరా ఫతేహీ వచ్చారని టాక్. ఈ నెల 12 తర్వాత జరిగే ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నోరా. ఎన్టీఆర్ ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ వంటి స్పెషల్ సాంగ్స్‌తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు నోరా. ఇంకా కిక్ 2, లోఫర్ చిత్రాల్లోనూ ప్రత్యేక పాటలకు కాలు కదిపారు. హిందీలోనూ స్పెషల్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఇటీవల కొన్ని హిందీ చిత్రాల్లో కీలక పాత్రలకు సై అంటున్నారు. తాజాగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో గూఢచారిగా నటించడానికి సిద్ధమయ్యారామె. ఈ చిత్రం ఆగస్టు14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి పరిణీతీ ఎందుకు తప్పుకున్నారంటే ‘సైనా’ చిత్రంతో బిజీగా ఉండటం వల్లే అని బాలీవుడ్ టాక్. ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకున్నాక ఆమె స్థానంలోకి పరిణీతి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డి’ సాంగ్ లాంచ్
-
లాకింగ్ అండ్ పాపింగ్!
యూకేలో ఉండే ఆ పాకిస్థానీ అమ్మాయి, పంజాబ్ కుర్రాడు డ్యాన్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత వీరిద్దరికీ పోటీగా మరో డ్యాన్సర్ సవాల్ విసిరాడు. ఫైనల్‌గా విజేత ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం మాత్రం టైమ్ దగ్గర పడింది. రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమాకు ‘స్ట్రీట్ డ్యాన్సర్స్ 3’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్లకు చెందిన లుక్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో పంజాబ్ కుర్రాడి పాత్రలో వరుణ్ ధావన్, పాకిస్థానీ అమ్మాయి పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రద్ధా ఐదురకాల కొత్త డ్యాన్సులు నేర్చుకున్నారు. ‘అఫ్రో, లాకింగ్ అండ్ పాపింగ్, క్రంప్, టుట్టింగ్ అండ్ యానిమేషన్, అర్బన్’.. ఈ ఐదు రకాల నృత్యాలను యూకేలో ఉంటున్న భారతీయ నృత్యకారుడు ప్రశాంత్ షిండే, టానియా టోరియాల నుంచి నేర్చుకున్నారు. శ్రద్ధాకి డ్యాన్స్ నేర్పించడం కోసం ఈ ఇద్దరూ ఇండియా వచ్చారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 10న లండన్‌లో జరగనుంది. మార్చి 25 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇంతకుముందు రెమో డిసౌజా దర్శకత్వంలోనే 2013లో ‘ఏబీసీడీ’ (ఏనీ బడీ కేన్ డ్యాన్స్), 2015లో ‘ఏబీసీడీ 2’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘స్ట్రీట్ డ్యాన్సర్స్ 3’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘అతడి పేరు కూడా తెలీదు.. ఇంకా వివాహమా’
సాక్షి, ముంబై : ప్రాణ స్నేహితుల్లా మెలిగిన, ప్రేమించుకున్న వ్యక్తులను బ్రేకప్ తర్వాత మీ బంధం ఎలా ఉందని అడిగితే ఎవరికైనా కోపం, చిరాకు రావడం సహజం. ప్రస్తుతం బాలీవుడ్ నటి, మోడల్ నోరా ఫతేహి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మూడేళ్ల పాటు నటుడు అంగద్ బేడీతో రిలేషన్ షిప్లో ఉన్న నోరా... గతంలో అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే కావడంతో సంతోషం పట్టలేని ఆమె.. వారిద్దరి ఫొటోలను షేర్ చేసి ‘హ్యాపీ బర్త్‌డే అంగద్.. మనం ఇద్దరం ఒకే తేదీన పుట్టడం ఎంతో బాగుంది కదా. నువ్వు అచ్చం నాలాగే ఎందుకు ఉంటావో ఇప్పుడు తెలిసింది బెస్టీ అంటూ’ ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘ హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్.. నీతో ఈ రోజును పంచుకోవడం నా అదృష్టం’ అంటూ అంగద్ ట్వీట్ చేశాడు. అయితే నోరాతో బ్రేకప్ అనంతరం అంగద్.. బాలీవుడ్ హీరోయిన్ నేహా ధుపియాను గత మేలో వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య పంజాబీ సంప్రదాయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇటీవల ఓ జాతీయ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో భాగంగా.. అంగద్ బేడీకి వివాహ శుభాకాంక్షలు తెలిపారా అంటూ నోరా ఫతేహిని యాంకర్ ప్రశ్నించారు. దీంతో చిరాకు పడిన నోరా..‘అంగద్ బేడీ ఎవరు. అతడి పేరు కూడా ఎప్పుడూ వినలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అతడు ఎవరో కూడా తెలియనపుడు అతడి పెళ్లి గురించి నేనెలా మాట్లాడతానంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. Happy birthday to us 😎😄😇 @Imangadbedi how cool we are born on the same day! That explains why ur as cool as me😉 thats why we are besties😁 pic.twitter.com/WkaqYK6LGE — Nora Fatehi (@Norafatehi) February 6, 2017 Happy birthday superstar @Norafatehi I'm honoured to share my birthday with you.i always have your back.. errr I mean your shoulder😎 #bestie pic.twitter.com/iKTBexJbI4 — ANGAD BEDI! (@Imangadbedi) February 6, 2017 -
అప్పుడు ఐటం సాంగ్... ఇప్పుడు స్పెషల్ సాంగ్
హైదరాబాద్: టాలీవుడ్ చిత్రాలను శిల్పాలుగా చెక్కాలంటే జక్కన అదేనండి ఎస్ ఎస్ రాజమౌళి తర్వాతే ఎవరైనా? ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరిగంతులు వేయాల్సిందే. ఇప్పుడు ఆ అవకాశం నోరా ఫతేహికు వచ్చింది. ప్రభాస్ హీరోగా దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ... వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి చిత్రంలో నటించనుంది. అది కూడా ఆ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో నటించనుంది. త్వరలో ఆ పాటకు సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్‌లో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్‌కు డ్యాన్స్ చేసేందుకు వస్తున్నాను అంటూ నోరా ఫతేహి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పూరీ సమర్పించు.. సరికొత్త ఐటెం గాళ్
ఐటెం సాంగులు తీయడంలో తనదైన ప్రత్యేకత కనబర్చే దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఈసారి మరో కొత్త ఐటెం గాళ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ఈసారి మొరాకో దేశస్థురాలైన కెనడా మోడల్‌ను తెరమీదకు తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ చేసే ఆమె పేరు నోరా ఫతేహి. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జోరుగా సాగుతోంది. మళ్లీ ఎన్టీఆర్ తన బ్రాండు స్టెప్పులను ఈ పాటలో చూపిస్తాడని అంటున్నారు. ఇంతకుముందు దేవుడు చేసిన మనుషులు చిత్రంలో 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాటకు బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బెర్టాంటే, కెమెరామన్ గంగతో రాంబాబులో 'జొరమొచ్చింది.. దడపుట్టింది' పాటకు బ్రిటిష్ డాన్సర్ స్కార్లెట్ విల్సన్, హార్ట్ ఎటాక్‌లో దక్షిణాఫ్రికా మోడల్ నికోల్ అమీ మాడెల్... ఇలా పలువురు ఐటెం గాళ్స్‌ను తెలుగు తెరకు తీసుకొచ్చిన పూరీ.. ఇప్పుడు కెనడియన్ భామ నోరాను పరిచయం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో పూరీ చేస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. సినిమాలో ప్రస్తుతం పాట షూటింగ్ జరుగుతోంది. టాలీవుడ్లో నోరా ఫతేహి డాన్స్ చేయడం ఇదే తొలిసారి అయినా.. ఇప్పటికే హిందీ సినిమాలు రెండింటిలో ఆమె కాలు కదిపిందట. ఎన్టీఆర్ చిత్రం పూర్తయిన తర్వాత హిందీలో మరో పాటకు కూడా నర్తిస్తుంది.