కేవలం దాని కోసమే పెళ్లి.. జీవితాలు త్యాగం చేసి: నటి షాకింగ్ కామెంట్స్ | Nora Fatehi Says Most Bollywood Couples Married Only For Money, Sensational Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Nora Fatehi:‍ 'అంతకంటే దారుణం లేదు'.. బాలీవుడ్‌ జంటలపై నటి హాట్‌ కామెంట్స్‌!

Published Fri, Apr 12 2024 9:50 AM | Last Updated on Fri, Apr 12 2024 10:34 AM

Nora Fatehi Says Most Bollywood Couples Married Only For Money - Sakshi

ఇటీవల మడ్గావ్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ ఆస్వాదిస్తోంది బాలీవుడ్ భామ. డ్యాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నోరా  రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్‌ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోలో కూడా మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నోరా బాలీవుడ్‌ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ప్రముఖ జంటలను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ బీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. 
 
నోరా  మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో డబ్బు, పేరు కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు ప్రేమించని వ్యక్తిని వివాహం చేసుకోవడం కంటే దారుణం ఇంకోటి లేదు. ఇష్టం లేకపోయినా ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తున్నారు. బాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది అలాంటి పనికిమాలిన వాళ్లే ఉన్నారు. వారు కేవలం ఆ సర్కిల్‌లో మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వారి కెరీర్ ఎక్కడికి వెళుతుందో వారికి తెలియదు. అందుకే వారికి కొంత బ్యాకప్ ప్లాన్ కావాలి.' అని అన్నారు. 

తనకు బాయ్‌ఫ్రెండ్స్‌ లేరన్న విషయంపై నోరా స్పందించింది.' చాలామంది నన్ను కేవలం వాళ్ల ఫేమ్ కోసమే వాడుకుంటున్నారు. అందుకే అలాంటి వారు నాతో ఉండలేరు... అందుకే నేను అబ్బాయిలతో డేటింగ్ చేయడం మీకు కనిపించడం లేదు. బాలీవుడ్‌ పరిశ్రమలో కేవలం డబ్బు, పరపతి  కోసమే పెళ్లి చేసుకుంటారు. వీరంతా బార్య, భర్తలుగా కాకుండా తమ సర్కిల్‌లో డబ్బు, పేరు కోసం ఆ బంధాన్ని వాడుకుంటున్నారు. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మూడేళ్లపాటు  రిలేషన్‌లో ఉంటున్నారు. ఆ తర్వాత అతనితో కొన్ని సినిమాలు చేసి.. అవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగానే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారని' చెప్పుకొచ్చింది. 

అంతే కాకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్‌లో జీవిస్తున్నారని నోరా తెలిపింది. వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎందుకలా త్యాగం చేస్తున్నారో నాకు అర్థం కాలేదని పేర్కొంది. అయితే నోరా ఫతేహీ ప్రత్యేకంగా ఏ జంట పేర్లను ప్రస్తావించలేదు. కాగా.. రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత గర్మి, సాకి సాకి, జెహ్దా నాషా, మనీకే, డాన్స్ మేరీ రాణి, కుసు కుసు, జాలిమా కోకా కోలా, దిల్బార్ లాంటి చిత్రాల్లో మెరిసింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement