బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్‌పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.
చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్‌లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్‌లో ఓకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు.
అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్‌కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ సినిమాలో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment