Sanjay Leela Bhansalis Niece Sharmin Segal Gets Secretly Engaged - Sakshi
Sakshi News home page

Sharmin Segal: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు..!

Jul 19 2023 4:47 PM | Updated on Jul 19 2023 8:54 PM

Sanjay Leela Bhansalis Niece Sharmin Segal Gets Secretly Engaged  - Sakshi

బాలీవుడ్ చిత్రనిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు బీ టౌన్‌లో చర్చ నడుస్తోంది. నటి అయిన షర్మిన్ సెగల్ ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో షర్మిన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోనుంది. 

(ఇది చదవండి: బోల్డ్‌ సీన్స్‌తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్‌, ఇప్పుడు పేదరికంలో! )

ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం షర్మిన్ 2023 ప్రారంభంలోనే అహ్మదాబాద్‌కు చెందిన వజ్రాల వ్యాపారితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదని తెలుస్తోంది.  కాగా.. షర్మిన్ సినిమాల్లో ఎంట్రీకి ముందే భన్సాలీతో కలిసి పనిచేసింది. ఆమె 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'గంగూబాయి కతియావాడి' వంటి చిత్రాలకు  సహాయ దర్శకురాలిగా పనిచేసింది. 

కాగా.. షర్మిన్ 2019లో 'మలాల్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2022లో ఆమె 'అతిథి భూతో భవ'లో నటించింది.  తాజాగా ఆమె భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'హీరామండి'లో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'హీరమండి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తోంది షర్మిన్. 'హీరమండి'లో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ కూడా ఉన్నారు.

(ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement