బాలీవుడ్ కామెడీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా నటి జీల్ మెహతా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇటీవలే తన ప్రియుడు ఆదిత్యతో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని జీల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు నటికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
కాగా.. తారక్ మెహతా కా ఊల్టా చష్మాలో సోనాలికా పాత్రను జీల్ పోషించారు. ఆమె 2008 నుంచి 2012 వరకు ఈ షోలో కనిపించారు. అయితే ఈ షోలో సోనూ పాత్రకు పేరుగాంచిన జీల్ నటనను వదిలేసి ప్రస్తుతం మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తోంది. ఆగష్టు 2021లో బాడీ షేమింగ్ గురైనట్లు తెలిపింది. కొంతమంది తన మొటిమల మాట్లాడారంటూ జీల్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment