స్టార్‌ హీరోయిన్ ‍సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే? | Priyanka Chopra pens note after her brother Siddharth Chopra engagement | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రియాంక సోదరుడి ఎంగేజ్‌మెంట్‌..!

Published Tue, Apr 2 2024 8:04 PM | Last Updated on Tue, Apr 2 2024 8:50 PM

Priyanka Chopra pens note after her brother Siddharth Chopra engagement - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్‌ జోనాస్‌, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్‌ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 

అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్‌మెంట్‌కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్‌.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్‌కి ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది.

వధువు ఎవరంటే.. 

హీరోయిన్‌ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో  కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement