siddharth chopra
-
సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)
-
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
సోదరుడికి పెళ్లి కూతురిని వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా.. అదేలాగంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటి వాడు కానున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయను ఆయన పెళ్లాడనున్నారు. ఈ పెళ్లి కోసమే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఇండియా చేరుకుంది. తాజాగా సోదరుడి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్‌లో కలిశాడని వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలిపింది. అయితే ఆ డేటింగ్లో యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం మరో విశేషం. అంతేకాదు ఆమె యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.ఈ విషయంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము యూఎస్‌కు చెందిన డేటింగ్ యాప్‌ను ఇండియాకు కూడా తీసుకొచ్చాం. నా సోదరుడు తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలిశాడు. అతనికి సరైన జోడీ దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అ తాను ఎప్పుడూ డేటింగ్ యాప్‌ను ఉపయోగించలేదని తెలిపింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కలవాలని అనుకున్నా. ఆ విధంగా నేను ఈ తరానికి చెందిన వ్యక్తిలా అనిపించకపోవచ్చు.' అని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా..ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ట్విటర్ ద్వారా కలుసుకుంది. ప్రియాంకకు మొదట నిక్ జోనాస్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కలవాలని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రియాంకకు సందేశం పంపించాడు. దీంతో ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించడంతో.. ఆ తర్వాత ఇద్దరూ ఆస్కార్ వేడుక తర్వాత ఓ పార్టీలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. అనంతరం 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం..ఈమె మూడో అమ్మాయి (ఫొటోలు)
-
స్టార్ హీరోయిన్ సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్‌కి ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది. వధువు ఎవరంటే.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో కనిపించింది. View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
నటితో ప్రియాంక చోప్రా తమ్ముడి డేటింగ్!
గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గత కొంతకాలంగా నటి నీలం ఉపాధ్యాయతో డేటింగ్ చేస్తున్నట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ నీలం సిద్ధార్థ్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆదివారం అతడి పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నీకు నేనెంతో కృతజ్ఞురాలినై ఉంటాను. కలిసి లేస్ తింటూ, నాకు నచ్చిన, అంతగా క్వాలిటీ లేని షోలను చూస్తూ(ఎందుకంటే నీకు వేరే చాయిస్ ఉండదు గనుక) గడిపిన ఆ రాత్రులు నాకెంతో ఇష్టం. అంతేగాకుండా నీతో కలిసి భోజనం చేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం కూడా చాలా ఇష్టం. నాలో దాగున్న పరిపూర్ణ వ్యక్తిని వెలికితీసేందుకు నువ్వు చేసే ప్రయత్నాలు, ఎల్లవేళలా నన్ను ప్రోత్సహించే నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు లభించిన వరం. హ్యాపీ బర్త్‌డే సిద్ధార్థ్ చోప్రా’’ అంటూ అతడిపై ప్రేమను చాటుకున్నారు. (భర్త రాజీవ్ వ్యాఖ్యలను ఖండించిన నటి) ఈ క్రమంలో.. ‘‘మీరిద్దరు చాలా బాగున్నారు. అయితే తొందరగా పెళ్లి చేసుకోండి. లేదంటే అతడి మనసు మారిపోవచ్చు. ఎందుకంటే అతడు అంతగా నమ్మదగిన వాడు కాదు’’ అంటూ నెటిజన్లు నీలంను హెచ్చరిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సిద్ధార్థ్ కొంతకాలం కిందట తన స్నేహితురాలు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కొన్నిరోజుల ముందే ఆమెకు బ్రేకప్ చెప్పి.. పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత నీలంతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. గణేశ్ చతుర్థి, హోలి వంటి పండుగ సమయాల్లో చోప్రా కుటుంబ సభ్యులతో కలిసి నీలం ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ.. వీరి బంధం గురించి చోప్రా కుటుంబ సభ్యులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కాగా నీలం మిస్టర్ 7 అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అల్లరి నరేశ్ యాక్షన్ 3డీ మూవీలో నటించడంతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ కనిపించారు.(అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్) View this post on Instagram Happy birthday @siddharthchopra89 I’m so grateful for you and all that you do. I love and appreciate our nights in, stuffing our mouths with Lays, watching some crappy show (that I want to watch and you have no choice 😅), as much as I love going out for meals and drives and exploring new places with you. Thank you for always making sure I’m warm enough, taking me to new places, being your usual thoughtful self and always motivating me to be the best possible version of myself. You’re a big blessing (and a big pain in the ass sometimes 🤷🏻♀️) #siddyday #birthdaybehavior #sneakypicturetaker ♥️ A post shared by Neelam Upadhyaya 👸🏻 (@neelamupadhyaya) on Jul 12, 2020 at 5:06am PDT -
అందుకే ఆ పెళ్లి ఆగిపోయింది!
హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే దానిపై ప్రియాంక తల్లి మధు చోప్రా పెదవి విప్పారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో సిద్ధార్థ చోప్రా వివాహం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇషితకు అత్యవసర శస్త్రచికిత్స జరగడం వల్లే పెళ్లి రద్దైందని తొలుత ఊహాగానాలు వచ్చాయి. సిద్ధార్థ సిద్ధంగా లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని తాజాగా రుజువైంది. మరోవైపు ఇషితా కుమార్‌కు ఆమె తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. పెళ్లి ఆగిపోయినందుకు బాధ పడొద్దని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భరోసాయిచ్చారు. సిద్ధార్థ కంటే మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరుకుతాడని ధైర్యం చెప్పారు. (చదవండి: ఆగిన ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి!) -
హీరోయిన్ సోదరుడిపై కేసు
పూణె: అక్రమంగా హుక్కాను సరఫరా చేస్తున్నందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్ధ్ చోప్రాపై కేసు నమోదయింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అయిన సిద్ధార్ధ్ చోప్రా పూణేలోని కారేగావ్ పార్క్ సెంటర్ లో 'ద మగ్ షాట్ లాంజ్' పేరుతో ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. నో స్మోకింగ్ జోన్లో పొగాకు విరివిగా వాడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి సదరు రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేయగా.. అనుమతి లేకుండా హుక్కాను వినియోగిస్తున్నట్లు బయటపడింది. దీనిపై డీసీపీ పీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. 'ద మగ్ షాట్ లాంజ్' యజమాని అయిన సిద్ధార్ధ్ చోప్రా(26)పై, అలాగే రెస్టారెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ చౌదరి(24)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హుక్కా పరికరాలను, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఇదే రెస్టారెంట్లో మే నెలలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడినందుకుగాను 10మందిని పూణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తమ్ముడు వండితే చక్కగా లాగిస్తా!
అన్న అయితే అండగా ఉంటాడు. తమ్ముడైతే అండ కోరుకుంటాడు. సిద్ధార్థ అలా కోరుకున్నప్పుడు అక్క ప్రియాంక అతడి వెంట నిలబడింది. ప్రోత్సహించింది. అది ఆ తమ్ముడు మర్చిపోలేదు. తమ్ముడినైనా అన్నలా జీవితాంతం నీకు అండగా ఉంటానంటూ అక్కయ్యకు మాటిచ్చాడు. అక్క కోసం ఏం చేసేందుకైనా సిద్ధమంటాడు. అందుకే... అక్కాతమ్ముళ్ల అనుబంధానికి అసలైన నిర్వచనంగా వాళ్లిద్దరినీ చూపిస్తారంతా! ఏ ఆడపిల్ల అయినా తన అన్నను చూసుకుని చాలా ధైర్యంగా ఉంటుంది. నాకు అన్న లేడు. తమ్ముడున్నాడు. వయసులో చిన్నవాడు కనుక తమ్ముడంటున్నాను కానీ అన్నకంటే ఎక్కువ భరోసా ఇస్తాడు. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రద్ధ చూపిస్తాడు. తను ఉంటే బాగుణ్ను అని నేననుకునేలోపు నా దగ్గరుంటాడు. మా తమ్ముడు సిద్ధార్థ అంటే నాకు ప్రాణం. చిన్నప్పట్నుంచీ వాడిని బాగా ముద్దు చేసేదాన్ని. తను నాకంటే ఏడేళ్లు చిన్నవాడు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు పుట్టాడు. బొద్దుగా, క్యూట్‌గా ఉండేవాడు. మొదట్నుంచీ చాలా కామ్‌గా కూడా ఉండేవాడు. మగపిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారని అంటారు. కానీ సిద్ధూ అలా కాదు. నేను కాస్త తుంటరిదాన్ని కానీ తను చాలా బుద్ధిమంతుడు. సెలైంట్‌గా తన పని తాను చేసుకుపోతుంటాడు. సింపుల్‌గా ఉంటాడు. తనది ఎంత మంచి మనసంటే... తన ఎదురుగా ఎవరు బాధపడినా వాడి కళ్లు చెమరుస్తాయి. వెంటనే వాళ్లని ఓదార్చడానికో, సాయం చేయడానికో రెడీ అయిపోతాడు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే వాడిలో నాకు నచ్చని లక్షణం ఒకటుంది. మరీ ఎమోషనల్‌గా ఉంటాడు. ఎవరైనా చిన్న మాట అన్నా హర్ట్ అయిపోతాడు. తను నమ్మినవాళ్లు ఎవరైనా అబద్ధం చెప్పినా, కాస్త మోసగించినా ఎంతగానో ఫీలైపోతాడు. అది మంచి పద్ధతి కాదని ఎంత చెప్పినా వినడు. మనల్ని బాధపెట్టేవాళ్ల గురించి పట్టించుకోవడం అనవసరం, మనల్ని ప్రేమించేవాళ్లను గుర్తు తెచ్చుకుని సంతోషపడటం ఉత్తమం అన్నది నా పాలసీ. అది వాడికి అర్థమవదు. చెప్పినప్పుడు సరే అంటాడు కానీ మళ్లీ మామూలే. సినిమాల్లోకి వచ్చాక వాడితో గడిపే సమయం తగ్గిపోయింది. దానికి తోడు తను చదువుకోవడానికి విదేశాలకు వెళ్లిపోవడంతో కాస్త దూరం పెరిగింది. అయితే ఏ మాత్రం చాన్స్ దొరికినా కలిసేవాళ్లం. తన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌కి నేను స్విట్జర్లాండ్ వెళ్లాను కూడా. నన్ను అక్కడ చూడగానే ఎంత సంతోష పడిపోయాడో! ఇక రాఖీ పండుగ వచ్చిందంటే సందడే సందడి. నేను పొద్దునే లేచి, వాడినీ లేపి రాఖీ కట్టేస్తాను. నిజానికి నాకు ఇరవైమంది వరకూ కజిన్స్ ఉన్నారు. చిన్నప్పట్నుంచీ వాళ్లందరికీ రాఖీలు కట్టేదాన్ని. తర్వాత బిజీ అయిపోయి పోస్ట్‌లో పంపించడం మొదలుపెట్టాను. అయితే ఎంతమందికి కట్టినా... మా తమ్ముడి దారి వేరు, తనకు రాఖీ కట్టడంలో ఉండే ఆనందం వేరు. సిద్ధూకి మొదట్నుంచీ వంట చేయడం చాలా ఇష్టం. అందుకే చెఫ్ అయ్యాడు. అద్భుతంగా వండుతాడు. నాకు థాయ్ ఫుడ్ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరతాయి. అందుకే నాకోసం తను థాయ్ స్పెషల్ కర్రీ చేసి పెడుతుంటాడు. భలే ఉంటుంది రుచి! ఇంకా రక రకాల వంటకాలు చేసి రుచి చూపిస్తుంటాడు. నేను ఫుల్‌గా లాగించేస్తాను. ఏ అక్కకి ఆ అదృష్టం దొరకుతుంది చెప్పండి! సిద్ధూకి పోయినేడు ఎంగేజ్మెంట్ అయ్యింది. తను కర్ణికను ప్రేమించాడు. తన ప్రేమను మేమందరం అంగీక రించాం. మా తమ్ముడు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నన్ను కంటికి రెప్పలా చూసుకునే నాన్న మమ్మల్నందరినీ వదిలి వెళ్లిపోయారు (ప్రియాంక తండ్రి డాక్టర్ అశోక్‌చోప్రా, పోయినేడు జూన్‌లో క్యాన్సర్‌తో మరణించారు). ఇక అమ్మకి, నాకు ఉన్న తోడు, ధైర్యం సిద్ధూనే. నాకు తెలుసు... నాకోసం ఎప్పుడు ఏం చేయడానికైనా తను సిద్ధంగా ఉంటాడని! సిద్ధార్థ చోప్రా స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ప్రస్తుతం ఓ ప్రముఖ హోటల్లో చీఫ్ షెఫ్‌గా పని చేస్తున్నాడు. స్వతహాగా కాస్త సిగ్గరి అయిన సిద్ధార్థ... ఎప్పుడైనా అక్కతో పాటు పార్టీలకు వస్తాడు తప్ప ఇండస్ట్రీకి, సినీ జనానికి కాస్త దూరంగానే ఉంటాడు!